Wednesday, 18 July 2012

వంకర రాతల సుంకర వెంకటేసు


విశాలాంధ్ర మహాసభ తరఫున నేణు ప్రశ్నలడుగుతున్నాను, సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటే సమాధానం ఇమ్మని సుంకర వెంకటేసు అనే పెద్దమనిషి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ పెద్దమనిషి రాతలు అత్యంత అభ్యంతరకరంగా సంస్కారహీనంగా ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానాలు చెప్పబడిన తర్కహీనమయిన నాసిరకం వాదనలు. అలాంటి చెత్త వాదనలకు సమాధానాలు ఇస్తూ అటెన్షన్ సీకర్లకు లేని ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా ఒకవేల సమాధానం ఇవ్వకపోతే ఎవరైనా తెలియనివారు ఈనాసిరకం వాదనలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది కనుక సమాధానాలు ఇవ్వల్సి వస్తుంది.

సుంకర గారి సవాలు పూర్తి పాఠం:
**********
విశాలాంధ్ర మహాసభ తరపున నేను చేస్తున్న  సవాలు కి ఈ "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? ఆ ఇవ్వగలిగే సత్తా మీకు ఉందా..?
మా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే  కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా  ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని  ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(            26 - 02 - 1997       )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) (            18 - 07 -1996       )
౩.  శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా 
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు  వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది  అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(            22 -08 -1988       )
 మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద  ఉద్యమము మీలో చాలా మందికి  బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది  కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా   చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్

****************


>>>తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? 



ఆర్యా, పెద్దలు కాస్త నోరు అదుపులో పెట్టుకుని రాతలు రాయవలసి ఉంటుంది. ఇవ్వాల మీరు తమ సొంత నామధేయంతో విశాలాంధ్ర మహాసభ తరఫున అని చెబుతూ, తెలంగాణ నడిబొడ్డున నివసిస్తూ కూడా   తెలంగాణ వాదులపై ఇంత అభ్యంతరకరంగా రాతలు రాయగలుగుతున్నారంటే కారణం మీరు రాసినట్టు తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, నాయకత్వం కానీ తీవ్రవాదులూ, వేర్పాటువాదులూ కారు కాబట్టి.

ఒక్కసారి తమరు తమ సమైక్యవాద నాయకత్వాన్ని గమనిస్తే అందులో సగం మంది ఫాక్షన్ చరిత్ర కలిగిన వారూ, నేర చరిత్ర కలిగిన వారూ అని తప్పక గమనిస్తారు. కానీ మీకళ్ళు నిజాలని చూడడానికి సిద్ధంగాలేవుకదా? ఇదే రకం మాటలు సమైక్యవాదనాయకత్వంపై ఎవరైనా ఉపయోగించి ఉంటే తెల్లారేసరికి తెలంగాణపై దాడిచేసి కడప బాంబులూ, కర్నూలు వేటకొడవల్లు, గుంటూరు నాటుబాంబులూ (కోడెల శివప్రసాదు ఇంట్లో పేలిన రకం) ఉపయోగించి యుద్ధం చేసి ఉండేవారని మనవి.   

మరో మాట: ఒకవైపు  తీవ్రవాదులూ, వేర్పాటువాదులూ అనే భాషను ఉపయోగిస్తూ ఎదుటివారిని మాత్రం సంస్కారంతో, సహనంతో సమాధానం ఇమ్మని అడగడం మీబుద్ధిలేమిని, అఙ్యానాన్ని, మదాన్ని తెలియజేస్తుందని మనవి. కనుక ఇకనైనా నిజాలు తెలుసుకుని సంస్కాయుతంగా రాతలు రాయగలరు. పైగా మీరు విశాలాంధ్ర మహాసభ తరఫున సవాలు విసురుతున్నారు కనుక అందులో భాష సరిగా వాడకపోతే మీరాతలు విశాలాంధ్ర మహాసభకు చెరుపు. 

సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది 

ఆహా, తమరి రాతల్లో సంస్కారం ఉట్టిపడుతుంది కదా! ఇది కేవలం మీ కుసంస్కారమే అనుకోవాలా, లేక మీవిశాలాంధ్ర మహాసభకూ, సమైక్యవాదులందరికీ కట్టగలిపి ఆపాదించాలా?


"నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే  కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా  ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.



తమరు సరిగ్గా విన్నట్లు లేరు. వారడిగేది అదికాదు, "మానోరు నొక్కేస్తున్నారు కదయ్యా" అంటూ అమాయకత్వం నటించే "విషవృక్షాలు",  "మేంఉ తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తాం, అన్నదమ్ముల్లా విడిపోదాం" (రుజువులు కావాలా?) అన్నప్పుడు తమ నోరు ఎవరైనా నొక్కేసారా అని అడుగుతున్నారు.

పైగా ఇంట్లో సొంతభార్యను నీవాదనతో ఒప్పించనివాడివి ఇక్కడ ప్రజలను మేము ఒప్పిస్తాం అని గొంతెమ్మ కబుర్లెందుకు చెబుతున్నావని అడుగుతున్నారు.

1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(            26 - 02 - 1997       )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) (            18 - 07 -1996       )
౩.  శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా 
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)


ఆర్యా, చంద్రశేఖరరావు గానీ కొండా లక్ష్మన్ బాపూజీ గానీ, మరొకరు కానీ తాము ఒక రాజకీయపార్టీలో ఉన్నప్పుడు ఆపార్టీ నాయకత్వం యొక్క స్టాండుకు కట్టుబడి మాట్లాడారు. అయితే ఆఇద్దరూ కూడా తెలంగాణ విషయంపైనే పార్టీతో విభేదించి బయటికి వచ్చి ఆ తరువాత తెలంగాణవాదాన్ని వినిపించారు.


