Image courtesy: http://gideetelangana.blogspot.com/
పదేళ్ళనుండీ మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడూ, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణను మానిఫెస్టోల్లో పెట్టి రాజకీయం చేస్తున్నప్పుడూ ఏనాడూ పట్టించుకోని సీమాంధ్రులు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తరువాత ఏదో కొంపలు మునిగిపోయినట్లు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. ఈఉద్యమం నాయకులు తయారుచేసిన కృత్రిమ ఉద్యమం అయినప్పటికీ ఈఉద్యమం ద్వారా మీడియా సహాయంతో వీరు తెలంగాణ వస్తే ఆంధ్రా ప్రజలకు నష్టం వాటిల్లుతుంది, హైదరాబాదునుండి తరిమేస్తారు, క్రిష్ణా గోదావరి నీల్లు రావు లాంటి భయాందోళనలు సృష్టించడంలో కృతకృత్యులయ్యారు. అసలింతకూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నష్టపొయ్యేదెవరో, లాభపడేదెవరో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.
1) ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారం ఎప్పుడూ రెండు అగ్రకులాల చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి కమ్మలకు అధికారం వస్తే మరోసారి రాయలసీమ రెడ్లకు వస్తుంది. రాష్ట్రజనాభాలో వీరిశాతం కొద్దిదయినప్పటికీ అధికారం వీరిచేతిలో ఉండడానికి కారణం పెద్దరాష్ట్రంలో అధికారం రావాలంటే కావాల్సిన ధనబలం, మీడియా బలం వీరిదగ్గర ఉంది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని దళితులు, బీసీలు అధికారానికి దగ్గరవుతారు. ఈకారణం వల్లే సీమాంధ్రలోని దళిత మహాసభ, బీసీలు విభజనకు మద్దతు ఇస్తున్నారు.
2) సమైక్యరాష్ట్రంలో తెలంగాణలాగే ఉత్తరాంధ్ర కూడా నిర్లక్ష్యానికి గురి అయ్యింది. రాష్ట్ర విభజన జరిగితే చిన్న రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నాయకులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించి తమప్రాంతానికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
3) సీమాంధ్రలోని మరో ప్రముఖ సామాజికవర్గమయిన కాపులు సమైక్యరాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నా వారికలలు నిజం కావడంలేదు. విభజన జరిగితే వీరు సీమాంధ్రలో బలమయిన వర్గంగా తయారవుతారు. అప్పుడు వీరికి అధికారం రావడం చాలా సులభం.
4) ఓడరేవు, పరిశ్రమలూ కలిగిన విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెంది త్వరలో దేశంలో పెద్ద నగరంగా ఎదగగలదు.
5) కొత్త రాజధాని ఎక్కడయితే అక్కడ రాజధానివలన అబివృద్ధి జరిగి ఆప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది.
6) విడిపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వోద్యోగులు రెండు రాష్ట్రాలలో విడిపోయినప్పటికీ కొత్త ఉద్యోగాలు సీమాంధ్రలో ఎక్కువగా అవసరం అవుతాయి. హైదరాబాదులో ఉండే ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు ఎక్కువమంది అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కనుక వారి స్థానాలవల్ల ఆంధ్రాప్రాంత యువకులు ఎక్కువలబ్ది పొందురారు.
ఈవిధంగా సీమాంధ్రలో సుమారు ఎనభైఅయిదు శాతం దాకా విభజన వలన లాభపడతారు. కానీ నష్టపోయే కొద్దిశాతం మంది మొత్తం అందరికీ విభజనవలన నష్టం కలుగుతుందే అనే ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఇంతకూ ఈనష్టపొయే కొద్దిమంది ఎవరు?
1) లగడపాటి, రాయపాటి, కావూరు, సుబ్బరామిరెడ్డి, టీజీ వెంకటేశ్ లాంటి సీమాంధ్ర నాయకులు సివిల్ కాంట్రాక్టు వ్యాపారాలు చేస్తూ అధికారం ద్వారా సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. విభజన జరిగితే వీరు ఇక సీమాంధ్ర ప్రాంతంలోని కాంట్రాక్టులకే పరిమితం కావాల్సి వస్తుంది.
2) రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్నవారు విభజన వలన తమ వ్యాపారాన్ని రెండుగా విడగొట్టి రెండు ప్రాంతాల్లో రెండు సంస్థలుగా నడపడమో లేక ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కావడమో చేయాల్సివస్తుంది. వీరి వ్యాపారాలకు విభజన దెబ్బ తీవ్రంగా ఉంటుంది.
3) అధికారాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాదులో భూకబ్జాలకు పాల్పడ్డ సీమాంధ్ర నాయకులకు పెద్ద దెబ్బే తగులుతుంది. విభజన తరువాత హైదరాబాద్ పరాయి రాష్ట్రంలో భాగమవుతుంది. సొంతరాష్ట్రంలో ఉన్న అధికారసౌలభ్యం అక్కడ ఉండదు.
4) సమైక్య రాష్ట్రంలో రాజకీయ, మీడియా, సినీఫీల్డ్, వ్యాపార రంగాల్లో ముందుండి క్రిష్ణ కింద పొలాలు అధికంగా కలిగిన కమ్మసామాజిక వర్గం ప్రస్తుతం సమైక్యరాష్ట్రంలో విపరీతంగా లాభపడుతుంది. విభజన వల్ల వీరికి గట్టి దెబ్బ తగులుతుంది. వీరి వ్యాపారాలు ఒక రాష్ట్రంలో, వీరి జనాభా మరొక రాష్ట్రంలో మిగిలిపోయి రెండు రాష్ట్రాల్లో వీరు అధికారానికి దూరమవుతారు.
5) రాయలసీమలో ఫాక్షన్ రాజకీయాలు చేసే వర్గానికి విభజన వలన దెబ్బ తగులుతుంది. చిన్నరాష్ట్రంలో బడుగులు అధికారానికి దగ్గరయితే వీరి పెద్దరికం తగ్గిపోయి అధికారం దూరం కావొచ్చు.
మొత్తంగా విభజన వలన సీమాంధ్రలో మెజారిటీ లాభపడితే కొద్దిశాతం మందికి మాత్రం నష్టం జరుగుతుంది. నిజానికి దీన్ని నష్టం అనడం కూడా సరికారు. మితిమీరిన లాభం అనుభవిస్తున్న వారికి కొంత లాభం తగ్గితే అది నష్టం కాదు. అయినా మనిషి ఆశకు అంతులేదుకదా, వీరు దాన్ని నష్టం కింద లెక్కేసుకుని తమలాభం తగ్గకూడదనే దురుద్దేశంతో రాష్ట్ర విభజనకు అడ్డుపడుతూ విభజన జరిగితే సీమాంధ్రలో అందరికీ నష్టం అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తున్నారు. ఇకనయినా సీమాంధ్రలోని మిగతా ఎనభై ఐదు శాతం మంది తమపై జరుగుతున్న కుట్రను తెలుసుకుని దాన్నుంచి బయటపడితే తెలంగాణలో, సీమాంధ్రలో మెజారిటీకి లాభం జరిగేలా విడిపోవచ్చు.
