Wednesday 29 June 2011

సీమాంధ్ర ఎంపీల వ్యాపారాలు, పార్లమెంటులో ప్రశ్నలు


తెలంగాణవాదులు నిధులపంపిణీలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురయింది అని చెప్పగానే సీమాంధ్రవాదులు అందుకునే వాదన మీ ఎమ్మెల్యేలూ, మంత్రులూ అంతా ఏం చేస్తున్నారు? మీనాయకులు చేతకానివారయితే దానికి ప్రభుత్వమేం చేస్తుందీ అని. నాయకులు ఎవరైనా సొంతలాభాలే చూసుకుంటారు, మీప్రాంతానికి నిధులు అందడానికి మీనాయకుల గొప్పతనం కారనం కాదు, కేవలం నిధుల పమిపిణీని నిర్ణయించే ముఖ్యమంత్రి మీవాడు కావడం వలన, మందబలం ఉండడం వలన అని చెబితే వారికి అర్ధం కాదు.

సరే, ఇంతకూ సీమాంధ్ర నాయకులు ఎంతగొప్పవారు అంటే , వీరిలో అత్యధికులకు చేసేది పార్ట్‌టైం రాజకీయాలు, ఫుల్‌టైం వ్యాపారాలు. మనరాష్ట్రానికి ఎందుకు ఎక్కువ కేంద్రమంత్రిపదవులు దక్కడంలేదని అడిగితే ప్రధాని ఇచ్చిన సమాధానం ఇలా పార్ట్‌టైం  రాజకీయాలు చేసేవారికి మత్రిపదవులు ఇవ్వడం జరగదని.

వీరు వ్యాపారాలు చేసుకుంటే సరే, కానీ అధికారాన్ని వారి వ్యాపార విస్తృతికి వాడుకోవడం సరీయినది కాదు. కానీ అనేకమంది ఆంధ్రా ఎంపీలు తమవ్యాపారలాభాలకోసం తమ పదవులు వాడుకుంటున్నారు. ఆఖరుకు పార్లమెంటులో ప్రజాసమస్యలకోసం వినియోగించాల్సిన ప్రశ్నోత్తరాల సమయం వీరు వ్యాపారాలకోసం వాడుకుంటున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరనలు:

లగడపాటి రాజగోపాల్:

విజయవాడ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ లాంకో ఫౌండర్ అన్న విషయం తెలిసిందే. ఈయన పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న:
“Whether the Central Government proposes to give some concessions to small power units generating 25 MW of power. If so, the details thereof; and if not, the reasons for not giving concessions.”

లాంకో పవర్ ప్రాజెక్టుల వ్యాపారం చేస్తునదనేది తెలిసిందే.


కావూరి సాంబశివరావు:

కావూరి సాంబశివరావు ఏలూరు ఎంపీ అయి ఉండగా ఈయన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపనీ కన్స్ట్రక్షన్, ఇంఫ్రా వ్యాపారాలు చేస్తాడని తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the Government proposes to empower the NHAI to extend working capital loans to road developers to help them tie over credit crunch and maintain speedy implementation of road projects.”

రాయపాటి సాంబశివరావు:

గుంటూరు ఎంపీ రాయపాటి జయలష్మి గూపు ఓనరు. ఈయన అనేక ఇతర వ్యాపారాలతోపాటు కన్స్ట్రక్షన్, రోడ్ల వ్యాపారాలు చేస్తాడు. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the NHAI has recently sought comments of various stakeholders on hybrid models to implement highway projects. If so, the details thereof along with the views of the various parties involved.”

నామా నాగేస్వర్:

మధుకాన్ చైర్మన్ నామా ఖమ్మం ఎంపీ. ఖమ్మం తెలంగాణలో భాగమయినప్పటికీ ఇతను ఏవర్గం కొమ్ము గాస్తాడో తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

"Whether the Government proposes to start eight-lane access control express highways. If so, the details thereof along with the locations where the expressways are proposed, state-wise and national highway-wise.”

ఇదండీ, ఈవిధంగా మన ఆంధ్రా ఎంపీలు రాజకీయాలను వ్యాపారానికి వాడుకుంటూ పార్లమెంటులో ప్రజలసమస్యలగురించి చర్చించాల్సిన అమూల్యమయిన సమయాన్ని తమ వ్యాపారాల అవసరాలకోసం ప్రభుత్వ కార్యక్రమాలు ఎలాఉపయోగపడుతాయో తెలుసుకోవడం కోసం వాడుతున్నారు.


Tuesday 28 June 2011

లొక్‌సత్తా తెలంగాణకు దగ్గరవుతోందా?

లొక్‌సత్తా పత్రిక ఎడిటర్ గంగాధరరావు గారి లొక్‌సత్తా టైంస్‌లోని వ్యాసం  ఈక్రింద చూడవచ్చు. తెరాసపై, కేసీఆర్‌పై  దుమ్మెత్తిపొయ్యడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ ఈవ్యాసం తెలంగాణవాదానికి అనుకూలంగానే ఉన్నది. ఇటీవలే లోక్‌సత్తా శ్రీక్రిష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. ఈపరిణామాలను చూస్తుంటే లోక్‌సత్తా ఆలస్యంగానైనా తెలంగాణ అంశంపై న్యాయం వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది.

*******************

అన్ని పార్టీల మద్దతూ అవసరమే
- కొంగర గంగాధరరావు
ఈ వేళ తెలంగాణలో నూటికి 90 శాతం మంది ప్రజల బలమైన వాంఛ తెలంగాణ రాష్ట్రం. ఈ ఉద్యమాన్ని కెసిఆర్ కళ్ళతోనో లేక తెలంగాణ కాంగ్రెస్/టిడిపి నాయకుల దృష్టితోనో చూస్తే, అది తెలంగాణ ప్రజల్లో ప్రబలంగా ఉన్న ఆకాంక్షను అవమానించడమే అవుతుంది. మరి ఇంత ప్రబలంగా ఉన్న ఈ వాంఛ సఫలీకృతం కావడానికి గల అడ్డంకులేమిటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయకుండా సాగతీయడానికి గల కారణాలేమిటి? 

మనమందరం విస్మరించకూడని విషయం మరొకటుంది. ఏ ఉద్యమంలోనైనా ప్రజలందరూ పాల్గొనరు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నిజంగా పాల్గొన్న యోధులు వేలల్లోనే ఉన్నారు. కాని అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లొంగదీసుకొంది. మరి లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చినా, కోరుకొంటున్నది దేశ సార్వభౌమత్వానికి ఏ రకంగానూ భంగకరం కాని, ఒకప్పుడు ప్రత్యేకంగా వుండి నేడు సమై క్య ఆంధ్రప్రదేశ్‌లో అస్తిత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్రాన్నే అయినా, కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి మరీ వెనుక అడుగులు ఎందుకు వేస్తోంది? దీనికి కారణభూతులు ఎవరు? తెలుసుకోవాలంటే ముందుగా మనం ఉద్యమ మూలాల్లోకి వెళ్ళాలి. 

1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్ర మేర్పడినప్పుడు చెన్న పట్టణాన్ని తమిళులకు కోల్పోయిన ఆంధ్ర ప్రజల్లో, నాయకుల్లో విశాలాంధ్ర ఏర్పడాలన్న కోరిక పురుడు పోసుకొంది. అంతకు రెండు శతాబ్దాల క్రితం తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయాయి. ఆంధ్ర మహాసభ తదితర కార్యక్రమాలతో ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోను, అటు కోస్తాంధ్ర, రాయలసీమలోను తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసి పోతే మరింత ఎదగగలమని ఆశ పొడసూపింది. 1948లో పోలీస్ యాక్షన్ ద్వారా భారత్‌లో విలీనమయిన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారిని, నిజాం నవాబుల కాలంలో అనుభవించిన బాధలు, విశాలాంధ్ర వైపు అడుగులు వేసేలా చేశాయి. 

అయితే వాటితోపాటే అనుమానాలు ఏర్పడ్డాయి. వివిధ చారిత్రక కారణాల వల్ల అటు ఆంగ్ల విద్యలో, ఇటు లౌక్యంలో ఎంతో ముందంజలో ఉన్న కోస్తాంధ్ర ప్రజ లు అటు రాయలసీమ ప్రాంత ప్రజల్లో, ఇటు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయారు. రాయలసీమ వాసులతో శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుని కలుపుకున్న కోస్తాంధ్ర నాయకత్వం ఇటు తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకోవాలని తహతహలాడింది. 

అందుకే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం తదితర ఒడంబడికలు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య జరిగాయి. ఫజల్ అలీ కమిషన్, అయిదేళ్ళు ఆగి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి కొత్తగా ఎన్నికయిన ఆ ప్రజాప్రతిధులు ఇరు ప్రాంతాల శాసనసభలలోను మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు విశాలాంధ్రను ఏర్పరచాలని అభిప్రాయపడింది. 

కాని నిజాం ప్రతినిధి మోయిన్ నవాజ్ జంగ్ ఐక్యరాజ్యసమితిలో స్వతంత్ర హైదరాబాదు రాజ్యానికి సంబంధించి ఇచ్చిన అర్జీ తదితర కారణాల వల్ల భారత ప్రభుత్వం హైదరాబాదు రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించింది. ఐదు జిల్లాలను మహారాష్ట్రలో, మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపి మిగిలిన హైదరాబాదు ప్రాంతాన్ని (తెలంగాణ) సీమాంధ్రతో జోడించింది. భాష తెలిసిన ఎవరికయినా ఇది జోడింపు (అఛిఛ్ఛిఛ్ఛీ) మాత్రమేనని, కలయిక/ విలీనం (అఝ్చజూజ్చఝ్చ్టజీౌn) కాదని తెలిసిపోతుంది. 

ఈ జోడింపు తెలంగాణ ప్రాంత ప్రజల్లోని అభద్రత భావాన్ని తొలగించకపోగా మరింత పెంచింది. పాలనా వ్యవహరాల్లో ఉపయోగపడేందుకు తెలుగు, ఆంగ్లం ఎక్కువగా తెలిసిన సీమాంధ్ర వారిని ఉన్నతాధికారులుగా హైదరాబాద్ తీసుకురావడం, తెలుగు వారయినా నిజాం పాలనలో ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం వల్ల సీమాంధ్రులతో పోటీబడే స్థాయిలో తెలంగాణ ప్రజలు లేకపోవడం ఈ దూరాన్ని పెంచింది. ఒక కాకి పదికాకులను పిలిచినట్లుగా సీమాంధ్ర ఉన్నతాధికారులు సీమాంధ్ర విద్యాధికులకు పెద్దపీట వేసి తివాచీ పరచి ఆహ్వానించడంతో తెలంగాణ ప్రజానీకానికి తమచోటే తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిరావడం బాధాకరంగా పరిణమించింది. 

అగ్నికి వాయువు తోడైనట్లుగా సీమాంధ్రుల అభిజాత్య అహంకారపు ధోరణి తెలంగాణ ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక ఉర్దూ కలగలిసిన తెలంగాణ తెలుగు మాండలికాన్ని సీమాంధ్రులు చిన్నచూపు చూడటం విద్వేషాగ్నిని రగిల్చింది. తమ దైన భాష, సంస్కృతి తమ చోటే తిరస్కృతికి గురికావడం తెలంగాణ ప్రజానీకం తిగరబడేలా చేసింది. దానికి విద్యార్థి నాయకులు త్యాగం, కొద్దిమంది తెలంగాణ రాజకీయనాయకుల స్వార్థం తోడవడంతో 1969లో ఉవ్వెత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎగసింది. 

అప్పటికింకా ఐక్యరాజ్యసమితిలో నిజాం మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ పెట్టిన అర్జీ తేలకపోవడం, జాతీయ సమగ్రత అంశాలు కలగలిసి ఉండటంతో ఇందిరాగాంధీ నేతృత్వంలోని నాటి జాతీయ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ససేమిరా అంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిని ప్రలోభ పరచి, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణ ప్రజానీకానికి తాయిలాలు వేసి ఉద్యమాన్ని చల్లార్చి రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంచడంలో సఫలీకృతం అయింది. 

అప్పుడప్పుడు అసంతృప్త తెలంగాణ రాజకీయ నాయకులు ఈ కాంక్షను వాడుకోవాలని చూసినా 1969లో మోసపోయిన తెలంగాణ ప్రజానీకం అంత త్వరగా స్పందించ లేదు. కాని 2002లో చంద్రబాబుపై కోపంతో ప్రత్యేక తెలంగాణ సమరాంగణంలో దూకిన కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు ఉరఫ్ కెసిఆర్ ఈ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. విద్వేష భావాలు రెచ్చకొడుతూనే ఎక్కడా హింసాత్మక రూపం తలదాల్చకుండా అటు అణచివేతకు అవకాశమీయకుండా ఇటు ఉద్యమ స్ఫూర్తి చల్లారినప్పుడల్లా తనదైన ఎత్తుగడలతో ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తూ కెసిఆర్ చేసిన ఉద్యమ ప్రస్థానం తెలంగాణ ప్రజానీకపు ప్రగాఢ కాంక్షను మరింత బలీయం చేసింది. 

బలమయిన ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్టార్ ప్రమాదంలో కోల్పోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేమన్న భయంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కెసిఆర్‌ను ప్రోత్సహించింది. తత్ఫలితమే కెసిఆర్ నిరాహార దీక్ష, 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటన. మొయిన్ నవాజ్ జంగ్ అర్జీకి కూడా 1975లో ఐక్యరాజ్యసమితిలో కాలం చెల్లిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 10న పార్లమెంటులో సైతం ప్రకటించిన జాతీయ ప్రభుత్వం ఆ తరువాత చంద్రబాబు ఎదురుదాడికి తల్లడిల్లింది. 

అంతవరకు ప్రత్యేక తెలంగాణకు ఉత్తుత్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు, ఇది తనపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రయోగించిన అస్త్రంగా గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. సీమాంధ్రలో డిసెంబర్ 10 నుంచి ప్రజ్వరిల్లిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇటు చంద్రబాబు అప్రకటిత మద్దతుతో, అటు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు హైదరాబాదులో వున్న ప్రయోజనాల దృష్ట్యా ఉవ్వెత్తున ఎగియడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెనక్కి తగ్గింది. పరిష్కారాలు వెతకడం కోసం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సంవత్సరం పాటు కాలహరణం చేసిన శ్రీకృష్ణ కమిటీ మరింత వివాదాస్పదంగా తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ రహస్యంగా 8వ అధ్యాయాన్ని సమర్పించి జస్టిస్ శ్రీకృష్ణ ప్రతిష్ఠను పాతాళానికి తొక్కింది. 

మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తిరిగి ఊపందుకునే ప్రయత్నంలో వుంది. అయితే సంవత్సరం క్రితం ఉన్న ఆనందోత్సాహాలు, తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఇప్పుడు లేవు. మోసపోయామన్న బాధ, పోరాడాలన్న కసి తప్ప ఏంచేస్తే తెలంగాణ వస్తుందో తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజానీకం, నాయకత్వం వుంది. కారణాలేమి టి? 

