Saturday 28 September 2013

ఎందుకూ పనికిరాని బ్యాటింగ్



ఒన్‌డే క్రికెట్‌లో భారీ స్కోరును చేజింగ్ ఛేస్తున్న జట్టులో ఒక్కరొక్కరుగా అందరూ అవుటవుతూ, లక్ష్యం కనుచూపుమేరలో కూడా లేకుండా మిగిలిన బంతులూ, చెయ్యాల్సిన పరుగుల సమీకరణం అసంభవంగా ఉన్న సమయంలో ఆఖరున మిగిలిన బాట్స్‌మన్ అప్పుడప్పుడూ పిచ్చిపట్టినట్టు బ్యాటింగ్ చేసి ఫోర్లూ, సిక్సర్లూ కొడతాడు. బౌలర్లు కూడా ఎలాగూ అప్పటికే గెలిచిపోయామని తెలుసుకాబట్టి బాట్స్‌మన్ కొడుతున్నా పెద్దగా  పట్టించుకోక నవ్వుతుంటారు. ఇలాంటి బ్యాటింగ్ గెలవడానికి ఏకోశానా పనికిరాదు గానీ బాట్స్‌మన్ వ్యక్తిగత రికార్డులను పెంచడానికీ,  బాట్స్‌మన్ వ్యక్తిగత ప్రతిష్ట పెరగడం తద్వారా మరికొన్నాల్లు జట్టులో స్థానం నిలుపుకోవడానికీ మాత్రం పనికొస్తాయి. ఆబాట్స్‌మన్ జట్టును గెలిపించలేకపోయినా ఓడిన జట్టులో ఆరోజుకు ఛాంపియన్‌గా గుర్తుండిపోతాడు.

ఆఖరు బాట్స్‌మన్ అలాగ పరుగులు తీస్తుంటే చూసే జనం "అరె, ఇప్పటిదాకా ఇలాగే ఆడుంటే బాగుండు కదా, గెలిచేవాళ్ళం" అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇలా ఆఖరు నిమిషంలో చెలరేగే బాట్స్‌మన్ ఎవరూ కూడా లక్ష్యం అందుబాటులో ఉన్నప్పుడు అలా ఆడరు. కారణం లక్ష్యం చేయి దాటి అసాధ్యమని తెలిసినతరువాత బాట్స్‌మన్ పై వత్తిడి ఉండదు. ఔటయినా పోయేదేమీలేదు. అందుకే కళ్ళుమూసుకుని కొడుతూ ఉంటారు. అదే ఆట ముందు ఆడాలంటే ఔటయితే జట్టు మేనేజ్‌మెంట్ తిడుతుందేమోనన్న భయం మనసులో ఉంటుంది కాబట్టి ఆడరు.

ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రేస్, వైకాప, తెదేపా నాయకులందరికీ కూడా తెలంగాణ విభజన ఎలాగు జరిగిపోతుంది, ఆపడం తమవలన సాధ్యం కాదని తెలుసు. కానీ తమ పార్టీ ప్రతిష్ఠ పెంచుకోవడానికి, సీమాంధ్ర జట్టుకు ఛాంపియన్‌గా మిగలడానికి నానా తంటాలు పడుతూ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రేస్లో స్టార్ బాట్స్‌మన్, సీమాంధ్ర (సమైక్యాంధ్ర) జాక్‌లకు ఛైర్మన్ అని చెప్పబడుతున్న  ముఖ్యమంత్రి ఛాంపియన్‌గా మిగలడానికి తనవంతు తంటాలు పడ్డాడు.

ఎలాగూ విభజన జరిగేది తధ్యం, నేనూ ఒకసారి సమైక్యాంధ్రకోసం గొంతు వినిపిస్తే రేపు విభజన తరువాత నాకు రాజకీయ మనుగడ ఉంటుంది అని చేసే ప్రయత్నమే తప్ప ఇది మరోటి కాదు. ఎలాగూ విభజన తరువాత కనీసం సీమాంధ్రకు కూడా ముఖ్యమంత్రిని కాలేనని తెలుసు గాబట్టి ఇప్పుడే కాస్త రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడితే అలాగయినా జనానికి గుర్తుంటానని ఈముఖ్యమంత్రి ప్రయాస. అయితే సొంతబలం ఏమాత్రం లేక సర్పంచి పదవికి కూడా సొంతంగా గెలవలేని ఈసీల్డ్‌కవర్ ముఖ్యమంత్రికి ఈప్రయత్నం మేలు చేయదు కదా బెడిసికొట్టి విభజన తరువాత దిక్కులేకుండాపోవడం ఖాయం.

అంతసేపు కష్టపడి, ఎంతో ప్రిపేర్ అయ్యి చేసిన ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒక్క వాస్తవం కూడా లేకపోగా నవ్వుకునేలాగున్నది. ముఖ్యమంత్రి తన మాటలద్వారా తనకు నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టిందీ కూడా తెలియదని నిరూపించుకున్నాడు. పైగా దేశాలమధ్య నీటి వాటాలు పంచుకుంటుంటే రాష్ట్రాలమధ్య పంపకం అసాధ్యమని తేల్చేయడం ముఖ్యమంత్రి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది.   

తన మాటలద్వారా ముఖ్యమంత్రి తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకుంటున్నాడు. పోన్లే..కుర్చీలో ఉండేది మరో రెండు మూడూ రోజులేగదా. కాకపోతే ఈముఖ్యమంత్రి మాటలు చూసి తమ స్టార్‌బాట్స్‌మన్ చెలరేగాడని పండగ చేసుకుంటున్న సీమాంధ్ర ఆందోళనకారులు ముఖ్యమంత్రి పోయి రాష్ట్రపతి పాలన వచ్చినా, మరో ముఖ్యమంత్రి వచ్చినా తమ బతుకు బష్టాండే నని తెలుసుకుంటే మంచిది. 

Friday 27 September 2013

సమైక్యవాద కామెడీలు

ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయక ఫాక్షనిజం పేరుతో తిన్నదరగక చంపుకొనుడూ, కులగజ్జితో హత్యాకాండలు జేసే వర్గం ఒక్కసారి ఆందోళనలు చెయ్యాల్సి వచ్చింది. అది కూడా తమ కదుపుకోసం కాకుండా తాము కొమ్ముగాసే బడా నాయకుల ఆస్థులకోసం, టీవీ మీడియా ప్రదర్శనకోసం చేసే ఆందోళనలు ఎలాగుంటాయి? పాపం ముఖ్యమంత్రీ,డిజీపీ, అన్ని రాజకీయపార్టీలూ కలిసి ఎంతగాలికొట్టడానికి ప్రయత్నించినా కామెడీలు తప్ప ఎక్కడా ఉద్యమాలు కానరావు. ఇవీ సీమాంధ్రలో ప్రస్తుతం సమైక్యాంధ్రకోసం జరిగే కామెడీలు.   

మరి ఇక్కడ నిజంగా ఉద్యమాలు జరగలేదా అంటే గొప్ప ఉద్యమాలు జరిగాయి. కాకరాపల్లి, సోంపేట థర్మల్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కారంచేడు,చుండూరు, లక్షింపేట దమనకాండలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. కానీ పాపం ఆఉద్యమాలు సీమాంధ్ర ఛానెల్లకూ ఎన్నడూ పట్టలేదు గానీ ఇప్పుడు ఈపసలేని సమైక్యాంధ్ర డ్రామాలను మాత్రం రోజంతా ఒకటే ఊదరగొడుతున్నరు.  



తెలంగాణ వస్తే వీల్లకు కట్టుకోడానికి బట్టలు కూడా మిగలక ఆదిమ మానవుల్లాగా ఆకులు కప్పుకుంటారట.
  

తెలంగాణ వస్తే అడుక్కోవడమే వీళ్ళ బతుకట. మొన్నటిదాకా తాము లేకపోతే తెలంగాణ బతుకలేదని అన్నది వీళ్ళే.
తెలంగాణ ప్రజలు రాక్షసులట, సీమాంధ్ర ప్రజలు దేవుళ్ళట. మరి రాక్షసులతోటి ఎందుకు కలిసి ఉండడం? 



అర్ధం లేని ఆందోళనలకు జనాలు దొరక్క ఎప్పుడూ ముక్కుపచ్చలారని బడిపిల్లలనే ఎండల్లో నిలబెడతారు.


ఉద్యమమంటే ఒక ఫ్యాషన్ షో, ఒక కబడ్డీ, ఒక రికార్డ్ డాన్స్.


ఒకడు మీద పెట్రోలు పోసుకుని బెదిరిస్తుంటే మిగతావారు నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు.

తెలంగాణ అడిగితే నరుకుతారట ఈమగువలు.

ఇంకా కొందరు ఈకలు పీకుతూ, మట్టి తింటూ కూడా వినూత్నంగా ( ఈనాడు భాషలో) తమ నిరసన తెలిపారు. 

