Friday 18 January 2013

సీమాంధ్రలో ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి?ఫొటో: సమైక్యాంధ్ర “ఉద్యమం”లో భాగంగా కడపలో ఒక పెట్రోల్ బంకును ధ్వంసం చేస్తున్న టిడీపీ గూండాలుఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం:

1952 లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులదెబ్బకు ఆంధ్రాలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం లాంటివారు ఓడిపోయి రాజకీయనిరుద్యోగులయిపోయారు. టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పదవికోసం కష్టపడ్డా అది తమిలుడు రాజాజీకే దక్కింది. దీంతో వీల్లందరికీ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు వచ్చింది. అంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన ఊసెత్తని ప్రకాశం, ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు. తప్పు లేదు..వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప.

రాజాజీ అప్పటి ప్రతిపాదిత నందికొండ ( ఇప్పటి నాగార్జునసాగర్) నుండి కొంత నీటిని మద్రాసుపట్టణానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇది క్రిష్ణా, గుంటూరులో ఉన్న భూస్వామ్యవర్గాలకు నచ్చలేదు. ఇదే అదను అనుకొని రాజకీయంగా దెబ్బతిన్న బెజవాడ, నీలం, ప్రకాశం లాంటి నాయకులు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. ఇక్కడ ఆంధ్రా నాయకుల, క్రిష్ణా, గుంటూరు భూస్వాముల ప్రయోజనాలే ఈఉద్యమానికి కీలకమయ్యాయన్నది గమనించాల్సిన విషయం.

అంతకుముందు గుంటూరులో కొన్ని గుమస్తా ఉద్యోగాలు తమిలులకు ఇచ్చారంటూ చిన్న గొడవ కూడా బయల్దేరింది. తమిలులు తమ అవకాశాలను దోచుకుంటున్నారనేది ఉద్యమంలో ముఖ్యంగా ప్రచారం అయింది. అంటే ఇప్పటి తెలంగాణ ఉద్యమం లాగానే అప్పుడు కూడా ఉద్యోగాలు, నీళ్ళు ప్రధానాంశాలు కాగా తరువాత అది తెలుగువారి ఆత్మగౌరవంగా మారిపోయింది.

అప్పటి జేవీపీ కమిటీ మద్రాసు లేకుండా రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే అప్పటి ఉద్యమంలో ఎవరికీ పక్కన తెలంగాణలో ఉన్న తెలుగు వారు గుర్తుకు రాలేదు. మద్రాసు లేకపోతే సరే తెలంగాణలో ఉన్న తెలుగువారిని కూడా కలపాలి అని ఎవరూ ప్రతిపాదించలేదు, ఉద్యమించలేదు. కానీ తమకి రాని, తమిలులు అధికమయిన మద్రాసుకోసం మాత్రం పోరాడారు, అమాయకుడు పొట్టి శ్రీరాములును పొట్టన బెట్టుకున్నారు.

జై ఆంధ్రా ఉద్యమం:


1969 తెలంగాణ ఉద్యమం తరువాత ముల్కీ నిబంధనల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. చివరికి సుప్రీం కోర్టు తమ తీర్పులో ముల్కీ నిబంధనలు న్యాయమయినవే అని తేల్చింది. దీనికి కొద్దినెలలు ముందుగానే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసిమ్హారావు సీమాంధ్రలో భూసంస్కరణలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే అప్పటి ఆంధ్రా మంత్రులు, ఇతర నాయకులకు ఇది నచ్చడంలేదు. పీవీపై ఈవిషయంపై ఆంధ్రా నాయకులు కోపంతో రగులుతున్నారు.

ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో వీరికి చక్కగా అదును చిక్కింది. ఇంకేం ఒక్కసారిగా ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి జై-ఆంధ్ర ఉద్యమం లేవనెత్తారు. ఇక్కడ కూడా ఉద్యమం కొందరు భూస్వామ్య వర్గాల ప్రయోజనాలకోసమేనని తెలుస్తుంది.

అయితే ముల్కీ రూల్స్ ఏపక్షపాత నేతో బలవంతంగా వీరిపై రుద్దలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రులు వీరికి అన్యాయం చేయలేదు. కేవలం సుప్రీం కోర్టు ఇది న్యాయమేనని ధృవీకరించింది. అయినా దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించకుండా వీరు ఉద్యమాన్ని లేపారు. కొన్ని నెలలు అల్లకల్లోలం సృష్టించారు.

