Sunday, 12 May 2013

అబద్ధానికి, వక్రీకరణకు పుట్టిన వికృత శిశువు విశాలాంధ్ర మహాసభ



సూర్యుడిని చూడమంటే చీకటిని చూసేవారిని
ఏనుగును చూడమంటే తోకను చూసేవారిని
చంద్రుడిని చూడమంటే మచ్చలు చూసేవారిని
గులాబీని చూడమంటే ముల్లును మాత్రమే చూసేవారిని
కమలాన్ని చూడమంటే దానికింద బురదను చూసేవారిని
మామూలు మనుషులు అనలేం.
మానసిక వికలాంగులయినా కావాలి లేక
ఉన్మాదం పోతపోసిన మూర్ఖులయినా కావాలి!
డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను ఇలా చూడాల్సిరావడం విషాదం!
యాభైయ్యేళ్ల తెలంగాణ ఉద్యమం అబద్ధమట. రెండేళ్లకింద నడమంవూతంగా పుట్టిన విశాలాంవూధ మహాసభ నిజమట. విశాలాంధ్ర పత్రిక నడిపిస్తున్నవారు కూడా తెలంగాణ ఉద్యమంలోని హేతబద్ధతను చూసి మద్దతునిస్తారు. నిన్నమొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణ తీర్మానాలకు ప్రతిపాదకునిగా, ప్రత్యక్షసాక్షిగా ఉన్న పరకాల ప్రభాకర్ ఇప్పుడు వీర విశాలాంవూధవాదిగా పోజుపెడతాడు. కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి పంగనామాలు ఎక్కువ. ప్రభాకర్‌కు అన్నీ ఎక్కువే. ఆయన అవాకులు చవాకులు పరాకాష్ఠకు చేరాయి. తెలంగాణవాదులపై విశాలాంధ్ర వాదం పేరుతో విషం కక్కుతున్నారు. తెలంగాణపై ద్వేషం లేదంటూనే విద్వేషపూరిత యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆయన రాతలు కోతలు విశ్లేషణలు, విమర్శల పరిధిని దాటిపోయాయి. పచ్చి అబద్ధాలు పదేపదే చెప్పి నిజం చేయాలన్న గోబెల్ వారసత్వాన్ని ఆయన ఆకళింపు చేసుకున్నట్టున్నారు. ‘నేను తెలంగాణవాడినే, నేను తెలంగాణవాదినే’ అని చెప్పే పెద్దమనుషులు ఇటువంటి ఉన్మాదులకు వేదికలు కల్పిస్తారు. పరకాల ప్రభాకర్ తానేదో సత్యాలు కుప్పపోసినట్టు, వాటికి తెలంగాణవాదులు సమాధానాలు చెప్పలేకపోయినట్టు, తెలంగాణలో అంతటా చీకట్లు అలుముకున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆయన చేస్తున్న వాదనల్లో ఎంత డొల్లతనం ఉందో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు. నాలుగు మాటలు చాలు. .