Thursday 26 September 2013

ఒక ప్రాంత సీఎం గా పనిచేస్తున్న కిరణ్ - దిగ్విజయ్ వ్యాఖ్య

-పక్షపాతం పనికిరాదు.. అన్ని ప్రాంతాల ప్రజలు 
-ఎన్నుకుంటే  సీఎం అయ్యారు: దిగ్విజయ్ వ్యాఖ్య
-కేబినెట్ నోట్ తయారవుతోంది.. కేంద్ర మంత్రివర్గం చూశాక అసెంబ్లీకి పంపిస్తాం
-ఎపీ ఎన్జీవోల సమ్మెతో సామాన్యులకు ఇబ్బందులే .. వేడుకుంటున్నా .. విరమించండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (టీ మీడియా) :రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా ఉండి ఒక ప్రాంతంపై పక్షపాతం ప్రదర్శించరాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఎన్నుకుం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. 
diggirajaకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో బుధవారం రాష్ట్ర రాజకీయాలపై సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణపై కేబినెట్ నోట్, సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న తీరు, ఏపీఎన్జీవోల సమ్మె, ఎంపీల రాజీనామా తదితర అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

అందరూ ఎన్నుకున్న సీఎం..
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంవూతిగా వ్యవహరించరాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారూ ఎన్నుకుం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అన్ని ప్రాంతాల పట్ల ఆయన సమబాధ్యతతో వ్యవహరించాలి’ అని దిగ్విజయ్ హితవు చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని చట్టసభల్లో అడ్డుకుంటే రాష్ట్రపతి మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగల శక్తి తనకు ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఆయనఈ విధంగా స్పందించారు. మంగళవారం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఓడిస్తే తాను వ్యక్తిగతంగా రాష్ట్రపతిని కలిసి బిల్లును తిరస్కరించాలని కోరతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 

ప్రైవేటు పనిచేస్తుంటే...
ఎపీఎన్జీవోల సమ్మె పై మాట్లాడుతూ..‘సమ్మెను నిలిపివేయాలని వారిని కోరుతున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని దిగ్విజయ్ అన్నారు. ‘ప్రైవేటు వ్యాపారాలు కొనసాగుతున్నప్పుడు, ప్రైవేటు దుకాణాలు తెరిచి ఉంటున్నప్పుడు, ప్రైవేటు రవాణావ్యవస్థ పని చేస్తున్నప్పుడు, ప్రైవేటు స్కూళ్లు నడుస్తున్నప్పుడు, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ఎందుకు మూసేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. ‘ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా... అన్ని ఇబ్బందులు, భయాలను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి పనిలో చేరండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి ప్రయోజనాలు పరిరక్షించబడతాయని హామీ ఇస్తున్నాం’ అని ఆయన చెప్పారు. 

Tuesday 24 September 2013

సత్యవాణి భూకబ్జాపై విచారణ చేయండి

- శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు లోకాయుక్త ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (టీ మీడియా): ఆధ్యాత్మికం ముసుగులో భూ కబ్జాకు పాల్పడిన సత్యవాణి దందాపై సమగ్ర విచారణ జరిపించాలంటూ రంగాడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మార్వోను లోకాయుక్త ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి నవంబర్ 11లోగా నివేదికను సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సత్యవాణి భూదందాలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నేత, న్యాయవాది బద్దం నర్సింహాడ్డి, జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో సత్యవాణి భూ కబ్జా బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మియాపూర్ సర్వే నెం.

satyaavani100, 101లో బైనంబర్‌లతో సత్యవాణి భూదందాకు పాల్పడ్డారని, గతంలో ఆమె అధ్యక్షురాలిగా పనిచేసిన దీప్తిశ్రీనగర్ హౌస్ బిల్డింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై విచారణ జరిపించాలని వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సత్యవాణి భూ కబ్జా వ్యవహారం తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ సైబరాబాద్ కమిషనర్, రంగాడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి జాయింట్ కలెక్టర్, మియాపూర్ సీఐ, శేరిలింగంపల్లి ఎమ్మార్వో, మియాపూర్ సబ్ రిజిష్ట్రార్‌లను రెస్పాండెంట్స్‌గా తన ఫిర్యాదులో చేర్చారు. మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ధార్మిక కార్యక్షికమాల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తున్న సత్యవాణిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ (టీఆర్‌సీపీ) డిమాండ్ చేసింది. దేవుడు పేరుతో దేవాలయాలు నిర్మించి శివబాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణి 520 ఎకరాల భూమిని ఆక్రమించి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండగడ్డ విక్రమ్‌కుమార్ ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అట్లూరి సుబ్బారావుతో కలిసి విక్రయించిన సత్యవాణిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Monday 23 September 2013

వర్ధిల్లాలీ సమైక్యాంధ్ర!!



"వర్ధిల్లాలీ సమైక్యాంధ్రా" సుబ్బారావు గట్టిగా, పక్కనున్న నారాయణ కాస్త నెమ్మదిగా అరిచారు. గంటనుండీ అలాగే అరుస్తున్నారు. అదేదో సమైక్యాంధ్రకోసం ధర్ణా అట. బడిపిలగాళ్ళంతా చక్కగా రంగురంగు యూనిఫారాలతో ఒద్దికగా కూర్చున్నారు. అక్కడక్కడ సుబ్బారావు, నారాయణ లాంటి మరికొందరు నడివయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎవరో ఒక పెద్దాయన నినాదాలిస్తుంటే బడి పిల్లలు చక్కగా గొంతు కలుపుతున్నారు. సుబ్బారావు కూడా వారితో పాటు గట్టిగా అరుస్తున్నా మిగతా జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు.

నారాయణకు కాసేపటికి తామెందుకలా అరుస్తున్నామనే సందేహం వచ్చింది. సుబ్బారావ్, సమైక్యాంధ్ర వర్ధిల్లడమంటే ఏంటి?

సుబ్బారావుకు కోపమొచ్చింది. "అంటే ఈరాష్ట్రాన్ని యిడగొట్టకుండా ఇలాగే కలిపి ఉండాలని".

మరి యెవలిడగొడుతున్నరు?

నారాయణ, నువ్వసలు బొత్తిగా ఏం జరుగుతుందని తెలుసుకోవు లాగుంది. తెలంగాణోల్లు తమకు వేరే రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తున్నరు. ఈమధ్యనే కేంద్రం వాల్ల డిమాండుకు ఒగ్గేసి విడగొట్టడానికి ఒప్పుకుంది. అందుకే మనం ఇలా ధర్ణా చేస్తున్నాం.

ఆహా!! వాళ్ళు విడగొట్టమని, మనోళ్ళు కలిసుందామనీ అంటున్నరన్నమాట. ఇప్పుడేం జెయ్యాల? మనం మాత్రం కలిసుండీ వాళ్ళు విడిపోతె సరిపోద్ది గద?

నారాయణా, అసలు నీకేం తెల్వదు. వాళ్ళు విడిపోయి మనం కలిసుండడమంటె రాష్ట్రం విడిపోయినట్టే గద?

సుబ్బారావ్, నువ్వు చెప్పింది నిజమే కని మనం మాత్రం కలిసుండాలంటె సమైక్యాంధ్ర ఎట్ల వర్ధిల్లుతది?

నారాయణ, వాళ్ళు విడిపోతె మనకేంది గానీ, విడీపోతూ విడిపోతూ వాళ్ళు హైదరాబాదును కూడా తమతోపాటు తీసుకెలుతున్నరట. మన నాయుడుగారి యాపారాలన్నీ నేమో హైదరాబాదులనే ఉండె. అందుకే ఈపోరాటం. అందుకే మన నాయుడుబాబుగారు మనల్ని యిక్కడకి రమ్మని పిలిసిండు.

అట్లనా! అట్లయితే మనం హైదరాబాదు మనగ్గావాలని కద పోరాటం జెయ్యాల్సింది? మరి నడిమిట్ల సమైక్యాంధ్ర వర్ధిల్లాలని అనుడెందుకు?

అట్లడిగితె హైదరాబాదు మనకు రాదంట. నాయంగ హైదరబాదు వాల్లదేనంట. కలిసేటప్పుడు మనం దాన్ని తీసుకెల్లలేదు, అది మన ప్రాంతంల లేదు. ఎటు జూశినా అది మనకు దక్కే ఉపాయంలేదు. అందుకే సమైక్యంగ ఉంటె హైదరాబాదుమీద నాయుడుగారి పెత్తనం అట్నే నడుస్తది, ఆయన యాపారాలు అట్నే సాగుతయని నాయుడుగోరి ఆశ.

ఓహో..సూటిగడుగుతందుకు మనదగ్గర నాయం లేదు గనక యిట్ల డొంకతిరుగుడు యవ్వారం జేస్తున్నమన్నమాట. ఏమైనా నాయుడుగారిది గొప్ప తెలివే సుబ్రావ్. ఇంతకూ మనకేది మంచిగుంటది?  

మనమాహైదరాబాదును ఎప్పుడన్న సూశినమ, పెట్టినమా? మనరాజధాని మన బెజవాడ దగ్గరుంటె కనీసం అప్పుడప్పుడన్న పొయ్యిరావచ్చు. మనకు పనులు పెరుగుతయి. విడిపోతనే మనకు మంచిది.

ఈయిసయం ఇంతమెల్లగ చెబుతవేంది సుబ్రావ్? మన కోరికల నాయం లేకపాయె, మనకు లాభం లేకపాయె. మన నాయుడుగారి లాభంకోసం పొద్దాక మనమెందుకు ఈడ కూసోని గొంతుబొయ్యేదాక అరవాలె? సదువుకునే పిలగాళ్ళెందుకు సదువులు పాడు చేసుకుని అరవాలె. నాకిదేం బాగనిపిస్తలేదు. పోదాం పద.

సరే..నాకూ అదే అనిపిస్తుంది. పద ఇంటికెల్దాం. రేపటినుంచి నాయుడుగారిదగ్గర పని మానేసి ఇంకెక్కడన్న చూసుకుందాం. 


ముఖ్యమంత్రి మార్పు



రాష్ట్రవిభజన గురించి కాంగ్రేస్ నిర్ణయం తీసుకున్నతరువాత తోక జాడిస్తున్న ముఖ్యమంత్రిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిర్ణయానికి ముందు అంతా మీయిష్టం అంటూ హైకమాండ్‌కు చెప్పొచ్చిన సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి ఆతరువాత వారంరోజులకు సుషుప్తావస్త నుండి బయటికి వచ్చి రాష్ట్రాన్ని విభజిస్తే నీళ్ళ సమస్యలెలా తీరుస్తారు, విద్యుత్ సమస్యలెలా తీరుస్తారు అంటూ మాట్లాడి తన అవగాహనారాహిత్యాన్ని చాటుకోవడమే కాక సీమాంధ్రలో  కిరాయి ఉద్యమాన్ని సృష్తించడం కోసం అషోక్‌బాబు లాంటి పావులను కదపడంపై ఢిల్లీ కోపంగా ఉంది.

