Monday 25 November 2013

చిత్తం రామునిపై భక్తి పోలవరంపై


"చిత్తం శివునిపైన భక్తి చెప్పులపైన" అనేది పాత సామెత. "చిత్తం రాముడిపైన భక్తి పోలవరం డ్యాముపైన" అనేది నేడు సీమాంధ్ర నేతలకు సరిగ్గా అతికే సామెత.

భద్రాచలం డివిజన్ మాకే దక్కాలి అనే వాదించే సీమాంధ్ర నేతలు చెప్పే కారణం "భద్రాచలం తెలంగాణలో ఉంటే పోలవరంకు అడ్డంకులొస్తాయి" అని. నిజానికి పోలవరం రిజర్వాయరు ప్రస్తుత డిజైన్ ప్రకారం భద్రాచలం డివిజన్లో సగం మునిగిపోతుంది. అందమైన పాపికొండలు కనుమరుగవుతాయి. విలువైన ఆటవీ ప్రాంతం, వన్యప్రాణులు, ఖనిజ సంపద మునిగిపోతాయి. వీటన్నిటితో పాటు రాజమ్నడ్రి లాంటి ఒకపెద్ద నగరం ఆడ్యాము కింద ఉండడం అతిపెద్ద రిస్క్.భూకంపం సంభవిస్తే రాజమండ్రి క్షణాల్లో తుడిచిపెట్టుకోగలదు. అయినా సీమాంధ్ర నేతలు తమ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం పోలవరంపై పట్టుబట్టారు.

ఇప్పుడు భద్రాచలం డివిజన్ తెలంగాణకొస్తే రిజర్వాయరులో ఆటవీప్రాంతం ముంపుకు వ్యతిరేకంగా అక్కది ప్రజలు ఉద్యమిస్తారు, కోర్టులకెలతారు. అదే తమ సొంత రాష్ట్రంలో ఉంటే నయానో భయానో ఒప్పించవచ్చు. ఇదీ సీమాంధ్ర నేతల ఉపాయం.

 మీరు మాతో కలవండి, మేము మిమ్మల్ని నీటిలొ ముంచుతాం అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే భద్రాచలం ప్రజలు మేము తెలంగాణతోనె ఉంటామని తెగేసి చెబుతున్నారు, ఉద్యమిస్తున్నారు. 

రాష్ట్రం విడిపోతే నీటిపోరాటాలొస్తాయి అనే కిరణ్‌రెడ్డి కలిసుంటే నీటిపోరాటాలు ఎందుకు రావో చెప్పడు. కలిసున్నా ఇప్పుడూ నీటికోసం ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి కానీ వాతిని నిరంకుసంగా అణచివేయొచ్చు విడిపోతే అణచివేత సాధ్యం కాదనేది అతని మాతల మర్మం.

అలాగే మునగాల పరగణా గురించి కూడా. నాగర్జునసాగర్ ఎడమకాలువ పారే అతికొద్ది తెలంగాణా ప్రాంతంలో ఒకటి మునగాల పరగణా. అందుకే మునగాలపై ప్రేమ. 

Monday 18 November 2013

అందరూ అంబేద్కరులే!



