Sunday, 18 May 2014

పవన్ పార్టీ అంతా డ్రామాయేనా?



ఒక అయిదారు నెలలకిందటివరకూ సీమాంధ్రలో ఏసర్వే చూసినా జగన్‌దే గెలుపని తేల్చింది. జగన్ కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తానే గెలుస్తానని అనుకున్నాడు. అయితే చివరికి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుదే పైచేయి అయింది. ఇందుకు చంద్రబాబు కలిసొచ్చిన రెండు అంశాలు ఒకటి దేశమంతటా మోడి గాలి వీస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాగా రెండోది పవన్ కల్యాన్ ద్వారా కలిసొచ్చిన కాపు వోటు బ్యాంకు.

సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు మూడు అగ్రకులాల చుట్టూనే తిరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో తెదేపా కమ్మల పార్టీ కాగా జగన్‌కు రెడ్డి, దళిత క్రిస్టియన్ల మద్దతు ఉన్నది. కమ్మలకంటే దళిత క్రిస్టియన్లు కలిపి ఎక్కువ వోట్లు ఉంటాయి కాబట్టి నిన్నమొన్నటిదాకా జగన్‌దే పైచేయిగా ఉంది. ఎప్పుడైతే కాపు వోట్లు కూడా కలిసొచ్చాయో అప్పుడు సమీకరణం తారుమారయింది.

క్రితంసారి ఎన్నికల్లో కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈసారి చిరంజీవి కాంగ్రేసులో ఉన్నాడూ కనుక కాపులు కాంగ్రేసుకు వోటువేయాల్సింది. కానీ కాంగ్రేసు గెలుస్తుందని చిరంజీవి సహా ఎవ్వరికీ నమ్మకం లేదు కాబట్టి కాపులు జగన్ వైపు ఉండటమే బెటరనుకునారు. ఎప్పుడైతే పవన్ జనసేన పార్టీ అంటూ పెట్టి ఎండీయేకి మద్దతు ఇచ్చాడో అప్పుడు కొందరు ఇటువైపు తిరిగారు.

అయితే ఇప్పుడొస్తున్న సందేహం పవన్ కళ్యాన్ పార్టీ పెట్టినందున నిజంగా చిరంజీవి ఫామిలీ రాజకీయంగా విడిపోయిందా లేక అంతా ఉత్తుత్తి డ్రామానా అని. బహుషా చిరంజీవి కూడా ఊహించి ఉంటాడు.."ఎలాగూ కాంగ్రేస్ గెలిచేది లేదు. కాపులంతా కాంగ్రేస్‌కు వోటు వేస్తే అది జగన్‌కే లాభం. దానిబదులు టీడీపీకి వోటు వేస్తే జగన్ను వోడించొచ్చు. కానీ కాంగ్రేస్లో ఉండి అలా చేయమని చెప్పే ధైర్యం చిరంజీవికి లేదు. పోనీ తానే పార్టీ మారుదామన్నా అప్పుడే రెండు పార్టీలు మార్చిన చిరంజీవికి మరో పార్టీ మార్చే ధైర్యం లేదు. అందుకే బహుషా చిరంజీవి తమ్ముడు పవన్ను ముందు పెట్టి కాపు వోట్లు టీడీపీకి వేయించి ఉంటాడు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  

4 comments:

  1. కోటి రత్నాలవీణగారు, ఇతరరాష్ట్రాలమీద పడి ఏడవటం మీకు ఇంకా అవసరమా?
    కేసీఆర్ మహాశయుల నిరాహారదీక్షనాటకం లాంటివే అందరి అన్ని ప్రవర్తనలూ‌ అనుకుంటే ఎలాగండీ మరీ?

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, పక్కదేశాల్లో జరుగుతున్న విషయాలను మాట్లాడుకోగా లేనిది పక్క రాష్ట్రం విషయం రాస్తే మీకెందుకు ఉలుకు? మీఅంత సంకుచిత బుద్ధి మాకు లేదు, రాష్ట్రం విడిపోయినా అందరూ భారతీయులే, మనవారే అని మేము నమ్ముతాం.

      అయినా పవన్ కల్యాన్, చంద్రబాబు పక్క రాష్ట్రంలో మాత్రం ప్రచారం చేసి ఊరుకోలేదే, ఇక్కడ కూడా పుడింగులలా ప్రచారానికి వచ్చారే? మరి వారిగురించి మేమెందుకు మాట్లాడగూడదో?

      ఎవరివి దీక్షలు నాటకాలో, ఎవరివి ప్రజలకోసం చేసినవో ఎలక్షన్లలో ప్రజలు దిమ్మతిరిగేట్టు సమాధానమిచ్చారు, అయినా తమబోటివారికి తలకెక్కినట్టులేదు.

      Delete
    2. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక కూడా చంద్రబాబునాయుడు మాత్రం పక్కరాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వద్దామని ఏడవవచ్చు

      Delete
    3. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక కూడా చంద్రబాబునాయుడు మాత్రం పక్కరాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వద్దామని ఏడవవచ్చు

      Delete

Your comment will be published after the approval.