చివరగా...విభజనను అడ్డుకునేవారు తెలుగు జాతి విడిపోగూడదు, తెలుగు జాతి ఐక్యత లాంటి కబుర్లెన్నో చెబుతారు, కానీ వారి అసలు ఉద్దేషం విభజన వలన వారి లాభాలు తగ్గిపోవడమే. లేకపోతే తెలంగాణకు న్యాయం జరుగుతుందనగానే జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసినవారికి తెలుగుజాతి ఐక్యతపై ఒక్కసారి అంతప్రేమ ఎలాపుట్టుకొస్తుంది? సీమాంధ్ర సామాన్య ప్రజలారా, ఆలోచించండి.
నేనిది ఏ ప్రాంతాన్ని ,కులాల్ని ,దృష్టిలో పెట్టుకొని వ్రాయడం లేదు.విడిపోతే అందరికీ నష్టమే.శాతవాహనులు,విష్ణుకుండినుల కాలంలో దక్షిణాపథం అంతా పాలించినవారు,కాకతీయులు,రాయల వారు పాలించినప్పుడు కలిసినవారు,నిజాం పరిపాలనలో కూడా (నిజాం బ్రిటిష్ వారికి విడదీసి ఇచ్చేవరకు )కలిసినవారు,1956నుంచి కలిసినవారు ,ఇప్పుడు విడి పోవలసిన అవసరమేమీ లేదు.భారత్లోని రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన వాటిలో ఒకటిగావున్న రాష్ట్రం విడిపోతే మన అందరికీ నష్టమే.నేను అన్ని జిల్లాలు చూసాను.అభివృద్ధిలో పెద్ద తేడాలు లేవు.అంధ్రుల(అంటే తెలుగు వారందరూ, అనిప్రాంతాలు,జిల్లాలవారు,) ప్రతిష్ఠ,సంపద,glory,పలుకుబడి కలిసి వుంటేనే పెంపొందుతాయి.భాషాప్రాతిపదిక మీద ఏర్పడ్డ మహారాష్ట్ర,గుజరాతు,కర్ణాటక,కేరళ ,తమిళ్నాడు, ఒడిస్సా ,బెంగాలు,కలిసి ఉండగా,మనమెందుకు చేజేతులా మన భవితవ్యాన్ని పాడు చేసులోవాలి? ఈ విషయంలో తెలుగు మేధావుల మౌనాన్ని,నిర్లిప్తతనీ నేను నిరసిస్తున్నాను.
ReplyDeleteకమనీయంగారు వ్రాసినది సబబుగా ఉంది.
ReplyDeleteరాష్ట్రం ముక్కలయితే మరి కొంత మందికి రాజకీయలబ్ధి కలగ వచ్చునేమో కాని తెలుగుజాతికి తీరని నష్టం.
అసలు ఆంధ్రప్రదేశం యేర్పాటు చేసినప్పుడే తెలుగు ప్రాంతాలకు బాగానే కత్తెరలు వేసారు. పర్లాకిమిడి, బళ్ళారి వగైరాలు, ఆట్టే మాట్లాడితే మదరాసు కూడా, మనవే - కాని రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా శాశ్వతంగా కోల్పోయాము.
రామారావు గారు తెలుగుజాతి కీర్తిని దిగంత పరివ్యాప్తం చేస్తే, కల్వకుర్తివారు ఆ కీర్తిని రొచ్చుగుంటలోకి త్రోసివేసారు.
ప్రస్తుత తరం తెలుగువాళ్ళు అయితే డబ్బు సంపాదన యావ తప్ప తెలుగుభాషా, తెలుగుజాతీ యెక్క భవిష్యత్తులను గూర్చి ఆలోచింఛే తీరికలేకుండా ఉన్నారు. పెరుగుతున్న మొలకతరంకు ఆవేశాలు కావేషాలు నూరిపోస్తూ వాళ్ళని రాజకీయులు ఆత్మహత్యలవైపు తరుముతూ పోతున్నారు.
ఇదంతా చాలా ఆవేదన కలిగిస్తోంది.
రాయుల పాలనలో తెలుగువాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారు? కృష్ణా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాలు మాత్రమే రాయులు పరిపాలనలో ఉండేవి.
ReplyDeletehe occupied upto vizag
Deleteకమనీయం గారు,
ReplyDeleteపెద్దలు మీరు ఇలా రాయడం బాగోలేదు. భారత ప్రభుత్వ రూరల్ డెవలప్మెంట్ నివేదికలో తెలంగాణలో ఎనిమిది జిల్లాలు అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించబడ్డాయి. ఈజిల్లాలు వెనుకకారణం ప్రకృతి సంపదల లోటు కాదు, కేవలం పాలకుల నిర్లక్ష్యం. పరిపాలనలో వివక్ష ఉన్నప్పుడు ఒక్కటిగా కలిసి ఉండడం సాధ్యం కాదు.
శ్యామలీయం గారు,
ఒకవైపు ఒక ప్రాంతాన్ని ఉద్దేషపూర్వకంగా వెనక్కినెట్టేసి కొద్దిమంది లాభపడుతూ తెలుగుజాతి ఐక్యత, విడిపోతే తెలుగుజాతికి తీరని నష్టం అంటూ కబుర్లు చెబితే ఏంలాభం? స్వార్ధంతో బలవంతంగా కలిపి ఉంచడం కన్నా విడిపోయి ఎవరిబాగు వారు చూసుకోవడం ఉత్తమం. కలిసుంటే బాగుపడేది వ్యాపారులూ, నాయకులూ, విడిపోతే బాగుపడేది సామాన్యులు అని ఈవ్యాసం చదివితే అర్ధం అవుతుంది. రాష్ట్రాలు సామాన్యులకోసం ఏర్పడాలి కానీ వ్యాపారులకోసం, రాజకీయ నాయకులకోసం కాదు.
మనం రెండు రాష్ట్రాల్లో ఉండికూడా చక్కగా తెలుగు భాషకు సేవచేసుకోవచ్చు. రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నంతమాత్రాన తెలుగు భాషకు లోటేం రాదు. ఇంగ్లీషు, స్పానిష్, జెర్మన్ మాట్లాడేవారు ఎన్నో దేశాల్లోనూ హిందీ మాట్లాడేవారు ఎన్నో రాష్ట్రాల్లోనూ ఉండికూడా చక్కగా వారిభాషను అభివృద్ధి చేసుకుంటున్నారు.
