Tuesday 8 October 2013

దొంగలముఠాలో చీలికలు

దొంగలముఠాలో చీలికలొస్తే ఏం చేస్తారు? ఒకరి దొంగతనాలను మరొకరు బయటపెట్టుకుంటారు. ప్రస్తుతం సీమాంధ్ర పెద్దల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి తనకు అనుకూలుడు, ఒకే కులం, ప్రాంతం వాడు తాను చెప్పినట్టు వింటాడు అని చెప్పి అర్హత లేకున్నా దినేష్‌రెడ్డిని అందళం ఎక్కించాడు. అప్పటికి దినేష్‌రెడ్డి కంటే సీనియర్లు, ఎక్కువ కఠినతర భాద్యతలు నెరవేర్చి ర్యాంకింగ్‌లో ముందున్నవారు తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు గౌతంకుమార్, మరొకరు ఉమేశ్‌కుమార్. అయినా అన్యాయంగా నిబంధనలను తుంగలో తొక్కి కిరణ్‌రెడ్డికి డీజీపీ పదవి ఇచ్చాడు. దానివలన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ఇంతా చేసింది ఎందుకు? తనకు అనుకూలుడు, తన మాట వినేవాడూ పోలీస్ బాస్ అయితే తనకు అడ్డు ఉండదు, అంతా తన ఇష్టప్రకారం జరుగుతుందీ అని.

చివరికి జరిగిందేమిటంటే తన పదవి ఎక్స్‌టెన్షన్ దొరకలేదని దినేశ్‌రెడ్డి ముఖ్యమంత్రిపై విరుచుకు పడ్డాడు. ముఖ్యమంత్రి సంగతులు అన్నీ బయట పెట్టాడు.

మచ్చుకు కొన్ని: ముఖ్యమంత్రి తమ్ముడి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఏపీఎంజీవోల సభకు వద్దన్నా పర్మిషన్ ఇప్పించడం,  తెలంగాణ వస్తే నక్సలైట్ సమస్య పెరుగుతుందని అబద్దాలు చెప్పమనడం. ఇవన్నీ బయట పెట్టినందుకు దినేశ్‌రెడ్డిని ఎవరూ నిజాయితీపరుడనరు గానీ ముఖ్యమంత్రి బండారం మాత్రం బయట పడింది. ముఖ్యమంత్రీ, మాజీ డీజీపీ ఏవిధంగా తోడుదొంగలయిందీ, చివర్లో ఏవిధంగా వాటాలు కుదరక విభేధాలు వచ్చిందీ అందరికీ తెలిసింది.

ఈవ్యవహారం బయటపెట్టిన మరో విషయం ఇప్పటివరకూ సీమాంధ్ర ముఖ్యమంత్రులు తమకు కొమ్ముగాసే సీమాంధ్రకు చెందినవారికి ఏవిధంగా అక్రమంగా పదవులు కట్టబెడుతుందీ, ఏవిధంగా తెలంగాణా వారికి అన్యాయం చేస్తుందీ. 

1 comment:

Your comment will be published after the approval.