Saturday, 19 May 2012

సీమాంధ్రలో ఉద్యమాలు ఎలా జరుగుతాయి?ఏ సమైక్యవాదిని కదిలించినా తెలంగాణ ఉద్యమం హింసాయుతంగా జరుగుతుందనీ, ఉద్యమకారులు భాద్యతగా ప్రవర్తించడంలేదనీ లెక్చర్లు దంచుతారు, తెలంగాణవాదులను తిడుతుంటారు. పైగా తాము సమైక్యాంధ్రకోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్నామనీ, అలా చేస్తున్న తమనోర్లు నొక్కుతున్నారనీ అంటుంటారు. నిజానికి ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరగడంలేదు, జరిగేది తెలంగాణ ఉద్యమమే. డిసెంబరు 9, 2009 తరువాత రెండువారాలు మాత్రం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎన్నో హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి. బస్సులు, రైలు పెట్టెలూ తగలబెట్టడమేకాక గాక అనంతపురం బీఎస్సెన్నెల్ ఆఫీసు గోడౌన్లలో కోట్ల ఆస్తులు కాల్చివేశారు.   

ఆంధ్రరాష్ట్రం కొఱకు జరిగిన ఉద్యమం శాంతియుతంగా గాంధీమార్గంలో పొట్టిశ్రీరాములు దీక్షవలన జరిగిందని చెబుతారు. అప్పుడు ఎంత హింస జరిగిందీ, ఎలా పొట్టి శ్రీరాములు ప్రాణాలను పొట్టనబెట్టుకుందీ గత టపాల్లో చెప్పుకున్నాం. 

ఇక  ముల్కీ నిబంధనలపై తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జరిగిన జై-ఆంధ్రా ఉద్యమం ఎలా జరిగిందో ఒక్కసారి పాత న్యూస్‌పేపర్లను తిరిగేస్తే తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, విభజన వ్యతిరేకించిన నాయకుల ఇళ్ళలోకి దూరి కొట్టడం, ఇంట్లో ఫర్నీచర్ తగలబెట్టడం లాంటి అనేకసంఘటణలు కనిపిస్తాయి. వీటన్నింటికీ పరాకాష్ఠ ఏమిటంటే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన సభకు జనం లారీల్లో దివి తాలూకా నుంచి వచ్చి తిరిగి వెల్తుంటే లారీని ఉయ్యూరు సమీపంలో అడ్డుకుని అందులోని స్త్రీలను వివస్త్రలను చేసి అఘాయిత్యం చెయ్యడం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఈవిషయంపై అప్పట్లో విశాలాంధ్ర పత్రికలో వచ్చిన సంపాదకీయం ఇక్కడ చూడొచ్చు.


కేవలం వంగావీటి, పరిటాల లాంటి వ్యక్తుల హత్యలకు జరిగిన నిరశనల్లో జరిగిన ప్రభుత్వ ఆస్తి నష్టం లెక్కలేనిది. అలాంటిది లక్షలకొద్ది ప్రజలు పాల్గొనే ప్రజా ఉద్యమాలు సీమాంధ్రలో జరిగితే ఎలాగుంటాయంటే పైన ఉదహరించినట్లే ఉంటాయి. 


33 comments:

 1. తెలంగాణా ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగితే సీమాంధ్ర ఉద్యమంలో రేప్‌లు జరిగాయి. బాగుంది ఈ న్యూస్ క్లిప్పింగ్.

  ReplyDelete
  Replies
  1. వేర్పాటువాదులు ఎక్కడైనా వెధవలే అన్నమాట. కానీ చిత్రమేంటంటే నలభై ఏళ్ల తర్వాత కూడా వేర్పాటు వాదుల లక్షణాలు అలాగే ఉన్నాయి. కాపోతే ఈ సారి వేదిక తెలంగాణాకి మారిందంతే. అన్నట్టు దీనికన్నా మూడేళ్ళ ముందు అరవై తొమ్మిదిలో ప్రత్యెక తెలంగాణా ఉద్యమం చాలా ప్రశాంతంగా జరిగినట్టుంది?