నిజానికి విభజన ప్రకటన తరువాత సీమాంధ్రలో వారం రోజులపాటు ఎలాంటి ఆందోళనలూ లేవు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా భాయాందోళనలు రగిలించడమె కాకుండా కొందరు కిరాయి మనుషులతో ఆందోళనలు ప్రోత్సహిస్తున్నాడనేది బహిరంగ రహస్యం. ఏపీఎంజీవోలు హైదరాబాద్‌లో జరిపిన మీటింగుకి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అయి నడిపించడమే కాకుండా ఏసీ బస్సులూ, ప్రత్యేక రైల్లూ అరేంజ్ చేశాడు. 

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంకోసం సభలకు అనుమతుల నిరాకరణతోపాటు ముందస్తు అరెస్టులూ, రబ్బరు బుల్లెట్లూ, విచక్షణారహితంగా లాఠీఛార్జీలూ చేపించే ముఖ్యమంత్రి సీమాంధ్ర ఆందోళనల్లో జాతీయ నాయకుల విగ్రహాలు కూలగొడుతున్నా పట్టించుకోలేదు. 

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య నాటకానికి ముగింపు పలకడానికి కేంద్రం ముఖ్యమంత్రిని మార్చి తెలాంగాణకు చెందిన నాయకున్ని ముఖ్యమంత్రిని చెయ్యడమో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడమో చేయనున్నట్లు సమాచారం. ఇదేజరిగితే సమైక్యాంధ్ర ఆందోళనలు ఆపడానికి అక్కడ కూడా ముందస్తు అరెస్టులూ, లాఠీచార్జీలూ, కేసులు బనాయించడం చేస్తే వాటిని తట్టుకుని సమైక్యాంధ్ర సమర్ధకులు ఆందోళనలు ఎంతవరకు కొనసాగిస్తారనేది ప్రశ్నార్ధకమే. కడుపు కాలినవాడు పోలీసులనెదిరించి పోరాడుతాడు కానీ కడుపు నిండినవాడు చేయలేడుకదా? 

Sunday 22 September 2013

అర్ధంలేని భయాలు, మాటున దాగున్న కఠొర సత్యాలు



సీమాంధ్ర టీవీ ఛానెల్లలో విభజన గురించి జరుగుతున్న చర్చాగోష్ఠుల్లో పాల్గొంటున్న కొందరు వెలిబుచ్చుతున్న భయాందోళనలు చూస్తుంటే అక్కడి ప్రజలను వారి నాయకులు ఎంతగా బెదరగొట్టారో తెలుస్తుంది. అయితే వీరు వెలిబుచ్చే భయాందోళనలను పరిశీలించి చూస్తే చరిత్రలో దాగిన కఠోర సత్యాలు కనిపిస్తున్నాయి.

ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటుంది: రాష్ట్ర ఆదాయంలో అరవైశాతం హైదరాబాదు నుంచేనట. మరి విడిపొÓతే మాకు జీతాలెవరిస్తారు? నిజానికి ఇప్పుడు హైదరాబాదుకింద చూపించే ఆదాయం అంతా హైదరాబాదుది కాదు. రాజధాని హైదరాబాదు కనుక పన్నులన్నీ హైదరాబాదుకిందికి వస్తాయి కానీ విడిపోతే అందులో సీమాంధ్ర వాటా సీమాంధ్రకే చెందుతుంది కనుక జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనేది ఒక ఎక్జాగరేషన్. అయితే దీని మాటున దాగున్న సత్యం: 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపూర్వం ఆంధ్రరాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణతో కలవడానికి ఇక్కడ మిగులు ఆదాయం ఒక ప్రధాన కారణం.

మరో ప్రభుత్వ ఉద్యోగి: "నలభై వేలమంది ఉద్య్'ఓగులు హైదరాబాదు విడిచి వెల్లాల్సి వస్తుంది". ఇది కూడా ఎక్జాగరేషన్. పదేళ్ళవరకూ హైదరాబాద్ కామన్ కాపిటల్ అయితే పదేళ్ళు వదిలి వెల్లాల్సిన అవసరం ఉండదు. అంతలోగా ఎందరో రిటైర్ అవుతారు. అయితే ఇక్కడ  బయట పడే సత్యం: ఇన్నాళ్ళూ సీమాంధ్రులు హైదరాబాదులో అక్రమంగా తమ వాటా కంటే చాలా  ఎక్కువగా ఉన్నారని చెప్పినప్పుడు ఒప్పుకోనివారు కలుగుల్లో ఎలుకల్లా తమ సంఖ్యను తామే బయట పెట్టుకున్నారు.

"మన థెర్మల్ పవర్ ప్లాంట్లకు తెలంగాణ వారు బొగ్గు ఇవ్వరు". ఇది ఏమీ పరిష్కరించుకోలేనటువంటి సమస్య కాదు. దానికి సంబంధించి ఒప్పందం చేసుకోవచ్చు, పైగా దిగుమతి కూడా చేసుకోవచ్చు. ఎలాగూ మన బొగ్గు మన అవసరాలకు సరిపోవట్లేదు. అయితే ఇక్కడ దాగున్న సత్యం: బొగ్గు తెలంగాణలో ఉన్నప్పటికీ, కోస్తాంధ్రలో పంటపొలాలతో ఉన్న భూములు థెర్మల్ కేంద్రాలకు అనుకూలంగా లేనప్పటికీ థెర్మల్ ప్రాజెక్టులు మాత్రం అక్కడ పెట్టించారు. కారణం: ఆఉద్యోగాలన్నీ అక్కడివారికే చెందాలనే అత్యాశ.

మరొకావిడ చెబుతుంది:"నదీపరివాహిక ప్రాంతమంతా అక్కడ ఉంటే సీమాంధ్రకు సముద్రపు నీల్లే గతి". మరి పరివాహిక ప్రాంతమంతా తెలంగాణలో ఉన్నప్పుడు ఇన్నాల్లూ ఇక్కడ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? అప్పుడెందుకు గ్రావిటీ బూచిని చూపి తెలంగాణ ప్రాజెక్టులు అటకెక్కించారు? ఇన్నాల్లూ లేనిది ఇప్పుడుమాత్రం ఒక్కసారే ఎత్తుగడ్డపైనున్న తెలంగాణలో ప్రాజెక్టులు సాధ్యమయి నీరు క్రిందికి రాకుండా ఆపగలం?

ఇంకా ఒక ఆర్టీసీ ఎంప్లాయీ బాధ: " విడిపోతే ఆర్టీసీ మూత బడుతుంది". ఇన్నాల్లూ నడిచింది ఇప్పుడెందుకు మూతబడుతుంది? ఆర్టీసీ అంతా తెలంగాణ ఆదాయంపైనే నడుస్తునందనేది ఇక్కడ దాగిన సత్యం, పెత్తనం మాత్రం అన్నిటిలాగే ఇక్కడ కూడా ఆంధ్రాదే.






Friday 20 September 2013

అప్పుడే పుట్టిన పసిగుడ్లనూ వదలని సమైక్య సాడిజం!


సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ వెర్రితలలు వేస్తున్నాయి. అక్కడి సంఘాలు, పార్టీలు చేస్తున్న కొన్ని కొన్ని నిరసన రూపాలు చూస్తుంటే “అసలు వీళ్లకు ఉద్యమమంటే పరాచికం” అనిపిస్తుంది
కానీ ఈ వీడియో చూడండి. ఇది వారి ఉన్మాదానికి పరాకాష్ట. అప్పుడే పుట్టిన పసిగుడ్లను కూడా తమ రాజకీయాలకు ఎంత అమానవీయంగా వాడుకుంటున్నరో…
చేసినోళ్లకు బుద్ధిలేదు సరే, కనీసం దీన్ని ప్రసారం చేసిన మీడియా వాళ్లకైనా ఉండాలె ఇంగితజ్ఞానం.

సీమాంధ్ర జనం వీధుల్లో నేతలు భూముల్లో


కోట్ల రూపాయలు మళ్లిస్తున్న పెట్టుబడిదారులు, నేతలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేతులు
మారుతున్న వేల ఎకరాలు

-భూముల కొనుగోళ్లలో సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు
-రానున్న కొత్త రాజధాని.. సీమాంధ్రలో రియల్ రెక్కలు
-వెయ్యి ఎకరాలు కొనేసిన సమైక్య నాయకుడు
-అదే దారిలో గుంటూరు కాంగ్రెస్ నేత..
-తానూ తక్కువ తినలేదన్న టీడీపీ మాజీ మంత్రి
-వాటా కోసం మూడు సీమాంధ్ర చానళ్ల పోటాపోటీ


lands001విజయవాడ/హైదరాబాద్, సెప్టెంబర్ 19 (టీ మీడియా):సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజలను ఉద్యమాలకు ఉసికొలుపుతున్న నేతలు, టీవీ చానెళ్ల యజమానులు రాష్ట్ర విభజనను లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. సీమాంవూధలో రియల్ వ్యాపారానికి ఈ వర్గాలవారు భారీగా నిధులు తరలిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ సాగిన వీరి రియల్ దందా గత రెండు నెలలుగా సీమాంధ్ర జిల్లాల చుట్టూ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కాంగ్రెస్ అధిష్ఠానం కొంతకాలం క్రితమే సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు చెప్పేసింది. అప్పటినుంచే ఆయా ప్రముఖులు తమ వ్యాపారాభివద్ధికి రియల్ ఎస్టేట్ ప్రణాళికలు వేసుకున్నారు. రాజధాని నగరం ఏ ప్రాంతంలో రావచ్చో కూడా అంచనాలు వేసుకుని అనుచరులతో ఆ ప్రాంతాల్లో భూముల అన్వేషణ చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒకవైపు రాజీనామా డ్రామాలు, మరోవైపు ప్రజలను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. అదే సమయంలో తమ ఆస్తుల విస్తరణకు ఈజీ మనీ...తక్కువ సమయంలో గడించేందుకు అడుగులు వేస్తున్నారు.

