మల్లీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలపర్వం మొదలయింది. రెండున్నరేళ్ళక్రితం కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్లో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని చనిపోవడంతో మొదలయిన బలిదానాలపర్వం కొద్దిరోజులుగా బలిదానాలు తగ్గిపోయాయని ప్రజలు కాస్త ఊరటపడుతున్న సమయంలో చీఫ్‌విప్ గండ్ర తెలంగాణవాదం తగ్గిపోయిందని మాట్లాడి మరోసారి బలిదానాలకు తెరదించారు.
అసలింతకూ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఉద్యమంలో ఆత్మబలిదానాల అవసరం ఏముంది? ఉద్యమకారులు ప్రభుత్వంపై నిరశన తెలపాటానికి ఇంకా అనేకమార్గాలు ఉండగా ఈవిపరీత విధానాన్నే ఆయుధంగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? దీనికి సమాధానం తెలుపును తెలుపుగా,నలుపును నలుపుగా చూపించాల్సిన మీడియా బాధ్యత మరచి వ్యవహరించి మిగతా నిరశన మార్గాలకు గొళ్ళెం పెట్టడం వల్లేనని చెప్పొచ్చు.
తెలుగు మీడియా డిసెంబరు 9, 2009 తరువాత తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరించి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండగా నేషనల్ మీడియా శ్రీక్రిష్ణ కమిటీ ఏడో అధ్యాయం వల్లనేమో అసలు తెలంగాణ అనేప్రాంతమే ఈభూమిమీదలేదన్నట్టు వ్యవహరిస్తోంది. మీడియా అనుసరిస్తున్న ఈపక్షపాతవైఖరివల్ల సామాన్య, పేద యువకులకు ఈప్రభుత్వం వైఖరిపై నిరశన వ్యక్తం చెయ్యడానికి మరేమార్గం లేకుండా పోయింది.
ఇక్కడ ఉస్మానియాలో వెయ్యిమంది విద్యార్థులు ఒక్కసారి సామూహిక నిరాహారదీక్షలకు పాల్గొంటే మీడియా ఆఖరుపేజీలోకూడా ఆఊసే ఉండదు. ఇక్కడ విద్యార్థుల శాంతియుత ర్యాలీలను పోలీసులు అన్యాయంగా అడ్డుకుని విచక్షణారహితంగా ఉస్మానియాలోనూ, నిజాం కాలేజీలోనూ కొడితే ఆసంఘటనలు మీడియా పచ్చకామెర్ల కళ్ళకు అందవు.ఇక్కడ సబ్బండవర్గాలు కలిసికట్టుగా సకలజనులసమ్మె చేస్తే అసలేమీ జరగట్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఉప-ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనొ తెలంగాణ అనుకూల పార్టీలు దిగ్విజయం చెందినా మసిపూసి మారేడుగాయజేసి వోట్లశాతం తగ్గింది, తెలంగాణవాదం తగ్గింది అంటూ ప్రచారం మొదలు పెడతారు.
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యతను మీడియా నిర్వర్తించడం మరిచినందువల్ల ఇక సామాన్యుడికి తనగొంతును వినిపించే అవకాశం పోయింది. తామేం చేసినా, ఎంత ఉధృతంగా సమ్మెచేసినా కనీసం ఆవార్త ప్రపంచానికి చేరకపోతే ఇంకా తాము శాంతియుతమార్గాలద్వారా నిరశన తెలిపి లాభంలేదనే నిరాశ యువకుల్లో వ్యాప్తించింది. స్వతహాగా శాంతికాముకులూ, ఫాక్షన్, రౌడీ రాజకీయాలకు దూరమైన తెలంగాణ ప్రజలు తమ ఆగ్రహాన్ని హింసారహితంగా ఎలావ్యక్తం చేయాలో తెలియని అనిశ్చిత స్థితిలోకి వెల్లారు. పరిణామం, తమ నిరశన తెలపటానికి ఆత్మబలిదానాలద్వారా తమను తామే హింసించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మబలిదానాలకు పూటకో మాట మార్చి వచ్చిన తెలంగాణను అడ్డుకున్న మోసపునేతలు ఎంత బాధ్యులో తమ బాధ్యత మరిచి పక్షపాతబుద్దితో వ్యవహరిస్తూ వృత్తిద్రోహం చేస్తున్న మీడియాకూడా అంత బాధ్యులు. తెలంగాణా ఈమీడియాకు అక్కరలేకపోతే మనకూ ఈపక్షపాత మీడియా అవసరం లేదు. ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర మీడియానూ, తెలంగాణ అసలు లేనట్లు వ్యవహరిస్తున్న జాతీయ మీడియానూ తెలంగాణాలో బహిష్కరిద్దాం.
