Tuesday 10 May 2011

విగ్రహాల కూల్చివేతపై సీమాంధ్ర మీడియా అబద్దాలు

డిసెంబరు 9 చిదంబరం ప్రకటన తరువాత సీమాంధ్ర మీడియా అంతా తెలంగాణా ఉద్యమంపై కత్తికట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించడం, ప్రసారం చెయ్యడం మొదలుపెట్టింది. ఉద్యమాన్ని తక్కువచేసి చూపడం కొరకు వీరు పాటించే ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట మిలియన్ మార్చ్. మిలియన్ మార్చ్ అనుమతి కోసం ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మార్చ్ వ్యవధి తగ్గించి మధ్యాహ్నానికి మార్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోగా ఈ ఉద్యమాన్ని ఎలాగయినా అణచివెయ్యాలనే ఏకైక లక్ష్యంతో లక్షలమందిని తెలంగాణా యావత్తూ అక్రమంగా నిర్భందించి స్కూల్లూ హాస్టల్లలో భందించింది. హైదరాబాద్ వచ్చే అన్ని బస్సులనూ, రైల్లనూ ఆపేసింది, ప్రైవేటు బస్సులను వాడకుండా చర్యలు తీసుకుంది. వేలమంది స్పెషల్ ఫోర్సులను ఉపయోగించి హైదరాబాద్ రోడ్లన్నీ నిర్భందించింది. ఇంత నిర్భందం మధ్య అందరు ట్యాంక్ బండ్ చేరుకోవడం ఒకపెద్ద విజయం. కానీ మీడియా మాత్రం అదేదీ రాయకుండా కేవలం విగ్రహాల విధ్వంసాన్నే పెద్దగా చేసి చూపించింది.

ఇదంతా ఒకయెత్తయితే సీమాంధ్ర మీడియా విగ్రహ విధ్వంసం పధకం ప్రకారం జరిగినది అనే అబద్దాన్ని సమర్ధవంతంగా ప్రచారం చేసింది. మార్చ్ తరువాతి రోజు పోలిసులు ఒకప్రకటనలో సంఘటన స్థలంలో కొన్ని ఇరన్ రాడ్స్ దొరికాయి, దీన్ని బట్టి విధ్వంసానికి ముందే పధకం జరిగిందేమో అనే అనుమానాన్ని వ్యక్తపరిచింది. అంతే, మీడియా దానికి మరికాస్త మసాలా కలిపి వార్తలు గుప్పించింది. కొన్ని పేపర్లూ, చానెల్లూ సంఘటన పధకం ప్రకారమే జరిగిందని పోలీసులు తేల్చేశారని చెబితే, మరికొన్ని ఇంకాస్త ముందుకు వెల్లి అక్కడే విగ్రహాలను కూల్చివెయ్యడానికి అన్ని టూల్స్ దొరికాయి, ముందే అక్కడ టూల్స్ చేరవేశారు అని చెప్పాయి. ఇంకొందరయితే అక్కడ పానాలూ, స్క్రూ డ్రైవర్లూ, గ్యాస్ కట్టర్లూ అన్నీ దొరికాయని ప్రసారం చేశారు, సీమాంధ్ర జనం దాన్నే నమ్మింది.

మరుసటి రోజు పోలీసులు మరో ప్రకటనలో అక్కడ దొరికిన రాడ్స్ పోలీసులు పెట్టిన బారికేడ్స్ మాత్రమే, ఉద్యమకారులు ఆ బారికేడ్స్‌ను పీకి కూల్చివేతలో ఉపయోగించారు, కూల్చివేత పధకం ప్రకారం జరగలేదు అని చెప్పారు. అయితే ఈషయాన్ని మాత్రం ఒక్క తెలుగు మీడియా కూడా చూపించలేదు, రాయలేదు. ఆంగ్ల మీడియా టైంస్ ఆఫ్ ఇండియా మాత్రం ఆవార్త ప్రచురించింది.

