గతవారం విదుదలయిన సినిమా "దేనికైనా రెడీ" బ్రాహ్మణులను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలవలన వివాదాలకు గురయింది. బ్రాహ్మణులపై, అర్చకులపై సినిమాల్లో సెటైర్లు కొత్తకాదు గానీ ఇందులోకాస్త శృతిమించడంతో బ్రాహ్మణవర్గానికి బాధ కలిగించింది. అసలింతకూ సినిమాల్లో బ్రాహ్మణవర్గాన్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? మోహన్‌బాబు, పెద్ద ఎన్‌టీఆర్, చిన్న ఎన్‌టీఆర్ సినిమాల్లో, పరుచూరి బ్రదర్స్ కధ, మాటలు రాసిన సినిమాల్లో ఇవి ఎందుకు శృతి మించుతున్నాయి? కమ్మసామాజికవర్గానికి చెందినవారిదగ్గరినుండి ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి?
మొదట్లో కమ్మసామాజికవర్గం భూమి, డబ్బూ కలిగి ఉన్నప్పటికీ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎక్కువగా రాణించలేదు. ఈరంగాల్లో విద్యాధికులయిన బ్రాహ్మణుల ఆధిపత్యం నడిచేది. అయితే 1920 దగ్గర్లో ఏర్పడ్డ "కమ్మ మహాజనసభ" తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం ఒక ఫార్ములా తయారుచేసింది. ఇంది రెండంచెల ఫార్ములా: తమకంటే ముందున్న బ్రాహ్మణుల ఆధిపత్యానికి గండి కొట్టాలి. దానికోసం తమ పిల్లలను అన్ని రంగాల్లో చదివించడమే కాకుండా అవసరమయితే బ్రాహ్మణులను కిందకి లాగి దెబ్బకొట్టాలి. తమకంటే తక్కువలో ఉన్న దళితబహుజన వర్గాలను అణగదొక్కాలి, అవసరమయితే కత్తులు వాడాలి.
ఈ రెండంచల పధకంలో రెండవదాని ఫలితం కారంచేడు, పదిరికుప్పం తరహా దాడులు. మొదటిదాని ఫలితం మెడికల్, ఇంజినీరింగ్, రాజకీయ, సాహిత్య, సినిమా, మీడియా రంగాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడం, బ్రాహ్మణుల పొట్టగొట్టడంకోసం కమ్మలే పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులను ఎగతాళి చేస్తూ సినిమాలు తీయడం.
ఈఫార్ములా ఆధారంగానే సినిమాల్లో ఎడాపెడా బ్రాహ్మణులపై సెటైర్లు వేయడం, సినిమాల్లో కమ్మ జమీందారీ వర్గాన్ని గ్లోరిఫై చేయడం, అక్కడి భాష, వీరి జమీందారీ అలవాట్లను ఎలివేట్ చేయడం, దానికోసం పక్కప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తెలంగాణ యాసలను, అక్కడి అలవాట్లను, అక్కడి ప్రజలను కించపరిచినట్లు సినిమాలు తీయడం.
ఈకమ్మ భావజాళ వ్యాప్తికి కమ్మ ఐకన్ త్రిపురనేని రామస్వామి చౌధరి ఎక్కువ ప్రచారం చేశాడు. ఆభావజాళవ్యాప్తి ఫలితమే ఎన్‌టీఆర్ అధికారంలోకి రావడం. ఈయన రుణం తీర్చుకునేందుకు ఎన్‌టీఆర్ త్రిపురనేని విగ్రహాన్ని ట్యాంకుబండుపై పెట్టాలనుకున్నాడట, అయితే ఒక్కడిదే పెడితే బాగుండదని తెలుగు వైతాళికులని కొందరి ఎంపిక చేసి విగ్రహాలు పెట్టి అందులో త్రిపురనేనిది కూడా కలిపేశాడు. ఆ విగ్రహాల్లో ఎక్కువ ఎన్‌టీఆర్ మొహంతోనే ఉంటాయనేది మరో విషయం.
కమ్మ మహాజనసభ భావజాళవ్యాప్తి ఫలితంగా ఇప్పుడు కమ్మలు సినిమా, మీడియా, పారిశ్రామిక, రాజకీయరంగాలలో సమైక్యాంధ్రలో ఆధిపత్యం వహిస్తున్నారు. వీటిద్వారా రాజకీయరంగంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్నారు. వీరు అన్నిపార్టీలలో చేరి ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తమదగ్గర అధికారం ఉండేలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణను అడ్డుకుంటుంది కూడా ఈశక్తులే. కారణం విడిపోతే అటు సీమాంధ్రాలోనూ, ఇటు తెలంగాణాలోనూ అధికారం తమకు దక్కదనే వీరి భయం.
ఆర్ధిక, రాజకీయరంగాల్లో వెనుకబడి అగ్రకుల బలహీనవర్గంలా తయారయిన బ్రాహ్మణులు ఇలా సినిమాల్లో హేళనకు గురవుతుంటే ఇప్పుడేం చేయాలి? ఇప్పటికైనా తాము ఏదో ప్రత్యేకవర్గం, హిందూ సమాజానికి తాము మెలు చేస్తున్నాం, తమమీద దాడులు మొత్తం హిందూ సమాజం మీద దాడి లాంటి భ్రమలను వదలాలి. వీళ్ళు అందరిలా ఒక సామాజిక వర్గం, దళిత బహుజనుల్లా ఇప్పుడు వీరు కూడా వివక్షకు గురవుతున్నారనే సత్యాన్ని గ్రహించాలి. తమను కించపరుస్తున్న వారిపై సంఘటితంగా పోరాడాలి, దానికోసం తమశక్తి సరిపోకపోతే దళిత బహుజన వర్గాలను కలుపుకుపోవాలి.
#ఇప్పటికైనా తాము ఏదో ప్రత్యేకవర్గం, హిందూ సమాజానికి తాము మెలు చేస్తున్నాం, తమమీద దాడులు మొత్తం హిందూ సమాజం మీద దాడి లాంటి భ్రమలను వదలాలి.
ReplyDeleteThought-provoking post and right points elevated, especially the above one!
తెలంగాణా కోరకు హిందువుల మధ్య కులపోరాటాలు పెడుతున్నావు ఉన్నవి లేనివి కల్పించి. ఎవరు నీవు? మిషనరీవా? కమ్యునిష్ట్ వా?
ReplyDeleteహిందువులు కులాలుగా విడిపోయి కోట్టుకుంటుంటే నీవు రాజ్యము చేయాలని చూస్తున్నట్లు ఉన్నావు. విభజించు పాలించు నీ సూత్రములా ఉంది. కులాలుగా విడిపోయిన హిందువులను నీవు ఈజీగా విడగోట్టవచ్చు అని అనుకుంటున్నట్లు ఉంది.
నీ ప్రాంతీయత (తెలంగాణా) కోసము వంద కోట్ల హిందువుల ప్రయొజనాలను నీవు ఫణముగా పెట్టగలవు. చాతనైతే కులాల మధ్య స్నేహాన్ని పెంపోందించు. కులాల మధ్య ఐఖ్యత తీసుకురా. ఇంకా చిచ్చు పెట్టకు.
వివక్ష చూపినవారిని శిక్షించడానికి చట్టాలు చాలా ఉన్నాయి.
@Anonymous1 November 2012 16:20
Deleteనేను మనిషిని. నాకు కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ తేడా లేదు. అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించడం నా అలవాటు. నిజాన్ని ప్రజలకు అందించడం నేను చేసే పని.
చిచ్చు పెట్టడం అంటే నీకు తెలిసినట్టులేదు. ఒకవర్గాన్ని ఎగతాళి చెయ్యడం, అడిగితే కొట్టడం చిచ్చుపెట్టడం, దాని ప్రశ్నించడం కాదు.
బాగా వ్రాశారు. lampooning and belittling a particular group or community is in bad taste. కానీ protest చేయటం civilised manner లో చేస్తే బాగుంటుందేమో. తెలబాన్ type of reaction is not good. cine folks should ponder over the distasteful portrayal of brahmin community. they should feel ashamed of themselves.
