Monday, 9 April 2012

చేగొండీ! ఎందుకీ తొండి?




చేగొండి రామజోగయ్య అనబడే విశ్రాంత బ్యాంకు అధికారి ఈమధ్య  విశ్రాంతి లేకుండా ఆంధ్రప్రభలో ఎడాపెడా తెలంగాణపై విషాన్ని గుప్పిస్తున్నాడు. ఇతని రాతల్లో ఒక అర్ధం, పర్ధం ఉండదు, ఒక్క విషయంపై నిలకడగా తార్కిక వివరణ ఇవ్వలేడు, ఎంతసేపూ ఉద్యమాన్ని ఎలా వెక్కిరిద్దామా అన్నట్టు నంగి మాటలతో వ్యంగ్యాన్ని గుప్పించడం తప్ప పస ఉన్న వాదనలు ఒక్కటీ ఉండవు. ఈయన చత్తరాతలను కూడా ఆంధ్రప్రభలో ప్రచురిస్తాన్నరంటే అసలు ఆంధ్రప్రభ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అనిపిస్తుంది.

ఇంతకూ ఈయన రాతల సారాంశం ఏమిటీ అంటే "విభజనవాదం విషతుల్యం, రాష్ట్రాన్ని విభజిస్తే అది దేశ సమగ్రతకే ముప్పు, రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్రం రెండు ముక్కలు కాదు, యాభై ముక్కలవుతుంది, అందులో తెలంగాణాయే ముప్పై ముక్కలవుతుంది(?!)". ఎందుకూ, ఎలా అన్న వివరణలు ఆరాతల్లో మచ్చుకు కూడా కనపడవు. ఎందుకు ముప్పై ముక్కలవుతుందీ అంటే చేగొండి గారు తమ బ్యాంకు అధికారి అనుభవంతో చెప్పారు గనక మనం ఒప్పుకుని తీరాల్సిందే.  చేగొండి మాష్టారు గారూ, ఇప్పుడు తెలంగాణ ఏకారణాలతో విడిపోవాలనుకుంటుందో సరిగ్గా అదేకారణాలవల్ల తమరి ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడం కోసం ఉద్యమించి తమరి భాషలో దేశంలో మొట్టమొదటి వేర్పాటువాదానికి తెరలేపింది. ఎంత విషతుల్యమైందో కదా మీఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోరిక?

అసలు నిజంగా ఒక రాష్ట్రం విడిపోతే దేశసమగ్రతకే ముప్పు వస్తే, రాష్ట్రవిభజన నిజంగా అంత ప్రమాదకరమయిందే అయితే మీరు చెయాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం కాదు, అంతప్రమాదానికి కారణమయిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడును ఎత్తివేయడంకోసం మీరు ఉద్యమించాలి, ప్రయత్నించండి మరి. యాభై ఏల్లు ఉద్యమిస్తే ఒక్క రాష్ట్రం ఏర్పాటు కాలేదు గానీ, విభజిస్తే ఈరాష్ట్రం గాజుగ్లాసును నేలకేసి కొడితే పగిలినట్లు ముక్కలవుతుందా? ఆహా, ఏం తెలివండీ తమరిది?

ఇటీవల ఈమహానుభావుడి కలంలోనుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఏమిటంటే "విడిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారట, ఆంధ్రా ప్రజలకు లాభమట, అయినా వారు పెద్దమనసుతో తెలుగుజాతి సమగ్రతకోసం విభజనను అడ్డుకుంటున్నారట". ఆహా, ఎంత తెలివీ? ఇంతకాలం ఈమాత్రం తెలియకుండానే తెలంగాణ ప్రజలు విడిపోదామనుకుంటున్నారే. ఏదయితే అదయింది, మీరిలాగే రాస్తూ ముందుకుపోండి..మీరాతలను చదివి సీమాంధ్ర జనం తమకు రాష్ట్రవిభజన వలన జరిగే లాభాలను తెలుసుకుని విభజనకు ఒప్పుకుంటే మరీమంచిది.
 