ఉద్దేశపూర్వకంగా యెవరూ యెవరినీ నెట్టివేయలేదనే నా అభిప్రాయం. "ఎవరిబాగు వారు చూసుకోవడం ఉత్తమం." అనే తమ మహత్తరమైన నీతిని పూర్వం జయచంద్రాదులు అనుసరించి భారతదేశానికి దాస్యం తలకట్టారు. మీ వ్యాసం చదివాను కాని, "విడిపోతే బాగుపడేది సామాన్యులు" అన్న వాదన చాలా అసంగతంగా అనిపిస్తోంది. అలాగయితే తెలుగుగడ్డని - రెండేమి కర్మ - ముక్కముక్కలు చేసి సామాన్యులు అద్భుతంగా బాగుపడే అవకాశం ఇవ్వాలన్నమాట. "రాష్ట్రాలు సామాన్యులకోసం ఏర్పడాలి కానీ వ్యాపారులకోసం, రాజకీయ నాయకులకోసం కాదు." అన్న సుభాషితం నచ్చింది. కాని మీరనుకుంటున్న తెలంగాణా యేర్పడితే బాగుపడేది అక్షరాలా వ్యాపారులు రాజకీయనాయకులే. ముఖ్యంగా KCR & Co. కాని జనం బాగుపడేది యేమీ ఉండదు - అంతా మీ భ్రమ. "రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నంతమాత్రాన తెలుగు భాషకు లోటేం రాదు. " - కావచ్చు. కాని అది నిరూపించటానికి గడ్డ పగులగొట్టాలంటారు!
Deleteఅధికారంలో ఉన్నవారు ఎవరిబాగును వారు చూసుకోవాలి ఆనిచెప్పి తమ ప్రాంతానికే ఫండ్సు తరలించడాన్నే మరో భాషలో ఉద్దేషపూర్వకంగా వెనక్కి నెట్టివేయడం అంటారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు అన్ని ప్రాంతాలకు ప్రతినిధులుగా వ్యవహరించాలి, సీమాంధ్ర ముఖ్యమంత్రిగానో కడప ముఖ్యమంత్రిగానో కాదు. అది జరగడనంతవరకూ ఇలాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. పాలనలో వివక్ష, తెలుగుజాతి ఐక్యత రెండూ కావాలంటే కుదరదు.
Deleteపెద్దన్నా నేను వ్రాసినా కామెంట్స్ ని ఆమోదించలేదు... ఎవరో వచ్చి మనని నాశనం చేయటం లేదు.. మనకళ్ళని మనమే పోడుచుకుంట్టున్నాం... తెలంగాణా ఉద్యమం వల్ల మనం ఎంత నాశనం అయిన మనవారికి అవసరం లేదు.. నిన్ను చుస్తే అర్ధం అయింది ఉద్యమాన్ని చేయండి కానీ మనని మనం నాశనం చేసుకోవద్దు అని తెలంగాణ ప్రజలు చెప్పిన మీ చెవులకు ఎక్కదు...మీరు తెలంగాణా కోసం బ్లాగ్ లు వ్రాయటం తెలంగాణ పౌరుడిగా నేను సిగ్గు పడుతున్నా మిమ్ములను చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు... చెప్పుతున్నగా చూడు మన ప్రజలు ప్రత్యెక తెలంగాణా అంటే తెలంగాణ ప్రజలే వెంట పడి తన్నే రోజులు వస్తాయి...
ReplyDeleteఅరవై ఏల్లనుంచీ ఈనేల కష్టాలు పడుతూనే ఉంది. ఇప్పుడు ఉద్యమం వలన మరికొన్ని రోజులు కష్టపడడం పెద్ద విషయం కాదు. నీది తెలంగాణ కాదనే విషయం తెలుస్తూనే ఉంది. చర్చ హుందాగా ఉన్నంతవరకూ విమర్శలు ఎవరివయినా ప్రచురించబడుతాయి, వెకిలిరాతలకు మాత్రం ఇక్కడ స్థానం లేదు.
Deleteviswaroop's arguments have some brownie points no doubt. Coming to my self I belong to both the regions. I have born brought up educated and employed in Hyderabad, while my parents hail from uttarandhra. I consider my self as an andhraite only not that I have any dislike for telangana or its people. Andhra word is applicable for all telugus, as were were referred to since time immemorial, from the period of Aiteraye Brahmana. That was the reason why freedom fighter and great literary figures like suravaram pratapa reddy and dhashardhi etc called themselves 'Andhraites' and found andhra janasangam in Hyderabad way back in 1920 itself. My concept of visalandhra is different. Telugu people can live like brothers in two states. For that you have to build broad consensus with out hurting the feelings of the people of other regions. Hyderabad's population has reached nearly one crore, burgeoning population is putting huge pressure on its resources and infrastructure. Why cant we build another world class capital with the best infrastructure and lessen the pressure on Hyderabad city? Why cant we think out of box. In order to facilitate the new kind of thinking, T separatist should first of all change their stance. So long as they brand SA people as cheats, looters, userpers, colonialists, etc. a person like me has no other go except to say 'Jai samikyandhra' and attack them with same ferocity. I reject all those base less allegations thousand times with equal ferocity. Yes I agree some mistakes have taken place. 1st of all a gentleman par excellence, kind hearted person like Burgula should have been the 1st CM of AP. Instead haught and feudalistic Neelam was made a CM. Burgula's sacrifice was in no way less significant than that of Potti sriramulu in formation of AP, why his contribution was totally forgotten in unified state? Why there was not a single statue of Burgula any where in SA cities or towns? Kakatiya prataparudra was the last chivolorous andhra ruler ( telugu) who ruled entire present day AP. Why he was not given pride of a place by us? Why there was no stutues of kakatiya rulers on tank bund? When AP was formed, no doubt T was very backward economically and educationaly, in order to protect them roster system should have been implemented in AP secreteriat or else where instead of confusing GOs like 610 and controversial rules like Mulki rules etc. In a 100 point roster 1st 40 jobs should have been reserved for T people leaving rest of 60 to SA. 80-20 roster should have been used in other T districts. That simple formula would have solved all our problems. Any way at this juncture there is no point in worrying about spilt milk. For a person like me both unified state, or two separate states are OK. But this inter telugu fued should end and 10 crore telugu people should live peacefully and happily. While tamils, malayalis, gujs, are living happyly why we telugus are fighting like proverbial dogs?
ReplyDeleteకళ్యాణ్, వాళ్ళు సమైక్య రాష్ట్రం కోరుతున్నది సురవరం ప్రతాపరెడ్డి వారసత్వం కోసమో, దాశరథి రంగాచార్య వారసత్వం కోసమో కాదు. వాళ్ళు మేడి పండు లాంటి హైదరాబాద్ కోసమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆ మేడి పండు లేకపోతే వాళ్ళు సమైక్యత అనే మాట కూడా పలకరు. తెలుగులో ఇంగ్లిష్ పదాలు కలపకుండా మాట్లాడితే ఎర్ర బస్సు ఎక్కేవాణ్ణి చూసినట్టు చూసేవాళ్ళు హైదరాబాద్ విషయానికొచ్చినప్పుడు మాత్రం సమైక్యత గురించి మాట్లాడుతారు. వాళ్ళకి భాష కమ్యూనికేషన్ కోసం అవసరం లేదు కానీ ఒక మేడి పండు పేరు చెప్పుకోవడానికి మాత్రం అవసరమయ్యింది.
ReplyDelete"సమైక్య రాష్ట్రం కోరుతున్నది సురవరం ప్రతాపరెడ్డి వారసత్వం కోసమో, దాశరథి రంగాచార్య వారసత్వం కోసమో కాదు. వాళ్ళు మేడి పండు లాంటి హైదరాబాద్ కోసమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకుంటున్నారు."