ఉద్యమం అంత ఉద్ధృతంగా సాగినా ఫలితాన్ని సాధించడంలో ఎందుకు విఫలం అవుతోంది? అసలు ప్రత్యేక తెలంగాణ సాధనకు గల అడ్డంకులేమిటో ఒకసారి పరిశీలిద్దాం. తరచి తరచి చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బలమే దానికి బలహీనతగా పరిణమించిందని అర్థమవుతుంది.కెసిఆర్‌పై అధికంగా ఆధారపడటం ఉద్యమ గమనానికి ఎంతఅవసరమైందో, లక్ష్యసాధన లో అంతే అడ్డంకిగా నిల్చింది. కారణాలు విశ్లేషిద్దాం. 

(అ) నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సీమాంధ్రులకు అభ్యంతరం లేదు. కానీ ఉద్యమంలో ఉద్రేకం చల్లారకుండా వుండేందుకు కెసిఆర్, అతన్ని అనుసరిస్తూ ఇతర తెలంగాణ ప్రాంత నాయకులు వాడిన పదజాలం సీమాంధ్రులను గాయపరచింది. అందుకే తమకు పోయేదేమి లేకున్నా, తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడివున్నా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సామాన్య సీమాంధ్రులు సైతం బలపరిచారు. 

(ఆ) తెలంగాణలో ప్రబలంగా వున్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యపరుస్తాడనుకున్న కెసిఆర్ తెలంగాణలో తమని కూడా తుడిచి పెడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇచ్చి కెసిఆర్‌ను మరింత బలపరిస్తే ఆ ప్రాంతంలో తమకు నూకలు చెల్లినట్లేనని గ్రహించింది. 

(ఇ) అటు సీమాంధ్రలో చంద్రబాబును పక్కనపెట్టి ముందుగా వై.ఎస్.జగన్ అంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భయపడుతోంది. అటు జగన్ బలాన్ని అంచనా వేయలేక, ఇటు తెలంగాణ ప్రకటిస్తే ఆ కారణంతో అటు సీమాంధ్రలో జగన్ తమని తుడిచిపెడితే తమగతి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందేమోనని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తల్లడిల్లుతోంది. 

(ఈ) ఇక ఎలాగూ తెలంగాణ వస్తోంది కాబట్టి, తెలంగాణలో ప్రత్యర్థుల నిర్మూలనకు కెసిఆర్ పూనుకున్నారు. టిడిపిిని దాదాపుగా తుడిచిపెట్టిన కెసిఆర్ తమను విడిచి పెడతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ ప్రభ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇవ్వాలంటే భయపడే రీతిలో వుంది. 

అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వనట్లేనా? దీనికెవరిని నిందించాలి? మితిమీరిన కెసిఆర్ స్వార్థ నాయకత్వమా? కెసిఆర్‌పై అతిగా ఆధారపడి మిగిలిన రాజకీయ పక్షాలను తెలంగాణలో శూన్య స్థితికి తెచ్చిన రాజకీయ జేఏసీ కారణమా? తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రక్రియ అని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాల్సిన అవసరం వున్నదన్న విషయం మరచి, తెలంగాణలో జై తెలంగాణ అనని రాజకీయ పక్షాల అస్థిత్వాన్ని నిర్మూలించాలన్న వ్యూహం తెలంగాణ ఉద్యమం పట్ల ఆత్మహత్యా సదృశం అయ్యిందా? దీనికెవరిని నిందించాలి? 

ఖచ్చితంగా రాజకీయ జేఏసీనే. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు స్వార్థం లేనిదే మనుగడలేదు. పైచేయి సాధించడం, ప్రత్యర్థులను తుదముట్టించడమే రాజకీయ పక్షాల లక్ష్యం. కానీ రాజకీయ జేఏసీ లక్ష్యం అదికాదు. స్వార్థం దానిగుణం కాదు. కేవలం ఉద్యమ ఉద్ధృతికి కెసిఆర్‌పై ఆధారపడవలసి వచ్చినా, ఇతర రాజకీయ పక్షాల నిర్మూలనలో కెసిఆర్‌కు రాజకీయ జేఏసీ సహకరించడమే ప్రస్తుత దుర్గతికి కారణం. నిరాహార దీక్ష రెండోరోజునే పళ్ళరసం తాగిన కెసిఆర్ దిమ్మతిరిగేలా విద్యార్థి ఉద్యమ నాయకత్వం హెచ్చరికలు పంపి కెసిఆర్‌ని నిరాహార దీక్ష కొనసాగించేలా చేసిన వైనం, రాజకీయ జేఏసీ మరచిపోయింది. 

కేసీఆర్‌పై ఆధారపడుతూనే అతడిని, అతడి రాజకీయ వ్యూహాలను అదుపులో పెట్టవలసిందిపోయి, కెసిఆర్ చెప్పినట్లుగా చేసి ఇతర రాజకీయ పక్షాలకు దూరమయ్యింది. అన్ని రాజకీయ పార్టీలకు విశ్వాసం కలిగించి, తెలంగాణ రావడం ఆ పార్టీలకు శరాఘాతం కాదని, అన్ని రాజకీయ పక్షాలకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కూడా సమాదరణ ఉంటుందనే భావన కల్పించడం మరచిపోయి, కెసిఆర్ అడుగులకు మడుగులొత్తని రాజకీయ పక్షాల పీచమణచేందుకే తన శక్తి యుక్తులనుపయోగించింది. పర్యవసానమే ఈ దుస్థితి. 

ఇకనైనా రాజకీయ తదితర జేఏసీలు ప్రాప్తకాలజ్ఞతతో అన్ని రాజకీయ పక్షాలతోనూ చర్చించి వాటి విశ్వాసాన్ని చూరగొనాలి. రాజకీయ పక్షాలు సహకరించకుండా, వాటి పీచమణచడం ద్వారా తెలంగాణ సాధించడం అసాధ్యం. అలాకాకుండా అన్ని రాజకీయ పక్షాలను సమాదరిస్తూ, వాటికి విశ్వాసాన్ని కలిగించగలిగితే రాజకీయ ప్రక్రియలో అన్ని రాజకీయ పక్షాలను పాల్గొనేలా చేయగలిగితే ఉద్యమంలో ఉద్ధృతి రేకెత్తించేందుకు సీమాంధ్ర ప్రాంతీయులపై ద్వేషాన్ని వెళ్ళగక్కే విధానం పోయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమవుతుంది. అలాకాకుండా ప్రస్తుతం జరుగుతున్నట్లుగా అంతా కేసీఆర్ మయం అనుకుంటే 2014 ఎన్నికల్లో అన్ని తెలంగాణ సీట్లు (పార్లమెంట్,అసెంబ్లీ) కెసిఆర్ గెలుచుకున్నా తెలంగాణ రాదు, 

అలాగే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా ప్రస్తుత పరిస్థితులే ఆంధ్ర ప్రాంత ఎంపీలపై ఆధారపడటంఅప్పుడూ వుంటే బిజెపి కూడా తెలంగాణ ఇవ్వదు. తెలంగాణ రావాలంటే అన్ని రాజకీయ పక్షాల సహకారం అవసరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రాజకీయ, విద్యార్థి తదితర జేఏసీలు ఈ విషయాన్ని గ్రహించి తదనుగుణమైన కార్యాచరణను చేపడితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం కల సాకారమవుతుంది. 

- కొంగర గంగాధరరావు
లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు
-- 

పోలవరం సత్యాలు -2


కొంతమంది అతితెలివి చూపిస్తూ మీదగ్గర పారిశ్రామికీకరన జరగితే మేం కాదంటున్నామా, మాకు నీల్లెక్కువ వస్తే మీరెందుకు కాదంటారు అని అమాయకంగా అడుగుతారు. పారిశ్రామికీకరన అవసరం లేదు అని ఎవరూ చెప్పరు, కానీ పారిశ్రామీకరణ ఎక్కడ జరిగినా రాష్ట్రంలో అందరికీ అవకాశాలు లభిస్తాయి, ఆ కంపనీల వోనర్లెవరో, జీడీపీ పెరిగితే అది ఎవరి జేబుల్లోకి వెలుతుందో అందర్రికీ తెలిసిందే. అయితే అసలు పోలవరం నిజంగా వారు చెబుతున్నట్టు ఆప్రాంతం వ్యవసాయం కోసమేనా?

పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.


కొంతమంది అతితెలివివారికోసం ఇక్కడ ఒక క్లారిఫికేషన్: నాఉద్దేషం కాకినాడ, విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు రావొద్దని కాదు. కానీ పరిశ్రమల అవసరంకోసం భారీ నీటిప్రాజెక్టులు ప్రభుత్వం కట్టదు. ఒకవేళ కడితే అది ఇతర తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తరువాత. అలా చెబితే అసలు ప్రాజెక్టుకు CWC నుండి అనుమతి కూడా రాదు, అందుకే ఆయకట్టు గురించిన అబద్దాలు. ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.

ఇందులో ఉన్న పర్యావరణ సమస్యలు, విజయవాడ, రాజమండ్రికి వరద ప్రమాదాలగురించి మరో టపాలో.

Ref: http://www.downtoearth.org.in/content/why-polavaram-pointless-project
http://www.bannedthought.net/India/PeoplesTruth/PeoplesTruth02-200807.pdf

Monday 27 June 2011

ఆంధ్రా అక్టోపస్ అసలు స్వరూపం


గడచిన ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలతరువాత అక్టోపస్ గురించి వినని వారుండరు. అక్టోపస్ సముద్రం అడుగున ఉంటుంది,   ఎనిమిది కాల్లతో తన ఎరను బంధించి రక్తం పీల్చి చంపేస్తుంది, శత్రువు దాడి చేస్తే నల్లని విషాన్ని చిమ్మి తప్పించుకుంటుంది. అప్పుడప్పుడు అక్టోపస్ జాతకాలు కూడా చెబుతుంది. ఆంధ్రా అక్టోపస్  కూడా ఇవన్నీ చేస్తుంది. అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో పేదలరక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, గిట్టని తెలంగాణవాదంపై విషం చిమ్ముతుంది, ఎలక్షన్లపై జాతకాలూ చెబుతుంది. దీనిపేరే లగడపాటి.


ఆంధ్రా అక్టోపస్‌కు చెందిన లాంకో కంపనీ ప్రభుత్వం నుండి 108 ఎకరాల భూమిని పొందింది. అయితే ఇది వక్ఫ్ భూమి అని తరువాత తేలింది. వక్ఫ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ లేదు. హైకోర్టు స్టే ఇచ్చినా అక్టోపస్ తన అధికారాన్ని ఉపయోగించి మాయచేసి లాంకోహిల్స్‌ను పూర్తి చేశాడు. ఐటీపార్కు కోసం ప్రభుత్వం దగ్గర కొట్టేసిన భూమిలో కనీసం పావు వంతు కూడా ఐటీ పార్కు కట్టకుండా అంతా కమర్షియల్ ఫ్లాటులు కట్టిన అక్టోపస్ భూమికి ఆనుకుని ఉన్న కుంటలూ, గుట్టలూ, ఆఖరుకు స్మశానం, గుడి కూడా వదలకుండా కలిపేసుకున్నాడు. అయితే పాపం రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో లాంకోహిల్స్ ఇప్పుడు దివాళా తీసింది. తెలంగాణ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయే ప్రమాదం ఉండడంతో పాటు వక్ఫ్‌భూములపై, ఆక్రమణలపై విచారన జరిగే అవకాశం కూడా ఉండడంతో ఈఅక్టోపస్ తెలంగాణ ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకుంది.

ఆంధ్రా అక్టోపస్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. అయితే ఎలక్షన్ అఫిడవిట్‌లో మూడో సంతానం గురించిని దాసిన విషయంపై విచారణ నడుస్తుంది. ఇంకా ఆంధ్రా అక్టోపస్ హవాళా కుంభకోణంలోనూ, ఇన్సూరన్సు కుంభకోణంలోనూ కూడా భాగం ఉన్నట్టు తెలుస్తోంది. ఈఅక్టోపస్‌కు చెందిన లాంకో ఇంఫ్రా ఈక్కడెక్కడైతే పవర్ ప్లాంటులు కడుతుందో అక్కడ అన్ని చోట్లా ఆయా రాష్ట్రప్రభుత్వాలతో కోర్టు కేసులు ఎదుర్కుంటోంది.

లగడపాటి vs KTR

లగడపాటి, కేటీఅర్ లమధ్య ఆసక్తికరమయిన చర్చ HMTV వారి బిగ్‌షోలో జరిగింది. ఎంతో ఆసక్తి కరంగా జరిగిన ఈచర్చలో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. చర్చలో లగడపాటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం జరిగింది అనేది అవాస్తవమని, అది కేవలం సమైక్యవాదుల ప్రాపగాండా అని ఒప్పుకున్నారు. అలాగే విడిపోతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గానీ కేంద్రపాలితప్రాంతంగా గానీ ఉంచడం కుదరదని అది తెలంగాణకే చెందాలని కూడా ఒప్పుకున్నారు. చర్చలో ఏకోసానా లగడపాటి కేటీఆర్‌కు సమాధానం ఇవ్వలేకపోయారు.

పూర్తి చర్చ దొరకలేదు, కొంతభాగం మాత్రం యూట్యూబ్‌లో క్రింది వీడియోల్లో చూడవచ్చు.Saturday 25 June 2011

పోలవరం సత్యాలు - 1
పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం.

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు (కొందరు మేతావులు దీనిని 4500 ఎకరాలుగా చెబుతున్నారు) అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం). అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది. అసలు మొత్తం ప్రభుత్వం చెప్పే ఆయకట్టులో 75% వరకూ ఇప్పటికే ఏదో ఒకరకమయిన ఇరిగేషన్ ఉందని అంచనా.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.

ఇందులో ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఎక్కువ రాయలేకపోవడం జరిగింది. ఈప్రాజెక్టు సమర్ధకులు చెప్పే ఇంకోవిషయం 900MW పవర్ జెనరేషన్ కాగా, కేవలం 900MW పవర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం నాడా ఉంది కదా అని గుర్రం కొనుకోవడం లాగ. పవర్ జెనెరేషన్ ఖర్చులో పెట్టుబడిపై వడ్డీని కూడా చూడాలి, అలా చూసినప్పుడు థెర్మల్ పవర్‌కే తక్కువ ఖర్చు.