ReplyDelete@Anonymous1 November 2012 16:25
Deleteతెలబాన్ టైపంటే ఏమిటి? ఇంకా ఏవిధంగా ప్రొటెస్ట్ చెయ్యాలి వివరంగా చెబుతారా?
ayyaa
ReplyDeletemee uddeshyam purtigaa ardhamavutuMdi ? chinnapilllakukudaa
musugu tolagimchamdi daani avasaram ledu
దళిత బహుజనులతో వర్గాలతో బ్రాహ్మణులకు ఎమీ విభేదాలు ఉన్నాయండి. ఎమీ లేవు. అది దళితులకు తెలుసు. వాళ్ల తరపున కోర్టు కేసులు వాదించే కన్నాభిరాన్, బాలగోపాల్ మొద|| అంతా ఏ వర్గం వారు? తెలుగు బ్రాహ్మణులలో కవులలో శ్రీ శ్రీ ,వరవర రావు లాంటి వారు ఎందరో కమ్యునిజం వైపు ఆకర్షితులైన వారు, జీవితాతం అంకిత భావంతో పని చేసినవారు ఉన్నారు. కాకపోతే బ్రాహ్మణులకు పొలిటికల్ ఆంబిషియన్ (అధికారం ద్వారా డబ్బులను అడ్డదిడ్డంగా కుమ్మి పారేయాలనే ) కమ్మా, రెడ్డి వర్గాల వారికి ఉన్నంత లేదు. దానికి ప్రధాన కారణం బ్రాహ్మణులకు యం.యల్.ఏ. గా గెలిచినతరువాత ప్రజలకి ఎదైనా చేయాలనుకొంటారు, కాని గత 30సం|| ఆ రెండు వర్గాల రాజకీయ నాయకుల ఏకైక లక్ష్యం వారి వ్యాపారాలని అభివృద్ది చేసుకోవటం. అసెంబ్లికి వెళ్ళిన మొదలుకొని దానిని నడిపించకుండా అడ్డుపడటం, వాయిదా వేస్తే ఇంటికి పోవటం. అదేకదా వీరు చేస్తున్న పని. సిగ్గు అనేది వదిలేశారు. ఆ వర్గాలలో ఎంత సిగ్గు వదిలేస్తే అంత డబ్బులు సంపాదించవచ్చు, ఆడబ్బులను చూసి కులగజ్జి తో గొప్ప నాయకుడని వాళ్లకి ఫాలోయర్స్. వారిలో ఒక్క నాయకుడైన మంచి ఉపన్యాసం ఇవ్వగలడా? ఆ సత్తా ఉందా? ముఖ్యమంత్రి కే తెలుగు సరిగా రాదు. బాబు గారి తెలుగు సంగతి చెప్పనక్కరలేదు.
ReplyDelete@Anonymous1 November 2012 18:18
Deleteవిభేధాలు ఉన్నాయని నేననలేదు, కలుపుకొనిపోవాలని మాత్రమే అన్నాను. బాలగోపాల్, కన్నాభిరాన్, హరగోపాల్ లాంటి వారికి కులాలు అంటగట్టడం ఎందుకు?
*బాలగోపాల్, కన్నాభిరాన్, హరగోపాల్ లాంటి వారికి కులాలు అంటగట్టడం ఎందుకు?*
Deleteమీరొకటి గమనించాలి, చరిత్ర తిరగేయండి , దేశ స్వాతంత్ర సమయం నుంచి తీసుకొంటే నిస్వార్ధంగా(అబొవ్ కేస్ట్ అండ్ క్రీడ్) ప్రజలకొరకు పోరాటం చేసిన వారిలో ఎంతో మంది బ్రాహ్మణులు ఉన్నారు. బ్రిటిస్ తలారులు ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులే. అండమాన్ జైల్లో నరకయాతన అనుభవించిన 500 మంది స్వాతంత్ర పోరాటయోధుల్లో సగానికి సగంవారే. ఏ కులమో ఖచ్చితం గా తెలియని కృష్ణ దేవరాయలను మాకులం అని ఆయన లేగసి కొరకు పోరడుతూంటే, పాకులాడుతూంటే, అందరికి తెలిసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి కులం అంటగట్టటం మీకు ఎందుకనడం భావ్యంకాదు. వీరంతా కులా,మతాలకు అతీతంగా దేశం కొరకు పనిచేశారు అని, వారికి కులం అంట గట్టకుడదంటే ఇక చెప్పుకోవటానికి మాలో ఎవ్వరు పెద్దగా మిగలరు. కులాన్ని ఉద్దరించటమే పనిగా పెట్టుకొని ఎవరు ఇప్పటివరకు పని చేసినట్లు కనపడలేదు. ఆధునిక కాలంలో ఈ కులపిచ్చి దౌర్భాగ్యం చదువుకొన్న వారిలో, మరి ఇంత ముదురుతుందని కలలో ఊహించని, ఊహకు అందని విషయం .
బ్రాహ్మణుల మీద సినేమాతీసి జోకులేసుకోవాలి. అదే వారి మీద సినేమా తీయకుండానే ప్రజలకి ప్రతిదినం టి వి లో ఆన్ లైన్ కామేడి షోలుప్రజలకీ చూపిస్తున్నారు. మచ్చుకి కొన్ని కొంతకాలం క్రితం టి వి లో కొడాలి నాని, చంద్ర బాబు గారిని నోటికొచ్చినట్లు తిడుతూ ఒక కామేడి షో నడిచింది. రెండోది తారా చౌదరిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒపెన్ హార్ట్ విత్ ఆర్ కె అని ఇంటర్వ్యుచేస్తూ రాజకీయ నాయకుల తో సంబంధాలు అడిగితే రాయపాటి సాంబశివరావు,ఆయనతమ్ముడి కొడుకు,శంకర రెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు అంతా వాళ్ళొల పేర్లను వరుసగా ఆమే చెప్పింది. అదొక పెద్ద మెగాకామేడి షో. ఆమే చేసేవ్యాపారాన్ని ఎంత అమాయకంగా చెపుతుందో, రాధాకృష్న అంత అమాయకంగా ప్రశ్నిస్తూంటాడు. మూడో షో ఎడతెగనిది వేల కోట్లు మింగేసి తెచ్చిపెట్టుకొన్న అమాయకపు మొహం వేసుకొని ఓదార్పు యాత్ర. ఇంతటి ప్రత్యక్ష హాస్యాన్ని నెలల తరబడి ప్రజలకి అందిస్తూంటారు. అసలికి సదరు మోహన్ బాబు ఆయన కూతురికి రెండో పెళ్లిని, మొదటి పెళ్లికన్నా ఘనంగా జరిపిన చరిత్ర ఉంది. ఇంతటి కామేడి చరిత్ర కలిగిన వీళ్లు వాళ్ల పైన సినేమా తీసుకొంటే ప్రజలకి కొత్తదనం ఉండదని,బ్రాహ్మణుల మీద పిచ్చి జోకులు వేసుకొంట్టూ సినేమాలు తీస్తూంటారు.
ReplyDeleteసినేమాని సినేమా గా చూడటం అన్ని కులాల వారికన్నా బ్రాహ్మణులకు బాగా తెలుసు. ఎప్పుడైనా తమాషాగా చూపితే ఒకవిధం కాని అదే పనిగా సినేమా అంతా పూర్తి నిడివిగల పాత్రలు వారిపైన సృష్ట్టించి, సినేమాని నడిపి సొమ్ము చేసుకోవాలను కోవటం చెత్త వెధవలు చేసేపని. ఆపనిని ఇప్పుడు దాదాపు ప్రతి పెద్ద హీరో చేస్తున్నాడు. అదే రాష్ట్రాన్ని దోచుకొన్న వాళ్ల కులాల వారిని గొప్ప త్యాగధనులైనట్లు, సినేమాలో చూపించు కొంట్టున్నారు. మీరే ఒకసారి ఆలోచించండి, ఫేక్షనిజమే తప్పు, రాయలసీమలో ఫాక్షనిస్ట్ లు చేసే వెధవ పనులు అందరికి తెలుసు. కాని వారిని గ్లొరిఫై చేస్తూ సమరసిమ్హా రెడ్డి, నరసిహ్మనాయుడు అంట్టూ సినేమాలు తీసుకోలేదా? పోని ఈ రోజు మనం చూస్తున్న, వీరు చేసె వైట్ కాలర్ స్కాంలు వేల,లక్షల కోట్ల ప్రకారం వీరి పైన ఏటువంటి సినేమా తీయాలి , ఆ సినేమాకి ఏ పేరు పెట్టాలి? రాష్ట్రంలో గజదొంగలు పడ్డారు, ఆంధ్రా పిండారులు అని టైటిల్ పెట్టి తీయాలి .
