Wednesday, 31 October 2012

సీమాంధ్రలో నో బతుకమ్మ?!!


ఉయ్యాల బ్లాగరు మిత్రుడు మంచి ప్రశ్న ఒకటి అడిగాడు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగను తెలంగాణా వాసులు తెలంగాణలో జరుకోవడంతోపాటు న్యూయార్క్, డల్లాస్, అట్లాంటా, సిడ్నీ, దుబాయి, లండన్ లాంటి ప్రపంచంలోని పలుచోట్ల ఉన్న తెలంగాణ వాసులు జరుపుకున్నారు. మనదేశంలో సూరత్, ఢిల్లీ, ముంబాయి, షోలాపూర్ లాంటి పలుచోట్లకూడా అక్కడ ఉన్న తెలంగాణ వాసులు బతుకమ్మపండుగ జరుపుకున్నారు. కానీ సీమాంధ్రలో గుంటూరులోగానీ, బెజవాడలోగానీ, ఒంగోలు, కర్నూలు లల్లో, ఇంకెక్కడా బతుకమ్మ పండగ జరుపుకోలేదు. కారణం?

ఎవరి పండగలు వారివి. సీమాంధ్రులు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకోలేదనేది ఇక్కడ ప్రశ్నకాదు. అలాగే తెలంగాణవాసులు సంక్రాంతికి కోళ్ళపందాలు, అట్లతద్ది, పైడితళ్ళి పండగలు చేసుకోరు. కానీ అక్కడి తెలంగాణవాసులు ఎందుకు బతుకమ్మ పండగ చేసుకోలేదు? ఏం, పట్టుమని పదిమంది తెలంగాణ ఆడపడుచులు సీమాంధ్ర పట్టణాల్లో లేరా? ఎందుకు లేరు?

వ్యవసాయానికి సాగునీరులేక, పంటలు పండక, పనులు దొరకక తెలంగాణావాసులు దశాబ్దాలుగా నౌసారి, భీమండి, బొంబాయి, షోలాపూరు, దుబాయి, మస్కట్, రియాద్ వలస వెళ్ళి పనులు వెతుక్కుంటున్నారు. బ్రతుకుతెరువుకోసం అక్కదికి వెళ్ళినవారు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఇటీవల ఐటీ బూమ్‌లో అందరితోపాటు తెలంగాణవాసులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లకు వెళ్ళారు. ఉద్యమంలో భాగంగా జరుగిన సంస్కృతి పునర్నిర్మాణంలో  భాగంగా అక్కడా బతుకమ్మ జరుపుకున్నారు.

కానీ ఏవ్యవసాయకూలీలూ పనులకోసం పక్కనే ఉన్న గుంటూరుకో, కర్నూలుకో వెల్లిన ధాకళాలు కనపడవు. ఉద్యోగస్తులు కూడా ఎవరూ సీమాంధ్ర ట్రాన్స్‌ఫర్‌కు ఇష్టపడరు. కారణం: మనుషులు పొట్టకూటికోసం వలస వెలతారు, కానీ పొట్టకంటే కూడా మనిషి రక్షణ, మర్యాదలకు విలువనిస్తాడు, అవి దొరకనిదగ్గరకు వలస వెల్లడు.

హైదరాబాదు రాజధాని కనుక ఇక్కడ పనులు దొరుకుతున్నాయి కనుక మేం వస్తున్నాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం: సీమాంధ్రులు ఒక్క హైదరాబాదులోనే కాదు, నల్లగొండ,నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలా ఎక్కద చూసినా పళ్ళె, పట్టణం తేడాలేకుండా తెలంగాణలో సీమాంధ్రులు నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఒక గుంటూరు వాడ ఉంటుంది, అక్కడ సీమాంధ్రవారు నివాసం ఏర్పరుచుకుని ఉంటారు. మరి సీమాంధ్రలో మాత్రం తెలంగాణవారు ఎందుకు లేరు?

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమయిన విషయం, తెలంగాణలో సీమాంధ్రవారు మాత్రమేకాదు, ఎప్పటినుంచో బిహారీలు, మార్వాడీలు, సింధీలు, పంజాబీ, మహరాష్ట్రియన్లు, కన్నడిగలు ఉన్నారు, తెలంగాణ వాసులతో మమేకమయి నివసిస్తున్నారు, వారి వారి సంస్కృతిని, ఐడెంటిటీని కాపాడుకుంటునారు. సీమాంధ్రలో తోటి తెలుగువారయిన తెలంగాణప్రజలు లేనట్లే, అక్కడ బిహారీలు,  పంజాబీలు, మహరాష్ట్రియన్లు ఎవరూ లేరు. కారణం అక్కడ కొత్తవారిని కలుపుకుపోయే స్వభావం తక్కువకనుక, పక్కవారిని తక్కువవారిగా చూడడం, అణచివేయడం పరిపాటి కనుక.


 ఈపరిస్థితికి ఇంకా ఫ్యూడలిజం వాసనలు తొలగిపోని సీమాంధ్రలో జనం కులాలుగా విభజించబడి తమకులమే అధికమనే భావన కలిగిఉండడం ఒక కారణం కావొచ్చు.  ముఠాకక్షలు, దళితులపై దాడులు సాధారణమయిన ఇక్కడ కొత్తవారికి రక్షణ అనిపించదు. ఇటీవల తెలంగాణ ఉద్యమం బలపడినతరువాత వీరి పరప్రాంత అసహనం మరీ పెరిగింది. తెలంగాణవాసులు గుడికెల్దామని వెలితే దాడులు, వైజాగ్‌లో బాక్సింగ్ పోటీలకని వెల్లినవారిపై దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

సమైక్య ఉద్యమం @ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్} ఆనాడు అదే కంట్రోల్ రూం

సమైక్య ఉద్యమం @ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్} ఆనాడు అదే కంట్రోల్ రూం
PRAVEENKUMAR-REDDY_6
- ఎమ్మెల్యేల రాజీనామాలకు బాబే కారణం
- పార్టీ కార్యక్రమంగానే సమైక్యాంధ్ర బస్సు యాత్ర
- కేంద్రానికి లేఖ ఇచ్చామని ఇక్కడ కలరింగ్..
అది డమ్మీ లెటర్ అంటూ అక్కడ కవరింగ్
- బాబు వైఖరిపై ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి నిప్పులు 

హైదరాబాద్, అక్టోబర్ 30 (టీ మీడియా): టీడీపీ అధినేత చంద్రబాబు లోగుట్టును ఆయన సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రవీణ్‌డ్డి బయటపెట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు టీడీపీ కార్యాలయం కంట్రోల్‌రూమ్‌గా పనిచేసిందని చిత్తూరు జిల్లా తంబాలపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌డ్డి సంచలన రీతిలో వెల్లడించారు. డిసెంబర్ 9 ప్రకటన అనంతరం సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలకు చంద్రబాబే సూత్రధారి అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనను కూడా చంద్రబాబు భాగస్వామిని చేశారని వెల్లడించారు. తెలంగాణ విషయంలో ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఒక చానల్‌తో మాట్లాడిన ప్రవీణ్‌డ్డి.. తెలంగాణ విషయంలో కేంద్రానికి లేఖ ఇచ్చానని కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు.. సీమాంధ్ర నేతల వద్ద మాత్రం అందులో ఏమీ లేదని, అది ఉత్తుత్తి లేఖ అని, దానిని పట్టించుకోవద్దని చెప్పారని అన్నారు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, తెలంగాణపై ప్రకటన వచ్చిన తరువాత చంద్రబాబు పార్టీ కార్యక్షికమంలాగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేయించారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9 రాత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారని, మరుసటి రోజు చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అన్నారు. సీమాంవూధలో సమైక్య ఉద్యమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే డైరెక్షన్ వచ్చిందన్నారు. ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పార్టీ కార్యక్షికమంలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే మానిటరింగ్ చేశారన్నారు. ఆనాడు సమైక్య ఉద్యమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కంట్రోల్ రూమ్‌లాగా పని చేసిందన్నారు. ఆనాడు సీమాంవూధలో పార్టీనే బస్సుయాత్ర చేయించిందని, బస్సును పంపించి, దానికి అయ్యే ఖర్చులను కూడా పార్టీనే ఇచ్చిందని తెలిపారు.

ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కదలిక తెచ్చేందుకు తనను సైతం ఉపయోగించారని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకొని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని ఆనాడు సీమాంధ్ర నేతలను ఢిల్లీకి పంపించింది చంద్రబాబేనన్నారు. దీనిని కూడా పార్టీ ఖర్చులతో పార్టీ కార్యక్షికమంగా చేపట్టారని వివరించారు. తెలంగాణపై ఢిల్లీలోచిదంబరం అఖిలపక్షం నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడు కావాలనే సీమాంధ్ర నుంచి యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌డ్డిని పంపించారని అన్నారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసైం తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాడని అన్నారు. సమైక్య ఉద్యమ బాధ్యతలను రాయలసీమలో పయ్యావుల కేశవ్‌కు, ఆంధ్రాలో దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగించారని చెప్పారు. 

Thursday, 25 October 2012

కొందరు!!రూపం నటనా సున్నానే,
అయినా ఇష్టం ఆహీరోనే!
ఔను, మరి నాదీ ఆకులమే!!


అన్నాహజారె వెంటనడుద్దాం,
అవినీతిని నాయకులనెండగడుదాం!
ఒక్క నాకులం నేతను తప్ప!


మాబలం ఫాక్షనిజం,
మానైజం రౌడీయిజం
బస్సుపై రాళ్ళేస్తారా?
హింస! హింస! హింస!!


నాడు!!
అరవోడు దోచుకుంటుండు,
మననీళ్ళు కాజేస్తుండు
మనోళ్లను నొక్కేస్తుండు! 
నేడు!
ఏం, మేం దోచుకుంటున్నామా?
మమ్మల్ని దొంగలంటావా? 
బొమ్మాలీ... నిన్నొదల!! 


నీకు తెలుగు రాదు!
నీకు ఇంగ్లీషు రాదు!
నీకు తెలివి లేదు!
నువ్వు తాలెబన్‌వి. 
విడిపోతామంటావా?
నన్నొదిలేసి వెల్తావా?
కుదరదు గాక కుదరదు.
ఔను, నీదీ నాదీ ఒకేజాతి. 


Wednesday, 24 October 2012

ఎవరిది దాడులకు పాల్పడే నైజం?
తెలంగాణవాదాన్ని విమర్శించడానికి సీమాంధ్ర మిత్రులు ఉపయోగించే ఒకానొక ఆయుధం "మీరు సీమాంధ్రులపై దాడులు జరుపుతున్నారు", "మీకేసీఆర్ నరకండి, చపండి అంటడు", "మీరు మా ఆస్థులపై దాడి చేస్తారు" లాంటి కొన్ని అవాస్తవాలు, అభూతకల్పనలు. అయ్యా, తెలంగాణ వాదులు మీపై ఎప్పుడు దాడులు చేశారు, ఎప్పుడు కేసీఆర్ నరకండి చంపండి అన్నాడు అంటే వీరిదగ్గర సమాధానం ఉండదు. కారణం అవి పూర్తి అవాస్తవాలు గనక, గత పన్నెండు సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడూ తెలంగాణలోని సీమాంధ్రులపై దాడులకు పాల్పడదం గానీ అందుకు నాయకులు ప్రేరేపించడం గానీ జరగలేదు గనక.  

అసలు దాడులకు పాల్పడే నైజం ఎవరిది? ఫాక్షనిజం, రౌడీయిజం, దళితుల ఊచకోత సాధారణంగా ఎక్కడ జరుగుతుంటాయి అంటే వాటికీ వీరిదగ్గర సమాధానం ఉండదు. కారణం వారి అసలురంగు అదే కావడం, అసెంబ్లీలో సగం సీమాంధ్రనేతలు ఫాక్షనిజానికి కొమ్ముకాసేవారుకాగా నాటి పదిరికుప్పం, కారంచేడులదగ్గరినుండి ఇటీవలి లక్షింపేటదాక వీరి దళితుల ఊచకోతకు అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉండడం. 
  
ఫాక్షనిజం, దళితుల ఊచకోతలు సీమాంధ్రకే పరిమితం కదా, దానివళ్ళ తెలంగాణవారికేంటి బాధ అని ఎవరైనా అడగొచ్చు. ఈసంఘటణలు వారి నైజానికి ప్రతీకలు కాగా ఇలాంటి రౌడీ ఫాక్షనిస్టులను వారు గెలిపిస్తూ ఉండడం వలన వారు అధికారంలోకొచ్చి పరిపాలనాయంత్రాంగాన్ని ఒక మాఫియా ముఠాలా తయారుచేయడంవలన తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇదిమాత్రమే కాక ప్రస్తుత సున్నిత వాతావరణంలో సీమాంధ్రలో పలుమార్లు తెలంగాణప్రజలపై దాడులు జరుగుతున్నాయి.


వైజాగ్‌లో తెలంగాణ బాక్సర్లపై దాడి:

ఆటలను ఆటలుగా చూసే క్రీడాస్ఫూర్తిలేని కొందరు తెలంగాణ బాక్సర్ గెలుపును ఓర్వలేక దాడులకు పాల్పడ్డ హేయమైన చర్య ఇటీవల  ఇటీవలి ఉదంతం. ఈనెల 19న వైజాగ్‌లో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జరిగాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన ఒక బాక్సర్ ఆంధ్రాకు చెందిన మరోబాక్సర్‌పై గెలవగా అది సహించలేని సీమాంధ్రా బాక్సర్లు మూకుమ్మడిగా ప్రేక్షకులు చూస్తుండగానే తెలంగాణ బాక్సర్లపై దాడి చేశారు. ఘటనలో ఏడుగురు తెలంగాణ బాక్సర్లు తీవ్రంగా గాయపడ్డారు.


