Monday 16 April 2012

ఇది ఫుడ్ ఫాసిజం!



ఉస్మానియాలో దళిత,బహుజన విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఏబీవీపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలూ ఘర్షణ పడగా పోలీసులు లాఠీచార్జీ, భాష్పవాయుప్రయోగం చేయాల్సివచ్చింది. గతసంవత్సరం కూడా దళిత విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ చేసినప్పుడు రైట్‌వింగ్ వారు అడ్డుకుని ఆహారంలో మూత్రవిసర్జన జరిపినట్లు సమాచారం. కాగా ఈసారి దలితులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ వారి ఫెస్టివల్ ఉద్రిక్తతుకు దారితీసింది.

దళితులు ఎద్దుమాంసం ఒక డెలికసీ. ఎద్దు, దున్నపోతు మాంసాలు వారు ఇష్టంగా తింటారు. వందల సంవత్సరాలనుంచీ ఇతర సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్టు బతుకు కొనసాగించిన దలితులు ఊర్లో ఎవరింట్లోనైనా గొడ్లు చనిపోతే వాటిని తీసుకెల్లి కోసి మాంసం తిని చర్మంతో చెప్పులు తయారుచేసేవారు. మున్సిపాలిటీ లాంటి వ్యవస్థలు లేని ఆకాలంలో వీరు చచ్చిన గొడ్లను తీసుకెల్లి మిగతా సమాజానికి చచ్చిన గొడ్లు కుల్లిపొయి వ్యాధులు వ్యాపించకుండా సేవ చేశారు. ఇప్పుడు వారు గొడ్డుమాంసం తినడం ద్వారా తమ మనోభిప్రాయాలు దెబ్బతింటున్నాయని రైట్ వింగ్ అభిప్రాయం. ఈమొత్తం పరిణామం అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

గొడ్డు మాంసం తినడాన్ని అడ్డుకుంటున్న వారిలో అనేకులు గొర్రె, మేక మాంసం తినేవారే. రేపెవరయినా వచ్చి గొర్రె, మేక వారికి తల్లి లాంటివి, దేవతలతో సమానం కనుక ఎవరయినా వాటి మాంసం తింటే తమ మనోభిప్రాయాలు దెబ్బతింటాయి అని చెబితే ఎంతమంది  తినడం మానేస్తారు? ఇప్పుడు అడ్డుకున్న వారిలో అనేకులు రేప్పొద్దున విదేశాలకెల్తారు. అక్కడ ఆఫీసు క్యాంటీనులో తమపక్కనే కూర్చొని తెల్లొల్లు గొడ్డుమాంసం తింటుంటే వీల్లమనోభావాలు దెబ్బ తినవా? దెబ్బతింటే తెల్లొల్లకు గొడ్డుమాంసం తినొద్దని వీరు అడ్డు చెబుతారా?

అంటే గొడ్డుమాంసం తినే దళితులు తమకంటే తక్కువవారు కనుక వారి హక్కులకు భంగం కలిగించొచ్చు.ఏమయినా అంటే మామనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. తెల్లోడు మనకన్న బలవంతుడు, ఎక్కువమాట్లాడితే ఎగిరి తన్నుతాడు కనుక తెల్లోడు పక్కన కూర్చొని గొడ్డుమాంసం లాగిస్తున్నా నోర్మూసుకుని ఊర్కుంటారు. మేకని తింటే తమ మనోభావాలు దెబ్బతింటాయని ఎవరైనా చెబితే ముందు ఎదుటివారి బలం ఎంత అని చూసి, బలవంతుడయితే ఆపేస్తారు, బలహీనుడయితే పట్టించుకోరన్నమాట!!

అసలు దళితులు బీఫ్ ఫెస్టివల్లో తినేది, మన రాష్ట్రంలో దొరికేది ఆవు మాంసం కాదు, ఎద్దు, బర్రె, లేదా దున్నపోతు మాంసం. తినేది ఆవు మాంసం కానేకానప్పుడు ఎవరి మనోభావాలు మాత్రం ఎందుకు గాయపడాలి? ఎద్దు మాంసంతో బూట్లు చేస్తే చక్కగా కొనుక్కుని తొడుక్కున్నప్పుడు ఎద్దుమాంసం తింటే మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? వీల్లనెవ్వరూ తినమనలేదే? పక్కవారు తింటూంటే ఎవరికి మాత్రం ఏం నష్టం? అసలు గొడ్డు మాంసం తినగూడదు, మేక, గొర్రెలను తినొచ్చని ఏమతగ్రంధం చెప్పింది?