ఇక సినేమాల లో వీరు డబ్బా కొట్టుకొనే ధైర్య సాహసాలు పచ్చీమధ్య యుగాల నాటి భుస్వామ్య వ్యవస్థని గుర్తుకుతెస్తాయి. అటువంటి వాటికి కాలంచెల్లిందని గ్రహించలేని అజ్ణనంలో పడి ఉంటారు. సినేమాలలో వీరేదో చాలా ధైర్యవంతులైనట్లు, పేదప్రజలను రక్షిస్తున్నట్లు వారి పైన డైలాగులు రాసుకొని, వంశం అది ఇది అని పోజులు పేడతారు కదా, మరి ఈ దేశం లో లక్షల కోట్ల స్కాంలు (2జి మొద||) జరిగినపుడు ఈ గొప్ప ధైర్య వంతులైన (డబ్బాకొట్టుకొనే)ఈ వర్గాలకు చెందిన వాడు ఒక్కడు ఇప్పటివరకు నోరు మెదపినట్లు ఎక్కడా చూడం. పిత్తిన ముత్తైదువులా కదలకుండా, మెదలకుండా కూచొని అధిష్టాన చెక్క భజన చేస్తూంటారు. మరి అటువంటి లక్షల కోట్ల స్కాములను బహిర్గతం చేసి,ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడేది ఏ అధికారం లేని బ్రాహ్మణ రాజకీయ నాయకులు సుబ్రమణ్య స్వామి, అరుణ్ శౌరి లాంటివారు. వాళ్లదగ్గర వీరి లాగా గుట్టలు గుట్టలుగా ధనంకూడా ఉండదు. వాళ్లు పోరాడితే వచ్చే డబ్బులు ఉండవు. సుప్రిం కోర్ట్ ఆ లైసేన్సులను రద్దు చేసేంతవరకు వారిపోరాటం గురించి వార్తలు కూడా రావు. అయినా నిస్వార్ధంగా వాళ్లు దేశ క్షేమం, ప్రజల క్షేమం కొరకు పని చేస్తున్నరు. మరి అధికారం,పదవులు అన్ని దగ్గర ఉంచుకొని ప్రజల డబ్బులను ఎవరు జౌరుకొంట్టున్నారో తెలిసిన విషయమే!
మొత్తానికి తెలంగాణా సమస్యకి మూలకారకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి అంటారా :)
ReplyDeleteకాబట్టి బ్రాహ్మణులు అంతా టాంక్బండ్ పై తెలుగు వైతాళికుల విగ్రహాలు కూలగొట్టడాన్ని ఖచ్చితంగా సమర్ధించాలి అంటారా :)
ఎవర్గం వారయినా తమ క్రింది వర్గం వాళ్ళ గురించి ఆలోచించడం, ప్రణాళికలు వెయ్యడం జరుగదు. కాబట్టి కారంచెడు గొడవలు కి మీరు చెప్పిన వ్యక్తులకి సంబంధం ఉండకపోవచ్చు.
తెలంగాణా సమస్యని ఇలాంటి వాదనలతో పలుచన చేసుకోకండి :)
@mauli
Delete/**మొత్తానికి తెలంగాణా సమస్యకి మూలకారకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి అంటారా :)**/
/**కాబట్టి బ్రాహ్మణులు అంతా టాంక్బండ్ పై తెలుగు వైతాళికుల విగ్రహాలు కూలగొట్టడాన్ని ఖచ్చితంగా సమర్ధించాలి అంటారా :)**/
నేనలా అన్నానా?
/**ఎవర్గం వారయినా తమ క్రింది వర్గం వాళ్ళ గురించి ఆలోచించడం, ప్రణాళికలు వెయ్యడం జరుగదు. కాబట్టి కారంచెడు గొడవలు కి మీరు చెప్పిన వ్యక్తులకి సంబంధం ఉండకపోవచ్చు.**/
చేస్తారు, అలా చెయ్యకపోతె కిందివడు పైకి వచ్చి వీల్ల ఆధిపత్యాన్ని పడగొదొతాడు. దీనికోసం ఒక పద్యం కూడా రాసుకున్నారు.
/**తెలంగాణా సమస్యని ఇలాంటి వాదనలతో పలుచన చేసుకోకండి :)**/
అన్నింటినీ తెలంగాణాతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అన్యాయం ఎవరికి జరిగినా నెను ఖండిస్తాను.
@విశ్వరూప్
Delete@నేనలా అన్నానా?
అవును. రామస్వామి చౌదరి లేకుంటే మీరు అసలు తెలంగాణా అడిగే వారె కాదు అన్నది కనిపిస్తోంది :)
@అన్నింటినీ తెలంగాణాతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అన్యాయం ఎవరికి జరిగినా నెను ఖండిస్తాను.
ముడి పెట్టి మరీ వ్రాసారు. ఖండించడం తో ఆపేసి ఉంటె బావుండేది :)
మీరు వ్రాసిన పద్దతి లో చెప్పాలంటే,
కొన్నాళ్ళ తరువాత KCR , తెలంగాణా పోరాటం చేసిన వారందరి గురించి మీరిప్పుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి చెప్పుకొన్నట్లే చెప్పుకొంటారు. అప్పుడు ఏమి జరిగనది అన్నది అప్పటి పరిస్థితులతో అన్వయించుకోవాలి కాని ఇప్పుడు మనకేది తోస్తే అది అనెయ్యకూడదు.
"కొన్నాళ్ళ తరువాత KCR , తెలంగాణా పోరాటం చేసిన వారందరి గురించి మీరిప్పుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి చెప్పుకొన్నట్లే చెప్పుకొంటారు."
Deleteరామస్వామి చౌదరికి కేసియార్ కి పోలికే లేదు. రామస్వామి చౌదరికి అప్పుడు సమాజంలో ఉన్న ఒక భావజాలనికి ప్రత్యామ్న్యయంగా ఒక ఫిలాసఫి/భావజాలన్ని ప్రతిపాదించినవాడు. కేసియార్ ఒఠి, పూర్తి కాలపు రాజకీయ నాయకుడు. మరి తెలంగాణా భావజాలం అనేది ఎప్పటినుంచో ఉంది, అది ప్రజలనుంచి వచ్చిన భావజాలం. దానిని కేసియార్ ఎమీ ప్రతిపాదించలేదు,ఆయన సిద్దాంత కర్త కాదు. ఆయనని ప్రజలు కొన్నేళ్ల వరకు గుర్తుంచుకొంటారని ఎలా అనుకొంట్టున్నారు. యన్.టి. రామారావుని ఎవరైనా ఇప్పుడు పట్టించుకొంట్టున్నారా? తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంటే పూర్తిగా మరచిపోయి ఉండేవారు. కేసియార్ ని ప్రజలు ఆదరించటానికి ఎన్నోకారణాలు ఉంటాయి. ఏ ఆంధ్రా రాజకీయ నాయకుడీతో (ఉండవల్లిని తప్పించి) పోల్చినా ఆయన మంచి వక్త, సమయస్పూర్తితో తెలుగు,ఉర్దు,ఆంగ్ల భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు.ఇతరులను ఆకట్టుకోగలడు. ఆయన నీతి నీజాయితిల గురించి తెలంగాణ ప్రజల కు కూడా తెలుసు. మీరేమి దిగులు చెందనవసరంలేదు. ప్రస్తుతం తెలంగాణ వారి వాణిని సమర్ధవంతంగా వినిపించగలిగే నాయకుడి అవసరం వారికి ఉంది. అందువలన తెలంగాణా వారు ఆయనని నాయకుడిగా గుర్తించారు.
arey mouli entra bhai ee message...burra dobbindaa
ReplyDeleteతెలంగాణా సమస్యని ఇలాంటి వాదనలతో పలుచన చేసుకోకండి
*తెలంగాణా సమస్యని ఇలాంటి వాదనలతో పలుచన చేసుకోకండి *
ReplyDeleteఅడగకపోయినా సలహాలివ్వటం మీ అహంకారం సూచిస్తున్నాది. మీ నాలుగు జిల్లా ఆధిపత్య వర్గం వాళ్ల అతితెలివి వికటించిందని ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
@విశ్వరూప్ అసలికి మీరు ఇంత సమాధానం ఆమేకి ఇవ్వనవసరంలేదు.
