గ్రామ సింహాలు మొన్నటిదాకా ఘర్జించాయి "ఈరాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూస్తాం" అటూ. మా అధిష్టానానికి బుద్ధి చెబుతాం అని ఒకడు, ఢిల్లీలో మాప్రభుత్వాన్నే కూల్చి పడేస్తామని ఒకడు, అసెంబ్లీలో తొడగొడతామని ఒకడు, ఇది రాజ్యాంగవ్యతిరేకం కనుక అసలు సాధ్యమే కాదని మరొకడు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఓడించి విభజనను ఆపుతామని ఒకడు, బిల్లుపై చర్చను సాగదీసి, గడువు పొడిగించి ఎలక్షన్లలోపు విభజన సాధ్యంకాకుండా చేస్తామని ఇంకొకడు.
పాపం ఒక్కొక్కటిగా తమ ప్రగల్భాలన్నీ తేలిపోయాక సీమాంధ్ర నేతలనబడే గ్రామసింహాలు ఇప్పుడు మియ్యావ్ మియ్యావ్ అంటున్నాయి. అసెంబ్లీలో తొడగొడతామన్నవారు తొడగొట్టలేదు కదా తడబడి మాటలు రాక తెల్లబోయారు. అసలు ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు తాము విభజన వద్దంటున్నామో చెప్పలేక అసలు విభజన ఎందుకో ఒక్క కారణం కూడా వివరించలేక ఒక్కొక్కరూ మొహాన నెత్తురుచుక్కలేకుండా మిగిలిపోయారు.
ఒక్కొక్క సీమాంధ్ర నాయకుడూ గంటల తరబడి మాట్లాడుతాడు..కానీ అందులో ఒక్క పాయింటు కూడా ఉండదు. తెలంగాణ నేతలు తమకు దొరికిన కొద్ది సమయంలో సూటిగా స్పష్టంగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను, సీమాంధ్ర నేతల మోసాలను, మాట తప్పి మడమ తిప్పిన విషయాలనూ వివరిస్తుంటే సీమాంధ్రనేతలవద్ద సమాధానమే లేదు. మాట్లాడ్డం చేతకాక ప్రసంగంలో పసలేక పాపం ఇబ్బందిపడ్డారు, జనాలను బోరు కొట్టించారు.
చర్చలో పాల్గొంటే ఎక్కడ తమ మోసం బయట పడుతుందోనని చర్చే వద్దని ఒకపార్టీ పది రోజులు చర్చకు అడ్డుపడింది. ఎలాగూ మందబలం ఉంది కనుక ఓటింగు పెడితే చాలు చర్చ జరిగితే తమ మోసం బయటపడుతుందని కపటోపాయాలు. ఇంకో పార్టీ ఇంకా తమ రెండు కళ్ళ విధానాన్ని వీడదు.
మొత్తానికి ఈఅసెంబ్లీ చర్చ ద్వారా ప్రపంచానికి తెలిసిందేమంటే సీమాంధ్రనేతలు గ్రామ సింహాలు.. తమ మెజారిటీ ఉన్నంతకాలం తొడలు కొడుతూనే ఉంటారు కానీ ఎవరికీ మాట్లాడే చేవ లేదు. విభజనను మేము ఆపుతామని ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు కానీ వారికంత సీను లేదని. విభజనకు ఇంకా అడ్డుపడుతూ, చర్చలో మాత్రం తెల్లమొహాలు వేస్తూ ఇన్నాళ్ళూ తెలంగాణను దోచుకున్నది నిజమేనని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తున్నారు.
ఒక గ్రామసింహం ఒకవైపు విభజన ప్రక్రియ జరిగిపోతుంటే ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముప్పై సీట్లు గెలుచుకుందాం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ఢిల్లిలో గద్దెనెక్కిద్దం అని చెబుతుంది. ఎన్నికల లోపే విభజన జరిగిపోతుంటే ముప్పైసీట్లు గెలుచుకుని ఏం చేస్తాడట, మరో లక్షకోట్లు దండుకోవడం తప్ప. ఇంకో గ్రామ సింహం ఇప్పుడు కొత్తగా సమైక్యాంధ్ర పార్టీ పెడ్తుందట. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు విభజన జరిగినంక సమైక్యాంధ్ర పార్టీ ఎందుకు? సీమాంధ్ర పార్టి అని పెట్టుకోవచ్చుగద?
విశ్వరూప్‍గారూ!
ReplyDeleteఈ గ్రామ"సింహాలు" మ్యాఁవ్...మ్యాఁవ్ మంటూ "మొఱుఁగు"తున్నాయి, ఏ జంతుజాతో కూడా తెలుసుకోలేనంతగా! కూఁతలు కూడా స్థిరంగా ఉండటం లేదు...మ్యాఁవ్ మ్యాఁవ్..భౌ భౌ...గుర్ర్ గుర్ర్...కీచ్ కీచ్...కఁయ్య్ కఁయ్య్...ఘుర్ర్ ఘుర్ర్...! ఇదేం వ్యాధో ఎవరికీ (కేంద్రానికి) అంతుపట్టడం లేదు. చీదరించినా...చీత్కరించినా...అసహ్యించుకొన్నా...ముఖంమీదే ఛీకొట్టినా సిగ్గులేని జన్మలు! తెలంగాణను వదలిపోం అంటున్నాయి! దీనికి మందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే! ఆ తర్వాత వీటి గతి అధోగతే...! సీమాంధ్ర ఛీకొట్టి కాలితో ఝాడించి తంతే ఎక్కడో అధఃపాతాళంలో పడతారు. వీళ్ళ భవిష్యత్తింతే! జై తెలంగాణ! జై జై తెలంగాణ! (నా తెలంగాణ కోటి రత్నాల వీణ)
అయ్యో ,,,,,మీరు ఈ విషయం గమనిన్చలేదనుకుంటా ....
ReplyDeleteఈ గ్రామ సింహాలే నిజమైన సింహాలని వారి డిక్షనరీ ఏనాడో మార్చేసుకున్నారు. సమైక్యం అనే పదానికి అర్థం మార్చుకోలేదా , అలానే ఇది కూడా. మనం ఇప్పుడు దాని అసలు అర్థం ఎంత చెప్పినా వృథా నే ..