పెనుగంచిప్రోలులో తెలంగాణ కుటుంబంపై దాడి:కొన్నినెల్లలక్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కుటుంబం మొక్కు చెల్లించుకోవడానికి నల్లగొండకు ఆనుకుని క్రిష్ణాజిల్లాలొని పెనుగంచిప్రోలు తిరుపతమ్మగుడికి వెళ్ళారు. వీరు ఒక రెంటల్ సుమోను అద్దెకు తీసుకుని వెల్లగా ఆసుమోపై "జైతెలంగాణ" అనే స్టికర్ ఉండడం పాపమయిపోయింది. అక్కడి ఊరివారు వీరిపై మూకుమ్మడిగా దాడిచేసి స్త్రీలు, గర్భినీ అని కూడా చూడకుండా పాశవికంగా దాడి జరిపారు. అక్కడి మూకలు రాడ్లతో దాడిచేసిన ఈఘటనలో కుటుంబంలో అందరికీ తీవ్రగాయాలయ్యాయి. గర్భిణీ స్త్రీనికూదా కిరాతకంగా నేలపై పడేసి కొట్టారు. 
రాజోలిబండ రగడ:కర్నూలు, మహబూబ్‌నగర్లమధ్య ఉన్న రాజోలిబండ ప్రాజెక్టు మహబూబ్నగర్లో కొన్ని మండలాలకు నీళ్ళిస్తుంది. దీనికి దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీ కర్నూలుకు నీళ్ళందిస్తుంది. రెండు ప్రాంతాలకూ నీళ్ళు సమానంగా వచ్చేట్లుగా రాజోలిబండలో సగం గేట్లు తెరిచి, సగం మూయబడి ఉంటాయి. మహబూబ్‌నగర్¨కు నీళ్ళు రాకుండా చెయ్యదానికి గత పది సంవత్సరాలలో మూడు సార్లు ఇక్కడ సీమాంధ్ర నేతల అధ్వర్యంలో ఫాక్షన్ మూకలు రాజోలిబండ గేట్లను పగల గొట్టడం జరిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా నిరశన తెలపడానికి జేయేసీ ప్రయత్నించగా అవతలివైపునుంచి కర్నూలు ఫాక్షన్ మూకలు సుమోళ్ళో కత్తులు, గొడ్డల్లు, బరిసెలతో చేరుకున్నారు.


నంద్యాల ఎడ్లపందెంలో దాడి:

ఇంతేకాక నంద్యాలలో ఎడ్లపందాలు జరిగినపుడు తెలంగాణ నుండి కొందరు తమ ఎడ్లను పందానికి పంపగా తెలంగాణా ఎడ్లను దుండగులు రాళ్ళతో కొట్టడం జరిగింది. ఎడ్లేం పాపం జేసాయో?

ఇవి కేవలం కొన్ని దృష్టాంత్యాలు కాగా ఇలాంటి సంఘటణలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. సీమాంధ్ర నాయకులు హింసను ప్రోత్సహిస్తున్నట్లుగా బయటపడరు, కానీ ఇలాంతి పనులు వారి కనుసన్నల్లో వారి అణుచరులచేతనే జరుగుతుంటాయనేది జగమెరిగిన సత్యం. 

రిగ్గింగులో చంద్రబాబు "లీన్" ప్రాజెక్టు
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గురించి తెలిసినవారికి "లీన్" (LEAN) మెథడాలజీ గురించి తెలిసే ఉంటుంది. "లీన్"లో ఒక ప్రాజెక్టు ప్రాసెస్‌ను అధ్యయనం చేసి అందులో ఉత్పత్తి తగ్గడానికి విధానంలో ఉన్న అవరోధకాలను (pain areas) తెలుసుకుని, ఈఅవరోధకాలను అధిగమించడానికి ప్రణాలికను తయారుచేయడం "లీన్" లో ఒక ముఖ్యమైన అంశం.

చంద్రబాబు మామను దించేసి ముఖ్యమంత్రిగా అయినతరువాత "లాప్‌టాప్స్"తో పవర్ పాయింటు ప్రెజెంటేషన్లు దంచేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పచ్చపత్రికలతో బాకా ఊదించుకుంటున్న రోజుల్లో ఎవరో ఈయన చెవిలో "లీన్" ప్రాజెక్టు గురించి సమాచారాన్ని చేరవేశారట. వెంటనే మన చంద్రబాబుకు 1999 ఎన్నికల్లో గెలవాలంటే వోట్లు దండుకోవడానికి నామామకూడా లేడు, నామొహాన్ని జూసి మీటింగు పెడితే ఒక్కరు కూడా రాడు కదా అన్న విషయం గుర్తొచ్చింది. ఇంకేముంది ఎలక్షన్లలో ఎలా గెలవాలో ఒక "లీన్" ప్రాజెక్టు చేయమని తన పచ్చతమ్ముళ్ళకు పురమాయించాడట.

ఈవిషయ్మ్ మీద స్టడీ చేసిన పచ్చతమ్ముల్లు ఇల్ల ఆలోచించారు. ఎలక్షన్లలో నెగ్గాలంటే నాలుగు మార్గాలు 1) ఎంటీఆర్ లా ప్రజాకర్షణ కలిగి ఉండడం 2) మంచిపనులు చేసి ప్రజల మనసులు గెలవడం 3) మీడియాలో బాగా ప్రచారం పొందడం 4) రిగ్గింగ్ చెయ్యడం. మొదటిది అసాధ్యం. రెండవది కష్టం. మూడవది ఎలాగూ పచ్చపత్రికలద్వారా జరుగుతూనే ఉంది కానీ సరిపోదు. నాల్గవదానిపై ఏంచెయ్యాలి?

"రిగ్గింగ్" అనే ప్రాజెక్టులో అతిపెద్ద అవరోధం (pain area) ఏమిటంటే డబ్బులు తీసుకున్నవాడిదగ్గరనుండి వోటు రాబట్టడం. అన్ని పార్టీలూ డబ్బులిస్తాయి, వోటరు అందరిదగ్గరా డబ్బు తీసుకుంటాడు గానీ చివరికి ఎవరికి వోటేస్తాడో తెలియదు. మరి వోటరుకు డబ్బు ఇచ్చాక ఖచ్చితంగా వోటు రాబట్టడం ఎలా?

దీనికోసం రాత్రింబవళ్ళు ఆలోచించి తెలుగు తమ్ముళ్ళు చివరికి ఒక పక్కా ప్రణాలికను చంద్రబాబుకు సమర్పించారు. అదేమిటంటే ఎలక్షన్లరోజు ప్రతి బూతులోనూ ముందు ఒక తెదేకార్యకర్త వోటు వెయ్యడానికి వెల్తాడు. అయితే వోటు వెయ్యడం కోసం ఇచ్చిన బ్యాలెట్ పేపరును పోలింగ్ డబ్బాలో వేయకుండా ఒక తెల్లకాగితం మడిచి వేస్తారు, బ్యాలెట్ పేపరును జాగ్రత్తగా రహస్యంగా బయటికి తీసుకొస్తారు.

ఆతరువాత ఆబ్యాలెట్ పేపరుపై ముందే సైకిలు గుర్తుపై స్టాంపు గుద్ది దాన్ని వోటరు మహాశయునికిస్తారు. వోటు వెయ్యడానికి పోలింగ్‌బూత్ లోపలికి వెల్లే వోటరు మహాసయుడు ఇప్పుడు తనకిచ్చిన ముందే స్టాంపు గుద్దిన బ్యాలెట్ పేపరును డబ్బాలో వేయాలి, తనకిచ్చిన ముద్ర గుద్దని బ్యాలెట్ పేపరును బయటికి తీసుకురావాలి. అలా ముద్రగుద్దని బ్యాలెట్ పేపరును బయటికి తీసుకొస్తేనే రిగ్గింగ్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే డబ్బులు ఇవ్వరు.

తరువాతి వోతరుకు మల్లీ ఈబ్యాలెట్ పేపరుపై ముద్ర గుద్ది ఇస్తారు, మల్లీ అదేపద్దతి ఇప్పుడూ రిపీట్ అవుతుంది.