i am 100% agree with you
ReplyDeleteమీడియా చూపలేదంటే ఉద్యమంలో నిజాయితీ లోపించినట్టు అర్ధం. సమైక్య వాద మీడియా అంటే పక్షపాతం చూపింది అనుకోవచ్చు. జాతీయ మీడియాకి ఏమి రోగం? ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. తెలంగాణా వాదం లేదు అని నేను అనట్లేదు. దాన్ని అపహాస్యం చేసేలా సోకాల్డ్ తెలంగాణా వాదులు వ్యవహరిస్తున్నారు అని మాత్రమె చెప్తున్నా. ఒక ఆత్మహత్య జరిగితే కానీ కే.సి.ఆర్ మత్తు వదిలి బయటకు రాలేదు. ఇలా అయితే ఎంతమంది చస్తే ఉద్యమం ఊపందుకుంటుంది. నాలుగుకోట్లా? ఆలోచించండి
ReplyDeleteఅనిల్,
ReplyDeleteజరిగినదానిని రిపోర్టు చేయకుండా దాచడానికి, ఉద్యమంలో నిజాయితీకీ లంకె ఎక్కడుందో నాకర్ధం కావడంలేదు. అయితే గియితే మీడియాలో నిజాయితీ లోపించిందని తెలుస్తుంది.
తనకు కంచు కోటల్లాంటి మూడు నియోజకవర్గాల్లో
ReplyDeleteతెలుగు దేశం పార్టీ డిపాజిట్లు కోల్పోతె
ఆ విషయం కప్పి పుచ్చి
దాని గురించి చర్చించకుండా
జిత్తులమారి లెక్కలు వేసి
టీ డీ పీ కి ఓట్లు పెరిగాయి ఒహొ అని టముకు వెసిన Andha మీడియా నిజంగా ఎంత దుర్మార్గానికి తెగబడిందొ.
అంధ్ర మీడియాకు పక్షవాతం సోకింది.
ఎయిడ్స్ కంతె భయంకరమైన జబ్బుతొ కుల్లిపొయింది.
తెలగాణా బిడ్డలారా నిరాశ పడకండి ,
మోసపోకండి,
ఈ నక్కల నాటకాలు ఇంకా ఎంతో కాలం సాగవు.
అంతిమ విజయం మనదే
జై తెలంగాణా!
మీడియా లో మరియు తెలంగాణా లో వచ్చే ఫేం చూసి వ్యక్తిగత సమస్యలతో చావాలనుకున్నవాడు కూడా తెలంగాణా పేరు పెట్టేసి షార్ట్ కట్ లో అమరవీరుడయిపోతున్నాడు(?). వీళ్ళకి జీవితం లోనే ఏమి గోల్ ఉండదు, ఏమి సాధించింది ఉండదు. వీళ్ళు తెలంగాణా ప్రజల కోసం, తెలంగాణా బాగు పడటం కోసం చచ్చారు అంటే నమ్మాలా? అంతెందుకు వీర తెలంగాణా వాదులమని చెప్పుకునే రాజకీయ నాయకులు కానీ , బ్లాగ్స్ లో తెగ ఫీల్ అయిపోయే వీర తెలంగాణా వాదులు (విశ్వరూప్ లాంటి వాళ్ళు) కానీ తెలంగాణా కోసం ఏమి చేసారు. ఈ వీర తెలంగాణా వాదులంతా కష్టపడి ౧౦ ఏళ్ళు చదువు చెప్పి అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తే తెలంగాణా వెనకబాటు తనం అంత పోయేదిగా?