ఎలాగయితేనేం ఈఉద్యమం ద్వారా వీరు తాము కోరుకున్న ఫలితాన్ని రాబట్టగలిగారు. ముల్కీ రూల్స్ రద్దయ్యాయి,పీవీ ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోయాడు, భూసంస్కరణలు ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ కూడా ఆగిపోయింది. ఈఉద్యమం మొదలవడం, ఆగిపోవడం అంతా కూడా తెలంగాణకు న్యాయం జరుగుతుంటే అడ్డుకోవడానికే తప్ప నిజంగా విడిపోవడానికి కాదనీ, కలిసి ఉండడంలో విపరీతంగా లాభపడుతున్నవీరికి విడిపోవాలని లేదనీ తెలుస్తుంది.


సమైక్యాంధ్ర ఉద్యమం:

2009 డిసెంబరు తొమ్మిదిన చిదంబరం తెలంగాణ ప్రకటించగానే సీమాంధ్రలో రాత్రికి రాత్రే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయింది. అంతకుముందు పదేళ్ళుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఏనాడూ అడ్డుచెప్పనివారు, పైగా తెలంగాణ వస్తే రాజధాని గుంటూరు దగ్గరొస్తుందని భూముల ధరలు పెంచిన వారు, అన్నిపార్టీలూ తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోల్లో చేర్చినప్పుడు, మద్దతు ప్రకటించినపుడు అడ్డుచెప్పక వారినే గెలిపించినవారు, కనీసం బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. ఇంకేముంది వెంటనే తెలంగాణ ప్రజలను "మీరు మాతో కలిసుండాల్సిందే" అంటూ సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు.


ఎవరైనా తమ హక్కులకోసం ఉద్యమం చేస్తారు. మీరు మాతో కలిసి ఉండాల్సిందే అంటూ ఎదుటివారి హక్కులకు అడ్డుపడడానికి చేసిన ఉద్యమం చరిత్రలో ఇదే మొట్టమొదటిది.

ఈఉద్యమం కూడా మిగతా రెండు ఉద్యమాల లాగే సమైక్య రాష్ట్రంలో అమితంగా లాభపడుతున్న కొద్దిమంది ధనిక, భూస్వామ్య, పెట్టుబడిదారులకోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఉద్యమానికి దలితులెవరూ మద్దతివ్వకపోగా వారు విభజనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈవిధంగా సీమాంధ్రలో జరిగిన మూడు ప్రధాన ఉద్యమాలు ధనిక భూస్వామ్య వర్గాలు, కొందరు నేతల ప్రయోజనం కోసం చేసినవి కాగా ఈ మూడు ఉద్యమాల్లో మూడు రకాలుగా ఉద్యమాలు చేశారు. ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఏఅంశాలమీద ఉద్యమం జరుగుతుందో అదే అంశాలమీద జరిగిన ఉద్యమం. అప్పుడు అవేకారణాలమీద విడిపోవడం వీరికి ఒప్పుగా తోచగా ఇప్పుడది తప్పుగా తోస్తుంది. మరో ఉద్యమంలో ఇప్పటివాదనకు పూర్తిభిన్నంగా ఇప్పుడు కలిసి ఉందామన్న వారు అప్పుడు విడిపోదామన్నారు..అదికూడా కనీసం దేశంలో అత్యంత ఉన్నతమయిన న్యాయపీఠం ఒక తీర్పునిస్తే దాన్ని గౌరవించకుండా!

అంటే ఇక్కడ ఉద్యమాలకు ఒక సిద్ధాంతాలు, గట్రా ఉండవు. ఇక్కడి భూస్వామ్య, ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు వీల్లు ఏదయినా వాదించగలరు అనితెలుస్తోంది. రేప్పొద్దున కేంద్రప్రభుత్వం సమైక్య రాష్ట్రాన్ని అలాగే ఉంచి తెలంగాణకు న్యాయం జరిగేలా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే మల్లీ ఈనాయకులే తమ స్వరం మార్చి రాష్ట్రాన్ని విడగొట్టాలనే డిమాండ్ చేయగలరు.

