Saturday, 4 June 2011

తెలంగాణ FAQ-3: మీనాయకులేం చేస్తున్నారు?

తెలంగాణవాద విమర్శకులు తరుచుగా ఉపయోగించే మరో వాదన "మీ తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా? వాల్లిన్ని రోజులూ ఏం చేస్తున్నారు? మీప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారుగా, వాల్లెందుకు మీప్రాన్ని అభివృద్ధి చెయ్యలేదు?" అని.

ఎమ్మెల్యేలూ, ఎంపీలు, మత్రులు, సర్పంచ్‌లూ ఉంటే అది స్వపరిపాలన అయిపోదు. మత్రులయినా, ఎమ్మెల్యేలయినా రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆఙ్నలకు అనుగునంగానే పనిచేస్తారు, అధినేతను కాదని తమ ప్రాంతానికి ఫండ్సు తీసుకురాలేరు. ఆ అధినేత అయిన ముఖ్యమంత్రి ఎప్పుడూ సీమాంధ్ర నుంచే ఉంటాడు కాబట్టి మంత్రులనూ, ఎమ్మెల్యేలను అందరినీ తనకు కావలసినవారు, తన చెప్పుచేతలలో ఉండేవారినే నియమిస్తాడు.

ఉదాహరణకు నీటిపారుదల శాఖకు గత ఆరు సంవత్సరాలు తెలంగాణ నుంచే మత్రి ఉన్నాడు, అయినా తెలంగాణలో ఇరిగేషన్‌కోసం ఏమీ చెయ్యలేకపొయ్యాడు, తెలంగాణ కోటాకు కూడా తెలంగాణలో ప్రాజెక్టులు అప్రూవ్ కాలేదు, అప్రూవ్ అయినవాటికి ఫండ్స్ రాలేదు. ఎందుకు అంటే మంత్రి తెలంగాణ వాడయినా, ప్రాజెక్టులను నిర్నయించేది ముఖ్యమంత్రేనని తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలకూ, సర్పంచ్‌లకూ, ఎంపీలకు ఎంత అధికారం ఉంటుందో తెలిసిందే.

అసలు ఆమాటకొస్తే బ్రిటిష్ వారి కాలంలో కూడా చానాకాలం మనదేశం వారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అయినా మనం దాన్ని స్వపరిపాలన అనుకోలేదు, కారణం పరిపాలన మనచేతిలో లేనంతకాలం నాయకులు పెద్దగా చేసేదేం ఉండదు కాబట్టి.

రాష్ట్రంలో ఒక్క తెరాసకు తప్ప అన్ని ప్రధాన పార్టీలకు అధినేతలు సీమాంధ్రలోనే ఉంటారు. ఎవరికి అధికారం వచ్చినా సీమాంధ్ర వారే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణకు కొన్నిపదవులు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వారిచెప్పు చేతల్లో ఉండేవారికి కొన్నిపదవులు వస్తాయి. పీ. జనార్ధన్ రెడ్డి లాంటి స్వతంత్ర భావాలు కలిగి స్వతంత్రంగా పనిచేసే నేతలకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం.

ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా పొరపాటున ఎప్పుడయినా అయితే సీమాంధ్ర నాయకులంతా ఒక్కటై ఏదో విధంగా కుట్ర జేసి దించేస్తారు. దీనికి చెన్నారెడ్డి, పీవీలను దించివెయ్యడమే పెద్ద ఉదాహరణ. కాబట్టి భవిష్యత్లో కూడా తెలంగాణ నుంచొ ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఓనాలుగేల్లు పదవిని కాపాడుకోవడమనేది కల్ల.

18 comments:

  1. వంక లేనమ్మ డొకట్టుకు తిరిగిందట.. అభివృద్ది చెయ్యాలనే చిత్తశుద్ది లేని మంత్రులను, అధికారులను "ఒరే బేవకూఫ్! ఏ పనీ చెయ్యకుండా నీ పై అధికారులకు నీ కాల్ మొక్కుతా బాంచెన్ అని ఎందుకురా అంటావ్ అని నిలదీసే దమ్ము ధైర్యం లేకుండా పొద్దస్తమానం సీమాంధ్ర వాళ్ళ మీద పడి ఏడవడమే తెలంగాణా వాదమా? మరి అడ్డదారి లో కోట్లు సంపాదించడానికి ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రులూ అడ్డుకోలేదే? అక్రమంగా కాంట్రాక్ట్ లు పొందడానికి, భూమిల్ని కబ్జా చేయడానికి, విదేశాలకు అక్రమ దారిలో మందిని పంపించి, కోట్లు సంపాదించడాన్ని ఎవరూ అడ్డుకోలేదే. (ఒక్కొక్క నాయకుడిది ఒక్కో చరిత్ర బాబూ)