   Delete
  2. @SHANKAR.S

   వాదంతో సబంధలేకుండా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి ఉద్యమం, సంఘటన, నిరశన జరిగినా అందులో ఉద్రిక్తత ఉంటుంది. జై-ఆంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో రెండిట్లోనూ హింస కనపడ్డం, రెండూ నడిపిన నాయకులు ఒక్కరే కావడంలో ఆశ్చర్యం లేదు. మరో టపాలో అసలు జై-ఆంధ్రా ఉద్యమం ఎందుకు జరిగింది అని వివరిస్తాను.

   Delete
  3. వేదిక ఎక్కడికి మారినా తెలంగాణా ఉద్యమంలో రేప్‌లు జరగలేదు. నాడు జై-ఆంధ్ర ఉద్యమంలో రేప్‌లు చేసినవాళ్ళే నేడు సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తమది గాంధేయవాద ఉద్యమం అని చెప్పుకుంటున్నారు.

   Delete
  4. @విశ్వరూప్
   "జై-ఆంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో రెండిట్లోనూ హింస కనపడ్డం"

   అరవైతొమ్మిదినాటి, ప్రస్తుత తెలంగాణా ఉద్యమాల గురించి చెప్పడం మర్చిపోయినట్టున్నారు. లేకపోతే జనాలు అవేవో ప్రశాంతంగా జరిగాయనుకునే ప్రమాదం ఉంది. :)

   @ప్రవీణ్

   అంటే రేపులు తప్ప ఉద్యమం పేరుతొ ఇంకేం చేసినా పరవాలేదన్న మాట. అయినా ప్రవీనూ పైన ఎడిటోరియల్ లో రేపులు చేసినట్టు ఎక్కడుందో కాస్త చెప్తావా? చివరి పేరా పై రెండు లైన్లలో కూడా స్త్రీలను వివస్త్రలను చేసే అనాగరిక స్థితి అన్నారు. అది ఖచ్చితంగా అనాగరికమె. రజాకార్లు నగ్నంగా బతుకమ్మ ఆడించినా, పైన సంఘటన అయినా ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇకపోతే అప్పుడు రేపులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు అన్నావు. ఎవులాలు? పోన్లే వాళ్ళని తిట్టినా సమైక్యాంధ్ర ఉద్యమం ఉందని నువ్వే ఒప్పుకున్నావు.

   చూడు ప్రవీనూ నువ్వు ఏదైనా వాదాన్ని సమర్దిస్తున్నావు అంటే అందులో జరిగే చెడుని కూడా గుడ్డిగా సమర్ధించాల్సిన అవసరం లేదు. తెలంగాణా ఉద్యమమైనా, అప్పటి ప్రత్యేకాంధ్ర ఉద్యమమైనా తప్పు చేసినప్పుడు ఎవరినైనా ఖండించాల్సిందే.

   Delete
  5. తాగేసి షాప్‌ల అద్దాలు బద్దలుగొట్టే ఉద్యమం కోస్తా ఆంధ్రలో లేదని నేను అనలేదు. నిజమైన సమైక్యతా రాగమే లేదు అని నేను అన్నాను. మా పట్టణంలోనే ఒక టైలర్ తన షాప్ అద్దాలని ఎవరూ బద్దలగొట్టకూడదు అని ఆ అద్దాల మీద "జై సమైక్యాంధ్ర" అని పేపర్ అంటించాడు. వర్షాలు పడి పేపర్ ఊడిపోయింది. సమైక్యవాద గూండాలు మళ్ళీ రాలేదు కనుక ఆ పేపర్ మళ్ళీ అంటించాల్సిన అవసరం అతనికి కనిపించలేదు. నల్లగొండ జిల్లాలో కోస్తా ఆంధ్రకి చెందిన సిమెంట్ కంపెనీలవాళ్ళు తమ ఫాక్టరీల మీద దాడులు జరగకూడదని ఫాక్టరీల గోడల మీద "జై తెలంగాణా" అని వ్రాసారు. బంద్‌ల నాడు ఆ ఫాక్టరీలపై దాడులు జరగకపోతే బంద్ ప్రశాంతం అని ప్రచారం చేశాయి సమైక్యవాద చానెళ్ళు.