#ఇప్పటికైనా తాము ఏదో ప్రత్యేకవర్గం, హిందూ సమాజానికి తాము మెలు చేస్తున్నాం, తమమీద దాడులు మొత్తం హిందూ సమాజం మీద దాడి లాంటి భ్రమలను వదలాలి.
ReplyDeleteకరక్ట్ గా చెప్పారు..ఇంకా మురికి ఆలోచనల్తో కొట్టుకుపోకుండా....బ్రహ్మణులు స్ట్రీమ్ లైన్ లోకి వచ్చి ఇతరులను దూరం పెట్టడం మానాలి...అది మూర్ఖత్వం అని గ్రహిస్తే ..అదే పది వేలు...ఇక ఎవడి గుత్తాదిపత్యాలు చెల్లవు లెండి...అన్న వర్గాల్లో పైకి రావాలన్న తపన పెరిగింది...మేమే పోటుగాళ్ళం...అందరికంటే మేమే కమ్మగా సమ్మగా అని ఉంటాం అనుకునే రోజులు పోయాయి...చాలా కులాల వాళ్ళు చదువుల్లోనూ...ఆర్ధికంగా నూ పైపైకి పోతున్నారు....
ఈ caste based society ఎప్పటికైనా నశించాలనీ...మనుషుల్లా బ్రతకాలనీ ఆశిద్దాం..
@kvsv
DeleteWell Said!!
"బ్రహ్మణులు స్ట్రీమ్ లైన్ లోకి వచ్చి ఇతరులను దూరం పెట్టడం మానాలి..."
Deleteబ్రాహ్మణులు ఎవ్వరిని దూరంగా పెట్టింది లేదు. డిస్కషన్ & డిబేట్ చర్చల ద్వారా అందరిని కలుపుకుపోవటమనేది వారు మొదటి నుంచి అవలంభిస్తున్నపద్దతి. అందులోను భవిషత్ తరాలను దృష్ట్టిలో ఉంచుకొని, వారు నిర్ణయాలు తీసుకోవాలనుకొంటారు. లాభాలు ఉన్నా, తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొనే నిర్ణయాల వైపు పెద్దగా మొగ్గు చూపరు. తెలుగు సాహిత్యం లో ఎంతో మంది బ్రాహ్మణ రచయితలు వారి అభిప్రాయాలను,వాదనలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతీలో, పెద్దగా ఆర్ధిక లాభం లేకపోయినా రాస్తూంటారు. అదే మిగతా వర్గాల వారినుంచి రచనా వ్యాసంగాన్ని సీరియస్ గా తీసుకొని రాసే వారు తక్కువ. వారిలో ఎందుకు ఎక్కువగా రచయితలు రావటంలేదో వారు ఆలోచించుకోవాలి. ఎక్కువమంది రచయితలు వారి నుంచి రావాలి.
@వీరంతా కులా,మతాలకు అతీతంగా దేశం కొరకు పనిచేశారు అని...
ReplyDeleteవీళ్ళూ బ్రహ్మణులే..సొసైటీ గురించి పనిచేసారు అని చెప్పటం లో తప్పులేదనుకుంటా..
మరి అటువంటి లక్షల కోట్ల స్కాములను బహిర్గతం చేసి,ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడేది ఏ అధికారం లేని బ్రాహ్మణ రాజకీయ నాయకులు సుబ్రమణ్య స్వామి, అరుణ్ శౌరి లాంటివారు. వాళ్లదగ్గర వీరి లాగా గుట్టలు గుట్టలుగా ధనంకూడా ఉండదు. వాళ్లు పోరాడితే వచ్చే డబ్బులు ఉండవు. సుప్రిం కోర్ట్ ఆ లైసేన్సులను రద్దు చేసేంతవరకు వారిపోరాటం గురించి వార్తలు కూడా రావు. అయినా నిస్వార్ధంగా వాళ్లు దేశ క్షేమం, ప్రజల క్షేమం కొరకు పని చేస్తున్నరు. మరి అధికారం,పదవులు అన్ని దగ్గర ఉంచుకొని ప్రజల డబ్బులను ఎవరు జౌరుకొంట్టున్నారో తెలిసిన విషయమే!
ReplyDeleteడబ్బు పిచ్చ లేకపోవడమె బ్రహ్మణులు చేసుకున్న తప్పు.....బ్రహ్మణులు కూడా బాగా బలిసి ఉంటే వీళ్ళు ఇంత వీరంగాలు చేయగలరా??
ఒక్క సినిమాలోని హింసకే ఇలా అల్లరి పెడుతున్నారే??ఇలాంటి ఎన్ని సంఘటనలు తెలంగాణా వాళ్ళను ఈ నాటి పరిస్థితికి పురికొల్పి ఉంటాయో??అందుకే తెలంగాణా డిమాండ్ విషయంలో చదువుకున్న(ఉత్తరాంద్ర వైపు వాళ్ళు) చాలా మంది నిశ్శబ్ధంగా ఉంటారు...
ReplyDelete(రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటనే ..బొత్స మాటల్ని వక్రీకరించే సాలే గాళ్ళు ఉంటె ఉండవచ్చు గానీ....రాజకీయ లబ్ధి కోసమని..) రాష్ట్రం విడిపోవడమనే భాద తో వ్యతిరేకిస్తారు గానీ తెలంగాణా వాళ్ల ను కాదు...
...రాష్ట్రం విడిపోవడమనే భాద తో వ్యతిరేకిస్తారు గానీ తెలంగాణా వాళ్ల ను కాదు...
ReplyDeleteEe madhya kaalam lo nenu vinna 'a very sensible and accurate' statement.
Telangana supporters will bash these ppl also and loosing their support.
I like to support Telangana, but I don't want to support to the movement the way it is now.Period.
"ఏవర్గం వారయినా తమ క్రింది వర్గం వాళ్ళ గురించి ఆలోచించడం. ప్రణాళికలు వెయ్యడం జరుగదు."
ReplyDeleteఈ మాటలను నమ్మటానికి పంగనామాలు పెట్టుకోలేదు. పై మాట ఏ వర్గానికైనా వర్తిస్తుందేమోగాని, ఆ నాలుగుజిల్లాల ఆధిపత్య వర్గానికి కాదు. వాళ్ల దారే వేరు. వారికి ఎప్పుడు వాళ్ళోళే అధికారంలో ఉండాలి. పోని వీరు అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలు నడుపుతారా అంటే అది లేదు. మొదటిసారిగా రెండు మంత్రి పదవులు కాపులకిస్తే ఎంత గలభా చేశారు? ఇతర వర్గాలను కలుపుకొని పోవటంలో రెడ్లు ఎంతో బెటర్. వారు రాజకీయాలలో ఎంతో కాలంగా కొనసాగుతున్నా ప్రజలలో వారి పైన వ్యతిరేకత, వీరి మీదున్నంత ఎమీ లేదు. అదే పదేళ్ళనుంచి అధికారంలో లేకపోయినా, వీరి మీద ప్రజలలో సదభిప్రాయం లేదు. రాయలసీమ, తెలంగాణాలలో ఎంతో మంది రెడ్లు ఎప్పటినుంచో యం.యల్.ఏ. లుగా గెలుస్తు, అధికారంలోకి వచ్చారు. కాని అక్కడేక్కడా కోస్తా జిల్లాలలో మాదిరిగా కులగజ్జి లేదు.
కావురి గారి కామేడి షో!