అబద్ధం నంబర్ 1- ‘1969 నుంచి 2009 దాకా-నాలుగు దశాబ్దాలపాటు-తెలంగాణలో విభజనవాదానికి ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు’-ఇంతకంటే బుకాయింపు, దబాయింపు, అబద్ధం ఇంకొకటి ఉండదు. ముందు తెలంగాణది విభజన వాదం కాదు. విలీ నానికి వ్యతిరేకంగా పాత హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ)ను పునరు ద్ధరించమని ఆర్టికల్ 3 రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోరడం. అదిక్కడ చర్చ కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం మహోధృతంగా నడిచింది. 369 మంది యువకులను ఈ సీమాంధ్ర ప్రభు త్వం కాల్చి చంపింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పది లోక్‌సభ స్థానాలను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి గెలుచుకుంది. 2000 సంవత్సరంలో 41 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు చేయాలనికోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమి తి ఏర్పాటు చేసిన మూడు మాసాలకు జరిగిన స్థానిక ఎన్నికల్లోనే టీఆస్‌కు 20 శాతం ఓట్లు వచ్చాయి. రెండు జిల్లా పరిషత్‌లు వచ్చాయి. ఆ బలం చూసే 2004లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చి కాంగ్రెస్ టీఆస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని పోటీ చేసింది. ఆ తర్వాత 2009కి ముందు పార్టీ పెట్టిన చిరంజీవి సామాజిక తెలంగాణ ఏర్పాటుచేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ప్రణాళిక తయారీలో పరకాల ప్రభాకర్, మాజీ డీజీపీ ఆంజనేయడ్డి ఉన్నారు. నిజామాబాద్‌లో జరిగిన ఒక సభలో పరకాల ప్రభాకర్ స్వయంగా పీఆర్‌పీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని ప్రకటించారు. కాంగ్రెస్, పీఆర్‌పీ, సీపీఐ, బీజేపీ అందరూ తెలంగాణ అన్నాక మనమూ అనకపోతే బాగుండదని తెలుగుదేశం ఏకంగా ఒక కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. టీఆస్ వెంటబడి బతిమాలి పొత్తుకుదుర్చుకుంది. తెలంగాణవాదం అన్నందుకే మహాకూటమి కాంగ్రెస్ కంటే ఎక్కువగా తెలంగాణలో 55 స్థానాలను గెల్చుకుంది. రాజశేఖర్‌డ్డి కూడా తెలంగాణలో ప్రచారం జరిగినన్ని రోజులు కాంగ్రెస్ వస్తేనే తెలంగాణ వస్తుందని నమ్మబలికారు. 2009 డిసెంబరులో అఖిలపక్షాలూ తెలంగాణ ఇవ్వాల్సిందేనని ప్రకటించాయి. కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. సమైక్యవాదులు కుట్రలు చేసి దానిని అడ్డుకున్నారు. వెయ్యిమంది పిల్లలు బలిదానాలు చేశారు. ఇవన్నీ కాదు గత మూడేళ్లలో తెలంగాణలో జరిగిన 20 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చా యి. టీఆస్ 17 గెల్చుకుంటే, తెలంగాణవాదులే అయిన బిజెపి రెండు, తెలంగాణ నగారా సమితి ఒకటి గెల్చుకుంది. మాటలు మార్చి, మోసం నేర్చి, ఇన్ని పరిణామాలకు కళ్లు మూసుకుని, పరకాలలో ఏదో జరిగిందని ఈ గొంతెమ్మ సూత్రీకరిస్తారు. మనం నమ్మాలి.

అబద్ధం నంబర్ 2- ‘వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణపట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజనవాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాదిమంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్యకారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటి పారిపోతుంది’- ఎంత గొప్పగా చెప్పావు ప్రభాకర్! మేము కోరుతున్నది అదే. తెలంగాణపై వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నాం. తెలంగాణపై ఆరు దశాబ్దాలుగా అలుముకున్న చీకట్లు విడిపోవాలనే కోరుకుంటున్నాం. ముసుగులో గుద్దులాటలు బద్దలు కావాలని ఆశిస్తున్నాం. ఎవరయినా సరే వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ‘మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామ’ని చెప్పి పోటీ చేయాలని చెబుతు న్నాం. దొంగవేషాలు, నంగి వేషాలు వద్దని చెబుతున్నాం. నువ్వు కాంగ్రెస్‌ను ఒప్పిస్తావో, టీడీపీని ఒప్పిస్తావో, వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఒప్పిస్తావో లేక నీ విశాలాంధ్ర మహాసభ నుంచే పోటీ చేయిస్తావో నిర్ణయించుకో. ఇది తెలంగాణవాదుల సవాల్! సొల్లు చర్చలు, పుస్తకాలు వేయడాలు పెద్ద విషయం కాదు. నీ వెనుక ముగ్గురు ఉండరు. పక్కన తోడు ఉండరు. కేతిగాడిలాగా తమరు విసిరే సవాళ్లకు ప్రతిసారీ తెలంగాణవాదులు రావాల్సిన పనిలేదు. తెలంగాణవాదాన్ని వ్యతిరేకించడం తెలంగాణ ప్రజల శ్రేయస్సును వ్యతిరేకించడమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వమ్ము చేయడమే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న సీమాంధ్ర పెత్తందారులకు ఊడిగం చేయడమే. తెలంగాణను కొల్లగొడుతున్న సీమాంధ్ర పెత్తందార్ల కొమ్ముకాయడమే. వారి ఆశీస్సులు, నిధులతోనే తమరు చెలరేగుతున్నారని వేరే చెప్పనవసరం లేదు. మా వాదన నిజం కాదని రుజువు చేసే దమ్ము ఉంటే విశాలాంధ్ర నినాదంతో తెలంగాణలో ఎన్నికలకు రండి. అక్కడే ప్రజలు తేల్చేస్తారు.

