Wednesday 30 October 2013

రెండు రోడ్డు ప్రమాదాలు


గత రెండురోజుల్లో రెండు పెద్ద రోడ్డుప్రమాదాలు ప్రధానవార్తలయ్యాయి. ఒకటి ఔటర్ రింగ్‌రోడ్ మీద డీసీఎం ట్రక్కును ఢీకొన్న ప్రమాదమయితే మరొకటి వోల్వో బస్సు దగ్ధం.

వోల్వో బస్సులు గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెల్లినా బ్యాలన్స్ తప్పవు, ప్రయాణీకులకు కుదుపులుండవు కనుక వేగంగా పోతుందని భయం ఉండదు. అయితే ఈవోల్వో బస్సులు డిజైన్ చేసింది ఫారిన్ రోడ్లను దృష్టిలో పెట్టుకొని. అక్కడి రోడ్లపై గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళీనా ప్రమాదాలు జరగవు. అయితే మన డ్రైవర్లు మన డొక్కురోడ్లపై కూడా వోల్వో దొరికింది గదా అని అదే స్పీడుతో వెలుతుంటారు. కానీ మన రోడ్లు అంత వేగంతో వెళ్ళడానికి అనుకూలంగా ఉండవు. ఎప్పుడు రోడ్డుపై ఏ కుక్క వస్తుందో, మేకలగుంపు వస్తుందో, పశువులు వస్తాయో తెలియని పరిస్థితి. రోడ్లకు ఆనుకునే ఊర్లు ఉంటాయి. హైవేలపై అప్పుడప్పుడూ చిన్నపిల్లలు ఆడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో నూటనలభైపై వెలుతున్న బస్సుకు సడన్‌గా ఏదైనా అడ్డువస్తే కంట్రోల్ చేయడం కష్టం. బహుషా వోల్వోలకు మన రోడ్లపై స్పీడ్ లాక్ చేయాల్సిన అవసరం ఉందేమో.

రెండోప్రమాదం జరిగిన ఔటర్ రింగ్ రోడ్డు ఫారిన్ రోడ్లకు ఏమాత్రం తీసిపోనిది. నాలుగు లేన్లతో కూడిన ఈ చక్కటిరోడ్డుపై స్పీడుగా వెల్లినా ప్రమాదాలు జరగగూడదు. కానీ అంత వేగంతో వెల్లడానికి అవసరమయిన రక్షణ వ్యవస్థ, సిగ్నలింగ్ సిస్టం లేని వాహనాలు కూడా ఈరోడ్డుపై వెలతాయి. ఇలాంటి వాహనాలు కూడా రోడ్డు బాగుంది కదా అని అంతే వేగంతో వెలతాయి. రోడ్డు మధ్యన ఆగిన ట్రక్కువాడు ఎమర్జెన్సీ బ్లింకర్ వేయకపోవడం ఒక తప్పు అయితే డీసీఎం అదుపు చేయలేనంత వేగంగా రావడం మరో తప్పు.

ఏతా వాతా తేలేదేమంటే వేగంగా వెళ్ళడానికి మంచి వాహనం, మంచి రోడ్డు రెండూ అవసరం. ఏదో ఒకటి ఉంది కదా అని స్పీడు పెంచితే పరిస్థితి ఇదే అవుతుంది. 

