Monday 31 December 2012

తొర్రూరు డిపో బస్సుపై విజయవాడలో దాడి

డ్రైవర్ కండక్టర్‌కు గాయాలు 
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు 
విజయవాడ: తొర్రూరు బస్ డిపోకు చెందిన ఏపీ36 జెడ్ 146 నెంబర్ గల బస్సుపై విజయవాడ సమీపంలో కొంతమంది వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్‌ను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విజయవాడ సమీపంలో చోటుచేసుకుంది. కండక్టర్ కృష్ణయ్య ‘టీ మీడియా’తో ఫోన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు డిపో నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుపతికి బస్సు బయలుదేరింది. విజయవాడ మరో మూడు కిలోమీటర్లు ఉందనగా ఏపీ16బీసీ177 వాహనంలో వచ్చిన ఐదుగురు, ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో ఇద్దరు కలిసి తమ వెంట తెచ్చుకున్న కర్రలు, బస్సులోని రాడ్లను తీసుకొని డ్రైవర్ జనార్దన్, కండక్టర్ కృష్ణయ్యలపై దాడి చేశారు. అడ్డువచ్చిన ప్రయాణికులపై కూడా దాడి చేశారు. దీంతో భయంతో అందరూ పరుగుపెట్టారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులు విపరీతంగా మద్యం సేవించి ఉండటం, అసభ్యంగా ప్రవర్తించడంతో ఎవరూ అడ్డుకోలేక పోయారు. ‘వారంతా వరంగల్‌కు చెందినవారు. వాళ్లని చితకబాదండి’ అంటూ దాడి చేశారు. 
ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టి, కొద్ది దూరం వెళ్లాక స్థానికులకు విషయం తెలుపడంతో వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విజయవాడ వన్‌టౌన్ సీఐ ఘటనాస్థలికి చేరుకొని బస్సును స్టేషన్‌కు తరలించి, గాయపడిన కండక్టర్ కృష్ణయ్య, డ్రైవర్ జనార్దన్‌ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు బాధ్యులైన నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్, కండక్టర్ టీఎంయూకు చెందినవారు కావడం, విజయవాడలో ఘటన జరగడంతో తెలంగాణ వ్యక్తులపై కావాలనే దాడులకు పాల్పడ్డారని తెలుస్తోందని, దీనిపై విచారణ జరపాలని టీఎంయూ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున్, గౌరవాధ్యక్షుడు సోమయ్య, డిపో కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు.

Sunday 30 December 2012

610జీవో@27ఏళ్లు..


ఎప్‌టీ రామారావు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ప్రభుత్వం 1985లో తెలుగుగంగ పనులను శరవేగంగా పూర్తి చేయటానికి పూనుకున్నది. ఈ ప్రాజెక్టు పనిలో భాగంగా కొంతమంది తెలంగాణ ఉద్యోగులను రాయలసీమకు పంపటం జరిగింది. ఇది సహించలేని కొందరు రాయలసీమ నాయకులు, ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపించాలని అలా పంపకపోతే తదుపరి జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ నాయకులు, ఉద్యోగుల డిమాండుకు తలవంచిన నాటి ప్రభుత్వం 564 జీవోను జారీ చేసి 30 రోజుల్లో తెలంగాణ ఉద్యోగులను రాయలసీమ నుంచి వెనక్కి పిలిపించారు.

564 జీవో అమలుతో అవమానానికి ఆవేదనకు గురైన తెలంగాణ ఉద్యోగులు, మా ప్రాంతంలో రాష్ర్టపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల మాటేమిటని ఎన్‌టీఆర్‌ను నిలదీశారు. ఇది చిలికి చిలికి గాలివానై మరో తెలంగాణ ఉద్యమానికి దారి తీయగలదని గ్రహించిన ఎన్‌టీఆర్ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు పంపే నిమిత్తం 610 జీవోను 30-12-1985న జారీచేస్తూ మూడు నెలల్లో జీవో లక్ష్యం పూరి ్తకావాలని గడువు విధించా రు. 610 జీవోను 31.03.1986 నాటికి పూర్తి గా అమలు చేయాలి. కానీ 30-12-2012 నాటికి 27ఏళ్లు నిండినా 610 జీవో అమలుకి నోచుకోలేదు. 610 జీవో ప్రకారం రాష్ర్టపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చిన నాటి (18- 10-1975) నుంచి తెలంగాణలో జోనలైజేషన్‌కి విరుద్ధంగా నియమించబడిన సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపి అట్టి ఖాళీలను తెలంగాణ నిరుద్యోగులతో నింపాలి. 38 సంవత్సరాల నుంచి రాష్ర్టపతి ఉత్తర్వులు 28ఏళ్ల నుంచి 610 జీవో అమలుకు నోచుకోలేదు.

తెలంగాణవాదుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా, సభాసంఘాలు, కమిటీలు, కమిషన్స్‌తో కాలయాపన చేయటం, జీవోల జారీలతో తెలంగాణ వారిని మభ్యపెట్టడం సీమాంధ్ర పాలకులకు అలవాటుగా మారింది. 31.12.1985 నాటికి వివిధ కమిటీల లెక్కల ప్రకారం తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంవూధుల సంఖ్య 59 వేలు కాగా, నేటికి ఆ సంఖ్య రెండు లక్షల పైనే ఉంటుంది.1973లో ఆరు సూత్రాల పథకం ఆవెూ దం పొంది, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన స్థానిక, స్థానికేతర వివరాలను, సర్వీస్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నవెూదు చేయాలని 1975 లో 729 అనే జీవోను జారీ చేశారు. ఈ జీవోను సీమాంధ్ర పాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయలేదు. దీని పర్యవసానంగా తెలంగాణలో స్థానికుల కేటగిరిలో, ఎంతమంది ఏయే శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారో గుర్తించడం చాలా కష్టమైనది.

ఈ విధంగా గుర్తించడానికి వీలు పడకుండా 729 జీవో లక్ష్యానికి అందకుండా, తెలంగాణలో అక్రమంగా తిష్టవేసిన సీమాంధ్ర ఉద్యోగులు, గుర్తించబడ్డ ఉద్యోగులకంటే ఎన్నోట్లు ఎక్కు వ. 610 జీవో అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి అధిగమించడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చే నిమిత్తం 2001లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి గిర్‌గ్లాని నేతృత్వం లో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు.ఈ కమిషన్ తన నివేదికను 2004 లో రాష్ర్ట ప్రభుత్వానికి నివేదించింది. 2004లో తెలంగాణ రాష్ర్ట సమితితో ఎన్నికల పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్‌ఎస్ మంత్రుల ఒత్తిడి మేరకు, 610జీవోను అమ లుచేసి నివేదిక పంపాలని అధికారులను ఆదేశిస్తూ 548అనే మరొక జీవోను జారీ చేశారు.

గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను అమలు చేయటానికి బదులు 2004 మేనెలలో కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆ కమిషన్‌లోని అంశాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా నాటి గ్రామీణాభి వృద్ధి శాఖామంత్రి డి.శ్రీనివాసును చైర్మెన్‌గా, మంత్రులు కె.జానాడ్డి, డి. రెడ్యానాయక్, ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావు, జె.సి.దివాకర్‌డ్డిలను సభ్యులుగా నియమిస్తూ 778 అనే వేరొక జీవోను జారీ చేశారు.

610 జీవో అమలుకు బదులు సభాసంఘాలు, కమిటీలు, కమిషన్‌లతో కాలయాపనకు అలవాటు పడ్డ సీమాంధ్ర పాలకులకు తానేమి అతీతుడను కాదన్నట్టు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డిని 610 జీవో అమలుకు ఒక సభా కమిటీ వేసి ఆ కమిటీకి ఉత్తం కుమార్‌డ్డి (కాంక్షిగెస్ ఎమ్.ఎల్.ఎ)ను చైర్మన్ గా నియమించారు. 38 ఏళ్ల నుంచి (18-10-1975) రాష్ర్టపతి ఉత్తర్వు లు 28 ఏళ్ల నుంచి (30.12.1985) 610జీవో అమలు కోసం ఎదురు చూసి తెలంగాణ నిరుద్యోగ యువత ఏజ్‌బార్ అయి గృహస్తులుగా, తండ్రి గా, తాతగా, అమ్మమ్మగా, నాయనమ్మగా షష్టిపూర్తి చేసుకుంటున్నా ఈ ఉత్తర్వులు, జీవోలు మాత్రం అమలుకు నోచుకోవటం లేదు.

తెలంగాణ ఐ.ఎ. ఎస్. అధికారులపైనా! సీమాంధ్ర పాలకులకు చిన్న చూపే? ప్రాధాన్యం లేని పదవుల్లో నియమించటం, పదోన్నతుల్లో పద్ధతులకు నీళ్ళొదలటం పరిపాటి అయింది. 31-10-2012 నాటికి రాష్ర్టంలోఉన్న 276 మంది ఐ.ఎ.ఎస్. అధికారుల్లో తెలంగాణ వారు 14 మంది. ఈ పద్నాలుగు మందిలో ఏఒక్కరినీ కీలక శాఖలో కాని, ప్రాధాన్యం గల పోస్టులోగాని నియమించలేదు. రాబోవు 30సంవత్సరాల్లో ప్రధాన కార్యదర్శి (సి.ఎస్) అయ్యే అవకాశం ఏ ఒక్క తెలంగాణ ఐ.ఎ.ఎస్ అధికారికి లేదు.అర్హత గల తెలంగాణ అధికారులకు కన్‌ఫర్మ్‌డ్ ఐ.ఎ.ఎస్. దక్కటం అందని ద్రాక్ష అయింది.

2012 సెప్టెంబరు 19, 20 తేదీలు మహబూబ్‌నగర్ జిల్లా చరివూతలోనే మర్చిపోలేని దుర్దినాలు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన 220 మంది మహబూబ్‌నగర్ జిల్లావాసులకు 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కర్నూల్ జిల్లాలో ఉద్యోగాలిస్తేఅట్టి నిర్వాసితులను కూడా,కర్నూలు జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకుల అండతో నిర్దయగా వెనక్కి పంపారు. దీని మీద నోరువిప్పని సీమ నాయకులు సమైక్యాంధ్ర గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. 21-11-2012న రాష్ర్ట హైకోర్టు 610జీవోఉత్తర్వులు సమంజసమేనని తీర్పునిచ్చింది.