గతంలో తెలంగాణ ప్రాంతంలో అలైన్‌మెంట్ల మార్పులు-చేర్పులతో అడ్డదిడ్డంగా అక్రమార్జనకు అలవాటుపడిన సీమాంధ్ర పెట్టుబడిదారులు తాజాగా సీమాంవూధలో అలాంటి నాటకాలే ఆడుతున్నారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, ఎక్కడ కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్నారు...అనే విషయాలు అన్నీ క్షుణ్ణంగా తెలిసిన నేతలు తెలివిగా చౌక ధరలకు భూములను కొనుగోలుచేస్తూ సీమాంధ్ర ప్రజలకు శఠగోపం పెడుతున్నారు. సమైక్య ఉద్యమం నడిపిస్తున్న రాజకీయ నేతలే భూవ్యాపారం జోరుగా జరుపుతున్నారని ఇటీవలి భూముల క్రయవిక్షికయాలను గమనిస్తే వెల్లడవుతోంది.

ఇందులో ట్విస్టు ఏమిటంటే తెలంగాణ రానే రాదని.. హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు ఉన్నాయని తమకు తెలిసిందని రోజుకో సోది చెబుతున్న సీమాంధ్ర వార్తా చానళ్లు కూడా భూముల కొనుగోలులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుండి రెచ్చగొట్టి మరీ వార్తలు ప్రసారం చేస్తున్న 3 సీమాంధ్ర చానళ్లు ఢిల్లీలోని తమ లాబీని ఉపయోగించి ఎక్కడ రాజధానికి అనుకూల పరిస్థితి ఉందోనని తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా చవక ధరలకు భూములను కొనుగోలుచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొనుగోలు అగ్రిమెంట్లు కూడా చేయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ వచ్చే పరిస్థితి లేదంటూ ప్రజల ఉద్యమాలను భూతద్దంలో చూపుతున్నాయి. సీమాంవూధకు చెందిన రాజకీయ పెట్టుబడిదారులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవంగా ఇపుడు సీమాంవూధకు కొత్త రాజధాని ఏర్పాటుపై స్థల అన్వేషణ జరుగుతున్నది. ఫలితంగానే గత ఆరేడు ఏళ్ల క్రితం హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో వచ్చిన రియల్ ఊపు ఇపుడు సీమాంవూధలో కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు తమ అనుచరగణం ద్వారా గుంటూరు నుంచి ఒంగోలు వరకు భూములు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

కొనుగోళ్లలో నేతలు బిజీబిజీ..
సమైక్యాంవూధకు మారుపేరుగా నిలబడిన ఒక ప్రజావూపతినిధి ఇప్పటికే ఒంగోలు సమీపంలో వెయ్యి ఎకరాలకు పైగానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సీమాంవూధకు కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య లేదా ఒంగోలు సమీపంలో నిర్మాణం జరుగుతుందని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు తెనాలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా గతంలో పనిచేసిన ఒక ప్రజా ప్రతినిధి సూచనలు, సలహాలతో పలువురు ప్రజావూపతినిధులు గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, మార్కాపురం చుట్టువూపక్కల భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అదే విధంగా విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే మార్గంలో హనుమాన్‌జంక్షన్, నూజివీడు, అగిరిపల్లి చుట్టు ప్రక్కల సైతం భూములు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు-విజయవాడ మార్గ మధ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజావూపతినిధి సంయుక్తంగా సుమారు 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పడితే వాటి చుట్టు ప్రక్కల ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. రాజధానికి మెరుగైన అవకాశాలున్నాయనే ప్రచారం ఉన్న ప్రకాశంజిల్లాలో ఇప్పటికే రాజకీయ నేతలు భారీగా భూములను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కనిగిరి, పొదిలి, మార్కపురం ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రకటన రాకముందే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా రాయించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యాపార వేత్త, పార్లమెంట్ సభ్యుడు ఒకరు గుంటూరు జిల్లా చిలుకలూరి పేట నుంచి వినుకొండకు వెళ్లే మార్గంలో 800 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు కూడా జోరుగా భూములు కొనుగోలు చేస్తున్నారు. చోటా, మోటా నాయకులు కూడా భూ కోనుగోలుపైనే దృష్టి సారిస్తున్నారు. విజయవాడ నుంచి నందిగామ వరకు రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇబ్రహింపట్నం- కంచికచర్ల మధ్యలో కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు చెబుతున్నారు. విజయవాడ -ఆగిరిపల్లి మధ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత వంద ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ-ఏలూరు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మూడు వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. సీమాంధ్ర సమ్మె నేపథ్యంలో అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. దీన్ని గమనించిన పెట్టుబడిదారులు తెలంగాణలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు అనుమతించాలని సీఎంను ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.

సండే భోజనం - పిచ్చాపాటీ కబుర్లు

"అప్పుడే పన్నెండయ్యింది. తొందరగా తయారవుతావా?" ల్యాప్‌టాప్ నుంచి మొహం తిప్పకుండానే మా ఆవిడనడిగాను.

"నేను రెడీ, బుజ్జిగాడు కూడా రెడీ. నువ్వు కూడా తయారయితే తొందరగా వెల్లొచ్చు." సమాధానం.

సండే. బద్దకంగా ఉంది. తెలిసినవాళ్ళు భోజనానికి పిలిచారు.

మేముండే దేశంలో చలికాలం అంతా చలీ, చీకటి కనుక వేసవి విలువయింది. అలాంటి వేసవిలో అందమయిన ఆదివారం ఇలా భోజనానికి వెల్లడం విసుగ్గానే ఉన్నా ప్రామును తోసుకుంటూ మెల్లిగా కదిలాం.

చక్కగా లేక్ సైడ్ స్విమ్మింగ్ వెలితే ఎంతబాగుండేది!! పిలిచినప్పుడు వెల్లాలి తప్పదు. ఇక్కడ ఉండే తెలుగువాల్లే అతికొద్దిమంది కనుక ఇలా భోజనాలపేరుతోనయినా అప్పుడప్పుడూ కలిస్తే బాగుంటుంది.డిన్నర్ అయితే బాగుండేదనుకున్నాను.

అపార్ట్‌మెంటు బయటివరకూ మసాలా వాసనలు వస్తున్నాయి. చికెన్లో మసాలా బాగానే దట్టించినట్టున్నారు. వాల్లబ్బాయి కిందకు వచ్చి మరీ మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళాడు.  

వెల్లేవరకు మా ఫ్రెండ్, వాల్లావిడా సినిమా యాక్టర్ల క్రికెట్ మాచ్ చూస్తున్నారు. సోఫాలొ కూర్చున్నాం. ఇంతలో కోక్ వచ్చింది. మెల్లగా సిప్ చేస్తూంటే మీరు మాచ్ చూడట్లేదా? భలే ఇంటరెస్టింగ్‌గా ఉంది అన్నాడు మావాడు.

"వీళ్ళను సినిమాల్లో చూడ్డమే కష్టం, ఇంకా బయట కూడా చూడాలా" అన్నాను.

ఇంతలో మంచు మనోజ్ పక్క హీరోయిన్‌తో ఏదో కుళ్ళు జోకులేస్తున్నాడు. "అసలు వీడు హీరో ఎలాగయ్యాడో? తండ్రి ఇండస్ట్రీలో ఉంటే  ఎవడైనా హీరో గావచ్చు" అన్నాన్నేను. అసలే నాకు నోటి దురుసు. మనసులో ఏదయినా తోస్తే బయటికి కక్కకుండా ఉండడం కష్టం.

"ఎందుకండీ, బాగానే ఉంటాడుగా? చిరంజీవి కొడుక్కన్నా నయమే కదా?" అంది మా ఫ్రెండ్ వాల్లావిడ.

నాక్కాస్త దిమ్మ తిరిగింది. చిరంజీవి కొడుకూ నాకు నచ్చడు గానీ మనోజ్ కంటే నయమే అని నా అభిప్రాయం. ఎవరి టేస్టు వారిది అనుకున్నాను. నాకింకా వాళ్ళు ఫలానా సామాజిక వర్గమని తెలియదు. అప్పటికి కూడా ట్యూబ్ లైట్ వెలగలేదు.

"అవును చిరంజీవి కొడుక్కి కూడా మొహానికి ఎన్నో ఆపరేషన్లు జేస్తే ఇప్పుడు ఆమాత్రం ఉన్నాడట" అంటూ కవర్ చేశాను.


భోజనాలకు ఇంకాస్త టైముంది. కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుతున్నాం.  కాస్సేపు ఆస్ట్రేలియాలో భారతీయులపై వేధింపులూ, పారిస్ ఎయిర్‌పోర్టులో ఇండియన్స్‌పై వివక్షా లాంటి వాటిగురించి సీరియస్‌గా మాట్లాడుకున్నాం. అంతలో నార్వేలో భారతీయులపై కేసు గురించి మాఫ్రెండు వాల్లావిడ చాలా సీరియస్ అయింది. "అసలు వీళ్ళకు భారతీయులంటే లెక్కే లేకుండా పోయింది. ఎంత పొగరు? వీళ్ళకు మనమంటే ఏంటో చూపించాలి" అంది.

భోజనాలకు లేచాం. కోడి కూరా, రాగి సంకటి. ఒంగోలు స్పెషల్. కాస్త మసాలా ఎక్కువైనా బాగానే ఉంది.

"మీ ఒంగోలు స్పెషల్ బాగుందండీ. థాంక్స్." అన్నాను.

మల్లీ పిచ్చాపాటీ మొదలయింది. ఈసారి తెలంగాణ, ఆంధ్రా గురించి టాపిక్ మల్లింది. నాక్కాస్త ఇబ్బందిగా అనిపించింది. అవతలి వాళ్ళు విభజనకు వ్యతిరేకమని తెలుసు. ఈమధ్యన ఇదో సమస్యయిపోయింది. ఈడిస్కషన్ వచ్చిందంటే అందరికీ ఇబ్బందే. మొహమాటాలు తొలగిపోయి ఒక్కోసారి వాదనలు వేడిగా మారుతాయి. 

