రాష్ట్రాన్ని విభజించి తెలుగుజాతిని విడదీయాలని చూస్తే ఆత్మహత్యలకే కాదు, తాము ఆత్మాహుతి దాడులకు కూడా సిద్దపడుతామని ఈరోజు తెలగుదేశం అనంతపురం నేత పయ్యావుల కేశవ్ ఒక మీటింగులో చెప్పారు. ఇంకా రాష్ట్రాన్ని విభజిస్తే దేశాన్ని విభజించినట్లే, ఈదేశం ముక్కలయిపోయినా సరే రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు గానీయం అని ప్రకటించారు.
అయ్యా పయ్యావుల గారు, మీకు తెలిసిందే ఒకరిని బెదిరించడం, బెదిరించి సెటిల్మెంటు దందాలు జెయ్యడం, ఎవరయినా బెదిరింపులకు లొంగకపోతే తలలు నరికెయ్యడం. మీకు ఆత్మాహుతి దాడులకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయిగానీ, మీ ఇలాంటి ఉద్దేషాలూ, స్వభావాలూ చూసి చూసి విసిగిపోయారు కాబట్టే తెలంగాణ ప్రజలు తమకు స్వరాష్ట్రం కావాలని అడుగుతున్నారు. ఇక్కడివారు తమహక్కు కోసం పోరాడుతున్నారు, దానికోసం ఇక్కడి ఆరొందల యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలకు త్యాగాలు చెయ్యడమే గానీ ఇంకొకరిని బెదిరించి లొంగదీసుకోవడం చేతకాదు. మీరు మీ ముఠాకక్షల సాంప్రదాయాలను ఇప్పటికే మీప్రాంతం నుంచి హైదరాబాద్ వరకూ పొడిగించి అక్కడి హత్యలు ఇక్కడ చేసుకుని ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి చాలవని ఇంకా ఆత్మాహుతి దాడులు గూడా చేస్తారా? విడిపోతామనే ఒకన్యాయమైన హక్కుకు అడ్డుపడటానికి ఇలాంటి బెదిరింపులు ఎందుకు? మీరు భయపెట్టి కలిసి ఉండమంటే అది సమైక్యత ఎలా అవుతుంది?
ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశం ఎలా ముక్కలయిపోతుంది సామీ? అలా ముక్కలయిపోయేదే నిజమయితే రాష్ట్రాలను మార్చే, పునర్విభజించే అధికారాన్ని తీసివేసేలా ఒక చట్టం తీసుకురాగూడదూ? ఇప్పటిదాకా యాభై సార్లు రాష్ట్రాలను పునర్విభజించారు, దేశం ఎన్ని ముక్కలయిందేమిటి? ఎందుకీ అసందర్భ ప్రేలాపనలు? నీకు దేశం ముక్కలయిపోయినా ఫరవాలేదు గానీ రాష్ట్రాన్ని మాత్రం విభజించనియ్యవా, ఎందుకో? అప్పనంగా దోచుకోవడం కుదరదనా?
అడక్కుండానే రాజీనామాలు చేసి ఏదో పొడిచేసామని చెప్పుకుంటున్న తెలంగాణా తెదే నేతల్లారా, జెర మీపార్టీ నాయకుల ప్రేలాపనలు జూడండి. మరి ఇలాంటి పిచ్చిపట్టిన పైత్యపు నాయకులకు మీరు సమాధానం చెబుతారా, లేక మీ గుడ్డికల్ల బాబు జెపుతాడా? తెలంగాణ నేతలు ఏచిన్న మాట అన్నా దాన్ని గోరంతలు కొండనత చేసే సీమాంధ్ర మీడియా, సీమాంధ్రా నాయకులు, సీమాంధ్రా సమర్ధ బ్లాగరులు ఇలాంటి మాటలు మాత్రం పట్టించుకోరు మరి, మనకు అనుకూలం కదా, ఏమన్నా సమర్ధనీయమే.