   Delete
  6. @SHANKAR S

   హింస ఎక్కడ జరిగినా తప్పే. నేణెప్పుడూ హింసను సమర్ధించలేదు. కేవలం తమ తప్పులనన్ని దాచుకొని ఎదుటివారిపై వేలెత్తి చూపే కొందరి బండారం బయట పెట్టడమే నా ఉద్దేషం

   ఇకపోతే హింసను ఖండించడంతో పాటు హింసను అది ఎలాంటి హింసో అర్ధం చేసుకోవడం కూడా ముఖ్యం. పిల్లిని గదిలో వేసి బాదితే పిల్లి తిరగబడుతుంది, అప్పుడు తిటాల్సింది పిల్లిని కాదు, దాన్ని గదిలో బంధించి కొట్టినవారిని. తెలంగాణలో 69లో నయినా, ఇప్పుడయినా రెండు అతిపెద్ద ఉద్యమాల్లో చిన్నచిన్న చెదురు మదురు సంఘటనలు జరిగినాయి, అయితే వాటికి కారణం పిల్లిని గదిలోవేసి బంధించి కొట్టినట్లు ప్రవర్తించిన ప్రభుత్వానిది. చిన్నచిన్న ర్యాలీలకు కూడా అనుమతినివ్వక, లక్షల్లో అరెస్టులు చేసి ఆడపిల్లలని కూడా చూడకుండా రాక్షసుల్లా కొట్టించిన చర్యలకు ప్రతిచర్యలుగానే హింస జరిగింది.

   కానీ ఆంధ్రాలో హింస అలా కాదు. అక్కడ జరిగింది తమ తోటి ఆంధ్రా ప్రజానీకంపనే దాడి, దానికి ప్రవోకేషన్ ఏదీ లేదు. కేవలం వారు విభజన వ్యతిరేకించిన కారణంగా కిరాతకుల్లా ఆడవారిపై అఘాయిత్యం చెయ్యడం ఏవిధంగానూ సమర్ధనీయం కాని పైశాచిక చర్య.. ఇది ఫాక్షన్, కులగజ్జి వర్గాల దాడులూ, కారంచేడు, చుండూరు లాంటి పాశవికచర్యలతో సమానమయింది. దీనికి విభజన వాదంతో సంబంధం లేదు..మరే వాదంతోనూ సంబంధ్మ లేదు.. అక్కడి కొందరు అలవాటుగా చేసే కిరాతకాలను మాత్రమే సూచిస్తుంది.

   ఇక్కడ విషయం ఏమిటంటే ఇలాంటి కిరాతకులు ప్రజాఉద్యమాలు చేస్తున్నట్లు నటిస్తుంటే అలాంటి ఉద్యమాలు ఎలాగుంటాయి అనేది. అదృష్టవశాత్తూ సమైక్యాంధ్ర ఉద్యమం రెండువారాల్లో పూర్తయింది, లేకపోయుంటే ఈరాక్షసగణం బహుషా ఈపాటికి అక్కడి సామాన్యప్రజలపైనే వేటకొడవల్లతో దాడులు చేసి దాన్ని ఉద్యమంలో భాగంగా చెప్పుకునేవారు.

   Delete
  7. "తెలంగాణలో 69లో నయినా, ఇప్పుడయినా రెండు అతిపెద్ద ఉద్యమాల్లో చిన్నచిన్న చెదురు మదురు సంఘటనలు జరిగినాయి"

   మరేనండి చాలా చెదురుమదురు సంఘటనలు. అబ్బే అస్సలు హింసలేదు. విధ్వంసం లేదు. రెచ్చగొట్టడం అస్సలు లేదు.

   మన దగ్గర జరిగితే చిన్న అలజడి. అదే అటు పక్క జరిగితే భీకర విధ్వంసం. అంతేగా మీరు చెప్పదలచుకున్నది. :))

   Delete
  8. @SHANKAR S

   నేనలా నలేదని మీకూ అర్ధమయింది, ఇంకా ఎందుకు పొడిగించి మిమ్మల్ని మీరే ఎక్స్పోజ్ చేసుకుంటారు? అన్యాయంగా లాఠీచార్జి చేసి ఆడవాళ్లను సైత కాల్లిరిగేలా కొట్టినపుడు వళ్ళుమండి ఒక బస్సు తగలబెట్తడానికీ, వళ్ళు తిమ్మిరెక్కి లారీలు దించి ఆడవారిపై అత్యాచారాలు చేసేవారికీ తేడా తెలుసుకోండి.

   మాకు సీమాంధ్ర ప్రజలపై ఎలాంటి కోపం లేదు..కాకపోతే మీరు మీ లంచగొండి, మోసకారి, ఫాక్షనిస్టు, రౌడీమూక, కిరాతక నాయకులకు వత్తాసు ఇవ్వడం వల్లనే మేము ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది.

