Friday, 28 December 2012

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు

Source: missiontelangana.com

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. కొండంత రాగం తీసిన తెలుగు దేశం పార్టీ అఖిలపక్షంలో కొత్తగా చెప్పిందేమీ లేకపోగా ఏదో పొడిచేశామని తెలంగాణ తెదేపా నాయకులు ఇక్కడ శిగాలు ఊగుతున్నారు.
చంద్రబాబు పంపిన సీల్డ్ కవర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించే మాట ఒక్కటంటే ఒక్కటి లేకపోగా ఒక పచ్చి అబద్ధం ఉన్నది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నామనడం.
ఇవ్వాళ ఈ లేఖను డిల్లీకి మోసుకుపోయిన యనమల రామకృష్ణుడు స్వయంగా గత యేడాది మీడియాతో మాట్లాడుతూ 2008 నాటి లెటర్ ఇప్పుడు పనికిరాదని, 2011 మహానాడులో తెలంగాణపై తీసుకున్న వైఖరే ఫైనల్ అని తేల్చాడు. ఒకసారి ఈ వీడియో చూడండి.
ఇంతకూ 2011 మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఏం నిర్ణయం చేసిందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. తెలంగాణ అంశాన్ని కేంద్రం సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని తెదేపా డిమాండ్ చేసిందా సభలో.
ఇదే విషయం మీద 29 జులై నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో యనమల రామకృష్ణుడు ఏమన్నాడో చూడండి:
2009 డిసెంబర్ 7 నాడు అఖిలపక్షంలో లిఖితపూర్వకంగా తెలంగాణ తీర్మానానికి మద్ధతు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ మూడు రోజుల్లోనే నిర్ణయం మార్చుకుంది. అట్లాంటి దగుల్బాజీ పార్టీ ఇప్పుడు 2008 లో రాసిన లెటర్ కు కట్టుబడి ఉన్నామని దొంగమటలు చెబితే నమ్మేటోడెవడు?

8 comments:

  1. ఏంటో మీ భయం.
    ఎప్పుడో అపుడు ఒప్పుకున్నాడు కదా ...ఇప్పుడు ఏకంగా సెంటర్ లో గవర్నమెంట్ కె చెప్పాడు.
    అయిన మీకు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్రెడిట్ చంద్రబాబు షేర్ చేసుకుంటాడు కాబట్టి.
    ఇప్పుడు కూడా మీరు విమర్శిస్తే జనాలకి నువ్వోస్తుంది. ఈ మధ్యన తెరాస statements మీద స్టేట్మెంట్స్ ఇస్తుంది రోజు ఈ భయంతోనే కాబోలు.
    ఎలా ఓల ఏడవండి. విని విని విసుగొస్తుంది ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు మీరు.
    :venkat.

    ReplyDelete
  2. Anonymous ... you are correct ...
    వీల్లకి ఎప్పుడూ ఎవొరొ ఒకరు కావలి పడి ఎడవడినికి

    ReplyDelete
    Replies
    1. Pradeep and Anonymous28 December 2012 18:04

      చంద్రబాబు ఏం ఒప్పుకున్నడు? అఖిలపక్షంలో ఏమైనా తెదేపా తెలంగాణ ఏర్పటుకు కట్టుబడి ఉంది అని జెప్పిండా? 2008లో మేము ప్రణభ్కు లేఖ ఇచ్చినం అన్నడు గని ఇప్పటికీ మది అదే స్టాండు అని ఏమైన స్పష్టంగా జెప్పిండా? పైగా ఆస్టాండు మారింది ఇప్పుడు అలేఖకు విలువ లేదు అని వాల్లే అంతకుముందు జెప్పిన్రు. మోసపు బుద్ధి కాకపోతె ఇంత అస్పష్టం ఎందుకు? కేంద్రాన్ని నిర్ణయం తీసుకొమ్మని అంటుండు గని ఆనిర్ణయానికి కట్టుబడి ఉంటము, దొంగ ఉద్యమాలు చెయ్యం అని ఎప్పుడైన జెప్పిండా?