ఎక్కువగా మాట్లాడని జైపాల్‌రెడ్డి మాట్లాడితే అవతలివారికి దిమ్మతిరుగుతుందని నిన్న చేసిన ప్రసంగంతో నిరూపించాడు. చంద్రబాబు, జగన్, జేపీ, ఉండవల్లి, అశోక్‌బాబు తేడా లేకుండా సీమాంధ్ర నాయకులంతా ఆర్టికల్ మూదును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు, అక్కడికి వీరికి రాజ్యాంగనిర్మాతలకంటే ఎక్కువ తెలిసినట్లు. మందిని మోసం జేయడం, దొరికితే జైలుకెల్లడం జేసే ఈదగుల్బాజీ నాయకులకు రాజ్యాంగం మార్చాలని చెప్పేంత సీనుందా? అందుకే అందరూ అంబేద్కరులైతే తట్టుకోవడం కష్టమని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలు ఆర్టికల్ మూడు రాష్ట్రాల పునర్విభజన అధికారాన్ని కేంద్రానికి ఇచ్చిందే ఇలాంటి పరిస్థితి వస్తుందని. రాజ్యాంగ నిర్మాతలు అరవై ఏళ్ళకిందనే ఊహుంచినదాన్ని ఇప్పుడు మన సీమాంధ్ర నేతలు నిరూపిస్తున్నారు. పైగా తమ పెత్తనం కొనసాగడంకోసం రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర నాయకుల లాభాలకోసం అవసరమైతే ఈసమైక్యాంధ్ర రాష్ట్రంలో ఫైల్లు మారుతాయి కానీ రాజ్యాంగం మారదని ఈమట్టిబుర్రలకు తెలీదులాగుంది. అలా మార్చగలిగితే ఇంకేముంది, అక్రమ ఆస్తుల కెసులనుండి జగన్ను బయటికి తేవడానికి చట్టాలనే మారిస్తే సరిపాయె.

ఆర్టిక 3 ఈ అధికారం కేంద్రానికి ఇచ్చిఉండకపోతే మద్రాసు నుండి ఆంధ్ర విడిపోగలిగేదే కాదు. సీమాంధ్ర నాయకులు చెప్పినట్టు ఆర్టికల్ 3ను సవరిస్తే భవిస్యత్తులో ఏరాష్ట్రంలోనైనా మెజారిటీవర్గం మైనారిటీ వర్గాన్ని వివక్షకు గురిచ్_ఎస్తుంటే మైనారిటీ విడిపోయేహక్కును కోల్పోతుంది. ఇలాంటి డిమాండ్‌ను  సీమాంధ్ర నాయకులు చేస్తే అది ఎలాగూ ఎవరూ ఒప్పుకోరుగానీ సీమాంధ్ర పరువు మాత్రం దేశం మొత్తంలో మంటకలుస్తుంది. సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని దోషులుగా జేస్తుంది మీనాయకులే.

నిజాయితీ లోపించిన మేధావితత్వం


"చెడ్డవారి దుర్మార్గం కంటే కూడా మంచివారి మౌనం వల్ల ఈసమాజానికి ఎక్కువ నష్టం". ఇది మన ప్రియతమ లోక్‌సత్తా అధినేత తరుచుగా వినిపించే సూక్తి. ఈజేపీ తెలుసుకోవాల్సిందేమిటంటే  చెడ్డవారి దుర్మార్గం, మంచివారి మౌనం కంటేకూడా మేధావివర్గం పక్షపాత ధోరణివలన సమాజానికి ఎక్కువ నష్టం. జేపీ మేధావి అన్నది ఎంత నిజమో తెలియదు కానీ ఇతను ప్రాంతీయ, కుల పక్షపాతాలకు ఏమాత్రం అతీతుడు కాదు, పైపెచ్చు ఈపిచ్చి కొంచెం మోతాదుకు మించే ఉన్నది అని మెల్లిగా అందరికీ తెలిసొచ్చింది.

రెండువేల తొమ్మిది డిసెంబరు తరువాత ఈరాష్ట్రమంతా విభజన అంశంపై విడిపోయి ఉడికిపోతున్నవేల పార్టీ ఫండ్శ్ కోసం అమెరికా వెల్లిన జేపీని అక్కడి తెలంగాణవాదులు రాష్ట్రవిభజన అంశంపై మీవైఖరి ఏంటి అని నిలదీస్తే ఇతనిచ్చిన సమాధానం అదిప్పుడు ప్రయారిటీ కాదు అని. ఆతరువాత సంవత్సరం  తిరిగినాక  ఇదే జేపీ ఇంత ముఖ్యమైన విషయంపై రాష్ట్రం ఉడికిపోతుంటే కేంద్రం ఎన్ని రోజులు సమస్యను నాంచుతుంది, వెంటనే తేల్చాలి అని స్టేట్మెంటు ఇచ్చాడు.. కాకపోతే "అందరికీ ఆమోదయోగ్యమైన సామరస్యపూరిత పరిష్కారం" కావాలంటూ ఒక క్లాజు తగిలించాడు, అదెలాగూ సాధ్యం కాదని తెలిసినోడు కాబట్టి.