ఇదంతా చంద్రబాబు డ్రామాయే. ఎర్రబెల్లి వచ్చి KCRని, JACని తిడతాడు. పయావుల వచ్చి KCRని, తెలంగాణా వాదులని కలిపి తిడతాడు. చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తుంటాడు. ఏదో రాజీనామాలు చేసిన్రు గదా అని తెలంగాణా తెదేపా ఎమ్మేల్యేలను ప్రజలు చూసి, చూడకుంటా ఉంటున్నారు. వీళ్ళు గనుక ఇదే పని కొనసాగిస్తే మటుకు వీళ్ళని తెలంగాణా నించి తరిమికొట్టే రోజు తప్పకుండా వస్తుంది.
ReplyDeleteWere you sleeping all these 10 years when KCR and his pack of fools like Ramreddy damodar reddi and Madhuyashki uttered the same golden words just for their political survival? Were you sleeping when your goons attacked film-personalities and destroyed shooting sets? Were you in hibernation when the same people attacked MPs and threatened MLAs? Is this what you call as peaceful and democratic agitation?
ReplyDeleteStop giving lectures on the culture of Telangana and your so called Tyaganirati.First look at your black before crying on others.
దోపిడీదారులంటూ విద్వేషం రెచ్చగొట్టటం మొదలుపెట్టిననాడే, ఆ మొదలుపెట్టిన వారిని మీరు ఖండిస్తే, మేమూ ఈ కేశవ్ లాంటివాళ్ళని మీకంటే ముందు ఖండించేవాళ్ళం.
ReplyDeleteతెలంగాన కోసం రక్తపుటేరులు పారిస్తాం అన్న వారిని మీరు ఖండిస్తే, మీకంటే ముందే కేశవ్ వ్యాఖ్యలను ఖండించే వాళ్ళం.
టాంక్బండ్ మీద విగ్రహాలు పగులకొట్టటాన్ని మీరు ఖండిస్తే, మేమూ ఇతని వ్యాఖ్యలను మీకంటే ముందు ఖండించేవాళ్ళం.
ప్రకాశం బారేజి లో ఉచ్చపోస్తా అన్నవాడిని మీరు ఖండిస్తే, మేమూ ఇతనిని ఖండించేవాళ్ళం. మీరు మౌనం గా ఉండి, మీ వైపు వారి వ్యాఖ్యలను ఆనందిస్తూ ఉంటే, మేము ఇతని వ్యాఖ్యలను ఖండిస్తే, అప్పుడు సీమాంధ్ర జనాలు మమ్మల్ని అడుగుతారు, "తెలంగాణ నాయకుల రెచ్చగొట్టుడుని వాళ్ళ ప్రాంతం వారు ఖండిచ లేదు..మరి మీకెందుకు ఈ ఉలుకు?", అని.
కేశవ్, అయినా కేసీఆర్ అయినా జనాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ఖండించతగ్గ విషయమే!
@Anonymous
ReplyDeleteWhere were you hiding when our water, our jobs and our funds were looted?Where were you when our sons of the soil died in police firing, gave their lives for the state hood? They questioned what happened and asking for a separate statehood. Why do those who preach for united state talk about suicide bombers?
@ఆంధ్రుడు
దోపిడీ అంటూ రెచ్చగొట్టలేదు, ఉన్న వాస్తవాలను మాత్రమే చెప్పారు, అందుకే విడిపోతామంటున్నారు. కలిసి ఉందామని చెప్పేవారు మానవబాంబులగురించి మాట్లాడడం ఏమిటి? మిమ్మల్ని ఖండించమని మేము చెప్పట్లేదు, మీకంత మంచి మనసే ఉంటే మీ సోదరులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటారా? కేవలం మీవైఖరి ఎండగడుతున్నాం.