   Delete
  9. "నేనలా నలేదని మీకూ అర్ధమయింది"

   నేను ఎలా అన్నా తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే వాళ్ళలా మీరు మీకు కావలసిన అర్ధాన్నే మీరు తీసుకుంటారని బాగా అర్ధమయిందండీ. అన్నట్టు పాపం ఒక్క బస్సు తగలబెట్టడాలే కాదండోయ్ ఉద్యమంలో జరిగిన మిగిలిన హింస మీ కంటికి కనిపించలేనట్టుంది. ఓ సారి అలా ట్యాంక్ బండ్ పైకి వెళ్లి చూడరాదూ? లేదూ సూర్యాపేట దగ్గర బస్సులపై పడ్డ రాళ్ళని అడగరాదూ?

   "మాకు సీమాంధ్ర ప్రజలపై ఎలాంటి కోపం లేదు..కాకపోతే మీరు మీ లంచగొండి, మోసకారి, ఫాక్షనిస్టు, రౌడీమూక, కిరాతక నాయకులకు వత్తాసు ఇవ్వడం వల్లనే మేము ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది."

   అభివృద్ధి, ఆత్మగౌరవం తర్వాత ఇదేదో కొత్త కారణంలా ఉంది? బావుంది బావుంది. ఇంకా వెతకండి దొరుకుతాయి.

   Delete
 2. వాల్లది,మీది ప్రజా ఉద్యమాలు కాదుకాబట్టే విఫలమయ్యాయి

  ReplyDelete
  Replies
  1. @వజ్రం
   తెలంగాణ ఉద్యమం పూర్తిగా ప్రజా ఉద్యమం, అది విఫలం కాలేదు, తాత్కాలికంగా కొందరు సీమాంధ్ర స్వార్ధశక్తులవల్ల ఆలస్యం అయింది, కానీ లక్ష్యం దిశగా దూసుకెల్తుంది.

   సీమాంధ్రలో జై-ఆంధ్రా అన్నా సమైక్యాంధ్ర అన్నా అది ప్రజా ఉద్యమం కాదు, స్వార్ధనాయకుల పెట్టుడు ఉద్యమమే. అయినా జై-ఆంధ్రా ఉద్యమం లక్ష్యాన్ని సాధించింది. జై-ఆంధ్రా ఉద్యమ లక్ష్యం రాష్ట్రాన్ని విడగొట్టడం కాదు, ముల్కీ రూల్స్‌కు అడ్డుపడం, ఆంధ్రాలో భూసంస్కరణలను ఆపడం..ఆరెండు లక్ష్యాలు నెరవేరాయి. ప్రజాఉద్యమాలన్నీ సఫలం కావాలని లేదు, స్వార్ధనాయకుల నాటకాలు ఓడిపోవాలనీ లేదు..అప్పటి వారి బలాబలాలమీద గెలుపు-ఓటములు నిర్ణయించబడతాయి.

   విచితంగా అప్పుడూ జై-ఆంధ్రా అన్న నాయకులే ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారంటే వాళ్ళ ఉద్దేషాలు సుస్పష్టం.

   Delete
 3. కానరాదులే మన నలుపు..

