Thursday, 30 January 2014

మోసగాన్ని నమ్మితే



మోసగాన్ని నమ్మితే ఏమవుతుంది? ఒక చెడ్డవాన్ని నమ్మి మరో చెడ్డవాడు దుర్మార్గపు పనికి పూనుకుంటే ఏమవుతుంది? దొంగల మధ్య ఒప్పందాలు చివరికి ఏమవుతాయి?  ఇటీవలి రెండు ఉదాహరణలు చూస్తే ఈప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

మొదటిది ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి తనకు అనుకూలంగా పనిచేయించుకోవడం కోసం అర్హత లేకున్నా దినేష్‌రెడ్డికి డీజీపీ స్థానంలో కూర్చోబెట్టాఆడు. అందుకు ప్రతిగా పదవిలో ఉన్నన్నాల్లూ దినేష్‌రెడ్డి ముఖ్యమంత్రికి, ఆయన కొమ్ముగాసే సమైక్యవాదానికి అనుకూలంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమంపై కర్కశంగా వ్యవహరించాడు, సీమాంధ్ర సభలకు మాత్రం రాచమర్యాదలు చేశాడు. అయితే చివరికి మరో రెండేళ్ళు తనపదవిని కొనసాగించకపోతే అదే సీఎంపై దుమ్మెత్తిపోశాడు.

ఇప్పుడు తాజాగా మొత్కుపల్లి వ్యవహారం రక్తికట్టించింది. గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు మొత్కుపల్లి చంద్రబాబును నమ్మి చంద్రబాబు చెప్పినట్లు కేసీఆర్ను అడ్డమైన బూతులూ తిట్టాడు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే ఎలాగూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే అవకాశంలేదు కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తే రాజ్యసభకైనా వెల్లొచ్చని. అయితే చివరికి చంద్రబాబు మొత్కుపల్లికి మొండిచెయ్యి చూపించి రాజ్యసభకు రెండు సీట్లకూ సీమాంధ్ర నేతలకే టికెట్లిచ్చాడు.

బాబు మోసంతో దిమ్మతిరిగిన మొత్కుపల్లి పాపం అసెంబ్లీలో కన్నీళ్ళు కూడా కార్చాడంట. గత రెండేళ్ళుగా చంద్రబాబును నమ్మి మాట్లాడిన మాటలకు మొత్కుపల్లికి నియోజకవర్గానికి వెళ్ళే దమ్ముకూడా లేదు. వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు పెద్దగాలేవు. ఒకటీ అరా పార్టీలు అవకాశమిచ్చినా వాతికి గెలిచేంత సీనులేదు.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు మొత్కుపల్లిని గవర్నర్ను చేస్తానని బుజ్జగిస్తున్నాడట. నమ్మేవాడుంటే గవరరేం ఖర్మ రాష్ట్రపతిని చేస్తానని కూడా అనొచ్చు. 

2 comments:

  1. ప్రపంచంలోనే ఉత్తమ నమ్మకద్రోహి చంద్రబాబు

    ReplyDelete
  2. మొత్కుపల్లికి తగిన శాస్తి జరిగింది.

    ReplyDelete

Your comment will be published after the approval.