ఈయన తనవ్యాసంలో విభజన జరిగితే తెలంగాణకే నష్ట ం అంటూ రాసిన ఎనిమిది పాయింటలో కనీసం ఒక్కటి కూడా చర్చించడం కూడా అనవసరమైనటువంటి చత్త రాతలు. దేశంలో అధిక సంఖ్యాకప్రజలు విభజనకు వ్యతిరేకమత.. అది ఈఅయనే కనుక్కున్నాడు మరి.  హైదరాబాదులో నలభై ఐదుశాతం మంది సీమాంధ్రులేనంట..ఇరవై శాతం భాషాపర మైనారిటీలు, మరో ఇరవై శాతం మతపర మైనారిటీలూనూ. ఇదీ ఈయన లెక్క. అంటే హైదరాబాదులో తెలంగాణ ప్రజలు కేవలం 15 శాతం..మరి ఈమాత్రానికే విభజన జరిగితే మాకు రక్షణ ఉండదూ, గట్రా, కాబట్టి హైదరాబాదును యూనియన్ టెర్రిటరీ చెయ్యాలీ అని నసుగుతున్నారెందుకంట?

చివరగా ఈయన వివరించిన గొప్పసందేషం ఏమంటే విభజన జరిగితే సీమాంధ్రులు అసాధ్యులు, నదీజలల్లో ఎక్కువ వాటా కొట్టేస్తారూ, కనుక తెలంగాణకు పెద్దలాభం ఉండదూ అని. మరి విడిపోయి వేరే రాష్ట్రంలో ఉంటేనే వీరి అసాధ్యం ఇలాగుంటే ఒక్కరాష్ట్రంలో ఉన్నప్పుడు ఈఅసాధ్యులు ఇంకెంత వాటానొక్కేయాలి? అందుకేగదా ఇప్పుడు ఒక్కనీటిచుక్క గూడా విదిల్చడం లేదు?

నీరుపల్లమెరుగుతుంది అంటూ జలదోపిడీని సమర్ధించుకునే వీరు పైరాష్ట్రాల నీటివాటాలో మాత్రం ఆ సూత్రాన్ని అమలు చెయ్యరు. పైగా స్వభాషీయులు దోచుకున్నా ఫరవాలేదంటకానీ పైరాష్ట్రం వాన్ని నిలదీయాలట. ఆహా చేగొండి! ఏందండీ ఈతొండి?

25 comments:

  1. FYI, Ramajogaiah is also a jump jilani like Parakala Prabhakar who changed parties multiple times.

    ReplyDelete
  2. ఒక్కసారి ఈ కింది లింక్‌పై లుక్కేయండి.

    http://visalandhra.blogspot.com/2012/04/blog-post.html

    ReplyDelete
  3. తెలుగు భాష మాట్లాడే వారు 18 కోట్లు ఉన్నారని ఈయన కాకిలెక్కలు చూపిస్తారు. సెన్సస్ లెక్కలను గోరంతలు కొండంతులు చేసే ఈయన గారు విశ్రమించక ముందు ఇదే తీరులో అప్పులు ఇచ్చుంటే వారి బాంకు పని గోవిందా!

    SA businessman: I want a loan for 8 crores. My equipment valuation is enclosed with my application.
    VMS banker: No, I will give you 18 crores loan. Your neighbors have 10 crore assets, I will add it to your list.

    A few months later, the business goes phut. Bank recovers 8 crores from collateral and writes off 10 crores to "Telugu unity"

    ReplyDelete
  4. ప్రవీణ్,

    ఈచేగొండి పార్టీలు మార్చిన చేగొండి కాదు, ఈయన ఒక విశ్రాంత బ్యాంకు అధికారి.

    రమేష్,

    మీలింకు చూసినతర్వాతే ఈపోస్టు రాయడం జరిగింది.

    ReplyDelete
  5. జై,

    బహుషా ఈయన పనిచేసిన బ్యాంకు మునిగిపోయి ఈయనకు బలవంతపు విశ్రాంతి లభించి ఉంటుంది. ఇప్పుడు విశ్రాంతి లేకుండా రాతలు రాస్తున్నాడు.

    ReplyDelete
  6. పిచ్చి రాతలు కాకి లెక్కలు కాక ఈయనకు ఇంకో పెద్ద దురద ఉంది. ఈయన కచరా వీరాభిమాని. ఆయన ఇన్నేళ్ళూ ఏయే ఊళ్లు తిరిగిండో, ఎప్పుడు ఏ సీన్మలు చూస్తాడో, ఏమి తాగుతడో కనుక్కొని గాసిప్ రాసి మురిసిపోతడు.

    గవన్ని నీకెట్ల ఎరుక, పక్కన కూచొని తాగినవా లేక ఆయన జీతగాళ్ళకు డబ్బులిచ్చి తెలుసుకున్నవా అంటే చెప్పడు. ఆయన ఎంత parapazzi ishtyle రాతలు రాసినా మనం పట్టించుకోమని తెలవదు పాపం.

