Saturday 25 June 2011

పోలవరం సత్యాలు - 1




పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం.

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు (కొందరు మేతావులు దీనిని 4500 ఎకరాలుగా చెబుతున్నారు) అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం). అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది. అసలు మొత్తం ప్రభుత్వం చెప్పే ఆయకట్టులో 75% వరకూ ఇప్పటికే ఏదో ఒకరకమయిన ఇరిగేషన్ ఉందని అంచనా.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.

ఇందులో ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఎక్కువ రాయలేకపోవడం జరిగింది. ఈప్రాజెక్టు సమర్ధకులు చెప్పే ఇంకోవిషయం 900MW పవర్ జెనరేషన్ కాగా, కేవలం 900MW పవర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం నాడా ఉంది కదా అని గుర్రం కొనుకోవడం లాగ. పవర్ జెనెరేషన్ ఖర్చులో పెట్టుబడిపై వడ్డీని కూడా చూడాలి, అలా చూసినప్పుడు థెర్మల్ పవర్‌కే తక్కువ ఖర్చు.

2010 లెక్కలప్రకారం ప్రస్తుత ఖర్చుల అంచనా 16 వేలకోట్లు. పూర్తయే సరికి బహుళార్ధక ప్రాజెక్టులు వేటికయినా నాలుగురెట్లు ఖర్చు పెరుగుతుంది. అయితే ఈ అంచనాలో పునరావాసం ఖర్చు గానీ, మైన్సూ, ఆటవీ ప్రాంతం ఖర్చు గానీ ఉన్నట్లు లేదు. ఇక కోల్పోయే వన్యమృగ సంపద, ప్రకృతి సంపద లాంటివాటికి లెక్కేలేదు. ఇంతాచేసి ఇదేమీ కరువు ప్రాంతం కాదు, తక్కువలోతులోనే భూగర్భ జలాలు ఉండే తీరప్రాంతంలో. మరి ఈ తెల్ల ఏనుగు ఎవరికోసం అయ్యా అంటే వోట్లకోసం పదవులకోసం పంతాలకు పొయ్యే కొంతమంది రాజకీయనాయకుల స్వార్ధం కోసం.



Ref: http://www.downtoearth.org.in
http://www.conflicts.indiawaterportal.org/sites/conflicts.indiawaterportal.org/files/conflicts_polavaram.pdf

27 comments:

  1. ప్రవీణ్ గారు,

    మీవీడియో బాగుంది. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, రెండో భాగంలో వాటిగురించి రాస్తాను.

    ReplyDelete
  2. పోలవరం అనేది నదుల అనుసంధానం కోసం కూడా ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణ డెల్ట కి 80 టి ఎం సి ల నీటి తరలిస్తే,నాగార్జున సాగర్ మీద వత్తిడి తగ్గి, కృష్ణ నదిలో వాటర్ ని మహబూబ్ నగర్ అంటే తెలంగాణా కే ఉపయోగించు కోవచ్చు.

    //గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.//
    దానికి అనుగుణంగానే ప్రాజెక్ట్ కట్టాలి అండీ.కర్రెంట్ షాక్ కొడితే మరణించ వచ్చు,అందువలన కరంట్ వాడటం ఆపేస్తామా?

    // పవర్ జెనెరేషన్ ఖర్చులో పెట్టుబడిపై వడ్డీని కూడా చూడాలి, అలా చూసినప్పుడు థెర్మల్ పవర్‌కే తక్కువ ఖర్చు. //
    నిజమా!!!!!జల విద్యుత్ కి పర్యావరణ కాలుష్యం బెడద ఉండదు. ధర్మల్ విద్యుత్ లో బొగ్గు కానీ, గ్యాస్ కానీ కొన్ని రోజులల్లో అయిపోతాయి. జల విద్యుత్ లో ఆ బెడద ఉండదు. నీటి నిల్వ చేసుకుంటే ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తాయి. జల విద్యుత్ కి, ధర్మల్ విద్యుత్ కి నక్కకీ ,నాక లోకానికీ ఉన్నంత తేడా ఉంది.