Tuesday 22 October 2013

మూడువేల శిశువుల ప్రాణాలు తీసిన సమైక్యాంధ్ర ఆందోళనలు


From Telegraph  India

http://www.telegraphindia.com/1131009/jsp/nation/story_17440815.jsp#.UmX8tflHJXU

Baby deaths surge amid Andhra blackout

Hyderabad, Oct. 8: Over 4,000 babies have died in Andhra Pradesh’s hospitals, about half of them newborns in non-functional incubators, since an indefinite power employees’ strike began on Sunday morning, doctors’ associations said.
No figures were available from a state government virtually paralysed by striking employees and truant ministers from Seemandhra since July 31. Doctors’ bodies gave rough estimates of infant deaths by collating district-wise inputs from hospitals, but none were willing to be quoted.
In normal times, the state’s hospitals witness an average of 300-400 baby deaths daily —which means at least an additional 1,000 babies have died per day since the strike began.
“I appeal to protesters to let the hospitals function so that these little children don’t suffer,” said Prabhakar Reddy, father of a newborn, at Hyderabad’s Nilofuer Hospital.
Doctors and NGOs said the power crisis accounted for most of the additional deaths, and that the acute staff shortage at the hospitals because of the two-month-old anti-statehood strike was also to blame.
An Indian Medical Association spokesperson said several coastal and tribal-dominated districts were witnessing an outbreak of diseases among children aged one to three.
“Viral fever, dengue and chicken pox have taken a heavy toll in Visakhapatnam and Rajahmundry,” he said.
Sources in an association of government doctors said 520 babies had died in five Hyderabad hospitals — including a private clinic — since Sunday.
State health minister and anti-statehood agitator Kondru Murali Mohan, who had two months ago tendered his resignation, which has not been accepted, said: “It is unfair to blame the deaths on the agitation — baby deaths in government hospitals are common.”
But even he appeared stunned when told about the figures. Mohan has not been attending office these past 10 weeks.
One Hyderabad hospital’s authorities said they were spending Rs 22,000 per day on generators and had back-up left for just a few hours. With ACs not running, burns patients’ sufferings have increased.
Doctors have cancelled surgeries. “Medicines, blood in the blood bank, and blood-products are deteriorating during the long power cuts,” said Dr Suresh Goud of the AP Private Hospitals and Nursing Homes Association.

Thursday 17 October 2013

సద్దుమణిగిన సమైక్యాంధ్ర, జాడలేని సీమాంద్ర్హ హక్కుల చర్చపెట్టుడు ఉద్యమాలు ఎన్నాల్లని ఉంటాయి? పెట్టుబడి పెట్టేవాడు మానగానే అవీ మాయమవుతాయి. సమైక్యాంధ్ర ఆందోళనల పరిస్థితీ ప్రస్థుతం అదే. ఎక్కడా ధర్ణాలు లేవు, బహిరంగ సభలు లేవు, లక్ష(?)ఘళఘోషలు లేవు. ఉద్యోగస్థులందరూ మెల్లమెల్లగా డ్యూటీల్లో చేరుతున్నారు. ప్రభుత్వంలో విలీనం హామీతో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి.

మొన్నటిదాకా ఈనాడు పేపరు వాడు ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ ఏదో బ్యానరు పెట్టి గడ్డి తినేవాళ్ళ ఫోటోలు, ఈకలు పీకేవారిఫోటోలూ పెట్టేవాడు.ఇప్పుడదీ బందయింది. సీమాంధ్ర ఛానెళ్ళు పోటీలు పడి చిన్న చిన్న ఆందోళనల క్లిప్పింగులు రోజంతా రిపీట్ చేసేవారు. వారూ మానేశారు.

పోటీలు పడి నిరాహారదీక్షలు జేసిన పెద్దలు ఇంట్లో గూర్చుని ఇప్పుడు నీది దొంగ దీక్ష అంటే నీది దొంగ దీక్ష అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరివీ దొంగదీక్షలని తెలిసిన ప్రజలు ఇవి అసలు పట్టించుకోవడం లేదు.

నేను రాజీనామా చేశానంటే నేనూ చేశానని ప్రకటించుకున్న ఎంపీలూ, మంత్రులూ ఇంతవరకు వారి రాజీనామా పత్రాలు ఎందుకు ఆమోదించబడలేదో చెప్పడం లేదు.

బడిపిల్లలు ఎండలో కూర్చున్న ఫోటోలను ఫేస్బుక్కుల్లో షేర్ చేసుకుని సోషల్ నెట్‌వర్కర్లు మురిసిపోయేవారు కూడా ఇప్పుడు కొత్తఫోటోలు లేక మానేశారు.

అయినా ఇంకా సీమాంధ్ర నేతలు మాత్రం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తెలంగాణనాపుతారు అని ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప వాస్తవాలను ఒప్పుకుని ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలపై చర్చించడం లేదు. సీమాంధ్రకు రాజధాని విషయంపై గానీ, నీటివాటాల విషయంపై గానీ, ఉద్యోగుల హక్కులవిషయంపై గానీ చర్చలేదు. సీమాంధ్ర నేటల ఈప్రవర్తన వలన నష్టపోతుంది సీమాంధ్ర సామాన్యుడే.