  “తెలంగాణ హక్కుల రక్షణ ఉద్యమాన్ని సాకుగా తీసుకొని నిన్న విచ్చల విడిగా విహరిస్తూ ప్రైవేట్ ఆస్థులని, గృహ దహనాలకు పాల్పడిన అనేక మంది గూండాలను, సంఫ్హ వ్యతిరేక శక్తులను పోలీసులు నేడు అరెస్ట్ చేసారు. నిన్న పోలీసులకు, గూండాలకు మధ్య జరిగిన ఘర్షణ లో ప్రైవేట్ ఆస్థులకి విశేషనష్టం వాటిల్లింది.
  ఒక కడప విధ్యార్ది కి కనురెప్పల మీద వెంట్రుకలు గొరిగించి, ఒక మీసం గొరిగించిన ఉదంతం ఈ రోజు ఇక్కడకు తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన కాందిశీకుల వల్ల తెలియవచ్చింది.
  నరసరావుపేట నిండి గాజులు అమ్ముకోను వెళ్ళిన ఆరుగురిని తన్ని పంపించివేశారు.
  స్త్రీలు, పిల్లలతో సహా 24 గంటలలో ఖాళీచెయాలని నోటీసు ఇచ్చారు.
  ఒక అధికారి కూతురుని తన్ని అవమానం చేసారని ఆ అధికారి దొండపాడుమీదుగా ఎడ్లబండి మీద తప్పించుకు పారిపోయారని.....
  ఉస్మానియా యూనివర్శిటి హాస్టల్లో దమనకాండ - ఆంధ్ర విద్యార్ధుల సామాగ్రి బూడిదపాలు - ఆంధ్రపత్రిక 31-1-1969
  గత రాత్రి జయప్రకాషనారాయణ రోడ్డు లో లూటీలు, దహనకాండకు యత్నించిన అల్లారి మూకలను చెదరగొట్టతానికి పోలీసులు ఖాళీ తూటాలను పేల్చారు – ఆంధ్రప్రభ 30-1-1969
  ఆంధ్ర విధ్యార్ధుల సామాను దగ్ధం – ఇక్కడి ఇంజనీరింగు కళాశాలలో చదువుతూ, హాస్టల్ లో నివసిస్తున్న కొందరు ఆంధ్ర విధ్యార్ధుల సామాను కొందరు దుండగులు దగ్దం చేసినట్లు అధికారపూర్వకం గా తెలియవచ్చింది. – ఆంధ్రప్రభ 30-1-1969
  కృష్ణాజిల్లా రిజిస్టర్ అయివున్నట్లు నెంబరు గల ఒక లారీ ని ములుగు రోడ్డు వద్దు దగ్దం చేసారు
  టెలిఫోన్ ఎక్స్చేంజ్, టెలిగ్రాఫ్, హనుమకొండ హెడ్ పోస్టాఫీసు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసె ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వీరిలో కొందరిపై గత రాత్రి దుండగులు దాడి చెయ్యటమో, వారి గృహాలపై దాడి చేసి లూటీలు చెయ్యటమో జరిగింది.

  గుంటూరు జిల్లా వారి గడ్డివాములు దగ్దం – గుంటూర్ జిల్లా నించి వచ్చి ఇక్కడి సామీపం లో దిండి గ్రామం లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి చెందిన గడ్డి వాములను మొన్న సాయంకాలం విధ్యార్ధులు తగులబెట్టారని ఇక్కడికి సమాచారం అందింది. – ఆంధ్ర పత్రిక 30-3-1969
  వరంగల్లు లో రైసు మిల్లు దోపిడి – వరంగల్లు లో నిన్న అల్లరి మూకలు స్వేచ్చ గా విహారం చేసినట్లు ఇక్కడకు చేరిన వారతననుసరించి తెలుస్తున్నది – 30-1-1969
  పొన్నూరు కి చెందిన మాభుఖాన్ లారీలో కలప విజయవాడకి వేసుకొని వస్తుండగా వరంగల్ రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టి లారీని ఆపేశారు. డ్రైవర్ ను బయటకు లాగి రు. 1000 విలువచేసే వాచీ, ఉంగరం తీసుకొని డ్రైవర్ను, క్లీనర్ను కొట్టారు. మోకులు, టార్పాలిన్ తీసుకున్నారు.
  ఇవికాకా, కాసుబ్రహ్మానందరెడ్డి గారి భార్య రాఘవమ్మ ని ఉద్దేస్యించి గోడలపై మీరు వ్రాసిన అశ్లీల, అసహ్యకరన వ్యాఖ్యలు మరిచిపోయారా?
  మొన్నటికి మొన్న రైలులో ప్రయాణిస్తున్న ఆడవారిపై ఉద్యమకారులపేరుతో చేసిన పైత్యం గుర్తులేదా?

  and the master piece in your praja udyamam..

  సర్వేయర్ రంగాచారి మృతి. – నల్లగొండ లో ఎవరో దుండగులు ముట్టడించి నిప్పు పెట్టగా గాయపడిన ఆంధ్ర సర్వేయర్ బి. రంగాచార్యులు నేడు ఆస్పత్రి లో మరణించినట్లు తెలియవచ్చింది.

  ReplyDelete
  Replies
  1. Whole point of the post is to show your dark side!!

