Thursday, 12 July 2012

చలసాని --ఆంధ్రా మేతావుల ఫోరం

టీవీల్లో వార్తాఛానెల్లు క్రమం తప్పకుండా చూసేవారికి చలసాని శ్రీనివాస్ సుపరిచితుడు. ఆంధ్రా మేధావులఫోరం అంటూ ఒకటి స్థాపించి, తనను తానే మేధావిగా ప్రకటించుకున్న ఇతగాడు ఎక్కడ ఎప్పుడు తెలంగాణ, ఆంధ్రాలకు సంబంధించిన చర్చ జరిగినా నేనున్నానంటూ వాలిపోయి  తీర,సీమాంధ్ర వాసుల హక్కులంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఈయన తనవాదన మొదలు పెట్టాడంటే చాలు, వాదనలో తర్కమూ, హేతువూ పారిపోతాయి. నిజాలు కనుమరుగయిపోతాయి, అసలు వినేవాళ్ళకు ఇలాకూడా మాట్లాడొచ్చా అనిపిస్తాయి.

ఒకవైపు మెడికల్ సీట్లలో తమకన్యాయం జరిగింది, కొత్తగా అనుమతిలభించిన సీట్లలో తెలంగాణాకు వాటా రాలేదని తెలంగాణావాదులు చెబుతుంటే కాదు, అసలు మా తీర, సీమాంధ్రలకే అన్యాయం జరిగిందని ఈయన వాదిస్తాడు. పైగా ఆరు సూత్రాలపధకం వచ్చినప్పటినుంచీ నేటివరకూ తెలంగాణా జనాభా పెరిగిందీ అని వాదిస్తాడు. మరి సీట్లు జనాభా పెరిగిన చోట ఇవ్వాలో పెరగని చోట ఇవ్వాలో వినేవారికి అర్ధం కాక బుర్రగోక్కోవాల్సి వస్తుంది.

14F ఒక అన్యాయమైన నిబంధన, దీనివలన హైదరాబాదులో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయపార్టీల, అన్ని ప్రాంతాల నాయకులు నిర్ద్వందంగా ఒప్పుకున్నప్పుడు ఈయన మాత్రం లేదు 14F ఉండాల్సిందే అని వాదిస్తాడు.

పోనీ ఈయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమా అంటే అదేం కాదు. అందరు సీమాంధ్ర నాయకులూ, మేధావులమని చెప్పుకునేవారికి భిన్నంగా ఈయన తెలంగాణ ఏర్పాటు మాకు సమ్మతమే అంటాడు. కానీ హైదరాబాదును మాత్రం దేశానికి రెండో రాజధానిని చేసి కేంద్రపాలితప్రాంతం చెయ్యాలట. ఎందుకూ అంటే 17వ శత్తాబ్దంలో కోస్తానుండి హైదరాబాదుకు నిధులు (పన్నులు) వెల్లాయని వాదన మొదలు పెడతాడు.. అందరిలా ఇప్పుడు మేం పెట్టుబడులు పెట్టాం కాబట్టి మాకూ వాటాకావాలి అంటూ తెలివితక్కువమాటలు మాట్లాడనందుకు అభినందించాల్సిందేకానీ 17వ శతాబ్దంలో పన్నులు కడితే ఇప్పుడు కేంద్రపాలితప్రాంతం చెయ్యడం వల్ల ఈయనకు ఏం ఒరుగుతుందో?

చీటికీ మాటికీ అసలు తెలంగాణ, ఆంధ్రాలు కలవడంవల్ల మాతీరసీమాంధ్రలు వెనుకబడిపొయ్యాయంటూ చిత్రవిచిత్రమైన వాదనలు చేసే ఈయన మరి వెనుకబడిపోతే ఎందుకు కలిసిఉందామంటున్నారు, విడిపోవచ్చుగా అంటే చెప్పడు. ఇలాంటివారి వాదనలు కూరలో కరివేపాకులాంటివి... ఇవి ప్రేక్షకులకు కాస్సేపు కాలక్షేపం నింపుతాయి..అంతే.


9 comments:

 1. ఈయన వాదన ప్రకారం రెండొందల ఏండ్లు నిధులు వెళ్ళాయి కాబట్టి లండన్ కూడా మనదే. ఎన్నో ఏళ్ళుగా నిధులు వెళ్ళుతున్నాయి కాబట్టి ఢిల్లీ కూడా మనదే.

  వీటన్నిటితోపాటు అంతకు ముందు నిధులు వెళ్ళిన చెన్నైని కూడా కేంద్ర పాలితం చేయాలేమో!