2010 లెక్కలప్రకారం ప్రస్తుత ఖర్చుల అంచనా 16 వేలకోట్లు. పూర్తయే సరికి బహుళార్ధక ప్రాజెక్టులు వేటికయినా నాలుగురెట్లు ఖర్చు పెరుగుతుంది. అయితే ఈ అంచనాలో పునరావాసం ఖర్చు గానీ, మైన్సూ, ఆటవీ ప్రాంతం ఖర్చు గానీ ఉన్నట్లు లేదు. ఇక కోల్పోయే వన్యమృగ సంపద, ప్రకృతి సంపద లాంటివాటికి లెక్కేలేదు. ఇంతాచేసి ఇదేమీ కరువు ప్రాంతం కాదు, తక్కువలోతులోనే భూగర్భ జలాలు ఉండే తీరప్రాంతంలో. మరి ఈ తెల్ల ఏనుగు ఎవరికోసం అయ్యా అంటే వోట్లకోసం పదవులకోసం పంతాలకు పొయ్యే కొంతమంది రాజకీయనాయకుల స్వార్ధం కోసం.Ref: http://www.downtoearth.org.in
http://www.conflicts.indiawaterportal.org/sites/conflicts.indiawaterportal.org/files/conflicts_polavaram.pdf

Thursday 23 June 2011

దేడ్ దిమాక్ వాదనలు -2

దేడ్ దమాక్ వాదన 1: తమరి ప్రశ్నకు సమాధానం వచ్చినతరువాత అసలు ప్రశ్ననే మార్చేసే దేడ్‌దిమాక్ పనులు జెయ్యొద్దు. తమరి ప్రశ్న వలసవాద ప్రభుత్వమంటూ ఉద్యోగాలు చెయ్యడానికి సిగ్గులేదూ అని, మరొకసారి చదువుకోండి. బ్రిటిష్ ప్రభుత్వంలో మీపెద్దలెవరూ పనిచెయ్యలేదా, లేక వారికి సిగ్గులేదా, అది చెప్పక వలసవాదం నిర్వచనానికి ఎందుకు వెలతారు? ఎలాంటి పెత్తనాలు వలసవాదం కిందికి వస్తాయో ఏవిరావో చెప్పగలిగేంత శాస్త్రం తమ దగ్గర లేదు గానీ కనీసం తమరు చెప్పిన వాదనకు కట్టుబడి ఉండండి.

దేడ్ దమాక్ వాదన 2: చేదే సామర్ధ్యం మనిషికి ఉంది అది బావిలోనయినా, లిఫ్టు ఇరిగేషన్లో నయినా, లేనిది will. పోలవరానికి ఇంకా ఏమేం అవసరం ఎంతమందికి పునరావసం కావాలి, ఎంత ఆటవీ సంపద మునిగిపోవాలి, తీరా ఎన్ని ఎకరాలకు నీల్లు వస్తున్నాయనేది తరువాత మాటాల్డుకుందాం. ఎంత దేడ్ దిమాక్‌లయినా మరీ కనీసం ఒక వాదనకు కట్టుబడకపోతే ఎలా? తమరిలాంటి దేడ్ దిమాక్లు బావి ఉన్నా దాహంతో ఎండిపోతారేమో కానీ మిగతావారు అలా కాదని గమనించండి.

దేడ్ దమాక్ వాదన 3: అడ్డంగా దొరికిపోయినతరువాత కూడా వెధవకబుర్లు. పీఠభూముల్లో కూడా నదీజలాలొస్తే బంగారం పండిచ్చొచ్చని మీదేడ్ దమాక్కు తెలవకపోతె తెలుసుకోండి.

దేడ్ దమాక్ వాదన 4: మల్లీ అదే అతితెలివి.దేడ్‌దమాక్కు తెలియని విషయం క్రిష్ణా నది చాలా ఎత్తులో ప్రవహిస్తుందని, దానికి టోపాలజీ సమస్య లేదని. అయినా ఊరుకోదు కదా, తెలియని విషయాలపై కూడా జడ్జ్‌మెంట్లు.

గోదావరిలో కొన్నిచోట్ల టోపాలజీ సమస్య ఉన్నా అన్నిప్రాంతాలకూ వనరులు అందజెయ్యడం ప్రభుత్వ భాద్యత.. ఇక్కడ పల్లం ఉంది కదా అని ఉన్నచోటే మల్లీ మల్లి నీల్లివ్వరు, లేనిదగ్గర ఇస్తారు. దానికోసం అవసరమయితే లిఫ్టు చేసి కూడా. అది తమ అతితెలివికి ఎక్కదులే.


దేడ్ దమాక్ వాదన 5: ఓహో: ఎ.యం.ఆర్. ప్రాజెక్టు, భీమా కూడా గోదావరిపైనే ఉన్నాయా? మరీ ఇంతగొప్పతెలివితేటలా తమరివి, ఏదో అనుకుని అనవసరంగా సమాధానాలిస్తున్నాను. ఛ, ఎంత కాపీ పేస్టు తెలివి తేటలయితేమాత్రం ఇంతఘోరమా, ఎల్లి మూడో తరగతి సోషల్‌బుక్కు చదువుకోండి, సిగ్గులేకపోతే సరి. మిగతా వాటిలో పేపర్ పైనెన్నున్నయ్, వాస్తవంగ ఉన్నవెన్ని?

దేడ్ దమాక్ వాదన 6: మల్లీ అదే అతితెలివితేటలు ప్రదర్శించి దొరికిపోవడం. తమరు చెప్పిన వాదన మీదగ్గర పారిశ్రామీకరన జరుగుతుంటే మేమేడుస్తున్నామా, అని. ఇప్పుడు దొరికిపొయ్యాక ఇలా ప్లేటు ఫిరాయించడం. సాగునీటిలో మావాటా మాకు కావాలని అడుగుతున్నాం, మీకు కాకుండా మాకు రావాలని మేమనట్లా, దాన్నే ఏడుపు అనే తమరి దురాశ తెలుస్తూనే ఉంది.


దేడ్ దమాక్ వాదన 7,8: అసలు వీటికి ఇంకా సమాధానాలు కావాలా? ఇక్కడ చివరికి కన్‌ఫ్యూషన్ ఏమయినా ఉంటే మీరు అసలు దేడ్ దమాక్‌లా, లేక జీరో దమాక్‌లా అనేదే.

ఇంకా ఈదేడ్‌దమాక్‌లతో వాదన ఇంకా సాగదీసే ఉద్దేషం లేదు, గుడ్‌బై.

Wednesday 22 June 2011

దేడ్ దమాక్ వాదనలు

కొంతమందికి మెడకాయలమీద తలకాయలు ఉన్నప్పటికీ, ఆతలకాయల్లో ఆలోచించే మెదడు ఉండదు, దాని స్థానంలో అహంకారము మాత్రము ఉంటుంది. అందుకే మెదడుతో గాక పొగరుతో ఆలోచించి తమ మిడిమిడి గ్నానాన్నే మహా తెలివితేటలని భావించి అందరినీ విమర్శించబోతారు, చివరికి తమ తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకుంటారు. ఇలాంటిదే ఒకసారి ప్రజాకవి గోరేటి వెంకన్నపై చూపించబోయి అడ్డంగా దొరికిపొయ్యారు, అయినా బుద్ది మారలేదు.

వలసవాద ప్రభుత్వంలో ఉద్యోగం చెయ్యడానికి సిగ్గులేదూ అని అడిగే బుర్రలేని వెధవలకు బ్రిటిష్ వలసవాద ప్రభుత్వంలోనూ భారతీయులు, సీమాంధ్రులు ఉద్యోగాలు చేశారని తెలియదా? అసలు ప్రపంచంలో ఎక్కడయినా వలసవాద ప్రభుత్వాలు లోకల్ ఉద్యోగులు లేకుండానే పనిచేశాయా? బ్రిటిష్ పాలనలో ఉద్యోగాలు చేసిన మన పెద్దలకు సిగ్గులేదని, వారిబుద్ది శంకరగిరి మాన్యాలు పట్టిందని ఈయన అభిప్రాయమా లేక ఈయన మెడకాయపై ఉన్నతలకాయలోంచి మెదడు మోకాల్లద్వారా అరికాల్లలోకి జారిపోయి చితికిపోయిందా?

ఇక రెండొ శుష్కవాదన బావిలో నీల్లున్నా బావిపై ఉన్న మనుషుల దాహం తీరనట్టు పీఠభూమిలో నదులున్నా భూములకు అందదట, వహ్వా. బావిలో నీల్లుంటే బావిపైనున్న మనుషులు దాహంతో ఎండరు, చేదుకుని తాగుతారు. ఎవరైనా ఎండారు అంటే అది మనిషిలా ఆలోచించలేని జంతువులన్న అయ్యుండాలి, లేదా ఎవరైనా పెద్దదొరలు దౌర్జన్యం జేసి నీల్లను తాగకుండా మిగతా ప్రజలను ఆపనన్నా ఆపాలి. మరిక్కడ ఈయన వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిలేని జంతువా, లేక కొంతమంది దౌర్జన్యంగా మిగతావారికి అందకుండా చేస్తున్నారా?

గుంటూరు నుంచి నల్లగొండకు రైల్లో వచ్చినా, బస్సులో వచ్చినా ఎక్కడయితే క్రిష్ణా జలాలు కాలువద్వారా అందుతాయో అక్కడ పచ్చగా ఉంటుంది, ఎక్కడయితే అందవో అక్కడ ఎండిపోతుందని ఈఅతితెలివి మహాశయునికి తెలియదు. దక్కన్ పీఠభూమిలోనే ఉన్న నిజామాబాద్, కరీమ్నగర్ లలో కూడా కాలువలు ఉన్నచోట పచ్చగానే ఉంటుందని పచ్చకామెర్ల మనిషికి తెలియదు.

ఇక ఆతరువాత నీరు పళ్లమెరుగును అని ఒక పెద్ద శాస్త్రాన్ని తానే కనుక్కున్నంత దర్జాగా చెప్పి కల్లు తెరిపించాడీ అతితెలివి మహానుభావుడు. నీరు పల్లమెరిగితే అది డెల్టాలో మాత్రం వాడడం ఎందుకు బంగాళాఖాతం ఇంకా పళ్ళంలో ఉంది కదా అని అక్కడికే పంపిద్దామా? లేక ఎగువన ఉన్న రాష్ట్రాలు నీల్లు పల్లమెరుగును కదా అని అన్నీ కిందకే విడిచిపెడుతున్నారా?

నిబద్దత ఉన్న ప్రభుత్వం ఆయకట్టు ఇప్పటికే ఉన్నచోట ఆయకట్టు స్థిరీకరణకోసం వేలకోట్లు ఖర్చుపెట్టేముందు అసలు లేని చోత ప్రాజెక్టులు చేపడతారు. కానీ ప్రభుత్వంలో చక్రం తిప్పేది మనమయితే ప్రాజెక్టు ఉన్నదగ్గరే మల్లీ మల్లీ కడుతాం, నియమాలు ఉల్లంఘించి గోదావరి నీల్లను క్రిష్ణా బేసిన్‌కు మల్లిస్తాం, పర్యావరణం పాడయినా, అడవులు మునిగిపొయినా, ఆదివాసిలు నిర్వాసితులయినా ఇంకా ఏమయినా ఫరవాలేదు. ఎగువన ఉన్న శ్రీరాం సాగర్ మాత్రం మూడొంతులకు కుదిస్తాం, ఎన్నటికీ పూర్తిచేయం, గ్రావిటీ బూచి చెప్పి ఇంకా ఏప్రాజెక్టూ చేపట్టం.

ఇప్పటికే క్రిష్ణాపై శ్రీశైలం ఎడమకాలువకు పూర్తిగా ఎగనామం పెట్టి, నాగార్జున సాగర్ ఎడమకాలువ అలైన్మెంటు మార్చి తెలంగాణ నోట్లో మట్టికొట్టారు, అడిగితే క్రిష్ణాలో నీల్లెక్కడ ఉన్నాయి ఇవ్వడానికి అని మన రాజశేఖరుడు సమాధానాలు చెబుతాడు. ఇక మిగిలిన గోదావరిపై తెలంగాణలో ఎన్నటికీ ప్రాజెక్టులు కట్టం, చూడండి ఎలాగూ సముద్రంలోనే కలుస్తున్నాయి కదా అని చెప్పి క్రిష్ణా డెల్టాకు మల్లిద్దాం.రేప్పొద్దున ఎవరైనా తెలంగాణలో గోదావరి నీల్లడిగితే ఇప్పటిదాకా గ్రావిటీ బూచిని చూపించినవారు రేపు గోదావరిలో నీల్లెక్కడ ఉన్నాయి, వాటిని క్రిష్ణా డెల్తాకి పంపించేశాం కదా, ఇప్పటికే ఉన్న ఆయకట్టుకదా ఎలా అంటాడు.

అతితెలివి మహాశయుడు ఇచ్చే మరో భారీ స్టేట్మెంటు మీదగ్గర పారిశ్రామీకరన చెందితే మేమేడుస్తున్నామా, నదీజలాలను మొత్తంగా మాకు తరలిస్తే మీరెందుకు ఏడుస్తారూ అని. అయ్యా.. మాదగ్గర పారిశ్రామీకరణ జరిగితే దాని వోనర్లు, ఉద్యోగులు, అటేందర్లు అందరూ మీవారే గదా? వ్యవసాయం పెరిగితే అక్కడి నివాసితులకు లాభం గానీ పారిశ్రామీకరణ వలన ఎవరికి లాభమో మీలాంటి అతితెలివి మనుషులకు తెలియదా చెప్పు? ఊరికే ఏడుపు ఏడుపు అని వాగొద్దు, మేం మాహక్కులకోసం అడుగుతున్నాం, మీపైసాకూడా మాకొద్దు. మావాటా మాకివ్వాల్సి వస్తుందని ఏడిచేది మీరే.

మనుషులు తమ పరిమితులు తెలుసుకోకుండా కంప్యూటర్ ఉందికదా ఏదయినా రాసేద్దాం, పెద్దవాల్లను బుద్దిహీనులు, మెడకాయమీద తలకాయలేని వారు అంటూ తిట్టిపోస్తే మనకు మైలేజీ పెరుగుతుందని ఇష్టం వచ్చింది రాస్తే సాధించేది ఏమిటి? తన మిడిమిడిగ్నానాన్ని మరో మారు చూపుకుంటూ పోలవరం ఇస్తే సీమాంధ్ర నుండి హైదరాబాదుకు వలసలు తగ్గిపోతాయి అంటూ మరో భారీ స్టేట్మెంటు??!! అయ్యా, పొట్టకూటికోసం వలసపొయ్యే కూలి జనాలకూ, ఊర్లో ఆయ్కట్టుకింద నాలుగెకరాలుండి అదక్కడ సాగు చేస్తూనే దొంగ సర్టిఫికెట్లు పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగాలు దోచుకునే దోపిడీవారికీ తేడా తెలుసుకోండి. వలసలకూ వలసవాదానికీ తేడా తెలుసుకోండి.అయినా ఏదో మాఅమాయకత్వం గానీ నీతిమాలిన లగడపాటినికూడా నిస్సిగ్గుగ వెనుకేసుకొచ్చే మనుషులకెక్కడయినా నీతి ఉంటుందా?

PS: bad publicity is also good publicity. మీరు విమర్శిద్దామనుకుని ఆవీడియోలు మీబ్లాగులో పెట్టుకున్నా ఆవిధంగా మీరు తెలంగాణవాదానికి మంచే చేస్తున్నారు. మీబ్లాగులో ఆవీడియోలు చూసేవారంతా మీఅంత మూర్ఖవాదులూ, పక్షపాతంతో కల్లుమూసుకుపోయినవారు కాదు గనక వారు మీబ్లాగుద్వారా వీడియో చూసి నిజాలు గ్రహించనూ వచ్చు, తరువాత మీరాతలు చదివి సీమాంధ్రవాదుల పక్షపాతధోరణినీ తెలుసుకోవచ్చు. మీకు ధన్యవాదాలు.