అసలు నిజానికి హిందువులు గొడ్డుమాంసం తినకపోవడానికి మతంతో సంబంధం లేదు. వ్యవసాయ ప్రధానమయిన దేశంలో పశువులు సాధారనంగా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు పెంపుడు జంతువులలాంటివి. పెంపుడు జంతువులను తినడానికి మనసొప్పదు కనుక గొడ్డుమాంసం తినడం మానేశారు అనేది ఒక థీరీ కాగా పశుసంపద తగ్గిపోగూడదనే ఉద్దేషంతో గొడ్డుమాంసం తినడం మానేశారనేది మరొక వాదన. ఇప్పుడు కొత్తగా ఆరెస్సెస్ దీన్ని మతానికి లింకు పెట్టి తినొద్దని శాసిస్తే వేలసంవత్సరాలనుండి గొడ్డుమాంసాన్ని ఇష్టంగా తింటున్న దళితులు ఇప్పుడెందుకు మానెయ్యాలి?

బీజేపీ, ఆరెస్సెస్ల ఫాసిస్టు పోకడలవల్ల తెలంగాణలో ఎప్పుడో ఈపార్టీకి ప్రజలు పాతరేశారు. ఇప్పుడు తెలంగాణవాదంవల్ల మహబూబ్‌నగర్లో గెలిచిన బీజేపీ ఇది తమ సొంతబలమనుకుని మల్లీ ఫాసిస్టు పోకడలకు పోతే నష్టపోయేది వీరే. మతవిశ్వాసాలు, భొజనపు అలవాట్లూ మనుషుల వ్యక్తిగత విషయాలు, వీటిపై ఎవ్వరూ మరొకరిని శాసించలేరని బీజేపీ ఇకనయినా తెలుసుకుంటే మంచిది.




22 comments:

  1. చాలా బాగా రాసారు .
    మీ వాదన చాలా శాస్త్రీయంగా , మనవ విలువలతో కూడుకొని వుంది .
    నేను గొడ్డు మాంసం తినను .
    కానీ గొడ్డు మాంసం తినే వారి హక్కును సమర్ధిస్తాను .
    ఎవరి ఇష్టాలు వారివి .
    ఆహారపు అలవాట్లను ఎవరూ శాసిం చలేరు.
    బాపనోళ్ళు కోమ టో ళ్ళు ఈరోజుల్లో బాహాటంగా హోటళ్ళలో మతాన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తింటున్నారు.
    మద్యం తాగుతున్నారు. వాళ్ళని ఎవరూ ఆపడం లేదు కదా.
    బీద కులాలవాళ్ళు అంటే ఇంట చులకనా?
    తక్కు వకర్చుతో దొరికే పౌష్టిక ఆహారం తినే హక్కు వారికి లేదా ?
    అన్యాయం .
    ఈ మతోన్మాదులు హిట్లర్ పోకడల నడ్డి విరగ్గోట్టాల్సిందే !

    Yadagiri, Hyderabad

    ReplyDelete
    Replies
    1. @viswaroop and yadgiri please read this post
      http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/19/edit/19edit4&more=2012/apr/19/edit/editpagemain1&date=4/19/2012

      Delete
  2. For unknown reasons Telangana party is silent on the matter. Worried about losing support from one section or the other? :-) :-)

    ReplyDelete
  3. very well written. What's wrong even if they eat cow??....people need not justify that we are eating beef where cow is not part of it.

    ReplyDelete
  4. Tintanni evaru tappu pattaru, kani colleges lo e pani enti... ?

    ReplyDelete
    Replies
    1. వినోద్,

      కాలేజీలో కాదు, హాస్టల్లో.హాస్టల్లో మటన్, చికెన్ తినగా తప్పు లేనిది బీఫ్ తింటే తప్పు ఏమిటనేదే ఇక్కడ వారి ప్రశ్న. ఈ ఫెస్టివల్ ద్వారా వారు చెప్పదలుచుకున్నది ఎవరి ఆహార అలవాటూ తప్పు కాదు, మేకమాంసం తినడం ఎంత గౌరవప్రదం, నాగరికం అయ్యిందో గొడ్డుమాంసం కూడా అంటే నాగరికం అని చెప్పడం. అదేదో తప్పు చేస్తున్నట్లు ఇంట్లో మాత్రమే ఎందుకు తినాలి, హాస్టల్లో తినొచ్చుకదా అని.