నిజమైన ప్రజా ఉద్యమాలు:

మరి ఇక్కడ నిజమయిన ప్రజా ఉద్యమాలు జరగలేదా అంటే జరిగాయి. మొన్న కాకరాపల్లిలో థెర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం, కారంచేడు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా చేసిన ఉద్యం, ఇలాంటివే మరికొన్ని. వీటికి ఇక్కడి ఏపెద్దనాయకుడు తమ మద్దతునివ్వడు, గట్టిగా పోరాడడు, ఏదో మొక్కుబడి ఖండనలు తప్ప. పేదోల్లకి న్యాయంజరిగేలా చేసే ఉద్యమాలకు ఇక్కడ కనీసంచదువుకుని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మద్దతివ్వదు, ఎందుకంటే వీరిలో అత్యధికులు సీమాంధ్ర ధనిక భూస్వామ్య వర్గాలవారే కాబట్టి.

Saturday 12 January 2013

చంద్రబాబు తగలేసిన మరో తెప్ప - మొత్కుపల్లి
"ఏరుదాటిన వెంటనే తెప్ప తగలేయడం", "ఓడ దిగన వెంటనే బోడి మల్లయ్య అనడం" సామెతలు చంద్రబాబుకు అతికినంతగా బహుషా ప్రపంచంలో మరెవ్వరికీ అతకదేమో. చంద్రబాబు చరిత్రలో వాడుకుని తగలేసిన తెప్పలెన్నో. అందరినీ తన అవసరానికి వాడుకోవడం, అవసరం తీరినవెంటనే వదిలెయ్యడం చంద్రబాబుకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలువదు.

తాను కాంగ్రేస్లో ఉన్నప్పుడు మామపైనే పోటీ చేస్తానని బీరాలు పలికి, తరువాత పదవికోసం మామ పంచన చేరిన చంద్రబాబు పార్టీలో తనకు సొంతబలం తయారుచేసుకున్నవెంటనే మామకే వెన్నుపోటు పొడిచాడు. మామను గద్దెను దించడానికి తోడల్లుడు దగ్గుపాటి, బావమరిది హరిక్రిష్ణ సహాయం తీసుకున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయి, వారి అవసరం తీరిన వెంటనే ఇద్దరినీ పార్టీనుంచి గెంటివేశాడు.

పార్టీలో తన అవసరంకోసం రేణుకాచౌధరినీ, జయప్రదనూ వాడుకుని వదిలేశాడు. దేవేందర్‌గౌడ్‌ను తొక్కెయ్యడానికి నాగంను లాగిన చంద్రబాబు నాగంను తొక్కెయ్యడానికి ఎర్రబెల్లి, మొథ్కుపల్లిలను వాడుకున్నాడు.

చంద్రబాబు మద్దతు, సీమాంధ్ర మీడియా కవరేజీలను చూసి రెచ్చిపోయి తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై విచక్షణారహితంగా నోరుపారేసుకున్న మొథ్కుపల్లికి ఇప్పుడు తాజాగా చంద్రబాబు తన దెబ్బ రుచి చూపించాడు. తాజాగా పార్టీలో తనకు సీనివ్వడం లేదనీ, తెలంగాణపై లెటరు విషయంలో తనను సంప్రదించలేదనీ మొథ్కుపల్లి ఏడుస్తున్నాడు. అయితే పాపం అనవసరంగా తెలంగాణ ఉద్యమంపై నోరుపారేసుకున్న మొథ్కుపల్లికి ఇప్పుడూ బయట ఎక్కడా ఉప్పు పుట్టదు. అందుకే తేలుకుట్టిన దొంగలా పడి ఉంటున్నాడు.

Tuesday 8 January 2013

తెలంగాణపై మిన్నాగుల పన్నాగం? చివరి కుట్రా?

ప్రాధాన్యం సంతరించుకున్న అక్బరుద్దీన్ ‘విద్వేష ప్రసంగాలు’
అశాంతి నెలకొల్పి.. ‘తెలంగాణ’ను జాప్యంచేసే యత్నమా?
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలు కొనసాగుతున్నదా?
తెలంగాణవాదుల మదిలో మెదులుతున్న అనుమానాలు
అప్రమత్తంగా ఉండాలి.. కుట్రలను తిప్పికొట్టాలి
తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ క్షిశేణుల పిలుపు