నిజానికి అక్కడ కూల్చివేతకు ఎలాంటి పధకమూ జరగలేదు, మార్చ్ చాలాసేపు ప్రశాంతంగానే జరిగింది. అయితే ఆరోజే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య పాల్పడ్డారు, అదికూడా మిలియన్ మార్చ్‌పై పోలీసుల నిర్భంధంపై నిరసనగా వారు చనిపొయ్యారు అని తెలిసినతరువాత ఉద్యమకారులు సహజంగానే ఉద్రేకానికి లోనయ్యారు. అంతోటి విగ్రహాలను కూల్చివెయ్యడానికి పెద్ద పనిముట్లు అవసరం లేదు, అవికేవలం ఇటుకలతో కట్టిన దిమ్మలపై పెట్టిన విగ్రహాలు, నలుగురు కలిసి రెండు దెబ్బలేస్తే అవేకూలుతాయి. అసలు ట్యాంక్‌బండ్ అప్పటికి మూడు నాల్గు రోజులముందునుండే పోలీసుల ఆధీనంలో ఉంది, ట్యాంక్బండ్ పైనే వేలమంది స్పెషల్ ఫోర్సులు ఉన్నారు, వారెవరికీ చిక్కకుండా అక్కడ టూల్స్ దాయడం సాధ్యం కాదు, అంత అవసరం కూడాలేదు. కానీ ఉద్యమంపై విషప్రచారం చెయ్యడానికి మీడియాకు మాత్రం ఈవాస్తవాలేమీ అవసరం లేదు, తెలంగాణా ఉద్యమాన్ని తక్కువచెయ్యడమే కదా వారికి కావల్సింది, అందుకు వచ్చిన అవకాశాన్ని వీరు చక్కగా వినియోగించుకుని కూల్చివేత పధకం ప్రకారమే జరిగిందనే అబద్దాన్ని ప్రచారం చేసింది.

సంబంధిత టైమ్స్ వార్త ఇక్కడ చూడవచ్చు

extract:
***************
In a new twist, cops are also veering to the opinion that the act of vandalism, perhaps, was not planned as was believed earlier. Vandals had desecrated 12 statues of Telugu icons during the March 10 event. They threw most of the damaged statues into the Hussainsagar.
Police had initially claimed the protesters had brought hammers, ropes and nails along with them, but the ongoing Central Crime Station (CCS) probe has revealed that iron rods used in demolition were actually broken railings of police barricades. Rope and ladders used in the attack were picked up on the way from a nearby shopping complex at Lower Tank Bund. Water hose and boulders used in breaking and pulling down statues were very readily available on Tank Bund.
***************

10 comments:

  1. మీరు లాహిరిలాంటి కొంతమంది తెలంగాణావాదుల్లాగా ఫాసిస్టులు కాదని అనుకున్నా. ఈ టపాలో మీరు రాసిన నగ్న అసత్యాలను చూస్తే నవ్వొస్తోంది. నాటి ఘటనకు కొన్నిరోజులముందే కేటీఆర్...బహిరంగంరగా మీడియాముందే ప్రకటించాడు - ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను కూలుస్తామని. విగ్రహాలను కూల్చేటప్పుడు పెద్దపెద్ద సమ్మెటలు, మోకులు(లావుపాటి తాళ్ళు) ఉపయోగించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది(ఇది కూడా సీమాంధ్ర ఛానల్స్ సృష్టి అనకండి ప్లీజ్). అవన్నీ పోలీసులు వాళ్ళకు తెచ్చిచ్చి ఉంటారని మీ ఉద్దేశ్యమా. మిలియన్ మార్చ్ జరిగిన తర్వాత కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఇంకా మరికొన్ని విగ్రహాలను కూడా కూలుస్తామంటూ, ఆ రోజున కూల్చింది తామేనని అన్యాపదేశంగా చెప్పడం అవాస్తవమా. ఇంతెందుకు సీమాంధ్ర మీడియా గురించి మీరు ఇన్ని మాటలు చెప్పారుగానీ, విగ్రహాలను పడగొట్టడం పొరపాటు అని మీరు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు.