రాష్ట్రవిభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నతరువాత ఈమధ్యన టీవీషోల్లో బుజీగా కనిపిస్తూ ఇదేం చిన్నపిల్లల ఆటనా, కేంద్రంలో అందరూ పనికిమాలిన వెధవలు అంటూ అందరినీ తిడుతూ తానొక్కడే పెద్దమేధావి తనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు అన్నట్టు ఫోజు పెడుతూ కేంద్రం విభజన వ్యవహారంపై రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని భారీ డైలాగులు వినిపిస్తున్నడు. పోనీ ఎలా విభజిస్తే బాగుంటుందో కాస్త మీరు చెప్పండి అంటే అమ్మో నేనేదైనా చెబితే మల్లీ నన్నంటారు అంటూ వెంటనే తప్పించుకున్నాడు.

ఎక్కడా కనపడని సమైక్య ఉద్యమాన్ని పెద్దది చేస్తూ వందరోజులుగా రోడ్లపైకి జనం వస్తుంటే ఈకేంద్రానికి పట్టదా అని ప్రశ్నిస్తాడు. నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాలతో ఉడికిపోతుంటే మాత్రం రాష్ట్రాన్ని ఉద్యమాలపేరుతో తగలబెడుతున్నారు అంటూ మొసలి కన్నీరు కార్చేవాడు. ఈసమస్యను తేల్చాల్సింది కేంద్రం కాదు, రాష్ట్ర అసెంబ్లీయే తెల్చాలి అంటూ పైగా అదే రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతున్నాడు. దోచుకునెవాన్ని దోచుకోబడేవాడు వెళ్ళి అయ్యా మీరే నాసమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే చెబుతాడా? ఆ సంగతి తెలిసే రాష్టృఅ విభజనపై అధికారాన్ని రాజ్యాంగనిర్మాతలు కేంద్రానికి కట్టబెట్టారని ఈయనకు తెలియదా? 

ఒస్మానియా విద్యార్థులను అమానుషంగా కొట్టిన పోలీసులను మానవ హక్కుల ఉల్లంఘనకింద కోర్టులే అక్షేపించినా ఆవిషయంపై నోకామెంట్ అంటూ తప్పించుకున్న జేపీకి అరెస్టులూ బైండోవర్ కేసులతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపినపుడు నోరుమెదపని జేపీకి ఇప్పుడు సీమాంధ్రలో మీడియాలో తప్ప ఇంకెక్కడా కనపడని ఉద్యమం గురించి ఆక్రోషం ముంచుకొస్తుంది. ఇలాంటి పక్షపాత బుద్దులవల్ల ఈసమాజానికి మేలు జరగదు గానీ కీడు మాత్రం బోలెడు. తిన్నింటివాసాలు లెక్కబెట్టే ఇలాంటి కుహనా మేధావులను తెలంగాణనుండి తరిమేసే రోజులు ఎంతోదూరంలో లీవు, ఎన్నికలకు ఇంకా ఉంది ఆరు నెలలే. 


Wednesday 13 November 2013

గొంతెమ్మ కోరికలు


కిరణ్‌రెడ్డి నేతృత్వంలోని సీమాంధ్ర సర్కారు మంత్రుల బృందానికి తమ కోరికలు తెలుపుతూ ఒక నివేదిక ఇచ్చిందంట. ఇంకా విభజన జరగలేదు గనుక ఇది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నివేదిక కావాలి. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రులూ, ప్రబుత్వాలూ ఉమ్మడి రాష్ట్రానికి ప్రభుత్వాల్లా వ్యవహరించలేదు, కేవలం తెలంగాణపై పెత్తనం చేస్తూ సీమాంధ్ర ప్రయోజనాలకోసం మాత్రమే పని చేశాయి కాబట్టి సీమాంధ్ర ప్రభుత్వం అనాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాకుండా నిస్సిగ్గుగా తమది సీమాంధ్ర ప్రభుత్వం అని తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించారు. ఇందులో కొన్ని మచ్చు తునకలు:

లక్ష ఎకరాలలో సీమాంధ్ర రాజధాని:

లక్ష ఎకరాల్లో ఐదు లక్షల బడ్జెట్‌తో సీమాంధ్రకు రాజధానిని ఏర్పాటు చేయాలంట. ప్రస్తుతం జీహెచ్ఎంసీ  పరిధి లక్షన్నర ఎకరాలు. కనీసం దానిలో మూడింట రెండు వంతులు ఉంటే గానీ తమ రాజధానికి సరిపోదంట. ఈ లక్ష ఎకరాలు అంతా కొత్తగా కావాలంట.  అంటే ఇప్పటికే ఉన్న విశాఖ, విజయవాడ లాంటి నగరాలను అభివృద్ధి చేస్తే అవి లక్ష ఎకరాల నగరాలయినా అలాగొద్దట, పూర్తిగా లక్ష ఎకరాల కొత్త భూమి కావాలంట. దానికోసం అభయారణ్యాలను డీనోటిఫై చేసి చెట్లు కొట్టేసి రాజధానిని ఏర్పాటు చేయాలంట. 

ఒక రాజధానికోసం లక్ష ఎకరాల అడవి కొట్టేయడం ఎందుకు, ఇప్పటికే ఉన్న నగరాలపక్కన స్థలాన్ని తీసుకుని అవసరమయిన బిల్దింగులు కట్టడానికి ఎంత స్థలం కావాలి అని సామాన్యుడికి అనుమానం రావొచ్చు. మరి ఇప్పుడున్న సీమాంధ్ర నగరాలచుట్టూ ప్రైవేటు భూములుంటాయి. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ప్రైవేటు వ్యక్తులు తమ భూములు అమ్ముకుని లాభపడతారు, నేతలకు కబ్జాలు చేయడానికి కుదరదు గదా? అదే లక్ష ఎకరాల కొత్త ఆటవీ భూమిని డీనోటిఫై చేసి రాజధాని ఏర్పాటు చేస్తే అందులో మూడొంతులు ఈనేతలు కబ్జా పెట్టొచ్చు గదా. అంత స్థలం కబ్జా చేస్తే గానీ హైదరాబాదు వదులుకున్న ఈనేతల భూదాహం తీరదు. 

హైదరాబాదు భూముల పంపిణీ తిరగదోడొద్దు:

కొత్త రాజధానిలో తమ కబ్జాలకోసం లక్ష ఎకరాలు ఇవ్వడంతోపాటు ఇప్పటిదాకా తాము హైదరాబాదు చుట్టుపక్కల చేసిన కబ్జాలపై సీమాంధ్ర నేతలకు రక్షణ కావాలంట. అందుకోసం హైదరాబాద్ భూముల పంపినీ వ్యవహారాలను తిరగదోడొద్దనేది వీరి మరో విచిత్రమయిన కోరిక.

భద్రాచలం డివిజన్ సీమాంధ్రకివ్వలట:

భద్రాచలం డివిజన్ను  విభజన తరువాత సీమాంధ్ర కిచ్చేయాలట. దీనికి వీరిచ్చే రీజన్: పోలవరం కడితే భద్రాచలం డివిజన్ ముంపుకు గురవుతుంది. కాబట్టి మాకిస్తే ఇబ్బంది ఉండదు, డివిజన్ మొత్తాన్ని ముంచేసి అక్కడి ప్రజలను తరిమి కొడతాం. అక్కడి ప్రజలేం కోరుకుంటే మాకేంతి మా అవసరాలె మాకు ముఖ్యం, మాదగ్గర ఆదివిజన్ ఉంటే అక్కడి ప్రజలను బలిపశువులు చేయొచ్చు లెకపోతే కుదరదనేది వీరి విచిత్ర వాదన.