ReplyDeleteతొక్కేం కాదు? సరే కొంతసేపు నిజాలని పక్కన పెట్టి మీరన్నదే కరెక్ట్ అనుకుందాం. మరి మీరెందుకు హైదరాబాద్ నే పట్టుకు వేలాడుతున్నారు. హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే తెలంగాణా మొత్తాన్ని సస్యశ్యామలం చేసుకోవచు కదా. ఎలాగూ హైదరాబాద్ అంత సీమంధ్రులు occupy చేసారు అని మీరే చెప్పుకుంటారు కదా. అది మాత్రం కుదరదు. ఇన్ని రోజులు రాజధాని కదా అని అందరూ పెట్టుబడులు పెట్టడం వల్ల హైదరాబాద్ ఆదాయం పెరిగితే, ఆ ఆదాయం మొత్తం తెలంగాణా వారె అనుభవించాలని మీ కుటిల యత్నం.
ఇక ఎప్పుడు మీరు చెప్పేది తెలంగాణా వెనుకపడింది అని. దానికి కారణం ఎవరు. మీ ప్రాంతానికి MLAs , MPs etc ఎవరు అయ్యారు? సీమంద్రులా? అంటే మీ MLA లకి MP లకి 60 సంవత్సరాలయినా ఒక ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలో తెలీదు. కానీ ఏ నాయకుడయినా కోటీశ్వరుడు కాని వాడు ఉన్నాడా తెలంగాణా లో?
ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. మహబూబ్ నగర్ ఉత్తీర్ణత శాతం 18 % అట. రాష్ట్రము లోనే అతి తక్కువ.(ఇది కూడా సీమంద్రుల కుట్రే అనకండి. కింద పది నవ్వాల్సోస్తుంది). దానికి MP మన ఘనత వహించిన కెసిఆర్ గారు. ఈయనా మీ తలరాతలు మార్చేది. ఎంత అమాయకులయ్యా? ఇంతకుముందు నవ్వుకునే వాడిని కాదు కానీ ఇప్పుడయితే మీ తెలివిని చూసి నిజంగానే నవ్వొస్తోంది.
నేనేమీ తెలంగాణాలో నివాసం ఉండడం లేదు. తెలంగాణాకి హైదరాబాద్‌ని కాకుండా నిజామాబాద్‌ని రాజధాని చేస్తే నాకు అభ్యంతరం లేదు. హైదరాబాద్ కోసం వీధిలో గంతులేస్తోంది సమైక్యవాదులే కానీ తెలంగాణావాదులు కాదు.
Delete"హైదరాబాద్ కోసం వీధిలో గంతులేస్తోంది సమైక్యవాదులే కానీ తెలంగాణావాదులు కాదు."
Deleteఅవునా మరి తెలంగాణావాదులు అంత గంతులేయకపోతే హైదరాబాద్ వదిలేసుకోవచ్చుగా
@సత్యం
DeleteHere you can find the answer for your meaningless ugly remark.
http://www.youtube.com/watch?v=9DC8pNhTEPE
By the way why don't you suggest your leaders to make such a demand in case of division? Why do they talk about "Telugu jathi aikyata" for which they never do care about?
we dont want even an inch of your hyderabad but definitely andhras will develop their cities 10000 times better than hyderabad
ReplyDeletelooking at history gujaratis and marathis fought for mumbai but gujarathis had settle for ahmedabad,the development of maharastra is nothing if mumbai is removed but gujarat is setting an example in terms of development.likewise telangana cannot survive without hyderabad even for a day but andhra can survive for millions of years.history is repeating again the day is not too far where our country talks about andhra as a model state.
@jai andhra
DeleteThat should be the spirit my fried. Tell the same to your leaders like Lagadapati, Kavuri, TG Venkatesh and others who are obstructing telangana formation for their selfish interests.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణా ప్రయోజనాలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణా ప్రయోజనాలకి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం వస్తుంది. తెలంగాణా ప్రయోజనాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌కి ఇంపార్టెన్స్ తగ్గించే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చినప్పుడు మాత్రం సమైక్యవాదం పడగలు విప్పుతుంది.
ReplyDelete"రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణా ప్రయోజనాలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణా ప్రయోజనాలకి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం వస్తుంది."
Deleteరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి సీమాంధ్ర ప్రయోజనాలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సీమాంధ్ర ప్రయోజనాలకి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమం వస్తుంది. ఇద్దరిదీ పక్కోడి మీద ఏడుపే ప్రవీణ్
@సత్యం
DeleteJai Andhra movement was NOT because of some incorrect decisions taken by rulers to favor Telangana. Jai Andhra movement was the result of supreme court's ruling to give JUSTICE to Telangana. Hope you can comprehend the difference.
యత్ర యత్ర మందంగి దర్శనం
ReplyDeleteతత్ర తత్ర కువ్యాఖ్య గోచరం
లుప్తతర్కవిపరీతవాదనా
లోలుపం విషయోన డుండుకమ్.
@శ్యామలీయం
Deleteప్రవీణ్ రాసిన కామెంటు అర్ధవంతమయింది. మీ సంస్కృత పాండిత్యం ఇక్కడ అనవసరంగా వాడినట్లు అనిపిస్తుంది.
మొన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన లీడర్లలో చాలామంది ఒకప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నవారే. జైఆంధ్రా ఉద్యమం మొదలయిందే సుప్రీంకోర్టు తెలంగాణకు న్యాయం చేసేలా తీర్పు ఇచ్చినందుకు. కోర్టు తీర్పునే గౌరవించక ఉద్యమం లేపినవారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమకు పాలకుల పక్షపాతం వల్ల జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే మాత్రం తెలుగుజాతి ఐక్యత గురించి పాఠాలు చెబుతున్నారు. అవసరం తమదయితే విడిపోతామ్ని లేకపోతే తెలుగుజాతి ఐక్యత అనేవారి వాదనలో నీతి ఎక్కడుంటుంది?
"మొన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన లీడర్లలో చాలామంది ఒకప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నవారే."
Deleteఅచ్చం ఇప్పుడు తెలంగాణా ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్న లీడర్లలో చాలా మంది ఒకప్పుడు సమైక్యవాదాన్ని సమర్ధించినట్టే
@సత్యం
DeleteHope you do understand the difference between talking in favor of some ideology and leading an agitation.
ఎందుకండీ....!!! ఈ తెలంగాణా... రాయలసీమ, ఆంధ్రా....!!!
ReplyDeleteఅందరం ముందు భారతీయులం.. ఆతరువాతే.. ఆంధ్రానా... తెలంగాణా రాయలసీమా అని..
కష్టపడి బ్రతికేవాడు.. ఎక్కడైనా బ్రతకగలడు..
తన కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితులలో అయినా... మంచి భవిష్యత్ ని ఇవ్వగలడు.. అలా ప్రతి మనిషీ.. తన జీవితం .. తన కుటుంబం బాగు చేసుకుంటే.. సమాజం, గ్రామం, ఒకటొకటిగా.. రాష్ట్రం. దేశం... అభివృద్ధి చెందే అవకాసం వుంటుంది.