    అయితే మీరు లాహిరి, Anarchist లాంటి కొంతమందికన్నా చాలా మెరుగేలెండి. విగ్రహాలను కూల్చింది సీమాంధ్ర వాళ్ళేనని(టీజీ వెంకటేష్ అనుచరులు) ఆరోపించలేదు. ధ్యాంక్స్.

    ReplyDelete
  2. అయ్యా అనామకులు గారూ, మీకోసం టపాలో టైమ్స్ లింకు పెట్టాను, ఒకసారి మీరంటున్న రోప్సూ, నిచ్చెనలూ ఎక్కడనుండి వచ్చాయో మీరే చూడండి.

    ReplyDelete
  3. స్వాతంత్రోద్యమంలో గాంధీ, నెహ్రూ లున్నారు .. భగత్ సింగ్, బోసులు ఉన్నారు. ఆంధ్రోద్యమంలో కూడా నిరాహార దీక్షలు జరిగాయి, విధ్వంసాలూ జరిగాయి. అన్ని ఉద్యమాలలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా అతివాదులు, మితవాదులూ ఉన్నారు. మితవాదులు శాంతియుతంగా ఎంతటి ఉద్యమం చేసినా సీమాంధ్రులు, ప్రభుత్వం పట్టించుకోక పోతే, అతి వాదులు ముందుకొస్తారు. ఇంత వరకు అతివాదులు తమ ఉద్యమ ప్రణాళిక ఎప్పుడు చెప్పినా, కావలసినంత సమయం ఇచ్చి, అయినా తమ వాదాన్ని పట్టించుకోక పోతే, అప్పుడు అన్నంత పని చేసి చూపారు. వెల్లువలా వచ్చే ఈ ప్రజా ఉద్యమంలో జరిగే విధ్వంసాన్ని ఈ ప్రభుత్వం కళ్ళప్పగించి చూడడమే తప్ప ఏమీ చేయలేదు. అంతగా అయితే నాలుగయిదు అరెస్టులు చేసి, వారం తరువాత వదిలేస్తారు. ప్రాణ త్యాగాలకే సిద్ధపడుతున్న ఉద్యమకారులు అది లెక్కచేయరు.
    అతివాదులు ఇంతకు ముందే ... తరువాతి ’ మిల్లినియం మార్చ్’ జూబిలి హిల్స్ లో అని చెప్పి ఉన్నారు. ఏ హైటెక్ సిటీ, ఏ సైబరాబాదులను చూపి, సీమాంధ్రులు హైదరాబాదును మేమే అభివృద్ధి చేసామంటున్నారో, ఆ ప్రతీకలన్నిటిని కూలుస్తామని చెప్పకనే చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ జూన్ లో తెలంగాణను ప్రకటించడం అందరికీ శ్రేయస్కరం. లేదంటే - అతివాదులు అన్నంత పని చేస్తారేమో అని భయంగా ఉంది.

    ReplyDelete
  4. పై అగ్నాత,

    మీరు చెప్పింది నిజమే, కానీ ప్రభుత్వం కూడా ఉద్యమం అతివాదులచేతికి వెల్లాలని ఎదురుచూస్తుంది, తద్వారా ఉద్యమాన్ని కర్కషంగా అణచివెయ్యడానికి వారికి ఒక సాకు దొరుకుతుంది. 1969లో అదేసాకుతో ఉద్యమాన్ని అణచివేసి నాల్గొందలమందిని పొట్టనబెట్టుకున్నారు.

    ReplyDelete
  5. విశ్వరూప్ గారు!
    అదేగాని జరిగితే ... ఈ రాష్ట్రం ఏనాటికి బాగుపడదు. సర్వ నాశనం అవుతుంది. పోన్లెండి. సీమాంధ్రులు ఎలాగూ తెలంగాణ వాళ్ళను బాగుపడనీరు. ’బంపర్ ఆఫర్’ సినిమాలోలాగా అలాగైనా, సీమాంధ్రులు కూడ పూర్తిగా నష్టపోయి, తెలంగాణ వాళ్ళతో సమానమవుతారు.