అందరం తొందరగానే ఈ టాపిక్ నుంచి బయట పడ్డాం. నిజానికి నేనే డైవర్ట్ చేశాను.

ఇంతలో  టాపిక్ దళితులగురించీ, రిజర్వేషన్ల గురించీ మల్లింది. 

మా ఫ్రెండ్ వాల్లావిడ వాల్ల ఊరిలో దళితుల గురించి చెబుతుంది. "ఈమధ్యన వీల్లకు బాగా ఎక్కి పోయింది. నాకయితే వాల్లను చూస్తేనే అసహ్యం వేస్తుంది.  ధైర్యంగా వచ్చి ఆటోల్లో పక్కనే కూర్చుంటున్నారు. నిన్నమొన్నటిదాకా మాకింద పనిచేసేవారు నా పక్కన కూర్చోబోతే నేను లేచి వెల్లిపోతాను" ఇంకా ఏదో చెబుతుంది.

ఇందాక ఈవిడే కదా ఆస్ట్రేలియాలో భారతీయులపై వివక్షను గురించి ఆవేశంగా మాట్లాడింది? ఇంతలో ఎంత మార్పు? మనదాకా వస్తే అన్ని సూత్రాలూ మారుతాయి కాబోలు.

అప్పటిగ్గానీ ట్యూబ్‌లైట్ వెలుగలేదు. ఔను, కారంచేడు వీల్లూరికి ఎంత దూరం? అడగాలా? ఆవిషయం గురించి గానీ మాట్లాడానంటే కిచెన్ కత్తితో పొడిచి తరిమేస్తారేమో, తొందరగా బయటపడాలనుకున్నాను.     






Wednesday 18 September 2013

మాకడుపులు కొట్టి సంబరాలా?

నలభై రోజులుగా జరుగుతున్న సమ్మె వల్ల జీతం రాక కోపంతో ఒక ఆర్టీసీ డ్రైవరు మాకడుపులు కొట్టి మీరు సంబరాలు చేసుకుంటారా అంటూ విశాఖపట్నంలో సమైక్యాంధ్ర దీక్షల్లో డాన్సులు చేస్తున్న నాయకులపై విరుచుకుపడ్డాడు. యధాప్రకారం దీన్ని కూడా ఈనాడు ఎక్కడో లోకల్ ఎడిషన్లో లోపలి పేజీల్లో వేసింది.


Tuesday 17 September 2013

జేపీ ఏ ఎండకా గొడుగు!!

సీమాంధ్ర బందులు - పేదవిద్యార్థులే పావులు



సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యోగులు నలభై రోజులుగా సమ్మె చేస్తుండడం వలన ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూతబడి పిల్లల చదువులు గందరగోళమయ్యాయి. అయితే కార్పోరేట్ స్కూల్లు మాత్రం యధావిధంగా నడవడం వలన ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులపై ఈబందు ప్రభావం ఏమీ లేదు. ఎటొచ్చీ పేద విద్యార్థులు మాత్రం బలి పశువులుగా అయిపొయ్యారు.

తెలంగాణలో ఎంత ఉద్యమం జరిపినా ఇలా వరుసపెట్టి స్కూళ్ళు బందు పెట్టింది లేదు. సకల జనుల సమ్మె సందర్భంగా మాత్రం ఇరవైనాలుగు రోజులు అన్ని విద్యాసంస్థలూ ( ప్రభుత్వ మరియు ప్రైవేటు) మూతబడ్డాయి, కానీ అందులో పది రోజులు దసరాసెలవులు  కావడం వలన నికరంగా బందు ప్రభావం వలన మూతబడ్డది పద్నాలుగు రోజులే. దానికే గగ్గోలు పెట్టిన సీమాంధ్ర మీడియా ఛానెళ్ళు నలభై రోజులుగా మూతపడ్డ సీమాంధ్ర ప్రభుత్వ పాఠశాలలగురించి పట్టించుకుంది లేదు.

విశాలాంధ్ర మహాసభ అని పేరుపెట్టుకున్న ఒక సంఘం వారు సకలజనుల సమ్మె సందర్భంగా బడులు మూతబడి పిల్లల చదువులు పాడవుతున్నాయి అని తెగబాధపడిపోయి కూకట్‌పల్లిలో ఒక ర్యాలీ కూడా తీశారు. పదిమందికూడాలేని ఈగుంపు చేసిన ర్యాలీని సీమాంధ్ర మీడియా విపరీతంగా ప్రచారం చేసి,డిస్కషన్లు పెట్టి హడావుడి చేశింది. అయితే సీమాంధ్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గోడు మాత్రం ఈవిశాలాంధ్ర మహాసభకు ఎంతమాత్రం పట్టినట్టులేదు.  

సీమాంధ్రలో పలు చోట్ల తమ బడులు తెరిపించాలని పేద విద్యార్థులు ధర్ణాలు చేస్తున్నప్పటికీ సీమాంధ్ర మీడియా వాటిగురించి ప్రచారం జరగకుండా జాగ్రత్తపడుతుంది. కొండొకచో ఆధర్ణాలను కూడా సమైక్యాంధ్ర అకౌంట్లో కలుపుతున్నారు. ఇదీ సీమాంధ్ర ఉద్యమం తీరు. 



సత్యవాణి..కబ్జాల రాణి

నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్. శివ.. శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది. సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు.. అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి కొంత తెలుసుకున్నా అర్థమైపోతుంది. ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం. మియాపూర్‌లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని.. ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారని స్థానికులు చెబుతున్నారు.

satya2hg
సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్‌వాసుపూవ్వరూ అడుగుపెట్టే పరిస్థితి లేదని.. వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు. సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు. ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్టు రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలున్నాయి. 

దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి: సీమాంధ్రకు చెందిన ప్రశాంత్ బిల్డర్స్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ చైర్మన్ అట్లూరి సుబ్బారావు అండ దండలే సత్యవాణిని ఈస్థాయిలో నిలబెట్టిందని తెలుస్తున్నది. అట్లూరి చలవతోనే సత్యవాణి మియాపూర్ స్థలాన్ని కబ్జా చేసి ట్రస్టు మాటున సర్కారు భూములను బుక్కపెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లో ఉన్న దీప్తి శ్రీనగర్ కాలనీలో దీప్తి శ్రీ బిల్డింగ్ సొసైటీ 1985నుంచి 1990వరకు మూడు ఫేజ్‌లకు అనుమతులు పొందింది. అక్కడి నుంచే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు కబ్జా కథ మొదలైంది. నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీవాసులు ఎవరు లేకుండానే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు తామే ఈ సొసైటీ పెద్దలమని నాటకం మొదలు పెట్టారు. సత్యవాణిని సొసైటీ అధ్యక్షురాలుగా అధికారులను నమ్మించి ఈమేరకు రిజిస్ట్రేషన్ చేయించా రు. 

ఆ తర్వాత 1996నుంచి దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షురాలి పేరుతో సత్యవాణి సొసైటీ లేఅవుట్‌ను కాంప్రహెన్సివ్ రివైజ్‌డ్ లే-అవుట్ చేసి ప్రజాప్రయోజనార్థం నిర్దేశించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టారు. దీనికి ఉదాహరణగా ఫేజ్-1 లే అవుట్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం 1.18ఎకరాల విస్తీర్ణం గల భూమిని నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ లేఅవుట్‌లో చూపించింది. ఈ స్థలంపై కన్నుపడ్డ అట్లూరి సుబ్బారావు సత్యవాణితో కలిసి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్‌ను పార్క్ స్థలంలోకి మార్చారు. పార్క్ కోసం కేటాయించిన 50X275 =13750చదరపు అడుగుల స్థలాన్ని అట్లూరి సుబ్బారావు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ఫేజ్-2 లేఅవుట్‌లో స్కూల్ కోసం నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలాన్ని మరోసారి అట్లూరి సుబ్బారావు 1500గజాలు ఆయన భార్య పద్మావతి 1500గజాలు దక్కించుకున్నారు.

పైగా స్కూల్ కోసమంటూ నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలం సొసైటీ ఆధీనంలోనే ఉన్నట్లు చూపి జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి స్కూల్ నిర్మాణం కోసం సత్యవాణి అనుమతి పొందారు. అట్లూరి సుబ్బారావుకు, ఆయన భార్య పద్మావతికి అమ్మగా మిగిలిన 2270చదరపు గజాల స్థలాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు స్కూల్ పేరుతో అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. సత్యవాణి చేస్తున్న ఈ అక్రమాలన్నీ కాలనీ ప్రయోజనాలకు విరుద్ధమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమే అవుతుందని కాలనీవాసులు అంటున్నారు. తమకు తెలియని సొసైటీ ప్రెసిడెంట్ ఎవరా..? అని ఆర్‌టీఐ చట్టం కింద ఆరా తీస్తే సత్యవాణి అని తేలిందని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికే పై అక్రమాలను ప్రస్తావిస్తూ వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. కాగా, రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన దీప్తిశ్రీ నగర్ సొసైటీలో ఇప్పటివరకు ఒక్కసారికూడా ఎన్నికలు జరగలేదు. 