    ReplyDelete
  3. //అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది. అసలు మొత్తం ప్రభుత్వం చెప్పే ఆయకట్టులో 75% వరకూ ఇప్పటికే ఏదో ఒకరకమయిన ఇరిగేషన్ ఉందని అంచనా//

    గోదావరి జిల్లాలు,విశాఖ,శ్రీకాకుళం జిల్లాలలో మెట్ట భూములు లేవు అని మీ అభిప్రాయమా? కొంచెం ఈ ఏరియా ల గురించి తెలుసుకొని రాస్తే మంచిది అనుకుంటా.
    //అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది//
    అందరికీ సరి అయిన పునరావాసం కల్పించాల్సిందే. దీవించవమ్మ అని దగ్గరికి వెళ్తే ఏదో అన్నది అంటా,అలా ఉంది మీ వాదన.
    //ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది.//
    మనుషుల ప్రాణాల కన్నా పిట్టల ప్రాణాలు ఎక్కువటండీ?

    ReplyDelete
  4. //నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.//

    ప్రస్తుత గిరిజనా అభివృద్ధి పదకాలలోనే పెద్ద తప్పు ఉంది. వాళ్ళని కమ్యూనిస్టులు తమ స్వార్ధం కోసం సంస్కృతి,మట్టీ,మన్ను మశానం పేరుతొ అడవుల పాలు చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా తె రా స కూడా తయారయ్యిందా?
    కమ్యూనిస్టు లకి సంస్కృతీ సంప్రదాయాలేందో నా బుర్ర ఎంత చించుకున్నా అర్ధం కాదు. కార్ల్ మార్క్స్ చెప్పిన దానికి కొత్త భాష్యమేమో? ట్రైబల్స్‌ను అడవులనుండి తరలించాల్సిందే. వారిని నాగరిక సమాజం లో కలపాల్సిందే. దీని మీద ఒక ఆర్టికల్ రాస్తాను.

    ReplyDelete
  5. http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post_25.html

    ReplyDelete
  6. పోలవరం అనేది తెలంగాణా అభివృద్దికి అతి కీలకమయినది. ఏదో గిరిజన వోట్ల కోసం కమ్యూనిస్టులు తో పాటు మీ లాంటి వారు రోటి పాట పాడటం ఏమీ బాగోలేదు.

    ReplyDelete
  7. ఇంద్రసేనా గారు,

    మీకామెంటుకు ధన్యవాదాలు. అలాగే మీటపాకూడా బాగుంది.

    //పోలవరం అనేది నదుల అనుసంధానం కోసం కూడా ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణ డెల్ట కి 80 టి ఎం సి ల నీటి తరలిస్తే,నాగార్జున సాగర్ మీద వత్తిడి తగ్గి, కృష్ణ నదిలో వాటర్ ని మహబూబ్ నగర్ అంటే తెలంగాణా కే ఉపయోగించు కోవచ్చు.

    దీనిగురించి రెండో పార్ట్లో రాద్దామనుకుంటున్నా. అసలు ఈ నదుల అనుసంధానం వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇది మన మేతావి చెప్పినట్లు కేవలం intar basin ప్రాజెక్టు కాదు, గోదావరీ జలాలు ప్రకాశం బారేజీలో కలుస్తాయి. దీనివలన విజయవాడ నగరానికి ముంపు ప్రమాదం, ఎకాలజీ సమస్యలు చాలా ఉన్నాయి, తరువాత రాస్తాను. అసలు ఇంతర్ రివర్ లింకేజీ ప్రతిపాదనపై చానా అభ్యంతరాలు ఉండడం వలన ఎప్పుడో ఇది అటకెక్కింది.

