Monday, 17 February 2014

మేమేం చేస్తే అదే రైటు!!కొంతమందికి బుద్ధి సరిగా వికసించకపోవడం వలన చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అలాంటివారు వాస్తవాలను అంగీకరించక ఎప్పుడూ మేమేం చేస్తే అదే రైటు, ఎదుటివారేం చేసినా అది తప్పే అని వాదిస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే అలాంటివారంతా సీమాంధ్రా ఎంపీలుగానూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులుగానూ పదవులు వెలగబెట్టడం. వీరికి దన్నుగా ఉండే వర్గం వారు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంటారు.


వీరికి తమ ప్రత్యర్ధి వర్గాన్ని ఒక విషయంపై వెక్కిరించేప్పుడు అరే, తాముకూడా ముందు ఇలాంటి పనే చేశాం అని అస్సలు స్ఫురించదు, ఒకవేళ ఎవరైనా గుర్తు చేసినా పట్టించుకోరు. అలాగే తాము ఏదైనా చర్యను సమర్ధించుకునేప్పుడు ఇంతకంటే చిన్నవిషయంపైనే ఎదుటివారు చేసినపుడు తాము తిట్టిపోసిన విషయాలూ గుర్తుకురావు.


ఉదాహరణకు:


- తాము తమిళులు తమ ఉద్యోగాలూ, నీళ్ళూ దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడితే అదో పెద్ద గొప్ప విషయం. సరిగ్గా అదే డిమాండ్లతో తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పు.


- తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే అదో మహా పాతకం, దేశసమగ్రతకు ముప్పు. తాము కేంద్రాన్ని ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే అది మాత్రం ఒప్పు.


- రాష్ట్రంలో తెలంగాణబిల్లును తిరస్కరించే తీర్మానాన్ని అజెండాలో లేకుండా, సభ ఆర్డర్లో లేకుండా ఉండగా ముప్పై సెకన్లలో చదివి గెలిపించుకుంటే ఒప్పు. పైగా ఇది "unchallanged vote" అని ముఖ్యమంత్రి సమర్ధించుకోవచ్చు. అదే కేంద్రం  అజెండాలో చేర్చకుండా బిల్లు ప్రవేశపెడితేనే అది పెద్ద తప్పు.


- తెలంగాణవారు తాము ఒక మార్చ్ చేసుకుంటానంటే అనుమతించక నిర్భందాలూ విధిస్తే కడుపుమండి నాలుగు విగ్రహాలు కూలదోస్తే అది మహాపాతకం. అదే తమ ఉద్యమాల్లో జాతీయనేతల విగ్రహాలను తీరుబడిగా కూలదోస్తుంటే ఒప్పు. అంబేద్కర్ విగ్రహాలను పధకం ప్రకారం కూలదోస్తే ఒప్పు.


- తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే అదో మహానేరం. అదే తమ ఎంపీలు వీధిరౌడీల్లా ప్రవర్తించి తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లితే అది ఒప్పు. వీడియోల్లో స్పష్టంగా గాలిలోకి విచక్షణారహితంగా స్ప్రే చేస్తున్నట్లూ, స్పీకర్ పై కూడా స్ప్రే చేసినట్లూ తెలుస్తున్నా కేవలం ఆత్మ రక్షణ అని వాదిస్తారు.

ఇంకొన్ని 

* అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు. 

* అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది (http://www.youtube.com/watch?v=TO_QaM7PzRQ)

* తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన బాబు, చిరు, జగన్ లాంటి వారు దేశం ముద్దు బిడ్డలు.


- సినీనటి శ్రీయను కొందరు అడ్డుకుని "జైతెలంగాణ" అని అనమని బలవంతపెడితే మొత్తం తెలంగాణవాదులందరూ దానికి భాద్యత వహించాలి. అదే నటి తమన్నాను కొట్టినంతపని చేసి "జైసమైక్యాంధ్ర" అనమని బలవంతపెడితే ఎక్కడి దొంగలు అక్కడ గప్‌చుప్.


-- అదుర్స్ సినిమాను నడపకుండా అడ్డుకుంటామనిచెబితే వారు సంఘవ్యతిరేకులు. అదే రాంచరణ్ సినిమా తూఫాన్, మరో అల్లు అర్జున్ సిన్మా విడుదల కానీయకపోతే అది ఒప్పు.

- తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే అది విద్యార్థుల చదువులు ఖరాబు చేస్తుంది అని గగ్గోలు ( అందులో సగం దినాలు దసరా సెలవులే అయినా). అదే ఆంధ్రాలో వరసపెట్టి బందులు చేసినా, ప్రభుత్వ పాఠశాలలు నెలలతరబడి నడపక, ప్రైవేటు స్కూళ్ళు మాత్రం నడిపినా అది తప్పుకాదు. 

మీరు సామాన్యులు కాదురాబాబూ. లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ. 

19 comments:

 1. What you said is 100% correct.

  ReplyDelete
 2. ఇంకొన్ని

  * అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు.

  * అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది (http://www.youtube.com/watch?v=TO_QaM7PzRQ)

  * తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన బాబు, చిరు, జగన్ లాంటి వారు దేశం ముద్దు బిడ్డలు.

  ReplyDelete
 3. Leave alone accepting, we wont even listen to others' opinions. Whatever we say is correct. We wont accept any factula reports given by any committe like Srikrishna. We will spread hatred and rumours and our entire so-called movement is entirely built upon hatred and lies. We want to grab all the resources menat for all. We have great freedom of expression, i.e any one should accept and listen to our opinion only, that is the only right opinion. Others who oppose this are beaten verbally and physically. Threats, blacmail and extortions. This is the hallmark of our movement. And guess who are these. These are called " telabans" and the ideology is " telabanism"

  ReplyDelete
  Replies
  1. avunu avunu ye sri krishna commite gurunchi matduthunnavu raa bevakuf .... ye project ye nadhi kindha vundhi ani sarigga cheppani commite gurunchaa ... 8th chapter lanti chatta vaythre kaminaa chapter pettinaa commite guruincha .... commite nadusthunna samamymulo lo seemandhraa donga lu itchinaa party la jarupukunna commite guruinchaa ... kendram emi cheputhe adhe rasamu ani swyangaa sri krishnaa cheppukunna commite gururinchaa.... venagla rao nu tg CM jama kattina commite gurinchaa

   eviraa abddalu nalgonda lo vankaraa poyeenaa kallu abdddalaa .....dubai lo inki pothunna ... ,ma bathukulu abddamaaa ... krishna majority mahaboob nagar lo pravahisthunna valla bathukulu valasa bathuku lu chesindhi abddamaa .... vudhohyagaa lalo meeruchesinaa dopidiabddamaa ...ye andhrabank poyeee telusthadhiraa yedhi abddamu ani

   mee opnions memu vinaka povadma entiraa 20 channelu 10 pathiraklu pettu koni cheppinaabddau chepakundaa cheputhente .... lagadapni lantonee bagthsing ani poguduthunna etla nadusthunna yeaa raa...tirupathi lo hanmathu rao nu vadalula leud akkriki balinthaa nukudaa vadaledukada raa karnool lo

   poyeee chudu raa mee jp gadu parliament lo jariginaa sangatanaa valla spandhanaa gurunchi valla websites lo

   Delete
 4. T-lawyers obstructing Lagadapati is wrong. Andhra NGO's throwing shoes at Ahmadulla is correct.

  T-vadis saying "I will cut your tongue" to Mohan Babu is wrong. Ganga Bhavani saying the same to Nannapaneni is correct.

  ReplyDelete
 5. Did ever mention these are correct and those are wrong?
  I only told after this much destruction you want more destruction is the question I asked.
  I always told you cannot up stream water rather build lakes etc..
  up streaming water is a temporary solution not a permanent!
  Also I indicated earlier we all are feeling money is our ultimate aim, please come out of that.

  ReplyDelete
 6. Also one more thing who are other state mp's to decide the life of people living in Andhrapradesh, lets solve the problem in a way which make lots of employment in farming not in virtual area.

  ReplyDelete
  Replies
  1. One more addition to the list:

   Other state MPs cannot decide APs future, but other region's MLAs can decide Telangana future, they can defeat the bill, they can do whatever they want.