నమస్తే!!

Tuesday 21 June 2011

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు

తెలంగాణ ఆశయం సిద్ధించకముందే కాలం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌గారికి నానివాళులు. ఈసందర్భంగా తెలంగాణ ఉద్యమానికి గల కారణాలనూ వివరిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలు. వల్యూం కాస్త తక్కువగా ఉన్నది.ఇరిగేషన్లో వివక్షపై వీడియోMonday 20 June 2011

రావొచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు.

"రావొచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు" ఇది రాష్ట్రం విడిపోతే సమైక్యవాదులు ప్రచారం చేసేటట్లు కొంపలేం అంటుకుపోవు, రాష్ట్రాల విభజన అనేది ఒక సాధారన రాజ్యాంగబద్దమయిన ప్రక్రియ అని చెప్పడానికి గోరేటి వెంకన్న సరలమయిన భాషలో రాసిన పాట. సీమాంధ్రలో కూడా ఎంతోమంది మెచ్చిన ఈపాటను సహోదరుడు రాజేష్ (బహుషా సీమాంధ్ర ప్రాంతం వాడే) ఒక బ్లాగులో కామెంటుగా రాశాడు.

ఇది చూసిన ఒకతోటి బ్లాగరు వెంటనే పాటలో ప్రతిపదార్థాల ఈకలు పీకుతూ తమ అతితెలివిని ప్రదర్శిస్తూ ఒక టపా వేశారు. వారు రాసిన ముక్కలు:

"నీ ఇడ్లిబండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు” అలా అన్నారు కదా అని సంతోష పడేరు! "పచ్చళ్ళ బేరాలు జేసిపత్రికల ఓనర్లయితిరి" ఎదిగితే ఇలానూ ఏడ్చారు మరి! అంటే మన బతుకులెప్పుడూ ఇడ్లీ బండి పెట్టుకునే దగ్గరే ఉండాలి. ఎదిగితే ఓర్వలేము అని చెప్పకనే చెప్పారు. సాంబారు సన్నాసిది కూడానూ.

పచ్చ్ళ్ళబేరాలు నిజాయితీగా జేసి పత్రికవోనర్లయితే సంతోషమే గానీ పక్కోడి కడుపుగొట్టి అసైండ్ భూములనూ, మధ్యలో కొన్ని మధ్యతరగతి జీవుల ప్లాటులనూ దర్జాగా తనలో కలుపుకుంటే చూసి మెచ్చుకునే పెద్దమనసు మాకు లేదు మరి. రోజూ ఇదే పెద్దమనిషి పచ్చళ్ళబాగోతాన్ని మరో సీమాంధ్ర పత్రిక ఎండగట్టినప్పుడు అది ఏడుపులాగా కనబడదు, తెలంగాణ గాయకుడు చెబితే మాత్రం వోర్వలేనితనం. ఇదే మన ద్వంద్వ విధానం, మన నిజాయితీ, మన ఆదర్శం మరి.

"ఒక్కతల్లి బిడ్డలమని ఒప్పుకుంటమే నిజము" అలా అన్నారు కదా అని సంతోష పడేరు! "అన్నదమ్ములు ఇద్దరుంటే ఆస్థి పంచుకోరా జెప్పు" అసలు దృష్టి ఆస్తుల మీదే అని అందంగా చెప్పారు. అంటే హైదరాబాదంతా మాదే.

విపరీత అర్ధాలు, పెడవాదనలలో అందెవేసిన చెయ్యికి ఆస్థి పంచుకోరా అంటే ఆస్థిలాక్కున్నట్టు వినిపిస్తుంది. విడిపోతే ఆస్థులు పంచుకుంటారు, ఎలా పంచుకోవాలనేది నిపుణులు నిర్నయిస్తారు. కలిసుంటే అప్పనంగా కాజేసేవాడు మాత్రం ఎప్పటికీ పంచుకోవడానికి ఒప్పుఓడు, ఎందుకంటే విడిపోతే వచ్చేది సగం, ఇప్పుడు అనుభవించేది మొత్తం. అందుకే చల్లకొచ్చి ముంతదాచుతూ ఉంటారు. హైదరాబాదు న్యాయంగా తమకు దక్కదని తెలుసు కాబట్టి పంపకాల లెక్కలడగరు, విడిపోవడానికి వీల్లేదంటూ దర్జన్యం చేస్తారు.మీకు దిగువకి చుక్క నీరు వదలం (సాగరు, డెల్టా చివరి భూములకి ఇంతవరకూ నీళ్ళు రాకున్నా దోపిడీనే).

అంటే ఇప్పటిదాక ఎగువప్రాంతాలకు చుక్కనీళ్ళుకూడా ఇవ్వడంలేదని ఒప్పుకున్నారు. రాష్ట్రాలు విడిపోతే వాటాలు కేంద్రప్రభుత్వబోర్డు నిర్ణయిస్తుందని తెలియదా, ఇప్పుడు ఎగువన ఉన్న రాష్ట్రాలు చుక్కనీళ్ళు వదలట్లేదా?ఒకవేళ వదలకపోతే దేశానికి ఒక కేంద్రం, సుప్రీం కోర్టు అన్ని గొడ్డుపొయినయా? అయినా మన వితండవాదం మాత్రం ఇలాగే కొనసాగిస్తాం.

ఇప్పటిదాకా హైదరాబాదులో పెట్టిన ఉమ్మడి సొత్తంతా అప్పనంగా మాదే. మీ ఎదుగుదల ఇక్కడే వదిలేసి మరో చోట ఇడ్లీ బండి పెట్టుకోమని సలహా కూడా ఇచ్చారు.  

ఉమ్మడిసొత్తో, తెలంగాణ సొత్తో మొత్తం యాభై ఏల్లలో రెండుప్రాంతాలలో వచ్చిన ఆదాయం,ఖర్చులు లెక్కేస్తే తెలుస్తుంది, అంత తొందరెందుకు ఆవిషయంపై నిపుణులు జూసుకుంటరు, అయినా నువ్వింకా ముంతదాచడం మానకపోయి సమైక్యరాగం పాడుతుంటె లెక్కలెట్లదేలుతయ్?

బతకనీకి వచ్చినోడిని భాయి భాయిగా సూస్తం" ఇలా అన్నారని సంతోషించేరు! ౧౯౬౯ లో నల్లగొండ పట్టణం నట్టనడిన రంగాచార్యులకి పట్టిన  గతే నీకూ అని కవితాత్మకంగా చెపారుగా!

ఔరా, యాభై ఏల్లలో ఒక్క సంఘటన మాత్రం భూతద్దంలో పెట్టి చూపిద్దాం. ఎంతమంది మీవోల్లు తెలంగాణ పల్లెపల్లెల లేరు,ఎన్ని సంఘటనలు జరిగినయి? మీదగ్గర మావోల్లుంటె ఏమిజరుగునో రాజోలిబండ మూడుసార్లు కూల్చివేసిన  ఘనులకు తెలవదా? ఒకన్యాయమైన డిమాండుకోసం ఉద్యమిస్తున్న ప్రజలను వందలకొద్ది అన్యాయంగ కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న దౌష్ట్యం కనపడలేదా?


మెజారిటీ ఉంటే చాలు, నీతీనియమాలు లేకుండా మాదాష్టీకం చేస్తాం ప్రభుత్వమయినా, బ్లాగులయినా అని నిరూపిస్తూ వీరు ఇలాంటి చెత్తవ్రాతలు రాస్తూనే ఉంటారు, వెంటనే పనికిమాలిన Snkr గాడిలాంటివారు వెటకారాలు చేస్తూనే ఉంటారు. కేవలం మెజారిటీతో అబద్దాన్ని నిజమని నిరూపిస్తారు.Wednesday 15 June 2011

ఒక మేతావి కామెంటుకు స్పందన


అనుకోకుండా ఈరోజు ఒక మేతావిగారి కామెంటు నాకళ్ళబడి కాసేపు మైండు బ్లాంకయింది.తరువాత ఈమేతావి గారి పురుషాహంకారము, కులాహంకారము, ప్రాంతీయ దురహంకారములగురించి ఇదివరకు వినియుండడం వలన కాసేపటికి తేరుకుని ఇక్కడ సమాధానం ఇస్తున్నాను. వారి కామెంటు ఇక్కడ యధాతధంగా:

**********
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (బ్లాగు: ఆనందిని)
  "తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు. 


తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."
**********

నా సమాధానం:

తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు
ఎవరికి మంచిది, నీకా? నీబోడి ఒపీనియన్ ఎవడికి గావాలి?

వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు
మాకేం గావాలో మాకు తెలుసులే, ఇంకా నీదగ్గర నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం బట్టలేదు.

తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం.
ఔరా, ప్రతి పనికిమాలిన వెధవ, మూడున్నర కోట్ల ప్రజల పనిసంస్కృతిని వెక్కిరించేవాడే. తోటి ప్రజలమీద ఇంత తేలికభావం కలిగిఉన్న దురహంకారులు ఇంకా సమిక్యత గురించి మాయమాటలు జెప్పుడెందుకు? చేద్దామంటె పనిదొరక్క మావోల్లు పొట్టచేతిలొ బెట్టుకుని భీవండి, సూరత్ పోతుండ్రు, మీలాగ  తేరగ దింటూ ఇంఖొడి పొట్టగొట్టుడు ఎరుకలేదు మాకు. నీలాంటి సంస్కారం లేని, తోటి ప్రజలను గౌరవించని అహంకారులతో మాకు పనిలేదు, అందుకే మారాష్ట్రం మాకు కావాలంటున్నం.

తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం.
మాకు తెలిసిందే తెలుగుమీడియం గవుర్నమెంటు స్కూల్లు, గండ్ల ఏమి జెప్తె గదే నేర్సుకుంటం, గక్కడ తెలుగే జెప్పుతరని ఇప్పటిదాక అనుకుంటున్నం, నీకేమన్న పారసీ గిట్ల కనబడ్డదా? మీలెక్క కార్పొరేట్ స్కూల్లల్ల ఇంగ్లీసు మీడియం మేం జదువుకోవడం మాకు శాతగాదు, గన్ని పైసలు మాతాన లెవ్వులే.

తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి.
గీ ప్రజాసామికమంటె ఏందో మాకు పెద్దపెద్ద మాటలు రావు గని, మాకు దెలిసింది ఐదేండ్లకోసారి ఎలచ్చెన్లొస్తె నచ్చినోడికి వోటెయడం. మీలెక్క కులానికో పార్టి పెట్టుకోని కులపోడు ఎంత దోస్తున్నా సపోర్ట్ జేసుడు మాకు దెల్వదులే. గట్లనే మానాయకులు మీవోల్ల లెక్కన కడప బాంబులు పేల్చి వాల్లె వోట్లు గుద్దుకోరు, మావోట్లు మేమె ఏస్తం.

ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు.
బయట పడ్దామంటే మీరెక్కడ పడనిస్తున్నరే, పొయిపొయి రోట్లె తలకాయ పెట్టినట్టు మాతలకాయలు మీఆంధ్ర దొరలకి అప్పజెప్పితిమి. గాళ్ళు ముస్లిములకన్న నిరంకుశంగా పరిపాలన జేసి మాకడుపుగొట్టి మాబతుకులు బుగ్గిజేసి మానీల్లు, మాఉద్యోగాలు, మావనరులు మాగ్గకుంట జేస్తుండె. ఇంక బయటపడుడెట్ల జెప్పు? గందుకే మారాష్ట్రం మాగ్గావలని అంటున్నం.

ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే.
మీఎరుకన పెజాస్వామ్యమంటే కులస్వామ్యం, ధనస్వామ్యం, ముఠాస్వామ్యం అయితె గాదానికి మేం వ్యతిరేకమేలే.గది మీదగ్గరే ఉంచుకోన్రి.

ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.
ఎదుటివాల్లంటె ఇక్కడ నువ్వేనా పెద్దన్నా? నీమాటలు మేము గాదు, ఎవ్వలు వినరులే, మీదగ్గర కూడ నీమాటలు ఎవ్వరు వినరు. నీ మతాహంకారము, మగజాతి హక్కుల సిద్దాంతాలు, నీకులగజ్జి, నీతాగుడు లెక్కలు జూసి నీమీద ఉమ్మేయనిది ఎవరు జెప్పు?

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."
గీ మొబిలిటీ ఏందో మాకు తెల్వదు గని మేం పొట్టకూటికోసం ఎంత దూరమన్న వెలతం. రోజు మావోల్లు భీవండి, నౌసారి, సోలాపురం, దుబాయి, సూరత్ పొయ్యి పని జేసుకుంటున్నరు. మానీల్లు మాపక్కోల్లు దోసుకపోతుంటె చేసుకోవడానికి మాదగ్గర పనిలేదు గనక మేం దూరదేశాలు పోతున్నం. అయితె ఒక్కమాట, మేం ఎంత దూరమన్న పనికోసం పోతం గని నీ ఏరియ మాత్రం రాము, నీకులగజ్జికి తలవంచం. కడుపుగాలినా పరువలేదు గాని నీ అహంకారానికి మాత్రం మేం దాసోహం గాబోము, యాది బెట్టుకో.

ఇవ్వాల తెలంగాణల సంటిపిల్లోడు సైతం జైతెలంగాణ అంటుండంటె దానికి కారణం నీలాంటి దురహంకారులే. మీదగ్గర నేర్సుకోవడానికి రికార్డు డాన్సులు దప్ప ఇంకేమి లేవు గని పొయ్యి నువ్వు నీపెద్దపురం కొంప పక్కన శివరాత్రి రోజు గంతులేసుకో పైసలొస్తయి, మాతెలంగాణల మాత్రం ఉండకు. ఇక్కడ మాతోటి కలిసి ఉండేటోల్లను ఎవ్వరినైనా మేం ఆదరిస్తం గానీ నీలాంటి దురహంకారులకు ఇక్కడ స్థానం లేదు.

Tuesday 14 June 2011

విశాలాంధ్రే తెలంగాణ కోరుతుంది


ఇటీవల నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిన మాట "ఇప్పుడు విశాలాంధ్రే తెలంగాణ కోరుతుంది" అని. ఔను, నిజం. విశాలాంధ్ర ఉద్యమం మొదలు పెట్టింది సీపీఐ. సీపీఐ వారి దిన పత్రిక, ప్రచురణాలయం పేర్లు కూడా "విశాలాంధ్ర". ఇప్పుడు ఆ సీపీఐ కూడా తెలంగాణ కోసం ఉద్యమబాట పట్టింది.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలు పెట్టిన సీపీఐ ఆతరువాతి కాలంలో ఆంధ్ర నాయకుల ప్రభావం వలన ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే కమ్యూనిస్టులకు రాష్ట్రంలో బలం వస్తుందని నమ్మి విశాలాంధ్ర ఉద్యమం చేపట్టింది. అసలు ఫజల్ అలి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలవడానికి ఐదు సంవత్సరాలు ఆగి, ఎలక్షన్లతరువాత ప్రజల అనుమతితో కలవాలని చెప్పినప్పటికీ అలా జరగకపోవడానికి కారణం అప్పటి కమ్యూనిస్టులే. 1969లో కూడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా సీపీఐ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది.

కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల అనుభవంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కల్లకు కట్టినట్టుగా కనిపిస్తుంటే సీపీఐ నాయకత్వం చివరికి వాస్తవాన్ని గమనించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. చిదంబరం ప్రకటన తరువాత మిగతా పార్టీలు వెనక్కి తగ్గినా సీపీఐ తమ మాటకు కట్టుబడి ఉండడమే కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటుంది.

కొంతమంది సీపీఐ దగ్గర "విశాలాంధ్ర" పేరును అరువు తెచ్చుకొని ఒక వెబ్‌సైటును పెట్టుకుని లగడపాటి సమైక్యవాదానికి అనుకూలంగా రాతలైతే రాస్తున్నారు కానీ వారెవరూ సీపీఐ యొక్క ఆదర్శాలు మాత్రం పంచుకోలేక తమవి విశాలాంధ్ర భావాలు కావు విష అంధ భావాలని నిరూపించుకున్నారు. తెలుగు భాషమీద నిజంగా ప్రేమ ఉన్న వారు ఒక్క రాష్ట్రంలో ఉన్నా రెండు రాష్ట్రాల్లో ఉన్నా భాష ఉన్నతికి తోడ్పడతారు. తెలుగు మాట్లాడేవారు అనేకులు ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ ఉండి తెలుగు భాషకు తొడ్పాటునిస్తూ పరిపాలనకూ, భాషాభివృద్ధికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు. కానీ ఏనాడూ తెలుగు మాట్లాడే ఇతర రాష్ట్రాల ప్రాంతాలని కలపాలని ఉద్యమాలు చెయ్యనివారు,  తెలుగులో రాయడం కూడా చేతకానివారు ఇప్పుడు తెలుగు వారు తమకోసం ఇంకోరాష్ట్రం కావాలంటే మోకాలడ్డుతున్నారు.

సీపీఐ లాంటి నిజాయితీ గల పార్టీలకు తెలంగాణ ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రేపు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరగబోయే సీపీఐ బహిరంగ సభ విజయవంతం కావాలని ఆశిద్దాం.

సమైక్యవాదుల అంకెల గారడీలు

ఒకబాబా చిన్నచిన్న గారడీలు చేసి దేవుడయిపోయాడు గానీ మన సమైక్యవాదులు అంతకన్న పెద్దపెద్ద గారడీలే చెయ్యగలరు. అసలు గారడీతో లేని ఉద్యమాన్ని ఉన్నట్లు చూపించి కేంద్రప్రభుత్వాన్నే ఏమార్చిన ఘనులు అంకెలతో గారడీలు జెయ్యడం పెద్ద విషయమా? అందుకే ఈమధ్య విశాలాంధ్ర మహానుభావులు అంకెలగారడీలతో తెలంగాణ అభివృద్ధిలో సీమాంధ్ర కంటే ఎంతో ముందు ఉంది అని నిరూపిస్తున్నారు. ఇవే అంకెలు వీరు శ్రీకుట్రకమిటీకి కూడా సప్లై చెయ్యడంతో వారు కూడా తమ రిపోర్టులో అచ్చంగా ఇలాంటి గారడీలే చూపించారు.

జేపీనారాయణ, నలమోతులు కలిస్తే తెలంగాణ ఆంధ్ర కన్న అభివృద్ధి చెందినట్లు చెప్పగలరు, జింబాబ్వే, రువాండాలు నార్వే, స్వీడన్లకన్నా అభివృద్ధి చెందినవని చెప్పగలరు. పైగా అంకెలు అబద్దాలు ఆడవు అని ఘంటాపధంగా చెప్పి మనల్ని ఆత్మరక్షణలో పడవేయగలరు. అంకెలు అబద్దాలు ఆడవు, కానీ అంకెలు చెప్పే విషయాలు వాటిని ఉపయోగించేవాడి తెలివి మీద ఆధారపడతాయి.

గ్రోత్ రేట్లు: గ్రోత్ రేట్ ఇండికేటర్లు ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలియకుండా వాడితే ఇలాగే రువాండా స్వీడన్ కన్నా అభివృద్ధి చెందినదనే అర్ధం వస్తుంది. ప్రతి విషయానికి 1956 నుంచి ఇప్పటికి తెలంగాణలో ఇంత శాతం పెరిగితే, సీమాంధ్రలో ఇంత శాతమే పెరిగింది చూశారా అనేది వీరి వాదన. మీదగ్గర 1956లో ఒక్క ఎకరం ఆయకట్టులో ఉండేది, ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఉన్నై అంటే 1000% అభ్వృద్ధి. మాదగ్గర అప్పుడు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు మూడు లక్షలు, మొత్తం కేవలం 200% వృద్ధి మాత్రమే. చూశారా మీప్రాంతాన్ని మాపాలనలో ఎంత ముందుకు తీసుకెల్లామో అన్నట్లు. గ్రోత్ రేట్లు ఎక్కడ వాడాలో తెలియని తెలివితక్కువ వారు స్టాటిస్టిక్స్ చూపిస్తే ఇలాగే ఉంటుంది.

జీడీపీ రేట్లు: వీరు ఉపయోగించే మరో ఆయుధం జీడీపీ రేట్లు. తెలంగాణలో ఐదు జిల్లాల జిడీపీ రాష్ట్ర ఆవరేజ్ జీడీపీ కన్నా ఎక్కువ పెరిగింది తెలుసా అని. జీడీపీ వ్యవసాయం ద్వారా పెరిగితే అది అక్కడి నేటివ్ ప్రజల వృద్ధిని చూపుతుంది, కానీ తెలంగాణాలో హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లలో ఉన్న జిల్లాలలో ఇండస్ట్రియలైజేషన్ ద్వారా పెరిగిన జీడీపీ అక్కడి పరిశ్రమల ఓనర్లూ, ఉద్యోగుల జేబుల్లోకి వెలుతుంది, సహజంగా వారంతా సీమాంధ్రులే మరి.

పచ్చి అబద్దాలు: అంకెల గారడీలతో పాటుగా వీరు చూపించే మరో విద్య నిజాలను ఎక్జాగరేట్ చెయ్యడం, అబద్దాలను జోడించి చెప్పడం. క్రిష్ణా, గోదావరి నదులకంటే తెలంగాణ ఎత్తులో ఉంది కాబట్టి కాలువల ద్వారా సాగునీటిని ఇవ్వడం సాధ్యం కాదు అనేది వీరు చెప్పే వాదన. వాస్తవానికి క్రిష్ణా నది కూడా ఎక్కువ ఎత్తులోనే ప్రవహిస్తుంది కాబట్టి క్రిష్ణాకు ఆసమస్యేం లేదు, అయినా శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నాగార్జునసాగర్ ఎడమకాలువ అలైన్మెంటులో మార్పు లాంటి వివక్షలు అందరికీ తెలిసినవే. ఇక గోదావరిలో శ్రీరాం సాగర్‌కు ఆసమస్య లేకున్నా ఫండ్స్ అందించక ఆ ప్రాజెక్టును నాన్చి నాన్చి, దశాబ్దాలు కొనసాగించి చివరికి ఆయకట్టును మూడొంతులు తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటి గురించి వీరు రాయరు.

నాగార్జునసార్ ఎడమకాలువ ద్వారా తెలంగాణకు 150 TMCలు వస్తున్నాయట. ఎడమకాలువ ఆంధ్రా ప్రాంతాలకు కూడా నీటిని ఇస్తుందని కన్వీనియెంట్‌గా దాచివేస్తారు. ఇక నీటి విడుదలలో వర్షాపాతం ఎక్కువ ఉన గత ఐదు సంవత్సరాలు మాత్రం చూపిస్తారు. వాస్తవానికి తెలంగాణకు నాగార్జునసాగర్ ద్వారా ఎప్పుడూ 70 TMCలకన్నా ఎక్కువ రావు.


ఇక ఇరిగేషన్ లెక్కల్లో గొట్టపు బావులు కూడా లెక్కేసి మీతెలంగాణలో ఇంత ఆయకట్టు పెరిగింది చూశారా అని చెప్పడం మరో పిచ్చి వాదన. ఎవడన్నా బుద్దున్నవాడు కాలువద్వారా నీల్లొస్తుంటే గొట్టపు బావులేసుకుంటాడా? గొట్టపు బావులద్వారా భూగర్భజలాల లెవలు పడిపోతున్నా తెలంగాణలో గొట్టపుబావులెందుకు తవ్వుతున్నారనే విషయం వీరు రాయరు.

అబద్దపు రాతలకు అసలు కారణం: ఇలాంటి అన్యాయపు, దుర్మార్గపు రాతలెందుకు రాస్తున్నారయా అంటే దానికి కేవలం రాష్ట్ర విభజననాపడం ఒక్కటే కారణం కాదు. అలాగయితే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఒప్పుకుని దానికి రాష్ట్ర విభజన పరిష్కారం కాదు, మరోలా చేసుకోవచ్చు అని వాదించొచ్చు. వీరి అసలు ఉద్దేషం రాష్ట్ర విభజనను ఆపడం మాత్రమే కాకుండా ఈదోపిడీకి చట్టబద్దతను కల్పించాలి, దోపిడీని ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలి అనేదే.

కానీ సమైక్య వాదులారా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు మునుపటిలాగా అమాయకులు కారు, మీరు అబద్దాలు చెప్పి నమ్మబలికితే జనం నమ్మరు. ఎలాగూ రాష్ట్ర విభజన తధ్యం, లేకపోతే తెలంగాణలో ఉనికిని శాస్వతంగా కోల్పోవాల్సి వస్తుందనేది కాంగ్రేస్‌పార్టీకి తెలుసు. కాబట్టి మీమోసపూరిత వాదనలవల్ల ఫలితం లేదు

Thursday 9 June 2011

వ్యవస్థీకృత దోపిడీ ఉండడానికే వీల్లేదట?!


ఈమధ్యన విషాంధ మహాసభకు చెందిన సి.నరసింహారావు అనే ఒక మేధావి(?) అసలు "ఈఆధునిక కాలంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృత దోపిడీ ఉండదు, ఉండడానికి వీల్లేదు" అంటూ గొప్పగా సిద్ధాంతీకరించాడు. అప్పుడప్పుడు టీవీషోల్లో కనబడే ఈమహానుభావుడు ప్రాంతీయ అస్తిత్వవాదానికీ, ప్రాంతీయ విద్వేషానికి తేడా కూడా తెలియదని నిరూపించుకుంటూ ఇంకా చాలా గొప్ప గొప్ప సిద్ధాంతీకరణలు చేశారు. పైగా అందుకు ఉదాహరణలు జెర్మనీ, అమెరికా లాంటి పరిణితి చెందిన సమాజాలూ, వాటితో ఇప్పుడిప్పుడే ఫ్యూడల్ వ్యవస్థనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న విభిన్న జాతులు, భాషలు, కుల, మత, సామాజిక తేడాలున్న మన సమాజంతో పోలిక.

దుప్పులనూ మేకలనూ ఒకే కంచెలో మేతకు వదిలితే మేకలను దుప్పులు తిననివ్వవు, అక్కడ గడ్డి రెంటికీ సరిపోయేంత ఉన్నాసరే. మనరాష్ట్రంలో గత యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అధికారం చేజిక్కించుకుంటారు. అసెంబ్లీలో 70 శాతానికి పైబడి ఈరెండు సమాజిక వర్గాలే ఉంటాయి. వీరికి సమాజంలో మెజారిటీ ఎక్కువా అంటే అదీలేదు, ఇద్దరూ కలిపి 3 శాతానికి మించరు. అంతా ప్రజాస్వామ్యబద్దంగానే జరుగుతుంది, ప్రజలే ఎన్నుకుంటున్నారు, నరసింహారావుగారి థీరీ ప్రకారం అసలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృత దోపిడీ ఉండదు కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు అసలు అధికారం చేపట్టడం, ఎమ్మెల్యేలూ, ఎంపీలు కావడం ఇష్టం లేదా?

బలవంతుడు బలహీనున్ని దోచుకోవడం ప్రకృతి ధర్మం. ఆప్రకృతి ధర్మంపై పోరాడుతూ మనిషి బలహీనున్ని కూడా బలవంతుడితో సమానంగా అవకాశాలు లభించేలా న్యాయాన్ని అమలు చేస్తాడు. ఈన్యాయం అంతటా ఒకే సూత్రం ప్రకారం చెయ్యలేం. వెనుకబడిన ప్రాంతాల అవకాశాలు అభివృద్ధి చెందిన ప్రాంతం వారు చేజిక్కించుకోవడానికి ఆప్రాంతాన్ని విడదీసి పాలిస్తారు, దాని ఫలితమే ఇటీవలి ఉత్తరాంచల్, ఝార్ఖండ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల ఏర్పాటు. అదే అన్ని ప్రాంతాలలోను ఉండే షెడ్యూల్డ్ కులాలూ, గిరిజనులూ, వెనుకబడిన తరగతులూ, స్త్రీలు లాంటి వర్గాలను విడదీసి పాలించడం సాధ్యం కాదు కాబట్టి వారికి రిజర్వేషన్ల లాంటి రాజ్యాంగబద్దమయిన ఏర్పాట్లు చేశారు.

ఈనరసింహ మేధావికంటే తెలివయినవారు యాభై, అరవై సంవత్సరాలక్రితమే రాబోయే కాలంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన వర్గాలు మిగతా వర్గాలను మార్జినలైజ్ చేసే పరిస్థితిని ఊహించి రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటులు కల్పించారు. మొదటి ఎస్సార్సీ ఏర్పాటు చేసిన సమయంలోనే అంబేద్కర్ ఈపరిస్థ్తిని ఊహించి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఏప్రాంతం వారి అవకాశాలు ఆప్రాంతం వారే అనుభవించొచ్చని చెప్పాడు. దానికి ఎంత చిన్న రాష్ట్రం అయితే సరయినది అనే ప్రశ్నకు ఒక భాష మాట్లాడే ప్రజల్లో ఎన్ని విభిన్న సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక ఎదుగుదల కలిగిన ప్రాంతాలుంటే అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలని సూత్రీకరించారు. రెండు విభిన్నస్థాయిలు, విభిన్న చరిత్ర కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలవడానికి ముందు వచ్చిన వ్యతిరేకతను మేనేజ్ చెయ్యడానికి పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏర్పాతు చేసిన రాజకీయ వెసులుబాటులు కూడా ఇలా అసమానతలను మేనేజ్ చేసి ఒకరి అవకాశాలను మరొకరు దోచుకోకుండా చేసిన ప్రయత్నమే.

వ్యవస్థీకృత దోపిడీ అసలు సాధ్యమే కాదని చెప్పే మేతావులు, వారి సూత్రాలకు ఆహా, ఓహో అంటూ చప్పట్లుకొట్టే జనాలకు తమదాకా వస్తే మాత్రం రూల్సు మారుతాయి. ఇదే ఆంధ్రప్రాంతం వారు మద్రాసు నుండి వేరుపడడానికి చెప్పిన కారణం తమిలులు మాఅవకాశాలు  దోచుకుంటున్నారు, మమ్మల్ని ఎదగనీయడం లేదు అని.