    ReplyDelete
  2. సమాధానం చెప్పిన విషయాన్ని మల్లీ అడిగి ఎందుకు టైంవేస్ట్ చేస్తారో అర్ధం కాదు. డబ్బు సంపాదించుకోవడానికి సీమాంధ్ర అధినేత అడ్డు ఎందుకు తగులుతాడు, అడ్డుతగిలితే తను లక్షల కోట్లు మెయ్యడం ఎలా? మీకోటా అయిపోయింది.

    ReplyDelete
  3. విశ్వరూప్ గారు. లేని విషయాన్ని పదే పదే వుందని చెప్పడం ద్వారా ఒక అబద్దాన్ని నిజం చేయాలనే మీ ప్రయాసను చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ప్రాంతాలను బట్టి, కులాలను అనుసరించి మనుషుల మనస్థత్వాలు, ప్రవర్తనలు ఉంటాయని మీరు నమ్ముతున్నారా..?
    అసలు ఈ " సీమాంధ్ర " పద ప్రయోగం ఏమిటి..? కొందరు మీడియా ప్రతినిధులు వారు స్వప్రయోజానల కోసం మనుషుల మద్యన చీలికల తెచ్చి తెచ్చిన కొత్త పదబందం అది..! మొన్నటి వరకు తెలంగాణ వాదులు " ఆంద్ర వాళ్ళు " అని సంబోదించే వాళ్ళు..గత రెండేళ్ళుగా " సీమాంద్ర " అట ఈ పదాన్ని పట్టుకొని వ్రేలాడుతున్నారు..అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణాలు కావాలి..!
    మీరన్న వాదమే చూడండి.. " మంత్రి పదివి తెలంగాణ వారికి వున్నా ముఖ్యమంత్రి మీరు సంబోదిస్తున్న " సీమంధ్ర " వారే వుంటారు కాబట్టి.. తెలంగాణ మంత్రుల మాటలు చెల్లవు.. అంతా సీమాంద్ర ముఖ్యమంత్రికే అన్ని అధికారాలు అన్నారు..మరి మాటలు చెల్లనప్పుడు ఎందుకు పి.జనార్దన్ రెడ్డికి మంత్రి పది రాలేదని వాపోతున్నారు..!మంత్రి పదవి వున్నా దండగే కదా ఎలాగూ సీమాంద్ర ముఖ్యమంత్రుల మాటలే కదే చెల్లుబాటు అవుతాయి..? మరెందుకు పి.జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి..? అంటే మీ ఆలోచనలోనే మీకు సరైన అవగాహన లేదనిపిస్తుంది..?
    పి.జనార్దన్ రెడ్డి స్వతంత్ర భావాలు కలిగిన అంత గొప్ప వ్యక్తా..? ఆయనే కాదు ఎక్కడ ఏ ప్రాంతంలో వున్నా రాజకీయ నాయుకల ఆలోచనలు ఒకే రకంగా వుంటాయి..బ్రదరూ..! దోచుకోవడం,అధికార లాలస, స్వప్రయోజనాలే వారికి ముఖ్యం..అవి తెలిసి కూడా మీరు పదే పదే..మనుషుల మద్యన చీలికలు, వ్యత్యాసాలు చూపి..మీ ఆలోచనలను సమర్థించుకుంటున్నారు..అంతె.

    ReplyDelete
  4. కమల్,

    ఉన్న పదమే, కొత్తదేం కాదు. లేదంటే ఇద్దరినీ కలిపీ ఆంధ్ర అంటే సరిపోతుందా? ప్రాంతాల మధ్య చీలికలు తీసుకొచ్చింది అధికారం గుప్పిట్లో పెట్టుకున్న వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కాకుండా ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినవారని తెలుసుకోండి.

    పీ.జనార్ధన్ రెడ్డి మంత్రి అయితే ఏదో ఉద్ధరిస్తాడని కాదు ఇక్కడ ఉద్దేషం, ముఖ్యమంత్రులు అయినవారు తమకు ఊడిగం చేసే వారికే పదవులు ఇస్తారు కాబట్టి వారిని అడిగి లాభం లేదని చెప్పటమే.