తమరి అవకాశవాద పరకాల ప్రభాకర్‌లాగా పార్టీలో ఉన్నప్పుడు పార్టీపాట పాడుతూ, ఏనాడూ రాష్ట్ర విభజన విషయంపై తమ పార్టీ నాయకత్వాన్ని నిలదీయక, విభేదించక డూడూ బసవన్నలాగా తలూపుతూ కేవలం టిక్కెట్టివ్వని కారణం చేత పార్టీని విషవృక్షం అని తూలనాడీ బయటికి వచ్చి ఆతరువాత తమ వాదన మార్చుకోలేదు.


ఈతేడా తమలాంటి బుద్ధిహీనులకు అర్ధం అవుతుందని అనుకోను. మీరు ఎందుకు బుద్ధిహీనులో ఇప్పటికే నిరూపించబడిందని గమనించగలరు


4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)


 ఆర్యా, తమరు వేర్పాటువాదము అనేపదానికి అర్ధం తెలియనంత మూర్ఖులని నేననుకోలేదు. మీ సమైక్యవాద నాయకులకు హైదరాబాదు, చుట్టుపక్కలా పుష్కలంగా వ్యాపారాలు ఉన్నాయి, వేల ఎకరాల భూములు కబ్జా చేశారు, వాటిపై లాంకో హిల్స్ లాంటి భవంతులు నిర్మించారు.

5 .వేర్పాటు  వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది  అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)




సమైఖ్య కాదు, సమైక్య.  సమైక్య ప్రభుత్వంలో తెలంగాణ నుండి ఎవరూ ఉండకూడదని మీవిషాంధ మహాసభవారేమయినా తీర్మానించారా? 




సుంకర వెంకటేస్వర్లు గారూ, మీవాదనలు ఎంత చప్పగా ఉన్నాయంటే వీటికి సమాధానాలు ఇవ్వడానికి మీరు భ్రమపడుతున్నట్లు మేధస్సు, దమ్ము, ఖలేజా లాంటివేవీ అవసరం లేదు, బొడ్డూడని బుడ్డోడు కూడా సమాధానం ఇవ్వగలరు. దానికి కారణం మీవాదనలో పటుత్వం లేకపోవడం తప్ప మరొకటి కాదని మనవి




5 comments:

  1. తెలంగాణా రాష్ట్రం నిజంగా రాదనుకుని గతంలో తాము తెలంగాణాకి అనుకూలమని చెప్పుకున్నవాళ్ళే ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారు. కె.సి.ఆర్ ఒకప్పుడు సమైక్యవాది అని అంటే ఇప్పుడు ఉన్న సమైక్యవాదులందరూ చిదంబరం ప్రకటన వెలువడకముందు తెలంగాణావాదులే కదా అని సమాధానం చెప్పగలం.

    ReplyDelete
  2. I asked Sunkara the following questions on his blog. Let me see how he responds.

    ====================================================================
    Jai Gottimukkala18 జూలై 2012 4:11 సా
    भाई साहिब, सूना है आप ह्यदरबाद को बचाने के लिए कुछ करते हो. क्या कर्तेहो ज़रा हमें भी बताईये, शुक्रिया.


    ====================================================================
    Jai Gottimukkala19 జూలై 2012 11:01 ఉ
    సుంకర వారూ, ప్రభాకర్ గారిని ఆయన రాజకీయ చరిత్ర గురించి అడిగినా, స్వ. శేషావతారం గారు లేదా కాళికాంబ/నిర్మల గార్ల గురించి అడిగినా వారికి సంబంధించిన విషయం కాబట్టి అర్ధం ఉంది. ఈ వ్యక్తులతో సంబంధం లేని చక్రవర్తి గారినో మిమ్మల్నో ఎవరూ ఈ ప్రశ్నలు అడగలేదని తమరు గమనించే ఉంటారు.

    బాపూజీ, KCR లేదా నాగం గార్లు కానీ, వారి దగ్గర వాళ్ళు కానీ మీ బ్లాగు చదివే అవకాశం ఉందా? మీకు నిజంగా సమాధానం కావాలంటే ఆయా వ్యక్తులకే రాయవలిసిందిగా మనవి.

    ఇకపోతే నేను ఇక్కడ మిమ్మల్ని మీ గురించి ఒక ప్రశ్న అడిగాను. జవాబు చెబితే విని (చదివి) తరించగలను. నా ప్రశ్న విమసకు కానీ, SGPST వారికి కానీ, మీ తెలంగాణా వ్యతిరేక మిత్రులకు కానీ సంబంధించినది కాదు కాబట్టి మీరో మీ हैबस ప్రతినిధులో జవాబు ఇస్తే బాగుంటుంది. మీరు రాసిన బ్లాగే కాబట్టి నా ప్రశ్నలు మీకు అందకపోవని ఆశిస్తాను.

    ReplyDelete
    Replies
    1. బస్తీమే సవాల్ అన్నోడు పత్తలేకుండ పోయిండు.

      Delete
    2. అన్నా, ఆయన చాలా బిజీగా ఉన్నడు. ఇప్పుడు భాజపాకు సవాల్ విసిరిండు. సవాల్ మీద సవాల్ చేస్తడు కానీ జవాబులు వినడు.

      बड़े चले आये हैदराबाद को बचाने.

      Delete
  3. వంకర టింకర సుంకర మాటలు
    సంకర జాతి చిల్లర రాతలు
    గలీజ్ మనుషుల బట్టేబాజ్ వాగుడు
    సత్రోల్ మూకల లత్కోర్ మొరుగుడు

    ReplyDelete

Your comment will be published after the approval.