ఆలయాల ప్రాంగణంలో ప్రకృతి చికిత్సాలయం
దైవాన్ని చూపించి వందల ఎకరాల స్థలాన్ని బుక్కపెట్టిన సత్యవాణి ఈ ప్రాంగణంలోనే ఓ ప్రకృతి చికిత్సాలయం, గెస్టు హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గతంలోనే అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే ట్రస్టులో సాగుతున్న మరో దందా నీళ్ల అమ్మకం.. ఎండాకాలంలో హోటళ్లకు, ప్రైవేటు హాస్టళ్లకు ఇక్కడినుండే నీళ్లు వెళ్తాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా చుట్టుపక్కల ఎన్ని బోర్లు వేసినా నీళ్లుపడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టులో నాంపల్లి బాబా స్పెషల్‌గా కనిపిస్తాడు. వాస్తవానికి ఈయన ఎక్కడా ఏ ఆధ్మాత్మిక కార్యక్షికమాల్లో పాల్గొనలేదని స్థానికులు చెబుతారు. గతంలో ఈ నాంపల్లి బాబా నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి తాగుతూ తిరిగేవాడని అక్కడి స్థానికులు చెబుతుంటారు. కానీ ఈ బాబాకు సత్యవాణి గుడి కట్టించేశారు.

Sunday 15 September 2013

రూంమేట్లు!!



"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.

సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.

సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ.  బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.

సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే  వచ్చి రమేశ్ గదిలోచేరాడు.

మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్  వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని  తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.

"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"

"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"

"ఏం చేస్తావేంది?"

"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"

"సరే చేసుకో."

"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"

"సరే. నీ ఇష్టం"

"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".

"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.

సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"

రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది.


రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.

"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"

"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."

"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే  దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"

"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి  నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు.

తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.

నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.

ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."

"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం."  రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.

"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.

"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.

Wednesday 11 September 2013

రౌడీయిజం వీరి నైజం



సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రకోసం హైదరాబాదులో సభ పెట్టుకున్నారు. ఉద్యోగుల ముసుగులో సభకు విచ్చేసిన సీమాంధ్ర ఫాక్షన్ రౌడీ మూకలు తెలంగాణ ప్రజలకు పీకలు తెగ్గోస్తాం అంటూ సైగ చేసి చూపడంతో పాటు సభపై తమ నిరశన తెలిపిన విద్యార్థులు, ఒక పోలీసు, సీఐ లపై పాశవికంగా సీమాంధ్ర ఫాక్షన్ ముఠాల దాడులను గుర్తుచేస్తూ కొట్టారు.

దాడులకు కొందరి సమర్ధన - "సమైక్యాంధ్ర సభకు వచ్చి జైతెలంగాణ అంటే కొట్టరా" అని. పైగా మారాజధానిలో మేం సభ పెట్టుకుంటే వద్దనడానికి మీరెవ్వరు అనడం. పచ్చకామెర్లతో కళ్ళకు విషమెక్కిన వీరినుండి మనం ఇంతకన్న ఎక్కువ ఆశించడం అత్యాశే.

రాజధాని కదా అనీ ఢిల్లీకి వెల్లి ఢిల్లీ పౌరుల మనోభావాలకు వ్యతిరేకంగా సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇస్తారా. ఒకవేళ సభ పెట్టుకుంటే అక్కడి జనం ఊరుకుంటారా?భావోద్వేగాలు తీవ్రస్థాయిలో  ఉన్న ఈసమయంలో సీమాంధ్రులు హైదరాబాద్ వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా సభపెడితే ఉద్రిక్తతలు పెరగవా? అది ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టినట్టు కాదా? అలాంటి సభను ఎందుకు పెట్టుకోవ్వాలి? దానికి ప్రభుత్వం ఎందుకు అనుమతినివాలి? సమాధానం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. సీమాంధ్రకు కొమ్ముగాస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణను ఆపడానికి తానేస్వయంగా ఉద్యోగసంఘాలతో మాట్లాడి పెట్టించిన సభ ఇది. సీమాంధ్ర చంచా అయిన డీజీపీ దీనికి నాలుగురోజులు ముందుగానే అనుమతినిచ్చాడు.

సమైక్యాంధ్రసభను పెట్టుకున్న వాళ్ళు సమైక్యతకోసం ఏమన్నా నాలుగు మంచిమాటలు చెప్పారా? ఎందుకు కలిసుండాలో తెలంగాణప్రజలకేమయినా సందేషం ఇచ్చారా? తెలంగాణ ప్రజల సమస్యలేంటి, బాధలేంటి అని విచారించి తెలుసుకోవడానికి ఏమన్నా ప్రయత్నించారా అంటే అదేంలేదు, కేవలం మేము రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమని బెదిరించారు. ఎందుకంటే వీరి ఉద్దేషం సమైక్యత కాదు, ఉద్రేకతలు రెచ్చగొట్టడం, తరువాత ఎవరైనా ఒక రాయి రువ్వితే దాన్ని సాకుగా చూపి హైదరాబాదును యూటీ చెయ్యాలని డిమాండ్ చెయ్యడం.

ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంటే నిరశన తెలపడం ప్రజల హక్కు.అదేలేకపోతే అది ప్రజాస్వామ్యం అవదు, నిరంకుశత్వం అవుతుంది. ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్టుకున్న ఈసభను ఆపాల్సిన ప్రభుత్వమే దగ్గరుండి జరిపిస్తుంటే కోపగించిన ప్రజలు చేయగలిగింది నిరశన తెలపడం. అలా నిరశన తెలపడానికి వెళ్ళిన వారికి జరిగిన సత్కారం అనాగరిక సీమాంధ్ర ఫాక్షన్ సంస్కృతిని గుర్తుచేస్తూ పాశవికంగా కొట్టడం.

బాలరాజు యాదవ్ అనే ఓయూ విద్యార్థిని ఎల్బీ స్టేదియం బయట గేటుదగ్గర కడప ఎంజీవోలు రక్తాలు కారేలా కొట్టారు. చేగొండి చంద్రశేఖర్ అనే యువకుడు సభలో జైతెలంగాణ అని నినదించినందుకు తల పగలకొట్టారు. చివరికి కడుపు మండిన ఒక పోలీసు జైతెలంగాణ అన్నందుకు పోలీసును, ఆపడానికి ప్రయత్నించిన ఒక సీఐని పాశవికంగా కొట్టారు. ఎందుకంటే వీల్లకు ప్రజాస్వామ్య భావనలన్నా, ప్రజల ఆకాంక్షలన్నా పడితే కదా?

ఈసభ ద్వారా తేలిందేమిటి?
1. సమైక్యత అనేది ఇక సాధ్యం కాదు
2. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ప్రాధమిక హక్కులు గౌరవింపబడవు.
3. సీమాంధ్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్నంతవరకూ హైదరాబాదులో, తెలంగాణలో తెలంగాణ ప్రజలకు రక్షణలేదు. ఎంతదూరమైనా వచ్చి మరీ దాడులు చేయగల సమర్ధులు సీమాంధ్రలో ఉన్నారు.


తెలంగాణ ప్రజలపై తెలంగాణలో సీమాంధ్రులు దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చంద్రబాబు పాలకుర్తి సభకు చంద్రదండు పేరుతో తరలి వచ్చిన సీమాంధ్ర గూండాలు తమతో సుమోల్లో కర్రలు తెచ్చుకుని తెలంగాణ ప్రజలపై దాడి చేశారు. అలాగే విజయమ్మ సిరిసిల్ల సభకు కూడా తనతోపాటు సీమ గూండాలను వెంటతెచ్చుకుని ప్రజలపై దాడిచేసింది. ఈరెండు సందర్భాల్లో వీరి వెనక ఉండి నాటకం ఆడించింది ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డే. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఉయోగుల ముసుగులో తెలంగాణప దాడి చేశాడు.

ఇటీవల విద్యుత్ సౌధలో జరిగిన ధర్ణాలో తెలంగాణ ఉద్యోగిపై ఇద్దరు సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేసి కొట్టడమే కాక ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వెల్లి తెలంగాణ ఉద్యోగిపైనే కేసు పెట్టారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా దాడి చేసింది ఎవరో తెలిసిపోవడంతో అడ్డంగా దొరికిపోయారు.

తక్షణం సీమాంధ్ర ముఖ్యమంత్రినీ, డీజీపీనీ గద్దె దించి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడమో, తెలంగాణా నాయకున్ని ముఖ్యమంత్రిని చేయడమో జరగకపోతే తెలంగాణ ప్రజలపై ఇంకిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. మొన్నటి సభలో తెలంగాణ నిరశనకారులపై సీమాంధ్రుల దాడులు, వాటికి ముఖ్యమంత్రి, డీజీపీల వత్తాసు చూసి ఆగ్రహించిన కేంద్రం అప్పుడె ఆదిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Tuesday 10 September 2013

దాడులపై కేంద్రం సీరియస్: APNGOల మీద మరో రెండు కేసుల నమోదు

APNGO మీటింగు ముసుగులో హైదరాబాదుపై దండయాత్రకు వచ్చిన సీమాంధ్ర గుండా తండాలు ఇక్కడి భూమిపుత్రులపై చేసిన దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీశ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ సభకు అనుమతి ఇవ్వడం నుండి అన్నీ తానై నడిపించిన డీజీపీ దినేశ్ రెడ్డికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది.
దీంతో మొన్న తెలంగాణ యువకులపై, పోలీశ్ కానిస్టేబుల్ పైన దాడికి తెగబడ్డ సీమాంధ్ర గూండాలపై కేసులు నమోదుచేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించాడు.
జై తెలంగాణ నినాదాలు చేసినందుకు దాడికి గురైన కానిస్టేబుల్ శ్రీనివాస్ నుండి ఈపాటికే ఫిర్యాదు తీసుకున్న సైఫాబాద్ పోలీసులు, నిన్న సభలో దాడికి గురైన చేగొండి చంద్రశేఖర్ నుండి కూడా ఫిర్యాదు తీసుకున్నారు.
మొన్న సభలో జై తెలంగాణ నినాదాలు చేసినందుకు చంద్రశేఖర్ ను రాడ్లు, కుర్చీలతో రక్తాలు కారేలా కొట్టారు సీమాంధ్ర గూండాలు.
అట్లాగే కానిస్టేబుల్ శ్రీనివాస్ పైన దాడి జరుగుతుంటే కాపాడడానికి పోయిన వరంగల్ అర్బన్ సీ.ఐ. విష్ణుమూర్తిపైన కూడా సీమాంధ్ర గూండాలు దాడి చేసి కొట్టారు. ఈ మేరకు ఆయన కూడా నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో మొన్న సీమాంధ్ర గూండాలు తెలంగాణ పౌరులపై చేసిన దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి.