డబ్బుల కోసం, కులం కోసం, మందుకోసం, స్వార్ధం కోసం.. మనం మన నాయకులను ఎన్నుకున్నంతకాలం...
ఈ కక్షలు కార్పణ్యాలు, అరాచకాలుతో.... ఇబ్బంది పాడేది.. సామాన్య మానవుడే! మనలాటి.. సామాన్యులే.. అన్న సంగతి మరువకుండా....
ప్రతిమనిషీ.. తన కుటుంబస్తాయి నుంచి.... కష్టపడి.... బాగుచేసుకోవడం ఇప్పటికన్నా మొదలుపెడితే.. కనీసం మరో 50 ఏళ్ళకన్నా.. మన దేశం. అభివృద్ధి చెందిన దేశం అవుతుంది.. లేదంటే..
:)
పై అనానిమస్,
Deleteఒక్కసారి పేద, సామాన్య దిగువమధ్యతరగతి కుటుంబాలదగ్గరికెల్లి చూడండి. వారు తమ కుటుంబాల బాగుకోసం ఎంతకష్టపడతారో. కష్టపడినవారందరికీ బాగుపడే అవకాశం దొరకగల్గితే అంతకంటే ఇంకేం కావాలి? కానీ సమాజంలో బలమైన వర్గం బలహీనవర్గాన్ని అణగదొక్కుతుంటే ఎంత కష్టపడ్డా పైకిరావడం కుదరదు..అందుకే ఇలాంటి ఉద్యమాలు. అవి ప్రాంతీయ ఉద్యమాలు కావొచ్చు, బలహీనవర్గాలవారి ఉద్యమాలు కావొచ్చు, అవినీత్ వ్యతిరేక ఉద్యమాలు కావొచ్చు.
విశ్వరూప్ గారు,
Deleteనేను అలాటి వారిని చూస్తూనే వున్నాను.. వాళ్ళు కష్టం, కష్టం గానే పడుతుంటారు. కష్టపడి తమకుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ కి భవిష్యత్తు కల్పిస్తూనే వున్నారు, నేటి పోటీ ప్రపంచలో.. జ్ఞానం సంపాదించుకున్న వాడిని ఎవరూ అణగాదోక్కలేరు. అవకాశాలు పుష్కలంగా వున్నాయి.. కనీ.. వారి ఆ ఆధైర్యాన్ని, వాళ్ళు నమ్ముకున్న నాయకులే, దారి చూపిస్తామని వక్ర మార్గం పట్టించి .. వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టేస్తున్నారు కదండీ..!!!
ఒక చిన్న ఉదాహరణ..
నేటి హైదరాబాదును ఒకసారి.. నాలుగు ఐదేళ్ల క్రితం హైదరాబాదుతో పోల్చండి.. మనం ఏమి కోల్పోయామో... ఇంకెంత కోల్పోతున్నామో.. అర్థం అవుతుంది.
వుద్యమాలు తప్పు అని నేను అనడం లేదు.. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి అనుకుంటే... మిగిలేది ఏమిటి?
మనం సంఘంస్తాయి నుంచీ.... స్వార్ధం లేని నాయకులను, మనం స్వార్ధం లేకుండా ఎన్నుకోవడం ఇప్పటికన్నా మొదలేడితే...
మనం, మన రాష్ట్రం .. మన దేశం బాగుపతుడుందని నా అభిప్రాయం.
@anonymous
Delete1) హైదరాబాదు, తెలంగాణ మొత్తం ప్రస్తుతం ఇలా మండుతుండడానికి కారణం రాజకీయపార్టీలు, కొందరు నాయకులు మాటలు మార్చి వంచించి వచ్చినతెలంగాణను ఆపడం. అసలు కారణాన్ని వదిలేసి పరిస్థితి బాగాలేదంటే ఏం చేసేది?
2) ఒక రాష్ట్ర ఏర్పాటు గ్నానంతో ముందుకు దూసుకుపొయ్యె కొద్దిమందికోసం కాదు. అందరూ ఐఐటీలూ, ఐఐఎంలకు వెల్లలేరు, ఎక్కువమంది ఏదో చిన్న గవర్నమెంటు ఉద్యోగం వస్తేనో, లేక ఎకరం పొలానికి నీల్లు లభిస్తే వ్యవసాయం చేసుకునేవారో ఉంటారు. రాష్ట్రం కావాలంటుంది అలాంటివారికోసం. ఉదాహరణకు రాష్ట్రవిభజన వలన నాకుగానీ నాలాంటి తెలంగాణ ఐటీ ఉద్యోగులకు గానీ అవసరం లేదు, ఇది సామాన్యులకోసం.
3) స్వార్ధం లేని రాజకీయనాయకులను తెలంగాణప్రజలు మాత్రం ఎన్నుకున్నా మెజారిటీ సీమాంధ్రలో ఉండడం వల్ల ముఖ్యమంత్రి ఏఫాషనిస్టో, మోసగాడో వస్తాడూ, కాబట్టి మీరు చెప్పే సలహా ఆచరణ సాధ్యం కాదు.
సమైక్యవాద ఎమ్మెల్యేల రాజీనామాలని ఆమోదించి వాళ్ళ చేత ఉప ఎన్నికలలో పోటీ చెయ్యిస్తే కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం ఉందో, లేదో తెలిసిపోతుంది. కాంగ్రెస్ కంటే తెలుగు దేశం పక్కా సమైక్యవాద పార్టీ. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం మొత్తం ఏకమవుతోందనీ, ఈ పరిస్థితిలో చిన్న రాష్ట్రాలు అవసరం లేదనీ ప్రచారం చేసిన పార్టీ అది. తెలుగు దేశం ఎమ్మెల్యేల రాజీనామాలని ఆమోదించినా కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం ఉందో, లేదో తెలిసిపోతుంది. అయినా తెలుగు దేశం ఎమ్మెల్యేల రాజీనామాలని కూడా ఆమోదించలేదు.
ReplyDeleteఅయ్యా ప్రవీణులవారూ తెలుసుకోవలసినది రాజీనామాలాటలూ గెలుపుల గురించికాదు. తెలుసుకోవలసినది దేశహితం గురించి. కుక్కలు చింపున విస్తరిగా దేశాన్ని మార్చితే లాభాలున్నాయనే వాళ్ళు ముందు ఇది తెలుసుకోవాలి. స్వస్తి.
Deleteతెలుగు దేశంవాళ్ళు గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమంతా ఏకమవుతోందనీ, ఈ పరిస్థితిలో చిన్న రాష్ట్రాలు అవసరం లేదనీ బహిరంగంగానే ప్రచారం చేశారు. ఒకవేళ వాళ్ళు కోస్తా ఆంధ్రలో గెలిస్తే కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం ఉందనే ఋజువవుతుంది కదా. అది ఋజువు చెయ్యడానికి సమైక్యవాదులు ఎందుకు ప్రయత్నించలేదు? కేవలం తెలంగాణాలో ఉన ఎన్నికలు పెట్టి తెలంగాణాలో తెలంగాణావాదం ఉందని ఎందుకు నిరూపించుకోమన్నారు? కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం ఉందని నిరూపించుకుంటే తప్పా?