30 డిసెంబరు 1985న ప్రభుత్వం జారీ చేసిన 610 జీవో ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో జరిగిన ఉల్లంఘనలు సవరిస్తూ 07-09-2007న రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన 674జీవో ఈ రెండు జీవోలు సమంజసమేనని ఇవి రాష్ర్టపతి ఉత్తర్వులకు (18.10. 1975) అనుకూలంగా ఉన్నవి తప్ప అధిగమించి లేవని హైకోర్టు పేర్కొన్నది. 18-10-1975నాటి రాష్ర్టపతి ఉత్తర్వుల ఆధారంగానే స్థానిక కోటా ఏర్పా టు అయిందని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 80శాతం ఓపెన్ కేటగిరిలో 20శాతం పోస్టులను భర్తీ చేసే నిమిత్తం నాటి రాష్ర్ట ప్రభుత్వం 08-01-2002న జారీ చేసిన జీవో 8 కూడా సమంజసమేనని హైకోర్టు తీర్పు నిచ్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఎన్జీవోల విజ్ఞప్తి మేరకు 610 జీవో అమలు చేసే నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వం 07-09-2007న 674అనే జీవోను జారీ చేసింది. ఈ 674జీవోను సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రవూపదేశ్ పరిపాలన ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు. ఆంధ్రవూపదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ 23-04-2012న 610, 674జీవో సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

ఈతీర్పును 1528 మంది సీమాంధ్ర ఉద్యోగులు హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు 21-11-2012న, 610జీవో ఉత్తర్వులు సమంజసమే ముందు ఉత్తర్వులను అమలుపరిచి తెలంగాణలో అక్రమంగా వున్నవారిని వారి సొంత జోన్లకు పంపండి. ఆవిధంగా వారు వారి సొంత జోన్లలో విధుల్లో చేరిన తర్వాత, వారికి ఏదైైనా అన్యాయం జరిగింది అనిపిస్తే, 03-05-2012న రాష్ర్ట ప్రభు త్వం నియమించిన జస్టిస్ రాయ్‌కోటి కమిషన్‌కి వారు ఫిర్యాదు చేసుకోవచ్చునని హైకోర్టు సూచించినది. ఈ తీర్పును గౌరవించి సీమాంధ్ర ఉద్యోగులు వారి సొంత జోన్లకు వెళ్ళటంగాని, నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పాలకులు హైకోర్టు తీర్పును అమలు చేయం గాని, చేస్తారని గత సీమాంధ్ర పాలకుల చరిత్ర తెల్సిన తెలంగాణ వారు నమ్మాల్సిన పనిలేదు. కాలయాపనలో భాగంగా సీమాంధ్ర పాలకులు ఉద్యోగులు కుమ్మక్కై సుప్రీంకోర్టుకు వెళ్ళినా! ఆశ్చర్యపడనక్కర లేదు.

ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటుంది. రాయలసీమ ఉద్యోగులకు మేలు చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపే 564జీవోను విడుదల చేసిన 30 రోజుల్లో కచ్చితంగా అమలు చేశారు. అదే సంవత్సరం అనగా 30-12-1985న విడుదలై మూడు నెలల్లో అమలుకావాల్సిన 610 జీవో మాత్రం 27 ఏళ్లు నిండినా అమలుకి నోచు కోకుండా సభాసంఘాలు, కమిటీలు, కమిషన్‌లతో కాలయాపనకు గురవుతున్నది. ఈ జీవో అమలు చెయ్యాలని ఇంకొక జీవో విడుదల చేయటం, ఆ జీవోఅమలుకు మరొక జీవో వేయటం ఈ రెండు జీవోలు అమలుకు ఇప్పుడున్న నిబంధనలు వర్తించవని కొందరు సీమాంధ్ర ఉద్యోగులు పరిపాలన ట్రిబ్యూనల్‌కు వెళ్ళటం పరిపాటి అయ్యింది.

ఆ తీర్పు అనుకూలంగా లేకపోతే హైకోర్టుకు వెళ్ళటంఅక్కడ అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటం చివరికి సుప్రీంకోర్టులో కూడా సీమాంవూధులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో రాజ్యాంగ సవరణ చేయించి అయినా దేశ సర్వోన్నత న్యాయస్థాన మిచ్చిన తీర్పులను సమాధి చేయగల సమర్థులు సీమాంధ్ర కాంగ్రెస్ పాలకులు.

ఉదాహరణకు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమేనని 3.10.1972న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థాన మిచ్చి న తీర్పుకు విరుద్ధంగా ఏర్పడ్డ, జై ఆంధ్ర ఉద్యమకారులు సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గిన, నాటి కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులు 1974లో 37వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ వారి రాజ్యాంగ బద్ధమైన ముల్కీ నియమాన్ని రద్దు చేయించారు.
సీమాంధ్ర పాలకుల పీడన పోవాలన్నా, దోపిడీలకు తెరపడాలన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. అప్పుడే ప్రాంత ప్రతి ఉద్యోగి, విద్యార్థులు, విద్యావంతులు, యువజనులు బతుకులు బాగుపడతాయి. ఈ సత్యాన్ని అన్ని వర్గా ల ప్రజలకు తెలిసేలా తెలంగాణ అంతటా చైతన్యయావూతలు నిర్వహించాలి. సీమాంధ్ర నాయకుల ఆధిపత్యంలో నడిచే రాజకీయపార్టీలకు తెలంగాణలో గోరికట్టాలి. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడ్డ పార్టీకి పట్టంకట్టాలి. 
డీ.ఎస్.రావు


రెండు కళ్లు.. నాలుగు నాలుకలు


అంశం ఒక్కటే.. సమయం, అవసరాన్నిబట్టి మాటలు మారిపోయాయి. ఇన్ని మాటలు చెప్పటం ఎవరికైనా సాధ్యపడుతుందా.. ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తప్ప..! చిదంబరం ప్రకటనకు ముందొక మాట. ఆ తర్వాత మరో మాట. తెలంగాణ ఉప ఎన్నికలప్పుడు ఒక ముచ్చట. అవి ముగిశాక ఇంకొక ముచ్చట. పరకాలలో మరో మాట. ఆ ఎన్నిక ముగియగానే ఆ ముచ్చటా మారిపోయింది. ఇలా నాలుగేళ్లలో అనేకానేక మలుపుల మాటలు. పేరుకు ప్రధాన ప్రతిపక్షం. ప్రధాన సమస్యపై నిలకడలేనితనం. ‘మా పార్టీ వైఖరి ఏ ఎండకా గొడుగు అన్న చందంగా ఉంది’ అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించేంతటి పరిస్థితి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోం శాఖ మంత్రికి అందజేసిన లేఖలోనూ ఇదే విధమైన అస్పష్ట వైఖరిని ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు అధికారం కోసం..

తెలుగుదేశం పార్టీ తొలుత సమైక్య వాదాన్ని ప్రదర్శించింది. అయితే, 2009లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం 2008లో తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. ఆ ఏడాది దసరా పండుగ రోజున టీడీపీ పొలిట్‌బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించిందని అధినేత చంద్రబాబు ప్రకటించారు. తర్వాత పది రోజులకే ‘తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం’ అంటూ అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ ఏర్పాటుకు శాసనపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.

చిదంబరం ప్రకటనపై అగ్గిమీద గుగ్గిలం!

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన దరిమిలా 2009 డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు మద్దతు పలుకుతుందని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే (డిసెంబర్ 9న) అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేశారు. మరుసటి రోజు టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ‘తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, నచ్చచెప్పకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒకరు అడుగుతారు, మరొకరు ఇస్తారు. కాంగ్రెస్ దీన్ని ఒక మ్యాచ్‌ఫిక్సింగ్‌లా చేసింది. స్వీయ రాజకీయ ప్రయోజనాలేవో ఆశించి ఇలా వ్యవహరించింది. సోనియాగాంధీ ఏమీ ఆలోచించకుండా అర్ధరాత్రి నిర్ణయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

రెండు కళ్ల సిద్ధాంతం

2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ‘తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి. తెలంగాణ, సమైక్య వివాదాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే’ అని ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద వివాదాన్ని రేపింది. దీంతో కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అదే ఏడాది తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. 2010 జూన్ 19న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ‘తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్ల వంటివని నేను ఎందుకు అన్నానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం’ అని మాట మార్చారు.

నేను తటస్థం

తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతం పనిచేయకపోవడంతో చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ‘రాష్ర్ట విభజన విషయంలో నేను తటస్థంగా ఉంటా. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పాను. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీనే’ అని 2011 మే 9న చెప్పారు.

మహానాడులో కొత్త తీర్మానం

2009 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న టీడీపీ.. 2011 మే 29న మహానాడులో కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ‘తెలంగాణ విషయంలో ఇంకా ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగిస్తారు? ఈ విషయంలో టీడీపీ చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేసింది. కేంద్రం సత్వర నిర్ణయం తీసుకొని ఈ అనిశ్చితిని తొలగించాలి. చేతకాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అంటూ తీర్మానం చేసింది. మరోపక్క రెండు ప్రాంతాల నేతలు ఒకరు సమైక్యం, మరొకరు తెలంగాణ ఉద్యమాలు చేసుకోవడానికి బాబు అంగీకారం తెలిపారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు వారి ప్రాంతాల మనోభావాలను ప్రతిబింబించక తప్పదు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా నేను ఏది చెబితే అదే పార్టీ వైఖరి. మిగతా ఎవరేం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం లేదా వారి ప్రాంత అభిప్రాయం మాత్రమే’ అని 2011 జూలై 29న చంద్రబాబు మరో విధంగా మాట్లాడారు.

ఉప ఎన్నికల కోసం మాట మారింది!!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదని ఎన్నికల ఫలితాల ప్రకటించిన వెంటనే చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది చెప్పి వారం గడవక ముందే 2011 మార్చి 11న కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ.. ‘నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇకపైనా మాట్లాడబోను’ అని మాట మార్చేశారు. 

పార్టీని గెలిపిస్తే ఉద్యమమే చేస్తాం

ఉప ఎన్నికలలో పార్టీ వరసగా ఓటమిని ఎదుర్కోవడంతో తమను గెలిపిస్తే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తాం. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. ఆ ఉప ఎన్నికలు ముగియగానే ‘తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం’ అంటూ మరోసారి మాట మార్చారు. 

ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ అంశంపై పార్టీలోని నాయకులతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఉప ఎన్నికలు రావటంవల్ల అందరితో మాట్లాడటం కుదరలేదు. అందరి అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే స్పష్టత ఇస్తాం’ అని చెప్పారు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ అంశం తేల్చడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

తాజాగా శుక్రవారం కేంద్ర హోం మంత్రికి పంపిన లేఖలోనూ ఆయన ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. 2008లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అందజేసిన లేఖ మీ వద్దే ఉందని, దాన్ని తామింతవరకు ఉపసంహరించుకోలేదని మాత్రం పేర్కొన్నారు. 2009లో యూపీఏ-1 ప్రభుత్వం పోయి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడినందున ఆ లేఖలోని విషయాలనే మరోసారి చెబితే బాగుండేదని, అలా చేయకపోవడంవల్ల అనుమానాలు రేకెత్తిస్తోందని తెలంగాణ ప్రాంత ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తమ రాజకీయ అవసరానికి తగినట్టుగా వాడుకునే విధంగా తప్పించుకునే ధోరణితో లేఖ ఇవ్వడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోతోందని సీమాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది: 2008లో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ

మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది.. : 2009 డిసెంబర్ ఏడో తేదీన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు 
తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.. : 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన మరుసటి రోజు చంద్రబాబు

తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి.. : 2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం 

రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం.. : 2010 జూన్ 19వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: 2011 మే 29న మహానాడులో తీర్మానం

యూపీ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు: 2011 యూపీ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వ్యాఖ్య

నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: ఆ తర్వాత కొద్ది రోజులకే కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

మా పార్టీ అభ్యర్థిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం : ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల సభలో చంద్రబాబు

తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం : ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు

Friday 28 December 2012

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు

Source: missiontelangana.com

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. కొండంత రాగం తీసిన తెలుగు దేశం పార్టీ అఖిలపక్షంలో కొత్తగా చెప్పిందేమీ లేకపోగా ఏదో పొడిచేశామని తెలంగాణ తెదేపా నాయకులు ఇక్కడ శిగాలు ఊగుతున్నారు.
చంద్రబాబు పంపిన సీల్డ్ కవర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించే మాట ఒక్కటంటే ఒక్కటి లేకపోగా ఒక పచ్చి అబద్ధం ఉన్నది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నామనడం.
ఇవ్వాళ ఈ లేఖను డిల్లీకి మోసుకుపోయిన యనమల రామకృష్ణుడు స్వయంగా గత యేడాది మీడియాతో మాట్లాడుతూ 2008 నాటి లెటర్ ఇప్పుడు పనికిరాదని, 2011 మహానాడులో తెలంగాణపై తీసుకున్న వైఖరే ఫైనల్ అని తేల్చాడు. ఒకసారి ఈ వీడియో చూడండి.
ఇంతకూ 2011 మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఏం నిర్ణయం చేసిందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. తెలంగాణ అంశాన్ని కేంద్రం సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని తెదేపా డిమాండ్ చేసిందా సభలో.
ఇదే విషయం మీద 29 జులై నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో యనమల రామకృష్ణుడు ఏమన్నాడో చూడండి:
2009 డిసెంబర్ 7 నాడు అఖిలపక్షంలో లిఖితపూర్వకంగా తెలంగాణ తీర్మానానికి మద్ధతు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ మూడు రోజుల్లోనే నిర్ణయం మార్చుకుంది. అట్లాంటి దగుల్బాజీ పార్టీ ఇప్పుడు 2008 లో రాసిన లెటర్ కు కట్టుబడి ఉన్నామని దొంగమటలు చెబితే నమ్మేటోడెవడు?