   Delete
  2. Nobody has supported such acts unlike T separatists who try to justify all uncivilized acts they do. For you Andhra Prabha is not biased when it wrote stories against Prakasam or when it published the violence after potti Sriramulu death. But When the same paper exposed the violence in your agitation, u see biased.. Rendu Nalkala Siddaantam.

   Delete
  3. 1) When leaders themselves are leading the mobs, what is the requirement for supporting? Ex: Payyavula led mobs in anantpur for burning BSNL godowns.

   2)All the incidents that telanganavadis support have valid reasons with prior state sponsored violence, including statues. I don't want to go into details as it is several times debated.

   3) Hypocrites are those who just criticize some odd incidents led to violence but keep blind eye on state violence such as brutal action of police on OU girl students, including hypocrite JP narayana.

   4) Regarding bias in media: before 52 telangana was not at all in the issue, why should they show bias?

   bye...

   Delete
  4. 1. Can you give me proof where Payyavula mobilized mobs to burn BSNL godowns? On the otherhand, Harish Rao, and KTR set an example on how to behave in the name of agitation

   2. My dear friend, anybody can make statements like "it is justified, have reasons, debated over and over etc". Do state administration should keep silent when the mob can go haywire disrupting public life?

   3. Hypocrites are those who even lacks courage to publish comments when their own black is showed. Hypocrites are those who call favoring news as genuine, countering news as biased.

   4. If the intentions of Andhra Prabha was not report to violence in Separate andhra/ Jai andhra they would have done it even in 52. The presence/absence of telangana is immaterial.

   Delete
  5. proofs: I can neither give payyavula leading mobs in anantpur, YSR instigating communal riots in Hyderabad to remove Chenna Reddy or many others. if we can prove it then they won't be in assembly, but behind bars. Even CBi couldn't yet establish charges on Jagan, that doesn't make us believe that jagan is innocent.

   Please come out of the notion that sitting behind internet you can prove everything. Just because you find a link saying flouride problem eradicated does not mean it is true in reality, just because I can't prove some one's role does not mean it is false.

   /* My dear friend, anybody can make statements like "it is justified, have reasons, debated over and over etc". Do state administration should keep silent when the mob can go haywire disrupting public life? */

   That is waht they did when mobs are doing riots from dec 9 2009 until dec 15 2009. BSNL godowns are burnt when police were actually present.

   రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అధికారంలో ఉన్నది మనోడయితే మనల్ని అడ్డేదెవరు?

   Girl students in OU were not going heywire and disrupting publc life to corner them in their hostels and beat them until midnight. Which seemandhra leader came and condemned such brutal act? Even when High Court called it as violation of human rights, why no one including JP, Parakala came and condemned such things?

   My dear fried when your rationale is blinded by biased views you do not understand whatever is said to you.

   When rulers are trying to suppress agitations, people use violence. But when rulers themselves are supporting samaikyandhra why was there any need for violence in samaikyandhra agitation? What is the need? Why to burn buses, why to set fire to BSNL godowns?

   Delete
  6. If state is sponsoring the violence why the people involved in BSNL incident were arrested and brought to book?

   For you links does not matter, statements of great personalities does not matter, govt reports does not matters, press news does not matter (except when it is against other region) after all what matters is what our great pundit Jayasankar wrote in his evening times.

   Can you provide the testimony of girl students who told they were beaten till midnight? Yes. Some of the girl students were hurt when the police reacted to the stone pelting. Don't try to exaggerate and extrapolate things. This will backfire you like in the case of suicides.

   It is not my rationale that blinded, it is ur view that became prejudice.

   Delete
  7. @satya

   http://hridayam.wordpress.com/2010/12/15/false-cases-ou-students/

   check the photos and news clippings in the post. And for testimonies, go yourself to OU and ask them. Sitting comfortably behind internet and debunking everything and asking for proofs in the internet will not help anybody.

   My comment about state sponsored violence is not about BSNL, but about arrest of over 3 lakh students in makeshift lockups 3 days ahead of million march(bbc reported), brutal act of police in OU girl students and Nizam college students.

   For you live experiences does not matter, high court condemning the incident does not matter! Why do I need to convince you in anything by the way. Please don't comment again here and extend topic unnecessarily.

   Delete
  8. @satya

   check this:
   http://www.andhralekha.com/banner/965-AP%20Govt.%20to%20move%20Supreme%20Court%20on%20Osmania%20University%20issue

   it seems police not just beat girl students locking them in the dark until midnight(by cutting off power) in their hostels but they also molested girl students. This is even news to me and found out just now. None of the seemandhra leaders and our great self styled intellect JP condemn such a brutal act.

