దేశంలో ఎక్కడ ఏసంఘటణ జరిగినా ఆఇష్యూను తనకు అడ్వాంటేజీగా తీసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడడం చంద్రబాబు అలవాటు. అయితే తనదాకా వస్తే మాత్రం ఆయన సిద్ధాంతాలన్నీ మారిపోతాయి.
జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హజారే దీక్ష చేస్తుంటే చంద్రబాబు తానే అన్నాహజారే మేనల్లుడిలాగా ఫోజుకొట్టి మరీ ఉద్యమానికి మద్దతు పలికాడు. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలిని లోకాయుక్త పరిధిలోకి తీసుకురావడానికి మాత్రం వెనక్కి తగ్గాడు ఇదే చంద్రబాబు.
ఎక్కడయినా సీమాంధ్రలో ఫాక్షన్ మర్డర్ జరిగితే ఫాక్షనిజంపై బుసలు గొడతాడు, కానీ తనపార్టీకి చెందిన సీమాంధ్ర నాయకుల్లో మాత్రం సగానికి సగం ఫాక్షనిస్టులే.
ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఢిల్లీ రేప్ సంఘటనపై విరుచుకుపడుతున్నాడు. చస్తున్నా పదవికోసం పాదయాత్ర సందర్భంగా కొందరు విద్యార్థినులు చంద్రబాబుతో రేపిస్టులను ఊరితీయాలని అడిగారట. చంద్రబాబు వెంటనే నిజమే రేపిస్టులను ఉరితీయాల్సిందే, ఉరితీస్తేగానీ మిగతావాళ్ళకు బుద్ధిరాదని సెలవిచ్చాడట. చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు కూడా ట్విట్టర్లో ఒకటే రేప్ సంఘటనపై విమర్శలు గుప్పిస్తున్నాడు. మంచిదే.. అయితే మరి టీడీపీ పార్టీలో పరిస్తితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.
టీడీపీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలలో ముగ్గురు రేప్, మోలెస్టేషన్ కేసులపై అరెస్టయినారు. దెందులొరు ఎమ్మెల్యే చింతమనేని ప్రకాశ్ మోలెస్టేషన్ కేసు ఎదుర్కొంటుండగా కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు తన నర్సింగ్ కాలీజీ విద్యార్థినులపై అత్యాచర ప్రయత్నం చేసినందుకు అరెస్టయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రేప్ కేసులో అరెస్టు కాగా ప్రస్తుతం కేసు నడుస్తుంది.
చంద్రబాబూ, ఢిల్లీ రేపిస్టుల అరెస్టు సంగతి తరువాత, ముందు నీ సొంతపార్టీలో రేప్ కేసులెదుర్కుంటున్నవారిని పార్టీనుండి సస్పెండ్ ఎప్పుడు చేస్తావు?
ABN andhrajyothi Radha Krishna lanti pervert lanu em cheddamo adhi meere cheppandi Chandra babu garu!!
ReplyDelete