జెఫ్ఫాలూ, జెర సోంచాయించుండ్రి



తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో భాగమయిన  తరువాత యాభై ఏళ్ళు అధికారంలో ఉన్న సీమాంధ్రనేతలందరూ వారు, వీరు అని తేడా లేకుండా తెలంగాణకు ద్రోహం చేసినవారే. అయితే అందులో అందరికంటే ఎక్కువ ద్రోహం చేసి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది మాత్రం ఇద్దరు కాంగ్రేస్ ముఖ్యమంత్రులు. ఒకరు 69 ఉద్యమాన్ని అణచివేయడం కోసం రాక్షసంగా కాల్పులు జరిపించి అయిదు వందల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కాసు బ్రహ్మానంద రెడ్డి కాగా మరొకరు తెలంగాణ ఎలాగూ ఏర్పడుతుంది కాబట్టి విడిపోయేలోగా వీలయినంత దోచుకుందామని విచ్చలవిడిగా దోచేసిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.


2004 లో అధికారంలోకి రావడంకోసం తెలంగాణకు మద్దతు ఇస్తామని టీఆరెస్ తో పొత్తు పెట్టుకున్న వైఎస్సార్ ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్టు తెరాసను అణచివెయ్యడంకోసం డబ్బులతో ఎమ్మెల్యేలను కొన్నాడు. బడ్జెట్ను లక్షకోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పుకునే వైఎస్సార్ పెట్టిన బడ్జెట్లో ఎక్కువ భాగం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మిన ప్రభుత్వ భూములమీద వచ్చిన డబ్బే. తెలంగాణ ఆస్తులమ్మి సీమాంధ్రలో మాత్రం భారీయెత్తున ప్రాజెక్టులు చేపట్టి ఇక్కడి నిధులతో హంద్రి-నీవా, వెలిగొండ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు కట్టుకున్నాడు. తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకూడా పూర్తిచెయ్యలేదు.

సీమాంధ్రలో చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల వాట లేకపోయినా వరద నీటి వాటా పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టిన వైఎస్సార్ తెలంగాణలో నికర జలాల వాటా ఉన్న ప్రాజెక్టులు కూడా చేపట్టలేదు. మరిక్కడ ప్రాజెక్టులు కడితే సీమాంధ్రకు నీళ్ళు తరలించడమెట్ల కుదురుతుంది?

రాష్ట్రానికి తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అతన్ని గద్దె దించడానికి హైదరాబాద్‌కు సీమాంధ్రనుండి కిరాయి గూండాలను రప్పించి అల్లర్లు సృష్టించాడని సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అసెంబ్లీలో చెప్పాడు.

వైఎస్సార్ ఆరేళ్ళ పాలనలో తెలంగాణకు లెక్కలేనన్ని అన్యాయాలు చేశాడు. కడప యోగివేమన యూనివర్సిటీకి కోట్లరూపాయలతో భవంతులు కడితే శాతవాహన యూనివర్సిటీ షెడ్డులకిందే నడిచింది. కడప రిమ్స్‌కు అన్ని హంగులూ సమకూరితే బీబీనగర్ నిమ్స్ మాత్రం ఎంతకూ పూర్తిగాదు.

తెలంగాణ వాదాన్ని అణచివెయ్యడానికి తెరాస పార్టీని చీల్చిన వైఎస్సార్ 2009 ఎన్నికలలో తన దుష్టబుద్ధిని మరోసారి చూపిస్తూ మొదటి ఫేజు ఎన్నికల్లో తెలంగాణ అంతటా కాంగ్రేస్ తెలంగాణకు కట్టుబడి ఉందని నమ్మబలికి వోట్లు దండుకుని ఇక్కడ ఎన్నికలు అయిపోగానే నంద్యాలకెల్లి హైదరాబాదుకెల్లాలంటే వీసాలు గావాలంట అంటూ రెచ్చగొట్టాడు.

ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబొయి గెలిచిన వైఎస్సార్ అసెంబ్లీలో "రాజేంద్రా, ఎక్కడుందయా నీ తెలంగాణవాదం?" అంటూ ఫాక్షన్ బుద్ధిని చూపించాడు. మరిప్పుడు తెలంగాణ వాదం ఎక్కడుందని విజయమ్మా, షర్మిలమ్మా తెలంగాణ ప్రజల మనోభావాలను వైకాప గౌరవిస్తుందని నక్కవినయాలు చూపెడుతున్నారు? ఎవర్ని మోసం చేద్దామని ఈదొంగవేషాలు? తెలంగాణవాదం లేకపోతే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ధైర్యంగా చెప్పి వోట్లడగొచ్చుగదా?

తెలంగాణకొచ్చి మీమనోభిప్రాయాలని గౌరవిస్తామని జెప్పి ఏం జేద్దామని? గెలిస్తే పోతిరెడ్డిపాడు ఎత్తు మరో వందడుగులు పెంచి క్రిష్ణ నీళ్ళు చుక్కలేకుండా దోఛేద్దామనా? రాష్ట్రం మొత్తాన్ని బయ్యారంలా అల్లుడికి కట్నం కింద ఇద్దామనా? జగనన్నను గెలిస్తే పోలవరం గడుతడట. ఎవరికోసం పోలవరం? ఎవరిని ముంచడంకోసం పోలవరం? జఫ్ఫాలూ జెర సోంచాయించుండ్రి. ఇప్పుడు కుక్క బిస్కట్ల ఆశకు వైకాపల జేరితె రేపు తెలంగాణ వచ్చినంక మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టడం ఖాయం.

Thursday 27 December 2012

చంద్రబాబూ, నువ్వు వ్యతిరేకం కాదని బొంకినా తెలంగాణ నీకు వ్యతిరేకమే!



చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదట! తెలంగాణలో పాదయాత్ర జేసుకోవడం కోసం పాపం రోజుకొకసారి మొత్తుకుంటుండు నేను తెలంగాణకు వ్యతిరేకం గాదని. మంచిది చంద్రబాబూ, నువ్వు మరి తెలంగాణకు అనుకూలమా? గది జెప్పరాదు జెర? మాటిమటికి నేనెప్పుడో ప్రణభ్ కమిటీకి లెటరిచ్చిన, దాన్ని ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు అంటవు. ఒక్కసారన్న అదేలెటరు సారాంశానికి ఇంకా కట్టుబడి ఉన్న అని జెప్పినవ?

నువ్వేమొ, తెలంగాణను నేనెన్నడు అడ్డుకోలేదంటవు, కని డిసెంబరు 2009 న నీతోనే ఉన్న నీ అప్పటి పార్టీ నేతలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాగం ఏమొ నువ్వే సమైక్యాంధ్ర ఉద్యమానికి సూత్రధారివి, అంత ఎన్‌టీఆర్ భవన్ నుంచి నీడైరెక్షన్లనే నడీచింది అని జెప్పుతరు. సరె, వాల్లు నీపార్టీ విడిచిపెట్టినందుకు తొండి జేస్తున్నరనుకుందాం, మరి రాజీనామ లేఖలు కాంగ్రేస్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరివి ఒక్కటే ఫార్మాట్లో ఎట్ల ఉన్నవి?


నీనోట్లె పురుగులు పడ, ఆనాడు అఖిల పక్షంల "మీకు దమ్ముంటె బిల్లు బెట్టుండ్రి, మేము మద్దతియ్యకుంటె అడుగుండ్రి" అన్న నోటితోటే వారం కుడ గడవకుండ "ఎవర్నడిగి అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నరు?" అంటివి, ఇప్పుడు నేను వ్యతిరేకం గాదన్నంతమాత్రాన గవన్ని ఎట్ల మరిశిపొమ్మంటవ్? నీలాంటి పూటకోమాట మాట్లాడేటోని మటలు ఎట్ల నమ్మమంటవ్?


చంద్రబాబూ, తెలంగాణకు నేను వ్యతిరేకం గాదంటున్నవ్ గని, తెలంగాణకు జరిగిన అన్యాయాలమీద ఏనాడన్న కొట్లాడినవా, కనీసం  మట్లాడినవ? తెలంగాణను ముంచేసే పోలవరం ప్రాజెక్టుకని నీ కోస్తాంధ్ర తమ్ముల్లకోసం దీక్షకు గూసుంటువి, మరి ఏనాడన్న తెలంగాణకు పనికొచ్చే శ్రీశైలం ఎడమ కాలువ గురించన్న, ఏఎమ్మార్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు గురించన్న కనీసం మాట్లాడినవా, నువ్వధికారంల ఉన్నప్పుడూ వటికోసం ఏమన్న జేసినవా? ఆరొందల పదిజీవొ గురించి ఏనాడన్న మాట్లాడినవా, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏమన్న జేసినవా?

నిన్నగాక మొన్న సాగర్ల నీళ్ళు లేకపోయినా సాగర్ నీళ్ళను ప్రకాశం బ్యారేజీకి విడిదల జెయ్యాలని పార్టీ తరఫున ఆందోళన జేపిస్తివి, మరి ఇక్కడ తెలంగాణోల్ల గోస నీకు కనపడలేదా? మాకు మెడికల్ కాలేజీల సీట్లపెంపులో అన్యాయం జేసినప్పుడన్న గొంతు విప్పినవా? గివన్నిటిమీద ఎన్నడూ మాట్లాడనోడివి ఖర్మగాలి రేపు తెలంగాణ ఏర్పడ్డంక గుడ తెలంగాణల నీపార్టీనే అధికారంలోకి వచ్చిందనుకో తెలంగాణ కడుపున మల్లీ మట్టిగొట్టవని నమ్మకమేంది? నీ రెండుకండ్లసిద్ధాంతంల రెండుకండ్లు సీమాంధ్రదిక్కేనని మాకు తెల్వదా?

గవన్నెందుకు గని నీదొక సీమాంధ్ర పార్టీ. మేము కొట్లాడేదే సీమాంధ్ర పెత్తనం వద్దని. ఇంక నీపార్టీని మాదగ్గర ఎట్ల ఉండనిస్తం? పుసుక్కున పాదయాత్ర జేసుకుంట నువ్వు గుండాగి సచ్చినవనుకో, నీతర్వాత నీపార్టీ నాయకత్వం ఏబాలయ్యకో, లోకేశ్‌బాబుకో వస్తది గని తెలంగాణ నాయకుడికి దక్కుద్ద? గందుకే నీది ఆంధ్రపార్టీ!