ఒక పిల్లిని గదిలో భందించి కొడితే అది తిరగబడుతుంది. దీనికి అసలు కారణాన్ని అన్వేషించకుండా పిల్లి తిరగబడింది, పిల్లి విద్వేషాన్ని వెల్లగక్కుతుంది అంటూ అరిచేవారు నిజాలను దాస్తున్నట్లే. అస్తిత్వ వాదాలు అణచివేత, పక్షపాతధోరణులనుంచి పుట్టుకొస్తాయి. సమాజంలో కొన్ని సామాజిక వర్గాలు పెత్తనం చేస్తూ మిగతావారిని అణచివేస్తే కుల అస్తిత్వ వాదాలు పుడుతాయి. అలాగే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వారు పెత్తనం చేస్తూ మరొక ప్రాంతం వారిని అణచివేసి పరిపాలనలో ఒకప్రాంతంవారిపై పక్షపాతవైఖరి కనబరిస్తే ప్రాంతీయ అస్తిత్వవాదాలు పుడతాయి. అస్తిత్వవాదం విద్వేషం కాబోదు, విద్వేషం వలన అస్తిత్వవాదాలు పుడతాయని నరసింహారవుగారు గమనిస్తే మంచిది.

కుల, మత, భాషా,ప్రాంతీయ విభేధాలు తొలగిపోయి అందరూ ఒకే కుటుంబంలాగా జీవించాలనేది నాతో సహా ఆదర్శభావాలు కలిగినవారందరూ ఒప్పుకునే విషయం. కానీ ఆభేధాలు సమాజంలో ఉన్నప్పుడు అవేవీ లేవు అని నటిస్తూ కూర్చుంటే లాభం లేదు, ముందర ఆభేదాలవలన ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టాన్ని అమలు చెయ్యాలి, ఆతరువాత భేదాలు తొలగించడానికి సామాజిక ప్రయత్నం చెయ్యాలి.


విగ్రహాలు చెప్పే ఊసులు -1


ఇటీవలే శ్రీక్రిష్ణదేవరాయల గౌరవార్ధం భారత ప్రభుత్వం ఒక పోస్ట్లల్ స్టాంపును విడుదల చేసింది. క్రింద ఆపోస్టల్ స్టాంపును చూడవచ్చు.


ఈస్టాంపులో ఉన్న క్రిష్ణదేవరాయలు మనకు తెలిసిన, మనమదిలో ఉండే క్రిష్ణదేవరాయలలాగా లేదు. అందుకు భిన్నంగా మన తెలుగు సినిమాల్లో చూపించిన విధంగా ఉంటుంది. మన రామారావుగారి క్రిష్ణదేవరాయల వేషం ఇలా ఉంది.

మన ట్యాంక్‌బండ్‌పై ఇటీవలి వరకూ కొలువున్న క్రిష్ణదేవరాయల  విగ్రహం ఈవిధంగా ఉండేది.

ఏమిటి, భారత ప్రభుత్వానికి క్రిష్ణదేవరాయలు ఎలా ఉంటాడో తెలియదా, వారి పోస్టల్ స్టాంపు అలా ఉంది అంటారా? అసలు క్రిష్ణ దేవరాయలు అలాగే ఉండేవాడు. తిరుపతిలో క్రిష్ణదేవరాయలు స్వయంగా నెలకొల్పిన రాయల విగ్రహం ఇదీ మరి.


మనవారు తెలుగు వెలుగులను నెలకొల్పడంలో ఎంచుకున్న ప్రమాణాలు ఈక్రిష్ణదేవరాయ పొరపాటు, రామారావు విగ్రహం ద్వారా గ్రహించవచ్చు. ఇదేదో విగ్రహాల కూల్చివేతకు సమర్ధన కాదు గానీ, ఒక నిజాన్ని ఎత్తిచూపడంలో తప్పులేదుమరి.

(మిషన్ తెలంగాణ సౌజన్యంతో).

Monday 6 June 2011

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నాడు-నేడు

మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉన్నప్పుడు ఆంధ్ర మద్రాసులోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాన వేరు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాల్లో పోలికలు, తేడాలు:

ఉద్యమానికి కారణాలు:

నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలు కావడానికి ప్రధాన కారణం రాజాజీ క్రిష్ణా జలాలో కొంతభాగం పెన్నా, సీమ మీదుగా మద్రాసు నగరానికి తరలించాలని చేసిన ప్రయత్నం కాగా నేడు తెలంగాణ వాదులు చెప్పే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం ఇరిగేషన్లో తమకు ఇప్పటికే జరిగిన అన్యాయం. అంటే ఆంధ్ర ఉద్యమానికి కారణం తమకు భవిష్యత్తులొ జరగబోతుందనే అన్యాయం అయిటే తెలంగాణకు కారణం ఇప్పటికే అనుభవంలో ఉన్నది.

చివరికి క్రిష్ణా-పెన్నా ప్రాజెక్టు రాకపోయినా మద్రాసుకు క్రిష్ణా నీల్లు అందాయి అయితే ఈసారి అది తెలంగాణా వాటానుంచి. క్రిష్ణాను తమిల ప్రాంతాలకు తరలించడం అప్పుడు తప్పనిపించినట్లే ఇప్పుడు గోదావరి జలాలను పోలవరం ద్వారా క్రిష్ణా డెల్టాకు తరలించడం తప్పని తెలంగాణ వాదులు చెబుతున్నారు. ఇప్పటికే క్రిష్ణాజలాల్లో తెలంగాణ ప్రాజెక్టులను నొక్కేసి అడిగితే క్రిష్ణాలో నీల్లు చాలట్లేదని చెబుతూ గోదావరిని క్రిష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నం జరుగుతుంది.

తెలంగాణ ఉద్యమంలో ఇరిగేషన్‌తో పాటు నియామకాలూ, నిధులూ ఇతర ముఖ్య కారణాలు. ఇవి రెండూ కూడా ఏదో భవిష్యత్తులో జరగబోయే అన్యాయం కాదు, ఇప్పటికే దశాబ్దాలుగా జరుగుతున్నది.

ఆత్మగౌరవం, స్వయం పాలన:

అప్పుడు క్రిష్ణా-పెన్నాతో మొదలయిన ఉద్యమం చివరికి తెలుగువాడి ఆత్మగౌరవం, స్వయంపాలన అనే నినాదాలుగా పరిణామం చెందాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిధులు, నీల్లు, నియామకాలతో మొదలయి ఇప్పుడు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి నినాదాలు రూపుదిద్దుకున్నాయి. ఈ అస్తిత్వ వాదానికి అప్పుడు భాష మూలం అయితే ఇప్పుడు ప్రాంతం.


అప్పటి ఇప్పటి రాష్ట్రాలకు మూలం:

అప్పటి మద్రాస్ స్టేట్ బ్రిటిషువాడు తన పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రెసిడెన్సీ నుండి పుట్టుకొస్తే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు శరతులతో కూడిన ఒప్పందాలతో కలవడం మూలాన జరిగింది. ఆ ఒప్పందాల ఉల్లంఘణ ఇప్పటి విభజనవాదానికి దారితీసింది.


కమిటీల ఏర్పాటు:

అప్పుడు జేవీపీ కమిటీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు మాయదారి శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటు జరిగింది. జేవీపీ కమిటీ సమస్యకు పరిష్కారం సూచిస్తే శ్రీక్రిష్ణ కమిటీ ఉద్యమాన్ని అనైతికంగా అణచివెయ్యడానికి సూచనలు చేసింది.


పీటముడులు:

అప్పుడు మద్రాసు నగరంపై పీటముడి ఏర్పడితే ఇప్పుడు హైదరాబాద్ పీటముడిగా తయారయింది. అప్పుడు మద్రాసు చివరికీ భౌగోళికంగా ఏప్రాంతంలో ఉందో వారికి దక్కింది. ఇప్పుడూ న్యాయంగా చివరికి హైదరాబాద్ భగోళికంగా ఎక్కడ ఉందో వారికే దక్కుద్దేమో అనే భయంతో సమైక్యవాదులు హైదరాబాద్ ఊసెత్తట్లేదు.

ప్రతి ఉద్యమాలు:

అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ప్రతిగా సమైక్య మద్రాసు ఉద్యమం లాంటిదేమీ జరగలేదు, ఇప్పటిలాగా. ఇప్పుడు మాత్రం తమ స్వలాభంకోసం అవతలివారు తమతో కలిసి ఉండాలనే వెరైటీ ఉద్యమం చరిత్రలో తొలిసారి మొదలయింది.


రాజకీయ నిరుద్యోగులు:

తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నిరుద్యోగులు తెరపైకి తీసుకొచ్చారని సమైక్యవాదులు గోలపెడతారు. అప్పట్లో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో ముఖ్యనేతలు ప్రకాశం, నీలం, బెజవాడ కూడా రాజకీయ నిరుద్యోగులే, ప్రకాశానికి ముఖ్యమంత్రి ఉద్యోగం దక్కలేదు, నీలం, బెజవాడలకు ఎమ్మెల్యే ఉద్యోగం దక్కలేదు, తరువాత అంతా ముఖ్యమంత్రులయిపొయ్యారు.

విలువలులేని విషాంధుల నిజస్వరూపం

ఈమధ్య తెలుగులో ఒక కొత్త బ్లాగు విశాలాంధ్ర మహాసభ పేరుతో మొదలయింది. వీరికి ఒక సొంత వెబ్‌సైటూ, ఒక ఫేస్బుక్ గ్రూపూ ఉన్నాయి. ఈబ్లాగు వెనుక సీమాంధ్రవాద ధురంధరులు నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్ లాంటివారు ఉన్నారు.

వీరు బ్లాగును రెండునెలలక్రితం ఆశావహంగా మొదలుపెట్టారు. వీరు తెలంగాణకు వ్యతిరేకమయినా, తెలంగాణవాదులు ఎందరో వీరి ఇనీషియేటివ్‌కు సంతోషించారు. కారణం తెలంగాణవాదులకు కావలిసింది సహృద్భావ చర్చ. చర్చ జరిగితే వారికి తమ వాదననూ, తెలంగాణ ఆవశ్యకతనూ తెలిపే అవకాశం లభిస్తుంది. అంతా ఈబ్లాగువారు కనీసం తెలంగాణ ఉద్యమంలో ఉన్న తప్పొప్పులను నిశ్పక్షపాతంగా బయట పెడతారనీ, సమైక్యాంధ్ర ఆవశ్యకతను తార్కికంగా వివరిస్తారనీ భావించారు.

వీరూ మొదట్లో కాస్త ఉత్సాహంతో ఇరిగేషన్ లాంటి విషయాలు చర్చించారు. గోదావరి నీటిని ఎందుకు ట్యాప్ చెయ్యలేకపోతున్నామో, గోదావరి నీటిని క్రిష్ణాకు తరలిస్తే రాష్ట్రానికి (సీమాంధ్రకు) ఎలా లాభమో వాదించారు. ఆతరువాత బ్లాగుల్లో ఈవాదనలోని అబద్దాలు, ఇరిగేషన్లో వాస్తవాలు బయటపెట్టారు.

తరువాత్తరువాత వీరికి రాయడానికి విషయం లేకపోయింది. సమైక్యవాదమంటే కేవలం తెరాసను విమర్శించడమే అనే భ్రమలో బతుకుతూ తెరాసపై కొన్ని కధనాలు రాశారు. ఆతరువాత తమకు సొంతంగా రాయడం చేతకాక ఏతెలుగు బ్లాగులో తెలంగాణ  వ్యతిరేక టపా ఉన్నా తెచ్చి తమ బ్లాగులో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం చదువరి బ్లాగు నుంచి ఎత్తుకురావడం పూర్తయింది.

ఆతరువాత వారికి రాయడం చేతకాక ఎప్పుడో ABN రాధాక్రిష్ణ ఈటెల రాజేందర్ పేరుతో తయారు చేసిన ఒక దొంగ ఉత్తరాన్ని కనీసం అందులో నిజానిజాలు ఏమాత్రం తెలుసుకోకుండా తెచ్చి బ్లాగులో పబ్లిష్ చేసి తమ సిగ్గులేనితనాన్ని చాటుకున్నారు. వీరికి తోడుగా ఎక్కడ తెలంగాణ ఉద్యమాన్ని తక్కువచేసి చూపే విషయం కనబడుతుందా అని ఆశగా ఎదురుచూసే కొంతబంది అత్యుత్సాహం కలిగిన బ్లాగరులు వెంటనే వెల్లి అక్కడ తెరాసను తిడుతూ వాఖ్యలు చేశారు. మరి ఇలా వాఖ్యలు చేసిన పెద్దమనుషుల్లో ఎవరయినా శ్రీక్రిష్ణ కమీషన్ మీడియాను మేనేజ్ చెయ్యమంటూ చేసిన అనైతిక సూచనలను ఖండించారా అంటే లేదు. ఒకేరకం సంఘటన తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉంటే ఒకలాగ వ్యతిరేకంగా ఉంటే మరోలాగ స్పందించే ఈపక్షపాత జీవులకూ, తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న విషాంధ జీవులకు మరి తెలంగాణతో కలిసి ఉండడం ఎందుకూ అంటారా, మరి అది వారి సొంత లాభం కోసం.

ఉద్యమంలో మీడియా మేనేజ్మెంట్ - ABN దొంగ లెటరు

తెలంగాణ విషయం తేల్చమని ప్రజాధనం వెచ్చించి కేంద్రప్రభుత్వం ఒక కమిటీ వేస్తే అది తెలంగాణ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించడం మానేసి ఏవిధమైన అనైతిక, మోసపూరిత చర్యలు చేపడితే తెలంగాణ ఉద్యమాన్ని అణచివెయ్యొచ్చో ఒక రహస్య నివేదిక రూపొందించింది.

ఈరహస్యనివేదిక అనైతిక సూచనలలో ముఖ్యమయినవి తెలంగాణ ఉద్యమ నేతలకు పదవుల ఆశ చూపించి వారిని లొంగదీసుకోవాలి, రాష్ట్ర మీడియాను అడ్వర్టైజ్మెంట్లతో, ఇతర మార్గాలతో లొంగదీసుకోవాలి అని. అదే రిపోర్టులో తెలుగు మీడియాలో ఒక్క రెండు చానెల్లు తప్ప మిగతా టీవీ చానెల్సూ, దినపత్రికలూ ఇప్పటికే సీమాంధ్రకు కొమ్ముగాస్తున్నాయనే రహస్యాన్ని కూడా బహిర్గతం చేసింది.