Taken from www.missiontelangana.com

వినాయకుడి భూలోక యాత్ర



మూషికా! నేడు వినాయక చవితి కదా? మరిచేపోయాను. నాకోసం భక్తులు ఏమేం వండారో, పద భూలోకంలో ఆంధ్రప్రదేశ్ వెల్దాం. అక్కడయితే ఉండ్రాల్లు దొరుకుతాయి. 

వద్దూ ప్రభూ. అక్కడ పరిస్థితులు బాగోలేవు ఈసారి ఇంకెక్కడికైనా వెల్దాం.

ఏమయింది మూషికా?

ఆ ఆంధ్రప్రదేశ్ పేరుకు మాత్రం తెలుగువారందరి రాష్ట్రం, కానీ అక్కడ పెత్తనం మాత్రం ఎప్పుడూ ఒక ప్రాంతం వారిదే. వీల్లు తెలంగాణ ప్రాంతం అనబడే ప్రాంతాన్ని యాభై ఆరేళ్ళుగా రాచి రంపాన పెడుతున్నారు. వాళ్ళ నీళ్ళూ, నిధులూ, ఉద్యోగాలు ఏవీ ఆప్రాంతం వారికి దక్కనీయడంలేదు.  

ఇది తప్పు కదా మూషికా? మరి ఆప్రాంతం వారేం చేస్తున్నారు?

ఈరాష్ట్రం ఏర్పడకముందునుంచీ ఇప్పటిదాకా  ఆప్రాంతంవారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోట్లాడుతూనే ఉన్నారు ప్రభూ. కానీ అధికారం, మెజారిటీ, డబ్బూ ఉండడం చేత ఈమిగతా ప్రాంతంవారు వాళ్ళ ఆకాంక్షను అణచివేస్తూనే ఉన్నారు.

మరి కేంద్రం ఏమీ చేయడం లేదా? 

కేంద్రం కూడా ఇన్నినాళ్ళూ మెజారిటీ ఎక్కవైన ఈ ఆంధ్రా లాబీ మాటలు వింటూ తెలంగాణ వారి గొంతును వినిపించుకోవడం లేదు. కానీ ఇటీవలే  మనసు మార్చుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకున్నారు.  

మంచి పని. ఇక సమస్య తీరినట్లేగదా?

లేదు ప్రభూ, ఈ ఆంధ్రలు అంత సులభంగా సమస్యను తెగ్గొట్టనిస్తారా. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టాడానికి వీళ్ళేదని యాగీ మొదలు పెట్టారు.

అదేమిటి మూషికా? వీళ్ళు మాత్రం కలిసుందాం అంటే సమైక్యత సాధ్యం అవుతుందా? ఒక్కచేత్తో చప్పట్లు సాధ్యమా? పోనీ ఆంధ్రులు ఏమైనా తెలంగాణ ప్రజల సమస్యలు ఇప్పటికైనా తెలుసుకుని పరిష్కరిస్తామంటున్నారా?

పక్కోడి సమస్యను అర్ధం చేసుకోవడం ఆంధ్రోళ్ళ ఇంటా వంటా లేదు ప్రభూ. కేవలం వాళ్ళు విడగొడితే మా తడాఖా చూపిస్తాం అంటున్నారు.

ఇదెక్కడిగోల మూషికా? ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు ఎలా వేగుతున్నారో కదా? ఇంతకూ ఆంధ్రాలో రాజకీయ నాయకులేం చేస్తున్నారు?

ఆంధ్రా నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకడు లక్షల కోట్లు మింగి ఇప్పుడు జైళ్ళో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఎంత దొంగయినా ఇప్పుడు ఆంధ్ర జనాలకి వాడే పెద్ద నాయకుడు. ఇతగాడు  విభజనకు వ్యతిరేకంగా తన చెల్లెలును రాష్ట్రంలో తిప్పుతున్నాడు. అదేదో సమన్యాయం కావాలంట. అదే ఉంటే తెలంగాణ ప్రజలు విభజన ఎందుకు కోరుకుంటారు?  

సమన్యాయం కోరుకుంటే మంచిదే కదా మూషికా?

అక్కడే ఉంది తిరకాసు. వాళ్ళు చెప్పే సమన్యాయం ఏమిటంటే విభజన తరువాత కూడా తెలంగాణపై దోపిడీ కొనసాగాల్సిందేనని.

ఇదేమి వైపరీత్యం. ఇంకా మిగతా వాళ్ళేం చేస్తున్నారు?

ఇంకో దొంగబాబు ఉన్నాడు. మోసం, వెన్నుపోటు అతడికి  నిత్యకృత్యాలు. అతగాడికి ఒకరోజు విభజన వద్దనీ, ఇంకో రోజు కావాలనీ, మళ్ళీ వద్దనీ పూటకో మాట మార్చడం వలన ప్రజలు వాన్ని పట్టించుకోవడం మానేశారు.

మరి అక్కడి ముఖ్యమంత్రేం చేస్తున్నాడు? కేంద్రంలో వీళ్ళదే ప్రభుత్వం కనుక కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాడా?

అతడొక నికృష్టుడు ప్రభూ. సొంతంగా సర్పంచి పదవికి కూడా గెలవలేని వాడు కేంద్రం జెయ్యబట్టి ముఖ్యమంత్రి అయిండు. నిన్నటిదాకా కేంద్రం ఏనిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాననేవాడు, ఇప్పుడు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించండి అంటూ అక్కడి ఉద్యోగులను ఎగదోస్తున్నాడు.  తెలంగాణవారు సభపెట్టుకుంటామంటే నానా రభస చేసే ఈముఖ్యమంత్రిగాడు అదే ఆంధ్రాప్రాంతం వారి సభలకు మాత్రం దగ్గరుండి వసతులు సమకూరుస్తుండు. వీడికి కుంభీపాకం శిక్ష వేసినా తక్కువే ప్రభూ. క్రిమీభోజనం చేయించి తరువాత కుంభీపాకం చెయ్యమని యముడికి చెప్పాలి.

ఇంతకూ ఆంధ్రా ప్రజలేమంటున్నారు మూషికా? 

అక్కడి మెజారిటీ ప్రజలకు కలిసున్నా విడిపోయినా పొయ్యేది, వచ్చేది ఏమీలేదు ప్రభూ, వాళ్ళ పని వాల్లు చూసుకుంటున్నారు. కానీ కొన్ని ధనిక భూస్వామ్య వర్గాలకు మాత్రం విభజన వల్ల నష్టం లాగుంది. హైదరాబాదులో కబ్జాలు బాగా చేశారుట, అవేమవుతాయోనని భయం పట్టుకున్నట్టుంది, వారు బడిపిలగాళ్ళాను ఎండల్లో కూర్చోబెట్టి టీవీల్లో దాన్నో పెద్ద ఉద్యమంలా జూపిస్తున్నారు.

విభజన వల్ల నష్టపోయే ఈవర్గం ఎవరు మూషికా?

ఉన్నారులే ప్రభూ. లగడపాటి, కావూరు, రాయపాటి అని కొందరు వీళ్ళ నాయకులు.

మూషికా ఈదోపిడీదారుల పని పట్టాల్సిందే. నేను తెలంగాణకెల్లి ఉండ్రాళ్ళు తినొస్తా, ఈలోపల నువ్వు ఆంధ్రాకి నీదండుతోసహా వెళ్ళి ఈదోపిడీదారుల బొక్కసాలన్నీ కొళ్ళగొట్టిరా! వెళ్ళవయ్యా మూషికా వెళ్ళు. 



Saturday 7 September 2013

రాష్ట్రవిభజన జరిగితే ఏమేం ఉపద్రవాలు వస్తాయి?


From http://sujaiblog.blogspot.in/

What happens if Telangana is created with Hyderabad as it capital?

These are the ‘genuine’ fears expressed by Seemandhra people and their leaders in Samaikyandhra agitations. 

All Seemandhras would lose their jobs instantly

All Seemandhras whether they are living in Telangana or in Seemandhra will instantly lose their jobs with creation of Telangana.  One needs to understand why.  Most Seemandhras are currently employed only in Telangana and that too only in government sector, taking up jobs meant for Telanganas.  They will lose these jobs immediately.   In addition, Seemandhras will lose their jobs within Seemandhra for unknown reasons, but known explicably to Samaikyandhra activists. Seemandhra teachers will lose their jobs, because all Seemandhra students will stop going to school due to the heart-break caused by the murder of their beloved Telugu Talli.  Bankers in Seemandhra will lose their jobs because banks would become empty after spending the money on Samaikyandhra agitations.  All lawyers in Seemandhra will have no cases to fight because currently most of them are engaged in fighting against Telangana activists.  


Not only this.  Seemandhras will also lose all private jobs.  Graduating engineers will not be able to travel outside Seemandhra to find jobs anywhere in India, because once Telangana is formed Seemandhras automatically get disqualified from taking up any private jobs in India.  How is that possible?  Don’t ask.  In a first of its kind, Facebook and Google based in Hyderabad will put up a board outside: “No Seemandhras will be hired, but all other Indians are welcome to apply”. Doctors in Seemandhra will have no patients to treat because all the current patients come only from Telangana.  Hospitals in Seemandhra will immediately close down.  Seemandhras will have no means for their livelihood.  

Seemandhra would instantly dry up to become a desert

The rivers will stop flowing into Coastal Andhra.  No water will go down into the Bay of Bengal because Telanganas will create the world’s largest reservoirs to store up all the water.  All Seemandhra fields will dry up instantly and their cattle will have nothing to eat.   Seemandhra people will have no food to eat and no water to drink.  Seemandhra people will die of hunger and thirst.

