తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో భాగమయిన తరువాత యాభై ఏళ్ళు అధికారంలో ఉన్న సీమాంధ్రనేతలందరూ వారు, వీరు అని తేడా లేకుండా తెలంగాణకు ద్రోహం చేసినవారే. అయితే అందులో అందరికంటే ఎక్కువ ద్రోహం చేసి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది మాత్రం ఇద్దరు కాంగ్రేస్ ముఖ్యమంత్రులు. ఒకరు 69 ఉద్యమాన్ని అణచివేయడం కోసం రాక్షసంగా కాల్పులు జరిపించి అయిదు వందల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కాసు బ్రహ్మానంద రెడ్డి కాగా మరొకరు తెలంగాణ ఎలాగూ ఏర్పడుతుంది కాబట్టి విడిపోయేలోగా వీలయినంత దోచుకుందామని విచ్చలవిడిగా దోచేసిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.
2004 లో అధికారంలోకి రావడంకోసం తెలంగాణకు మద్దతు ఇస్తామని టీఆరెస్ తో పొత్తు పెట్టుకున్న వైఎస్సార్ ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్టు తెరాసను అణచివెయ్యడంకోసం డబ్బులతో ఎమ్మెల్యేలను కొన్నాడు. బడ్జెట్ను లక్షకోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పుకునే వైఎస్సార్ పెట్టిన బడ్జెట్లో ఎక్కువ భాగం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మిన ప్రభుత్వ భూములమీద వచ్చిన డబ్బే. తెలంగాణ ఆస్తులమ్మి సీమాంధ్రలో మాత్రం భారీయెత్తున ప్రాజెక్టులు చేపట్టి ఇక్కడి నిధులతో హంద్రి-నీవా, వెలిగొండ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు కట్టుకున్నాడు. తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకూడా పూర్తిచెయ్యలేదు.
సీమాంధ్రలో చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల వాట లేకపోయినా వరద నీటి వాటా పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టిన వైఎస్సార్ తెలంగాణలో నికర జలాల వాటా ఉన్న ప్రాజెక్టులు కూడా చేపట్టలేదు. మరిక్కడ ప్రాజెక్టులు కడితే సీమాంధ్రకు నీళ్ళు తరలించడమెట్ల కుదురుతుంది?
వైఎస్సార్ ఆరేళ్ళ పాలనలో తెలంగాణకు లెక్కలేనన్ని అన్యాయాలు చేశాడు. కడప యోగివేమన యూనివర్సిటీకి కోట్లరూపాయలతో భవంతులు కడితే శాతవాహన యూనివర్సిటీ షెడ్డులకిందే నడిచింది. కడప రిమ్స్‌కు అన్ని హంగులూ సమకూరితే బీబీనగర్ నిమ్స్ మాత్రం ఎంతకూ పూర్తిగాదు.
తెలంగాణ వాదాన్ని అణచివెయ్యడానికి తెరాస పార్టీని చీల్చిన వైఎస్సార్ 2009 ఎన్నికలలో తన దుష్టబుద్ధిని మరోసారి చూపిస్తూ మొదటి ఫేజు ఎన్నికల్లో తెలంగాణ అంతటా కాంగ్రేస్ తెలంగాణకు కట్టుబడి ఉందని నమ్మబలికి వోట్లు దండుకుని ఇక్కడ ఎన్నికలు అయిపోగానే నంద్యాలకెల్లి హైదరాబాదుకెల్లాలంటే వీసాలు గావాలంట అంటూ రెచ్చగొట్టాడు.
ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబొయి గెలిచిన వైఎస్సార్ అసెంబ్లీలో "రాజేంద్రా, ఎక్కడుందయా నీ తెలంగాణవాదం?" అంటూ ఫాక్షన్ బుద్ధిని చూపించాడు. మరిప్పుడు తెలంగాణ వాదం ఎక్కడుందని విజయమ్మా, షర్మిలమ్మా తెలంగాణ ప్రజల మనోభావాలను వైకాప గౌరవిస్తుందని నక్కవినయాలు చూపెడుతున్నారు? ఎవర్ని మోసం చేద్దామని ఈదొంగవేషాలు? తెలంగాణవాదం లేకపోతే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ధైర్యంగా చెప్పి వోట్లడగొచ్చుగదా?
తెలంగాణకొచ్చి మీమనోభిప్రాయాలని గౌరవిస్తామని జెప్పి ఏం జేద్దామని? గెలిస్తే పోతిరెడ్డిపాడు ఎత్తు మరో వందడుగులు పెంచి క్రిష్ణ నీళ్ళు చుక్కలేకుండా దోఛేద్దామనా? రాష్ట్రం మొత్తాన్ని బయ్యారంలా అల్లుడికి కట్నం కింద ఇద్దామనా? జగనన్నను గెలిస్తే పోలవరం గడుతడట. ఎవరికోసం పోలవరం? ఎవరిని ముంచడంకోసం పోలవరం? జఫ్ఫాలూ జెర సోంచాయించుండ్రి. ఇప్పుడు కుక్క బిస్కట్ల ఆశకు వైకాపల జేరితె రేపు తెలంగాణ వచ్చినంక మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టడం ఖాయం.
మాకు అభ్యంతరం లేదు అంటే ఇలా అంటారు. అభ్యంతరం అంటే అడుగో ద్రోహి అంటారు. ఐనన్నా, కాదన్నా మీరు తిట్లే తినాలన్నమాట. మరి అలాంటప్పుడు ఎందుకు అభ్యంతరం లేదు అని చెప్పాలి
ReplyDelete