Deleteనా వంటి వారికి ఈ చర్చలో పాల్గొనడానికే జంకు పుట్టుతుంది.ఇది emotional issue .శాంతంగా,హుందాగా చర్చించరు.మాది ఉత్తరాంధ్ర.రాయలసీమలో చాలా కాలం పనిచేశాను.తెలంగాణాలో మా బంధువులు ఉన్నారు.అన్ని ప్రాంతాలు ఇష్టమే.ఇప్పటికైనా అంతా కలిసి సమాధానానికి వచ్చి కలిసి మొత్తం అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకోవచ్చును అని నా అభిప్రాయం.అందుకు తగిన వనరులు మన రాష్త్రంలో ఉన్నాయి.enterprise ఉంటే గుజరాత్ కన్న సంపన్నమైన రాష్ట్రం కావచ్చును.మొత్తం ,, తెలుగువారి గ్లొరీ ,వైభవం గురించే ఆలోచిస్తాను.జై ఆంధ్ర,ప్రత్యేక ఆంధ్ర వంటి ఉద్యమాలు కూడా తప్పే.ఐనా హిత వాక్యాలు చెవికిఎక్కవు.నా ఉద్దేశంలో కేంద్రప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ని విభజించి బలహీనపరచాలని కుట్ర జరుగుతుందని.
ReplyDeleteసరే 2014 ఎన్నికలలో ప్రజాభిప్రాయం ఎలా ఐతే అలాగ జరిగిస్తే మంచిది.ఈలోగా పరస్పర నిందలు మానుకొంటే మంచిది.
'అందుకే నా పద్యం ఇలా వ్రాస్తున్నాను.మొదటి పాదం మాత్రం దాశరథి గారిది .మిగతా నా స్వంతం.నన్ను utopian idealist గా భావించుకో వచ్చును.
'నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
దివ్య కాంచనరథము మా తీరభూమి
వెలుగు ముప్పేట హారమై తెలుగుసీమ.
జై ఆంధ్ర ఉద్యమం కొంత మంది మూర్ఖులు రెచ్చ గొట్టడంవల్ల వచ్చినది.
ReplyDeleteఅందుకే ఈ రోజు దానిని ఎవరూ గొప్పగా చెప్పుకోరు
కాని ప్రస్తుత తెలంగాణ ఉద్యమాన్ని దానితో పోల్చుకుని మిమ్మల్ని మీరు అవమాన పరచుకుంటున్నారు
Nobody is comparing Jai Andhra agitation with Telangana agitation, it is been compared with Samaikyandhra agitation. Both are sponsored agitations for the selfish interst of few politicians, factionists cum businessmen. Difference is that in one agitation they claimed for separate statehood and in another agitation they themselves talk about "telugu jathi aikyata".
Deleteజై ఆంధ్ర ఉద్యమం నడిపినవాళ్ళు మూర్ఖులు కాదు. వాళ్ళకి కావలసినది (ముల్కీ నిబంధనల రద్దు) సాధించడానికి ఆ ఉద్యమం నడిపారు. మూర్ఖులైతే అంత తెలివిగా ఉద్యమాలు నడపరు. జై ఆంధ్ర ఉద్యమాన్ని ఒక దుర్మార్గపు ఉద్యమం అని అయితే అనొచ్చు.
Deleteసమైఖ్య వాదం వినిపించేవారిలో కొంతమంది స్వార్థపరులు ఉండవచ్చు అందువల్ల సమైఖ్య వాదమే తప్పు అనవచ్చా? అదే నిజం ఐతే శ్రీయుతులు దాశరథి, సురవరం, పీ వీ, బూర్గుల, మఖ్దూం ఇంకా వేలాది తెలంగాణ రాజకీయ రాజకీయేతర ప్రముఖులు చేసినది కూడా తప్పేనా?
ReplyDelete@Anonymous
Delete1) సమైఖ్య కాదు సమైక్య
2) రెండేల్లకింది సమైక్యాంధ్ర ఉద్యమం గురించి మాట్లాడుతుంటే మధ్యలో సురవరం, దాశరధిలు మధ్యలో ఎందుకొచ్చాడు? డెబ్భై ఏల్లకింద విశాలంధ్ర ఒక స్వప్నం. ఇప్పుడది ఫెయిలయిన ప్రయోగం.
3) ఉద్యమంలో కొద్దిమంది స్వార్ధపరులు ఉండడాం కాదు జరిగింది, ఉద్యమాన్ని సృష్టించిందే స్వార్ధనాయకులు, ప్రజలభాగస్వామ్యం శూన్యం.
4) మొత్తం సీమంధ్ర ప్రజలంతా ఒకవేళ సమైక్యాంధ్ర కావాలని చెప్పినా అప్పుడుకూడా సమైక్యాంధ్ర వాదం తప్పే. కారణం ఒక్కపక్షమే కలిసి ఉండాలని నిర్ణయించలేదు.
"మొత్తం సీమంధ్ర ప్రజలంతా ఒకవేళ సమైక్యాంధ్ర కావాలని చెప్పినా అప్పుడుకూడా సమైక్యాంధ్ర వాదం తప్పే. కారణం ఒక్కపక్షమే కలిసి ఉండాలని నిర్ణయించలేదు."
Deleteబాగా చెప్పారు. అలాగే ఒక పక్షమే విడిపోవాలని నిర్ణయించలేదు
@satyam
DeleteIf we apply your rule you should have been still in Madras, There would not be any divorce cases in the world and all the business partners in the world should do business eternally.
Next time before making such frivolous meaning less comment I expect you to do little home work and learn basics, what ever the id you use for posting.
Many T separatists draw anology between Andhrdyamam in Madras province and presen day T agitation. Both are entrely different and cannot be comapred. 1st of all Madras prvince was not a state formed under Art 3 of the constitution, it was just a tax collection center of British Imperialists. TN peopl at large never lamented about dismemberment of Madra province. After taking away telugu speaking, kannada speaking, oriya speaking, kerala speaking areas of the then Madras they were left with teir own linguistic state of TN. If you ask them today to take back those telugu, kannada, oriya, and Malayalam areas back they will never agree. More over linguisic states were the result of linguistic rennaisance movements in several parts of the country like samyukta maharastra movement, Gujarath asmita movement, Kannada rajya movement and visalandha movement. Visalandhra movement was very popular in Nizam domain those days. Hence comaprision between visalandhra movement and T movement is simply preposterous. AP formation was resut of states reorganisation act of 1956, which has constitutional validity unlike unified Madras province, which came to existance to suit British imperialism.
Delete@Kalyan Ram
Delete1) How does it matter if a state is formed under article 3 or it is inherited from British Raj? Article 3 never prohibited further division/reorganization of states, so asking for separate state is equally valid in both cases.