ఇలాంటి అనైతిక నివేదిక తయారుచేసినందుకు ప్రస్తుతం ఆకమిటీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుంది. ఈవిధంగా మీడియాను అడ్వర్టైజ్మెంట్ల ఆశ చూపి లొంగదీసుకోవాలని రాయడం మీడియా అసోసియేషన్లు నిర్ద్వందంగా ఖండించాయి. ఈపరిస్థితిని గమనించిన సీమాంధ్ర నేతలకూ, శ్రీక్రిష్ణ కమిటీని అప్పటిదాకా ఆకాశానికి ఎత్తిన సీమాంధ్ర వాదులకూ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.మీడియా మేనేజ్‌మెంట్‌పై పోయిన పరువు మల్లీ తెచ్చుకోవడం కోసం తెలంగాణ వాదులకు కూడా ఇదే మచ్చను అంతగట్టడం కోసం చూస్తున్నాయి.

సీమాంధ్ర మీడియాలో భాగమయిన ABN చీఫ్ రాధాక్రిష్ణ టీఆర్పీలో అట్తడుగున ఉంటూ తమ చానెల్ స్థాయిని పెంచుకోవడం చేతకాక ఇతర చానెల్స్ పై బురద చల్లడం మొదలు పెట్టాడు. ఇతకుముందు ఆంధ్రజ్యోతిలోనే పని చేసిన రామచంద్రమూర్తి తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవడం కూడా ఇతను సహించలేకపోతున్నాడు. రాధాక్రిష్ణ తెదేపా లీడరు కోడెల శివప్రసాదరావుతో కలిసి ఈ పన్నాగం పన్ని లెటరు తయారు చేశాడు. లెటరు సారాంశం తెరాస HMTV వారి దశ-దిశ కార్యక్రమాన్ని మేనేజ్ చేసిందని. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడినట్లు ఈసంఘటన తరువాత ABN ఆశించినట్లు మీడియా వర్గాల్లో ఎవరూ ఈలెటరును సీరియస్గా తీసుకుపోగా రాధాక్రిష్ణ పరువే పోయింది.

ప్రస్తుతం తెలుగు మీడియా అంతా ఒక్కొక్కరు ఒక్కో నాయకుడికీ, పార్టీకి కొమ్ముగాస్తూ ఉంటే మీడియా విలువలు చక్కగా పాటిస్తున్న ఏకైక చానెల్ HMTV. తెలంగాణ అంశంపై ఒక వేదికపై ఇంతవరకూ దశ-దిశ కాకుండా మరెక్కడా అర్ధవంతమయిన చర్చ జరుగలేదనేది సత్యం, అసెంబ్లీతో సహా.

తెలుగు మీడియాలో ఒక్కొక్కటి ఒక్కో పార్టీకి ప్రాతింధ్యం వహిస్తున్నా అన్ని పార్టీలూ సీమాంధ్ర అధినేతల చెప్పుచేతల్లో నడుస్తున్నట్లు అన్ని మీడియా సంస్థలనూ సీమాంధ్ర వ్యాపారులే నడిపిస్తున్నారు. డిసెంబరు 9 తరువాత వీరంతా సీమాంధ్రకు కొమ్ముగాస్తూ తెలంగాణ వ్యతిరేక కధనాలు వండుతున్నారనేది అందరికీ తెలిసిందే. వీరు టీఆర్పీ పెంచుకోవడానికి నలుగురు నాయకులను పిలిచి ఒకరినొకరు తిట్టుకునే టాక్‌షోలు రోజూ పెడతాయి, మధ్యమధ్యలో వార్తలకు వారి వ్యూస్ జోడించి ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్న చేస్తాయి తప్ప ఎప్పుడూ అర్ధవంతమయిన చర్చలు పెట్టవు. ఎందుకంటే నిజమయిన చర్చలో నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాలు బయటికి వస్తాయి, అది వారికి ఇష్టం ఉండదు.

ఇలాంటి పరిస్థితిలో అన్ని ప్రాంతాలు తిరిగి అందరు మేధావులకు, విద్యావంతులకూ, వివిధ సంఘాల నేతలకూ అవకాశం ఇచ్చింది HMTV దశ-దిశ మాత్రమే. ఇది సీమాంధ్ర మీడియాకు కంటకింపుగా తయారయింది, కారణం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన  నిజాలు బయటికి రావడంతో పాటు HMTVకి క్రెడిట్ రావడం.

ఇప్పుడు HMTV దశ-దిశపై బురద జల్లడంలో భాగమే ఈ తెరాస లెటరు. అసలు నిజంగా మీడియాతో కుమ్ముక్కు అయితే ఎవరయినా సొంత సంతకంతో లెటర్లు రాసుకుని డాక్యుమెంటరీ ఎవిడెన్సులు తయారుచేస్తారా? కొసమెరుపేమిటంటే ఇంతవరకూ శ్రీక్రిష్ణ కమీషన్ మీడియా మేనేజ్మెంటు సూచనలను ఎన్నడూ ఖండించనివారూ, పైగా సమర్ధించినవారూ ఇప్పుడూ ఈలెటరు నిజమయినదా కాదా అని కనీసం వెరిఫై చేసుకోకుండా తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మేస్తున్నారు. ఇలాంటి పక్షపాత జీవులు ఎప్పటికైనా ఎదుటివారి దృక్పధాన్ని అర్ధం చేసుకుంటారనేది కళ్ళ. వీరి వాదనలు చూస్తుంటేనే తెలంగాణ ఎందుకు అవసరమో తెలిసిపోతుంది.

ఇట్లాంటి లెటర్ తనకేదీ అందలేదని, ఇది కేవలం దుష్ప్రచారమని శ్రీరామచంద్రమూర్తి గారు. ఇప్పటికే ఖండించినారు. కొత్తగా విశాలాంధ్ర మహాసభ అనే వెబ్ సైటూ, బ్లాగూ పెట్టుకున్నవారు కొత్తబిచ్చగాడికి పొద్దెరగదన్నట్లూ రోజూ ఏదో చత్త తెచ్చి రాస్తున్నారు. వీరిది ఎంత దిగజారుడు కార్యక్రమం అంటే బ్లాగు పెట్టుకుని రెండు నెలలయినా ఇంతవరకూ వారు ఒక్క విషయంలో కూడా తెలంగాణ ఉద్యమంలో తప్పు ఎత్తిచూపడం గానీ, సమిక్యంగా ఎందుకు ఉండాలో చెప్పడం గాని చెయ్యలేకపోగా తమకు సొంతంగా రాయడం చేతకాక బ్లాగుల్లో ఎక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాసినా తెచ్చి తమ బ్లాగులో పెట్టుకుంటారు. ఇలా తమ బ్లాగు టీఆర్పీ పెంచుకునే ప్రయత్నంలో మరో పొరపాటే ఏమాత్రం అవగాహన లేకుండా నిజానిజాలు తెలియకుండా ఒక లెటరు కనపడగానే తెచ్చి ప్రచురించడం. ఇలా వీరు తమ సిగ్గులేనితన్నాన్ని చూపించుంటూ సమైక్యంగా ఉండడం అంటే అర్ధం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే అనే కొత్తనీతిని మొదలుపెట్టారు. VMS, shame on you!!

Sunday 5 June 2011

ప్రాపగాండా - చిదంబరం ప్రకటనతో సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది?!

సీమాంధ్ర వాదులు, సీమాంధ్ర రాజకీయనాయకులు తమ నాయకుల యూ-టర్న్ ను సమర్ధించుకోవడం కోసం ఎప్పుడూ చేసే వాదన ఏమిటంటే డిసెంబరు 9 చిదంబరం ప్రకటన ముందు వరకూ విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు మానాయకులకు తెలియదు అందుకే వివిధ రాజకీయ నాయకులు, పార్టీలు తెలంగాణ ఏర్పాటును అంతకు ముందు సమర్ధించాయి, తమ మానిఫెస్టోల్లో పెట్టుకున్నాయి, తెలంగాణ ప్రజలకు ఆవిధంగా వాగ్దానాలు చేశారు, ప్రణబ్ కమిటీకి లేఖలు ఇచ్చారు, డిసెంబరు 9 పొద్దున కూడా ధమ్ముంటే బిల్లు పెట్టండి మేం సమర్ధిస్తం అన్నారు, అయితే డిసెంబరు 9 ప్రకటన తరువాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మానాయకులు మాట మార్చారు అని.

ఇందులో ఎంత అబద్ధం ఉందో అలా చెప్పేవారికి కూడా తెలుసు. చిదంబరం ప్రకటన చేసింది డిసెంబరు 9 అర్ధరాత్రి. ఆపాటికి ప్రజల్లో ఎక్కువమంది నిద్రలోకి జారుకున్నారు. లగడపాటి రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం దీక్ష ప్రారంభించింది ఒక అరగంట వ్యవధిలో. ఇంకొన్ని గంటల వ్యవధిలో మిగతా సీమాంధ్ర ఎమ్మెల్యేలూ, ఎంపీలూ రాజీనామ చేసి తమ దీక్షలూ, లూటీలు, బందులూ మొదలు పెట్టారు. ఆకొన్ని గంటల్లో ఈనాయకులకు ప్రజల రెస్పాన్స్ చూసి తమ మాట వెనక్కి తీసుకునే అవకాశమే లేదు.

అంటే ప్రజల ప్రతిస్పందన ఏమిటో ఇంకా తెలియక ముందే ఉద్యమం మొదలయిపొయ్యింది. ఒక్కసారి ఉద్యమం మొదలు పెట్టగానే పయ్యవుల కేశవ్ లాంటి నాయకులు తమ అనుచర గణంతో విధ్వంసం కూడా మొదలు పెట్టారు. మరి వీరు చెప్పినట్లు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాట మార్చినవారయితే అసలు ప్రజలు నిద్రిస్తుండగానే రాజీనామాలు చేసి విధ్వంసం ఎందుకు మొదలు పెట్టారు?

వాస్తవం ఏమిటంటే డిసెంబరు 9 వరకూ సీమాంధ్ర నాయకులెవరూ కేంద్రం తెలంగాణకు అనుకూలనిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు కాబట్టి అన్ని పార్టీలు, అందరు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను అంభ్యపెట్టడానికి, ఇతర పార్టీలపై పైచేయి సాధించడానికి, ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు నటించారు. అయితే ఒక్కసారి చిదంబరం ప్రకటన వెలువడగానే వీరికి దిమ్మదిరిగింది. హైదరాబాదులో ఉన్న తమ కబ్జాభూములపై భయం పుట్టుకొచ్చింది. కొందరికి తమ రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కొన్ని పార్టీలకు తమ ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టి లాభపడొచ్చనిపించింది. వీటన్నిటి ఫలితమే సమైక్యాంధ్ర ఉద్యమ నాటకం తప్ప విభజనపై అక్కడి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కాదు.

భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఏం చెప్పాడు?

అంబేద్కర్ భాషాప్రయుక్త రాష్ట్రాలగురించి ఏం చెప్పాడు? ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలన్నాడా లేక ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలన్నాడా?భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఏం చెప్పాడు?


అంబేద్కర్ భాషాప్రయుక్త రాష్ట్రాలగురించి ఏం చెప్పాడు? ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలన్నాడా లేక ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలన్నాడా?


అంబేద్కర్ రాష్ట్రాల విభజన కమిటీకి ఇచ్చిన రిపోర్టు ఇక్కడ చూడొచ్చు. అందులో ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రధాన భాషలుంటే వచ్చే ప్రమాదాలతో పాటు కేవలం భాషపేరుతో అసమాన అభివృద్ధి సాధించిన, భిన్న సంస్కృతులు కలిగిన ప్రాంతాలను కట్టిపడేస్తే జరిగే నష్టాలు కూడా వివరంగా రాశాడు.
http://ambedkar.org/ambcd/05C.%20Thoughts%20on%20Linguistic%20States%20PART%20III.htm


భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ సూచనలు ఇవి:
CHAPTER VIII
SUMMARY OF PRICIPLES COVERING THE ISSUE
For the sake of the reader I summarise below the principles which should underly the creation of Linguistic States which are already enunciated In
the foregoing pages but which lie about scattered. These principles may be staled as below :
(1) The idea of having a mixed State must be completely abandoned.
(2) Every State must be an unilingual State. One State, one language.
(3) The formula one State, one language must not be confused with the formula of one language, one State.
(4) The formula one language, one State means that all people speaking one language should be brought under one Government irrespective of area, population and dissimilarity of conditions among the people speaking the language. This is the idea that underlies the agitation for a united Maharashtra with Bombay. This is an absurd formula and has no precedent for it. It must be abandoned. A people speaking one language may be cut up into many States as is done in other parts of the world.
(5) Into how many States a people speaking one language should be cut up, should depend upon (1) the requirements of efficient administration, (2) the needs of the different areas, (3) the sentiments of the different areas, and (4) the proportion between the majority and minority.
(6) As the area of the State increases the proportion of the minority to the majority decreases and the position of the minority becomes precarious and the opportunities for the majority to practise tyranny over the minority become greater. The States must therefore be small.
(7) The minorities must be given protection to prevent the tyranny of the majority. To do this the Constitution must be amended and provisions must be made for a system on plural member constituencies (two or three) with cumulative voting. 


Saturday 4 June 2011

తెలంగాణ FAQ-3: మీనాయకులేం చేస్తున్నారు?

తెలంగాణవాద విమర్శకులు తరుచుగా ఉపయోగించే మరో వాదన "మీ తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా? వాల్లిన్ని రోజులూ ఏం చేస్తున్నారు? మీప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారుగా, వాల్లెందుకు మీప్రాన్ని అభివృద్ధి చెయ్యలేదు?" అని.

ఎమ్మెల్యేలూ, ఎంపీలు, మత్రులు, సర్పంచ్‌లూ ఉంటే అది స్వపరిపాలన అయిపోదు. మత్రులయినా, ఎమ్మెల్యేలయినా రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆఙ్నలకు అనుగునంగానే పనిచేస్తారు, అధినేతను కాదని తమ ప్రాంతానికి ఫండ్సు తీసుకురాలేరు. ఆ అధినేత అయిన ముఖ్యమంత్రి ఎప్పుడూ సీమాంధ్ర నుంచే ఉంటాడు కాబట్టి మంత్రులనూ, ఎమ్మెల్యేలను అందరినీ తనకు కావలసినవారు, తన చెప్పుచేతలలో ఉండేవారినే నియమిస్తాడు.

ఉదాహరణకు నీటిపారుదల శాఖకు గత ఆరు సంవత్సరాలు తెలంగాణ నుంచే మత్రి ఉన్నాడు, అయినా తెలంగాణలో ఇరిగేషన్‌కోసం ఏమీ చెయ్యలేకపొయ్యాడు, తెలంగాణ కోటాకు కూడా తెలంగాణలో ప్రాజెక్టులు అప్రూవ్ కాలేదు, అప్రూవ్ అయినవాటికి ఫండ్స్ రాలేదు. ఎందుకు అంటే మంత్రి తెలంగాణ వాడయినా, ప్రాజెక్టులను నిర్నయించేది ముఖ్యమంత్రేనని తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలకూ, సర్పంచ్‌లకూ, ఎంపీలకు ఎంత అధికారం ఉంటుందో తెలిసిందే.

