విభజనకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నతరువాత విభజనవల్ల వచ్చే సమస్యలేంటి, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాలను చర్చలద్వారా పరిష్కరించుకోవచ్చు. కాని మన సీమాంధ్ర నాయకులు మాత్రం ఒకవైపు సమైక్యత అంటూ అలజడులు సృష్టిస్తూ మరోవైపు హైదరాబాదును యూటీచెయ్యాలనే డిమాండ్‌తో ప్రజలను అయోమయానికి గురిచేస్తుంటారు.
హైదరాబాద్‌ను యూటీ చెయ్యాలనే డిమాండ్‌కు వారు చెప్పే కారణాలు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రా సెటిలర్లకు రక్షణ ఉండదేమో (ఊహాజనిత భయాందోళన) మరియూ హైదరాబాద్‌ను ఉమ్మడీగా డెవలప్ చేసుకున్నాం (నిజానికి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు సీమాంధ్ర నుండి రాలేదు సరికదా హైదరాబాద్ భూములు అమ్మి సీమాంధ్రలో జలయగ్నానికి వాడడం జరిగింది) కనుక ఇప్పుడూ హైదరాబాద్ మాకు దక్కకపోతే మీకూ దక్కొద్దు కాబట్టి యూటీ చేసి హైదరాబాద్ ఆదాయాన్ని కేంద్రానికి ఇచ్చెయ్యాలి. వీరు చెప్పే కారణాలు బాగానే ఉన్నాయి కానీ ఇవేకారణాలను సీమాంధ్ర పట్టణాలు తిరుపతి, వైజాగ్‌లకు వర్తిస్తే ఎలాగుంటుంది?
తిరుపతి అభివృద్ధికి కారణమక్కడున్న వెంకన్న, ఆయన్ను చూడ్డానికి వచ్చే కోట్లాది జనం. తిరుపతి వెంకన్న దర్శనానికి అనునిత్యం దేశంలోని మూలమూలలనుండి వస్తారు. మనరాష్ట్రంలోని మూడుప్రాంతాల భక్తులతో పాటు తమిలనాడు, ఇతర రాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారినుండి వచ్చే ఆదాయం వల్లే తిరుపతి అభివృద్ధి చెందింది. నిజానికి హైదరాబాద్ అభివృద్ధిలో చిల్లికాసు కూడా సీమాంధ్రనుంచి వచ్చింది లేదు ఇక్కడి ఆదాయమే హైదరాబాద్లో ఖర్చుపెట్టడం జరిగింది. కానీ తిరుపతి అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్నిప్రాంతాల భక్తుల పాత్ర ఉంది.
అంతేకాకుండా తిరుపతిలో పెద్ద సంఖ్యలో తమిళులు ఉంటున్నారు. మరి వీరి రక్షణ సంగతి ఎలా? ఇన్నిరోజులూ సమస్యలేనిది ఇప్పుడెందుకు ఉంటుంది అంటారా? ఏమో ఎవరు చెప్పగలరు? మద్రాసూ పాయె, హైదరాబాదూ పాయే అన్న కసిలో అక్కడి జనాలు మళ్ళీ ఇడ్లీ సాంబార్ గొబ్యాక్ తరహాలో దాడులు చేయరని ఎలా చెప్పగలం? అందులో మన సీమాంధ్రలో ఫాక్షన్ నేతలకు కొదవలేకపాయె. మొన్ననే తమిల రాందాస్ తిరుపతిని తమిలనాడులో కలపాలని డిమాండ్ చేసినట్టున్నాడు. ఆకోపంలో కూడా దాడులు చెయ్యొచ్చు. లక్షలమంది సీమాంధ్రులు హైదరాబాద్‌లో ప్రశాంతంగా బతుకుతుంటే లేని భయాలు సృష్టించి యూటీ చెయ్యాలనగా లేనిది తమిలుల రక్షణకు మాత్రం యూటీ ఎందుకు చెయ్యొద్దు?
ఇక వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్ కూడా సమైక్యాంధ్రలో బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడే హైదరాబాద్ దేశంలో అయిదో నగరం కాగా వైజాగ్ హైదరాబాద్‌లో ఒక పేట అంత కూడా ఉండనిది ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందింది. వైజాగ్‌ను కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. ఉమ్మడి రాష్ట్ర నిధులతో అభివృద్ధి చెందింది. పైగా ఇక్కడ పోర్ట్, స్టీల్ ప్లాంట్ చెయ్యబట్టి కాస్త నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. మరి వారి రక్షణ మాటేమిటి?
కనుక హైదరాబాద్‌ను యూటీ చెయ్యాలని సీమాంధ్ర నేతలు డీమాండ్ చేస్తే అదే లాజిక్ ప్రకారం తిరుపతి, వైజాగ్‌లను కూడా యూటీలు చేయాలి.
ఈ ధోరణినే ఉక్రోషం అంటారు.
ReplyDeleteనాకు దక్కని హైదరాబాదును యూటీ చెయ్యాలి అనడమే ఉక్రోషం, దానికి సమాధానంగా రాసింది వ్యంగ్యం అంటారు.