ఈవిధంగా పక్కాగా తయారుచేసిన ప్రణాలిక చంద్రబాబుకు వెంటనే నచ్చేసింది. రాష్ట్రమంతటా అన్ని బూతుల్లో ఇదేపద్దతి పాటించండని తెలుగుతమ్ముళ్ళకు పురమాయించాడు. రహస్యంగా పకడ్బందీగా తయారు చేసిన ఈప్రణాలికతో రిగ్గింగు చెయ్యడం, పచ్చపత్రికల్ల్లో ఊదిన బాకా తోడవ్వడంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబు  కాంగ్రేస్‌పై గెలిచేశాడు.  ఎన్‌టీఆర్ను కాదని చంద్రబాబు తన సొంత బలంతో గెలిచిన ఒకే ఒక ఎన్నిక ఇది.

ఈపద్దతిని 2004 ఎన్నికల్లోగా కాంగ్రేస్ తెలుసుకుందో లేదో యెలియదు గానీ 2004లో వచ్చిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లతో చంద్రబాబు ప్రణాలిక మాత్రం అమలు జరపడం కుదరలేదు. అప్పటినుంచీ చంద్రబాబు ఈవీఎంలమీద ఏడుస్తూనే ఉన్నాడు.  


Tuesday, 23 October 2012

పవన్ సినిమాపై తెలంగాణకు ఎందుకు అంత కోపమొచ్చింది?


గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రాంత ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని చులకనచేస్తూ సినిమాలు తీస్తూ వస్తోంది. దీనిపై తెలంగాణ ప్రజలు అనేక విధాలుగా తమ నిరసన వెలిబుచ్చారు. అయితే ఈ సారి ఆ ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పట్టరాని ఆగ్రహానికి పవన్ సినిమా తెలంగాణలో నడవలేని పరిస్థితి వచ్చింది. దీనికి తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణపై చూపిస్తున్న వివక్ష ఒక కారణం కాగా దీనికి మరో ప్రధాన కారణం అటు చిరంజీవి, ఇటు పవన్ కల్యాణ్ తెలంగాణకు చేసిన వ్యక్తిగత ద్రోహం.
మూడున్నరేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు పలికాడు. జగిత్యాల రోడ్ షోలో చాలా ఉద్వేగంగా ప్రసంగిస్తూ (నటిస్తూ?) తెలంగాణ ఉద్యమానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని నమ్మబలికాడు.


అన్న బాటలోనే తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ రాష్ట సాధన ఉద్యమానికి మద్ధతిచ్చాడు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక సభ పెట్టి అక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు.
కరీం నగర్లో జరిగిన ఒక సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణపై తమకున్నంత చిత్తశుద్ధి మరెవరికీ లేదన్నాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. పైకేదో సామాజిక స్పృహ, గాడిదగుడ్డు అని ఫోజులు కొట్టే ఈ హీరో ఎంత ఘోరంగా తెలంగాణ ప్రజలను వంచించాడో.
ఆ రోజుల్లో తెలంగాణలో లక్షలాది మంది అభిమానులు ఈ అన్న, తమ్ముళ్ల మాటలు నమ్మారు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే అటు అన్న, ఇటు తమ్ముడు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించారు.
చిరంజీవి బూటకపు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోగా, తమ్ముడు పవన్ అప్పటి నుండి ఈ విషయంపై మాట్లాడమే మానేశాడు.
అట్లాంటి మనిషి ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఉద్యమాన్నే టార్గెట్ చేస్తూ సినిమా తీసేసరికి ఇక్కడి ప్రజలకు గుండె మండింది. నమ్మించి తమ గొంతుకోసినందుకే పవన్ కల్యాణ్ తాజా సినిమాపై తెలంగాణ ప్రజల ఆగ్రహం రెట్టింపైంది.
వివాదం తరువాత సినిమాలో దాదాపు 15 సీన్లను కత్తెర వేయాల్సి వచ్చిందంటే ఒకసారి ఊహించుకోండి పవన్, పూరి జగన్నాధ్ ఈ సినిమాను ఎంత నిర్ల్యక్షంగా తీశారో.
source. missiontelangana.com

Monday, 22 October 2012

తెలంగాణ సినీప్రముఖులు


పైడి జైరాజ్:


కరీంనగర్లో పుట్టి హైదరాబాద్లో చదువుకున్న పైడి జైరాజ్ సినిమాలపై ఇష్టం పెంచుకుని బొంబాయి వెల్లి బాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 1930-50 మధ్యలో 170 సినిమాలకు పైగా కధానాయకుడుగా నటించిన జైరాజ్ హిందీ సినిమాల నిర్మాణం, దర్శకత్వం కూడా చేశాదు. ఆకాలంలో అగ్ర నటీమణులందరి సరసన హీరోగా నటించిన జైరాజ్ 1980 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు.


బీ. నర్సింగరావు


మెదక్ జిల్లా పగ్న్యాపూర్‌లో పుట్టిన బీ. నర్సింగరావు నాటకరంగం నుండి సినీరంగానికి వచ్చి దర్శకుడు, నిర్మాత, రచయితగా మంచి సినిమాలు తీసి అవార్డులందుకున్నాడు. 1979లో తీసిన మాభూమి సినిమాకు నర్సింగరావు గౌతం ఘోష్‌కు సహ దర్శకుడు మాత్రమే కాక రచయిత, నిర్మాత కూడా. నర్సింగరావ్ ఇంకా రంగులకల, మట్టిమనుషులు, దాసి సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాసి సినిమాకు 5 నేషనల్ అవార్డులు వచ్చాయి.

శ్యాంబెనెగల్:


సికందరాబాద్ తిరుమలగిరిలో పుట్టిన శ్యాంబెనెగల్ (అసలు పేరు బెనెగళ్ళ శ్యాంసుందర్) నిజాం కాలేజీ, ఉస్మానియాల్లో చదివుకున్నారు. అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక లాంటి అద్భుత సినిమాలు హిందీలో తీసి హిందీసినిమాలో ఒక కొత్త శకాన్ని సృష్టించిన శ్యాంబెనెగల్ అనుగ్రహం అనే తెలుగు సినిమా కూడా తీశాడు.   బెనెగల్ సినీరంగంలో తన కృషికి పద్మశ్రీ, పద్మభూషన్, దాదాసాహెబ్ఫాల్కే అవార్డులు దక్కించుకున్నాడు.


కాంతారావు:


నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కాంతారావు 400కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. కత్తియుద్ధానికి పేరుగాంచిన కాంతారావు పౌరాణిక, జానపద సినిమాల్లో హీరోగా అరవైల్లో ఒక ఊపు ఊపాడు. తెలుగుసినిమాల్లోనేకాక హిందీ, తమళ, కన్నడ సినిమాల్లో కూడా నటించిన కాంతారావు హేమ ఫిలింస్ బ్యానరుపై సినిమాలు నిర్మించాడు కూడా. అయితే చివరిదశలో ఎంతోపేదరికంలో గడిపిన కాంతారావు మద్రాసునుండి సినీఫీల్డు హైదరాబాదుకు వచ్చినప్పుడు సినిఫీల్డులో అందరికీ ఫిలింనగర్లో ప్లాట్లు లభించినప్పటికీ తను మాత్రం వందగజాలు కూడా దక్కించుకోలేకపోయాడు.