      Delete
    2. super like.....

      http://weekendperspective.blogspot.in/2012/04/blog-post_14.html

      Delete
  5. thinadaaniki inkaa manishi okkade migilaadu, vaanni thinandi thappemledu. virivigaa ekkada padithe akkada dorike pousthikaahaaram adi. shame shame... Festival gaa jarupukovadaaaniki beaf thappa inkem dorakaledaa dalithulaku vaari charithralo...

    ReplyDelete
    Replies
    1. ayya vithanda vaadam enduku......mekanu thinte leni thappu goddu ni thinte thappu ela avthundi....aina veru thinani vaarini balavantham ga thinamani chepatledu kada.....memu thintaam addukovaddu ani mathrame antunaaru....

      veere valla abhiprayalani shinchaleni vaaru fascistse avutharu...

      Delete
    2. ayyaa 'cheste tappenti?' ane prasanle athi pedda vithandavaadam. oka chinna upamaanam. andaree raktam okate annaru kaani andlu naalugu grouplu chesaaru. endukani? manushyulu andaroo okkate annaarau. kaanee ee iddari manushula DNA okati kaadu.

      Are there any scientific studies on food habits?
      Naakite teliyadu kaani intakumunde kanche ilaiahgaaru chepparu. Dr. Ambedkar gaaru koodaa maala maadigalanu goddu maamsam tinoddannaarata.

      Delete
  6. ఎవరు తినేద్దన్నారు, మీ ఇంట్లో తినండి, అందరు/చాలామంది ఉండే చోట్లో అందరికి ఆమోదంతోనే మెను ఉండాలి కానీ ఒక వర్గానికి నచ్చిన మెను పెట్టకూడదు. బీఫ్ తో పటు పోర్క్ ఫెస్టివల్ జరుపగలరా?

    ReplyDelete
    Replies
    1. అనానిమస్,

      మాఇంట్లో బీఫ్ తినరు. నేను కూడా తినను, అప్పుడప్పుడు ఆఫీస్ క్యాంటీన్లో మరేదీ దొరక్కపోతే మాత్రమే తింటాను. నాకు ఆబీఫ్ ఫెస్టివల్తో ఎలాంటి సంబంధం లేదు, నేణు దళితున్ని కాదు. కనుక మీఇంట్లో తినండి లాంటి వ్యక్తిగతాలు అనవసరం. జరిగిన పరిణామాలగురించి నాస్పందన నేను రాశాను. దళితులహక్కులగూర్చి దళితులు మాత్రమే మాట్లాడాలి సంకుచితబుద్ది నాకు లేదు.

      Delete
    2. వ్యక్తిగతం కాదు, నేనన్న రెండు పాయింట్లు మీరు సమాధానం చెప్పలేదు..అందరి ఆమోదంతో మెను & పోర్క్ ఫెస్టివల్..

      Delete
    3. బీఫ్‌ను మెనులో చేర్చాలనేది ఈటపాలో నేను చర్చించలేదు. ఇది బీఫ్ ఫెస్టివల్ గురించి మాత్రమే. బీఫ్ ఫెస్టివల్ దళితులు జరపడంలో ఉద్దేషం తమ అలవాట్లను కించపరిచే అగ్రకుల హిందువులపై ఒక ధిక్కారం. దానికి పోర్క్ ఫెస్టివల్తో ఎలాంటి సంబంధం లేదు, వారికి అది జరపాల్సిన అవసరం లేదు. ఇకపోతే చికన్, మటన్ మెనులో చేర్చినప్పుడు అందరి ఆమోదం ఎవరూ తీసుకోలేదు, వెజిటేరియన్లు మైనారిటీలు కనుక సరిపోయింది.

      Delete
  7. babu koti ratanalu ..

    nee vadanato nenu ekiibhavinchadam ledu.

    mekanu kodini evaduu pujinchadu kabatii tinnaa tappu ledu.

    gomata ani talli to samanamgaa chuuse vaari madhyalo ade govuni tindam anedi correct kaadu .. daanni samrthinchadam tappu ani naa bahavana.