తెలంగాణమీద స్పష్టమైన వైఖరి జెప్పమని మేమడిగేది నువ్వేదో తెలంగాణకు అనుకూలంగ వైఖరి జెప్పితె వోటేస్తమని గాదు. నువ్వు మాకు వ్యతిరేకం గాదని ఎంత బొంకినా మేము నీకూ, నీపార్టీకి వ్యతిరేకమే. ఒకసారి వోట్లేసి  యాభై సీట్లిచ్చినందుకు, నీకు వోట్లేసిన అధికారంతోనే ఇప్పుడు మాటదప్పినందుకు నిలదీస్తున్నం. నువ్వు మల్లీ మాటమార్చినా నీకు వోట్లు పడేది మాత్రం కల్ల.


Tuesday 25 December 2012

Telangana Issue - Conflict Resolution Analysis

In Management couse "Conflict Resolution" is an important subject that every management student, manager will learn at some point of time. A conflict can be resolved easily if each party exchanges their own concerns, understands other party's concerns and respect other's rights. If concerns are exchanged both parties can try to find a cooperative solution that addresses all concerns and achieve a win-win solution. However if one party tries to hide their concerns, conflict can never be resolved.

If an employee is fed up with management and  tries to leave a company then his manager will have a meeting with employee and tries to understand the concerns of the employee. If manager wants to retain the employee, manager assures the employee that his concerns will be addressed during coming months. If some concerns cannot be met due to organizational limits then manager tries to explain the same. On the other hand if manager feels that there is no point in attempting to retain the employee then he will let the employee go. Same thing happens even if brothers wants to get separate or a partner in a business firm wants to separate. However in Telangana conflict this is not happening in all these years. When one party wants to separate the other party instead of trying to understand others concerns they abuse, they ridicule others concerns and they try every thing to ensure that other party won't separate.

Telangana leaders have expressed  concerns for their demand in various forums and those are well documented. The primary reason for the demand is discrimination of ruling class in river water allocation, funds allocation in budget,injustice in employment, promotions, cultural supremacy, manipulation of history etc.

However those who are opposing Telangana state and preaching for united state have never attempted to understand concerns of Telangana. They never exchanged their concerns in case of division. They never respected the right of Telanganaites demand for separate statehood. Samaikyandhra proponents always try to say that the concerns expressed by Telanganaites are incorrect and try to come up with their own version of manipulated statistics.  What is the reason why they never tell their own concerns in the conflict? Is it that they do not have any concerns or is it that their concerns cannot be told openly?

If Samaikyandhra proponents do not have any concerns then there is no reason why they should oppose the demand of Telangana. So we can understand that they have some concerns but they are not able to express due to their own reasons.

Instead of coming up with their real concerns in the division, samaikyandhra proponents talk about some absurd, imaginary theories: "telugu jathi aikyatha", "if divided we go back 50 years in development", "anna thammula madhya chicchu". All these are meaningless and do not hold before logic.

Is river water issue the concern? There are several rivers whose waters are shared among states and even countries, with supervision of tribunals in allotment of waters. Issue comes only when there is discrimination happening in allotment of water between regions of same state as there is no independent authority to supervise in such case.

Is Hyderabad the real issue? This can be easily resolved considering geographical, historical aspects and previous examples.

Is safety of andhraites in Hyderabad an issue? The constitution of India gives right to live anyone peacefully in any place in India.

None of the above are real concerns of  Samaikyandhra proponents and they won't even talk about those. Their real issue is their real estate interests in Hyderabad and surrounding areas, their illegally occupied lands, securing civil contracts of Govt projects in Telangana, excess river water share that they are enjoying now by means of holding power. None of these reasons can be told publicly as they only expose the evil nature of Seemandhra leaders. This is the reason Samaikyandhra proponents can never express their concerns in this conflict. They think that by ensuring that conflict won't be resolved they can see taht status quo is maintained and they keep reeping the benfits in statues quo.

However fortunately in democracy they cannot control their power forever and ultimately people decide their destiny. When such day comes these are the ones who suffer largely when common folks from both sides will be happy.

Thursday 20 December 2012

ఆంధ్రోద్యమంలో అరవలను మీరు తిట్టిపోయలేదా?


By: కొణతం దిలీప్
“మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. కానీ ఉద్యమంలో భాగంగా ఆంధ్రోళ్లను మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నరు. మమ్మల్ని దోపిడీదార్లని అంటున్నరు. ఇట్లా తిడుతున్నరు కాబట్టే రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్నది”. అని ఇటీవల అన్నాడో సీమాంధ్ర మిత్రుడు.
అంతటితో ఆగక “ఇంత ద్వేషభావంతో విడిపోయిన తెలంగాణ అసలు ఏమవుతుంది?, ఇక్కడున్న సీమాంధ్రుల పరిస్థితి ఏమవుతుంది?” అని కూడా వాపోయాడు.
ఈ ప్రశ్నకు కూడా మేం చాలాసార్లే జవాబిచ్చినం. కానీ ఇదే ప్రశ్న మల్ల మల్ల అడుగుతున్నరు కాబట్టి. ఇంకోసారి…
ఇవ్వాళ తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని ఉద్యమిస్తున్నదే ఉమ్మడి రాష్ట్రంలో వారి ప్రయోజనాలు దెబ్బతిన్నాయని. వారి వనరులు, ఉపాధి అవకాశాలు కొల్లగొట్టబడ్డాయని. కాబట్టి వారికి సహజంగానే ఈ పరిస్థితికి కారణమైన సీమాంధ్ర ప్రాంతంవారిపై ఆగ్రహం ఉంటుంది.
అయితే ఉద్యమం సాగుతున్నప్పుడు ఉండే ఆగ్రహ భావనలు తెలంగాణ ఏర్పాటు తరువాత ఉండవు. దీనికి ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల విభజన సందర్బంగా జరిగిన చరిత్రను కొంచెం గుర్తుకు చేయాలె మీకు.
విద్య, ఉద్యోగాలు, వనరుల్లో తమిళులే ఆధిపత్యం చలాయిస్తున్నారని, ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందనే కారణంగా మదరాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడదీయాలనే ఉద్యమం ఊపందుకున్నది. ఈ ఉద్యమం చాలా యేళ్లు కొనసాగి చివరి దశలో తమిళులు, ఆంధ్రుల మధ్య ద్వేషభావాలు తారాస్థాయికి చేరాయి.
ఒకరిపై ఒకరు చేసుకునే ఈ ప్రచారంలో చివరికి చిన్న పిల్లల కథల పుస్తకాల్లో కూడా అరవల (తమిళుల) మీద వ్యాఖ్యలు ఉండేవి. మచ్చుకు 1948 నాటి “బాల” పత్రికలో ఈ కథ చూడండి:


అరవల కన్నా తెలుగు వారే గొప్ప అని ఇట్లాంటి కథలు రాసి చిన్నపిల్లల మెదళ్లలో నింపడం అవసరమా? ఒకసారి అలోచించండి.
ఇక ఆ కాలంలో ఆంధ్రులు చలామణిలోకి తెచ్చిన కొన్ని సామెతలు చూడండి. అవి అరవల పట్ల ఎంతటి ఏహ్యభావం ప్రదర్శిస్తున్నవో:
“అరవల పొట్ట, తమలపాకుల కట్ట ఎప్పుడూ తడుపుతూనే ఉండాల”
“అరవ చాకిరి మంగలి  అందరికీ దొరకడు”
“అరవ చెవులకేల అరిది వజ్రపు కమ్మలు”
“అరవ చెరుచు, పాము కరచు”
“అరవ అత్తగారు, ప్రధమశాఖ మామగారు”
“అరవ అధ్వాన్నం, తెనుగుతేట, కన్నడం కస్తూరి”

ఇంతటితో ఆగలేదు మన ఆంధ్ర సోదరులు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర మహాసభ తమిళులకు వ్యతిరేకంగా ఆంధ్రులకు ఒక పిలుపు ఇచ్చింది.
“తిరుపతి వెంకటేశ్వర స్వామి తమిళ దేవుడు. ఆంధ్రులు ఆ దేవాలయమును బహిష్కరించవలయును” (N. Subba Rao, History of Andhra Movement, Andhra Region, Vol-II, Hyderabad, 1982)
దేవుళ్లకు కూడ ప్రాంతీయత ఆపాదించిన గొప్ప చరిత్ర సీమాంధ్రులదే.
ఇంత ఘోరంగా అరవల మీద ప్రచారం చేసిన చరిత్ర ఉన్న సీమాంధ్రులు ఇవ్వాళ కడుపుమండిన తెలంగాణ వారు ఎప్పుడైనా విమర్శిస్తే బాధపడటం వింతగా అనిపిస్తది మాకు.
తెలంగాణ ఉద్యమ నాయకత్వం చాలా స్పష్టంగా “పొట్టగొట్టినోల్ల మీదనే పోరాటం కానీ పొట్టచేతపట్టుకొని వచ్చినోళ్ల మీద కాదని” చెప్పారు. ఉద్యమ వేడిలో అక్కడో, ఇక్కడో ఎవరో కటువుగా మాట్లాడి ఉండవచ్చు. కానీ గత దశాబ్దపు ఉద్యమ స్వభావం చూస్తే మాత్రం సామాన్య సీమాంధ్రులపై తెలంగాణ ప్రజలు పెద్దగా ఆగ్రహం చూపించిన సంఘటనలు లేవు. 1969తో పోలిస్తే ఇప్పుడు ఉద్యమం చాలా పరిణతి చెందింది. “వలస పాలకులపైనే కానీ వలస వచ్చిన బక్క జీవుల కాదు మా పోరాటం” అని విస్పష్టంగా ప్రకటిస్తున్నది తెలంగాణ ప్రజా ఉద్యమం.
ఆంధ్ర-మదరాసు విభజన జరిగిన తరువాత సభల్లో వక్తలు కూడా అనేవారు. “మొన్నటివరకూ ఎంతో తిట్టుకున్నాం, కానీ ఇప్పుడు సోదరుల్లా కలిసి మెలిసి ఉన్నాం” అని. రేపు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తరువాత ఇప్పటి ఉద్రిక్త వాతావరణం సమసిపోతుంది. మనం మనుషుల్లా కలిసే ఉంటాం. ఈ అనిశ్చితి తొలగి మనం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే  సీమాంధ్ర సోదరులు తమసాటి ప్రజల పోరాటానికి మద్ధతుగా నిలవాలె.
[With inputs from Rakesh Marupaka & Capt. L Panduranga Reddy garu]
source:missiontelangana.com

Monday 10 December 2012

తెలంగాణ, జన్‌లోక్‌పాల్




రెండోసారి యూపీయే అధికారం చేపట్టాక దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండు ప్రజా ఉద్యమాలవలన యూపీయే  ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి ఒకటి అవినీతి వ్యతిరేకతతో మొదలయిన జన్‌లోక్‌పాల్ కాగా మరొకటి పాలనా వివక్ష వలన మొదలయిన తెలంగాణ ఉద్యమం. ఈరెండు ఉద్యమాలలో చాలా సారూప్యం కనిపిస్తుంది..కొన్ని చోట్ల తేడాలూ కనిపిస్తాయి.