DeleteEven after repeated explanations you cannot understand the realities. It clearly reveals your stupidity. Tirupati is still a big village, not even a town. TTD income is being spent in building Kalyana Mantapams all over AP and maintaining Universities and colleges (SVU). Even in Hyderabad you have TTD buildings in Liberty from where you get services. Have you heard about Mana Gudi program? It is development and betterment of all kinds of temples of AP done by TTD. Nothing happens if Tirupati or some other town of AP becomes UT. Remember that Sri Krishna committee mentioned clearly that Rayalaseema is more backward in terms of natural resources than Telangana and no single town (or so called city) is there in Rayalaseema to develop like a capital of state because all are not focused on as whole state people contributed for the development of Hyderabad. It does not matter if you or somebody else think otherwise. Nobody can change history and truth.
ReplyDelete@Anonymous3 September 2013 21:28
DeleteIf TTD has built function halls outside seemandhra, which state would get benefit from the income from those investments after the division?
If Rayalaseema is not developed, who is responsible for that? Who objected if they want to separate under the leadership of Byreddy and develop their own state?
What do you mean by everybody contributed for the development of hyderabad? if some one comes to hyderabad and purchases a house it is for his own benefit, not for the benefit of hyderabad.
సిమంద్ర డబ్బు ఏమైనా తెలంగాణాలో ఖర్చు పెట్టి ఉంటె (వాళ్ళ డబ్బు వాళ్ళ జితాలకే సరిపోదు, అది వేరే విషయం) అది ఒప్పందాలకు వ్యతిరేకం, ఏ ప్రాంతం డబ్బు ఆ ప్రాంతం లోనే ఖర్చు పెట్టాలి, అలా కాకుండా సిమాంద్ర డబ్బు హైదరాబాదులో ఖర్చు పెడితే అది వారి ఖర్మ, ఒప్పందాల వ్యతిరెకమ్. మేం భాద్యులం కాదు.
ReplyDeleteఅసలు యాభై ఏళ్ళ లెక్కలు బయటికి తీస్తే తెలంగాణ నిధులు ఎన్ని ఆంధ్రాకు తరలించబడ్డాయో తేలుతుంది. అప్పుడు మొహాలెక్కడ పెట్టుకుంటరో.
Deleteవైజాగ్,తిరుపతిలను UT లు చేయాలంటే సీమా౦ద్రులకు చర్రున ఎంతకోపం వస్తుందో హైదరాబాద్ ను UT చేయాలని ఎవరైనా అంటే తెలంగాణా బిడ్డలకు కూడా అంతకోపం వస్తుందని అందరూ గమనించాలి!హైదరాబాద్ ను UT చేస్తే కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడి అవుతుంది!కనుక అది ఎందుకు చేస్తుంది!?చేయదు గాక చేయదు!పెట్టుబడిదారులకు హైదరాబాద్ ను వదలుకోవడం లోలోపల ఎంతో బాధగా ఉండటం సహజం!అర్ధం చేసుకోగలం!కాని హైదరాబాద్ ను ఒక్కసారైనా రాని ప్రజలు కూడా పాల్గొనడం అనవసరం!
ReplyDelete@surya prakash apkari
Deleteమనది గాకపోతె ఢిల్లీదాక దేకమన్నాడట. హైదరాబాద్ ఎలాగూ వీల్లది కాదు, యూటీ చెయ్యమంటారు. అదే తిరుపతి యూటీ అంటే మాత్రం ఊరుకోరు.
జోక్ బాగుంది
ReplyDeleteViswaroop, you forgot Vijayawada!
ReplyDeleteJai,
DeleteLet Vijayawada be with seemandhra. They need some city for capital. More over who else wants vijayawada for its ugly casteist politics and rowdysim?
మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని UT చేసేస్తే ఏ గొడవా ఉండదు కదా!
ReplyDeleteబోనగిరి గారు,
Deleteఅప్పుడు తెలంగాణ, సీమాంధ్ర వేర్వేరుగా రెండు యూటీలు చెయ్యాల్సి వస్తుంది.
UT చేసినా, వేర్వేరుగానే చెయ్యాలా?
Deletevizag, tirupati UT cheyalsinde
ReplyDeleteతిరుపతి కాదు కాని, అలిపిరి నుంచి తిరుమల అంతా UT చెయ్యడం మంచిదే.
ReplyDeleteకొండమీద రాజకీయం తగ్గుతుంది.
if separate state is going to form Hyderabad definitely should belongs to Telangana, but before doing this seemandhra people wants a city that will assure that some jobs can get if we go there.
ReplyDeleteNow can you tell me is there any city in seemandhra?
Why some one wants to go to a capital city to get a job? why don't they go to any other city for a job?
Deletemari padamoodella nundi gaadidalu kaashaaraa?
Deletetelangananu apaalani choose badulu ippatikainaa kallu teravandi.
naaku telisi svashakti meeda nammakam leni inta durbala jaatini ekkadaa chooda ledu.
Delete"Why some one wants to go to a capital city to get a job? why don't they go to any other city for a job?"
For recommendations :).
yes your argument 1oo% correct
ReplyDelete