ఉద్యోగులు కోరుకుంటే తెలంగాణలో ఉండనివ్వాలి:

తెలంగాణలో ఎందరో సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రికమెండేషన్ ప్రకారం వీరు తెలంగాణలో ఉండాలని కోరుకుంటే వీరికోసం ఖాళీలు లేకున్నా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇక్కడే ఉండనివ్వాలంట. అంటే విభజన జరిగిన తమ అన్యాయం అలాగే కొనసాగాలంట. 

సింగరేణిలో యాభైఎనిమిది శాతం వాటా కావాలంట:

తెలంగాణ నడిబొడ్డున ఉన్న సింగరేణి కాలరీస్‌ను విభజన అనంతరం సీమాంధ్రకు జనాభా ప్రాతిపాదికన యాభై ఎనిమిది శాతం వాటా ఇవ్వాలంట. విశాఖ ఉక్కులో,పోర్టులో, బెరైటీస్ గనుల్లో మాత్రం తెలంగాణకు వాటా ఉండదు.
  
ఆకాశరాముడు సెలవిచ్చినట్టు దురాశ దఃఖమునకు చేటు తెస్తే సంతోషానికి మంచిదే కానీ ఇది మాత్రం నిజంగా సీమాంధ్ర ప్రభుత్వపు  "దురాశ దుఃఖము, చేటు" తెస్తుంది. 

Monday 11 November 2013

యూటీతో లూటీ కొనసాగింపు

ఇన్నాళ్ళూ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు చెప్పిన పలువురు సీమాంధ్ర నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రులు చిరంజీవి, పురుందరేష్వరి ఇప్పుడు యూతీ రాగాన్ని ఎత్తుకున్న వారిలో ప్రముఖులు.

నిజానికి సీమాంధ్ర ప్రజలపై వీరికేమన్నా చిత్తశుద్ది ఉంటే విభజన అనివార్యమైన స్థితిలో సీమాంధ్ర ప్రజల హక్కులకోసం పోరాడాలి. రాజధానికోసం ప్యాకేజీనో నీటికేటాయింపులకోసమో పోరాడీతే సీమాంధ్ర ప్రజలకు బాగుండేది. కానీ వీరు ఇదేదీ అడక్కుండా హైదరాబాదును మాత్రం యూటీ చేయాలని ఎందుకంటున్నారు? యూటీ చేస్తే ఎవరికి లాభం?

హైదరాబాదును యూటీ చేస్తే హైదరాబాద్ ఆదాయం కేంద్రానికి వెల్తుంది. దీనివలన తెలంగాణకు గానీ, సీమాంధ్రకు గానీ లాభం ఉండదు. హైదరాబాద్ యూనివర్సిటీలలో తెలంగాణ వారికి గానీ, ఆంధ్రా వారికి గానీ ప్రవేశం ఉండదు. మరలాంటప్పుడు హైదరాబాద్ యూటీ చేస్తే సీమాంధ్రకేం ఒరుగుతుంది?

అయితే సీమాంధ్ర నేతలకు కావల్సింది తమ సొంత ప్రయోజనాలూ, తమ ఆర్ధిక లాభాలూ తప్ప ప్రజల బాగు కాదు గదా. ఈనేతలందరికీ హైదరాబాదు చుట్టుపక్కల వేల ఎకరాల భూములు ఉన్నాయి. అన్నీ బినామీ పేర్లతో ఉన్న కబ్జా భూములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం తమ మీద కేసులు పెడుతుందో, కేంద్రపాలిత ప్రాంతమయితే కేంద్రం నుంచి చక్రం తిప్పవచ్చనేది వీరి ఆశగా కనిపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఈడిమాండు కేంద్ర మంత్రులదగ్గరినుండి వస్తుంది. అయితే రోజులు ఎప్పటికీ ఒక్కలా ఉండవు కదా? వీరిపిచ్చిగానీ, ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతమయినా రాబోయేది వీరి ప్రభుత్వమని ఏంటి గ్యారంటీ? 

Wednesday 6 November 2013

మంత్రుల బృందానికి నా నివేదిక

రాష్ట్ర విభజన వలన తలెత్తే సమస్యలు, వాతి పరిష్కారాల గూర్చి కేంద్ర మంత్రుల బృందానికి వారు ఇచ్చిన టరంస్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అందజ్*ఏసిన నా నివేదిక.