అబద్ధం నంబర్ 3- ‘మాకు ఏ ప్రాంతం పట్ల అయిష్టత లేదు. ఏ ప్రాంతం పట్ల ద్వేష భావం లేదు. మేము వ్యతిరేకించేది వేర్పాటు వాదాన్ని. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేర్పాటు వాదులను’- ఈ వేషాలన్నీ ఎప్పటి నుంచి ప్రభాకర్! నీ చరిత్ర ఎక్కడ మొదలు పెట్టాలి ప్రభాకర్! బీజేపీలో 1999లో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానాని’కి సాక్షిగా ఉన్నప్పటి నుంచా? 2008లో పీఆర్‌పీలో సామాజిక తెలంగాణ తీర్మానాలు తయారు చేసినప్పటి నుంచా? తమరు సమైక్యవాది ఎప్పటి నుంచి ప్రభాకర్? ఇప్పుడు ప్రభాకరొచ్చి మొదలు పెట్టాడట. అందరూ వినాలట. యాభై ఏళ్లుగా జరుగుతున్న ఉద్యమం, నలుగుతున్న ఆకాంక్ష అబద్ధం. ఒప్పందాలు, వైఫల్యాలు, తీర్మానాలు, హామీలు, ఉల్లంఘనలు అబద్ధం. రెండేళ్ల కింద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రభాకర్ విశాలాంధ్ర కాంక్ష నిజం. నువ్వు అభివూపాయాలు మార్చవచ్చు. పార్టీలు మార్చవచ్చు. కోవర్టుగా మారి ఎన్నికలకు ముందు పీఆర్‌పీని అమ్మనాబూతులు తిట్టి ఫిఫ్త్‌కాలమిస్టుగా మారవచ్చు. తీర్మానాలు మార్చుకోవచ్చు. నీ విధానాలు అబద్ధం. చరిత్ర అవకాశవాదం. ఏ పరీక్షకూ నిలబడనివాడివి. మాటకు నిలబడనివాడివి. విధానాలకు కట్టుబడనివాడివి. నీకెందుకు ప్రభాకర్ సూక్తులు చెప్పే పని!

అబద్ధం నంబర్ 4- ‘రుజువులు లేని ఉద్యమం’, ‘తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు’-అన్నపుస్తకంలో ఆందోళనకారులు రాష్ట్ర విభజనకు చూపిస్తున్న కారణాలలో నిజం లేదని సమక్షిగంగా వివరించాం. మాపుస్తకం ఎంత శక్తిమంతమైనదో వేర్పాటువాదులు అందులో మేము రాసిన ఒక్క విషయాన్ని కూడా పూర్వపక్షం చేయలేకపోయారు’-ఇదో సెల్ఫ్ డబ్బా. అబద్ధాలు, వక్రీకరణల వికృత శిశువు విశాలాంవూధసభ. నిద్రిస్తున్నవాడిని మేల్కొల్పవచ్చు. నటించేవాడిని మేల్కొల్పడం కష్టం. నిజాయితీ పరులకు వివరించవచ్చు, వంచకులను మెప్పించడం కష్టం. వారి పుస్తకాలను ఖండించడానికి వందమాటలు కావాలా? 1969-2009కి మధ్య తెలంగాణవాదానికి పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదన్నవాడికి ఏమి రుజువులు చూపించగలం? ఈ ఒక్క అబద్ధం చాలు -వారి పుస్తకాలన్నింటినీ, వారి వాదనలన్నింటినీ పూర్వపక్షం చేయడానికి. తన చరివూతను, రాష్ట్ర చరివూత ను, రాజకీయ చరివూతను అంతా కప్పేసి, అసలేమీ జరగనట్టు, కొత్తగా మతం పుచ్చుకున్నట్టు మాట్లాడేవాడిని ఏవాదం కన్విన్స్ చేయగలదు? గత పదేళ్ల చరివూతను తిరస్కరించేవాడు తాను నిజాలు మాట్లాడుతున్నానంటే ఎవడు నమ్మగలడు? తెలంగాణవాదులపై, తెలంగాణపై అసత్యాలను కుమ్మరిస్తున్నవాడు తాను ప్రేమగా ఇవన్నీ చేస్తున్నానంటే ఎవరు నమ్ముతారు?