అసలు ఆమాటకొస్తే బ్రిటిష్ వారి కాలంలో కూడా చానాకాలం మనదేశం వారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అయినా మనం దాన్ని స్వపరిపాలన అనుకోలేదు, కారణం పరిపాలన మనచేతిలో లేనంతకాలం నాయకులు పెద్దగా చేసేదేం ఉండదు కాబట్టి.

రాష్ట్రంలో ఒక్క తెరాసకు తప్ప అన్ని ప్రధాన పార్టీలకు అధినేతలు సీమాంధ్రలోనే ఉంటారు. ఎవరికి అధికారం వచ్చినా సీమాంధ్ర వారే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణకు కొన్నిపదవులు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వారిచెప్పు చేతల్లో ఉండేవారికి కొన్నిపదవులు వస్తాయి. పీ. జనార్ధన్ రెడ్డి లాంటి స్వతంత్ర భావాలు కలిగి స్వతంత్రంగా పనిచేసే నేతలకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం.

ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా పొరపాటున ఎప్పుడయినా అయితే సీమాంధ్ర నాయకులంతా ఒక్కటై ఏదో విధంగా కుట్ర జేసి దించేస్తారు. దీనికి చెన్నారెడ్డి, పీవీలను దించివెయ్యడమే పెద్ద ఉదాహరణ. కాబట్టి భవిష్యత్లో కూడా తెలంగాణ నుంచొ ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఓనాలుగేల్లు పదవిని కాపాడుకోవడమనేది కల్ల.

Friday 3 June 2011

తెలంగాణ FAQ-2: వెనుకబాటుతనం అన్ని చోట్లా ఉంది?


తెలంగాణవాద వ్యతిరేకులు తరుచుగా ఉపయోగించే వాదన "వెనుకబాటుతనం ఒక్క తెలంగాణలోనే కాదు అన్ని చోట్లా ఉంది, మా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడలేదా?" అని. వీరు చెప్పేదాంట్లో నిజం లేకపోలేదు, రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వర్షాభావం వల్ల కరువుతో బాగా వెనుకబడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం కూడా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు.

అయితే ఇక్కడ తెలంగాణ ఏర్పాటును కోరేవారు చెప్పేది కేవలం తెలంగాణ వెనుకబాటుతనం కాదు, తమ వనరులను తమకు కాకుండా జేసి వివక్షతో సమైక్యాంధ్రలోని ప్రభుత్వాలు వెనక్కి నెట్టేయడం వలన తెలంగాణ వెనుకబడింది అనేది ఇక్కడ విషయం. కాబట్టి అనంతపూర్, చిత్తూరు వెనుకబాటు తనానికీ తెలంగాణ వెనుకబాటు తనానికి తేడా ఉందనేది ఇక్కడ ముఖ్య విషయం. ఈ విషయంలో ఉత్తరాంధ్ర కూడా వివక్షకు గురయిందని అక్కడి ప్రజలు, నాయకులు చెబుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన అనేక నాయకులు, ప్రజలు తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రకు ఒక రాష్ట్రంగా మనగలిగేంత స్థాయి లేదు కనుక వారు ఒక ప్రత్యేక ప్యాకేజీని కోరుతున్నారు. ఒకవేళ రాయలసీమ వారు తాము కూడా వివక్షకు గురయ్యామని భావిస్తే వారూ రాష్ట్రం అడుగుతారు, కానీ అది వాస్తవం కాదు గనుక, సమైక్య రాష్ట్రంలో వారు లబ్ది పొందుతున్నారు కనుక వారు స్వరాష్ట్రం అడగడం లేదనేది బహిరంగ రహస్యం.

ఏవిధమయిన వివక్షకు గురయిందనేదానికి ముఖ్యమయినది సాగునీటిలో జరిగిన వివక్ష. గోదావరిపై గ్రావిటీ బూచి చూపించి ప్రాజెక్టులు అస్సలు కట్టకపోవడం, గ్రావిటీ సమస్య లేని శ్రీరాం సాగర్‌కు నిధులు అందించక నిర్లక్ష్యానికి గురిచెయ్యడం కాగా క్రిష్ణా నదిని పూర్తిగా తెలంగాణకు కాకుండా జేసి మొత్తం క్రిష్ణా జలాలను సీమాంధ్రకు తరలించి ఏదో కొద్దినామ మాత్రం నీటిని తెలంగాణ మొహం కొట్టడం ప్రధానమయినది. ఒక్కసారి శ్రీశైలం ఎడమ, కుడి కాలువలకు విడుదల అయిన నిధులను చూస్తే తెలుస్తుంది ఈ వివక్ష. వ్యవసాయ ప్రధాన దేశంలో సాగునీరులేక రైతులు నడ్డి విరిగిపోగా కూలీలు పనులు దొరక్క దూరప్రాంతాలకు వలసలు వెలుతున్నారు.

వ్యవసాయం ఎలాగూ సాగదు, ఇక మిగిలిన ఉద్యోగాల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది, దీనిపై ఎన్నో కమిటీలూ వేసి అన్యాయం నిజమే అని నిరూపణ అయినా ప్రభుత్వం మాత్రం అన్యాయాన్ని దశాబ్దాలుగా సరిచెయ్యలేక పోయింది. ఒక పది సంవత్సరాల క్రితం వరకూ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలే ఆధారం, ఇప్పూడు పారిశ్రామీకరణ జరిగినా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టారులోనే ఉన్నాయనేది నిజం. నీళ్ళూ, నియామకాలు పోగా మూడోది నిధుల పంపిణీ. బడ్జేట్‌లో ఆదాయం ఎక్కువగా తెలంగాణ నుంచి రాగా వ్యయంలో మాత్రం తెలంగాణాది వెనుక సీటు.

కనుక ఇకనుంచీ సమైక్యవాదులారా, వెనుకబాటు తనం మాదగ్గరా ఉంది అంటూ మూస సమాధానాలు ఇవ్వకండి. మీదగ్గరా వెనుకబడిన ప్రాంతాలు ఉంటే ఇకనేం విడిపోయిన తరువాత మీప్రాంతాన్ని మీరు బాగుచేసుకోండి, మాప్రాంతాన్ని మేం బాగు చేసుకుంటాం.

ఇది చదివిన వెంతనే కొందరు "మరి వివక్ష జరుగుతుంటే మీప్రాంత నాయకులేం చేస్తున్నారు? మీప్రాంతం నుంచి మంత్రులూ, ఎమ్మెల్యేలూ లేరా? మీప్రాంతమ్నుంచి కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా? లాంటి ప్రశ్నలు వేస్తారని తెలుసు కానీ ఆప్రశన్లు ఇప్పుడే వెయ్యకండి, వాటిని మరో FAQలో ఇంకో టపాలో తప్పక చర్చిద్దాం.


Thursday 2 June 2011

తెలంగాణ FAQ-1: స్వార్ధ రాజకీయ నాయకులతో పోరాడండి??!!

తెలంగాణవాద విమర్శకులు తరుచూ ఎత్తుకునే వాదన "మీ సమస్యకు అసలు కారణం స్వార్ధ రాజకీయనాయకులు, మీరు ఆ స్వార్ధనాయకులతో పోరాడండి, రాష్ట్రం కోసం కాదు" అని. నిజమే స్వార్ధ రాజకీయనాయకులు దేశమంతటా ఉన్నారు, రాష్ట్రంలో ఇరువైపులా ఉన్నారు. ఇదొక జాతీయ సమస్య. అందరూ ఈవిషయంపై పోరాడవలిసిందే, కాదనేదేం లేదు.

మరిక్కడ కిటుకేమంటే మీనాయకులతో మేమెలా పోరాడుతాం, అందునా మీరు అలాంటి స్వార్ధ నీతిమాలిన నాయకులను గెలిపిస్తుంటే వారు అధికారం చేజిక్కించుకుంటే మేమెలా పోరాడేది? మానాయకులతోనే ఎందుకు సమస్య, మీతెలంగాణలో నాయకులు లేరా అంటారా? అధికారం ఎవరిదగ్గర ఉంటే వారితో పోరాడాలి గానీ అధికారం లేనివారితో పోరాడేం లాభం? ఎప్పుడూ సీమాంధ్రా నుంచే రాష్ట్ర అధినాయకులు ఉంటారు, వారి కనుసన్నలలో మెలిగే డమ్మీలు కొందరు తెలంగాణ నుంచి మంత్రి పదవులు దక్కించుకుంటే అలాంటి డమ్మీలతో పోరాడి ఏంలాభం?

అందుకే మేము ముందు స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నాం, మా రాష్ట్రం వచ్చిన తరువాత మేం నా స్వార్ధనాయకులతో పోరాడుతాం. అదీ సంగతి.

స్వార్ధ రాజకీయ నాయకులతో మనం 60 ఏళ్ళనుండి పోరాడుతున్నాం, ఇకముందు కూడా పోరాడుతూనే ఉంటాం, ఆపోరాటం అంత తొందరగా ముగిసేది కాదు. మీరు చెప్పేది కొత్త విషయమేమీ కాదని గమనించండి. అయితే ఇక్కడ పాయింటేమంటే రాష్ట్రం ఎంత చిన్నదయితే స్వర్ధ రాజకీయ నాయకులతో పోరాడ్డం అంత సులభం, కాబట్టి విభజన జరిగితే మీరూ, మేమూ కూడా ఇప్పటికంటే సమర్ధవంతంగా స్వార్ధరాజకీయ నాయకులతో పోరాడవచ్చు.

Wednesday 1 June 2011

Time for Telangana ( Economic Times of India)

It is time for the Congress to take the plunge and carve the state of Telangana out of Andhra Pradesh. There are many reasons to do so, not least the fact that historically, state boundaries get drawn and redrawn many times. When it became a republic, India was composed of 14 states. Now, at 28, it has double the number. Many states like Andhra Pradesh itself, were carved out of bigger entities after linguistic or ethnic movements. 

The three newest states, Chhattisgarh, Jharkhand and Uttarakhand, were created as recently as 2000. State boundaries are not carved in stone, but need to adjust to local needs and politics. The argument for Telangana is simple: the region's people want out and a new state of their own. Statehood might give the backward region a chance to run things better. Indeed, there is evidence to show that smaller states carved out of bigger ones tend to do better than their parent states: in 2008-09, the average person in Jharkhand was 50% better off than the average Bihari, the average Chhattisgarh resident was 54% better off than someone in Madhya Pradesh and income per head in Uttarakhand was 95% more than that in Uttar Pradesh. Why should we doubt that Telangana, home to much forest and mineral wealth, could take off on a similar trajectory after becoming a state? 

Most of the reasons for the Congress' chicken-hearted dither over Telangana do not exist any more. Its powerful chief minister Y S Rajasekhara Reddy , an opponent of the idea of Telangana, is no more. Son Jaganmohan is a rebel who has just beaten the Congress in recent bypolls. The main opposition party, the TDP , oscillates opportunistically between pro- and anti-Telangana postures. 

The current administration headed by Kiran Reddy has no platform. Creating Telangana will win the Congress many hearts and votes in the region, and stem the losses in Rayalaseema and coastal Andhra. It will also create the opportunity to create a new capital, with all the new spending and infrastructure that's required, away from Hyderabad. There is precious little to lose - and much to gain, from creating Telangana state. Get on with it.

రజాకార్ల వారసులకు సమైక్యాంధ్ర ఎందుకు?

ఆఖరు నిజాం కాలంలో భూస్వాముల దోపిడీకి వ్యతితేకంగా తెలంగాణలో సాయుధపోరాటం మొదలవగా, అదే సమయంలో సాయుధ పోరాటాన్నీ, హిందువులు స్థాపించిన ఆర్యసమాజ్‌ను అణచివెయ్యడానికి నిజాం కనుసన్నల్లో ఖాసిం రజ్వీ అధ్వర్యంలో రజాకార్ల సేన మొదలయింది. ఈ రజాకార్లు హైదరాబాద్ హిందువులను, తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఊచకోత కోశారు. ఆ ఖాసిం రజ్వీ వారసులే ఇప్పటి మజ్లీస్ పార్టీ ఓవైసీలు. మరి వీరికి సడెన్‌గా సమైక్యాంధ్ర మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? తెలంగాణకు వీరెందుకు వ్యతిరేకం? ఎందుకు విభజన తప్పకపోతే రాయలతెలంగాణ కోరుతున్నారు? పాతబస్తీలో మాత్రమే బలమున్నవారికి సమైక్య రాష్ట్రంతో ఏం పని?

1. గత ఇరవై సంవత్సరాల కాలంగా వీరికి కాంగ్రేస్ తో దోస్తీ నడుస్తుంది. దాని వలన వీరు బలపడ్డారు. రాజకీయంగా కాంగ్రేస్‌తో పొత్తు పెట్టుకోగా లోపాయకారీగా కొంతమంది రాయలసీమ నాయకులతో వీల్ల కూటమి కూడా బాగానే ఉంది.

ఎప్పుడు కాంగ్రేస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చాలన్నా పాతబస్తీలో గొడవలు సృష్టించడం మామూలే. లోపాయకారీగా సీమ నుంచి గూండాలను దించడం దానికి ఇక్కడి మజ్లీస్ కూడా తోడ్పడం జరుగుతుంది. ఇలా ఒకరికొకరు ఇన్నాల్లూ తోడూనీడలాగా ఉన్నారు. ఇప్పుడు విడిపోతే ఆ బంధం తెగిపోవచ్చు. అందుకే రాయల తెలంగాణ అయితే కొంత బెటర్.

2. తెలంగాణ మొత్తం రాష్టంగా కాకుండా గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రమయితే వీరు బలమయిన శక్తిలాగా తయారయి అధికారం చేజిక్కించుకోవచ్చు, కానీ అలా డైరెక్టుగా చెప్పలేరు. కాబట్టి ఏదోలా తెలంగాణకు అడ్డుతగిలి హైదరాబాద్‌ను విడగొట్టడానికి ఆంధ్రనాయకులు వత్తిడి తెచ్చేల చెయ్యడం ఒక ప్లాన్ కావొచ్చు.

3. తెలంగాణలో బీజేపీ బలపడి వీరిని అణచివేసే ప్రయత్నం చేస్తారనే భయం ఉండొచ్చు.

4. తాము తెలంగాణలో నాడు ఊచకోతకోసినదానికి తెలంగాణ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవచ్చుననే భయం ఉండొచ్చు.


అయితే మజ్లీస్ మాట తెలంగాణ ముస్లిముల మాట కాదు. తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఉన్న ముస్లిములు, హైదరాబాద్ లో, సికందరాబాద్లో ఉన్న మజ్లీస్‌కు చెందని అనేక ముస్లిములు తెలంగాణ రావాలనుకుంటున్నారు.

ముస్లిములలో కొద్దిమంది మిడిల్ ఈస్ట్ నుంచి వలస వచ్చినవారు కాగా ఎక్కువ మంది ఇక్కడి దళిత, బీసీ వర్గాలు ముస్లిములుగా కన్వర్ట్ అయినవారు, వీరు హైదరాబాదులో చిన్న చిన్న పనులు, వ్యాపారాలు చేసుకునే వారు. వీరు సమైక్యాంధ్రలో నష్టపోయామని భావిస్తున్నారు కనుక వీరికి తెలంగాణ ఒక అవసరం.