Wednesday, 23 November 2011

పరకాల మాటలు, అబద్దాల మూటలు

విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాలు, మా ప్రసంగాలు, రచనలూ, పత్రికా ప్రకటనలూ, మేము నిర్వహిస్తున్న సదస్సులను మీరు ఆసక్తితో గమనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 
మీకు కావల్సింది అదే కద, ఎందుకు ఆనందంగ ఉండదు?.  విశాలాంధ్ర ముసుగులో కావల్సినంత పబ్లిసిటీ దొరుకుతుంది మరి.

మేము ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ప్రజలకు, ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అటువంటి భావన మీకు కలిగి ఉంటే అది సరిఅయినది కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను.
 
ఓహో! ఇక్కడి ప్రజలు అభిమానించే ప్రొఫెసర్ జయ్శంకర్, బుర్రా రాములులపై బ్లాగుల్లో విషం చిమ్మినా, మీ వర్క్‌షాప్లో తిట్టిపోసినా అదికూడా వ్యతిరేకంగా మట్లాడీనట్లు కాదేమో.

ఆ మాటకొస్తే మేము ఏ ప్రాంతానికి, ఏ ప్రాంత ప్రజలకీ వ్యతిరేకం కాదు. మేము విశాలాంధ్ర కొనసాగాలనే అభిమతం కలవాళ్ళం. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చెప్పాలంటే మేము విభజన కోరే వారికి కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకత కేవలం విభజన వాదం పట్ల మాత్రమే. విభజన వాదుల పట్ల ఏమాత్రం కాదు.
 
అందుకేనా ప్రతిరోజూ వెబ్‌సైట్లోనూ, టీవీల్లోనూ వేర్పాటువాదులు, తెలబాన్లూ అంటూ రాతలూ, కూతలూ?

విభజన వాదం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నదని మా అభిప్రాయం. విభజన వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. అలాగే సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ ఉంది. సమైక్య వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.
 అలాగా!  తెలంగాణలో లక్షలాదిమంది, కోట్లాదిమంది విభజనను వ్యతిరేకిస్తున్నారని ఈమధ్య తెగ చెప్పేస్తున్నారు,  ఆ లక్షలాధిమంది, కోట్లాదిమంది మీతో వచ్చి చెప్పారా?, ఈవిషయం మీకెలా తెలిసింది?అంతమంది విభజనవ్యతిరేకిస్తుంటే ఏమిటి ఒక్కచోట కూడా ఒక్క సభకానీ, ర్యాలీ కానీ జరగలేదు?  

ఈరోజు కూడా పరిస్థితి అదే. కోస్తా రాయల సీమలలో విభజనకు మద్దతు పలికే వారున్నారు. తెలంగాణలో ఉన్నారు. అలాగే ఆ రెండు ప్రాంతాలలో కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. తెలంగాణా లో కూడా కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. మరొక సారి మరొక ప్రాంతంలో మరొక భావన బలంగా వ్యక్తమయ్యింది.
 

తెలంగాణలో కలిసిఉండాలనే భావన బలంగా ఎప్పుడయినా వ్యక్తమయిందా?

 మాకు కావాలని. మా మాటలు చెప్పుకోకుండా మమ్మల్ని అడ్డుకోవద్దని. మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించక పోయినా మా మాటలు చెప్పుకునే హక్కును మమ్మల్ని అనుభవించనివ్వండి అని.


సరే, మీరు చెప్పినట్లు తెలంగాణలో  మిమ్మల్ని మీటింగు పెట్టుకోనీయలేదని అనుకుందాం. మరి మీ వెబ్సైటు ద్వారాగానీ, బ్లాగుద్వారా గానీ, టీవీ చర్చల్లో కానీ, ఢిల్లీ వర్క్‌షాప్లో కానీ సమైక్యంగా ఎందుకు ఉంచాలో ఈరోజువరకూ ఏదయినా చెప్పగలిగరా? కలిసి ఉండేందుకు మీరు ఇక్కడి ప్రజలకు చేస్తున్న ఆఫర్ ఏమిటి? ఎంతసేపు ఇదిగో మీరే ఎక్కువ అభివృద్ధి చెందారు, కావాలంటే ఈజీడీపీ లెక్కలు చూసుకోండి,  అనడం, లేదా ఇక్కడి మాసమస్యలు చెబితే అందుకు మేమెలా కారణం అని కప్పదాటు సమాధానం చెప్పడ తప్పితే మీవాదన ఏమిటి?