"ఏరుదాటిన వెంటనే తెప్ప తగలేయడం", "ఓడ దిగన వెంటనే బోడి మల్లయ్య అనడం" సామెతలు చంద్రబాబుకు అతికినంతగా బహుషా ప్రపంచంలో మరెవ్వరికీ అతకదేమో. చంద్రబాబు చరిత్రలో వాడుకుని తగలేసిన తెప్పలెన్నో. అందరినీ తన అవసరానికి వాడుకోవడం, అవసరం తీరినవెంటనే వదిలెయ్యడం చంద్రబాబుకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలువదు.
తాను కాంగ్రేస్లో ఉన్నప్పుడు మామపైనే పోటీ చేస్తానని బీరాలు పలికి, తరువాత పదవికోసం మామ పంచన చేరిన చంద్రబాబు పార్టీలో తనకు సొంతబలం తయారుచేసుకున్నవెంటనే మామకే వెన్నుపోటు పొడిచాడు. మామను గద్దెను దించడానికి తోడల్లుడు దగ్గుపాటి, బావమరిది హరిక్రిష్ణ సహాయం తీసుకున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయి, వారి అవసరం తీరిన వెంటనే ఇద్దరినీ పార్టీనుంచి గెంటివేశాడు.
పార్టీలో తన అవసరంకోసం రేణుకాచౌధరినీ, జయప్రదనూ వాడుకుని వదిలేశాడు. దేవేందర్‌గౌడ్‌ను తొక్కెయ్యడానికి నాగంను లాగిన చంద్రబాబు నాగంను తొక్కెయ్యడానికి ఎర్రబెల్లి, మొథ్కుపల్లిలను వాడుకున్నాడు.
చంద్రబాబు మద్దతు, సీమాంధ్ర మీడియా కవరేజీలను చూసి రెచ్చిపోయి తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై విచక్షణారహితంగా నోరుపారేసుకున్న మొథ్కుపల్లికి ఇప్పుడు తాజాగా చంద్రబాబు తన దెబ్బ రుచి చూపించాడు. తాజాగా పార్టీలో తనకు సీనివ్వడం లేదనీ, తెలంగాణపై లెటరు విషయంలో తనను సంప్రదించలేదనీ మొథ్కుపల్లి ఏడుస్తున్నాడు. అయితే పాపం అనవసరంగా తెలంగాణ ఉద్యమంపై నోరుపారేసుకున్న మొథ్కుపల్లికి ఇప్పుడూ బయట ఎక్కడా ఉప్పు పుట్టదు. అందుకే తేలుకుట్టిన దొంగలా పడి ఉంటున్నాడు.
your posts on chandra babu are so biased. Looks like you have some personal grudge on him
ReplyDeleteఏమిటి మీ గొప్ప?
ReplyDeleteఎపుడూ సెంద్రిపై పడి ఏడ్వటం తప్ప
తెలంగాణాలో వందలాది అమాయకులు ఆత్మహత్య చేసుకోడానికి ప్రధాన కారకుడు బాబు.
ReplyDeleteపైకి ఒక మాట లోపల ఒక కుట్ర..
2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానంటాడు
అదే లేఖకు కట్టుబడి ఉన్నా నంటాడు. తెలంగాణా ప్రకటన రాగానే కుట్రపన్ని తెలంగాణను వంచించాడు.
తెలంగాణా వాళ్లకు ఆ పేరు వింటేనే కడుపు రగిలిపోతుంది.
రాజకీయాలంటేనే అసహ్యం పుట్టేలా చేసాడు
reply telugu scriptlo ela ivva vacchu?
ReplyDeleteuse http://lekhini.org
Delete