ReplyDeleteనాగం జనార్ధన్ రెడ్డి గెలిచిన నాగర్ కర్నూల్ దేశం లోనే తక్కువ అక్షరాస్యత ఉన్న నియోజక వర్గాల్లో ఒకటి. అయన ముప్ఫై సంవత్సరాల నుండి అక్షరాస్యతను పెంచటానికి ఏమి చేయలేదు అయినా ఓకే కేవలం జై తెలంగాణా అంటే చాలు. పెద్ద హీరో. అదీ మన తెలివి.
ఈడ ఉద్యమంలో మనమంతా ఒకరితో ఒకరు కొట్టుకు చస్తూ ఉద్యమాన్ని పీతల జాడీలెక్క చేస్తుంటే ఇంకా నేషనల్ మీడియా దీన్ని సీరియస్ గా ఎందుకు తీస్కుంటది?
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteసూటిగా said...
ReplyDeleteసూటిగా has left a new comment on your post "బలిదానాలకు కారణభూతమవుతున్న సీమాంధ్ర మరియు నేషనల్ మ...":
ఎదుటివారిని వేలెత్తి చూపేముందు తమ బొంతకు కంతలెన్నో తెలుసుకోవాలి. మరి నమస్తే తెలంగాణ దినపత్రిక,టి న్యూస్ చానెల్ నిజాయితీగా వార్తలు రాస్తున్నాయా,చూపిస్తున్నాయా.
నాకు మన హైదరాబాద్ ట్రాఫిక్కు అంటే విపరీతమైన చిరాకు,అసహ్యం,కోపం. మరి ఏమి చేయాలి.ఇది నాకు చాలా పెద్ద సమస్య.మరి మిగతావారికి అంత కాకపోవచ్చు. ప్రతి ఒక్క సమస్యకి భిన్న కోణాలు ఉంటాయ్.నే పట్టుకున్న కుందేలుకి మూడు కాళ్ళు అని పిడివాదం చేస్తూ అందరినీ నమ్మించాలని,నమ్మకపోతే నరుకుతాం అంటే నవ్వులాటగా ఉంటుంది తప్ప ఒరిగేది ఏమీ లేదు.
చావులతో సమస్యలు పరిష్కారంయ్యేట్లయితే దేశంలో,ప్రపంచంలో రోజుకు వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరు ఎంతలా సీమాంద్రులని,మీడియా వారిని తిట్టి ఆడిపోసుకుంటే సమస్య మరింత జతిలమవుతుంది తప్ప పరిష్కారం కాదు.
*మీరు ముందు, ఈ ఉద్యమం ఈ స్థాయికి రావటానికి కారణం మీరు తిట్టే సీమాంధ్ర మీడియానే(చేదు నిజం)
*మీకు ఇష్టం లేకపోతే, సీమాంద్ర మీడియాలో కనిపించకండి అని మీ రాజకీయ,ఉద్యమ నాయకులని కోరండి(ఇది అసాద్యం)
*ఉద్యమం వ్యాపారమయం అయిపొయింది కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించేందుకే "టిఆర్ఎస్" నిశ్చయించుకుంది.(వాస్తవం)
*ఇంత వరకు అగ్రకుల విద్యార్దులు కాని,ఒక్క రాజకీయ నాయకుడు కాని ఆత్మహత్య ఎందుకు చేసుకోలేదు(సమాధానం చెప్పలేరు)
*కచరా గారు(ఇదేమి తిట్టు కాదు- కల్వకుర్తి చంద్రశేఖర రావు కి చిన్న పేరు)తమ ఆస్తులు ఎందుకు ప్రకటించారు???(ఇట్లాంటివి మీకు పట్టవు )
*కచరా దొరవారు తమ ప్రతినెల జీతం విరాళంగా ఇచ్చి,తన కాడిలాక్ కారు అమ్మి వచ్చిన డబ్బులని అమరవీరుల కుటుంబాలకి ఇవ్వవచ్చు కదా(???)