అబద్ధం నంబర్ 5- ‘విశాలాంవూధలో మన ప్రాంత ప్రయోజనాలు సురక్షితమని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశాలాంధ్ర వాదులు తమ అభివూపాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి సంకోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలి. చరిత్ర, ఆర్థిక గణాంకాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సహజీవన పరంపర వారి వాదనకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ కాదు అన్న రావి నారాయణ రెడ్డి గర్జన తెలంగాణలో విశాలాంధ్ర వాదుల మంత్రం కావాలి’- మంచిదే ప్రభాకర్. నీ పిలుపునందుకు తెలంగాణలో విశాలాంధ్ర నినాదాలు మారుమోగితే, మీరు విజ యం సాధిస్తే మేం బానిసలుగా ఉండిపోతాం. కానీ ఒక్క మాట. రావి నారాయణడ్డి వారసత్వం పుణికిపుచ్చుకున్న సీపీఐ ఇవ్వాళ జై తెలంగాణ అంటున్నది. ‘విశాలాంవూధకోసం పైరవీ’ పేరుతో రావి నారాయణ రెడ్డి తన ఆత్మకథలో ఒక అధ్యాయం రాశారు. ప్రభాకర్ అది చదివితే మంచిది. విశాలాంవూధకోసం తానూ, పుచ్చలపల్లి సుందరయ్య జవహర్‌లాల్ నెహ్రూ వద్దకు వెళితే ఆయన ఎంత ఈసడించుకున్నాడో రాశారు. ‘విశాలాంధ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం’ చూపండి అని కమ్యూనిస్టు నేతలు అడిగితే, ‘మానవ సంబంధాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు’ అని నెహ్రూ సమాధానమిచ్చారు. అరవైయ్యేళ్ల కింద నెహ్రూకు ఉన్న ఇంగితం కూడా తమరికి లేకపోయింది. ఇక తమరు చెబుతున్నట్టు చరిత్ర, సంస్కృతి, ఆర్థిక గణాంకాలు ఏవీ విశాలాంధ్ర పరీక్షకు నిలబడలేదు. తమరు కొత్త బిచ్చగాడు. మొదటి రాష్ట్ర పునర్విభజన కమిషన్ తన నివేదికలోనే తెలంగాణ ప్రజల భయాలను రికార్డు చేసింది. ఇప్పుడు నల్లమోతు ప్రభాకర్‌ల సర్టిఫికెట్‌లు అవసరం లేదు. విశాలాంవూధవాదం పరీక్షలకు నిలబడి ఉంటే ఈ ఉద్యమాలు, 610 జీవోలు, గిర్‌గ్లానీ నివేదికలు అవసరమయ్యేవి కాదు.తెలంగాణ ప్రజలు ఆషాఢభూతులను, మాయల మరాఠీలను నమ్మేకాలం పోయిం ది. చచ్చి, పుచ్చి, కాలం చెల్లిపోయిన వాదనలను వినే పరిస్థితి లేదు. తెలంగాణలో ఏం జరిగిందో, తెలంగాణ ఎందుకు రాలేదో, తెలంగాణకు ఎవరు ఎప్పుడెప్పుడు ఎలా ద్రోహం చేశారో మునుపటికంటే బాగా అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏ పరీక్షకైనా నిలబడగలరు. తెలంగాణవాదాన్ని నిరూపించగలరు.
-శరత్ చంద్ర