ఇప్పుడు నీప్రశ్నలోనే చూస్తున్నాము కదా, లేనిది కల్పించి చెప్పే మీ మాటలు? దోపిడీని దోపిడీ అంటే తప్పుకాదు బ్రదర్, కానీ ఆత్మాహుతి దాడులు జేస్తామంటే అది నేరం. రాజోలీబండ డాము గేట్లు పగలగొట్టినపుడు ఎక్కడ నిద్ర పోతున్నావ్? నీల్లన్నీ దోచుకుని, ఏదో ఒక చిన్న ప్రాజెక్టు కాసిని నీల్ల చుక్కలు ఇస్తుంటే అది కూడా ఓర్వలేక పేల్చినవారు సమైక్యత గురించి మాట్లాడ్డం ఎందుకు?
ప్రపంచంలో ఎన్నో దేశాలు విడిపోయి కొత్త దేశాలు అవతరించాయి. ఎన్నో దేశాల్లో కొన్ని ప్రాంతాలు విడిపోయి(మరికొన్ని కలిసిపోయి) కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒక ప్రాంతం విడిపోవాలంటేనో, కొత్త దేశంగా (లేదా రాష్ట్రంగా) అవతరించాలంటేనో అంతర్యుద్ధాలూ, రక్తపాతాలూ, హత్యలూ, ఆత్మ హత్యలూ జరిగాయి. కానీ, విభజింపబడకుండా ఉంచడానికి ఆత్మహత్యలుగానీ, హత్యలుగానీ జరిగిన ఉదంతాలు ప్రపంచ చరిత్రలోనే లేవు. అలాంటిది చరిత్రను తిరగరాయడానికి పూనుకున్నారు మన పయ్యావుల కేశవ్. దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని.. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించడం ద్వారా సమైక్య ఉద్యమంలో అడ్వాంటేజీ కొట్టేయాలనుకున్నట్లున్నాడు కేశవ్. కానీ, ఆయన ఆ ఆతృత ఎన్ని విపరీతాలకు దారితీస్తుందో ఊహించినట్లు లేడు. బహుశా ఈ రాత్రి నిద్రపోయి లేచేవరకల్లా అయినా ఆయనకంటూ ఓ ఇంగితమేదైనా ఏడిస్తే రేపు తన వ్యాఖ్యల్ని సవరించుకుంటాడని భావిద్దాం.
ReplyDeleteAlso read my post named:ప్రపంచ చరిత్రను తిరగరాస్తానంటున్న పయ్యావుల కేశవ్ - నువ్వే ఆ మొదటి మానవ బాంబుగా మొదలెట్టు ఆ మహాకార్యాన్ని! నా తెలంగాణాకోసం నిన్ను కౌగిలించుకోడానికి నేను సిద్ధం!!at
http://dare2questionnow.blogspot.com/2011/07/blog-post_20.html
@R.S.Reddy
ReplyDeleteఈయనకు అంత ఇంగితగ్నానమేం లేదు, ఇంతవరకూ తన వాఖ్యలను ఉపసమ్హరించుకోలేదు, సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఇదేమనిషి ఇంతకుముందు సమిక్యాంధ్ర ఆందోళన పేరుతో గూండాలను తీసుకెల్లి కోట్ల విలువ చేసే బీఎస్సెనెల్ కేబుల్లు ఒక్కరోజులో కాలబెట్టాడు, అదీ పోలీసులు చూస్తుండగా. ఇలాంటి ఫాక్షనిస్టు గూండాలు ఇంతకంటే మంచి మాటలు ఎలా చెబుతారు?
కేశవ్ అల మాట్లాడటం తప్పే .. నేను ఒప్పుకుంటున్న .. అలాగే గతంలో కెసిఆర్ ఎన్నోసార్లు రక్తపాతం అని, అంతర్యుద్దం అని మాట్లాడాడు కదా .. అవి తప్పు కాదా ???
ReplyDelete@Siva
ReplyDeleteఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. అయితే ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి.