*మీ సమస్య కాని సమస్య తీర్చాలని అందరినీ ఆడిపోసుకునే ముందు ఎదుటివారి సమస్య ఏమిటని అడిగి,చర్చించి వివేకంతో మెలగకపోతే మిగిలేవి ఏడుపు,చావులే!!!
వ్యక్తిగత సమస్యలు ఉన్నవాళ్ళు కోస్తా ఆంధ్రలో కూడా ఉంటారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని పాపులారిటీ కోసం సమైక్యవాదం కలరింగ్ ఎందుకు ఇచ్చుకోరు? ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/8nkUSujfPaU
ReplyDeleteమీ బ్లాగులో ఎంత గందరగోళం ఉందో మీ తెలంగాణ ఉద్యమంలో కూడా అంత గందరగోళం ఉంది అని ఈ రోజు మరొక్కసారి నిరూపించారు.నా కామెంటులో ఏమంత విమర్శ ఉందని తొలగించారు?వాస్తవాలని జీర్ణించుకోలేని బలహీన మనస్తత్వాలతో తెలంగాణ సమస్యని మీరే ఇంత జటిలం చేసుకుని ఇప్పుడు అందరిమీదపడి తిడుతున్నారు.నా కామెంటుని తొలగించారు బాగుంది, మరి నా కామెంటు మొత్తం విశ్వరూప్ గారు తిరిగి ప్రచురిస్తే అభ్యంతరం లేదా??? ఇదెక్కడి విడ్డూరం??? అయోమయానికి పరాకాష్ట ఇది.నెనర్లు విశ్వరూప్ గారు. దేవుడా మా ఆంద్రప్రదేశ్ని కాపాడు తండ్రి !
ReplyDelete@ సూటిగా
ReplyDeleteI am Viswaroop, and I myself is the blog owner! Now who in here is in "గందరగోళం"?
At first I deleted your comment to avoid unnecessary foolish arguments for silly comments, but later since I already published it once, I reinstated.
By the way
మా తెలంగాణ "రాష్ట్రం" మాకొచ్చాక మీ ఆంధ్ర "దేశాన్ని" కాపాడమని తీరిగ్గా మీదేవున్ని ప్రార్ధించుకోండి.
"చీఫ్‌విప్ గండ్ర తెలంగాణవాదం తగ్గిపోయిందని మాట్లాడి మరోసారి బలిదానాలకు తెరదించారు."
ReplyDeleteముందుగా మీ పోస్ట్ లో ఈ డైలాగ్ మరోసారి చూసుకోండి. అక్కడ తెరలేపారు అని ఉండాలనుకుంటా.
సరే విషయానికొస్తే ఎవరో కోన్ కిస్కా గండ్ర స్టేట్మెంట్ కే ఆత్మహత్యలు చేసుకున్నారంటే జనాలు ఎంత పిరికిగా ఉన్నారనుకోవాలి? మరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినవాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు "2014 వరకూ తెలంగాణా వచ్చేలా లేదు, విషం తాగి చచ్చిపోవాలనిపిస్తోంది" లాంటి ప్రకటనలు ఇచ్చే వారిని ఏమి చేయాలి?
ఒక్క మాట చెప్పండి. ఉద్యమంలో ఐక్యత ఎంత వరకూ ఉంది? ఒకరితో ఒకరు ఆధిపత్యం గురించి పోట్లాడుకోవటంలేదా? 2009 నుంచీ ఉద్యమం అంటూ ఒక పార్టీతో మరో పార్టీ పోట్లాడుకోవడం తప్ప ఒక్క ఎం.పీ లేదా ఎమ్మెల్యే అయినా ఒక్క నియోజక వర్గ సమస్యైనా పట్టించుకున్నారా? మాట్లాడితే తెలంగాణా వస్తుంది. స్వర్గం దిగివస్తుంది అని జనాల్ని మభ్యపెడతారు. అరె. మబ్బుని చూసి ముంతలో నీళ్ళు ఒలకపోసుకుంటారా ఎవరైనా?