    ReplyDelete
    Replies
    1. మీరు పట్టించుకుంటే ఏమవుతుంది???

      Delete
    2. vasantam,

      Good question. His attention seeking mentality gets satisfied.

      Delete
  7. You can simply dismiss any thing like pitchi ratalu and kakilekkalu as you are not happy with the substance. 1st of all carving out new state is a mere administrative excercise in Indian constitution. It does not cofer any soveriegn status. Hence division of state is not " Freedom from colonial rule" etc etc is mere figmant of imagination. At the same time division of states does not threat teritorial integrity also. Both the assumptions are wrong. It is utter cacophony to belive that creation of telangana will automatically creat lakhs of jobs. For example small state like T, only need limited staff. In Secreteriat, you need only out of the existing 10. Invariably you have to send 6 people to SA secreteriat. Even then you will not have a single vacancy to fill. More over T separatists are opely proclaiming that SA people in Hyd need not worry, their jobs will be protected and they need not move out of T, in case of formation of T. If they are to be taken seriously T will end up as employee surplus state, leaving lakhs of students who are hoping for govt jobs high and dry. Mere pourign outburst on chegondi does not work, you have to come out with facutual details why he was wrong.

    ReplyDelete
  8. సుందరోషస్సు వచ్చే

    నాతల్లి కృష్ణవేణమ్మ కన్నీరొత్తి
    కొనుచు నాపై ప్రేమ మినుమడించే
    గోదావరమ్మ నమ్మొదమ్ముతో నాకు
    ముఖమార్జను జలమ్ములనొసంగు
    తుంగమ్మ తన పైట కొంగుతో నామోము
    తుడిచి నిద్దుర చిన్నెలడిచివేసె
    పెన్నమ్మ తన పయః పియూషము నొసంగి
    ఆకలిమంట చల్లారగొట్టె
    మూడు చెరగుల నేలల మూడుకోట్లు
    ముడివడినయట్లు కన్నుల ముందుతోచే
    అందలమునెక్కి యావజ్జనావళి మెచ్చ
    సుందరోషస్సు వచ్చె వసుంధరకును.

    కోటి గొంతుకల విచ్చి మేటి తెలంగాణ
    జోహారులను పల్కజొచ్చె నేడు

    మంజు మంజీరాకుమారి రాకుమారి
    వోలెనిటుగా తెల్గు పొందు సూపె
    వేకంబుల గుడిప్రిదిలిన తనగాధ
    మరచి క్రొత్త వెలుంగుపరచే దెసల

    ఎనిమిది మండలాలేకకటమ్మున
    తెలుగు రాష్ట్రమునకు దివ్వెలెత్తి

    మంగళా రాత్రికమ్ములు పొంగిపోయే
    ఆంద్రరాష్ట్రమువచ్చె, మహాంధ్రరాజ్య
    మేరుపడురోజు పొలిమేరచేరి నిలిచె
    నా తెలంగాణ తల్లి యానందపడగ

    -- శ్రీ దాశరధి

    ReplyDelete
  9. Kalyan Ram,

    The intention of this post is to expose chegondi's essays and his baseless claims, not to list all the causes of asking division of state. For that already there is sufficient documentation.

    Secondly noone is of the assumption that mere creating of a state automatically creates lakhs of jobs, so debating about something that was never claimed by divisionists is of no use. What we say is that division of state will in future eliminate all the discrimination that is happening now in recruitment, promotions. The scope of exploitation of opportunities of Telangana youth cannot be exploited by others.

    As you rightly said division of a state can never affect the sovereign status as claimed by some pseudo integrationists. But drawing parellel with colonial rule is justified as in united andhra pradesh by default power lies with seemandhra due to number games and they always exploit Telangana resources with their brute power.

    ReplyDelete
    Replies
    1. @vishwaroop
      Numbers hardly matter it is the leadership qualities that matter. CBN, Jagan has got huge following in T. Show me one leader in T who has even a little following in SA? How come Seema with fewer MLAs could corner Majority of CMs in AP history? If CMs have larger say in administration, than Seema would have been a developed region, on the contrary T is much more developed than seema and uttarandhra. Hence he contention of majority vs minority does not hold any valid argument at all. If you are employble you can join multinationals which are highly paid and highly sought after why settle for silly govt job? Separatist claims of jobs discrimination, exploitation of resources etc does not stand before objective verification. When your own MLA elects his CM, how is that you are calling it a colonial rule.