Thursday 10 October 2013

ఉద్యోగసంఘ నాయకులతో సీఎం చర్చలుసీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దుతుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె గురించి ఉద్యోగసంఘాల నాయకులతో సీఎం చర్చలు జరుగుతున్నాయి.

సీఎం: ఏమయ్యా! సమ్మె బాగా చేస్తున్నారా?

నాయకుడు: ఆ, ఏం చేయడమో సార్, రెండు నెలలనుంచీ జీతాలు లెవని ఉద్యోగులు మమ్మల్ని తిడుతున్నారు.

సీఎం: అలాగంటే ఎలాగ, ఎలాగో సమ్మెను నడిపించండని మీ నాయకులందరికీ డబ్బులు బాగానే ముట్టజెప్పాను గదా?

నాయకుడు: మాకిచ్చారు, ఉద్యోగులందరికీ ఇవ్వలేదు కదా?

సీఎం: మీరే ఎలాగో మేనేజ్ చెయ్యాలి. మీక్కావలంటే ఇంకాస్త డబ్బిస్తాను.

నాయకుడు: ఇంకా ఎన్నిరోజులు ఇలా చేయమంటారు సార్, మేము సమ్మె విరమిద్దామనుకుంటున్నాం.

సీఎం: విరమిస్తారా? ఇంత డబ్బు మీకిస్తే ఇప్పుడలా అంటే ఎలా? నాకదంత తెలియదు, మీరు సమ్మె కొనసాగించాల్సిందే.

నాయకుడు: మీరు ధర్ణాలకూ, సభలకు ఇచ్చిన డబ్బు అయిపోతుంది, ఇంకాస్త కావాలి.

సీఎం: సరే ఎంత కావాలో గుమస్తానడిగి తీసుకుపొండి. మన మీడియా బాగానే కవర్ చేస్తున్నారుగా మీ ఉద్యమాన్ని?

నాయకుడు: మీడియా వాళ్ళు కూడా డబ్బడుగుతున్నారు.

సీఎం: మీడియా వాళ్ళకు దబ్బెందుకు? సమైక్యాంధ్ర వలన ఆళ్ళకూ లాభమే కద. సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే.

నాయకుడు: సరే సార్, మరి బయటికి వెళ్ళినాక ప్రెస్ వారికి ఏం చెప్పమంటారు?

సీఎం: సమ్మె విరమణకు సీఎం అభ్యర్థించారనీ, సమైక్యాంధ్ర ప్రకటన రానిదే ససేమిరా అన్నామనీ చెప్పండి.

నాయకుడు: అలాగే. మరి వస్తాం సార్.

సీఎం: మంచిది. 

Wednesday 9 October 2013

తెలుగుజాతి పరువు తీస్తున్న సీమాంధ్ర నేతలుతెలుగుజాతి ఆత్మ గౌరవం, తెలుగుజాతి ఐక్యత అంటూ బీరాలు పోయే సీమాంధ్ర నేతలు ఢిల్లీ సాక్షిగా తెలుగుజాతి పరువుతీస్తున్నారు. తెలుగు జాతిని ఏలుతున్న నేతలు ఇంత స్వార్ధపరులు, ఆత్మ వంచకులా అని ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్నారు. తెలుగు దేశం, వైకాప, కాంగ్రేస్ అంటూ తేడా లేకుండా అందరూ తెలుగు జాతి పరువు తీస్తున్నారు.
 