    //నిజమా!!!!!జల విద్యుత్ కి పర్యావరణ కాలుష్యం బెడద ఉండదు. ధర్మల్ విద్యుత్ లో బొగ్గు కానీ, గ్యాస్ కానీ కొన్ని రోజులల్లో అయిపోతాయి. జల విద్యుత్ లో ఆ బెడద ఉండదు.

    నిజం. అసలు మన వుద్యుత్ అవసరాలౌ 900MW సముద్రంలో నీటిబొట్టులాంటిది. ప్రస్తుతానికి బొగ్గు ఉన్నది, లాంగ్ టరంలో న్యూక్లియార్ పవరే శరన్యం.

    //గోదావరి జిల్లాలు,విశాఖ,శ్రీకాకుళం జిల్లాలలో మెట్ట భూములు లేవు అని మీ అభిప్రాయమా?
    ఇది నాభిప్రాయం కాదు, నిపుణులు చెప్పిందే.

    //అందరికీ సరి అయిన పునరావాసం కల్పించాల్సిందే. దీవించవమ్మ అని దగ్గరికి వెళ్తే ఏదో అన్నది అంటా,అలా ఉంది మీ వాదన.
    అసలు ట్రైబల్ చట్టాలప్రకారం వారిని తరలించే హక్కు లేదు. అయినా ఇది మొత్తం లాభమెంత అందుఓసం ఎంతమందిని తరలిస్తున్నామని చూసుకోవాలి. లక్షా ఇరవైవేలమందికి పునరావాసం మాటలు కాదు.

    సమస్యలు ఏప్రాజెక్టుకయినా ఉంటాయి, కానీ ఇందులో ఉన్న సమస్యలెంత, దానివలన లాభం ఎంత అని చూసుకోవాలి. విశాఖలో మెట్టప్రాంతాలు ఉన్నాయి కానీ గోదావరి, క్రిష్ణాలో తక్కువ. ఆమాత్రంకోసం ఇంత ఖర్చు పెట్టి, ఇంతమందిని నిర్వాసితులను చేసి, ఆతవీ సంపద నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం కాదు, నిపుణుల అభిప్రాయం.

    ReplyDelete
  8. //అసలు ఇంతర్ రివర్ లింకేజీ ప్రతిపాదనపై చానా అభ్యంతరాలు ఉండడం వలన ఎప్పుడో ఇది అటకెక్కింది.//
    ఎఅవ్రు చెప్పారు మీకు,ఇంకా కాలవలు తవ్వుతానే ఉన్నారు

    ReplyDelete
  9. ఇంద్రసేనా గారు,

    పోలవరం వలన తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని మీకెలా అనిపించిందో గానీ, తెలంగానాకు ఇప్పటికి అలకేట్ చేసిన క్రిష్ణా జలాలకోసం ముప్పై ఏల్లనుంచీ ప్రాజెక్టులు కట్తలేదు. ఇప్పుడు ఏదో దీనిద్వారా క్రిష్ణా జలాలు మిగిల్చి తెలంగాణకు ఇస్తారనుకుంటే అది అత్యంత హాస్యాస్పదం.

    ReplyDelete
  10. జల విద్యుత్ కి మొదట పెట్టుబడి ఎక్కువయినా అది లాంగ్ టర్మ్ లో చాలా ఉపయోగకరం అండీ. జల విద్యుత్ కీ,న్యూక్లియర్ పవర్ కి సంబంధం లేదు. న్యూక్లియర్ పవర్ ని ఒకే సారి ఉత్పత్తి చేసి మూసి వెయ్యాలి. అలా సాధ్యం కాకపొతే నా వోటు జల విద్యుత్ కే.
    పవర్ గురించి నా వ్యాసం ఒక సారి చదవండి.
    http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post_11.html

    ReplyDelete
  11. విశ్వరూప్ గారు,
    పోలవరం తెలంగాణా ఎలా ఉపయోగమో చూడండి. ఇంతే కాదు ఆ పవర్ మొత్తం తెలంగాణా లో ఎత్తిపోతల పదకాలకి ఉపయోగించ వచ్చు.