To
The Group of Ministers,
Govt of India.

Sub: Regarding the issues arising due to the division of states and solutions

Dear Sir,

Thanks for giving us this opportunity to share our feedback with the esteemed  Group of Ministers.

The decision to divide the state of AP albeit delayed is a correct decision, without which justice is impossible to people of Telangana. In the united state of Andhra Pradesh people of Telangana are marginalised by the majority Seemandhra and were denied their basic rights. Over decades injustice was done to people of Telangana in irrigation, Govt funds allocation, state appointed jobs among many others. Only a separate statehood can give justice to people of Telangana. As this is not appropriate forum to list the injustices happened to Telangana and justifications for division of state, I am not going into this part and limit my feedback only on the issues that may arise in the process of division.

My feedback about the terms of reference as given by GoM:

1.       Determine the boundaries of the new state of Telangana and the residuary state of Andhra Pradesh with reference to the electoral constituencies, judicial and statutory bodies, and other administrative units:

The current ten districts of Telangana namely Hyderabad, Ranga Reddy, Nalgonda, Medak, Mahaboob Nagar, Warangal, Khammam, Karim Nagar, Nizamabad, Adilabad should be wholly with Telangana state. All the parliament and Assembly constituencies in these ten districts will then be part of Telangana state.

Rest of the 14 districs of Seemandhra region should be part of residuary Andhra Pradesh state.

Some may argue that Bhadrachalam  revinue division in the district of Khammam which was previously part of Andhra state before the merger of Andhra state with Telangana should be given back to Andhra. However the people in Bhdrachalam are culturally closer to Telangana region and they wish to be part of Telangana state post division. People of ten districts of Telangana also wish that Bhadrachalam revinue division should be with Telangana. As there is consent among people of both sides it is appropriate to make Bhadrachalam part of Telangana state.

Also historically Bhadrachalam was with Nizam state for long time and ceded to British Govt much later than the districts of Seemandhra.

2.      Look into the legal and administrative measures required to ensure that both the state governments can function efficiently from Hyderabad as the common capital for 10 years

In these days with advanced systems we do not need 10 years for building a new capital. Hyderabad as combined capital for such long time can make unnecessary friction between both states post division. Also residuary Andhra Pradesh state functioning can be impaired when their administration is happening away from their main land.

Residuary Andhra Pradesh state should be given grant for constructing necessary buildings such as secretariat, Assembly, High Court, quarters for state ministers, quarters for legislators etc. in their chosen city. Two to three years are sufficient for constructing all the necessary infrastructure.

Common capital period should be reduced to five years from 10 years. This five years time period is important and mainly required for the employees belonging to residuary Andhra Pradesh state to make up their mind whether to move to the new capital or take retirement and remain in Hyderabad city rather than for constructing capital city.

In the period of common capital, the right on administration of Hyderabad should naturally be with Telangana state. However a small area of the city that holds the administrative buildings of residuary Andhra Pradesh state post division can be identified and its administration limited to law and order only can be kept with Union Govt. However this area should be within the boundaries of MCH (not the current GHMC) and be restricted to below 80 square kilometres. This measure is required for the efficient functioning two state Governments from the same city with Hyderabad as common capital.

3.      Take into account the legal, financial and administrative measures that may be required for transition to a new capital of the residuary State of Andhra Pradesh

As suggested in the earlier point a small portion of Hyderabad within MCH limits can be identified and its law and order administration should be kept with Govt. of India. Legal rights on the same region should be with Telangana state.

As income from state departments is accounted at capital city currently the income of Hyderabad appears much higher than its actual share. However post division income of both states will be accounted separately and then Hyderabad income won’t be as big as it appears now.

Many of the companies owned by Seemandhra businessmen have their registered offices located at Hyderabad. This might do some injustice to residuary Andhra Pradesh state post division as the VAT collected from these offices will be accounted into Telangana state. For this reason post division companies should be given option to move their registered offices to Seemandhra region. Residuary Andhra Pradesh Govt can declare Tax holidays to promote their business men to move their registered offices into Seemandhra.