Sunday, 21 October 2012

ఘనత వహించిన తెలుగుసినిమా వారి వేర్పాటువాదం


తెలంగాణ ప్రజలు తమ హక్కుల సాధనకోసం, తమ అవకాశాలను తమకు దక్కకుండా దశాబ్దాలుగా జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మన తెలుగు సినిమా వారికి అదో హాస్యాస్పద అంశం అయిపోయింది, ప్రతివాడూ సినిమాల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టాడు. తెలుగుసినిమాను గుప్పిట్లో పెట్టుకున్న ఒక వర్గం వారు తెలంగాణా సంస్కృతిపై ఒకపద్దతి  ప్రకారం దాడి చేయడంతోపాటు ఇప్పుడు ఉద్యమంపై కూడా సినిమా అనే మాధ్యమంద్వారా దాడి చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నంలో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఐక్యతనూ తామే కాపాడుతున్నట్టు చూపించుకునే వీరికి తెలంగాణ ప్రజలకు ముల్కీ రూల్స్ విషయంలో న్యాయం దొరికిన వెంటనే న్యాయాన్ని దక్కకుండా చేసే ఉద్దేషంతో మొదలు పెట్టిన జైఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మాత్రం తెలుగుజాతి ఐక్యత గుర్తుకు రాలేదు. తెలుగుజాతి మనది అన్నవారూ, తెలుగు వీర లేవరా అన్నవారూ అంతా ఎక్కడివారు అక్కడ గప్చుప్ దొంగల్లాగా జైఆంధ్రా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఘనత వహించిన వీరి వేర్పాటు వాదం చూడండి:

1) అంజలీదేవి  
2)  వాణిశ్రీ 
3)  జమున 
4) ఎస్.వీ. రంగారావు  
5) ఛాయాదేవి 
6) Gummadi speaking in support in a Jai Andhra Meeting 1972
7) Krishnam Raju statement in support of Jai Andhra
8 )  Shoban Babu mourns Jai Andhra Martyrs!
9)  Krishna in support of Jai Andhra

నంది అవార్డుల వెనుకఈసంవత్సరం తెలంగాణ సినిమాలు జైబోలో తెలంగాణ, ఇంకెన్నాళ్ళు సినిమాలకు నంది అవార్డులు   రావడం తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణ కళాకారులను అణగదొక్కి, తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్మే తెలుగు ఫిల్మ్ ఇందస్ట్రీ, తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అణగదొక్కుతూ జైబోలో తెలంగాణ సినిమా సెన్సారుకు కూడా ఎన్నో అవరోధాలు కలిపించిన ప్రభుత్వం కలిసి తెలంగాణ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.

నిజానికి ఈసినిమాలకు అవార్డులు రావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. జైబోలో తెలంగాణకు సౌథ్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడే అరుదైన అవకాశం కూడా లభించింది. నిజానికి ఈసినిమాకు ఉత్తమ సినిమా అవార్డు రావాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే జాతీయ సమగ్రత, రాష్త్రంలో అందరు ప్రజలకు సమాన అవకాశాలు లభించబడ్డప్పుడే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, ఒక ప్రాంతప్రజల అవకాశాలను వారికి కాకుండా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, దేశానికీ నష్టం. రాష్ట్రం కేవలం తెలుగు మాట్లాడేవారిది కాదు, ఇక్కడ నివసించే అందరిదీ. ఈఉద్యమం మరోప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదు, దోపిడీ చేసే వర్గానికి మాత్రమే వ్యతిరేకం అనే సందేశాన్ని చక్కగా చూపించిన జైబోలో తెలంగాణ జాతీయ సమగ్రతా అవార్డుకు అన్నివిధాలుగా అర్హమయినది.

అయితే ఈసినిమాకు అవార్డు రావడం ఆశ్చర్యం కలిగించడానికి కారణం గత అనుభవాలు. ఎప్పుడూ మోసం చేసేవాడు ఒక్కసారిగా మంచిపని చేస్తే ఆశ్చర్యం సహజంగా కలుగుతుంది. గతంలో ఇంతకన్నా చక్కని సినిమాలు కూడా నంది అవార్డుల విషయంలో తిరస్కారానికి గురయ్యాయి. ఉదాహరణకు మాభూమి, అంకురం, దాసి, భద్రం కొడుకో వంటి సినిమాలకు నేషనల్ అవార్డులు లభించినా నంది అవార్డులు మాత్రం దక్కలేదు.

నంది అవార్డులను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈకమిటీని ప్రభుత్వం నియమించినా ఫిల్మ్ ఇండస్ట్రీ శిఫార్సు చేసినవారినే గతంలో ప్రభుత్వం ఈకమిటీసభ్యులుగా నియమించేది. సహజంగానే ఈసభ్యులందరూ ఇండస్ట్రీకి గుత్తాధిపత్యం వహిస్తున్న వర్గం (నాలుగు కుటుంబాలు, రెండు కులాలు, ఒక ప్రాంతం) వారికి కావల్సిన వారు అయుంటారు కనుక అన్ని అవార్డులూ వారికే వచ్చేవి.  ఈమధ్యన ఈనలుగురి పెత్తనంవల్ల తెలుగులో కాస్త మంచి ఇండిపెండెంట్ సినిమాలు తీసే దర్శకులే కరువయ్యారు ( క్రిష్, చంద్ర సిద్ధార్థ్ లాంటి ఒకరిద్దరు తప్ప) కనుక ఈ అవార్డుల నిర్ణయాలు మరీ శృతిమించాయి. బాలక్రిష్ణకూ, దాసరికీ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం కాపీసినిమాలు తీసే రాజమౌళి నాలుగు సినిమాలు కలిపి కుట్టిన మగధీరకు ఉత్తమచిత్రం అవార్డు రావడం దీనికి పరాకాష్ఠ.

ప్రతిసంవత్సరం అవార్డుల విషయంలో వస్తున్న విమర్శల కారణంగా గతసంవత్సరం అవార్డుల కమిటీ నియామకంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పాటించింది. కమిటీలో సభ్యులను ఫిల్మ్ ఇండస్ట్రీ సిఫార్సులమేరకు కాక విభిన్న రంగాలలో ప్రముఖులనూ, మేధావులనూ సభ్యులుగా నియమించారు. అంపసయ్య నవీన్( రచయిత ), కే. బాసిరెడ్డి (దర్శకుడు, టెక్నోక్రాట్), అల్లాణి శ్రీధర్ (జర్నలిస్ట్),  ప్రొఫెసర్ ఆనందన్, గోపిని కరుణాకర్ (రచయిత) అవార్డుల కమిటీలో కొన్ని పేర్లు. అందుకే ఈసంవత్సరం అవార్డుల ఎంపికలో ఎలాంటి వివాదాలు లేవు.అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు లభించాయి. జైబోలో తెలంగాణకు అవార్డు రావడం తెలంగాణ వ్యతిరేకులకు కంటగింపు కలిగించినా అవార్డులను మేధావులు హర్షించారు. గత సంవత్సరం బాలక్రిష్ణ అవార్డు తప్ప మిగతా అవార్డులు బాగానే ఉన్నాయి.