2) Andhra has separated from Madras not because of Visalandhra movement, it is formed as a result of the demand for separate statehood for telugu speaking people in Madras state. The comparison of telangana movement is with teh agiatation for separate andhra state in 1952, not with visalandhra movement. Please do not mixup things.
3) The comparision of Telangana movement with with separate andhra movement comes with the demands raised in both agitations. in both of them river water, jobs are the major issues at startup, but at one point both of them turned such that self-respect has become main issue.
4) Some idealogists in Telangana might have thought that all telugu speaking people can be under one state, there was also andhra mahila sabha started in telangana but as such there wasn't any major movement for visalandhra in telangana. There is enough evidence that large section of people in Telangana are against merger during 1956.
You can check here:
http://missiontelangana.com/1954-1956-telangana-movement/
5) Assuming that some idealogists ( actually very few ) were in favor of visalandhra, now after 60 years it has been proved that it is a failed experiment. There is no point in still seeking chanting the same visalandhra slogan when people of one section want to separate, rulers of other side has always shown discrimination.
6) Finally the idea of linguistic states is to have one state with people speaking one major language to make ease of administration, NOT to have one language per state. Just because it happened so that all the current regional languages of one state per language that does not mean dividing them is not permitted. Infact the Fazal Ali that is formed to answer for what you call as linguistic rennaisance has recommended two telugu speaking states.
Thanks for your comments. Hope I have answered you fully.
@viswaroop there used to be huge ground swell of support for visalandhra in Nizam domain. On the contrast very few opted for separate T. For evidence pleas read the following books of T writer: Jeevana Pathamlo by Ravi Narayana Reddy, Telangana Sayudha Samaramlo by Veerukanti Gopalakrishna, Chillaradevullu by Dasaradhi Rangacharya, T Sayudha Poratam Na Anubhavalu by Nalla Narasimhulu, Jeevanayanam by Dasaradhi Rachanalu, Veera Telangana Viplavaporatam-Gunapatam by Puchalapalli Sundaraiah, Sayudha Telangana Poratam Vastavalu by Makineni Basavapunnaiah, Modugupulu- Telangana Janajeevana Chitrana-2 by Dasaradhi, Veera Telangana-Na Anubhavalu- Jnapakalu by R N Reddy, Veera Telangana Sayudha Samaram by K Pratapa Reddy, Bandook by Kandimalla Pratapa Reddy and T’gana Veeranari by Arutla Kamala Devi.
DeleteHowever hard we my try to impress that T state will never generate jobs nor water grids. But you people continue to harp on the same utopia again and again.
That is the reason why I appeal to my SA brethern, dont oppose T, allow T to be formed along with Hyd.
All the tall claims of lakhs of govt jobs, and uninterrupted water grids for T fields, will fall flat miserably, with in 5 years T students and farmers realize their folly, and shed their hatred for SA people and leaders. Let us accept the division heavens will not fall. The same comraderrie and brother hood of anti nizam and andhra mahasabha days will come back again. okate bhasha okate prajalu, rendu rastralu, tappemundi
@Kalyan Ram
DeleteWhy do these VMS guys tell what T-vaidis don't claim and then conclude that they are false? We do not think Telangana state will "generate" new jobs, bring new water grids. What we claim is that with Telangana state telangana people get jobs, water and funds that are rightfully owned by them and nobody will exploit these things and siphon to other states. Please understand the difference between expecting rightful share to expecting generating something "extra".
All VMS guys always say there are lakhs of supporters for united state and then say few names, Like wise you are also saying more people supported visalandhra than separate state at that time and giving some names. You can give names only because they are countable. Any ways there is no need to talk about those idealistic few too now as we are already in visalandhra and it is failed experiment.
Instead of continuing this as a never ending debate with changing arguments every time, let us conclude what all already discussed and then forward.
1) we discussed how asking telangana state is as justified as asking andhra state in 1952. right does not change due to the fact of how state is formed.
2) we discussed how demands for separate andhra state in 52 are same as telangana agitation now.
3) we concluded already that both jai andhra movement and samaikyandhra movement are fake agitations asking for something that is not their right.
This is my audio on the so called UAP movement: http://praveensarma.in/125405804
ReplyDelete@vishwaroop: according to you your jobs and water was "exploit these things and siphon to other states" Where those siphoed water or jobs have gone? Had they relly gone to SA, entire seema uttarandhra, upland areas of godawari districts, palanadu area of guntur dt, would not have been more backward than T. Educated and upwardly mobile classes of SA region were able to secure jobs in Hyderabad. Similarly educated people of uttarandhra also got jobs in kharagpur, raipur, and in several parts of orrisa and chattisgarh as well. AFter dravidian movement several brahmins could find jobs in new delhi and mumbai. Huge tamil Brahmin settlements you can find in Mumbai and Delhi and other north indian cities even today. If you say doing job in other areas amount to stealing jobs of the aborigines, we have to rethink about Indian fedaral stucture and Indian constitution. AFter abolition of license, control and permit raj, post 1992 liberalization, enterprise classes of SA ( according to T separatists they are userpers and exploiters) have invested in trade, business and industry in Hyderabad. Every state in India welcome investers, as they bring capital, which in turn generate jobs for people and revenue for exchequer. KCR also many times told that he will spread redcarpet for SA caitalists once T is formed. If you call them exploiters of T people and villians of peace, i leave it to your conscience.According to you Jai andhra and samikyandhra movements are fake only separatist T movement is genuine. I also leave this to your conscience.
ReplyDeleteAlong with you I am also eargerly waiting for T formation, and anxious to see how that " Rightful share will go to right people" how all those "wrongs committed over 60 years are corrected and repaired"
I believe in unity of telugu people, unity could be in two different states or in single solitary state. I have born in this place, these people belong to me. Those people are also mine, I shall never disown them. If you say the new state will bring riches to its people and change the fortune, I dont oppose, I keep my fingers crossed and say good luck. I am samikyawadi of minds not geographical blocks. Good luck and good bye
@kalyan ram
ReplyDelete1)Had they relly gone to SA, entire seema uttarandhra, upland areas of godawari districts, palanadu area of guntur dt, would not have been more backward than T.
Do you think you are offering any argument here with this kind of twisted logic? Even if entire krishna, godwari water until its last drop is siphoned out, still there will be places that are not rich just becuase they are not sufficient enough.
You can check this:
http://edisatyam.blogspot.com/2011/02/blog-post_2521.html
2) Educated and upwardly mobile classes of SA region were able to secure jobs in Hyderabad.
People of telangana are cosmopolitan and always welcomed other people into their region. That is the reason there are gujaraties, marathis, marwadis in telangana. Complaint is not about other people getting jobs, complaint is about other region people exploiting jobs by illegal means such as favouratism in promotions, recruitments, illegal deputations, jobs with fake residency certificates. Here the zonal system has been exploited.
3) Investors are always welcome in Telangana. What is not welcome is land grabbing, crony capitalism in the name of investments with the support from ruling side.
I advise all those who try critisize Telangana movement (especially VMS guys) to first know about what are the real issues and give their argument on those issues. Arguing about some thing that is not the concern is of no use to anybody except for those involve in mudslinging.