      మోసపు బుద్ధులు ఉండేటోడే స్పష్టంగ జెప్పడానికి భయపడుతడు. భయం మాకు కాదు, చంద్రబాబుకు..ఒక నిర్ణయం తీసుకోవలంటే భయం ఉండేటోడికి పార్టీ ఎందుకు దండగ?

      ఇన్నిరోజులు నాంచి, రెండు కండ్ల డ్రామా ఆడి, డిసెంబరు 9 తరువాత పార్టీ తరఫున సమైక్యంధ్రకోసం రాజీనామాల డ్రామా ఆడి ఇప్ప్డుడేదో మేం అప్పుడే లెటరిచ్చినం అంటె క్రెడిట్ వస్తుందా? డిపాజిట్ వస్తె అదే ఎక్కువ. చంద్రబాబు మాటలు వినేటోడు వెర్రిబాగులోడయితె విని సమర్ధించేటోడు పిచ్చిమాలోకం గాడయి ఉంటడు.

      Delete
  3. Hi, don't just mix up things. I agree with your views on your videos. But, my straight question you is this? Does whatever the TDP told in front of the all party meeting is important or does whatever yanamala said in front of some media is important? I would consider the one whatever they told in front of the all party meeting. Please do not think that who ever conducts bandhs for the Telangana are the real supporters. Have you ever consider the impact of conducting bandhs on very poor vendors and daily laborers? Even though I am a supporter of united andhra, I feel happy for TDP today as it has taken a firm stand on Telangana. I wish Telangana people realize the real colors of KCR at least now. I strongly believe that KCR doesn't want Telangana state as he needs only their votes.

    ReplyDelete
    Replies
    1. @Anonymous28 December 2012 22:59

      Point 1# TDP didn't say anything in the meeting. They gave a letter that refers about their earlier letter in 2008. However they didn't say that they still abide to the same.

      Point 2# People know who are the real supporters. Not even a little kid in Telangana ever thinks TDP is the real supporter of Telangana. It is his own double game that made him lose credibility.

      Point 3# As far as I understand in Telangana poor vendors, street hawkers, daily labor won't be effected as noone calls them to shut their business. However we know that this is not the case in Seemandhra. may be your comment refers to your experiences in Seemandhra bundhs, but in telangana it is not the case.
      Please check this link:
      http://kotiratanalu.blogspot.fi/2011/08/blog-post.html

      Point 4#The inconvinience caused by one bundh is insignificant before the advantage of exposing the double standards of some parties. Don't forget that it is continuous bundhs in seemandhra after dec 9th along with resignation drama that stopped Telangana.

      Point 5# People already know the real colors of CBN. Thats why offlate he is not even managing to get deposits.

      Point 6# TDP has not taken any firm stand on Telangana as per todays meet. They are still continuing their "cat on the wall" game. However I feel they are better off this time than YCR-Cong and they have improved a bit considering their own hide and seek game all these days. But they still have not stopped playing cheap tricks.

      Delete
  4. Please check the below link. The article is some sort of against KCR stance , you may not like it, but it is truly reflecting the present political environment around Telangana statehood movement.

    http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/dec/29/edit/29edit2&more=2012/dec/29/edit/editpagemain1&date=12/29/2012
    : venkat.

    ReplyDelete
    Replies
    1. @Anonymous29 December 2012 00:42

      Any article from RK of Andhrajyothy will be for TDP and against KCR because Andhrajyothy is for TDP by CBN to yellow gang. Only yellow gang can say that RK's comments and articles reflect true situation.

      An andhraite who does not want Telangana to happen cannot decide taht Telangana leaders don't want Telangana. It may appease andhraites like you but nobody in telangana gives any damn about such articles.

      Delete
    2. So, you want to tell which paper to read also. Probably that won't happen.

      Delete

Your comment will be published after the approval.