    ReplyDelete
  5. ఏ రాష్ట్రంలోనైనా ఆర్థికంగా ముందున్న ప్రాంతాల నుంచే నాయకులు ఎక్కువగా వస్తారు. పశ్చిమ ఒరిస్సాలో 40% మంది గిరిజనులు. అది తెలంగాణా & ఉత్తరాంధ్ర కంటే చాలా వెనుకబడిన ప్రాంతం. తెలంగాణాలో దళితులు, గిరిజనులు ఎంత మందో తెలియదు కానీ మా జిల్లాలో దళితులు 9%, గిరిజనులు 6% జనాభాలో ఉన్నారు. జిల్లాలోని మిగిలిన జనాభాలో ఎక్కువ మంది OBCలు. ఒరిస్సాలోని మంత్రులలో ఎక్కువ మంది కోస్తా ఒరిస్సాకి చెందినవాళ్ళు. వాళ్ళు పశ్చిమ ఒరిస్సా రాజకీయాలని కూడా డామినేట్ చేస్తారు. ఒరిస్సాలో పురీ, కేంద్రపడా, కటక్, జగత్‌సింగ్‌పుర్ తప్ప మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాలే. ఇక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తప్ప అన్ని జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలలో జరగాలి. నాలుగైదు జిల్లాలలో జరిగితే దాన్ని అభివృద్ధి అనలేము. దాన్ని ప్రాంతీయ అసమానతలు అంటాము.

    ReplyDelete
  6. Please read this post at once and know the facts:

    http://sarasabharati.wordpress.com/2011/06/05/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F/
    one of the lines in telugu: "So many people run away from telangana to raayalaseemaa"
    Try to Stop to blame on Andhra Nayakulu

    ReplyDelete
  7. వోలేటి,

    నేను ఆంధ్ర నాయకులను బ్లేం చెయ్యడం గానీ తెలంగాణ నాయకులను సమర్ధించలేదనిగాని మీరు అర్ధం చేసుకుంటే మంచిది. ఒకవేళ తెలంగాణకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణ ప్రాంతం వారు ఎప్పుడూ అధికారం చేజిక్కించుకుంటే మీరు ఇదేపని చేసేవారు. నాటపా కేవలం మూస ప్రశ్నలేసి ఏదో వాదించేశామని జబ్బలు చరుచుకునేవారికి ఒక FAQ. మీరూ ఆకోవలోకే చెందుతారు కనుక చదివి అర్ధం చేసుకోండి. బై!

    ReplyDelete
  8. ఒకప్పుడు డా.రమణారెడ్డి రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమం నడిపాడు. కానీ అతను ఒక హత్య కేస్‌లో జైల్‌కి వెళ్ళి ఉద్యమం నడపలేకపోయాడు. ఇప్పుడు రమణారెడ్డి బయటే ఉన్నాడు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమకి ఎలాంటి ప్రయోజనం ఉండదు అని రమణారెడ్డి ఒక టివి చానెల్ మీటింగ్‌లో అన్నాడు. సమైక్యవాదం అనేది హైదరాబాద్ కోసమే తప్ప ఇంకొకటి కాదు. రమణారెడ్డికి హైదరాబాద్ మీద కాకుండా తన ప్రాంతం మీద అభిమానం ఉంది. రమణారెడ్డికి ఉన్న నిజాయితీ ఇతర సీమాంధ్ర నాయకులకి లేదు.

    ReplyDelete
  9. నిజమే ప్రవీణ్ గారూ.. ఆయన లాగ రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టడంలో నిజాయితీ వున్న వాళ్ళు లేరు.. కాని విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అని పోరాటం చేసిన శ్రీ తెన్నేటి విశ్వనాధం, మీ శ్రీకాకుళం జననేత శ్రీగౌతు లచ్చన .. మరి మద్యనిషేధం కోసం అహర్నిసలూ పోరాడిన వావిలాల ... వీళ్ళు రాజకీయాల్లో వుంటూ నైతికంగా బతికిన వారే తప్ప స్వలాభం కోసం డబ్బు ని అక్రమంగా ఆర్జించి కోటీశ్వరులైపోలేదు.. సీమాంధ్ర విషయాల్లో అన్నిటిల్లోనూ వకాల్తా పుచ్చుకు మాట్లాడే మీకు నిజాయితీ గల నాయకులు కనకబడక పోడం దురదృష్టం

    ReplyDelete
  10. వోలేటి గారు,

    ప్రవీణ్ గారు చెప్పింది ప్రస్తుతం సీమాంధ్రలో సమైక్యాంధ్ర అంటూ హడాఉడి చేస్తున్న నేతల గురించి, సీమాంధ్రలో అసలు మంచి నాయకులే లేరు అని ఎవరూ అనరు. అలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్లు "తెలంగాణలో మనుషులకు పనిచెయ్యడం చేతకాదు, నైపుణ్యం లేదు, తెలంగాణ వారు తాగుబోతులు అని చెప్పే అహంకారులు, అవివేకులూ గుప్పిస్తారు. అసలు ఒకవైపు తెలంగాణ ప్రజల గురించి ఈవిధంగా అవమానకరంగా మాట్లాడుతూ, ఎద్దేవా చేస్తూ కలిసి ఉందామనే మీ కపట విన్యాసాలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి.