తెలంగాణ ఉద్యమం ఇప్పుడూ ప్రజల్లో చొచ్చుకుపోవడానికి కారణం 2009లో కేసీఆర్ చేసిన దీక్ష కారణం కాగా జన్‌లోక్‌పాల్ ఉద్యమం అన్నా దీక్షవలన ప్రాచుర్యం పొందింది. రెండు ఉద్యమాలకూ ప్రజలనుండీ వస్తున్న మద్దతును చూసి యూపీయే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమాల డిమాండ్లకు మొదట ఒప్పుకుంది. కేసీఆర్ దీక్ష తరువాత తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం ప్రకటన చేస్తే అన్నా దీక్ష తరువాత జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం స్థూలంగా ఒప్పుకుంది. అయితే తరువాత ప్రభుత్వం రెండువిషయాల్లో వెనక్కి తగ్గింది.

తెలంగాణ ఉద్యమం తెలంగాణలో అన్నివర్గాల్లో చొచ్చుకుపోయి అన్ని తరగతుల ప్రజల మద్దతు విశేషంగా లభిస్తుంటే జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి మాతర్మ్ ఎగువ మధ్యతరగతి వర్గం వారిమద్దతు మాత్రమే ఉంది. సామాన్య ప్రజానీకానికి అసలు అదేంటో కూడా తెలియదు.

జన్‌లోక్‌పాల్ ఉద్యమం సందర్భంగా మొదటిసారి అన్నా దీక్ష చేసినప్పుడు నేషనల్ మీడియా విపరీతంగా మద్దతు ఇచ్చింది. రెండోసారి మాత్రం అసలు మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి నేషనల్ మీడియా మద్దతు లేకపోగా లోకల్ మీడియా మొత్తం సీమాంధ్ర పెద్దల కనుసన్నల్లో ఉద్యమంపై విషం చిమ్ముతుంది.

రెండు ఉద్యమాలనూ నీరు గార్చడానికి ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిపై ఆరోపణలు చేయడం, మీడియా మేనేజ్‌మెంటు చెయ్యడం చేసింది. ఫలితంగా అన్నా టీంను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం వీరి ఉపాయాలు పారలేదు. ఎంతగా విభజిద్దామన్నా తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న తెరాస రోజురోజుకూ ప్రజల మద్దతుతో బలపడుతుంది.


తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర నేతలు, ధనిక వర్గం అడ్డుకాగా జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి  అవినీతివలన లాభపడుతున్న అన్ని పార్టీలూ వ్యతిరేకమే. జన్లోక్‌పాల్ బిల్లుకు ప్రజల్లో తెలంగాణ ఉద్యమంలా విశేష మద్దతు లేకున్నా ప్రజలెవరిలో వ్యతిరేకత కూడా లేదు. దీనికి అడ్డు పూర్తిగా రాజకీయ పార్టీలే. తెలంగాణ ఏర్పాటుపై సాధారణ సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత లేకున్నా సమైక్యాంధ్రలో లాభపడుతున్న డెల్టా భూస్వామ్య వర్గం వ్యతిరేకంగా ఉంది. కొందరు సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలద్వారా కొన్నివర్గాల సీమాంధ్ర ప్రజల్లో హైదరాబాద్ మనది కాకుండా పోతుంది, తెలంగాణ వస్తే మనకు నీళ్ళు రావు లాంటి అనవసర భయాందోళణలు రగిలించారు.

అవినీతి వ్యతిరేకంగా ఇప్పుడు మొదలయిన ఆంâఅద్మీ పార్టీ తెలంగాణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, తెలంగాణ ఉద్యమంలో నిజాయితీని గ్రహించి మద్దతివ్వడం మంచి పరిణామం. అవినీతికంటే కూడా వివక్ష ప్రమాదకరం. అవినీతిని చట్టాలద్వారా అణచివేయొచ్చుగానీ పాలనా వివక్షను ఏచట్టాలద్వారా సవరించలేము. వివక్షను అధిగమించడానికి విడిపోవడం తప్ప మరో మార్గం లేదు.






తెలంగాణకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు

న్యూఢిల్లీ: జంతర్ మంతర్లో తెలంగాణ విద్యార్థుల నిరాహారదీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు వేర్వేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. లోక్ పాల్, తెలంగాణ విషయాల్లో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. అఖిలపక్షం పేరుతో కాలయాపన చేయడమే కాంగ్రెస్ ఎత్తుగడ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా పాలుపంచుకుంటామని చెప్పారు.

నయవంచనకు మూడేళ్ళు


సరిగ్గా మూడేళ్ళక్రితం ఇదేరోజు...కేసీఆర్ దీక్ష ఫలితమో, విద్యార్థుల ఉద్యమఫలమో గానీ భారత ప్రభుత్వం తరఫున హోంమంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన జేసిండు. తెలంగాణ ప్రక్రియ మొదలయింది..త్వరలో యూపీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జేస్తుంది అని ప్రకటన జేసిండు. తమ యాభై ఏళ్ళ కల నెరవేరిందని తెలంగాణ ప్రజలు సంబరపడ్డరు.

కానీ సంబరాలు ఎక్కువసేపు నిలువలేదు. అప్పటిదాక తెలంగాణకు మేము ఎక్కువ అనుకూలమంటే కాదు మేమే ఎక్కువ అనుకూలం అంటూ పోటీలు పడ్డోళ్ళు, ఇచ్చేది తెచ్చేది మేమే అంటే మీకు దమ్ముంటె బిల్లు బెట్టున్ర్డి మేం మద్దతు ఇయ్యకపోతె అడుగుండ్రి అన్నోళ్ళు, మేము సామాజిక తెలంగాణ తెస్తం కావాలంటె మామానిఫెస్టో జూడుండ్రి అని ఫోజులు గొట్టినోళ్ళు వాళ్ళూ వీళ్ళు అందరు ఒక్కటై ఒకరి ఎనకాల ఇంకొకరు లైనుగట్టినట్టు రాత్రికి రాత్రి రాజీనామాలు జేసిండ్రు. చరిత్రలో ఎక్కడలేనట్టు తమకు కావాల్సినదానికోసం గాకుండ ఎదుటివారికి వచ్చేది ఆపడానికి ఉద్యమం(?) మొదలు పెట్టిండ్రు. వోట్లకోసమైతె జైతెలంగాణ, అధికారం ,డబ్బుకోసమైతె నైతెలంగాణ అని తమ నైజం బయట పెట్టిండ్రు.

ఫాక్షనిస్టు కౄరమృగాలు జింకపిల్లలెక్క నటించి గాంధీగిరీ జూపించి దీక్షలు జేసిండ్రు, సాటుంగ వాల్లే వల్ల కిరాయి మనుషులను ఉసిగొల్పి లూటీలు జేసి, బస్సులు తగలబెట్టి విధ్వంసం జేసిండ్రు. ఎప్పుడు కొట్టుకుని తిట్టుకునే బెజవాడ రౌడీలు ఒక్కటై నిరాహారదీక్షలు జేసిండ్రు, విద్యార్థులను రెచ్చగొట్టి బంద్‌లు జేయించిన్రు. ఆడ మొగ తేడాలు మరిచిపొయి నన్నపనేనులు, లగడపాటులు సిగ్గువిడిచి కౌగిలింతలూ, ముద్దులూ కురిపించుకుండ్రు. ఏలినాటి పగలున్న ముఠాకక్షల శతృవులు ఏకమై నాటకాలు జేసిండ్రు.

"మనపక్కోడు మనకింద అనిగి ఉన్నంతవరకే నువ్వూ నేను శతృవులం. మనం మనం బాగనే ఉండాలి గని మనకింద ఉన్నోళ్ళు మనకోసం కొట్టుకు చావాలి. మనకిందోడు తెలివిమీరి మన అదుపునుండి బయటికి వస్తే అప్పుడు మనంశతృత్వం మరిచిపోవాలి,నువ్వు నేను ఒక్కటై కిందోన్ని అణగదొక్కాలి" గిదే ఫాక్షనిస్టు నీతి. గిదేనీతి డిసెంబరు 9, 2009 తరువాత సీమాంధ్ర నాయకులు జూపిండ్రు. అప్పటిదాక తెలుగుదేశం, కాంగ్రేస్ తరఫున కులగజ్జి, ముఠాకషలతో కొట్టుకునేటోళ్ళంత తెలంగాణ వస్తుందనగానె ఎక్కడ కబ్జాలు చెయ్యిజారిపోతయో, ఎక్కడ ఆధిపత్యం తగ్గిపోతుందోనని భయంతో శతృత్వాలను మరిచిపోయి ఫాక్షనిస్టు నీతిననుసరించి ఒక్కటై తెలంగాణకు అడ్డుపడ్డరు.

పదిహేను రోజులు వరస బందులు జేసిండ్రు. బస్సులు నడవనియ్యలేదు. బడిపిలగాళ్ళను బడికి పోనీయకుండ రోడ్లమీద కూసోపెట్టిండ్రు. రైల్వేస్టేషన్లు లూటీ జేసిండ్రు, గోడౌన్లు కాలపెట్టిన్రు. ఎక్కడికక్కడ టేంట్‌లేసి దీక్షలని గూసుండ్రు...రింగ రింగ పాటలు పెట్టుకుని డాన్సులు జేసిండ్రు. గక్కడ గోడౌన్లు గాలపెడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లెక్క గూసుండ్రు గని అడ్డుజెప్పలేదు. బడిపోరగాళ్ళతోని ర్యాలీలు తీపిస్తుంటె అడ్డుజెప్పలేదు.. రాష్ట్ర ప్రభుత్వమే అలజడి దగ్గరుండి జరిపిస్తుంటె అడ్డుకునేదెవరు? ఎన్ని లూటీలు జేసినా ఒక్క అరెస్టు గుడ లేదు.


ఈదొంగడ్రామాలకు మీడియా తోడు. చేతిలో మీడియా ఉంటె పదిమంది వచ్చిన సమైక్యాంధ్ర జాక్ సభ గుడ మహాసభ అయితది. బడిపోరగాండ్లతో తీయించిన ర్యాలీకుడ మొదటి పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో వస్తది. రోజు బిర్యాని పొట్లాలు తింటున్నా గుడ మహోన్నత నిరాహారదీక్ష అవుతుంది, టీవీలల్ల పదినిమిషాలకోసారి ఫ్లాష్ న్యూస్‌లొస్తయి. డబ్బుంటే రెచ్చగొట్టుడు వీడియోలు తీయించి పావుగంటకోసారి అన్ని ఛానెళ్ళలో జూపించొచ్చు.  అధికారముంటె లూటీలు జేసినా అడిగేటోల్లుండరు, మీడియా మనదయితె నక్క గుడ నాగలోకమయితది. ఇంకేం గావాలె? ఈదొంగనాటకం ఢిల్లీ నేతల కండ్లకు పెద్దగ గనపడ్డది. అది గాకుండ దొంగ డ్రామా రాజీనామాలు తప్పుడు ఫార్మాట్‌లో ఇచ్చి బ్లాక్‌మెయిలు గుడ జేసె. ఎక్కడ ప్రభుత్వం గూలిపోద్దోనని భయపడి యూపీయే ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి దీసుకుంది, తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది.

మూడేండ్లు గడిచిపొయినయ్. వందల యువకులు తెలంగాణలో ఆత్మబలిదానాలు జేసుకుండ్రు. వేలమంది లాఠీదెబ్బలల్ల గాయపడ్డరు, లక్షలమంది ఉద్యమాలు జేసిండ్రు, కోట్లమంది హృదయాలు గాయపడ్డయ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఇంకా ఎకాడ వేసినగొంగళి అక్కడనే అన్నట్టున్నది.