    పోలవరం అనేది తెలంగాణా అభివృద్దికి ప్రాణావసరం,
    గోదావరి,కృష్ణ నదుల్ని అనుసందానం చేసి, కృష్ణ బ్యారేజీ దగ్గర నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల మీద ఆధార పడటం తగ్గించి, తద్వారా నాగార్జున సాగర్ లో ఎక్కువ నీటిని నిల్వ చేయ వచ్చు.నాగార్జున సాగర్ ను కూడా ఖమ్మం జిల్లా నుండి గోదావరికి లింక్ కలపవచ్చు. తద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ కి నీటి విడుదల అక్కరలేదు.శ్రీశైలం రిజర్వాయర్ ని కేవలం ని డైవర్షన్ కింద ఉపయోగించుకోవచ్చు.పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ని లక్ష క్యూసేక్కులకి పెంచి,అది కూడా నిరంతరం సరఫరా చేసి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకి నీటిని సరఫరా చేయవచ్చు.అంతే కాక శ్రీశైలం మీద ఒత్తిడి తగ్గితే ఎగువన ఉన్న,భీమ,కల్వకుర్తి,జూరాల ద్వారా తెలంగాణాకి కూడా నీటిని సరఫరా చేయ వచ్చు.

    ReplyDelete
  12. ఇక్కడ మిగిలే 80 TMCలు తెలంగాణకు ఇస్తారనేది ఊహాజనితం. మనకు ఇంకెంతో పవర్ అవసరాలు ఉన్నాయి, ప్రస్తుతం తెలంగాణలో 6 గంటలు కూడా వ్యవసాయానికి పవర్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ900MW అక్కడ వాడొచ్చనేది అర్ధం లేని వాదన, అదొక నీటి బొట్టులాంటిది.

    ప్రస్తుతానికి తెలంగాణకు ఎంత లాభం, సీమాంధ్రకు ఎంతలాభం అనేవిషయం వదిలేద్దం. మొత్తం సమైక్య రాష్ట్రంలో ఎంతలాభం జరుగుతుంది, దానికోసం ఎంత త్యాగాలు చెయ్యాలి, ఇదే ఖర్చు ఇంకోదగ్గర పెడితే ఎంత లాభం లాంటి విషయాలు ఆలోచిద్దాం. రెండూ చేద్దాం లాంటివి చెప్పి వృధా. ఇప్పటికి ముప్పై ఏల్ల క్రితం ప్రారంభించిన శ్రీరాం సాగర్, శ్రీశైలం ఏడమకాలువ ప్రాజెక్టులు పూర్తికాలేదు. ముందు వాటికి ఫండ్స్ ఇవ్వాల్. తరువాత నీల్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టాలి.

    మన మేతావి వాదనలాగా మీదగ్గర మేమొచ్చి పరిశ్రమలు పెట్టి సంపాదించుకుని మీప్రాంతానికి జీడీపీ పెంచుతాం, నీల్లన్నీ మేమే తీసుకుంటాం అంటే ఏం లాభం చెప్పండి?

    ReplyDelete
  13. //ఇక్కడ మిగిలే 80 TMCలు తెలంగాణకు ఇస్తారనేది ఊహాజనితం//
    మీరు ఊరుకొండీ. అందరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు స్వార్ధ పరులు అనుకోవద్దు. రాష్ట్ర ,తెలుగు ప్రజల సమగ్ర అభివృద్ధి కాంక్షించే నాయకులు ఉంటారు.
    //కాబట్టి ఈ900MW అక్కడ వాడొచ్చనేది అర్ధం లేని వాదన//
    ఎందుకో చెప్పగలరా? ఎందుకు ఇవ్వరు. మీరు ప్రత్యెక రాష్ట్ర కల్ల జొల్ల నుండి చూడకప్పోతే సరిగ్గానే అర్ధం అవుతుంది.