అయితే నాలుగు అవార్డులు వచ్చాయి కదా అని సంతోషిస్తే ఇల్లలికి పండగ చేసుకున్నట్లే. చిత్రపరిశ్రమనూ, తెలంగాణలో థియేటర్లనూ ఈరెండుకులాలు, నలుగురు వ్యక్తుల కబంధ హస్తాలనుండి తప్పించి తెలంగాణ కళాకారులకు సరైన అవకాశాలు కల్పించినపుడే చిత్రపరిశ్రమకు నిజమైన విజయం, ఇది తెలంగాణ ఏర్పాటువలన మాత్రమే సాధ్యం.  

Friday, 19 October 2012

పచ్చకళ్ళు, పిచ్చి రాతలుమీరు తిట్టారు గనుక మిమ్మల్ని కొట్టినా, తన్నినా, చంపినా నేను సమర్ధిస్తానని తీర్మానించాడో పచ్చకళ్ళ మనిషి(?). తప్పు ఆయనది కాదు, ఆయన పచ్చకళ్ళది!! ఈ పచ్చకళ్ళవారికి లోకమంతా పచ్చపచ్చగా విచిత్రంగా కనిపిస్తుంది. తమ పచ్చప్రపంచంలో అంతా తామే. తమ ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నించారా, ముందు వాణ్ణి చెడ్డవాడు, తమని తిడుతున్నాడు అంటూ తమ పచ్చ పత్రికలతో ఒక ముద్ర వేసేస్తే చాలు. ఆతరువాత తాము ప్రశ్నించినవాణ్ణి నరికేసి కూడా సమర్ధించుకోవచ్చు!బలమూ, అధికారమూ తమ దగ్గర ఉన్నాయి కదా అని అన్యాయంగా బలహీనులపై దౌర్జన్యం చేస్తే అప్పుడు బలహీనుడేం చేస్తాడు? తిడుతాడు. ఇంకేం తిట్టాడనే సాకుతో ఎదుటివాడిని నరికి కూడా సమర్ధించుకోవచ్చును. నాడు కారంచేడులో మంచినీళ్ళచెరువును బురద చేస్తుండని ప్రశ్నించినందుకుగానూ కొడితే తిరిగి కొట్టడం చేతగాక ఒక ముసిల్ది తిట్టింది. అంతే! ఈ పచ్చబాబులకు సాటి మనుషులను విచక్షణారహితంగా కత్తులూ, బరిసెలతో పొడచడానికి ఆ తిట్టే సాకుగా దొరికింది. అసలు ఈపచ్చకళ్ళవారు ఇతరులనెప్పుడూ సాటి మనుషులనుకోరు. అలా అనుకుంటారనుకుంటే మన భ్రమ. వీరి పచ్చ ప్రపంచంలో మిగతా ప్రజలందరూ వీరి కింద పడి ఉండాల్సిందే.పచ్చబాబుల వాదనలు విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతంలొ నీతి కనిపిస్తుంది. రాష్ట్రవిభజనను దేశవిభజన అన్నట్టు వేర్పాటువాదం అని కొందరు మూర్ఖులు పిలుస్తుంటే అది సమర్ధించడానికి డిక్షనరీలు వెతికి మరీ అర్ధాన్ని కిట్టిస్తారు, తమదాకా వస్తే దాటేస్తారు. పక్కోడి వాదాన్ని తప్పు పడదామనే తొందరలో తమకే అర్ధంకానీ స్టాటిస్టిక్స్ పట్టుకొస్తారు.  పత్రికలపై పాలకులు వివక్ష చూపించి కొందరిని మాత్రం అనుమంతించకపోతే అందులోనూ లాజిక్ కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాకాంక్షలను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాకు అవార్డు వస్తే ఏడుస్తారు. బహుషా వీరు తమ పచ్చబాలయ్య పిచ్చి అరుపులకు ఉత్తమ(?) నటుడు అవార్డు ఇచ్చినప్పుడు పండుగ చేసుకునే ఉంటారు.


పచ్చబాబులకు పార్టీలూ, ప్రాంతాలూ, నీతి, న్యాయం అంటూ ఏవీ ఉండవు. తమ పచ్చలోకంలో తమకు ఎక్కడ లాభం ఉంటే అదే నీతి. తమవారికి ఎక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అదే తమ పార్టీ. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగితే తమకులం అధికారంలోకి వస్తుందనుకుంటే వీరే ముందుండి మరీ రాష్త్రం విభజించాలని ఉద్యమం చేస్తారు. పచ్చమాఫియా అన్ని పార్టీల్లోనూ, అన్ని రంగాల్లోనూ ఉండి తమకు అనుకూలంగా విధానాలనూ, వార్తలనూ వండివారుస్తారు. నాడు కారంచేడు మానవ హననం పచ్చపత్రికల్లో చిన్నవార్తగాకూడా రాలేదంటే అందులో ఆశ్చర్యం ఏమీలేదు.


సాటిమనుషులను రాక్షసంగా బరెసెలతో పొడిచినప్పుడూ, గుడిసెలు కాల్చి మనుషులను సజీవదహనం చేసినప్పుడూ ఖండించనివారు పక్కప్రాంతంలో మానవహక్కులహననం జరుగుతుంటే ఖండిస్తారా? ఎమర్జెన్సీని తలపిస్తూ తెలంగాణలో ప్రభుత్వం మానవహక్కులను అణచివేస్తుందని చెప్పినప్పుడు మేం ఖండించమన్నది మానవత్వం ఉన్నవారిని, అది ఇసుమంతైనా లేని పచ్చబాబులను కాదు.పదిరికుప్పంలో మనుషులను తగలబెట్టి

మీ అధికారదాహం చూపించారు!

కారంచేడులో కత్తులతో నరికి

మీ తలపొగరు తెలియజెప్పారు!

నిజాలు రాసినందుకు దశరథరాంను చంపి,

మీ మాఫియా పోకడలను చూపించారు!

నేడు మాహక్కులహననాన్ని  కూడా సమర్ధించారు,   
మీరు మనుషులుకాదని నిరూపించారు!!Thursday, 18 October 2012

ఎమర్జన్సీని తలపిస్తున్న సీమాంధ్ర సర్కారు పాలన

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చెప్పే ఏకైక మార్గం నిరసన. ఈనిరసన హక్కును ఇప్పుడు తెలంగాణలో విచక్షణారహితంగా ప్రభుత్వం అణచివేస్తుంది. దేశానికి ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా లేనట్టుగా  ఘోరమయిన నిరంకుశ పాలన చేస్తుందీ సీమాంధ్ర ప్రభుత్వం. ఇలా ప్రజలహక్కుల హననం జరుగుతుంటె జరిగేది మనకు కాదు ప్రక్కప్రాంతం వాడికేలే అని సమర్ధిస్తే రేపు మనకు జరిగినప్పుడు ఎవారూ తోడు రారు. ప్రాంతాలకతీతంగా నిరంకుశత్వాన్ని ఖండిద్దాం, మనలో ఇంకా మానవత్వం ఉందని నిరూపిద్దాం.ప్రధానమంత్రి హైదరాబాద్ రాక సందర్భంగా నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్న వైనం.


తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన అరెస్టులూ, లాఠీ చార్జి, భాస్పవాయు ప్రయోగం.జీవవైవిధ్య సదస్సు సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి వివక్ష చూపించిన ప్రభుత్వం తరువాతరోజు నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను ఈడ్చుకెల్తున్న దృశ్యం.   శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళా జర్నలిస్టును ఈడ్చుకెల్తున్న మగ పోలీసులు.