    ఇక సర్దార్ గౌతు లచ్చన్న నిజాయితీ గురించి గొప్పగా చెబుతున్నారు, అదే సర్దార్ గౌతు లచ్చన్న 69లో తెలంగాణకు అనుకూలంగా నిరాహారదీక్ష చేపట్టాడని మీకు తెలుసా?

    ReplyDelete
  11. రాయలసీమ తెలంగాణా కంటే వెనుకబడిన ప్రాంతం. అక్కడ పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రోజెక్ట్‌లు పూర్తి చెయ్యాలని ఒక్క రాయలసీమ నాయకుడైనా డిమాండ్ చెయ్యలేదు. తెలంగాణాలో గేజ్ కన్వర్షన్ ప్రోజెక్ట్‌ల కోసం రైల్ రోకోలు చెయ్యడమైనా జరిగింది. రాయలసీమలో అదీ లేదు. తెలంగాణా నాయకులు స్వార్థపరులు అనుకుంటే రాయలసీమ నాయకులు అంత కంటే స్వార్థపరులు అనుకోవాలి. ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం నడిపిన డా.రమణారెడ్డిని ఉదహరిస్తే వేరే నాయకులు కనిపించలేదా అని అడిగారు. హైదరాబాద్ మీద కాకుండా తమ ప్రాంతం మీద అభిమానం ఉన్నవాళ్ళని నేను సీమాంధ్రలో కొద్ది మందినే చూశాను. అందులో డా.రమణారెడ్డి ఒకడు. అందుకే అతని పేరు ఉదహరించాను. అంతే.

    ReplyDelete
  12. నేను చెప్తుందీ అదే.. కేవలం తమ సొంత ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ది కోసం గాని, తమ స్వలాభం కోసమే పనిచేసే నాయకులు కాదు మనకి కావలసింది.. అలా రాయల సీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ తెచ్చుకుంటే మళ్ళో మీరే బురద జల్లుతారు(ఇటువంటి స్వార్ధ నాయకులా మనకి/ మీకు కావలసింది ? ).. తెలంగాణా కంటే సీమాంధ్ర ప్రాంతలెన్నో వెనక బడి వున్నాయని మీరే చెప్తున్నారుగా.. మా బాధ అదే.. మరి రోజూ సీమాంధ్ర నాయకుల మీద పడి ఏడుపు ఎందుకు?(అన్యాయం, మోసం, కుట్ర..ఇంకా ఎన్ని? మీరు తిడితే మేం తుడుచేసుకోవాలి, కాని మిమ్మల్ని ఏం అనకూడదు..తెల్లారిలేచింది మొదలు ఎన్నెన్ని మాటలంటున్నారు?

    ReplyDelete
  13. వెనుకటికెవడో రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నాడట, అలాగుంది మీ పరిస్థితి. ఎన్ని సార్లు స్పూన్‌ఫీడ్ చేసినా అర్ధం కాకపోతె ఎలా, లేక అర్ధం కానట్టు నటిస్తారా?

    వర్షాలు లేక, నీల్లు లేక సహజసిద్దంగా వెనుకబడిన ప్రాంతాలకూ, అన్నివనరులు ఉండి తమ వనరులు దోచుకోబడి తమ పక్కనుండే నదులు పారుతున్నా తమ హక్కులు కాలరాయబడి ఆనీల్లు పక్కకు తరలించబడి వెనుకబడిన ప్రాంతాలకు తేడ అర్ధం చేసుకోవడం బహుషా మీకెన్నటికీ సాధ్యం కానట్టుంది. మావనరులు దోచుకోబడ్డాయి కాబట్టి దోపిడీ అంటున్నాం, మధ్యలో మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారో.