హైదరాబాద్, జనవరి 7 (టీ మీడియా) :మరో 20 రోజుల్లో తెలంగాణపై విస్పష్టమైన నిర్ణయం రానున్న తరుణాన.. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో సానుకూలంగా స్పందించనుందన్న సంకేతాలు వస్తున్న సమయాన.. వరుస కోర్ కమిటీ భేటీలు విధివిధానాలపై కసరత్తు జరుపుతున్నాయన్న సమాచారాల నడుమ.. తెలంగాణ నిర్ణయం కోసం కోట్ల మంది జనం ఉవ్విళ్లూరుతున్న వేళ.. మరో కుట్రకు తెర లేచిందా? వ్యతిరేక శక్తులు మళ్లీ అడ్డం నిలుస్తున్నాయా? సాకారంకానున్న దశాబ్దాల తెలంగాణ కలను చివరి నిమిషంలో చిదిమేసేందుకు మిన్నాగుల పన్నాగ రచన జరిగిందా? సగటు తెలంగాణవాసికి.. నిత్య ఉద్యమకారుడికి తలెత్తుతున్న అనుమానాలివి! ఈ అనుమానానికి కేంద్రబిందువుగా మారాయి నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసినట్లు చెబుతున్న విద్వేష ప్రసంగాలు.. అనంతర వ్యవహారాలు!! తెలంగాణపై కీలక.. తుది నిర్ణయం తీసుకునేందుకు యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరుగనున్న మినీ కోర్‌కమిటీ సమావేశానికి ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ప్రజల అప్రమత్తత అవసరమని అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు! ఉచ్చులో పడకుండా.. శాంతియుతంగా మెలిగి.. ఐక్యతను చాటి.. తెలంగాణకు సొంతమైన లౌకిక గుబాళింపులతో సొంత రాష్ట్రానికి స్వాగతం పలకాలని తీర్మానిస్తున్నారు ఉద్యమనేతలు!

మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు తాము వ్యతిరేకమని, రాష్ట్ర విభజన జరిగితే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఎంఐఎం ఉంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ అభివూపాయాలకు భిన్నంగా తెలంగాణ ఎలా వస్తుందో చూస్తామంటూ మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. గత నెలలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణపై మునుపెన్నడూ లేని స్పష్టతనిస్తూ.. నెలలోపు తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో మరో 20 రోజులుమాత్రమే మిగిలి ఉన్నాయి. అంతకుముందే అక్బరుద్దీన్ నిర్మల్‌లో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. చట్టం తన పని తాను చేసుకుపోవడంతో పాటు.. రాజకీయంగా వివిధ పక్షాలు ప్రత్యేకించి బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి మజ్లిస్ సభల్లో ఎంఐఎం నేతల వివాదాస్పద ప్రసంగాలు కొత్తేమీ కాదని, సాధారణంగా ఆ పార్టీ సమావేశాల్లో నేతల ప్రసంగాలు ఇదే మోస్తరుగా కొనసాగుతాయనే ప్రచారం లేకపోలేదు. అయితే హైదరాబాద్ వెలుపల నిర్మల్ పట్టణంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేకశక్తుల కుట్ర దాగిఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో కొంత ముందడుగు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంఐఎం వివాదాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించి కేంద్రం నిర్ణయంపై ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ వాదులు అభివూపాయపడుతున్నారు. సీమాంవూధుల కుట్రలో భాగంగానే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం కల్పించే కుతంవూతాలు పన్నుతున్నారనే వాదన ముందుకు వస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతున్నది?’ అనే పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక స్పష్టత వచ్చే సమయంలో కొంత మంది మత విద్వేషాలు రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర ఎత్తుగడలను ఎదుర్కొనే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందని అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు.. అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని మండిపడ్డారు. చెంచల్‌గూడ జైలు నుంచే వ్యూహ రచన చేసి, హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ సృష్టించి తెలంగాణ ఉద్యమాన్ని మలినం చేసేందుకు జగన్ కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రెండు సమైక్యవాద పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కోదాడలో జరిగిన ఒక సభలో విమర్శించారు.

అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సమక్షంలో దాదాపు రాజకీయపార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా చెప్పకపోగా సకాలంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ విషయంపై పరిష్కార మార్గానికి చొరవ తీసుకుంటున్నది. అందులో భాగంగానే సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల సమక్షంలో కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. రాహుల్‌గాంధీ విదేశాల నుంచివచ్చినందున మంగళవారం జరుగుతుందని భావిస్తున్న మినీ కోర్‌కమిటీ సమావేశం తెలంగాణపై మరింత స్పష్టత వచ్చే అవకాశాన్ని పెంచింది. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తెలంగాణవాదుల్లో నెలకొంది. అయితే మరో ఇరవై రోజుల్లో పరిష్కార మార్గం కనిపిస్తుండగా, కుట్రదారులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే మైనారిటీలకు అభవూదత ఉంటుందని, మతకలహాలు పెరుగుతాయని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఒవైసీ పరిణామాల వెనుక ఇలాంటి కుట్ర దాగిఉందనే అనుమానాలు లేకపోలేదు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తున్నది. దీంతో ఈ వివాదం చిలికి చిలిగా గాలివానగా మారి మరింత ముదురుతున్నది. తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో సీమాంధ్ర నేతలు అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకు, రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ వాదులు అభివూపాయపడుతున్నారు. అక్బరుద్దీన్ నిర్మల్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ముందస్తు కుట్ర దాగిఉందన్న అనుమానాలను టీ వాదులు వ్యక్తం చేస్తున్నారు. తాజా ఉద్రిక్తతలకు కారణాలు ఏమైనా తెలంగాణవాదులు మజ్లిస్, తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలను ఛేదించే దిశగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఉద్యమకారులు పిలుపునిస్తున్నారు.

Thursday 3 January 2013

ఉరేయాల్సిందే! రేపిస్టులను వదలొద్దు - చంద్రబాబు ఉవాచ


దేశంలో ఎక్కడ ఏసంఘటణ జరిగినా ఆఇష్యూను తనకు అడ్వాంటేజీగా తీసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడడం చంద్రబాబు అలవాటు. అయితే తనదాకా వస్తే మాత్రం ఆయన సిద్ధాంతాలన్నీ మారిపోతాయి.

జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హజారే దీక్ష చేస్తుంటే చంద్రబాబు తానే అన్నాహజారే మేనల్లుడిలాగా ఫోజుకొట్టి మరీ ఉద్యమానికి మద్దతు పలికాడు. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలిని లోకాయుక్త పరిధిలోకి తీసుకురావడానికి మాత్రం వెనక్కి తగ్గాడు ఇదే చంద్రబాబు.

ఎక్కడయినా సీమాంధ్రలో ఫాక్షన్ మర్డర్ జరిగితే ఫాక్షనిజంపై బుసలు గొడతాడు, కానీ తనపార్టీకి చెందిన సీమాంధ్ర నాయకుల్లో మాత్రం సగానికి సగం ఫాక్షనిస్టులే.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఢిల్లీ రేప్ సంఘటనపై విరుచుకుపడుతున్నాడు. చస్తున్నా పదవికోసం పాదయాత్ర సందర్భంగా కొందరు విద్యార్థినులు చంద్రబాబుతో రేపిస్టులను ఊరితీయాలని అడిగారట. చంద్రబాబు వెంటనే నిజమే రేపిస్టులను ఉరితీయాల్సిందే, ఉరితీస్తేగానీ మిగతావాళ్ళకు బుద్ధిరాదని సెలవిచ్చాడట. చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు కూడా ట్విట్టర్లో ఒకటే రేప్ సంఘటనపై విమర్శలు గుప్పిస్తున్నాడు. మంచిదే.. అయితే మరి టీడీపీ పార్టీలో పరిస్తితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.

టీడీపీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలలో ముగ్గురు రేప్, మోలెస్టేషన్ కేసులపై అరెస్టయినారు. దెందులొరు ఎమ్మెల్యే చింతమనేని ప్రకాశ్ మోలెస్టేషన్ కేసు ఎదుర్కొంటుండగా కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు తన నర్సింగ్ కాలీజీ విద్యార్థినులపై అత్యాచర ప్రయత్నం చేసినందుకు అరెస్టయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రేప్ కేసులో అరెస్టు కాగా ప్రస్తుతం కేసు నడుస్తుంది.
 
చంద్రబాబూ, ఢిల్లీ రేపిస్టుల అరెస్టు సంగతి తరువాత, ముందు నీ సొంతపార్టీలో రేప్ కేసులెదుర్కుంటున్నవారిని పార్టీనుండి సస్పెండ్ ఎప్పుడు చేస్తావు?