   Delete
  9. Here the point is 1st students did stone pelting on the police who are in charge of the situation. 2nd, It is very known fact there are many elements hiding in OU campus in the name of students. If Police does not have permissions to enter in OU even after stone pelting, how come such elements got permission to be in university?

   My question is all about the double standards. If police were held responsible for their act, so should be the students. You cannot justify unlawful acts in the name of udyamam. (eg. bus burnt coz of anger etc..)

   reg. Konatham Dileep blog, it is a clear example of how separatists are known to their tongue twisting. He mentioned only because of aftermath violence of Sriramulu death, Center announced andhra. But in some other posts, the same people write, even govt announced andhra, potti sriramulu did fast for madras and Prakasam was responsible.

   మనకు ఎప్పుడు ఎలా అవసరమైతే అలా వ్రాసుకోవడమే.. అడిగేది ఎవరు.. గొర్రెల్లా నమ్మే వాళ్ళు తప్పితే..

   Delete
  10. @satya

   Who are showing here double standards friend? The incident was condemned by honorable high court and several prominent human rights actiists but none of our seemandhra leaders, VMS folks nor hypocrite JP. Now you find double stndards in Telanganavadis?

   You asked me for the proof about police beating girl students, I showed them not just beating but beating girl students until midnight in the dark lockedup in the hostels and also molesting. That too not from any telangana supporting source, but andhralekha, supposed to be an andhra webportal. Now you go back and find double standards in us? Why do you prove again and again that you and your VMS folks are nothing but bunch of hypocrites working for self interests and just trying to spread venom on Telangana movement?

   The news item clearly shows that when students are conducting a peaceful rally from OU to Tarnaka, police unnecessarily disrupted ralley by conducting latheecharge and only later students pelted stones. That is what people do when theya re unnecesarily beaten, their rights are under attack whether it is kakarapalli in andhra or telangana.

   Even if we assume that students start it at first how can police beat girl students until midnight? how do they beat media persons? What is the reason for Seemandhra leaders, VMS, Jp not condemning? Especially JP was asked about the incident and he said no comments!!

   విషాన్ని కడుపునిండా దాచుకుని తెలంగాణవాదాన్ని అణగదొక్కడమఏ ధ్యేయంగా పనిచేసేవారికీ తమ ఫాక్షనిస్టు నేతలు నడిపించిన ఉద్యమం ముద్దుగా కనిపిస్తుంది, తమకి గిట్టనివారు చేసే ప్రజా ఉద్యమంలో అన్నీ తప్పులే కనిపిస్తాయి.

   You have proved yourself what kind of person you are by not accepting simple facts even if valid proofs are given just because the truth is against your side. Please do not comment in my blog and waste my time. You have now lost your credibility completely.

   Your comments will not published anymore in my blog.
   విషాన్ని కడుపులోదాచుకుని పైకి సమైక్యత నటించేవారికి ఇక్కడ స్థానం లేదు.

   Delete
 4. 1972 Jai Andhra movement was a separatist movement. Some popular leaders talked even a separate country.
  Obviously the movement did not have full support of people and eventually separatists had to settle for compromise solution.
  No monuments erected nor yearly homages paid to anybody.

  From this particular clipping one should accept the neutrality of the media. It bravely and clearly condemned politicizing the movement, called it 'separatist movement' and denounced uncivilized acts under guise of movement.

  ReplyDelete
  Replies
  1. PPR,

   The main agenda of Jai Andhra agitation was to stop Mulki rules which were justified by the highest authority of law. The second hidden agenda of the agitation was to stop land reforms in seemandhra region and remove PV from power who was trying hard to implement. The agitators have successfully negotiated both of their agendas. Separating from state was never their agenda.

   The neutrality of the media comes from the corner of visalandhra daily (not our current visalandhra mahasabha) owned by CPI. The same CPI now realized the injustice happening to Telangana and asking for division of state. The other media at taht time andhra patrika, andhra prabha as usual were biased in their reports both in case of 73 jai Andhra agitation and 69 Telangana agitation. No wonder our VMS hypocrites only show andhra patrika and andhra prabha paper clippings to support their views.