తెలుగుజాతి ఆత్మగౌరవం మా నినాదం అంటూ చెప్పుకునే తెలుగుదేశం నేత ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నాడు. అయితే ఈయన ఎందుకు దీక్ష చేస్తున్నాడు, దేనికోసం దీక్ష చేస్తున్నాడు, ఇతను రాష్ట్రాన్ని విభజించమంటున్నాడా వద్దంటున్నాడా, అసలు ఈయన పార్టీ విధానమేంటి అని తెలియక జాతీయ మీడియా జుట్టు పీక్కొంతుంది. పది నిమిషాలు ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగి కూడా ఐబీఎన్ రాజ్‌దీప్ మాత్రం తెలంగాణ కావాలా, వద్దా అనే ప్రశ్నకు బాబు దగ్గరనుండి సమాధానం రాబట్టలేకపోయాడు. తాము విభజనకు అనుకూలం అని కేంద్రానికి లేఖనిచ్చి, తొందరగా ఈవిషయంపై తేల్చండి అంటూ కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు, నిర్ణయం వచ్చిన తరువాతిరోజు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నాడో అర్ధం కాక జాతీయమీడియా విస్తుపోతుంది. చంద్రబాబు అవకాశవాదాం దేశం మొత్తానికి తెలిసొచ్చింది.

మరో సీమాంధ్ర నేత జగన్‌బాబు మొన్నటిదాకా లక్షకోట్ల అవినీతి కేసులో జైళ్ళో ఊచలు లెక్కబెడుతున్నాడు.  అవినీతిని ఇలాక్కూడా చేయవచ్చని ప్రపంచానికి చూపించి, తన ధన దాహానికి ఐయేఎస్ ఆఫీసర్లను, మంత్రులను జైలుపాలు చేసిన జగన్‌బాబు "ఆమరణ"  నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక నెలరోజులక్రితం జైళ్ళో ఉన్నప్పుడు కూడా ఇదే జగన్ "ఆమరణ" నిరాహార దీక్ష చేశాడు. ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారి చేస్తారు. నెలకొకసారి చేస్తే అది ఆమరణ నిరాహారదీక్ష ఎలా అవుతుందో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు. ఈజగన్‌బాబు దీక్ష ఎందుకో కూడా ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. మొదట నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే, నేను అడ్డూ కాదూ, నిలువూ కాదు అన్నవాడు ఆతరువాత సమన్యాయం చెయ్యాలంటూ ఒకసారి దీక్ష చేపట్టాడు. ఆ సమన్యాయం అంటే ఏమిటో ఆయనకే తెలియాలి. మళ్ళీ నెల తిరక్కుండానే సమన్యాయం నినాదాన్ని పక్కన పెట్టి సమైక్యాంధ్రకోసం దీక్ష చేస్తున్నాడు. ఇక ఈయన ఎండీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.....అబ్బో మొసళ్ళు కూడా సిగ్గుపడుతాయి.

ఇక కాంగ్రేస్ నేతలు సరేసరి. అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటామని చెప్పినవారు ఇప్పుడు ఒకసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నతరువాత అడ్డుపడడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆధిపత్యపోరులో ఒకరి ఆస్థులు మరొకరు లూటీలు చేపిస్తున్నారు.

ఈమొత్తం ఎపిసోడ్‌లో తెలుగుజాతిని ఏలుతున్న నాయకుల స్వార్ధబుద్ధి, సిగ్గులేనితనం ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు అర్ధం అయింది. తెలుగుజాతిలో తెలంగాణ ఎలా అణచివేతకు గురవుతుందో, ఆణచివేతను తొలగించేప్రయత్నాన్ని దోపిడీవర్గం ఎలా అడ్డుకుంటుందో అందరికీ తెలిసింది. పోయింది మాత్రం తెలుగుజాతి పరువు. 

తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ గర్వంగా తలెత్తుకోగలదు గానీ ఒక రాష్ట్రంగా ఉండి ఒక వర్గం దోపిడీ ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల జాతి పరువు మంటగలిసింది. 