1. గతంలో కేసీఆర్ కంటే కూడా ఎక్కువగా ఇలాంటి మాటలు లగడపాటి, టిజీ, వైఎస్సార్ లాంటి వారు ఎక్కువగా మాట్లాడారు. కానీ మీడియా కేసీఆర్‌పైనే ఫోకస్ పెడుతూ కేసీఆర్ మాట్లాడినదాన్నే ఎక్కువ చూపించి విమర్శించారు.
2. తెలంగాణ వాదులు ఎవరూ ఇంత ఘోరమయిన భాష వాడలేదు.
3. విడిపోదామనే వారు వాడే భాషనే సమైక్యత గురించి చెప్పేవారు వాడితే ఆసమైక్యతకు అర్ధం లేదు.
4. తెలంగాణవాదాన్ని విమర్శించడం చేతకాని విమర్శకులంతా కేసీఆర్ వాడే భాషను విమర్శించి తద్వారా తెలంగాణవాదాన్నే ఎత్తిచూపినట్లుగా ఫీల్ అవుతారు, అలాంటివారు తమ సీమాంధ్ర నేతలు వాడే భాష గురించి ఎప్పుడూ విమర్శించరు.
కెసిఆర్ అన్నమాటకు ప్రతి మాట గానే వాళ్ళు మాట్లాడారు తప్ప వాళ్ళేమి స్టార్ట్ చెయ్యలేదు ... YSR ఇంత కన్నా ఘోరంగా ఏమి మాట్లాడాడో ఒక్క మాట చెప్పావ ... ?? రక్తపాతం , రక్తం ఏరులై పారుతుంది .. సీమాంద్ర వాళ్ళని తరిమికోడతాము అని ఎన్ని సార్లు అనలేదు .. అది ఘోరం కాదా ?? కెసిఆర్ ఒక లీడర్ .. మరి అయన కంట్రోల్ గ మాట్లాడాలి .. ఆయనే లీడర్ కాబట్టి సహజంగా అయన భాషనే తప్పు పడతారు .. మీ భాష ని నా భాష ని ఎవరు పట్టించుకోరు కదా ...
ReplyDeleteసీమాంధ్రా వాల్లను తరిమివేస్తామని ఎవరన్నారో చెప్పండి? ఎప్పుడన్నా కేవలం దోపిడీదారులను మాత్రమే తరిమి వేస్తామన్నారు, అందులో తప్పేమిటి? కాకపోతే దోపిడీదారులనే పదం వినగానే కొందరు తమనేనేమో అని భుజాలు తడుముకుని మమ్మల్ని తిట్టాడు అని చెబుతుంటారు, నిజమైన దోపిడీదారులను తరిమెయ్యడం తప్పుకాదు. రక్తం పారుతుంది అని ఒకేఒకసారి అంటే దాన్ని మీమీడియా, నాయకులు వెయ్యిసార్లు చెప్పి ఉంటారు. రక్తం పారుతుందని అన్నది తెలంగాణకు అడ్డువచ్చినవారిని. నేణు దాన్ని కూడా సమర్ధించడం లేదు..ఎవరు అలాంటి మాటలు మాట్లాడీనా తప్పే. కేవలం సీమాంధ్ర నాయకుల, మీడియా పక్షపాత ధోరణి ఇక్కడ చెబుతున్నాము.
ReplyDeleteఇకపోతే పయ్యావుల ఆత్మాహుతి దాడులు చేస్తామంటే అది చిన్న విషయం కాదు, పైగా అతను అన్నతపనీ చెయ్యగల సమర్ధుడు...ఒక ముఖ్యమంత్గ్రి స్థాయిలో ఉన్న వైఎస్సార్ ఎన్నికలు తెలంగాణ ఆయేంతవరకూ తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నికలు అయిపోగానే నంద్యాల వెల్లి హైదరాబాదు వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా లాంటి మాటలు మాట్లాడొచ్చా?