ReplyDeleteఈ రోజు కావురి గారు గావు కేక పెట్టాడు . ఆంధ్రజ్యోతి నుంచి
"కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కావూరి సాంబశివరావు లో అగ్రహం, అసంతృప్తి, ఆక్రోశం... మరింత బలంగా గూడుకట్టుకుపోయాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడం తన అనుభవాన్ని, సమర్థతను అవమానించడమే అని ఆయన భావిస్తున్నారు. తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఐదు రోజుల కిందట రాసి న లేఖపై అధ్యక్షురాలు సోనియా కనీసం స్పందించకపోవడంతో.. బుధవారం మరో అడుగు ముందుకు వేశారు. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తనకు స్థా నం దక్కక పోవడంతో మనస్తాపం చెందిన కావూరి తన ఆవేదననంతా వెల్లడిస్తూ సోనియాకు లేఖ రాశారు. అయితే, సోనియా కానీ, అధిష్ఠానంలోని పెద్దలు కానీ దీనిపై స్పందించలేదు. కనీసం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆజాద్ కూడా కావూరితో మాట్లాడలేదని స మాచారం. "1985లోనే ఏఐసీసీకి సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. ఆనాడు చిదంబరంకంటే నా పేరు ముందుండేది'' అని నాటి ఉత్తర్వుల ను కొందరు నాయకులకు చూపించారు. అప్పట్లో తనకంటే ఎంతో కింద ఉన్న నాయకులు కూడా ఇప్పుడు కేంద్ర సీనియర్ మంత్రులు, అధిష్ఠానం పెద్దలు అయిపోయారని.. తాను మాత్రం ఇంకా మంత్రిని కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 'పార్టీ పదవులకు తప్ప ప్రభుత్వ పదవులకు నా అనుభవం సరిపోదా?' అని అసంతృప్తి ప్రకటించారు."
********************************************
కావురి గారు చెప్పనిది పి వి నరసిమ్హారావు హయాంలో ఆయన కాంగ్రేస్ పార్టి నుంచి బయటికి వేళ్ళాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు. సారుకి, సొంత వ్యాపారం మీద ఫోకస్ ఎక్కువ. అందువలన పార్టి కూడా ఆయన వ్యాపారభివృద్దికి దోహదపడింది. పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలలో చాలా భాగం ఆయన వ్యాపారాభివృద్దిని దృష్ట్టిలో ఉంచుకొని వేసేవాడు. సంపాదించుకొన్నంత సంపాదించుకొని, ఇప్పుడు మళ్ళీ పదవులు కావాలంటే అక్కడ కుప్పలుగా పోసిలేవు. మీరు చాలా తమాషా వేషాలు వేస్తూ ప్రజలకి చెవులో పువ్వులు పెడుతున్నారు. మొదట కులం పేరుతో సీట్లు తెచ్చుకొనేది, ఆ తరువాత మీలో మీరే పై పైకి కొట్టుకొని వర్గాలుగా మారి నేనా వర్గం, నేను సీనియర్ అని వేషాలు వేస్తూ వేరు వేరు దారులలో, వివిధ కారణాలతో మంత్రి పదవులు కావలనేది. మంత్రి వర్గ గరిష్ట్ట సంఖ్య పైన కోర్ట్ తీర్పులు కూడా ఉన్నాయి. ఒక్క వర్గమోళ్లకే పదవులన్ని కట్టబేడితే మిగతావారు నోట్లో వేలు వేసుకొని కూచోవాలా?
కావురి గారు మీసేవలను అధిష్టానం ఎంత గుర్తించి, గౌరవించిందో, డిల్లి గల్లీలలో మీకు గల పేరు ప్రఖ్యాతులు మాకు బాగా అర్థమయ్యాయి. మీలాంటి వారి వలన ఆంధ్ర రాజకీయ నాయకులకు డీల్లీ లో కొద్దిగా కూడా విలువలేదు. దయచేసి ఇకనైనా రాజకీయాల నుంచి తప్పుకోండి, మీ కిష్టమైన వ్యాపారం చేసుకొండి. ప్రజాసేవచేయటనికి దేశంలో ఎంతో మంది ఉన్నారు. మీరు లేకపోతే ఎమీ నష్ట్టంలేదు. పార్టిలో ఎంతో సీనియార్ అని చెప్పుకొంట్టున్న మీకు, గడ్డిపోచ అంత విలువలేదని, పార్టిలో ఉంటే ఉండూ, పోతే పో! నీ ఇష్ట్టం అని, అధిష్టానం చెప్పకనే చెప్పారు. పేపర్ వాళ్ల దగ్గర ఆవేదన వేళ్లగక్కు కొంట్టు అధిష్టాన వర్గానికి సందేశాలు పంపించే కార్యక్రమం ఆపండి. మీదే ఆలస్యం ఎంత త్వరగా కాంగ్రెస్ నుంచి బయటపడితే ఆపార్టి కొంత బాగుపడుతుంది.
సాధారణంగా సెలబ్రిటీ లు వివాదాస్సద అంశాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. వారు మాట్లాడింది వివాదంగా మారితే చెప్పలేం కానీ, అల్రెడీ వివాదంగా కూర్చున్న వాటి గురించి మనోళ్లు కామెంట్స్ చేయరు. అయితే ఇందుకు భిన్నంగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ వివాదాస్పద ‘ ఏ విమెన్ ఇన్ బ్రహ్మణిజం’ సినిమా గురించి మాట్లాడింది. ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. మంచు లక్ష్మీ కామెంట్లు చాలా మందికి మండేలా ఉన్నాయి…ఆ సినిమా ప్రోమోలు చాలా నీచంగా ఉన్నాయని, పక్క బూతు సినిమాను ఒక కులానికి ఆపాదించడం తగదని అందరూ అంటున్నాయి. అయితే ఆ ప్రోమోల్లో అభ్యంతరం చెప్ప తగినది ఏమీ లేదని మంచు లక్ష్మీ అంటోంది. దాదాపు పోర్నోగ్రఫీ అనదగ్గ ‘బ్రహ్మణిజం’ సినిమా గురించి లక్ష్మీ మాట్లాడుతూ…’ఫోర్నోగ్నఫీ ఇప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్. దీనికి సంబంధించి అనేక మంది మాట్లాడుతున్నారు, అనేక సర్వేలు సాగుతున్నాయి. ప్రతి సెకనులోనూ ప్రపంచంలో ఏదో ఒక మనిషి ఫోర్నోగ్రఫీని చూస్తున్నాడు. అలాంటప్పుడు సినిమాలో దాన్ని చూపడంలో తప్పు ఏముంది?’ అని మంచు ఆడబిడ్డ కొశ్చన్ చేసింది.
ReplyDeleteభారతీయులు సన్నీ లియోన్ వంటి పోర్నోస్టార్ ను మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటి వారు ఒక సినిమాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని లక్ష్మీ ప్రశ్నించింది. ‘మనం అధునాతన ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉండాలి…’అని ఆమె సలహా ఇచ్చింది. ‘ఈ రోజు వరకూ తెలుగులో ఎన్నో బీ-గ్రేడ్ , కామెడీ సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిని చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏదో ఒక కుల, మత ప్రస్తావన ఉందని, ఒక సినిమాను అడ్డుకోవడం భావ్యం కాదు…’అని తేల్చేసింది లక్ష్మీ మరి ఆమెను సమర్థించవచ్చా?
http://teluguzoom.blogspot.in/2012/11/manchu-laxmi-porno-graphy-lessons.html
బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు
ReplyDeletehttp://tinyurl.com/bc235xc
@a2zDreams,
మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసే అవకాశం లేదు గాబట్టి ఇక్కడ
రాస్తున్నాను.
ముందరగా బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు అని సరికొత్త నిజం కనుకొన్నందుకు అభినందనలు. పిచ్చి వాగుడు వాగిన మోహన్ బాబుకు , మొదటి పేరాలోనే క్లీన్ చిట్ ఇస్తూ రాసిన మీబ్లాగును చూసి, తెలుగులో మతిస్థిమితం లేని వాళ్లుకూడా బ్లాగులు రాస్తున్నారని తెలుస్తున్నాది. సినేమాలో ఉన్న కొన్ని దృశ్యాలపైన సేన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపితే ఆమేని ఏవిధంగా ఒత్తిడి చేసాడో, బెదిరించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొన్నాడో టి వి లో చూసాం. అటువంటి వాటిని పట్టించుకోకుండా రచయితల మీద తప్పు తోసేద్దామని ప్రయత్నిస్తారా? ఇదే జవాబు మోహన్ బాబు ని కోర్ట్ లో ఇవ్వమను చూద్దాం.ఎంత వరకు నిలుస్తుందో?