    CAN YOU ARRANGE PORK FESTIVAL at charminar and support it this way??

    JAIHIND!!

    ReplyDelete
    Replies
    1. Anon,

      The question is what if goat is also worshipped by some other cult? Do the same people objecting beef eating stop eating mutton at that time?

      regarding pork festival, if you conduct pork festival in charminar and someone else object you then I will definitely write a blog post supporting your cause. As of now no one is in the idea of celebrating pork festival. if someone wants that I don't think anyone should have objections on that.

      Delete
    2. "what if" .. doesnt matter here caz, there were people who worship cow at the place where this festival was arranged.

      And Im sure, if someone says pls dont goat where im caz i worship it, i would definetly consider it.

      regarding pork festival at charminar, dont these so called sc/sts ( with all respect to them ) dont eat pork? yes they do eat pork ... then why dont/cant they arrange a festival at charminar?

      Delete
  8. ఇస్లాం మతం ప్రకారం పంది మురికి జంతువు. అది పవిత్ర జంతువు కాదు. అయినా పోర్క్ ఫెస్టివల్ పెడితే మతంతో సంబంధం లేకుండా బతికేవాళ్ళకి అభ్యంతరం ఏమీ ఉండదు.

    ReplyDelete
    Replies
    1. meeku matam ledaa / matam to sambandam leda?

      sare edo oka 'ledu' anukundaam.

      maaku matamu undi matam to sambandamuu undi anduke ii abhyantaram!!

      JAIHIND!

      Delete
  9. నిజమే కానీ నాస్తికులు మిమ్మల్ని పోర్క్ తినమని బలవంతం చెయ్యరు కదా. నేను నాస్తికుణ్ణే. చిన్నప్పుడు ఎప్పుడో అడవి పంది మాంసం తిన్నాను. ఊరి చివరి పాకల్లో పెంచే సీమ పందుల మాంసం మాత్రం తినలేదు. అయినా ఎవరైనా పెడితే సీమ పంది మాంసం తినడానికి నాకు అభ్యంతరం లేదు.

    ReplyDelete
  10. ee post lo cheppinavi kontha varaku nijame ayina... ilanti vatini enduku samrthistunnaro rtham kavatledu... migatha vaalla gurinchi emo kani naa matuku naaku idi correct kadanipistundi... ofcse illallo and hotels lo non veg tine vallu chala mande unnaru (inkoka vishayam nenu kevalam goddu maamsam gurinchi cheppatledu nni rakala jantuvula gurinchi cheputunnanu).. kaakapote ila public ga kevalam ... " mammalni kinchapasrustunnaru" ane uddesham to vati praanalu teeyadam endukani.. adi beaf festival kavachu... goat festival kavachu inkedina kavachu ...asalu manamntaha enduku ila prati daanni religion to caste to link chesukoni maatladutaamu... and deeniki telangaana ki enti sambandam?

    inkokarevaro cheppinattu... avunu nijame prati intlonu non veg tintunnapudu ila public ga tinadam lo tappemi ledu alage prati intlo roju sex chesukuntunnaru kabatti ila public ga chesukodam lo kooda tappemi ledu kaavchu ?

    goddu maamsam tintunnarani chulakanaga chusarani beaf festival chestunnaru... alage pandi maamsam tine vaallani kooda chala mandi chulakana gaane chustaru kada..ee festival chesina vaallu okasaari nijangane pork festval charminar daggara celebrate chesukommanu..
    cheyaleru endukante...adi muslims ki nchadu kaabatti vaallu vurukoru kaabatti.. nariki paarestaru kaabatti... man Govt kooda emi cheyaledu kaabatti.... after all India is an anti-Hindu secular country kada...

    ReplyDelete
  11. I am a very stric vegeterian, even eggs are taboo to me and my family members. But I support beef festival. Beef should be in the menu of hostel every day, as it is the delicacy of downtroden members of our country. At the same time pork is also the delicacy of the poorer sections of our people. washermen community and other weaker sections take pork on daily basis. It has to included in the menu of hostel along with the beef. Let kacha ailiah and others fight for inclusion of pork along with beef in the university menu.

    ReplyDelete

Your comment will be published after the approval.