      Delete
    2. Kalyan Ram,

      Do you mean to say that PV Narsimha Rao, Chenna Reddy didn't have leadership qualities? The irony is that PV could become PM and rule for 5 years but he couldn't be CM for more than 1 year.

      Neither CBN, nor Jagan have got anything on their own. For both of them ground work has been prepared because of the power they enjoyed either directly or through others. In telangana after Chenna Reddy and PV the leadership has been suppressed. Remember that for all the parties except TRS the power was always held by Seemandhra leaders and they delibrately ensured that Telangana leadership cannot grow. For the same reason KCR was not given ministry by CBN.

      Regarding jobs, please note that even after so much development in private sector, govt is still the major employer. Whether in Seemandhra or Telangana majority depend on these jobs. unfortunately Telangana youth are discriminated. State division is not for those who can get into multi-nationals like you and me. We can live anywhere in the world, it is for those unfortunate people who cannot get there.

      Even in colonial rule we have our own representatives. Please do not repeat the same old argument here, all your claims are answered number of times. How is it related to Chegondi anyway?

      Delete
    3. If you are employble you can join multinationals which are highly paid and highly sought after why settle for silly govt job?

      Then why don't seemandhrites all get into multi-nationals and leave govt jobs for T-youth? Why do they get employed through back door entry in T-quota, why do they get promotions through lobbying?

      Delete
    4. @viswaroop
      We have already followed your suggestion. My father was a state govt employee joined in Kurnool in 1953. Later shifted to Hyd in 1956. Non of our brothers sisters or any of our relatives joined state govt as we were vexed with the politics in state govt circles.AS you suggested I also appeal to my SA brothers to leave state govt jobs to T people and go elsewhere OK

      Delete
    5. @Viswaroop
      we have never seen PV in the narrow angel of T. We always proudly said PV is an Andhraite(Telugu). We have elected him from Nandyal and Berhumpur(uttarandhra people who are in large number voted for him)You people have defeated him from Hanamkonda. He could not contest from karimnagar or peddapalli as all his lands were occupied by naxals. Still we are proud of PV, we own him very much. You can see his statue in vizag if any time you happen to visit vizag.
      Chenna reddy has got tremendous leadership qualities. Madam Gandhi could not digest his authoritarian style of functioning and removed him, and made anjiah a novice as CM. Dont blame SA people for that. SA people still remember his contribution in making vizag steel a reality. KCR was denied ministerial berth becuase of velma quota. CBN accommodated vijayramarao, in velama quota, as he has emerged as a giant killer by defeating late PJR. Hence dont give regional color to it my dear friend.
      Unless it is proved with documentary evidence about discrimination, it is simply a loose talk about so called discrimination. 4 lakh employees are members in T empoyees unions. Do you mean to say all of them have entered through back doors? Or you want to say all those T employees are meretorious only SA employees got employment through backdoor. Chegondi has raised certain valid points, you cannot dismiss it with simple rhetoric. Let Harish rao or KTR start Telugu rastra samithi and fight all the 294 seats, and let them become CM of the state. That is the best answer to SA domination.

      Delete
    6. >>> Do you mean to say that PV Narsimha Rao, Chenna Reddy didn't have leadership qualities?
      Yes, to some extent. Very important characteristic of political leadership is mobilizing the support.
      Half of congress CMs from SA are like that. First they build their own groups and then bargain with high command.
      Channa Reddy somewhat falls into this category but PV was kind of appointed by merit.
      PV could have returned as CM, had Telangana leaders rallied behind him.
      But he lost at home because he was integrationist.

      Even today Telangana is not in a position to offer a single leader acceptable to majority of the districts.

      The first hurdle is lack of aspiration in leaders. Telugus in general are less aspirant (compared other regions in India) by nature.
      Telanganas are somewhat more. Reasons can be cited here. But they may hurt people.
      The positive fallout of this nature is that degree of corruption in Telangana is far less than in other places.


      Next important factor is too much diversity in every perspective, geographical, religious, caste, cultural, social, political.
      Note that it is not a divided society but only diverse. They do not clash in the name of differences.
      At the same time it is difficult mobilize majority of them for some cause.
      A simple example is JACs in present movement. Let us take lawyers JAC. Ideally there should be one JAC with local units are affiliations.
      But there is one lawyers JAC in every town and city each of them independent from the other.

