Wednesday, 31 July 2013

అంతిమ విజయం


యాభై ఏళ్ళ పోరాటానికి ఫలితం ఆలస్యంగానైనా దక్కింది. అంతిమ విజయం తెలంగాణా ప్రజలనే వరించింది. ఈ విజయం ఒక సమిష్ఠి కృషి. ప్రొఫెసర్ జయశంకర్ తపన, దూరదృష్టి, ప్రొఫెసర్ కోడండరాం పట్టుదల, కేసీఆర్ మొండితనం, విద్యార్థుల ఉడుకుతనం, లాయర్లు, ఎంజీవోల దీక్షల ఫలితం.

కాంగ్రేసు లేటుగానైనా తనమాట నిలబెట్టుకుంది. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం వల్ల కన్ను లొట్టబోగొట్టుకున్న తరువాత ఈసారి జాగ్రత్తగా తటస్థంగానే వ్యవహరించాడు. జగన్ జైల్లోనుంచి సమైక్యాంధ్ర చక్రం తిప్పుదామనుకుని చివరికి తెలంగాణలో తనపార్టీ ఆనవాళ్ళు లేకుండా చేసుకున్నాడు. ఏదయితేనేం తెలంగాణ ప్రజల కల ఫలించింది. సోనియమ్మ కరుణించింది. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి ఈసారి డ్రామాలాపి కిక్కురుమనకుండా ఉన్నాడు.

ఈవిభజన సీమాంధ్ర ప్రజలకు కూడా విజయమే. అనిశ్చితి కొనసాగడం వలన రెండువైపులా నష్టం తప్ప లాభం లేదు. అనిశ్చితి తొలగించడానికి విభజన తప్ప మరో పరిష్కారం లేదు. పెద్ద సముద్ర తీరం, గ్యాస్, బరైటీస్ నిక్షేపాలు కలిగిన సీమాంధ్ర విభజన తరువాత మరో హర్యానాలా సంపన్నరాష్ట్రం కాగలదు. మనది కానిదానికి పాకులాడటం కంటే మనదైనదాన్ని వృద్ధి చేసుకోవడం మిన్న. రాష్ట్రంగా విడిపోయినంతమాత్రాన హైదరాబాదులోఐటీ, ఫార్మా ఉద్యోగాలు సీమాంధ్ర యువతకు దూరం కావు, పైగా కొత్త కంపనీలు ఆంధ్రా పట్టణాలకు కూడా వచ్చి అవకాశాలు పెరుగుతాయి. గుప్పెడు మంది నాయకుల,పెట్టుబడిదారుల  లాభం కోసం ఐక్యత లేని సమైక్యాంధ్రను కొనసాగించడం వల్ల నష్టపోయేది సామాన్యులే. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతిగా కలిసే ఉందాం, తెలుగు భాషకు సేవ చేద్దాం.

ఈసందర్భంగా నేను గతంలో రాసిన ఒక పద్యం!!

చం!!
అమరుల త్యాగముల్ ఫలియ అంతిమ తీర్పు నొసంగు రాష్ట్రమున్
సమరపు బావుటా లెగుర సాకరమౌ తెలగాణ నిక్కమున్
సమసమ రాజ్యమౌ మనదె సస్యపు శ్యామల ప్రాంతమౌ
నమవస నాఁడు విస్తరిలు నాకసమందు మనోజ్ఞకాంతులే

9 comments:

 1. అంతిమ ఘడియలు వచ్చేసినందుకు శుభాకాంచ్షలు.

  ReplyDelete
 2. బాగా చెప్పారు, సమైక్యంగా కలసి కొట్టుకుంటూ అధోగతివైపు పయనించేకంటే, విడి విడిగా అభివృద్ధి పధం వైపు అడుగులేయటం మంచిది. తెలుగు మాట్లాడే రాష్ట్రాలిప్పుడు భారతావని లో రెండున్నాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే సీమాంధ్ర ని అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా చెయ్యొచ్చు!

