Friday, 19 October 2012

పచ్చకళ్ళు, పిచ్చి రాతలు



మీరు తిట్టారు గనుక మిమ్మల్ని కొట్టినా, తన్నినా, చంపినా నేను సమర్ధిస్తానని తీర్మానించాడో పచ్చకళ్ళ మనిషి(?). తప్పు ఆయనది కాదు, ఆయన పచ్చకళ్ళది!! ఈ పచ్చకళ్ళవారికి లోకమంతా పచ్చపచ్చగా విచిత్రంగా కనిపిస్తుంది. తమ పచ్చప్రపంచంలో అంతా తామే. తమ ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నించారా, ముందు వాణ్ణి చెడ్డవాడు, తమని తిడుతున్నాడు అంటూ తమ పచ్చ పత్రికలతో ఒక ముద్ర వేసేస్తే చాలు. ఆతరువాత తాము ప్రశ్నించినవాణ్ణి నరికేసి కూడా సమర్ధించుకోవచ్చు!



బలమూ, అధికారమూ తమ దగ్గర ఉన్నాయి కదా అని అన్యాయంగా బలహీనులపై దౌర్జన్యం చేస్తే అప్పుడు బలహీనుడేం చేస్తాడు? తిడుతాడు. ఇంకేం తిట్టాడనే సాకుతో ఎదుటివాడిని నరికి కూడా సమర్ధించుకోవచ్చును. నాడు కారంచేడులో మంచినీళ్ళచెరువును బురద చేస్తుండని ప్రశ్నించినందుకుగానూ కొడితే తిరిగి కొట్టడం చేతగాక ఒక ముసిల్ది తిట్టింది. అంతే! ఈ పచ్చబాబులకు సాటి మనుషులను విచక్షణారహితంగా కత్తులూ, బరిసెలతో పొడచడానికి ఆ తిట్టే సాకుగా దొరికింది. అసలు ఈపచ్చకళ్ళవారు ఇతరులనెప్పుడూ సాటి మనుషులనుకోరు. అలా అనుకుంటారనుకుంటే మన భ్రమ. వీరి పచ్చ ప్రపంచంలో మిగతా ప్రజలందరూ వీరి కింద పడి ఉండాల్సిందే.



పచ్చబాబుల వాదనలు విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతంలొ నీతి కనిపిస్తుంది. రాష్ట్రవిభజనను దేశవిభజన అన్నట్టు వేర్పాటువాదం అని కొందరు మూర్ఖులు పిలుస్తుంటే అది సమర్ధించడానికి డిక్షనరీలు వెతికి మరీ అర్ధాన్ని కిట్టిస్తారు, తమదాకా వస్తే దాటేస్తారు. పక్కోడి వాదాన్ని తప్పు పడదామనే తొందరలో తమకే అర్ధంకానీ స్టాటిస్టిక్స్ పట్టుకొస్తారు.  పత్రికలపై పాలకులు వివక్ష చూపించి కొందరిని మాత్రం అనుమంతించకపోతే అందులోనూ లాజిక్ కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాకాంక్షలను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాకు అవార్డు వస్తే ఏడుస్తారు. బహుషా వీరు తమ పచ్చబాలయ్య పిచ్చి అరుపులకు ఉత్తమ(?) నటుడు అవార్డు ఇచ్చినప్పుడు పండుగ చేసుకునే ఉంటారు.


పచ్చబాబులకు పార్టీలూ, ప్రాంతాలూ, నీతి, న్యాయం అంటూ ఏవీ ఉండవు. తమ పచ్చలోకంలో తమకు ఎక్కడ లాభం ఉంటే అదే నీతి. తమవారికి ఎక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అదే తమ పార్టీ. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగితే తమకులం అధికారంలోకి వస్తుందనుకుంటే వీరే ముందుండి మరీ రాష్త్రం విభజించాలని ఉద్యమం చేస్తారు. పచ్చమాఫియా అన్ని పార్టీల్లోనూ, అన్ని రంగాల్లోనూ ఉండి తమకు అనుకూలంగా విధానాలనూ, వార్తలనూ వండివారుస్తారు. నాడు కారంచేడు మానవ హననం పచ్చపత్రికల్లో చిన్నవార్తగాకూడా రాలేదంటే అందులో ఆశ్చర్యం ఏమీలేదు.


సాటిమనుషులను రాక్షసంగా బరెసెలతో పొడిచినప్పుడూ, గుడిసెలు కాల్చి మనుషులను సజీవదహనం చేసినప్పుడూ ఖండించనివారు పక్కప్రాంతంలో మానవహక్కులహననం జరుగుతుంటే ఖండిస్తారా? ఎమర్జెన్సీని తలపిస్తూ తెలంగాణలో ప్రభుత్వం మానవహక్కులను అణచివేస్తుందని చెప్పినప్పుడు మేం ఖండించమన్నది మానవత్వం ఉన్నవారిని, అది ఇసుమంతైనా లేని పచ్చబాబులను కాదు.



పదిరికుప్పంలో మనుషులను తగలబెట్టి

మీ అధికారదాహం చూపించారు!

కారంచేడులో కత్తులతో నరికి

మీ తలపొగరు తెలియజెప్పారు!

నిజాలు రాసినందుకు దశరథరాంను చంపి,

మీ మాఫియా పోకడలను చూపించారు!

నేడు మాహక్కులహననాన్ని  కూడా సమర్ధించారు,   
మీరు మనుషులుకాదని నిరూపించారు!!



8 comments:

  1. చాలా బాగా రాసారు. మీ బ్లాగు బాగుంది. మంచి సమాచారం అందిస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.
    ఈ ఆంధ్రోళ్లకు చెబితే అర్థం అవుతుందని కాదుగానీ ఎప్పటికైనా వీళ్ల చిట్టి బుర్రలోకి కొంతైనా సమాచారం ఎక్కక పోదు.

    ReplyDelete
    Replies
    1. @Sniper

      థాంక్స్ స్నైపర్. వీళ్ళకి అర్ధం గాక కాదు, అన్నీ తెలిసే కావాలని ఎదుటివారిపై బురదజల్లుతుంటారు. తాము ఎన్ని బస్సులు, రైళ్ళు తగలబెట్టినా తప్పులేదు, తమ కారంచేడు, చుండూరు, లక్షింపేటలగురించి ఉలకరు కానీ తెలంగాణలో ఒక బస్సుపై రాయిపడితే అదో పెద్ద ఘోరం.

      Delete
  2. ఏ పత్రిక, ఏ చానల్ ఎవరి చేతిలో ఉందొ వివరాలు సేకరించి చెప్పండి బాగుంటుంది

    ReplyDelete
    Replies
    1. @Anonymous

      అన్నీ అందరికీ తెలిసినవే కదా? ఏపార్టీకి చెందిన ఛానెల్సైనా అన్నీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉంటాయి.

      Delete
  3. patrikalu , chanals saripoledani paccha sankara jathi blogs lo kuda hadavudi chesthondi .

    ReplyDelete
    Replies
    1. @Anonymous19 October 2012 17:36
      పత్రికలూ, టీవీ ఛానెల్సూ, సినిమాలూ, బ్లాగులూ అన్నింటా పచ్చబాబుల యెల్లో రాతలే.

      Delete

Your comment will be published after the approval.