4.      Look into the special needs of the backward regions and districts of both the states and recommend measures.

There are backward districts in both sides. As per the rural development board’s statistics eight out of ten districts in Telangana, three districs of Seemandhra are underdeveloped in human development index. All these districts should be given special packages for their economic developments.

Rural development in India depends a great deal on Agriculture and agriculture is entirely dependent on water resource. These under developed districts should be fed with irrigation by constructing small and medium irrigation projects. Both states should be given funds for development of irrigation. Gram panchayats should be given funds for constructing check dams for improving irrigation.

Hand crafts, cottage industries, agro industries should be encouraged in these regions with NABARD schemes and empowering people with necessary education in these areas.

5.       Look into issues relating to law and order, safety and security of all residents and ensure peace and harmony in all regions and districts consequent to the formation of the state of Telangana and the residuary state of Andhra Pradesh, and the long term internal security implications arising out of the move and make suitable recommendations;

Hyderabad city is from the beginning of its birth being cosmopolitan with people from several cultures ranging from Gujaratis, Marathis, Kannadigas, Parsis, Punjabis, Marwadis coexisting with locals here and living with harmony. Over few decades lakhs of people from Seemandhra region have made Hyderabad as their home and coexisting with natives.

Apart from Hyderabad in the rest of Telangana also scores of Biharis, Marwadis, people from Seemandhra region live together with natives in harmony. Telanganaites have always been cordial and receptive to people of other cultures. It clearly shows that post division there will not be any issues of safety for minority cultural groups: either Marwadis, Biharis or Seemandhra settlers. Any special action taking regarding issue of safety of Seemandhra settlers living in Hyderabad is insulting Telangana administration and must be avoided.

In Seemandhra region there were some sporadic incidents of law and order for people of Telangana residing in that region after the announcement of  decision to divide the state. However there are very few Telangana people living in Seemandhra region and the incidents were minor. We hope over time things get better. There is no need to take any special actions regarding the safety of Telangana people living in Seemandhra region.


6.      Look into the sharing of river water, irrigation resources and other natural resources (especially coal, water, oil and gas) between the two states and also inter-se with other states, including the declaration of Polavaram Irrigation Project as a National Project

Final judgment of Brijesh Committee regarding Krishna Water sharing must be deferred until the completion of division process. Telangana state must be given its right to present its case before Brijesh Committee.

Special boards with members from Telangana and residuary Andhra Pradesh states should be formed to oversee Godawari and Krishna Water.

Under Krishna river depending on flood flow water several projects were built in Seemandhra region. However currently these projects are getting water allocation at the cost of not constructing projects with net allocation in Telangana region. Post division flood flow projects must be restricted to utilizing water from flood flow period and projects in Telangana with net water allocation such as SLBC that are in pending for long periods must be completed as priority.

Proposed Polavaram project on Godawari river submerges lakhs of acres of forest land in Bhadrachalam division. Polavaram project must be redesigned to ensure minimal submergence.

Coal Mines in Northern Telangana(Singareni collories) will naturally belong to Telangana state post division. However there are few power plants in Seemandhra region that depend on these coal mines and must be taken care post division. Hence agreement should be made for the supply of coal at reasonable prices for these Seemandhra projects post division. Likewise Telangana power projects that depend on gas from KG Basin should get gas allocation agreement.


7.       Look into issues related to power generation, transmission and distribution between the two states;

In the united Andhra Pradesh Telangana region suffered organized discrimination in several fronts. Discrimination in installation of power plants is one major thing among others. Due to this discrimination it has happened so that Telangana region though the biggest consumer and main source for coal mines does not have enough power plants. Because of this it is evident that Telangana region will get power shortage post division.

Agreements must be made such that Seemandhra excess power will be utilized in Telangana until  Telangana state becomes self-sufficient in Power Generation.