చూస్తుండంగ మల్లి వోట్లు దగ్గరపడ్డయి. భూమి గుండ్రంగ ఉంటదన్నట్టు మల్లీ పార్టీల పగటి వేషగండ్లు నాటకాలు షురు జేసిండ్రు. పాదయాత్రలు, పొర్లు దండాలు మొదలు పెట్టిండ్రు. బిల్లుపెట్టి సూపించుండ్రి మద్దతియ్యకపోతె అడుగుండ్రి అని సవాలు జేసిన నోటితోటే గంటలల్ల మాటమార్చి ఎవర్నడిగి నిర్ణయం తీసుకుండ్రు అన్న మోసగాడు నేను తెలంగాణకు వ్యతిరేకం గాదు అంటుండు. పార్లమెంటులొ పక్కోడిదగ్గర ప్లకార్డు గుంజుకుని తెలంగాణకు వ్యతిరేకంగ అరిచినోడు ఇప్పుడు మీమనోభిప్రాయలకు అనుగుణంగ ఉంటమని పెద్దపెద్ద మాటలు జెబుతుండు. ఎనసిగ్గులేకపోతెమాత్రం మరీ వోట్లకోసం గిన్ని అబద్దాలా? ఇన్ని మోసాలు జేసి ఏం బావుకుంటరు?

మీదొంగ ఉద్యమం వల్ల ఒక్కటిమాత్రం మంచిదయింది. తెలంగాణలొ మూడేళ్ళకింద చానమంది  నా అసుంటొల్లు "తెలంగాణ తెచ్చుకుని జేసేదేముంది, దానికోసం ఎందుకు కష్టాలు ఎట్లనో ఒకలాగ ఉండెడానికి" అనుకునేటోళ్ళు. మీదొంగ ఉద్యమంతో అప్పటిదాక తటస్థంగ ఉన్న చానమందికి వాస్తవం తెలిసొచ్చింది. నీకీ పొత్తులో ఎంతలాభం లేకుంటె గీతీరుగ మారాష్ట్రానికి అడ్డుపడుతవ్ బిడ్డ, అధికారం చేతిలో పెట్టుకుని నువ్వు మాసొమ్మెంత దోసుకోకపోతె మావాటా మాగ్గావలంటె ఏడుస్తున్నవ్ అనుకున్నరు. లెక్కలు బయటికి తీసిండ్రు, చరిత్ర తెలుసుకున్నరు, యాభై ఏళ్ళుగ సమైక్యం పేరుతో జరుగుతున్న మోసాన్ని తెలుసుకున్నరు. ఇప్పుడు మీరు పాదయాత్రలు జేసినా, పొర్లు దండాలు పెట్టినా మీకెవ్వరు వోటేశేది లేదు. సీమాంధ్రపార్టీలనన్నింటినీ ఎప్పుడో మాదగ్గర బొంద పెట్టినం.

మీరిచ్చే కుక్క బిస్కెట్ల ఆశకు మాదగ్గర హౌల గళ్ళు కొందరు మీపార్టీలల్ల జేరుతున్నరని మురిసిపోకుండ్రి. వాల్లకు ఇంకే తెలంగాణ అనుకూల పార్టీల టికెట్ రాదని తెలిసి మీడబ్బుకోసం వస్తుండ్రు. అంత మూన్నాళ్ళ ముచ్చటే.  మీదోపిడీ ఇంక సాగదు, సామాను సర్దుకోవాల్సిందే.

Friday 23 November 2012

తెలంగాణ వ్యతిరేకతే సీమాంధ్ర సినిమా పరిశ్రమ నైజం!


By: కొణతం దిలీప్
తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు తరచూ వల్లెవేసే మాట – “మేము కళాకారులం, మాకు ప్రాంతీయ భేధాలు లేవు” అని. కానీ వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆది నుండీ తెలంగాణ అంటే చిన్న చూపే. సినిమా పరిశ్రమ పెద్దలు తమ ఆంధ్ర పక్షపాత బుద్ధిని ఏనాడు దాచుకోలేదు.
1972 జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నిజస్వరూపం నగ్నంగా బయటపడింది. ఆనాడు ముల్కీ రూల్స్ రద్దు చేయాలని సాగిన ఆ హింసాత్మక ఉద్యమానికి తెలుగు సినీ ప్రముఖులు ఇతోధికంగా సాయపడటమే కాదు ఏకంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని  ఈ తరంలో చాలామందికి తెలవదు.
అంతకు మూడేండ్ల ముందు 1969లో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసింది. ప్రభుత్వ కౄర అణచివేతలో 369 మంది యువతీయువకులు నేలకొరిగారు. ఇదంతా జరుగుతున్నా అదేదో తనకు సంబంధించని అంశంలా పట్టించుకోకుండా ఉండిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ.
తమ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఆడతాయని, నైజాం ప్రాంతం నుండి వసూలైన సొమ్ము భారీమొత్తంలోనే ఉంటుందని తెలిసి కూడా ఆనాటి సినీ పరిశ్రమ ఎలాంటి సంకోచం లేకుండా 1972లో ”జై ఆంధ్రా” అంటూ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకుంది. అదే పరిశ్రమ ఇవ్వాళ కళకు ప్రాంతాలు లేవని బొంకితే నమ్మేది ఎవరు? ఆనాడు జై ఆంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, జమున, వాణిశ్రీ వంటివారు నేటికీ జీవించే ఉన్నారు.
ఒకసారి అప్పటి చరిత్ర పుటలు తిరగేస్తే దిగ్బ్రాంతికర వాస్తవాలెన్నో బయటపడతాయి. దాచేస్తే దాగని ఈ సత్యాలు, తెలుగు సినీ పెద్దల అసలు స్వరూపాలను మనముందు నిలబెడతాయి. “అందరివాళ్లు”గా చలామణి అవుతున్న ఈ హీరోలు నిజానికి “కొందరివాళ్ళు” అని, ప్రాంతీయ దురభిమానులు అని , గోముఖ వ్యాఘ్రాలని నిరూపణ అవుతుంది.
1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలుగు సినీ పరిశ్రమ పోషించిన పాత్ర స్థూలంగా ఇదీ:
- తమకు ఏ రాజకీయాలు లేవని చెప్పుకునే సినీ పరిశ్రమ ఏకంగా ముల్కీ రూల్స్ ను రద్దు చేయాలనే డిమాండుతో పత్రికా ప్రకటనలు ఇచ్చింది
- ఉద్యమానికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చారు సినీ పరిశ్రమ పెద్దలు. విరాళాలు ఇచ్చిన వారిలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర హీరోలు ఉన్నారు. సినీ పరిశ్రమ నుండి భారీ ఎత్తున నల్లధనం ఉద్యమానికి అందుతున్నదనే అనుమానంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సి.ని.ఐ. విచారణకు కూడా అదేశించిందట.
- ఉద్యమంలో కాల్పులు జరిగి ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా తెలుగు సినిమా పరిశ్రమలోని అనేక మంది హీరోలు, హీరోయిన్లు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, జమున, రామకృష్ణ, ఎస్వీరంగారావు, వాణిశ్రీ, చలం, శారద, చాయాదేవి వంటి వారున్నారు. ఇవ్వాళ వందలాది మంది తెలంగాణ యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ఒక్క సినీ పరిశ్రమ ప్రముఖుడూ పట్టించుకున్న పాపానపోలేదు.
- జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మె చేసిన ఎన్.జివో లకు ఒక సహాయ నిధి ఏర్పాటుచేస్తే సినీ పరిశ్రమ ప్రముఖులు దానికి విరాళాలు ఇచ్చిండ్రు.
- ఆ సమయలో రిలీజ్ అయిన కొన్ని చిత్రాల ఒక్క రోజు కలెక్షన్లు ఉద్యమంలో చనిపోయిన వారి సహాయనిధికి ఇచ్చిండ్రు.
- ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో సినీ హీరో కృష్ణ, విజయ నిర్మల స్వయంగా మద్రాసులో నిరాహారదీక్షకు కూర్చున్నారు.
- కొంగర జగ్గయ్య, గుమ్మడితో సహా అనేకమంది నటీనటులు జై ఆంధ్ర ఉద్యమ బహిరంగ సభలలో పాల్గొని ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రసంగించారు.
తెలుగు సినిమా పరిశ్రమ సీమాంధ్ర పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యాలు ఆనాటి పత్రికల్లో ప్రచురితమైన ఈ వార్తా క్లిప్పింగులు. ఆ ప్రకటనల్లో భాష చూడండి ఒక సారి. వారికి సీమాంధ్ర ప్రాంతంపై ఎంత ప్రేమ ఉన్నదో ఇట్టే అర్థం అవుతుంది.

Thursday 22 November 2012

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు!!


జగనన్న విడిచిన బాణం షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలు జేస్తుంటే కర్నూలులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ వై.ఎస్.విజయమ్మ ఇలాగందట. "ఒక రామోజీరావు, ఒక మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి... వీళ్లందరికీ ఏ మార్గదర్శకాల ప్రకారం మీరు కేటాయింపులు చేశారు? అదే గైడ్‌లైన్స్ ప్రకారం రాజశేఖర్‌రెడ్డి గారు చేస్తే తప్పవుతుందా?"

అమ్మా, విజయమ్మా సత్యం బలికినవు. చంద్రబాబు ఏగైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సంపదను తన అణుచరులు, బినామీలకు పంచి పెట్టిండో మీఆయన గుడ అదే గైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సొమ్మును నీకొడుక్కు పంచి ఇచ్చిండు. ఒకడు దోపిడీకి తలుపులు తెరిస్తే ఇంకొకడు గోడలే కూలగొట్టి మరీ దోచేశిండు. ఒకడు దోచింది సింగపూరు, స్విస్స్ బ్యాంకులకు తరలిస్తే మరొకడు నన్నెవడడుగుతడనే ధీమాతో బాజాప్తుగ దోచుకుని పత్రికలు, టీవీలు, సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టుకుండు.  ఒకడు పగటి దొంగ, మరొకడు గజదొంగ. ప్రజలదృష్టిలో ఇద్దరూ దొంగలే.

మీకు దోచుకోవడంలో ఒకరితో ఒకరికి పోటీ. ప్రజలను మోసం జెయ్యడానికి పోటీ, పాదయాత్రలు జెయ్యడానికి పోటీ. ఒకడిది రెండు కళ్ళసిద్ధాంతం, మరొకడిది రెండు నాల్కల సిద్ధాంతం. మొత్తంగా మీరిద్దరూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు అన్నవిషయం ప్రజలకు సరిగ్గా తెలిసొచ్చింది.ఇంతకూ తమరిబాధ మీకొడుకును జైల్లో పెట్టినందుకా, చంద్రబాబును తోడుగా జైల్లో పెట్టనందుకా?

Wednesday 21 November 2012

మోసగాడి డిక్లరేషన్లు



చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టడానికి ఒక నెలరోజులు ముందుగా డిక్లరేషన్లమీద డిక్లరేషన్లు జేసిండు. బిసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ డిక్లరేషన్. ఇన్నిరోజులు లేనిది ఒక్కసారిగా పాదయాత్రముందే ఈడిక్లరేషన్లు ఎందుకు జేసిండు అని ఆలోచిస్తే ఈపాదయాత్రకీ డిక్లరేషన్లకూ ఉన్న లింకేందో తెలుస్తది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్ర సీమాంధ్రలో జేసినా, తెలంగాణలో జేసినా జనం చేత తిట్లు తిట్టించుకోవాల్సిందే.

