Monday 19 March 2012

ఇంటిదొంగల పని పడదాంబ్రిటిష్ వాడు ఇంతపెద్ద మనదేశాన్ని ఆక్రమించుకుని రెండువందలఏళ్ళు మనమీద పెత్తనం ఎలా చేయగలిగాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం పెద్దకష్టం కాదు. మనమీద పరాయివాడు పెత్తనం చెయ్యగలగడానికి కారణం మన ఇంటిదొంగలే. అలాగే ఈనాడు ఇంతపెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నసమయంలో కూడా ఆంధ్ర నాయకులు మనమీద జులుం చెయ్యగలగడానికి కారణమూ ఇంటిదొంగలే.

ఇంటిదొంగలు మనకే ప్రత్యేకం కాదు, ఎక్కడయినా ఉంటారు. ఒకవేళ సమైక్యాంధ్రలో తెలంగాణకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి పెత్తనం తెలంగాణ వద్ద ఉంటే, ఆంధ్రా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఉంటే అక్కడా ఇంటిదొంగలు ఉండేవారు. సమాజంకంటే తనసొంతలాభమే ఎక్కువ అనుకునేవారిని పసిగట్టి పెత్తనం చేసేవారు వారికి పదవులూ, డబ్బూ ఆశ జూపి లోబరుచుకుని మిగతా సమాజానికి వ్యతిరేకంగా పని చేయిస్తారు. అలాంటివారే ఈఇంటిదొంగలు.

చంద్రబాబు మనగడ్డమీద పరాయి కిరాయిరౌడీలను తీసుకొచ్చి మనయువకులనే  కొట్టించగలిగాడంటే కారణం ఇక్కడి ఇంటిదొంగలు ఎర్రబిల్లి, మొత్కుపల్లి, రేవంత్ లాంటివారే. కిరణ్‌రెడ్డి ఇక్కడికొచ్చి మననేతలనే తిట్టగలుగుతున్నాడంటే దానికి కారణం ఇక్కడి ఇంటిదొంగలు డీకే అరుణ, జానారెడ్డి లాంటివారే. మరి ఈఇంటిదొంగలకు ఇంతబలం ఎలావచ్చిందంటే వారిదగ్గర ఉండే కొద్దిమంది అనుచరవర్గం కారణం.

తెలంగాణ ప్రజలు ఇంటిదొంగల భరతం పట్టడం ఎప్పటినుంచో మొదలు పెట్టారు. ఆంధ్రాబాబులకు మద్దతు పలికే తెలంగాణ నేతలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. అయితే ఈక్రమంలో మన యువకులకే దెబ్బలు తగులుతున్నాయి...కారణం ఎదుటివాడు మనకంటే బలవంతుడు. అలాంటప్పుడు మనం ఏంచేయాలి? శతృవు బలంపై దెబ్బకొట్టాలి. ఈఇంటిదొంగల బలం వారి అనుచరవర్గమయినప్పుడు ముందు మన లక్ష్యం ఈ అణుచర వర్గమే కావాలి. ఈఇంటిదొంగలందరికీ సామాజిక బహిష్కరణ విధించాలి. భవిష్యత్తులో ఒక మొత్కుపల్లికో ఒక డీకే అరుణకో అనుచరుడిగా ఉండాలంటే వీల్లు భయపడాలి.

ఇంటిదొంగలకూ, వారి అనుచరులకు పెల్లిచేసుకుందామంటే పిల్ల దొరకగూడదు. ఊరిలో ఉప్పు పుట్టకూడదు. మున్సిపాలిటీ నీల్లు రాకూడదు, ఇంట్లో పనిమనుషులు దొరకగూడదు. వీల్లపొలాలు సాగుచేసుకుంటే కూలివాల్లు దొరకగూడదు, వీల్ల ఇంట్లో ఎవరయినా చస్తే డప్పుకొట్టేవారు, పాడెకట్టేవారు దొరకగూడదు. ఇకనుంచీ మన నినాదం ఇదీ.."ఇంటి దొంగల పని పడదాం...తెలంగాణ సాధిద్దాం".

4 comments:

 1. you mean to say no such people exist in TRS,BJP......

  ReplyDelete
 2. It may be worth while to know 'your' history before writing such article. Firstly British did not rule for 400 years. Nor they ruled Telangana region. Since fall of Paratarudra in 1323 AD Telangana was under Muslim rule till 1948 AD Police action.


  >>> "ఇంటి దొంగల పని పడదాం...తెలంగాణ సాధిద్దాం"
  "ఇతర పార్టీల నాయకులను బెదిరిద్ద్దాం, ఇంకొన్ని ఉప ఎన్నికలు తెద్దాం"

  ReplyDelete
 3. 1) corrected to 200 years. Thanks for pointing.
  2) Here I was referring to India, not Telangana. Unnecessary remark.
  3) Nothing wrong if we force other party leaders to resign to have bi-election. These MLAs and MPs are supposed to be poeple's representatives. They are supposed to listen to people's wishes not their party leaders commands. Without heeding to people's wish they have no right to be in their elected posts.

  ReplyDelete
  Replies
  1. these MPs and MLAs are given 5 year mandate. If people want them to listen everyday, first people should change the constitution and get recall right. Threatening elected members on streets is nothing but Jungle democracy.

   Delete

Your comment will be published after the approval.