నిజంగానే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎక్కడైనా ఎవరైనా ఏ కారణం చేతైనా ఆత్మహత్య చేసుకుంటే (అది తెలంగాణా గురించి కావచ్చు, కాకపోవచ్చు) వెంటనే గులాబీ జండాలు పట్టుకుని అక్కడ వాలిపోవడం మీడియా ముందు నానా హడావుడీ చేసి దాన్ని తెలంగాణా కోసం చేసుకున్న ఆత్మహత్యే అని చెప్పడం అని ఎవరైనా అనుకుంటే తప్పు కాదు. అసలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని గ్లోరిఫై చేయడమే తప్పు. అది నిరాశలో ఉన్న మిగిలిన జనాలకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది.
ఆరంభ శూరత్వంతో చేసే ఉద్యమాల వలన ఉపయోగం ఏంటి? సకల జనుల సమ్మెనే తీసుకోండి. అన్నిరోజులూ చేసి తెలంగాణతో సహా ప్రతి చోటా విద్యుత్ సంక్షోభానికి కారణం అయ్యారు. పోనీ ఆ చేసిన సమ్మైతో అయినా ఎమన్నా సాధించారా అంటే అదీ లేదు. సమ్మె చేస్తున్నంత సేపూ మాకు జీతాలు వెంట్రుకతో సమానం అన్నారు. చివరికి ఇప్పుడు ఆ సమ్మె కాలపు జీతాల కోసం మరో సారి సమ్మె చేస్తామంటున్నారు. అసలేంటిది?
@ప్రవీణ్
నీ కామెంట్లకి నీ పోస్టులే సాక్ష్యంగా ఇచ్చే అలవాటు మానుకో బాబూ. చూడలేక చస్తున్నాం. అదేదో పెద్ద నీ మాటే వేదం అన్న బిల్డప్ ఇస్తావు. దిక్కుమాలిన గోల.
సూటిగా గారు, శవాల మీద కుళ్ళు జోక్‌లు వేసేవాళ్ళకి మతమూ, దేవుడూ కూడానా? ఒయు అంకుల్స్ బ్లాగ్‌లో మీ కామెంట్లు చూశాను. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళని గొఱ్ఱెలు అనడం నీచనికృష్టమైన పని. శవాల మీద కుళ్ళు జోకులు వేసేవాళ్ళ కంటే శవాల మీద డబ్బులు ఏరుకునేవాళ్ళు నయం కదా. ఒకవేళ కెసిఆర్ నిజంగా శవ రాజకీయాలు నడిపినా చనిపోయినవాళ్ళని గొఱ్ఱెలు లాంటి పదాలతో సంబోధించకూడదు. ఎందుకంటే చనిపోయినవాడికి వచ్చేది ఏమీ ఉండదు. ఒక మనిషి అందని ప్రయోజనం కోసం చనిపోయాడని బాధపడకుండా చచ్చింది గొఱ్ఱె అని అంటే వినడానికి కంపరంగా ఉంటుంది. ఒయు అంకుల్స్ పేరుతో బ్లాగ్ వ్రాస్తున్నది విశాఖపట్నంకి చెందిన సమైక్యాంధ్ర జెఎసి నాయకుడు అడారి కిశోర్ కుమార్ అని అనుమానంగా ఉంది. ఆ బ్లాగ్ వ్రాసేవాడి స్టైల్ అడారి కిశోర్ కుమార్ స్టైల్‌లాగే ఉంది.
ReplyDeleteఎప్పుడూ ఎదుటివారు అదిచేయలేదు,ఇది చేయలేదు అని గోలచేసేమీరు మాత్రం ఏమీ చేయకుండా ఉండటమే పెద్ద గందరగోళం.నా ప్రశ్నలకి జవాబులు ఎందుకు ఇవ్వరు?సమాధానాలు లేవు కాబట్టా!తెలీదా??? నావి సిల్లీ కామెంట్లయితే మీ టపా అంత గొప్పదయితే మరి మీకు ఎంతమంది తెలంగాణ మద్దతుదారులు కామెంట్లు చేసారు???