యువ బ్రాహ్మణులు మోహన్ బాబు ఇంటి పైకి వెళ్ళడం తప్పు. ఎలా ? నిరసనలు తెలిపేవారంతా ఎలా తెలుపుతున్నారో తెలుసుకో! వాళ్ళు ఆయన ఇంటికి వరకు కూడా వేళ్ళలేదు. ఇంటికి సుమారు 150-200 మీటర్ల దూరంలో ఉంటే వెళ్ళి కొట్టారు. మరి మీ హీరో మొహన్ బాబుగారి కూతురు ప్రేమలో పడి, నచ్చిన బాయ్ ఫ్రెండ్తో విజయవాడకి వెళ్ళిపోతే, మోహన్ బాబు గారు ఆ అబ్బాయి వాళ్ళింటికి వేళ్ళి, గ్రిల్స్ లాగి, కనిపించినవాడి పై ఎగురుతూ వీరాంగం చేశాడు. మీ అమేరికా రూల్ ప్రకారం కలెక్షన్ నిల్ గారిని మంచు లక్ష్మి మొదటి భర్త ఇంటివాళ్ళు, రౌడీ వేషాలు వేసిన హీరోగారిని ఎమీ చేయాలి? కాల్చేయొచ్చంటారా?
పైన వ్యాఖ్యను చదవండి . మంచు లక్ష్మి పోర్నో గ్రాఫిని సమర్ధిస్తూ మాట్లాడింది. మీ అమేరికాలో ఆడావాళ్లు దానిపైనా అలా బహిరంగం గా మాట్లాడుతరేమో కాని , మాదేశం లో సంసారపక్షం గా ఉండే స్రీలు (పిల్లాపాప,అమ్మానాన్న, అత్తామామ,మరిది,ఆడపడచు ఉన్న వారు ) అలామాట్లాడరు. అంతెందుకు సాని వాళ్ళుకూడా అలా టి.వి. ముందుకువచ్చి సినిమాలో పోర్నోగ్రాఫి చూపితే తప్పేమిటి అని మాట్లాడారు. ఆమే లిబరల్,సెక్యులర్, పోగ్రెసివ్, ఫెమినిస్ట్ భావాలుగల అమేరికా మహిళ అని మీరనవచ్చేమో,మరి తమ్ముడు ఫ్యూడల్ భూస్వామిలాగా రౌడి మూకలతో మనుషులను రాత్రిపూట కొట్టిస్తే, ఆమే ఇప్పటివరకు ఎక్కడా ఇలా చేయటం తప్పు అని ఖండించిన పాపాన పోలేదేమిటి? అక్క లిబరల్- తమ్ముడు ఫ్యుడలా?
*మీరు నాతొ ఏకీ భవించవలసిన అవసరం లేదు. ఇది చదువుతున్నారంటే, మీరు పిచ్చ ఖాళీగా వున్నారని అర్ధం. చాలా సెన్సిటివ్ మేటర్ కాబట్టి ఇక్కడ చదివి ఇక్కడే మర్చిపోండి*
నీతో ఏకీభవించటానికి మేము నీలాగా, మోహన్ బాబు కుటుంబం లాగా మతిస్థిమితం ఎవరు కోల్పోలేదు. వెధవటపారాసింది కాకుండా, మళ్ళి చదివినవారు పిచ్చ ఖాళిగా ఉన్నారని అంటారా?? అంత సెన్సిటివ్ మేటర్ అయితే నోరు పారేసుకోవటం ఎందుకు? రాసిందంతా రాసి చివరికి చదివిన వారు పని పాటలేని వారు అనేబదులుగా మీరు రాయకుండా ఉండవచ్చుగదా! రాసేరే పో మళ్ళి దానిని కూడలి లో పబ్లిష్ చేయట మెందుకు?
ఈ టపాలో నువ్వు చెప్పాలనుకొన్నది మొహన్ బాబు తప్పు ఎమీలేదు, ఆ రిమేక్ సినేమాకు మాటలు రాసింది బ్రాహ్మణులే కాబట్టి వారిదే తప్పు అని బోడి లాజిక్ పీకబోయావు, అది విజయవంతం కాలేదు.
చాకిరేవు బ్లాగు - మంచు మంచి కరుగుతోంది
ReplyDeletehttp://tinyurl.com/cnthvzb
@కిరణ్,
కామేడి కిరణ్, నువ్వు ఏ కులమైతే ఎమీటి గాని, నువ్వు సినేమా ప్రేమికుడివి, సినేమా చూశావు. అంతటితో ఆపు. అంతే గాని మోహన్ బాబు తరపున వకాల్తా పుచ్చుకొంట్టు రాసిన ఈ రాతలేమిటి?
"I am saying don’t point fingers only to Mohanbabu family.
First mistake is not from Mohanbabu’s side. But later he commented badly.
He is short tempered. He gets easily provoked by others. But he commented only those who protested not entire Brahmin community. Mohanbabu’s children are hard workers. Surely they will get success. No body can stop them by these cheap tricks"
ఎవరా ఆయన మీద చీప్ ట్రిక్స్ ప్లే చేసేది. అసలికి ఆయనతో మాకేమిటి సంబంధం? ఆయన ఎమైన బిజినెస్ కాంపిటేటరా? సినేమా తీసుకొని వ్యాపారం చేసుకొనే వారితో అర్చక వృత్తి చేసుకొనే వారికి ఎమైనా పోటి ఉందా? మోహన్ బాబు పిల్లలు హార్డ్ వర్కర్స్ నాలుగు డబ్బులు సంపాదించుకొంట్టుంటే మేమేమైనా ఏడ్చామా? ఆయన టాటా బిర్లా,అంబాని లంత డబ్బులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నా కుళ్ళు కొనే స్వభావం బ్రాహ్మణులకు లేదు. కావాలంటే గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్లో అక్కినేని నాగేశ్వర రావు 88వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి యం.బి.యస్. ప్రసాద్ ఎంత పాసిటివ్ గా వ్యాసాలు రాస్తున్నాడో చూడు. ఆయన రాసిన కోణంలో నాగేశ్వర రావు పిల్లలు కూడా అటువంటి విధంగా రాయలేరు. అర్హతను,సామార్ధ్యాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రతిభను గుర్తించి గౌరవించేది ఎక్కువగా బ్రాహ్మణులే. అదే మీవాళ్ళు డబ్బు,అధికారం ఉన్నన్ని రోజులు నెత్తినేక్కించుకొని అవసరం తీరాక ఒక్కతోపు తోస్తారు. చచ్చిన కూడా లేక్క చేయరు. డబ్బులు, అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర ఒదిగిళ్ళు పడి ,గులాంగిరి చేస్తూ పక్కన వారిపై దాష్టికం చేస్తూ పెద్ద పోటుగాళ్ల లా ప్రవర్తిస్తారు. యన్.టి.ఆర్. విషయం లో అందరు చూసారు. ఎన్నికలలో రామారావు గెలిచినపుడు నిశబ్ద విప్లవకారుడు అంట్టు చెక్క భజన చేసిన ఆ ఇద్దరుసోదర రచయితలు బాబు అధికారంలోకివస్తే ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసు. నీకు ఎన్ని ఉదాహరణలు కావాలంటే అన్ని రాయగలను.
ఏవరైనా కొంచెం పైకి పోతుంటే ఏడ్చే వర్గాలు ఎవో ఆంధ్రాలో అందరికి తెలుసు. కాపులకు రెండు మంత్రి పదవులు అదనంగా ఇస్తే గలభాచేయలేదా?
1 Movie story writer and dialog writer are Brahmins.
2 Most of the actors are Brahmins.
3 Mamchu Lakshmi’s husband is a Brahmin.
How can Mohanbabu family responsible for this? First few days no controversy. After becoming hit then some dirty and jealous people started this controversy.
విష్ణు పెద్ద మేగాస్టార్. ఆయన సినేమాని మొదటి రోజే ఆంధ్రా జనం వెళ్ళి చూస్తారన్నమాట. ఇంతకి ఆయన భర్య చూసిందేమో కనుక్కో!
అసలికి ఎమీతెలివయ్యా నీది? ఈ వ్యాఖ్యను నా బ్లాగులో రాసి ఉంటే, ఈ మాట చూసి రీసైకిల్ బిన్ లో వేసేవాడిని. ఈ మాట కోర్ట్ లో మోహన్ బాబు లాయర్ చెప్పలేకపోయాడా? ఏ వాదోపవాదాలు జరగకుండానే గుడ్డిగా కోర్ట్ నిర్మాత,దర్శకుడు, బ్రహ్మానంద ల మీద పోలిసు కేసు రిజిస్టర్ చేసేయమంట్టుందా? ఒకసారి ఆలోచించు. నువ్వు భలే కామేడివి కిరణ్.