Tuesday 8 October 2013

దొంగలముఠాలో చీలికలు

దొంగలముఠాలో చీలికలొస్తే ఏం చేస్తారు? ఒకరి దొంగతనాలను మరొకరు బయటపెట్టుకుంటారు. ప్రస్తుతం సీమాంధ్ర పెద్దల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి తనకు అనుకూలుడు, ఒకే కులం, ప్రాంతం వాడు తాను చెప్పినట్టు వింటాడు అని చెప్పి అర్హత లేకున్నా దినేష్‌రెడ్డిని అందళం ఎక్కించాడు. అప్పటికి దినేష్‌రెడ్డి కంటే సీనియర్లు, ఎక్కువ కఠినతర భాద్యతలు నెరవేర్చి ర్యాంకింగ్‌లో ముందున్నవారు తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు గౌతంకుమార్, మరొకరు ఉమేశ్‌కుమార్. అయినా అన్యాయంగా నిబంధనలను తుంగలో తొక్కి కిరణ్‌రెడ్డికి డీజీపీ పదవి ఇచ్చాడు. దానివలన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ఇంతా చేసింది ఎందుకు? తనకు అనుకూలుడు, తన మాట వినేవాడూ పోలీస్ బాస్ అయితే తనకు అడ్డు ఉండదు, అంతా తన ఇష్టప్రకారం జరుగుతుందీ అని.

చివరికి జరిగిందేమిటంటే తన పదవి ఎక్స్‌టెన్షన్ దొరకలేదని దినేశ్‌రెడ్డి ముఖ్యమంత్రిపై విరుచుకు పడ్డాడు. ముఖ్యమంత్రి సంగతులు అన్నీ బయట పెట్టాడు.

మచ్చుకు కొన్ని: ముఖ్యమంత్రి తమ్ముడి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఏపీఎంజీవోల సభకు వద్దన్నా పర్మిషన్ ఇప్పించడం,  తెలంగాణ వస్తే నక్సలైట్ సమస్య పెరుగుతుందని అబద్దాలు చెప్పమనడం. ఇవన్నీ బయట పెట్టినందుకు దినేశ్‌రెడ్డిని ఎవరూ నిజాయితీపరుడనరు గానీ ముఖ్యమంత్రి బండారం మాత్రం బయట పడింది. ముఖ్యమంత్రీ, మాజీ డీజీపీ ఏవిధంగా తోడుదొంగలయిందీ, చివర్లో ఏవిధంగా వాటాలు కుదరక విభేధాలు వచ్చిందీ అందరికీ తెలిసింది.

ఈవ్యవహారం బయటపెట్టిన మరో విషయం ఇప్పటివరకూ సీమాంధ్ర ముఖ్యమంత్రులు తమకు కొమ్ముగాసే సీమాంధ్రకు చెందినవారికి ఏవిధంగా అక్రమంగా పదవులు కట్టబెడుతుందీ, ఏవిధంగా తెలంగాణా వారికి అన్యాయం చేస్తుందీ. 

Monday 7 October 2013

ఆధిపత్య పోరు - నిరశన ముసుగులో దాడులురాష్ట్ర విభజన గురించిన ప్రకటన తరువాత సీమాంధ్రలో మొదలయిన ఉద్యమం విభజన ఆపడానికి కాక సీమాంధ్రలో ఆధిపత్య పోటీ లాగా తయారయింది. ఈపోటీలో ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోగా ఇప్పుడు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే విజయనగరంలో నిన్నటినుంచీ కర్ఫ్యూ విధించగా మరికొందరు సందట్లో సడేమియాలు దుకాణాలపై పడి దోచుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమం నాలుగేళ్ళనుంచీ తీవ్రస్థాయిలో జరుగుతున్నా ఉద్యమం ఎప్పుడూ శాంతియుతంగానే జరిగింది. ఎప్పుడైనా బస్సులపై రాళ్ళు రువ్వడం లాంటి చిన్నచిన్న ఘటనలు జరిగినా అదికూడా పోలీసులు ఒవర్‌యాక్షన్ చేసి అనవర నిర్భందాలు, లాఠీఛార్జీలతో ప్రేరేపించినప్పుడే జరిగాయి. అయినా ఎప్పుడూ తెలంగాణ ఉద్యమాన్ని ఆడిపోసుకోవడమే తమ పనిగా పెట్టుకున్న సమైక్యవాదులు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దాక్కుంటున్నారు.