ReplyDeleteసీమాంద్ర,నేషనల్ మీడియా మీకు మద్దతు తెలపకపోతే మరి మీరు మీ తెలంగాణ మిత్రులని అందులో పనిచేయకండని,చదవద్దని,చూడవద్దని పిలుపునివ్వకపోయారా!
@తెలంగాణ "రాష్ట్రం" మాకొచ్చాక మీ ఆంధ్ర "దేశాన్ని" కాపాడమని తీరిగ్గా మీదేవున్ని ప్రార్ధించుకోండి.
మీ కోరిక,నా కోరిక కలియుగంలో నెరవేరవులెండి !!!
సూటిగా,
ReplyDeleteఅర్ధం పర్ధం లేణి ప్రతి చత్త ప్రశ్నకూ సమాధానం చెప్పి నా సమయం వృధా చేసుకోలేను. మీ తొక్కలో ప్రశ్నలకు సమాధానలు లేవు అని అనుకుంటే మీకు తృప్తి అయితే అలాగే అనుకోండి, ఫరవాలేదు.
SHANKAR S,
ఆత్మబలిదానాలు ఒక్క తెలంగాణకే పరిమితం కాదు, మిడిల్ ఈస్ట్ విప్లవం, అంతకుముందు మండల్ కమీషన్ వ్యతిరేక సమ్మె, నిన్న టిబెటన్ ఆత్మాహుతి ఇలాంటివి ఎన్నో. కాకపోతే మనం, మన మీడియా పక్షపాత కళ్ళతో తెలంగాణ ఆత్మబలిదానాలను తక్కువ చేసి మాట్లాడి, మిగతావాటిని గొప్పగా చిత్రీకరిస్తాయి. మీరు కూడా అలాగే చూడడం బాధాకరం. రేపు ఇంకేదయినా ఉద్యమం జరిగితే ఇది సీమాంధ్రలోకూడా జరగొచ్చు. సమైక్యాంధ్ర ఉద్యమంలో బలిదానాలు లేకపోవడానికి కారణం అక్కడ అది కేవలం ఫాక్షనిస్టులూ, పెట్టుబడీదారులూ మీడియా ఆడిన నాటకం కాబట్టి.
ఉద్యమంలో పరిపూర్ణ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాదు. తెలంగాణ తెదే, కాంగ్రేస్ సీమాంధ్ర నాయకుల చెప్పుచేతల్లో ఉంటూ ఏ ఆధిపత్యంపై పోరు జరుగుతుందో అదే ఆధిపత్యాన్ని పాటిస్తూ ఇక్కడ ఉద్యమంలో మేమూ ఉన్నాం అంటే ఐక్యత కుదరదు. మిగతా వాల్లంతా కలిసి కాకపోయినా ఒకేలక్ష్యంతో ఉద్యమిస్తున్నారు, ప్రజలు అందరికీ మద్దతు ఇస్తున్నారు.
ఇక్కడ టపా మీడియా బాధ్యతా రాహిత్యం గురించి. దానికి ఉద్యమంలో ఐక్యతకి సంబంధం లేదు. మీడియా తనపని తాను చెయ్యాలి. ఒకేరకం సంఘటనలు వేర్వేరుచోట్ల జరిగినప్పుడు ఒకేరకంగా స్పందించాల్సి ఉంటుంది, కానీ అది జరగట్లేదు.
హైదరాబాద్ అనే మేడి పండు కోసం సమైక్యవాదులు నిజంగా బలిదానాలు చేసుకుంటారా? మేడి పండుని బతికి అనుభవించాలనుకుంటారు కానీ దాని కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోరు.
ReplyDeleteఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/b8ECYbQbGZA ఇలాంటి విష ప్రచారాలు చేసేవాళ్ళు ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరగవు?
ReplyDelete