    ReplyDelete
  14. ఆ 80 టీఎంసీలలో కొంత తెలంగాణకు వస్తుందని ఆఅజనకంగా చెప్పుకున్నా దానికోసం ఎంత కోల్పోవలసి వస్తుందనేది ఇక్కడ చూడాల్సింది.

    ఉత్పత్తి అయిన పవర్ గ్రిడ్‌కిస్తాం, కానీ ఇక్కడి పవర్ అక్కడ వాడతాం అంటే అర్ధం లేదు. మన విద్యుత్ అవసరాలలో ఈ900MW ఎంత, దానికోసం పెట్టే ఖర్చు ఎంత అనేది ముఖ్యం. పవర్ అనేది ఇక్కడ ఒక బై-ప్రాడుక్ట్ తప్ప ఆకొద్ది పవర్కోసం ప్రాజెక్టు కట్టం.

    ReplyDelete
  15. అసలు ఇదంతా ఎందుకు రాయాల్సొచ్చిందంటే కొందరు దేడ్‌దమాక్‌లు గోదావరికీ, క్రిష్ణాకు తేడా కూడా తెలియకుండా, అసలు ఏప్రాజెక్టు ఏనది మీద ఉంది, ఏది ప్రపోజ్డ్, ఏది ఇప్పటికే పూర్త్ అయింది, దేని సామర్ధ్యం ఎంత అనే బేసిక్ నాలెడ్జి లేకుండా అనీ తెలిసిన వారికి మల్లే రాయటం వలన.

    సిగ్గు విడిచి పోలవరం ముంపును 1.2 లక్షల ఎకరాలనుంచి నాలుగున్నర వేలకు తగ్గించాడీ అతితెలివి వీరుడు. ఇంత తెలివితక్కువ వారు బ్లాగులు రాసేది ఎవరిని ఉద్ధరించడానికి?

    ReplyDelete
  16. 80 టీఎంసీ ?

    ReplyDelete
  17. 44టీఎంసీలనుకుంటా. మరి ఆమాత్రాన్ని మొత్తం రాయలసీమ, తెలంగాణలో ఎలా పంచుతారో? అది కూడా అంతా అనుకున్నట్టు జరిగితే.

    ReplyDelete
  18. తెలంగాణాకు కేటాయించిన నికర జాలాలకే ఇంతవరకు ప్రాజెక్టులు దిక్కు లేనపుడు, ఎక్కడనో ప్రాజెక్టు కట్టి, ఆ నీటిని మిగిలించి తెలంగాణాకు పంపిణీ చేస్తామనడం కన్నా పెద్ద కుట్ర మరొకటి లేదు. అసలు ఇట్ల అంటున్నరంటె తెలంగాణాకు కేటాయించిన కృష్ణా జలాలు మేమే వాడేసు కున్నమని వాళ్ళు ఒప్పుకున్నట్టే. అంటే తెలంగాణా వాళ్ళు మొదటినుండి చెప్పేది ఇదే కదా!

    వీళ్ళు చెప్పేది ఎట్ల ఉందంటే, "మేమే ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాకి ఇప్పటిదాక అన్యాయం చేసినం కాబట్టి, మేం ఇంకొ ప్రాజెక్టు కట్టుకోని, మాకు నీళ్ళు మునిగిపొయేటంత ఎక్కువ అయినంక, ఆ మిగిలిన నీటితోటి మీకు ప్రాజెక్టులు కట్టిస్తం" అన్నట్టు.