8.      Look into the issues arising on account of distribution of assets, public finance, public corporations and liabilities thereof between the two states;

-          All the movable and immovable properties that were originally with Telangana (Hyderabad state) prior to 1956 (before merger) shall naturally belong to Telangana.
-          AP Bhavan in New Delhi was compensation to Hyderabad Bhavan which was taken over by Union Govt. Hence AP Bhavan shall be with Telangana state post merger.
-          Properties of APSRTC are divided as per the region where they exist.
-          All the debts should be divded between states as per the project for which the debt was taken.


9.      Look into the issues relating to the distribution of the employees in the subordinate as well as All India Services between the two states;

Service records of all the state Govt employees should be checked thoroughly and divided between states post division as per their nativity.


10.   Look into the issues arising out of the Presidential Order issued under Article 371D of the Constitution consequent to the bifurcation and examine any other matter that may arise on account of bifurcation of the state of Andhra Pradesh and make suitable recommendations.

Article 371D wa formed because of the issues arised due to Mulki rules implementation and it is applicable only in the united Andhra Pradesh. Post division it will not be applicable to Telangana state. However for better division of employment among all districts in Telangana similar arrangement should be made in Telangana state with dividing Telangana state into four zones.

Thanks for giving me such an opportunity to express my views.


Best regards

Monday 4 November 2013

తప్పించుకు తిరుగువాడె సీమాంధ్ర నేత సుమీ!

రాష్ట్రవిభజనపై మీ వైఖరి ఏమిటో చెప్పండి అన్న ప్రశ్నకు ఇన్నాళ్ళూ టీడీపీ, వైకాప, కాంగ్రేస్, లోక్‌సత్తా అనే తేడా లేకుండా అందరూ రకరకాలుగా సమాధానం దాటవేసి నెట్టుకొచ్చారు. ఒకరు ఇది కేంద్రప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఆపేశక్తి మాకు లేదు అంటే ఇంకొకలు నేను వ్యతిరేకం గాదు, మరొకరు సామరస్య పరిష్కారం వెదకాలి అంటూ పదాలతో పదనిసలు చేశారు తప్ప సమాధానాలు చెప్పలేదు.

తీరా కేంద్ర నిర్ణయం తీసుకున్న తరువాత మేమే ఎక్కువ గట్టిగా విభజనకు అడ్డుపడుతున్నమంటే మేమే నంటూ సమైక్యాంధ్ర ఛాంపియన్షిప్ కోసం ఈసీమాంధ్ర నేతలంతా పోటీలు పడుతున్నారు. అందరూ సమన్యాయం , సామరస్యపూరిత పరిష్కారం కావాలనేవారే, కానీ అదెలాగోమాత్రం ఎవరూ చెప్పరు.

చివరికి విభజిస్తే సీమాంధ్రకొచ్చే సమస్యలేంటొనయినా చెప్పండి వీలయితే పరిష్కరిస్తామంటూ కేంద్రం ఒక మంత్రుల కమిటీని వేస్తే దానికి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా ఈసీమాంధ్ర నేతలకు ధైర్యం చాలట్లేదు. ఇస్తే గిస్తే ఇక్కడ సీమాంధ్రలో వోట్లు పోతాయనో తెలంగాణలో వోట్లు పోతాయనో తప్ప ప్రజల సమస్యలనెలా కేంద్రానికి తీసుకెళ్ళాలి అని మాత్రం ఈ స్వార్ధ సీమాంధ్ర నాయకులకు పట్టదు.

ఎప్పుడూ తమ వోట్లు, తమ పదవులూ, తమ ఆస్థులూ, తమ కబ్జా భూములు, తమ ఆర్ధిక రాజకీయ అవసరాలు తప్ప ప్రజల క్షేమం పట్టని ఈ నేతలు ఇలా తప్పించుకు తిరుగుతూ ఇన్నాళ్ళూ తెలంగాణ ప్రజలను వంచిస్తే ఇప్పుడు తమ సొంత ప్రాంతమయిన సీమాంధ్ర ప్రజలనే వంచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలారా ఆలోచించండి.. ఈ దగుల్బాజీ నేతలు మీకవసరమా?