Also, when New Delhi intervenes to make Telangana release the water, Telangana will have its own army to defend itself against the Indian Army.  Telangana will negate all the decisions of all tribunals to become the first state in the world that will be unwilling to share waters with any other region.  The water sharing mechanism which is followed worldwide so methodically, even by the nineteen countries that share River Danube, will suddenly fail only when it comes to Telangana.

Seemandhras will become illiterate

Suddenly all the colleges, universities and schools in Seemandhra will be shut down permanently, most probably because they don’t know how to teach prakruti andvikruti anymore, after the loss of Telangana as an internal colony.  The students of Seemandhra will have no future.  They will come onto to streets to become beggars while the parents will cry on TV debates organized by Seemandhra media.

Seemandhras will not be allowed into Hyderabad

Telangana will become another country.  Not just any country, it will become a hostile country.  It will become Palestine. No, No. It will become Pakistan.  Or is it Palestine?  Whatever!  But no Seemandhra person can go into Hyderabad unless he has a visa.  There will be border check posts along Seemandhra-Telangana border using Telangana Army.   Passports will be checked.   Seemandhras will carry separate passports in addition to Indian passports.  Seemandhras will have to apply for a visa with Telangana embassies situated in prominent cities like Vizag and Tirupathi.  Please note that this restriction is only limited to Seemandhras.  All other Indians will continue to throng Hyderabad without restrictions.

Seemandhras will lose all their investments in Hyderabad

Suddenly, overnight, all Seemandhras living in Hyderabad will lose their legal rights to their homes and businesses.  They will lose their apartment complexes, their malls, and their hospitals to the government of Telangana.  The Seemandhras will be thrown onto streets without recourse to law of the land.  In an instant, all constitutional rights and protections offered by Indian Constitution will become invalid in Hyderabad.  Please note, once again, that only Seemandhras will lose their entitlements, whereas all other Indians will continue to enjoy their constitutional rights in Hyderabad.  Also, note that those Seemandhras living in Telangana outsideHyderabad will not be affected.

Seemandhras will lose all sources of revenue

Overnight all revenues will stop flowing into Seemandhra.  Creation of Telangana will have an amazing effect on all Seemandhra cities.  Tirupathi, Vizag, Vijayawada, Kakinada, Guntur, Anantapur, Ongole, Kakinada, Rajamundry will suddenly stop earning any revenues.  Seemandhra people will stop paying taxes.  Out of grief, in seeing their united Andhra Pradesh break up, Seemandhras will stop buying goods.  Even the inveterate alcoholics will suddenly become teetotalers and stop spending money on liquor.

Every Telangana person will become a naxalite or terrorist

Creation of Telangana will automatically convert every Telangana person into a naxalite or terrorist.  Now that Telangana people got their own state after sixty years of struggle, they will lose complete faith in Indian political system, and take up arms to fight the very political system which granted them their state.  This may sound counter-intuitive, but that’s what is going to happen according to Samaikyandhra activists.  Telangana will be a haven for the communists and the religious fundamentalists at the same time, making it the first state with two competing ideologies taking root. 

Formation of Telangana is unnatural and anti-constitutional

Formation of Telangana will create earthquakes and tsunamis in Seemandhra.  It will create famines, epidemics of plague, and open up new volcanoes in and around Seemandhra.  Comets will strike their lands and animal species will go extinct.  Formation of Telangana is an aberration of all natural laws.  Even the gods do not favor Telangana.  Creation of Telangana is unconstitutional, illegal, illegitimate, undemocratic, fascist and the worst decision ever made in entire human history.

There are many more fears that could not be listed here.  Because of these ‘genuine’ fears, Telangana should not be formed. 

హైదరాబాదుపై ఏపీఎన్‌జీవోల దండయాత్ర



రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ముఖ్యమంత్రే మద్దతిస్తే సీమాంధ్రులు హైదరాబాదులో  సభ పెట్టడం కష్టమా? రాయలసీమ ఫాక్షనిస్టులు సుమోల్లో దండయాత్రలకెలితే ఏపీఎన్జీవోలు సభకు ఏసీబస్సుల్లో, ప్రత్యేకరైల్లలో వచ్చారు. ఇందులో ఎందరు ఎన్జీవోలో, ఎందరు కిరాయి గూండాలో తెలియదు. ఈసభకు దొంగ పాసులను కూకట్‌పల్లిలో పంచిపెడుతూ దొరికిపోయారంటే సీమాంధ్రనుండి వచ్చిన వారిలో ఎనదరు దొంగపాసులతో వచ్చారో తెలిస్తుంది.   


సభకు వచ్చిన ఒక ఆకురౌడీ నిజాం కాలేజీ విద్యార్థులను మెడలు నరికేస్తామంటూ సైగలు చేస్తున్న దృష్యాన్ని కింది వీడియోలో చూడొచ్చు. బాబూ ఆకురౌడీ, మీరు కత్తులతోనైనా తడిగుడ్డలతోనైనా గొంతులు కోయగలరని మాకు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకేగదా ఈ ఫాక్షనిస్తులతో మాకుపడదు, విడిపోతామనేది?




తెలంగాణవాదులు సభ పెట్టుకుంటామంటే అనుమతులు ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ బస్సులు, లారీలు, రైళ్ళను అపేయడం, ముందస్తు అరెస్టులూ, అవసరం లేకపోయినా లాఠీ ఛార్జీలూ చేయడం, భాష్పవాయుగోళాలను ప్రయోగించడం చేసే పోలీసులు ఈసీమాంధ్ర సభను మాత్రం దగ్గరుండి జరిపించారు. రైల్వే సహాయమంత్రి మూడు ప్రత్యేక రైళ్ళు వేయగా, అనేక ప్రభుత్వ, ప్రైవేటు బస్సులో జనాలను తరలించారు. సభ జరిపేది తెలంగాణవాదులైనా సీమాంధ్రవాదులైనా తెలంగాణ విద్యార్థులకు లాఠీ దెబ్బలు తప్పవని నిరూపిస్తూ నిజాం కాలేజీ హాస్టల్, ఓయూ విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించి విచక్షణారహితంగా కొట్టారు   ఈసభద్వారా మరోసారి సమైక్యరాష్ట్రంలో తెలంగాణపై వివక్షను చూపించి ఇది సీమాంధ్ర ప్రభుత్వం, తెలంగాణప్రజలు సవతి పిల్లలని ప్రభుత్వం నిరూపించింది.


సభకు కేవలం ఉద్యోగులు రావాలని హైకోర్టు అనుమతి ఇస్తే ఎందరో రాజకీయనాయకులు, ఇతరులకు అనుమతినిచ్చారు. ఘజల్ శ్రీనివాస్‌కు అనుమతిలేదని ముందు వెనక్కి పంపిస్తే ఒక ఐయేఎస్ అధికారి దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళాడు.


సభలో ఉద్వేగానికి లోనయిన ఒక తెలంగాణ పోలీసు "జైతెలంగాణ " అని నినదించగా ఆపోలీసును మిగతా పోలీసులూ, ఏపీఎంజీవోలు విచక్షణారహిత్మగా కొట్టారు. నిజాం కాలేజీలో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు ఒక విద్యార్థిని ఉద్దేషపూర్వకంగా పాశవికంగా బిల్డింగుపైనుండి తోసివేశారు. సభకు ర్యాలీగా వస్తున్న సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు ఒక ఓయూ విద్యార్థిని కిరాతకంగా కొట్టగా అతను ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.


ఇంతచేసి తెలంగాణ గడ్డపై తెలంగాణప్రజలను రెచ్చగొట్టెవిధంగా సభపెట్టుకున్న వారు సభలో కేసీఆర్ను తిట్టడం, నాయకులను రాజీనామాలు చేయమనడం మినహా ఒక్కరు కూడ ఎందుకు కలిసి ఉండాలి, విడిపోతే వచ్చే నష్టాలు, కలిసుంటే లాభాలు ఏమిటి అని మాట్లాడలేదు.


తెలుగు జాతి సమైక్యత, ఆత్మగౌరవం అంటూ గొప్పగా మాట్లాడిన వాళ్ళు వేదికపై ఇంతపెద్దగా పెట్టిన బ్యానరుపై కూడా అచ్చుతప్పులు రాస్తూ సమై"ఖ్య" ఆంధ్ర ఉద్యమం అంటూ రాసుకున్నారు.


పదమూడు జిల్లాలవారు మాత్రమే సభకు వస్తే అది ఏపీఎంజీవోల సభ ఎలా అవుతుంది, సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందనేది ఎప్పటిలాగే ఎప్పుదూ ఉండే ప్రశ్న. ఇలాంటి దండయాత్రలు సమైక్యతన్ సాధించవు సరికదా, తెలంగాణ ప్రజలు ఎందుకు ఈరాష్ట్రంలో కలిసి ఉండడం సాధ్యం కాదో మల్లీ మల్లీ తెలియజెబుతాయి. 


మొత్తానికి ఈసభ సమైక్యతకోసం కాదు, తెలంగాణ ప్రజలను రెచ్చగోట్టడానికి అనీ, ఇన్నిరోజు ఉద్యమం జరుగుతున్నా ఒక్కసారికూడా హైదరాబాదులో సీమాంధ్ర సెటిలర్లపై ఎలాంటి అవాంచనీయ సంఘటనలకూ పాల్పడని తెలంగాణవాదులను దాడులకు ఉసిగొల్పడం, తద్వారా హైదరాబాదును యూటీ చెయ్యాలనేడిమాండును తీసుకురావడానికి కిరణ్ రెడ్డి అషోక్‌బాబుతో కలిసి ఆడిన నాటకమనీ తెలుస్తుంది. 

కొసమెరుపు: ఏపీఎన్‌జీవోల సభకోసం వచ్చిన కొందరు నిన్నరాత్రి అమీర్‌పేట సితార హోటల్లో బసచేసి వ్యభిచారులతో గడుపుతూ రైడింగ్‌లో దొరికిపోయారుట. బుద్దులు ఊరికేపోతాయా?