జనం వచ్చి తెలంగాణకు ఎందుకు అడ్డుపడ్డవు అని అడిగితే సమాధానం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగ ఉన్నప్పుడు మాబతుకులెందుకు  రైతులకేం జేసినవ్, ఇప్పుడు లెస్స జెప్పుతున్నవ్ అంటె సమాధానం లేదు.ఏదో రెండు మూడు డిక్లరేషన్లు జేస్తె జనం అందరినీ గాకపోయినా కనీసం కొన్నివర్గాలవారిని మంచి జేసుకోవచ్చు. పాదయాత్రలో ఈవర్గాల మనుషులను తనతోపాటు నడిపిస్తే కొంచెం రక్షణగా ఉంటది అనేది బాబు ఐడియా.

మాదిగ దండోరా నాయకుడు మందక్రిష్ణ నిజంగ చంద్రబాబు వర్గీకరణ డిక్లరేషన్ను నమ్మండో, ఇంకేదయినా లోపాయికారీ ఒప్పందం జేసుకుండో మనకు తెలువదు కానీ మందక్రిష్ణ బహిరంగంగా చంద్రబాబు పాదయాత్రకు మద్దతు ఇవ్వడమే కాకుండా పాదయాత్రలో తన మనుషులను చంద్రబాబు చుట్టూ రక్షణవలయంలా నడిపించి తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తెలంగాణపై వైఖరేందని నిలదీయకుండా జేస్తుండు.

వర్గీకరణ డిక్లరేషన్ ఐడియా బాగానే వర్కయినట్టుంది గానీ ఇంతకూ చంద్రబాబు డిక్లరేషన్లకు విలువెంత?మోసగాడి మాటలను నమ్మేదెట్ల? చంద్రబాబు ఇంతవరకు ఎప్పుడు మాటమీద నిలబడ్డడని ఇప్పుడు నిలబడడానికి? వర్గీకరణపై నిర్ణయాత్మక సమయం వచ్చినప్పుడు చంద్రబాబు నేను వర్గీకరణకు వ్యతిరేకం కాదని అన్నా గానీ అనుకూలమన్నానా అంటే? నాకు మాలలూ, మాదిగలూ రెండు కళ్ళలాంటివారు, మాపార్టీ రెండువర్గాల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుంది, రెండువర్గాల్లో మాపార్టీనాయకులను ఉద్యమాలు జేయమంటాం అని జెపితే?

అయినా వర్గీకరణపై మాత్రం తేల్చడానికి చంద్రబాబెవరు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే గదా? దళితుల్లో మాదిగల శాతం సమైక్యాంధ్రలో కంటే తెలంగాణలో అధికం. అంటే తెలంగాణ మాదిగలకు నిజమైన న్యాయం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలయినపుడే జరుగుతుంది. వర్గీకరణ డిక్లరేషన్ జూసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం జేస్తే నాడా కొనుక్కోవడానికి గుర్రాన్ని అమ్ముకున్నట్టే. మందక్రిష్ణా, జెర సోంచాయించు!!

Monday 19 November 2012

ఆంధ్రజ్యోతి సమర్పించు..వేమూరి వారి సీమాంధ్రోపనిషత్!


తెలంగాణ ఎప్పుడు తెస్తారు, ఎలా తెస్తారని నిగ్గదీసి అడగాలట.. ఎవరినో తెలుసా?
తెలంగాణ ప్రకటన చేసి వెనుక్కుపోయిన కేంద్రాన్ని కాదట! తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ను కూడా కాదట!! తెలంగాణ అష్టవంకరలు పోయిన మన్‌మోహన్‌సింగ్‌ను, సోనియాగాంధీని అంత కన్నా కాదట!!!
తెలంగాణ రాజకీయ బానిసలను చేతుల్లో పెట్టుకుని తెలంగాణకు అడ్డం పడిన టీడీపీని కాదట!
ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచి సీమాంధ్ర రాజీనామా డ్రామాలాడించిన చంద్రబాబును కూడా కాదట!!
ఒక్క లేఖతో పోయేదానిని వంద తాలుమాటలతో మభ్యపెడుతున్న నారావారిని అంత కన్నా కాదట!!!
చంద్రబాబు బిస్కట్లకు అలవాటు పడి తెలంగాణ ఉద్యమంపై దాడి చేస్తున్న టీటీడీపీ బాంచలను,
సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకొని పార్లమెంటులో వీరంగం వేసిన జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు అంటకాగుతున్న వైఎస్సార్ పార్టీ నాయకులు … వీరెవరిని కాదంటా!
మరెవరినో తెలుసా….తెలంగాణ ఎప్పుడు, ఎలా తెస్తాడో కేసీఆర్, టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పాలంట!
100 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు వస్తే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలట!!
కేసీఆర్‌కు ఈయన కత్తే కాదు, డాలు కూడా ఇస్తాడట!!!
ఏమి జాణతనం, ఎంత వక్రనీతి, తమరు వెనక నుంచి పొడవకుంటే చాలు…
తెలంగాణ ఎలా వస్తుందో వేమూరి వారికి తెలియక కాదు ..
తెలంగాణ ఉద్యమాన్ని దొంగదెబ్బ తీసే కుహకం…
అసంతృప్తుల దాడిని తెలంగాణ ఉద్యమం మీదకు మళ్లించే కుట్ర …
చీలి కూలి కునారిల్లుతున్న చంద్రబాబును ఆయన పార్టీని క్రేన్లు పెట్టి లేపాలని తాపత్రయం!
అయ్యా వేమూరీ,
తెలంగాణలో సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీలన్నింటినీ ఓడిస్తే మా పని సగం పూర్తయినట్టే!
తెలంగాణ ప్రజల చేతికి సగం అధికారం వచ్చినట్టే…స్వయం నిర్ణయాధికారం మా చేతికి వచ్చినట్టే!!
తెలంగాణలోని సీమాంధ్ర పార్టీలను తుడిచిపెడితే ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్‌లో ఎలా బతికి బట్టకడుతుంది?
అప్పుడు ప్రత్యేక రాష్ట్రం నడుచుకుంటూ వస్తుంది!
ఇవన్నీ మీకు తెలిసినా.. ఎందుకీ సీమాంధ్రోపనిషత్తులు?
(ఒక జర్నలిస్టు మిత్రుడు)

16రీళ్ల తెలుగు సినీమాయ!

 
Cinema44
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’

మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..

నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..

అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..

ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..

వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..

ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!

Friday 16 November 2012

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం చేసుకుందాం. కోదండరాం వెంట నిలబడుదాం


జనంసాక్షి ఎడిటోరియల్

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను ఎక్కుపెట్టాయి..తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చడంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ ఉద్యమ రథసారధి కోదండరాంపై దుష్ప్రచారానికి తెరతీశాయి..తెలంగాణ కోసం రాజీలేకుండా పోరాడుతున్న ఒకే ఒక్క గొంతుక కోదండరాం సార్‌పై సీమాంధ్రుల పత్రికలు కత్తికట్టాయి. తన జీవితంలో చాలాకాలం పౌరహక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం పోరాడిన ఓ వ్యక్తి అగ్రవర్ణమట..ఎవరు ఏకులంలో పుట్టారన్న దాని కంటే ఏ ప్రజల వైపు పోరాడుతున్నారు, ఆ వ్యక్తి నినాదమేంది, ఏ శక్తులతో కలిసి పనిచేస్తున్నాడు, ఏప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడన్నది ముఖ్యం. ఆలోచనలో, ఆచరణలో తను ఏ సిద్ధాంతానికి మద్ధతుగా పోరాడుతున్నదే ప్రస్తుతం.  అతని ఆచరణ, విధివిదానాలను బట్టి అతను ఏ వర్గ శత్రువో, ఏ వర్గ మిత్రువో అంచనా వేస్తాం. ఆ శక్తులతో కలిసి ఏ మేరకు పనిచేయాలో నిర్ణయించకుంటాం. నిజానికి కోదండరాం అసలు పేరు కోదండరాం రెడ్డి. అంబేద్కర్‌ సభలలో, దళిత బహుజన పోరాటాలు ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో మీపేరు చివర రెడ్డి ఉంది కదా అని ప్రశ్నించగానే వెంటనే రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ఇక నుంచి తనను కోదండరాంగానే పిలవాలని అందరికీ విజ్ఞప్తి చేశాడు. ఆయన జీవిత కాలంలో ఎక్కువ కాలం పనిచేసింది కూడా దళిత, బహుజన వర్గాల కోసమే..పౌరహక్కుల సంఘంలో మనిషికి మాట్లాడే, పోరాడి స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, జీవించే స్వేచ్ఛకోసం ఆయన పోరాడారు..ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు కన్నా, తన పేరు చివరలోని రెడ్డి అనే పదం కన్నా దళితుల కోసమే ఎక్కువ ఆలోచించాడు.  ఆయన గతానికి, ప్రస్తుతానికి పెద్దగా తేడా ఏమీ లేదు..కోదండరాం రెడ్డిగా ఉన్నా, కోదండరాం గా ఉన్నా ఆయన పోరాడింది దళితులు, పౌర హక్కుల కోసమే..అసలు ఆయన ఏకులంలో పుట్టాడన్న విషయం బహుశా ఆయనే మర్చిపోయాడేమో..అయినా ఓట్లు, నోట్ల కోసమే పాకులాడే నాయకులు ప్రతిసారి కోదండరాం రెడ్డి అని గుర్తు చేస్తే తప్ప ఆయన కులం ఆయనకు గుర్తు రాకపోవచ్చు. అయినా ఆయన ఏనాడు తన కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయలేదు..తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడపాలి..తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాలో అన్న ఆలోచనలే ఆయన చేస్తుంటాడు..నాలుగు కోట్ల ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఏం చేయాలో అని ఉద్యమ కార్యాచరణను రచించే కోదండరాంను ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని తన రాజకీయాల కోసం వాడుకొనే పలువురు రాజకీయ నాయకులు పలువురు టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ కులంలో పుట్టినా అణగారిన ప్రజల వైపు నిలబడడం, వారి పోరాటాలకు మద్ధతు, వారి ఉద్యమాల్లో పాల్గొనడం, వారి వెంట నడవడం, వారితో భుజం,భుజం కలిపి వారితోపాటు పోరాటాలలో పాల్గొనడం, వారి కోసమే జీవించిన వారిని పీడిత ప్రజలకు మిత్రులు కాదని ఎలా చెప్పగలం. ప్రొఫెసర్‌ కోదండరాం కూడా అంతే. కారంచేడు, లక్ష్మింపేట ఘటన వరకు కోదండరాం దళితులుల వైపు మాట్లాడారు. దళితులుగా పుట్టి నామోషీగా పేరు చివర రెడ్డి తగలించికున్న  వారు కొందరు కోదండరాంను ఒంటరి చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న ఓ కుట్ర తెలంగాణ ఉద్యమ నాయకత్వం దళితుల వ్యతిరేకుల చేతుల్లో ఉందని చూపించేందుకు చేసే సీమాంధ్ర పత్రికల కుట్రలను మనం అర్థం చేసుకోలేమా…ఈ పత్రికలు కారంచేడులో దళితుల్ని చంపిన సామాజికవర్గానికి చెందిన వారి చేతుల్లో ఉన్న పత్రికలు. నిజానికి కట్టుకథలు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రికలు ఈ పత్రికలు. తమ విషాన్ని మనపై విరజిమ్మేందుకు ఈ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి..తమ రాతలతో కోదండరాంను దళిత వ్యతిరేకంగా ప్రచారం చేసి, తెలంగాణ ఉద్యమం దళిత వ్యతిరేక ఉద్యమంగా వక్రీకరించేందుకు సీమాంధ్ర పత్రికలు కుట్రలు పన్నుతున్నాయి..తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించగలమేమోనని పగటికలలు కంటున్నాయి..నిజానికి కోదండరాం చరిత్ర గురించి ఈ పత్రికలు రాయవు..కోదండరాం ఉద్యోగంలో చేరినప్పటినుంచే సగం జీతం పేద దళిత విద్యార్థులకు పంచుతున్నాడు..దీనికి ఈ పత్రికలు ప్రాధాన్యత ఇవ్వవు..పిచ్చి ప్రేలాపనలు, విషబీజాలను మనమెదళ్లలో నాటే సీమాంధ్ర కుట్రపూరిత ద్రోహాన్ని అడ్డుకొందాం..కోదండరాం వెంట నిలబడదాం..తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుందాం..