దోపిడీ దారులు ఎక్కడ ఉన్న తరిమి వెయ్యాల్సిందే .. ఓకే ... సంక్రాంతి కి ఇంటికి వెళ్ళిన వాళ్ళని రానివ్వం అని అనడం సబబా?
ReplyDeleteరక్తం పారుతుంది అని ఒకేఒకసారి అంటే , కేశవ్ కూడా ఒక్కసారే అన్నాడు .... కాని కెసిఆర్ ఒక్కసారే కాదు చాల సార్లు అన్నాడు .. మొన్నీమధ్య hyd లో కూడా అన్నారు కదా ...
"ఒక ముఖ్యమంత్గ్రి స్థాయిలో ఉన్న వైఎస్సార్ ఎన్నికలు తెలంగాణ ఆయేంతవరకూ తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నికలు అయిపోగానే నంద్యాల వెల్లి హైదరాబాదు వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా లాంటి మాటలు మాట్లాడొచ్చా" అలా YSR అన్నాడు ... కాని తను ఆ మాట ఎందుకు అన్నాడంటే ఇలా కెసిఆర్ రక్త పాతం లాంటి పదాలు వాడారు కాబట్టి ...
సరే అది తప్పని అనుకున్న , రక్తపాతం , రక్తం ఏరులై పారుతుంది అనే మాటల కంటే ఘోరమా ??
నేను ఇక్కడ ఎవరిని సమర్ధించటం లేదు .. కాని ప్రజా ప్రతినిధులు అలాంటి బాష ఎవరూ మాట్లాడకూడదు అని నా ఉద్దేశం ... ఇదే టపాలో మీరు అందరిని ఖండించి ఉంటె నేను కామెంట్ ఈ చేసే వాడిని కాను ...
@శివ
ReplyDeleteమీరు ఎవరినీ సమర్ధించడం లేదని నాకర్ధం అయ్యింది. అలాగే నేణు కూడా ఎవరినీ సమర్ధించడం లేదు. కానీ దేన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరు బ్లాగులు ఫాలో అయితే చూడోచ్చు, రోజుకు ఎంతమంది తెలంగాణవాదులను తిడతారో, మరి ఎంతమంది పయావులను విమర్శిస్తున్నారు?
ఇకపోతే నేను చెప్పేది విడిపోదామనే వారు మాట్లాడేభ్హష్ కలిసి ఉందామనే వారూ మాట్లాడితే కలిసి ఉండడంలో అర్ధం లేదని. పయ్యావుల ఏదో అన్నాడని కొంపలు మునిగిపోతాయని నేణనుకోవడంలేదు. ఇలాంటి వారి మాటలపై ఫోకస్ చెయ్యకుండా సమస్యపై ఫోకస్ చెయ్యగలిగితే పరిష్కారం లభిస్తుంది.
"ఇలాంటి వారి మాటలపై ఫోకస్ చెయ్యకుండా సమస్యపై ఫోకస్ చెయ్యగలిగితే పరిష్కారం లభిస్తుంది" నాకు నచ్చిన లైన్ ఇది . నా ఉద్దేశం కూడా అదే. కాని మీరు ఈ టపా లో కేశవ్ మీద ఫోకస్ చేసారు .. "ఇలాంటి పిచ్చిపట్టిన పైత్యపు నాయకులకు మీరు సమాధానం చెబుతారా, లేక మీ గుడ్డికల్ల బాబు జెపుతాడా" మరియు ఇతనికి ఇంగిత జ్ఞానం లేదు అని అన్నారు కదా. అందుకే నా కామెంట్ .. ఎనీ వే థాంక్స్ బ్రదర్ ..
ReplyDeleteVidipoyevadu emmatladina chellu tundi ani mee bhavana kabolu ... kalisundam ane vallaki entha bhadhyata undo, "vidipoyi kalisundam" ane vallaki kudaa anthe bhadyatha undi ... adi meeru gurtherigithe baguntundi
ReplyDelete