    ReplyDelete
  19. @శ్రీకాంత్ చారి గారు,

    //తెలంగాణాకు కేటాయించిన నికర జాలాలకే ఇంతవరకు ప్రాజెక్టులు దిక్కు లేనపుడు//
    ఏ ట్రిబ్యునల్ 'తెలంగాణా' కి నికర జలాలు కేటాయించింది సర్. ట్రిబ్యునల్ రాష్ట్రానికి మాత్రమె కేటాయిస్తుంది. ఇందులో ప్రాంతాలు చెప్పదు అండీ. మీరు కొంచెం ముందుగానే తెలంగాణా రాష్ట్ర కల కంటున్నట్టున్నారు.

    //ఎక్కడనో ప్రాజెక్టు కట్టి, ఆ నీటిని మిగిలించి తెలంగాణాకు పంపిణీ చేస్తామనడం కన్నా పెద్ద కుట్ర మరొకటి లేదు//

    మీరు కొంచెం మీ కుట్ర సిద్దాంతం నుండి బయటికి వచ్చి మాట్లాడితే మంచిది.

    //అసలు ఇట్ల అంటున్నరంటె తెలంగాణాకు కేటాయించిన కృష్ణా జలాలు మేమే వాడేసు కున్నమని వాళ్ళు ఒప్పుకున్నట్టే.//

    చెప్పండి ఏ ట్రిబ్యునల్ 'తెలంగాణా' కి నీరు కేటాయించిందో. విని చప్పట్లు కొట్టి అభినందిస్తాము.

    //మేమే ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాకి ఇప్పటిదాక అన్యాయం చేసినం కాబట్టి, మేం ఇంకొ ప్రాజెక్టు కట్టుకోని, మాకు నీళ్ళు మునిగిపొయేటంత ఎక్కువ అయినంక, ఆ మిగిలిన నీటితోటి మీకు ప్రాజెక్టులు కట్టిస్తం//

    బాగుంది. మీరే ప్రశ్న వేసుకున్నారు. మీరే ఆన్సర్ చేసుకున్నారు. ఇక మేము చెప్పేది ఏముంది ఇక్కడ!!!!

    ReplyDelete
  20. @విశ్వరూప్ గారు,

    // 44టీఎంసీలనుకుంటా. మరి ఆమాత్రాన్ని మొత్తం రాయలసీమ, తెలంగాణలో ఎలా పంచుతారో? అది కూడా అంతా అనుకున్నట్టు జరిగితే.//

    ఈ నీటిని కేటాయించరు అండీ. ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంది. పులిచింతల కట్టాలి. ఇది కృష్ణ డెల్టా కి బ్యాలెన్సింగ్ రాజర్వాయర్. ఖమ్మం నుండి దుమ్ము గూడెం ద్వారా లింక్ కలిపి నాగార్జున సాగర్ లో నీళ్ళు నిల్వ చెయ్యాలి.
    అప్పుడు పైనుండి వచ్చే నికర,మిగులు జలాలు శ్రీశైలం వద్దే ఆపేయ వచ్చు. ఈ నీటిని తెలంగాణా కు శ్రీ శైలం వద్దనుండి అందించ వచ్చు. శ్రీ శైలం మీద వత్తిడి తగ్గితే ఎగువున ఉన్న అన్ని తెలంగాణా ప్రాజెక్ట్ లకి నికర నీటి లభ్యత పెరుగుతుంది. ఇది తెలంగాణా కి ఎంతో ఉపయోగం. మీరు నా ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

    ReplyDelete
  21. పోలవరం నుంచి కృష్ణా నదికి 80 TMCల నీరు తరలిస్తారట. పులిచింతల ప్రోజెక్ట్ ద్వారా రాబోయే నీరు కృష్ణా డెల్టా రైతులకి సరిపోదనుకుంటున్నారా? కృష్ణా డెల్టాలో రెండో పంటకి నీరు ఇవ్వడం కూడా పులిచింతల ప్రోజెక్ట్ యొక్క పర్పోస్ అని ప్రభుత్వానికి తెలియదా? మొదటి పంటకి ఎలాగూ ప్రకాశం బారేజ్ నుంచి నీరు అందుతోంది.