దళిత నాయకులు విమర్శలకు అతీతులు కారు


జహీరాబాద్‌లో మొన్న జరిగిన ఒక విద్యార్థి జేయేసీ మీటింగులో మాట్లాడుతూ ప్రొ.కోదండరాం అక్కడి లోకల్ ఎమ్మెల్యే మరియు మంత్రిఐన గీతారెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీభాయి చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తుకుచేస్తూ అటువంటి వీరనారికి గీతారెడ్డి వంటి బిడ్డ ఉండటం దురదృష్టకరం అనే ధోరణిలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలా చీలికలు తీసుకురావాలా అని చూస్తున్న కొన్ని సీమాంధ్ర పత్రికలు వెంటనే కోదండరాం విమర్శను గోరంతలు కొండంతలుగా రాయడం, దళితసంఘాలు రంగంలోకి దిగి కోదండరాం దిష్టిబొమ్మను తగలబెట్టడం, కోదండరాంపై ఎస్సి,ఎస్టీ అట్రాషిటీ కేసు నమోదు కావడం అంతా స్క్రిప్టుప్రకారం చకచకా జరిగిపొయ్యాయి.
తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ ఉద్యమం చేయాలని జేయేసీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ నాడు నిర్ణయించింది. తదనుగుణంగానే సమావేశం జరిగిన జహీరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గీతారెడ్డిని విమర్శించడం జరిగింది. ఇదే సభ ఇంకో చోట జరిగితే అక్కడి ప్రజాప్రతినిధులపై విమర్శించడం జరిగేది.
మీడియా స్థాయిని రోజురోజుకూ దిగజారుస్తున్న వేమూరి రాధాక్రిష్ణ ఏబీఎన్ ఛానెల్ నిప్పురాజేసి, పెట్రోలు పోసి పెద్దది చేసి రెచ్చగొట్టుడు కధనాలు చూపించగా మంత్రి గీతారెడ్డి, దళిత సంఘాలు దీన్ని దళితులపై దాడిగా చిత్రించడం అత్యంత దారుణం. దళిత నాయకులు కావడం వలన ఎవరూ విమర్శలకు అతీతులు కారు. ఒక ఇష్యూపై దళితేతర నాయకులు ఎంతవరకూ విమర్శలకు గురవుతారో దళిత నాయకులు కూడా అంతే.
తాను మంత్రిగా ఉన్నప్పుడూ ఏనాడూ దళిత క్షేమం పట్టని గీతా”రెడ్డి”కి, భర్త దగ్గరనుండి అరువు తెచ్చుకున్న తోకను పేరుకు తగిలించుకుని దళిత ఐడెంటిటీని పేరులోనే తొలగించుకున్న గీతా”రెడ్డి”కి ఒక్కసారిగా తాను దళిత మహిళనన్న విషయం గుర్తొచ్చింది. అనునిత్యం పీడిత, తాడిత ప్రజల పక్షాన్ ఉంతూ తన పేరు నుంచి రెండు దశాబ్దాల క్రితమే “రెడ్డి”ని తొలగించుకున్న కోదండరాం మాటలను, అరువుతెచ్చుకున్న “రెడ్డి”తోక తగిలించుకున్న మంత్రి “అగ్రకుల దాడి”గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించడం నీచం, దిగజారుడుతనం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయంగా, ఆర్ధికంగా పోరాటం చెయ్యలేని బీదాబిక్కి దళితులకు అండగా ఉండాలి, అంటెకానీ చట్టం తన చేతిలో ఉన్న మంత్రులకు అండగా కాదు. దళిత సంఘాలు తమ కమ్యూనిటీలో వివక్షకు గురవుతున్న, అగ్రకుల దాడులకు గురవుతున్న బలహీన వర్గాలకు మద్దతుగా పోరాటాలు చెయ్యాలి, మంత్రుల వ్యక్తిగత రాజకీయాలకు మీ మద్దతు అవసరం లేదు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత యువకులపై కేసులుపెట్టి జైళ్ళొ పెట్టినప్పుడు గానీ, దళిత యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడుగానీ స్పందించని మంత్రిణి గూర్చి దళితసంఘాలు గోలపెట్టడం అనవసరం. ఇలాంటి చర్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాషిటీ యాక్టును దుర్వినియోగం చెయ్యడంతో బాటు సామాన్య ప్రజానీకానికి ఈ ఆక్టు గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
చివరగా ఉద్యమంలో చిచ్చుపెట్టి నాయకత్వాన్ని విడదీయాలని చూస్తున్న సీమాంధ్ర పత్రికలను, ఛానెళ్ళనూ తెలంగాణనుండి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది. లేకుంటే వాళ్లు ఇటువంటి కుట్రలకు తెగబదుతూనే ఉంటారు.

Thursday 1 November 2012

సినిమాల్లో బ్రాహ్మణులపై కామెడీలెందుకు?



గతవారం విదుదలయిన సినిమా "దేనికైనా రెడీ" బ్రాహ్మణులను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలవలన వివాదాలకు గురయింది. బ్రాహ్మణులపై, అర్చకులపై సినిమాల్లో సెటైర్లు కొత్తకాదు గానీ ఇందులోకాస్త శృతిమించడంతో బ్రాహ్మణవర్గానికి బాధ కలిగించింది. అసలింతకూ సినిమాల్లో బ్రాహ్మణవర్గాన్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? మోహన్‌బాబు, పెద్ద ఎన్‌టీఆర్, చిన్న ఎన్‌టీఆర్ సినిమాల్లో, పరుచూరి బ్రదర్స్ కధ, మాటలు రాసిన సినిమాల్లో ఇవి ఎందుకు శృతి మించుతున్నాయి? కమ్మసామాజికవర్గానికి చెందినవారిదగ్గరినుండి ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి?

మొదట్లో  కమ్మసామాజికవర్గం భూమి, డబ్బూ కలిగి ఉన్నప్పటికీ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎక్కువగా రాణించలేదు. ఈరంగాల్లో విద్యాధికులయిన బ్రాహ్మణుల ఆధిపత్యం నడిచేది. అయితే 1920 దగ్గర్లో ఏర్పడ్డ "కమ్మ మహాజనసభ" తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం ఒక ఫార్ములా తయారుచేసింది. ఇంది రెండంచెల ఫార్ములా: తమకంటే  ముందున్న బ్రాహ్మణుల ఆధిపత్యానికి గండి కొట్టాలి. దానికోసం తమ పిల్లలను అన్ని రంగాల్లో చదివించడమే కాకుండా అవసరమయితే బ్రాహ్మణులను కిందకి లాగి దెబ్బకొట్టాలి. తమకంటే తక్కువలో ఉన్న దళితబహుజన వర్గాలను అణగదొక్కాలి, అవసరమయితే కత్తులు వాడాలి.

ఈ రెండంచల పధకంలో  రెండవదాని ఫలితం కారంచేడు, పదిరికుప్పం తరహా దాడులు. మొదటిదాని ఫలితం మెడికల్, ఇంజినీరింగ్, రాజకీయ, సాహిత్య, సినిమా, మీడియా రంగాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడం, బ్రాహ్మణుల పొట్టగొట్టడంకోసం కమ్మలే పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులను ఎగతాళి చేస్తూ సినిమాలు తీయడం.

ఈఫార్ములా ఆధారంగానే సినిమాల్లో ఎడాపెడా బ్రాహ్మణులపై సెటైర్లు వేయడం, సినిమాల్లో కమ్మ జమీందారీ వర్గాన్ని గ్లోరిఫై చేయడం, అక్కడి భాష, వీరి జమీందారీ అలవాట్లను ఎలివేట్ చేయడం, దానికోసం పక్కప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తెలంగాణ యాసలను, అక్కడి అలవాట్లను, అక్కడి ప్రజలను కించపరిచినట్లు సినిమాలు తీయడం.

ఈకమ్మ భావజాళ వ్యాప్తికి కమ్మ ఐకన్ త్రిపురనేని రామస్వామి చౌధరి ఎక్కువ ప్రచారం చేశాడు. ఆభావజాళవ్యాప్తి ఫలితమే ఎన్‌టీఆర్ అధికారంలోకి రావడం. ఈయన రుణం తీర్చుకునేందుకు ఎన్‌టీఆర్ త్రిపురనేని విగ్రహాన్ని ట్యాంకుబండుపై పెట్టాలనుకున్నాడట, అయితే ఒక్కడిదే పెడితే బాగుండదని తెలుగు వైతాళికులని కొందరి ఎంపిక చేసి విగ్రహాలు పెట్టి అందులో త్రిపురనేనిది కూడా కలిపేశాడు. ఆ విగ్రహాల్లో ఎక్కువ ఎన్‌టీఆర్ మొహంతోనే ఉంటాయనేది మరో విషయం.

కమ్మ మహాజనసభ భావజాళవ్యాప్తి ఫలితంగా ఇప్పుడు కమ్మలు సినిమా, మీడియా, పారిశ్రామిక, రాజకీయరంగాలలో సమైక్యాంధ్రలో ఆధిపత్యం వహిస్తున్నారు. వీటిద్వారా రాజకీయరంగంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్నారు. వీరు అన్నిపార్టీలలో చేరి ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తమదగ్గర అధికారం ఉండేలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణను అడ్డుకుంటుంది కూడా ఈశక్తులే. కారణం విడిపోతే అటు సీమాంధ్రాలోనూ, ఇటు తెలంగాణాలోనూ అధికారం తమకు దక్కదనే వీరి భయం.

ఆర్ధిక, రాజకీయరంగాల్లో వెనుకబడి అగ్రకుల బలహీనవర్గంలా తయారయిన బ్రాహ్మణులు ఇలా సినిమాల్లో హేళనకు గురవుతుంటే ఇప్పుడేం చేయాలి? ఇప్పటికైనా తాము ఏదో ప్రత్యేకవర్గం, హిందూ సమాజానికి తాము మెలు చేస్తున్నాం, తమమీద దాడులు మొత్తం హిందూ సమాజం మీద దాడి లాంటి భ్రమలను వదలాలి. వీళ్ళు అందరిలా ఒక సామాజిక వర్గం, దళిత బహుజనుల్లా ఇప్పుడు వీరు కూడా వివక్షకు గురవుతున్నారనే సత్యాన్ని గ్రహించాలి. తమను కించపరుస్తున్న వారిపై సంఘటితంగా పోరాడాలి, దానికోసం తమశక్తి సరిపోకపోతే దళిత బహుజన వర్గాలను కలుపుకుపోవాలి.