    ReplyDelete
  6. విశ్వరూప్ గారూ, మొదటి కామెంట్ రాసింది నేనే. నేను మర్యాదగా మిమ్ముల్ను సంబోధిస్తే, మీరు వ్యంగ్యంగా అనామకులుగారూ అని వ్యంగ్యంగా సంబోధించి మీ సంస్కారం బయటపెట్టుకున్నారు.

    ఇక విషయానికొస్తే...మీరు పెట్టిన extract చూశాను. మీరు ఇచ్చింది వెబ్ లింక్ కాదు. ఎక్కడనుంచో కాపీ చేసి పేస్ట్ చేశారు. లింక్ అంటే url అయి ఉండాలి.

    ReplyDelete
  7. పై అఙ్నాతగారూ,

    మీకు ఈ సంబోధన మీకు సమ్మతమే అనుకుంటున్నాను. అఙ్నాత ముసుగులో తోటిబ్లాగర్లను తిట్టిపోసే మీరు సంస్కారం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మీరు ఇక్కడ అన్న పదంపై క్లిక్ చేస్తే మీక్కావలిసిన లింకు వస్తుంది, అది క్లియర్గా రెడ్ కలర్లో మార్క్ చేసి మరీ ఉంది??!!

    ReplyDelete
  8. Ikkada Point Tools gurunchi kaadu.

    Vigrahalni koolchara leda ani.

    Avi veyyella telugu Velugulu

    ReplyDelete
  9. విశ్వరూప్ గారూ, మళ్ళీ నేనే. మొదటి అజ్ఞాతను. అయ్యా, నేను మీ టపామీద రాసిన కామెంట్లలో మిమ్ముల్ను తిట్టిపోసినట్లు మీకు అనిపించిందా. ద్వేషంతో కళ్ళు కమ్ముకునిపోతే అలాగే కనిపిస్తుందిలెండి. దానినుంచి బయటపడండి. ఆ తెలంగాణా ఎలాగూ రాదు. మీరు బతుకంతా సీమాంధ్రులపై ద్వేషంతో ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు చెప్పండి.

    ReplyDelete
  10. పై అగ్నాత,

    1) నేను మీలాగా నన్ను తిడితే ఒకలాగ తోటి మరో బ్లాగర్ను తిడితే మరోలా స్పందించే సంకుచిత మనస్కున్ని కాను. అసలు మీరు మరో బ్లాగర్ పేరు తెచ్చినందుకు మీ కామెంటు పబ్లిష్ చెయ్యాల్సింది కాదు, ఎడిట్ చేసే ఓపికలేక అలాగే పబ్లిష్ చేశాను. మరోసారి ఇలాంటి పిచ్చిపని చెయ్యరని మనవి.

    2) అసలు ఒక అగ్నాతకు హక్కులు, అగ్నాత అంటే మర్యాద, అనామకులు అంటే రోషం. పైగా దానికి సీమాంధ్రాప్రజలపై ద్వేషం అని తేల్చేశారు. మీపిచ్చికామెంట్లకు ఓపిగ్గా సమాధానం చెబుతుంటే అది అందరు సీమాంధ్రులను ద్వేషించినట్లా? అందరూ మీలాగే ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగుకీ వెల్లి నచ్చనివారిని తిట్టే తైపు కాదండి, కాస్త మానసికంగా ఎదగడానికి ప్రయత్నించండి.

    3) మీతో ఇలా చత్త డిస్కషన్ చేసే ఓపికనాకు లేదు, విషయమ్మీద స్పందిస్తే స్పందించండి, లేదంటే కామెంటు పబ్లిష్ చెయ్యబడదని మనవి.

    ReplyDelete

Your comment will be published after the approval.