    ReplyDelete
  22. దాదాపు 65 సంవత్సరాల క్రితం దాశరథి చెప్పిన పద్యంలోని చివరిపాదం
    "నా తెలంగాణ కోటిరత్నాలవీణ". ‘రత్నాల’ అనే అనాలి. ‘రతనాల’ అంటే గణదోషం.
    అప్పుడు తెలంగాణ జిల్లాల జనసంఖ్య కోటి. ఇప్పుడు అది మూడురెట్లకంటే ఎక్కువ. ఇంకా "కోటి రత్నాలవీణ" అనే అంటున్నారు. దానిని "నా తెలంగాణ మేటి రత్నాలవీణ" అని మార్చుకుంటే బాగుంటుంది.

    ReplyDelete
  23. శంకరయ్య గారు, ధన్యవాదాలు. ప్రస్తుతానికి "రత్నాల" అని సరిచేస్తాను, కోటి అలాగే ఉండనిద్దాం.

    ReplyDelete
  24. ఇంద్రసేనా గారు,

    ఇక్కడ మాట్లాడేదీ ప్రాజెటులకు వాటాలు గురించే. నాన్ కాచ్మెంటు ఏరియాకు నీటిని తరలించడం కోసం మనం ట్రిబ్యునల్ దగ్గర మిగులు జలాలు మాత్రం తరలిస్తామని పర్మిషన్ తీసుకున్నాం. కాచ్మెంటు ఏరియాలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు నికర వాటా ఉంది. అలా మిగులు జలాలద్వారా తెలుగు గంగ, SRBC, వెలిగోడు, హంద్రినీవా లాంటి ప్రజెక్టులు మొదలు పెట్టి పూర్తి కూడా చేశారు. తెల్నగాణకు నికర వాటాపై చేపట్టిన SLBC, భీమ ఇంతవరకూ మోక్షం పొందలేదు. ఇవన్నీ క్రిష్ణా పై.

    ఇక గోదావరిపై ఎప్పుడో మొదలు పెట్టిన గ్రాఇటీ ద్వారా రావాల్సిన శ్రీరాం సాగర్ ను ఫండ్స్ పూర్తిగా తగ్గించి దాని సామర్ధ్యాన్ని పూర్తిగా తగ్గించారు. అసలు తెలంగాణలో ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టులు ముప్పై ఏల్లుగా పూర్త్కానప్పుడు ఇప్పుడు ప్రాణహిత గురించి మాటాడ్డం వేస్ట్, అందుకే నేను దాని గురించి రాయలేదు. నాగార్జునసాగర్ మొదలుపెట్టినపుడు తెలంగాణ, ఆంధ్రా వేర్వేరు రాష్ట్రాలు, రెంటికీ సమాన వాటా ప్రకారం మొదలుపెట్టారు. అయినా ఎడమకాలువ అలైన్మెంటు మార్చి అందులో తెలంగాణ వాటా తగ్గించారు.

    అందుకే తెలంగాణ వారికి సాధారణంగానే అనుమానాలు ఉంటాయి. దాన్ని మీరేదో కుట్ర సిద్దాంతం అంటూ వెక్కిరించొద్దు. వడ్డించేవాడు మనవాడయితే వెనూవరసలో ఉన్నా అన్నీ అందుతాయి.అందులో కుట్రేం లేదు, అంతా ఓపెన్‌గానే జరుగుతుంది.

    ReplyDelete
  25. ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు దుమ్ముగూడెం ప్రోజెక్ట్ ప్రొపోజల్‌లో ఉండేది. అఅ ప్రోజెక్ట్‌ని రాజశేఖరరెడ్డి మింగేశాడు. ఈ వీడియో చూడండి: http://videos.teluguwebmedia.in/fbrgvtjployn

    ReplyDelete

Your comment will be published after the approval.