   Delete
  2. >>who are other state mp's to decide the life of people living in Andhrapradesh

   They are the one who got this real power from our Constitution. If you say they should not involve in AP matters, then you are questioning the power and authority of our Constitution.

   Delete
  3. But lets discuss what's needed and make it final by our self as bill.
   Also the draft bill didn't have any points on capital for new state which means Congress wants Hyderabad to become a union territory so that they need not build a new capital, how even you people can support such an act.
   Whats your point viswaroop you want other state mps to decide the future of your region by those who don't know the problems in your area?
   Just put in the problems infront of table as white paper we can make them solved.
   Also Tamilnadu asweill north Indian parties always tried to unstablize because
   Tamilnadu had seen water problem after Andhra formation and Center came into power by dividing Andhra people.
   When ever your speak againist United Andhra never point out Andhra state dividing from Madras provenience, because both are under different contexts, also those contexts are going even today!

   Delete
  4. @Gelli Phaneendra

   1) Other state MPs and ministers and not regionally biased, so they can decide better without prejudices. Thats the reason article 3 gives the power to center.

   2) Hyderabad won't be UT.

   3) Deciding capital from Seemandhra is a big exercise and cannot be resolved so easily. Every leader will likely to fight for his constituency as capital. That is the reason a separate commitee will be setup after division.

   4) The reasons quoted for andhra separating from Madras are exactly same as current situation. The comparison is valid and logical.

   Having said this we are against several clauses in the bill. What we condemn is showing them as reason to stop the bill itself.

   Delete
  5. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు:

   "who are other state mp's to decide the life of people": Parliament is the only authority to decide such matters. If you don't like it, try going back to the 26-01-1950 situation.

   "Tamilnadu had seen water problem after Andhra formation"

   I am really surprised at this assertion. The only major river basin shared by Andhra & TN is the highly deficit Penna.

   "both are under different contexts"

   The context is *exactly* the same i.e. article 3.

   Delete
  6. Tell me which state is not regionally biased
   1. Tamilnadu - biased to Tamil spekaing people
   2. Uttar pradesh - they them self have many cast fights with guns
   3. Bihar - they say entire country belongs to them and others should vacate India
   4. West Bengal -biggest state having locality as precedence
   5. Rajasthan - I am not sure much but there are still cultural suppressions happening
   6. J&K - Every one knows
   7. Gujrath - Still there are many hands on cultural suppressions
   8. Karnataka - Still fights with other states
   9. Kerala - don't see in front because their employment in mainly on tourism so they don't show up in front but in back they have
   10. Assam - You have kidnappers supported by local people
   11. Madya pradesh - Largest state with many people leave because they are discriminated in their state it self
   12. Sikkim - still people claim they are part of China

   did I ever mention to make Hyderabad as UT why in discussion with me you got the point Hyderabad as UT?
   Next capital of Andhra should be declared first hand and all the land purchases in that area should be stopped after announcement.
   The reason for seperate Andhra is not same as what the reason Telangana is pointed so don't mention both.
   I still say Telangana is brought into picture because of our countries biggest mistake of having 60 years as retirement age.
   Because those who got into post cannot leave the post till 40 years. Which increased the unemployement

   Delete
 7. >>But lets discuss what's needed and make it final by our self as bill.

  Show me a count of atleast 10 MLAs/MPs from Seemandhra who showed much interest to discuss this issue in assembly?

  This issues has been going on from past one decade(current wave), atleast from past 5+ years on it's peak, so can you tell me what progress we have made ourselves in terms of discussion?

  Do you think Seemandra leaders will come to a peaceful decision about their new capital? I am sure they will have a big fight about the capital location.

  ReplyDelete

 8. తమిళనాడునుంచి విడిపోయిన వ్యవహారానికి తెలంగాణా వ్యవహారానికి పోలిక లేదండి. ..తమిళనాడు నుంచి విడిపోయిన తెలుగువారు రాజధానితో రాలేదు. పోలిక ఉందంటే తెలంగాణా వారికి హైదరాబాద్ వద్దనుకోవాలి.

  తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పుకాదు . రాజధానితో సహా కోరితే మళ్ళీ అలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశ సమగ్రతకు ముప్పు అంటున్నారు.

  ప్రత్యేక దేశం కావాలని ఎవరు డిమాండ్ చేసినా ఒప్పు కాదు.