      For discussion sake, if state division happens who will represent Telangana in negotiations?

      One can see the same in political parties. In many districts congress has strong leadership.
      But they do not accept one person as leader even on a temporary basis. T-congress forum does not have a full time leader.
      It is same with TDP, many popular leaders cutting across castes. But none acceptable to whole region.
      A. Madhava reddy, Devender goud and Nagam could rise to number 2 position in the party but not many takers in the region.

      Delete
    7. @kalyan Ram

      There are multiple things to be noted here:

      1) Strong leadership in the state means strong leader who can involve in factionism, caste mobilization and use money power. SA is famous for all the three, so strong leaders are who can take entire state politics are coming from that region.

      Note that they are not good at leadership skills but good at utilizing their power that is acquired by other illegal means for the advantage of political power. I am happy that such kind of "strong" leadership is not there in Telangana. We do not want to droop to such level for the benefit of getting some advantage in funds allocation. Instead we prefer to be in different state.

      2) As I said earlier the true people's leaders from Telangana region are suppressed by the otherwise strong leaders from SA with their muscle and money power.

      ex: - KCR denied ministry and ensured to leave TDP.
      - PV ensured to be removed from CM post as he was trying to implement land reforms with fake agitation called Jain Andhra.
      - P. janardhan Reddy denied ministry

      several other such examples

      3) For every political party, the state leadership lies with Seeamndra. They only encourage puppets who dances to their tunes and works for the benefit of SA and suppress others.

      Apart from Congress and TDP even in BJP Venkayya Naidu plays cards even though BJP has very little support in SA.

      4) Once we get T-state, we will produce enough leaders who can fulfill our cause. We do not want leaders with money or factionist power, we want leaders with people power and those are the true leaders. Only Telangana can produce such leaders, SA can never.

      Delete
    8. @kalyan ram

      great that you have elected PV from nandyal, but it is only when he became PM of the country, to take advantage of it. No need to repeat here about lobbying skills, opportunistic mentality of SA leaders to get every thing for their benefit. Remember that when PV became PM when Rajiv Gandhi died after the first phase of elections. In telangana region elections happened before his death and TDP won most of the seats. As there was no constituency to be offered, He had to get elected from Nandyal because of the then chief minister Kotla.

      There is enough documentary evidence, but closed minds will never agree. The very reason of creation states lieing with center through article 3 is that the discriminating side will never agree about discrimination, whatever the evidence offered. We should thank Dr. Ambedkar for his foresight.

      Chegondi didn't offer any points except his usual sarcasm. If you see some points there please do enlighten us.

      Delete
  10. >>> The intention of this post is to expose chegondi's essays and his baseless claims, not to list all the causes of asking division of state.

    True! T-vaadis are like proverbial 'raaja hansalu'. They take only water to spit back on others and leave the milk intact.

    ReplyDelete
  11. @Kalyan:

    Chegondi tried to show funny math to claim 18 crore Telugus. He also says Andhras will benefit in case of division but want to stay united inspite of this. He appears to stalk KCR & his family claiming where they go & what DVD's he sees.

    Please let me know in what way these are related to your arguments on jobs, terrirorial status etc.

    ReplyDelete
  12. @Kalyan Ram:

    "When your own MLA elects his CM, how is that you are calling it a colonial rule."

    Did MLA's elect Anjaiah, Bhavanam or KVB Reddy?

    Did TDP MLA's have any other CM choice apart from NTR or Babu?

    ReplyDelete
    Replies
    1. Interesting but meaningless. When they contested from respective parties, did they know what is in store for them or not? This is not just T-MLAs but every MLA and MP in the country.
      TRS promised CM post to dalit and Dy. CM to muslim. If it keeps the promise, will you call it lack of choice?

      Delete
    2. Jai: The movement you got the ticket of TDP, you have to endorse the CM ship of CBN, more over candidates openly canvass that they will elect CBN if their party comes to power. Hence your point no2 is irrelevent. You are voting congress means you are giving power to the then madam Gandhi to elect your CM. Madam gandhi made a horrible choice by choosing the ones like Bhavanam etc. she paid the price for it. You are voting for congress or TDP means you have an idea what your MLA is going to do.

      Delete
  13. BTW the circulation of Andhra Prabha is not more than 15,000.They are surviving by ads from govt and subscriptions from govt libraries and offices.They are writing anti Telangana news to appease the seemandhra officers on whom they depend on survival

    ReplyDelete

Your comment will be published after the approval.