సీమాంధ్రలో రాజకీయపార్టీలన్ని ఇంతకుముందు తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని చెప్పినవారే. విభజన ప్రకటన తరువాత ఈపార్టీలన్నే విభజనకు కారణం తమ ప్రత్యర్ధి పార్టీయే నని వాదనలు మొదలుపెట్టారు. రాజకీయ విమర్శలు, పోటాపోటీ దీక్షలు ఇన్నాల్లు సాగితే ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తెదేపా వర్గీయులు వైకాప నాయకుల ఇళ్ళపై, వైకాప వర్గీయులు తెదేపా నేతల ఇళ్ళపై దాడులు, కాంగ్రేస్లో ఒక వర్గం వారు మరో వర్గంపై దాడులు చేసుకుంటూ సీమాంధ్రను భ్రష్టుపట్టిస్తున్నారు.

విజయనగరంలో బొత్సా ఇల్లపై దాడులకు ప్రేరేపిస్తుంది స్వయానా ముఖ్యమంత్రేనని ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరంలో బొత్సా ఆస్థులతోపాటు ఒక పది ప్రైవేటు దుకాణాలను తగలబెట్టి దోచుకున్నారు. నిన్న ఒక వైన్‌షాపును పగలగొట్టి కొందరు మందుప్రియులు వైన్ సీసాలు దోచుకుపోయారు. బొత్సాతోపాటు హర్షకుమార్, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆస్థులపై కూడా దాడులు జరుగుతున్నాయి. వీటివెనుక ముఖ్యమంత్రి, లగడపాటిల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర మీడియా మాత్రం యధాప్రకారం  లూటీలను కూడా సమైక్య ఉద్యమం అకౌంట్లో కలిపేసి ప్రజలకు అక్కద ఉద్యమం జరుగుతున్నట్లు భ్రమలు కల్ప్పిస్తున్నాయి. 

Thursday 3 October 2013

నాటికీ నేటికీ తేడా!డిసెంబరు 9 2009రోజు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న యూపీయే ప్రభుత్వం మానాయకుల తడాఖాతో  రెండువారాల్లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, ఈసారికూడా అలాగే తీసుకోదా అని కొందరు సమైక్యవాదులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారలా చూస్తుండగానే ఈసారి చకచకా తెలంగాణ ఏర్పాటు ముందుకు సాగుతుంది. ఇంతకీ నాటికీ నేటికీ తేడా ఏమిటి అని చూస్తే చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఒకే డ్రామా మళ్ళీ మళ్ళీ చేస్తే రక్తి కట్టదు.

2. అప్పుడు ఎన్నికలు అంత త్వరలో లేవు కనుక నేతలు రాజకీయప్రయోజనాలు పక్కనపెట్టి తమ ఆర్ధిక, భూదాహ ప్రయోజనాలకోసం తెలంగాణను అడ్డుకోవడం కోసం అన్నిపార్టీలూ కలిసి పనిచేశారు. ఈసారి ఇంకోసంవత్సరంలొ ఎన్నికలుండగా అలా చేయడం కష్టం. పైగా పార్టీలు తామే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామంటే తామేనని పోటీపడుతున్నాయి.

3. అప్పుడు కేంద్రం ముందే జరిగే పరిణామాలను ఊహించలేదు, ఈసారి ఊహించి అందుకు ప్రిపేర్ అయి ఉంది.

4. తెలంగాణ ఇస్తేనే అన్ని రాజకీయపార్టీలకూ లాభం. ప్రతిపక్షాలు కూడా తాము చేసే ఆందోళనలు విభజన ఆపడానికి కాక సీమాంధ్రకు ఎలా ఛాంపియన్ అవాలి అనే దానిపైనే దృష్టి పెట్టాయి.

సీమాంధ్రకు బెంగుళూరును రాజధాని చేయడం ఎలా?మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయేటప్పుడు సీమాంధ్రులు చెన్నై మాకే కావలని అడిగారు. దానికోసం పాపం పొట్టి శ్రీరాములును చంపుకున్నా కూడా చెన్నై మాత్రం దక్కలేదు. కనీసం మాకు దక్కంది తమిళులకు కూడా దక్కొద్దు, చెన్నపురిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని డిమాండ్ చేసినా కేంద్రం సీమాంధ్ర నేతల మాటలు పట్టించుకోలేదు. ఆతరువాత కర్నూలు డేరాలక్రింద చెమటలు కారుస్తున్నప్పుడు హైదరాబాదు మీద మనసు పడి లాబీయింగ్ ద్వారా మొత్తానికి తెలంగాణను కలుపుకుని హైదరాబాదును రాజధానిగా పొందారు.
  