    ReplyDelete
  14. రాయలసీమలో చాలా గ్రామాలు ఫాక్షన్ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఫాక్షన్ నాయకులు తమ సొంత లాభాలు చూసుకుంటారు కానీ అభివృద్ధి చెయ్యరు. కోస్తా ఆంధ్రలో గానీ తెలంగాణాలో గానీ రాయలసీమలో ఉన్నంత ఫాక్షన్ రాజకీయాలు లేవు. తెలంగాణాలో సికందరాబాద్-ముద్ఖేడ్ గేజ్ కన్వర్షన్ ప్రొజెక్ట్ కోసం గతంలో రైల్ రోకోలు జరిగాయి. రాయలసీమలో ఒక్క పెండింగ్ రైల్వే ప్రొజెక్ట్ కోసమైనా అక్కడి నాయకులు రైల్ రోకో చేశారా? నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ పూర్తైతే సిమెంట్ రవాణా నుంచి రైల్వేలకి లాభం వస్తుంది. కానీ ఆ లైన్‌ని కూడా పెండింగ్‌లో పెట్టేశారు. రాయలసీమలో ప్రాంతీయ అభివృద్ధి కోసం పాటుపడిన డా.రమణారెడ్డి గురించి చెపితే అతనిదే స్వార్థం అంటున్నారు.

    ReplyDelete
  15. పక్కనే నదులు పారుతున్నది ఇక్కడ వర్షాలకి కాదు.. అక్కడెక్కడో పుట్టి, వేరెక్కడో కలవడానికి.. సర్.ఆర్ధర్ కాటన్ కూడా సీమాంధ్ర వాడేనా? ఆనకట్ట రాజమండ్రి కాక తెలంగానా ప్రాంతంలో ఎందుకు కట్టలేదు? స్పూన్ ఫీడింగ్ కావల్సింది ఎవరికి?

    ReplyDelete
  16. వోలేటి,

    ఇరిగేషన్ మీద మంచి ఎక్సపర్టైజ్ ఉనంట్లుంది మీకు??!! మీలెక్కన అసలు తెలంగాణలో వర్షాలు పడట్లేదా, లేక పడ్డ వర్షాలు పైకెగిరి డైరెక్టుగా బంగాళాఖాతంలో కలుస్తున్నయా? కాటన్ దొర రాజమండ్రిలో కట్టిండు గాబట్టి ఎప్పటికీ రాజమండ్రికి తప్ప వేరే ప్రాంతాలకు ప్రాజెక్టులు అక్కర్లేదా? ఇంత పెద్ద మేతావులు తెలంగాణలో ప్రజలకు నైపుణ్యం లేదు, అదిలేదు ఇది లేదు అంటూ ఉపన్యాసాలు దంచేస్తే జనం నవ్విపోతారు.

    మీదగ్గర విషయం ఏదయినా ఉంటే హేతుబద్దమయిన వివరణలతో రాయండి, ఇలా పదే పదే అడ్డదిడ్డమయిన కామెంట్లతో టైంవేస్ట్ చెయ్యొద్దు. మేం సాగునీటిలో మాన్యాయమైన వాటానే అడుగుతున్నాం, మీకూ చెందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా అక్కర్లేదు. మా న్యాయమైన వాటాను మాకు కావాలనడమే తప్పుగా కనిపిస్తే కలిసి ఉండాలని దొంగ కబుర్లెందుకు?న్యాయమైన వాటా ఏంటో మీమేధస్సుకు అందని విషయం కానీ దానికి ఎక్స్‌పర్ట్లు ఉంటారు, రేపు రాష్ట్రం ఏర్పడితే ఏరాష్ట్రానికి ఎంత రావాలో వారు వాటాలేస్తరు, అప్పుడు ఇప్పటిలా ఆనీల్లన్ని ఎక్కడో పుట్టి మరెక్కడో (కోస్తాలో అనా మీఉద్దేషం) కలుస్తాయి కాబట్టి మీకు వాటా లేదు అని చెప్పి మోసం చెయ్యడం మాత్రం సాధ్యం కాదని తెలుసుకోండి.

    ReplyDelete
  17. వోలేటి గారు, మీరు ముందు "తెలంగాణ FAQ-2: వెనుకబాటుతనం అన్ని చోట్లా ఉంది?" చదవండి.

    ReplyDelete
  18. @voleti

    కాటన్ తెలంగాణాలో ఎట్లా కడుతడు? అది నైజాం కింద ఉండేది కదా? అయినా ప్రాజెక్టు నైజాం కట్టినా, కాటన్ కట్టినా నీల్లు దొబ్బేది మీరే కదా? నైజాం కట్టిన రాజోలి బండ నీళ్ళు బాంబులేసి కాజేశారు. కాటన్ ప్రాజెక్టు నీళ్ళు తెలంగాణాను ఎండబెట్టి కాజేస్తున్నారు. అంతే తేడా!

    ReplyDelete

Your comment will be published after the approval.