  ReplyDelete
  Replies
  1. "వీటన్నిటితోపాటు అంతకు ముందు నిధులు వెళ్ళిన చెన్నైని కూడా కేంద్ర పాలితం చేయాలేమో"

   మదరాసు తమకు దక్కదని తెలిసిన తరువాత నగరాన్ని Chief Commissioner state (ఇప్పటి భాషలో కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని చాలా పాట్లు పడ్డారు లెండి. ఆ పప్పులేమీ ఉడకలేదు పాపం.

   Delete
 2. > ఆంధ్రా మేతావుల ఫోరం

  మేతావులేమిటి? ఏమిటండి ఆమాట?
  ఎగతాళిగా మాట్లాడటం కుసంస్కారం అని తెలియదా?
  మీర్లిలా దుందుడుకుగా మాట్లాడబట్టే, సమైక్యవాదులు మిమ్మల్ని 'తెలబానులు' అని వ్యవహరిస్తున్నా రనిపిస్తోంది.
  మీ టపా నేనింకా చదువ లేదు.
  శీర్షికలోనే ఇంత సంస్కారహీనంగా ఉన్న టపా చదువనవుసరం లేదని కూడా అనిపిస్తోంది.

  ReplyDelete
  Replies
  1. @శ్యామలీయం

   ఆహా! ఎంత గొప్పనీతివాక్యాలు చెప్పారండి. రోజూ తెలబాన్లూ, కచరా, విరోచనకారులూ, అంటూ అడ్డగోలురాతలు రాసేవారిని ఎంతమందికి తమరు ఇలాంటి నేతివాక్యాలు చెప్పారు? చలసానిని మేతావి అంటే మాత్రం అంత పొడుచుకొచ్చిందా? పక్షపాతబుద్ధితో కల్లు మూసుకుపోయినతమరిబోటి వారు చదవకపోతే ఇక్కడ వచ్చే నష్టమేమీ లేదు. దయచేయండి.

   Delete
 3. ఈయన పదప్రయోగం బ్రహ్మాండం. ఉ. తీర సీమాంధ్రులు = (కోస్తా) తీరానికి చెందిన ఆంధ్రులు + (రాయల)సీమకు చెందిన ఆంధ్రులు :)

  ReplyDelete
 4. శామలియం లాంటి పెద్ద మనుషులకు అభినందనలు .. ఆంధ్రా మేతావులు .. తెలబానులు ఇందులో ఏ పదం లో ఎక్కువ కుసంస్కారం కనిపిస్తోంది మీ నిష్పాక్ష పాత కళ్లుకు ... తెలబానులు అని రాయడాన్ని ఎప్పుడయినా మీరు ఖండించారా ?

  ReplyDelete
 5. Current academic year MBBS seats in Govt. medical college are as per below. This data is from MCI web site.

  - Telangana: 600 (31.6%)
  - Andhra: 1,300 (68.4%)
  - TOTAL: 1,900

  MBBS seats of Govt. medical colleges started after 1956 are as follows:

  - Telangana: 250 (20.0%)
  - Andhra: 1,000 (80.0%)
  - TOTAL: 1,250

  I excluded Siddartha Vijayawada as I heard these seats are open to everyone in the state.

  ReplyDelete
 6. SKC on medical education in Telangana:

  Page 197:

  There were two medical colleges in Telangana and two in coastal Andhra up to 1991-92. One medical college was added in Telangana in 1992-93 and another one in 2008-09. During this period, three more colleges have been added in coastal Andhra and four in Rayalaseema. Now, there are four medical colleges for the four districts of Rayalseema, five medical colleges for the nine districts of coastal Andhra and only four (of which two are in Hyderabad) for the ten districts of Telangana. Therefore, there is a strong case for opening of more medical colleges in Telangana region.

  Page 202:

  However, there is some disparity in medical colleges. At present, there are four medical colleges for the four districts of Rayalseema, five for the nine districts of coastal Andhra and four (of which two are in Hyderabad) for the ten districts of Telangana. The Committee feels that establishing a medical college in North Telangana would redress an important imbalance.

  ReplyDelete
 7. నిజాం నవాబులు 1766లో సర్కార్ జిల్లాలని బ్రిటిష్‌వాళ్ళకి అప్పగించారు. హైదరాబాద్ అభివృద్ధి మొదలైనది 1850లో. అటువంటప్పుడు రెండువందల ఏళ్ళు నిధులు ఎలా వెళ్ళినట్టు?

  ReplyDelete

Your comment will be published after the approval.