చివరికి కేంద్రం పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణ హైదరాబాదును దక్కించుకుంటుంటే సీమాంధ్రకి మాత్రం ఇంకొక రాజధాని అవసరం అయింది. ఇప్పటికైనా తమకున్న నగరాల్లో దేన్నైనా రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది గానీ సీమాంధ్ర నేతలకు మెట్రో నగరాలు తప్ప చిన్న నగరాలు సరిపోవు కదా!  చెన్నై, హైదరాబాదు తరువాత దక్షిన భారతంలో మిగిలింది బెంగుళూరు ఒక్కటే. బెంగుళూరును సీమాంధ్రకు రాజధానిని చేయగలిగితే ఎలా ఉంటుంది? 

నిజానికి సీమాంధ్ర నేతలు పూనుకుంటే బెంగుళూరును రాజధానిగా పొందడం పెద్ద కష్టం కాదు. హైదరాబాదు కంటే కూడా సీమాంధ్రులకు బెంగుళూరు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాదు అయితే ఉర్దూ రాక కష్టాలు, అదే బెంగుళూరు అయితే అక్కడివారికి తెలుగు బాగా వస్తుంది, అటుపక్క తెలుగు వారికి కన్నడ కూడా వస్తుంది. పైగా సీమాంధ్ర్ సరిహద్దు నుంచి చూస్తే హైదరాబాద్ కన్నా బెంగుళూరే దగ్గర.  

బెంగుళూరులో ఇప్పటికే తెలుగు వారు అనేక మంది ఉండడంతోపాటు సీమాంధ్రుల పెట్టుబడులు (ముఖ్యంగా మన జగన్ పెట్టుబడులు) కూడా బెంగుళూరులో ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్ళెక్కడినుంచి వస్తాయని కొందరు బాధపడుతున్నారు. కర్ణాటక ఒకవేల సీమాంధ్రతో కలిస్తే క్రిష్ణా, తుంగభద్రా ఎగువ ప్రాంతాలు సీమాంధ్ర నేతల అదుపులోనే ఉంటాయి కాబట్టి "నీటి యుద్ధాలు" జరగవు,  నీటి దోపిడీలే జరుగుతాయి. ఇన్ని లాభాలున్నప్పుడు సీమాంధ్ర కర్ణాటకతో కలిస్తే తప్పేముంది. 

ఇంతకూ ఇది ఎలా సాధ్యమంటారా! లాబీయింగు చేసి కేంద్రాన్నీ, కన్నడ నేతలను ఒప్పించగలిగారంటే అదేమంత పెద్దకష్టం కాదు. ఒకవేళ కన్నడిగులకేమయినా అనుమానాలొస్తే మీకేంకావాలంటే అవి ఇస్తామని ఒక పెద్దమనుషుల ఒప్పందాన్ని పడేస్తే సరి. ఒకసారి కలిసాక దాన్ని అమలుపరుస్తున్నామా లేదా అని ఎవడు చూడొచ్చాడు? 

మరో పాతికేళ్ళయినాక కన్నడిగులు నిద్రలేచి మాకు మీతో పడదు, విడిపోదామంటే అప్పుడు విడిపోదామని మీరనుకుంటున్నారు  కాబట్టి మీరు బెంగుళూరును వదిలేసుకోవాల్సిందేనని కిరికిరి పెట్టొచ్చు. గట్టిగా పోట్లాడాలేగానీ అప్పుడు మరో మెట్రో సిటీ సీమాంధ్ర సొంతం అయిపోదూ? 

గమనిక: అంతా బాగానే కనిపిస్తున్నా సీమాంధ్ర, కర్ణాటక కలిసిన రాష్ట్రంలో కన్నడ ఎమ్మెల్యేలే ఎక్కువమంది ఉంటారు కనుక అధికారం గుప్పిట్లో ఉంచుకోవడం సీమాంధ్ర నేతలకంత సులభం కాదు. దీనికి పరిష్కారం కూడా ఆలోచించాలి.