@viswaroop: Mine is twisted logic. fine what is your logic? SA people have stolen your water by constructing nagarjunsagar, krisha barrage, srisailam dam, dhawaleswaram barrage OK. How will you get back your water? Once you get your T, you will demolish, nagarjunsagar, dhawaleswaram, srisailam and take back your legitimate share? right? Good luck to you.
DeleteOnce T is formed you will identfy all those who are staying in T with SA origin and send them back packing, as they are doing jobs in T with fake certificates. Fine. Say Andhra go back, why are you shying.
You welcome investers, but dont allot land, as they 'Grab your land and exploit you' you will exclude SA people totally from investing in T, as they are evil people with devilish traits and incarnation of ghosts. Fine please do it.
You want me to believe that all the people beyond vijayawada and kurnool are rakshasasantathi and worse than thugs and pindaris. Fine your kodandaram and KCR repeats this propagada on daily basis. If you want me to agree I will agree. go ahead and get your bangaru telagana and banish all rakshansha people. Good luck
@kalyan ram
DeleteOnce again you are trying to contradict something that was never claimed by Telangana vadis. Then what is the point even if I answer you?
@Kalyan Ram
DeleteHow will you get back your water? Once you get your T, you will demolish, nagarjunsagar, dhawaleswaram, srisailam and take back your legitimate share?
So you now changed your stand and agree to the fact that water is siphoned out.How will we get back our water is an implementation detail. Without agreeing on features and requirements no point in discussing the implementation detail, but it is not that difficult as you say.
Once T is formed you will identfy all those who are staying in T with SA origin and send them back packing, as they are doing jobs in T with fake certificates.
Atleast we will be able to stop future exploitation, in all areas: water, funds, jobs.
విజ్ఞ్లులు నన్ను మన్నించాలి.
ReplyDeleteతెలుగువాళ్ళు సాటి తెలుగువాళ్ళతో తెలుగువాళ్ళ సమస్యలనుగూర్చి తెలుగులో చర్చించుకొనేటందుకు యెందుకు ప్రయత్నించరో ఒక తెలుగువాడిగా నాకైతే అర్థంకాదు. ఆంగ్లంలో గాని విషయం స్పష్టంగా వివిరించలేనంతటి ఆంధ్రభాషాదారిద్ర్యమా కారణం? లేదా నాగరీకం అనే ముసుగులో తెలుగుపైన చిన్నచూపా? ఆంగ్లమే మేథావుల భాష అనే దిక్కుమాలిన మూఢనమ్మకమేదైనా మన తెలుగువాళ్ళకున్నదా? సరే, కారణం యేదయినా కానివ్వండి ఈ ఆంగ్లమానసపుత్రులు యేమి వ్రాసినా చదవటం నాకు మనస్కరించదు. ఒకప్పుడు తెలుగులో వ్రాయటం నెటిజన్లకు అందుబాటులో లేకపోవచ్చు. ఇప్పుడు అది చాలా సులభమైనప్పటికీ అనవసరంగా కొందరు ఆంగ్లం దంచటం నాబోటి ఛాందసులకు వెగటుగానే ఉంటున్నది. దయచేసి తెలుగుభాషను సముచితరీతిలో గౌరవించవలసినదిగా సాటి తెలుగువారికి హృదయపూర్వక విజ్ఞప్తి. స్వస్తి.
@శ్యామలీయం
Deleteఇంగ్లీషులో రాయడం అదేదో మేధావులభాషయని కాదు, టైపింగులో సౌలభ్యం వలన, మరియు కొన్ని పదాలు తెలుగులో చప్పున దొరకనందున అని పెద్దలు గమనించాలి.
@syamaleeyamgaru, manninchandi, telugu bhasha ante mikanna ekkuva premakalavadini, mirandaru rasthuunthe naku rayalani undi kani, nenu entha prayatninchina, na laptop lo desktop lo download kaledu. correct ga ela download chesukovalo evarina chepte prayatnisthanu. nenu english lo rayadaniki miranna karanalu matramu kane kavu
Delete@kalyan ram
Deleteuse lekhini.org
విష్వరూప్గరు ధన్యవాదాలు
Delete@శ్యామలీయం:
Delete"తెలుగువాళ్ళు సాటి తెలుగువాళ్ళతో తెలుగువాళ్ళ సమస్యలనుగూర్చి":
తెలంగాణా తెలుగు వారి సమస్య కాదు, రెండు ప్రాంతాల తెలుగు వారి మధ్య ఉన్న సమస్య అంతకన్నా కాదు. ఇది తెలంగాణాలో ఉండే అన్ని భాషల వారి సమస్య. తెలంగాణాలో తెలుగు ఒక (ముఖ్యమయిన) భాష కావచ్చు కానీ ఇతర భాషలు కూడా సమానమే.
ఏ భాషలో వ్యాఖ్యలు స్వీకరించాలో బ్లాగరుకు వదిలేయడం విజ్యత అనిపించుకుంటుంది.
మీకు తెలుగంటే అభిమానం ఉండవచ్చు గాక. ఆంగ్లంలో రాసినవి చదవడానికి మీకు మనసు ఒప్పుకోకపోవచ్చు గాక. అలా చేసిన వారిని "దిక్కుమాలిన" తరహా పదాలతో సత్కరించడం తమ వంటి పెద్దలకు పాడియేనా?
తెలుగు జాతిని ఉద్దరిస్తామంటూ ప్రఘల్భాలు పలికే నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్ ప్రభ్రుతులు తమ సమై"ఖ్య"వాదాన్ని ఆంగ్లంలో వినిపిస్తే అభ్యంతరం చెప్పని వారు అన్ని భాషలను సమానంగా చూస్తామన్న తెలంగాణా వారినే ఆక్షేపించడం ఎంతవరకు సమంజసం?
రాస్ట్రాన్ని పది ముక్కలుగా చెసినా సామాన్యునికి ఒరిగెదేమి లెదు. ముందు రాజకియాలలొ అవినీతి కి వ్యతిరెకంగా పోరాడండి. అవినీతి నశించనంతకాలం తెలంగాణ వచ్చినా రాకున్నా సామాన్యుడికి ఒరిగిదేమి లేదు. అవినీతికి వ్యతిరెకంగా ఉద్యమించండి.
ReplyDelete@కూచిమంచిప్రసాద్,ముచ్చిమిల్లి
Deleteఅవినీతి తెలంగాణ సమస్యో, సీమాంధ్ర సమస్యో కాదు, ఈదేశ సమస్య. తెలంగాణతో సంబంధం లేకుండా అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా పోరాడాలి, అది ఒక నిరంతర ప్రక్రియ.
అవినీతికి అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల అవసరం, వ్యవస్తీకృత ప్రాంతీయ వివక్షకు పరిష్కారం, ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీక. కనుక తెలంగాణకూ, అవినీతి ఉద్యమానికి లింకు పెట్టడం అవివేకం. మీరు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి పిలుపునివ్వండి, తెలంగాణ రాష్ట్రం, ప్రాంతం తరఫున మేము మీవెంట మేమూ ఉంటాం.