  అసెంబ్లీలో జరిగిందీ తప్పే. పార్లమెంట్లో జరిగిందీ తప్పే. ఏ బిల్లుకైనా సరైన పద్ధతి పాటించాలి.

  పెద్దవాళ్ళ విగ్రహాలను ఎవరు కూల్చినా తప్పే.

  అసెంబ్లీలోనూ మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, పార్లమెంటులోనూ మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి.

  అసెంబ్లీలో, పార్లమెంట్లో దాడులు జరగటం సరైన పనికాదు. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందే చూసుకోవాలి.

  తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన పార్టీలు ఉమ్మడి రాజధానితో సహా ఇస్తామని వాగ్ధానం చేసారా ?

  ఏ ప్రాంతంలో అయినా పిల్లల చదువులకు అడ్డంకులు సృష్టించటం సరైన పద్ధతి కాదు.

  తప్పులు ఎవరు చేసినా సరైన పద్ధతి కాదు. వాళ్ళు చేసారు కాబట్టి మేము చేస్తే మాత్రం తప్పేమిటి అనే వాదన సరైనది కాదు.


  ReplyDelete
  Replies
  1. హైదరాబాదు 1956లొ తెలంగాణాలో ఉండేది. అప్పటికే మహానగరం. ఆ విషయం మరిచారా లేదా తెల్వదా?

   "పార్లమెంట్లో దాడులు జరగటం సరైన పనికాదు": ఈ విషయం విశవాయువుతొ హత్యా ప్రయత్నం చేసిన మీ వారికి అర్ధం అయ్యేలా చెప్పండి

   Delete
  2. >>తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన పార్టీలు ఉమ్మడి రాజధానితో సహా ఇస్తామని వాగ్ధానం చేసారా ?


   ఆ సమయంలో ఉన్న 'తెలంగాణా ఏర్పాటు డిమాండు' ను నెరవెర్చుతామని పార్టీలు వాగ్దానం చేసాయి. తెలంగాణా అంటే పది జిల్లాలు మరియు హైదరాబాదుతో కూడినది. ఏవో అయిదారు జిల్లాలు ఇచ్చేసి అదే తెలంగాణా అని ఎవరినా అనగలరా?

   అది పక్కన పెడితే, హైదరాబాదు లేని తెలంగాణాకు మేం సుముఖం అని ఈనాడు ఏ పార్టి చెప్పటం లేదు, అప్పుడు చేసిన వాగ్ధానంలో హైదరాబాదు కూడా ఇస్తామని మేము చెప్పలేదు అని కూడా వారు అనటం లేదు, అంటే అర్థం హైదరాబాదు, తెలంగాణా వేరు కాదని కదా.

   >>రాజధానితో సహా కోరితే మళ్ళీ అలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశ సమగ్రతకు ముప్పు అంటున్నారు.

   దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేది ఒక ప్రాంతం తమ మంద బలంతో మరొక ప్రాంతంపై అన్యాయాలు సాగించినప్పుదు. మన రాష్ట్రంలో ఈ ముప్పు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుండే మొదలయ్యింది. తప్పు జరిగింది అని తెలిసి కూడా ఈ అరవై ఏళ్ల కాలంలో ఆ తప్పు సరిదిద్దుకోవటానికి ఏనాడు ప్రయత్నించలేదు.

   Delete
 9. ఇంకోటి

  "పక్కనున్న ఇంకో తెలుగోడు చట్ట బద్దంగా వాని ప్రాంతాన్ని రాష్ట్రంగా అడిగితె అది దేశ ద్రోహం, అదే మనం మన ప్రాంతాన్ని చట్ట విరుద్దంగా ప్రత్యేక దేశంగా(లేదా పాకిస్తాన్లోనో అమెరికాలోనో కలపటం) కోరితే అది విపరీతమైన దేశ భక్తీ"

  *గత కొన్ని రోజులుగా సమైక్యవాదులు తమ ప్రాంతాన్ని ప్రత్యెక దేశం చెయ్యాలని, పాకిస్తాన్లోనో లేక అమెరికాలోనో కలపాలని చేస్తున్న డిమాండ్లను గుర్తు చేస్తూ.

  ReplyDelete

Your comment will be published after the approval.