మంచు లక్ష్మి భర్త బ్రాహ్మణుడు, వై.యస్. అల్లుడు బ్రాహ్మణుడు అని చుట్టరికాలు కలుపుకొని, చక్కలు గుద్దుకోనే దుగ్ద బ్రాహ్మణులకి లేదని తెలుసుకో! సంస్కృతి, సభ్యత, నలుగురి తో కలసి మెలసి ఉండటం ,ఇతరులను గౌరవించటం తెలియని వారిని, వారిదగ్గర ఉన్న అధికారం,డబ్బులు చూసి నెత్తిన పెట్టుకొంటారని అనూకోకు.
Chennai Brahmins Back Mohan Babu!
ReplyDeletehttp://greatandhra.com/viewnews.php?id=41813&cat=1&scat=4
తుప్పుపట్టిన భూస్వామ్య బాబాయిల వ్యుహాలను అనుసరిస్తున్న మోహన్ బాబు!
ఈ రోజు చెన్నై బ్రాహ్మణులు మోహన్ బాబు కు మద్దతు ఇచ్చారని వార్తలను చదివిన తరువాత, ఎప్పుడో చిన్నపుడు చూసిన ఆర్.నారయణ మూర్తి సినేమా గుర్తుకొచ్చింది. యజమాన్యానికి కార్మికులకు తగవులు పడతాయి. కార్మికులు సమ్మెకు దిగుతారు. యజమాన్యం బయట ఊరి నుంచి వేరే పని వారిని పనికి తీసుకువచ్చి పని నడిపించాలనుకొంటారు. లోకల్ కార్మికులు బయట వారిని కార్మికులుగానే గుర్తించరు. మిగతా సీన్ అందరికి ఈపాటికి అర్థమైపోయి ఉంట్టుంది. విషయానికి వస్తే, మోహన్ బాబు ఇదే వ్యూహం అనుసరించాడు. చెన్నై, తిరుపతి నుంచి ఎవరో తనకి మంచి పరిచయం ఉన్న నలుగురు బ్రాహ్మణులని తీసుకొని వచ్చి, వారితో టి వి కేమేరాల ముందు మాట్లాడించి తన వ్యుహాన్ని సమయానుకూలంగా అమలు చేయాలనుకొన్నాడు. కాకపోతే ఆంధ్రా బ్రహ్మణులు పట్టించుకొన్నటులేదు.
బాబు మోహన్ బాబు, మీ భుస్వామ్య టెక్నిక్ లకు ఎప్పుడొ కారంచేడు సంఘటనతో నే కాలం చెల్లిందనే సంగతి కూడా తెలిసినట్లు లేదు. ప్రస్తుతం సమాజాంలో అట్టడుగు వర్గాల వారిలోనే సామాజిక చైతన్యం పూర్తి స్థాయిలో వెల్లి విరుస్తూంటే, అంతో ఇంతో చదువుకొన్న వారు ఉన్న బ్రాహ్మణులలో ఇంకెంత చైతన్యం ఉండాలి? మీరు ఈ రోజు వేసిన డ్రామ మాకు అర్థం కాలేదనుకొంట్టున్నారా? మీరు ఏ రోజుల్లో ఉన్నారు? ఏ లోకం లో ఉన్నారు ?
ప్రస్తుతం మనం డిజిటల్ యుగం లో ఉన్నాం అన్న సంగతి మీకు తెలిసినట్లు లేదు. మీరు వ్యాపారాభివృద్దికైతే సమయానుకూలంగా కొత్త టేక్నాలజిని ఉపయోగించి సొమ్ము చేసుకొని లాభపడుతున్నారే , మరి అదే టేక్నాలజి వలన ప్రజలలో వచ్చిన మార్పులు గ్రహించకుండా, పాత కాలపు భుస్వామ్య వర్గాల వారిలాగా, టి వి కేమేరాల ముందు దౌర్జన్యం ఎలా చేస్తారు? అది ఒక నిరాత (వ్యాపారస్తుడి) అయిఉండి. ఇది పద్దతి కాదు. నువ్వు నీ పద్దతి మార్చుకోవాలి. రేదో హైదరాబాద్ లో నలుగురు ఊరుపేరు లేనివారిని కొట్టామనుకొంట్టున్నావు. కాని ఈదృశ్యాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరు చూశారు. ఇండియా టుడే లాంటి ఆంగ్ల పత్రికలలో కూడా ,నీ సినేమా పైన అభ్యంతరాల గురించి వార్తలోచ్చాయి. ఈరోజు అది మీరను కొన్నంత చిన్న సంఘటన కాదు. మసి బూసి మారేడుకాయ చేయటానికి.దెబ్బలు తిన్న వారికి పేరు ప్రఖ్యాతులు లేక పోవచ్చు. వారేవరో కూడా జనానికి తెలియక పోవచ్చు. కాని ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తం గా నేడు మీ పరువు పోయింది. ముందు అది తెలుసుకోండి. ఇక నైనా వెర్రి మొర్రి వేషాలు ఆపండి.
************************************
విష్ణు,
పట్టుమని 30సం|| ఉండవు నీకు, నువ్వు టి వి కేమేరాల వైపు చూసి రెచ్చిపోతావా? చిన్నపటినుంచి మేట్రొ సిటిలలో (చెన్నై),పెద్ద బడులలో, ఎన్నో భాషల వారి మధ్య చదువుకొన్న నీలాంటివాళ్ళకి, ఎక్కడ నుంచి ఈ భూస్వామ్య బుద్దులు, రౌడి గుణాలు వస్తాయి? వాటిలో అవి నేర్పరే? మీకేమైనా హైదరాబాద్ రావటం, ఆ బుద్దులు నేర్పటానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయా? అంత నోరూ, రెచ్చిపోయే వాగుడు ఎలా వస్తుంది? అదేకాదురోయ్! నువ్వు పరుచూరి బ్రదర్స్ పిచ్చి సినేమాలు మరీ ఎక్కువగా చూసినట్లు ఉన్నావు. మీ ఇంటిమీద మీరే రాళ్ళు వేసుకొని, మీ ఇంటి అద్దలాను మీరే పగుల గొట్టుకొని, మీ మనుషులకు మీరే గాయాలు చేసి, ఎదుటి వారు చేశారని ఆరోపణలు చేస్తావా? టి వి కేమేరాలలో మొత్తం రికార్డ్ అయిందికదా! రేపు ఒక గట్టి లాయర్ కేసు టేకప్ చేస్తే ఎలా వుంట్టుందో ఊహించుకో. జైలో కొన్ని రోజులు కాలక్షేపం చేసి, మీ శ్రీవిద్యా నికేతన్ స్కూల్ కి ఏ మొహం పెట్టుకొని పోతావు? తండ్రి కొడుకుల ఆగడాలు చూసి పిల్లల అమ్మానాన్నలు జడుసుకొని, మీస్కులో పిల్లలను చేర్పించటానికి కూడా ముందుకు రారు.
Srinivas
చివరిగా ఒక్క మాట మీరింకా భూస్వామ్యుల బుద్దులు వదులుకోలేకపోతున్నట్లున్నారు. మీరు, మీ బాబులు తెలుసుకోవలసింది, ప్రస్తుతం మీరెంత మాత్రం ఇక భూస్వాములు కారు. మీరేప్పుడో వ్యాపారులు గా అవతరించారు. వ్యాపారం చేసుకొనే వారు, ప్రొఫేషనలిజంతో వ్యాపారుల మాదిరిగా అనవసర వివాదాలకు పోకుండా ఉండాలి. అవసరమైతే వైశ్యులను చూసి నేర్చుకొండి. ఇలా రౌడి ఇజం చేయటం మొదలు పేడితే పేరు ప్రఖ్యాతులు,సంపద పోగొట్టుకోవటమేగాక,సమాజానికి, బంధు మిత్రులందరికి తలవంపులు తెచ్చి, భారంగా తయారౌతారు.
ReplyDeleteSrinivas
ఆ నా చెత్త పోస్ట్ వెనుక !!!