  ReplyDelete
 3. peeda poyindira babu. aidu dasabdala sani, somaripotutanam vadilindi. dont worry future is ours
  sreerama, chennai

  ReplyDelete
 4. తొమ్మిది డిసెంబర్ ౨౦౦౯ ననే తెలంగాణా ప్రకటన జరిగింది!సీమాంద్ర నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఇంతకాలం బలవంతంగా ఆపారు!కాంగ్రెస్ తాత్కాలికంగా వెనకడుగు వేసింది!ఇప్పుడు మళ్ళీ ఆ మంత్రం మళ్ళీ పనిచేయదు!ఇంకా ఇప్పటికీ కొందరు నాయకులు ఆపగలమని తుపాకిరాముల్లలా పలుకుతున్న ఉత్తరకుమార ప్రజ్ఞలు నవ్వు పుట్టిస్తున్నవి!చరిత్ర పుటలను మళ్ళీ వెనుకకు తిప్పలేరు!ఎన్నికలు వస్తున్నాయొస్తున్నాయి!reconcile కండి, జనానీకానికి నచ్చచెప్పండి కాని పిచ్చపిచ్చగా రెచ్చగొట్టకండి!మొదటినుంచి మీ నాయకుల స్వయంక్రుతాపరాదాలవల్ల మీకు ఇలాంటి పరిస్థితి దాపురించింది!gentleman s agreement నుండి అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి సీమాంద్ర ప్రయోజనాలను మాత్రమే పరిరక్షించారు!మీ నాయకుల దూకుడుకు నోట్లో నాలుకలులేని మా నాయకులు తట్టుకోలేకపోయారు!majority మాదని భయపెట్టారు!మా నాయకులని కిక్కురు మనకుండా మూగవాళ్ళనుచేసి కూర్చోపెట్టారు!ఈ తప్పులను పునరావృతం చేసి రాయలసీమకు అన్యాయం చేస్తే వాళ్ళున్నూ ఎక్కువకాలం మీతో కలిసి ఉండలేరు!పెట్టుబడిదారులను ససేమిరా ఎన్నుకోకండి!వాళ్ళు తమ ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటారు!మీకు మొండిచేయి చూపిస్తారు!వెనుకబడిన తరగతులవారికి ఎక్కువ పార్టీ టికెట్లు ఇచ్చేవారిని ఇష్టపడండి!ఇంకా ఎంతకాలం అందలాలు మోస్తారు!మీరూ సింహాసనాలు ఎక్కండి!తెలంగాణా ప్రజలకు కూడా నేను ఇదే సలహా ఇస్తాను!ఎన్నికలలో డబ్బులు వెదజల్లిన వారికి ఓట్లు వేయకండి!

  ReplyDelete
 5. >మీ నాయకుల దూకుడుకు నోట్లో నాలుకలులేని మా నాయకులు తట్టుకోలేకపోయారు
  ఏమి చమత్కారం,

  నాలుకకు అడ్డూ అదుపూ లేకుండా అమర్యాదకరంగానూ బెదిరింపులస్థాయిలోనూ ఇన్నాళ్ళూ నిరాటంకంగా మాట్లాడిన మహానుభావులా నోట్లో నాలుకలులేని అమాయకపు నాయకులు?

  ఔరా! అనండి, అనండి, మీ రోజులు బాగున్నాయి కదా, మీ రేమన్నా చెల్లుతుంది ప్రస్తుతానికి!

  ReplyDelete
 6. Viswaroop, please accept my congratulations for the role you & other bloggers played in the Telangana movement all these years. Looking forward to continuing the same spirit in the last mile issues now under way and in the reconstruction of Telangana once formed.

  You once advised me to write on Telangana. I somehow could not take it up.

  I have now started a series of blog posts on "Telangana river waters, irrigation & agriculture" based on a study spread over an year. I trust this will be interesting to you & your blog visitors.

  ReplyDelete
 7. telangana vallu penam mida nundi poi lo paddaru. k.t.r,harishrao,kavitha etc valla padalu nakandi

  ReplyDelete

Your comment will be published after the approval.