ఉస్మానియాలో లేడీస్ హాస్టల్లో దూరి విచక్షణారహితంగా కరెంటు తీసి మరీ మహిళలపై ఘోరంగా లాఠీచార్జి చెసిన సంఘటణ.  


అదేదో వాఘా బోర్డర్ అయినట్టు ఉస్మానియాను చుట్టు మట్టి చీటికీ మాటికీ రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగిస్తూ మానవహక్కులను హరిస్తున్న ప్రభుత్వం.  

విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిరశన తెలుపుతున్న మహిళను కృరంగా జీపుపైనుండి తోసేస్తున్న ఒక శాడిస్టు పోలీసు.

Sunday, 14 October 2012

సీమాంధ్రలో తెలంగాణం

సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొందరు భూస్వామ్య వర్గాలు, వ్యాపారుల స్వార్ధప్రయోజనాలకోసం అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈవర్గాలకు కొమ్ముకాస్తున్న నేతలు ఆడించిన నాటకం కాగా అక్కడి సామాన్య ప్రజానీకానికి తెలంగాణపట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదనే విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు మేం చెప్పడం జరిగింది. 

 అదే విషయాన్ని ఎత్తిచూపుతూ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అదేంటోకూడా తెలియని చిన్నారులనడ్డం పెట్టుకుని చెయాడాన్ని తప్పుపడుతున్న ఒంగోలు పౌరులను ఈవీడియోలో చూడవచ్చు.

Saturday, 13 October 2012

తెలంగాణ సినిమాలకు అవార్డుల పంట2011 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ప్రకటించారు. అవర్డుల్లో ఈస్సరి తెలంగాణ సినిమాలు అవార్డుల పంట పండించాయి.

తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రూపొందిన చిత్రం జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్. శంకర్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు, జై బోలో తెలంగాణకు ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు, గద్దర్‌కు "పొడుస్తున్న పొద్దు మీద" పాటకు ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చాయి.

ఇంకా విడుదలకు నోచుకోని మరో తెలంగాణ సినిమా "ఇంకెన్నాళ్ళు" లో నటించిన సుజాతారెడ్డికి ఉత్తమ సహాయనటి అవార్డు వచ్చింది. తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రఫి నిర్మించి దర్శకత్వం వహించిన ఈసినిమా విడుదలకు థియేటర్లు దొరక్క సినిమా విడుదల కాలేదు. రాష్ట్రంలోని సినిమాహాళ్ళన్నీ ఒక నలుగురి కంట్రోళ్ళో ఉన్నవిషయం తెల్సిందే.

తెలంగాణ నేపధ్యంగంతో రూపిందిన మరో సినిమా రాజన్నకు కూడా అవార్డులు వచ్చాయి. అయితే ఈసినిమాకు దర్శక నిర్మాతలతో సహా ఎవరూ తెలంగాణవారు కారు. తెలంగాణ ప్రజాకవీ, గాయకుడు అందేశ్రీ పాతకు ఉత్తమ గేయం అవార్డు రాకపోవడం దురదృష్టం.    

Wednesday, 10 October 2012

రూంమేట్లు!!"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.

సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.

సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ.  బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.

సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే  వచ్చి రమేశ్ గదిలోచేరాడు.

మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్  వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని  తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.

"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"

"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"

"ఏం చేస్తావేంది?"

"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"

"సరే చేసుకో."

"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"

"సరే. నీ ఇష్టం"

"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".

"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.

సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"

రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది.


రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.

"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"

"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."

"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే  దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"

"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి  నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు.

తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.
 
నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.

ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."

"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం."  రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.

"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.

"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.

Monday, 8 October 2012

1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని దుస్థితి ఇదీ


తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో చాలా తరచుగా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సమైక్యవాదులు అవాకులు చవాకులు పేలుతుంటారు. అయితే హైదరాబాద్ నగరం ఆరేడు దశాబ్దాల క్రితమే ఒక మహానగరానికి కావలసిన అన్ని హంగులూ ఉన్న నగరం అనేది నిర్వివాదాంశం. అందుకు సకల సాక్ష్యాలూ ఉన్నాయి.
అసలు ఇంతకూ ఆంధ్ర రాష్ట్రపు రాజధానిగా మూడేండ్లు ఉన్న కర్నూల్ టౌన్ పరిస్థితి ఏమిటో ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు.
దీనికి కొంత నేపధ్యం తెలుసుకోవాలి.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో అప్పటి నాయకులు మద్రాసు నగరం కొరకు పట్టుబట్టారు. మద్రాసులో తమిళులే అధికసంఖ్యలో ఉన్నప్పటికీ ప్రకాశం పంతులు వంటి నాయకుల మూర్ఖపు పట్టుదల వల్ల ఆంధ్ర రాష్ట్రపు ఏర్పాటు చాలాకాలం పాటే వాయిదా పడింది. చివరికి ఇదే డిమాండుతో పొట్టి శ్రీ రాములు ఆత్మ త్యాగం చేసినా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు దక్కలేదు.
1930ల నుండే సాటి ఆంధ్ర వారితో కలిసి రావడానికి రాయలసీమ వారు ఇష్టపడలేదు. ఆంధ్రవారితో కలిసి ఒక రాష్ట్రంలో ఉండటం కన్నా తమిళులతో కలిసి అప్పటి మద్రాసు రాష్ట్రంలోనే కొనసాగడమే రాయలసీమ భవిష్యత్తుకు మంచిదని అక్కడి నాయకులు తలిచారు.
చివరికి ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూల్ అవతరించింది.
అప్పటికి కర్నూల్ ఒక చిన్న టౌన్. ఏ విధమైన మౌలిక వసతులు లేవు. అన్ని ముఖ్య ఆఫీసులు, ఉద్యోగులు కూడా గుడారాలలోనే ఉండేవారు. సరైన పారిశుధ్యం, రోడ్లు లేక, వర్షం వస్తే బురదమయంగా మారే నల్ల రేగడి నేలల్లో నానా అవస్థలూ పడేవారు. అప్పటి పత్రికలు స్వయంగా కర్నూల్ ను డేరానగర్ గా వ్యవహరించేవారు. దినపత్రికల్లో ఈ డేరానగర్ దుస్థితి గురించి కార్టూన్లు కూడా వేసేవారు.
ఆ కాలం దినపత్రికల్లో వచ్చిన ఫొటోలు, వార్తలు చూస్తే మనకే అర్థం అవుతుంది ఆంధ్రరాష్ట్ర రాజధాని సొగసు ఎంతనో.
అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ లో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేదు. చివరికి డిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకుని, అప్పటికే సర్వ హంగులతో సిద్ధంగా ఉన్న హైదరాబాదును చేజిక్కించుకున్నారు సీమాంధ్ర నాయకులు.
ఈసారి ఎవరైనా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సొల్లు వాగుడు వాగితే వారికి తెలంగాణతో విలీనమయ్యేనాటికి ఆంధ్ర రాజధాని దుస్థితిని ఎరుకపరచండి.
From: MissionTelangana.com

తెలంగాణపై ఎందుకింత ద్వేషభావం?


ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో తమ హక్కుల సాధనకోసం నినదిస్తున్నారు. తమ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. లక్షలమంది ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనపై తమకున్న బలమైన ఆకాంక్షను తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ తెలంగాణ కోసం సభ లేదా ర్యాలీ జరిగినా స్వఛ్చందంగా ప్రజలు పెద్దయెత్తున పాల్గొని తమ గొంతు వినిపిస్తున్నారు. వరుస బై-ఎలక్షన్లలో తెలంగాణ వ్యతిరేక శక్తులను చావుదెబ్బ కొట్టి ప్రజలు వోటు ద్వారా తమ ఆకాంక్షను బలంగా చాటారు. లక్షల ఉద్యోగులు నలభై నాలుగురోజులు సకలజనుల సమ్మెలో పాల్గొనగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వోర్చుకుని సమ్మెకు మద్దతునిచ్చి ప్రజలు తమ రాష్ట్రసాధనకోసం ప్రభుత్వాన్ని నిలదీశారు.


 కానీ మన సొంతరాష్ట్రంలో పక్కప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు మాత్రం గౌరవించబడట్లేదు. మానవహక్కుల హననం జరుగుతుంటే స్పందించే హృదయం కరువయింది. ఇక్కడి ఉద్యమాన్ని మీడియా, సీమాంధ్ర నాయకులు తీవ్రవాదంతో పోలుస్తున్నాయి. కొందరు చదువుకున్నవారు పక్కన జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా  తెలంగాణప్రజలను సోమరిపోతులంటూ, తీవ్రవాదులూ, తాలిబన్లూ  అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? సమస్య ఎక్కడుంది?


కొందరి ప్రచారం "ఉస్మానియాలో విద్యార్థులు చదవరు, అంతా రౌడీలు, సోమరిపోతులు. ఉస్మానియాను మూసేయాలి. ప్రొఫెసర్ కోదండరాం చదువులు చెప్పడం మానేసి గొడవలు చేస్తున్నాడు." నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ఇండియాలోనే విద్యాప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ఒకసర్వే తేచిచెప్పింది . ప్రొఫెసర్ కోదండరాంతో సహా అనేకమంది తెలంగాణ ప్రొఫెసర్లు పౌరహక్కులవేదికల్లో భాగంగా అనేకసార్లు సీమాంధ్రలో ప్రజలపై, దళితులపై జరిగిన దౌర్జన్యాలపై పోరాడారు.

ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. తెల్లవారు భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడి ప్రాంతాన్ని దోచుకునేటప్పుడు ఇక్కడి ప్రజలను నాగరికతలేనివారిగా, సోమరిపోతులుగా చిత్రీకరించారు. అరబ్ దేశాలపై అమెరికా, యూరప్ దేశాలు ఒకవైపు దాడులు చేస్తూ, ప్రజాహక్కులను కాలరాస్తుంటే అదే అరబ్బులపై ద్వేషభావన కూడా అంతే ఎత్తులో ప్రచారం చేయబడింది. అమెరికాలో నల్లవారిని దోచుకునే రోజుల్లో అదే నల్లవారిని తెల్లవారు ద్వేషించారు. మనదేశంలో మనరాష్ట్రంలో దళితులపై అగ్రకులాలవారు కారంచేడు, చుండూరుల్లో దాడులు చేసినపుడు  దాడులను ఖండిచాల్సింది పోయి అక్కడి అగ్రకుల విద్యావంతుల్లో అధికభాగం దళితులపై ద్వేషభావన నింపుకున్నారు.


James W. Loewen అనే మహానుభావుడు ఈవిషయంపై చెప్పిన కోట్:
“It is always useful to think badly about people one has exploited or plans to exploit... No one likes to think of him or herself as a bad person. To treat badly another person whom we consider a reasonable human being creates a tension between act and attitude that demands resolution. We cannot erase what we have done, and to alter our future behavior may not be in our interest. To change our attitude is easier."

మనుషులు తము దోచుకునేవారిని చెడ్డవారిగా జమకడితే అది వారికి లాభదాయకం. అలా చేయకపోతే పక్కవాడిపై చేసే దోపిడీకి, దౌర్జన్యాలకు తమకు తామ సమాధానం ఇచ్చుకోవాల్సివస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు తమపనులమీద తమకే అసహ్యం వేసి తమ దోపిడీని ఆపాల్సొస్తుంది. అదే పక్కవాడిని దుర్మార్గుడిగా జమకడితే అప్పుడు తము చేసే దోపిడీకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం సులభం. మనుషులు తమ చర్యలను మంచివైపు మార్చుకోవడం కంటే ప్రవర్తనను దిగజార్చుకోవడం  సులభం.

 మొన్న జరిగిన తెలంగాణ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత కర్కషంగా అణచివేస్తుందో, మానవహక్కులను ఎలా కాలరాస్తుందో చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రజలు తమ ఆకాంక్షను చెప్పడాని చేసిన ప్రయత్నాన్ని రైళ్ళూ, బస్సులూ ఆపేసి, ఎక్కడికక్కడ ప్రజలను మార్చ్‌కు రాకుండా అడుగడుగునా నిర్భందించి, లక్షలకొద్ది అరెస్టులు చేసి కాలరాసింది. ఉస్మానియా యూనివర్సిటీని నిర్భందించి విద్యార్థులు బయటికి రాకుండా వారిపై రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీలు ప్రయోగించింది. వేదికను చేరుకోవడానికి వీళ్ళేకుండా అడుగడునా ముల్లకంచెలు ఏర్పాటుచేసింది. ఒకవైపు మార్చ్ జరుగుతుంటే ఉద్యమకారులపై భాష్పవాయుగోళాలు నేరుగా మనుషులపైకి ప్రయోగిస్తే ఆ గోళాలు తాకి కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

 భాష్పవాయువు వల్ల ఎందరో పిల్లలు, స్త్రీలు అనారోగ్యానికి గురయ్యారు. పోచయ్య అనే వికళాంగుడు రెండు కాళ్ళు అవిటివయినా కర్రలతో నాల్గు కిలోమీటర్లు నడిచి మార్చిలో పాల్గొన్నాడు.

రాజకీయనాయకులు, వ్యాపారులు, కబ్జాకోరులూ తమ స్వార్ధలాభాలకోసం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మవచ్చు. కానీ ఉద్యమంపై, తెలంగాణపై ద్వేషాన్ని ప్రకటించే ప్రజలూ, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. హక్కులకోసం పోరాడుతున్న ప్రజలపై జరిగే దౌర్జన్యాలను సమర్ధిస్తే రేపు మీపై దౌర్జన్యం జరిగినపుడు మీకు తోడు దొరకదు. ఆత్మవంచన చేసుకుని అన్యాయాన్ని సమర్ధించకండి, ధైర్యంగా న్యాయాన్ని సమర్ధించండి.

Friday, 5 October 2012

ఒకటి ప్రజా ఉద్యమం, మరొకటి కిరాయి నాటకం
సెప్టెంబరు 30 నెక్లెస్ రోడ్ తెలంగాణ మార్చ్‌లో జన ప్రభంజనం.


ప్రజల ఆగ్రహానికి తెగిపడిన పోలీసులు ఏర్పాటుచేసిన ముళ్ళ కంచెలు.


వెలవెలబోతున్న గుంటూరు సమైక్యాంధ్ర మానవహారంఅమలాపురంలో జనాలు దొరక్క స్కూలు పిల్లలతో ర్యాలీతీయిస్తున్న చోద్యం.