ReplyDeletehttp://tinyurl.com/bxof3z6
"అది చదివి ఈ బ్లాగర్ పై బాడ్ ఒపీనియన్ వస్తుందని తెలిసి కూడా…"
@kvsv,
నీకా భయం అక్కరలేదు. నువ్వు ఇటువంటి టపాలు ఒక వంద రాసిన నీకు చెడ్డ పేరు రాదు. ముందర నీబ్లాగు చదివితే కదా నిన్ను పట్టించుకోవటానికి. ఎందుకంటే బ్లాగులు రాయటం,చదవటం వలన డబ్బులు రావు. అందువలన ఆ వర్గం వాళ్ళు ఇటువంటి పనులు చేయరు. వాటిని లైట్ తీసుకొంటారు.
అయితే నీకొక అనుమానం రావచ్చు, తెలంగాణా అంశంపైన వాళ్ళు ఊగిపోతుంటారే? అని, ఆ ఒక్క అంశానికి వారు ప్రతిస్పందించేది. ఎందుకంటే, ఇప్పటివరకు అధికారం అండతో కూడబెట్టిన సంపద విలువ, ఎక్కడ మాయమైపోతూందో అనే భయంవలన మాత్రమే. అయినా ఇప్పుడు భయటపడుతున్న స్కాం ల వలన అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా! బాబులు వ్యాపారం చేసి సంపాదించిందాని కన్నా, బినామి లు గా ఉండటంవలన ఎక్కువ వేనకేశారని. కష్ట్టపడకుండా ఉచితం గా వచ్చిన డబ్బు. అదెక్కడపోతుందో అని రెండింతలు భయం. అందువలన తెలంగాణకు వ్యతిరేకం.
సున్నితత్వం, సమస్యను సమస్యగానే చూడటం, ఇతరుల మనోభావాలను గుర్తించి, గౌరవించటం అనేవి వారి నిఘంటువులో ఉండదు. ఏ సమస్యనైనా డబ్బు కోణం లో నుంచి మాత్రమే చూసి, మనకి ఆర్ధికంగా లాభమా ? నష్టమా? అని బేరిజు వేయటం ,అందులోనే పరిష్కారం వెతుక్కొవటం ఒక్కటే వారికి తెలిసిన జీవన విధానం.
Srinivas
ల్యాంకో, జీఎంఆర్‌పై ఎందుకంత ప్రేమ? దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకుంటారా లేదా?
ReplyDeleteస్పందించకుంటే గ్యాస్ రద్దు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక
http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/nov/10/main/10main6&more=2012/nov/10/main/main&date=11/10/2012
హైదరాబాద్, నవంబర్ 9: ల్యాంకో కొండపల్లి రెండో దశ, జీఎంఆర్ తనీర్ బావి కంపెనీలపై ఎందుకంత ప్రేమ? వారి నుంచి నియంత్రిత ధరకు ఎందుకు కరెంటు కొనడంలేదు? దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకోవడంలేదు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసింది. ఆ రెండు ప్రాజెక్టులతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటారా? లేక... వాటి గ్యాస్ కేటాయింపులు రద్దు చేయమంటారా? అని హెచ్చరించింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలులో ఒక యూనిట్ విద్యుత్‌ను 5.50 రూపాయలతో కొనేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ) అనుమతించగా... ల్యాంకో కొండపల్లి-2 నుంచి యూనిట్‌కు రూ.5.70, జీఎంఆర్ తనీర్ బావి నుంచి రూ.5.60లతో ఎలా కొంటారని నిలదీసింది.
*****************************
బాబులు బినామి లు గా ఉండటం వలన వెనకేసారని అన్నానోలేదో ఈ వార్త కంటపడింది. బహుశా వీళ్ళిద్దరు (ల్యాంకో , జీఎంఆర్ ) కూడా బినామీలు అయి ఉంటారు. అందువలననే కేంద్రం వీరి పైన ప్రేమ చూపుతూండవచ్చు.
ఒంటరిగా పోరాడుతున్న మోహన్ బాబు
ReplyDeletehttp://tinyurl.com/chgq6r5
@a2z dreams,
మొగుడిని కొట్టి మొరపెట్టిందని ఒక సామేత ఉంది. అలా ఉంది మీటపా పేరు. అసలికి ఇక్కడ మోహన్ బాబు చేస్తున్న పోరాటమేమిటి? కొంట్టించి ఇంట్లో కూచున్నాడు. ఆయన తరపున వకాల్తా తీసుకొన్న సినేమా పరిశ్రమ పెద్దలు దెబ్బలు తిన్న వారిదే తప్పనట్లు, ఇళ్లమీదికి పోకుడదు, సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేయాలని పై పై మాటలు మాట్లాడారు. అన్యాయం గా కొట్తించిన మోహన్ బాబును ఎవరు, ఎక్కడా,చిన్న తప్పు కూడా పట్టలేదు. మీరు పదే పదే సినిమాకు పనిచేసిన రచయితలందరూ బ్రాహ్మణులే అని అనటంలో ఔచిత్యం కనపడటంలేదు. సినేమా పరిశ్రమలో రచయితలకి ఉన్న స్వేచ్చా తెలిసిందే. ఆమధ్య తనికెళ్ళ భరణి ఇంటర్వ్యులో రచయితల గురించి చెపుతూ వాళ్ళది ఆఖరు స్థానం, గుమస్తా లాంటివాడని చెప్పాడు. హీరొ,నిర్మాత,దర్శకుడు మొద||వాళ్ళు చెప్పింది విని చేయటమే రచయిత పని. రచయిత కంట్టు ఏ స్వంత అభిప్రాయం ఉన్నా, దానిని అమలు చేయలేరు, అలా పట్టుపట్టే సీన్ లేదు, ఎక్కువ చేస్తే రచయితనే మార్చేస్తారు అని చెప్పాడు. అది రచయితలకున్న స్థానం. ఈ సినేమాకి ప్రాథమికంగా బాధ్యత వహించవలసింది నిర్మాత,దర్శకుడు, బ్రహ్మానందం, అందువలననే కోర్ట్ వీళ్ల పైన కేసులు నమోదు చేయమంది.
ఇప్పుడే కాదు ఇంతక్రితం కూడా అదిరింది అల్లుడు అని ఒక సినేమా తీశాడు. అప్పుడు బ్రహ్మణులను ఎగతాళి గా చూపితే, అభ్యంతరం తెలిపితే ఆయన సినేమాలో నటించిన వాళ్ళు హీరొయిన్ రమ్యకృష్ణ,లక్ష్మి అంతా బ్రాహ్మణులు, నాకు వాళ్ళంటే గౌరవమే, సినేమాను సినేమాగా చూడండి అని పాట మొదలు పెట్టాడు. దొంగొకడు దినం మంచిదని తెల్ల వార్దులు దొంగిలించాడంట. అలా సక్సేస్ లేకపోతే బ్రహ్మణులను ఎగతాళి చేస్తూ సినేమా తీయడం ఒక ఫార్ములా తాయారు చేయబోయాడు. ఊహించని విధంగా దెబ్బతిన్నారు. మోహన్ బాబు బ్రాహ్మణ ద్వేషా? ఇంకొకటా కాదు, ఇక్కడ ప్రశ్న. తప్పు దొర్లిన తరువాత దిద్దుకునే ప్రయత్నం ఎమి చేశాడు? ఎమీ చేయకపోగా తంతారా? ఆయనేవరో త్రిపురనేని మహరధి గారి కొడుకు, మొహన్ బాబు ట్రాక్ రికార్డ్ చూడండి. ఆయనకి బ్రాహ్మణులంటే ద్వేషమేమిలేదు అని టి వి షో లో చెప్పాడు. మరి బ్రాహ్మణుల ట్రాక్ రికార్డ్ చూడనవసరం లేదా? ఇప్పటి వరకు వాళ్ళెవరైనా ఇళ్ల మీద పడి నేరాలు,ఘోరాలు చేశారా? విష్ణు ఇంటిమీదకు వచ్చారని, కనీసం చేతిలో గూలక రాయి కూడాలేని వారిని, పెద్ద కర్రలతో కొట్టారే? టి వి కేమేరాలు చూస్తూండగానే ఇంతకు తెగించారే అవి లేకపోతే ఇంకేమి చేసిఉండేవారో! ఇటువంటి వారిని సమర్ధిస్తూ డి. రామానాయుడు, తమ్మారేడ్డి భరద్వాజా,పరూచూరి గోపాల కృష్ణ ఎలా మాట్లాడారో అర్థంకాని పెద్ద విషయం.
Sriniva