   The point is that leaders of Andhra never had any theoretical base for their argument, They just change tunes as per their selfish interests. In their attempt they can go to any extent..even raping ladies.

   If at all govt of India says that we agree to the injustice happened to Telangana, but state division is not accepted, instead we do compensate telangana with irrigation projects, implement 610 GO strictly etc, then all the samaikya leaders including our VMS guys immediately bat for separate andhra state.

   Their formula of being united is only until they are profitable in being united.

   Delete
 5. Viswaroop,

  whatever the agenda, the outcome was visible failure. No heroics attached to it. No martyrdom declared. IT IS FORGOTTEN as if it was a bad dream. Period.

  It does not matter who owns the paper. The newspaper published from SA exposed uncivilized action of SA movement. Please do not bluff me about other papers too. I have read enough in archives between 1954-56 and again 1968-1973. They never failed to publish both sides of the arguments. In fact during JA movement they had to publish two pairs of similar but distinct views. Two separatist views and two unity views from both regions.

  I do not see any problem even if VMS etc behave as you said. When politically unemployed could revive 30 year old dormant issue what is wrong in selfish knee-jerk reaction?

  ReplyDelete
  Replies
  1. @PPR

   Outcome of an agitation lies in meeting the agenda of agitation, not the aftermath heroics. Jai-Andhra agitators successfully negotiated their agenda and that is all required for them.

   There were no heroics attached to jai-Andhra movement because of the simple reason that it was not a people's demand but just an artificial sponsored agitation by few selfish leaders at that time. Neither will there be any heroics attached to 2009 december's saamikyandhra agitation as it wasn't either any peoples agitation but just an artificial one.

   Just because politically unemployed leaders like T. Prakasam, Gopal reddy, Sanjeev Reddy brought up the separate andhra movement, the movement itself didnot become any unworthy. Likewise if politically unemployed leaders reviving Telangana agitation doesn't make it any unworthy for the simple reason taht they just revived what is always only what people wished.

   However stage managed dramas like samaikyandhra and jai andhra with flip flops only for their selfish interests only make seemandhra leaders buffoons.

   Delete
 6. జై ఆంధ్ర ఉద్యమం నిజంగా విభజనవాద ఉద్యమం కాదు కాబట్టే ముల్కీ నిబంధనలు రద్దు చెయ్యగానే ఆ ఉద్యమాన్ని ఆపేశారు. జై ఆంధ్ర ఉద్యమం దాని యొక్క లక్ష్యం సాధించడం (ముల్కీ నిబంధనలు రద్దు చెయ్యించడం)లో సఫలమైంది. దాన్ని విఫల ఉద్యమమని అనలేము.

  ReplyDelete
 7. Viswaroop,

  JA was a violent movement to meet specific partisan selfish agenda. Agreed!
  Does it have people support? Does you article expose dark side of SA leaders or people?

  ReplyDelete
  Replies
  1. PPR,

   People every where will have all kinds of people, good, bad and ugly! But a dominant group in SA have this kind of criminal attitude including but not limited to factionism and karamchedu, chunduru kulagajji. Unfortunately this group is so strong that they can determine politics there and the SA leaders are chosen by this group. So we cannot just point out leaders in Seemandhra alone and forget the group that is beneficiary of these leaders. Whether it is Jai-Andhra or Samaikyandhra, it is only for the benefit of this group.

   Sorry but I cannot continuously debate due to lack of bandwidth.

   Delete
  2. "But a dominant group in SA have this kind of criminal attitude including but not limited to factionism and karamchedu, chunduru kulagajji. "

   మరే సార్. తెలంగాణాలో అందరూ బుద్ధుడి వారసులు మరి. మిస్టర్ విశ్వరూప్ మీ అంతరాత్మకి నిజాలు తెలుసు. దయచేసి అతిగా ఆత్మవంచన చేసుకోకండి. అది ఆత్మహత్యకన్నా దారుణం.

   Delete
 8. No need to respond to everything when you lack bandwidth. Particularly when you cannot follow the debate in properly. Your knowledge and intention are already conveyed in your article.

  ReplyDelete
 9. సీమాంధ్ర మార్క్ గాంధేయవాదానికి ఇది కూడా నిదర్శనమే: http://missiontelangana.com/violent-protests-seemandhra-mopidevi-venkataramana/

  ReplyDelete

Your comment will be published after the approval.