Thursday 5 September 2013

సమైక్య ఉద్యమాన్ని మోయడానికి ఈనాడు పాట్లు



లక్షలమంది పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ఎప్పుడూ తక్కువచేసి చూపించే సీమాంధ్ర మీడియా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మాత్రం గొప్పగా చూపించడం కోసం పడరాని పాట్లు పడుతుంది. రోజూ సీఎమాంధ్ర టీవీ ఛానెల్లూ, పత్రికలూ సమైక్యాంధ్ర ఉద్యమ హోరు అంటూ అక్కడక్క పదిమంది కలిసి చేసిన వంటావార్పూ, ఫ్యాషన్ ¨షో, కబడ్డీ ఆట, బడి పిల్లల విన్యాసాలను పెద్దగా చూపిస్తారు.

అయితే మిగతా ఛానెళ్ళూ, పత్రికల విన్యాసాలు ఒకవంతైతే ఈనాడు విన్యాసాలు మరొక వంతు. సీమాంధ్రలో ఎకడ దేనికోసం ధర్ణా చేసినా దానిని సమైక్యాంధ్ర అక్కౌంట్లోనే వేసి చూపిస్తున్నారు. ఇది శ్రుతి మించి చివరికి సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా మాబళ్ళు తెరవండి బాబూ అంటూ చేసిన ధర్ణాను కూడా సమైక్యాంధ్ర అక్కౌంట్లోనే వేశారు.

క్రింది వార్త చూడండి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ పాఠశాలలను మూసి ప్రైవేటు పాఠశాలలను మాత్రం తెరవడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు తెరవాలని అచ్చయ్యపేట అనే ఊరిలో ధర్ణా చేస్తే ఈనాడు దాన్ని సిగ్గువిడిచి సమైక్యాంధ్ర కోసమే ధర్ణా చేసినట్టు రాసింది.



అంతకుముందు మరోవార్తలో ఒకవ్యక్తి రోడ్డుప్రమాదంలో చనిపోతే సమైక్యాంధ్రకోసం మృతి అంటూ రాసింది.




ఇలా సపోర్టు చేసే మీడియా ఉంటే ఇంకేంకావాలి? ఈవార్తలు పట్టుకుని అచ్చోశిన ఆకాశరామన్నలంతా ఎవ్వరూ పట్టించుకోని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా సీమాంధ్ర యావత్తూ విభజనకు వ్యతిరేకంగా ఉడికిపోతుందని  గుండెలు బాదుకుంటారు. ఎలాగూ తెలంగాణ మీడియా సీమాంధ్రకు వెళ్ళలేదు. వెలితే ఈరౌడీ ఫాక్షన్ మూకలు ఊరుకోరు. కనుక ఏం రాసినా చెల్లుతుందనే ధీమా. 

21 comments:

  1. Nee lanti vallanu kooda memu emee cheyyam. Leaders leni nijamaina praja udyamam. vachi choodu, tharvata avaakulu chavvakulu pelavacchu.

    ReplyDelete
    Replies
    1. adhi nijamainaa praja vudhyamamam kadaa adhi tharuvathaa vishyam ..... mee seemandhra media , prabuthvam ela act chestunadhi annadhi asalu vishayam

      Delete
  2. Kaane kaadu....okka ka cha ra thoti abhivrudhi chendina raastraanni nasanam chesthunnarane aavedana......inka hyderabad vishayam ...eppatikee telangana swantham kane kaadu.hyderabad charithra chaduvukondi....anavasara vishayaalu levadeesi telangana meedaa aa prajala manchithanam meeda vunna gouravam pogottakandi meelaati bloggerlu......meerantha ka cha ra ki thothulugaa maaripoyaru .
    Okka vishayam...vibhajana anedi jarigedi kaadu..idantha political drama....bali ayyedi samaanyule e praantham vaaraina.....chivariki jarigedi entante hyderabad evariko appajeppi rendu praanthaala vaallu chonga kaarusthuu koorchovaali.
    Ka cha ra kutumbam paalisthaaru hyderabad raashtraanni.......naya nizamulaga..adi sangathi.
    Andhra ki , telangana ki separate capitals ichi saripettukondi antaaru...ADENA MANAKI KAAVAALSINDI? Ila kooda aalochinchi chhodandi.

    ReplyDelete
  3. సీమాంధ్రలో అంత మహోద్యమం జరుగుతున్నా, మీరు కళ్ళుండీ కబోదిలా మాట్లాడుతుంటే మిమ్ముల్నేమనాలో అర్ధంకావడంలేదు. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమమే అబద్ధాలు, అవాస్తవాల పునాదిపై నిర్మించబడింది.

    ఇలా మాట్లాడి, వచ్చే తెలంగాణనుకూడా వెనక్కు పంపిస్తున్నారన్న విషయం తెలబాన్లకు అర్ధమయ్యేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తొందరపడకండి.

    నాగేశ్వరరావు

    ReplyDelete
    Replies
    1. "మహోద్యమం" LOL!

      నాగేశ్వరరావు గారూ, మీరు ఎక్కడ ఉంటారు? బెజవాడ గురించి సత్యం తెలుసుకునే కుతూహలం ఉంటె ఈ బ్ల్లగు చదవండి. ఎవరు కళ్ళున్న కబోదులో, ఎవరు లేనిది ఉన్నట్టు చూపించి పబ్బం గడుపుకుంటున్నారో తేట తెల్లం అవుతుంది.

      http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

      Delete
    2. జై,

      ఏచెట్టూ లేనిదగ్గర ఆముదపు చెట్టే మహావృక్షం. ఏఉద్యమంలేనిదగ్గర పదిమంది కలిసి రోడ్డుమీద ఫ్యాషన్‌షో పెడితే అదే మహోద్యమం.

      Delete
  4. hyderabad chraritthraa chaduvukovalaa emundhi dantlo .... hyderabad mummattiki telangana de ...

    ReplyDelete
  5. anna akasha rammanna chala chavabaru vishleshanalu chesthadu alantivall gurunchi time waste chesukovaddhu

    ReplyDelete
  6. మీరు చూపించిన ఆ కటింగులోనే ఉన్న వార్తను చూడండి.. అచ్చియ్యపేట గ్రామస్తులు బడి ’తెరవాలని’ ధర్నా చేసారు అని రాసారు. ఈనాడు రాసిన వార్త, ఫోటో ’కోహరెంట్’ గానే ఉన్నాయే!

    ReplyDelete
    Replies
    1. @చదువరి

      ఆర్యా,

      జనప్రవాహంలా ఉద్యమం అంటూ హెడ్దింగు పెట్టి, అనకాపల్లి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటూ కాప్షన్ పెట్టి, ఫోటోకు కింద అచ్చయ్యపేట పాఠశాల వద్ద ధర్ణా చేస్తున్న విద్యార్థులు అంటూ రాస్తే దాని అర్ధం ఏం వస్తుందో తెలీనంత అమాయకులా మీరు? లోపట చిన్న అక్షరాలతో మధ్యలో కాస్త ఏం రాశారో ఎంతమంది చూస్తారు?

      మరీ ఇంత మాయకత్వం నటిస్తే ఎలా? మీసంగతి వేర్పాటువాదం మీనింగుకోసం డిక్షనరీని వెతికినప్పుడూ, చంద్రబాబు రెండుకళ్ళసిద్ధాంతంలో నీతిని చూసినప్పుడే తెలిసింది గానీ అప్పుడు మరీ ఇంత అనుకోలేదు. పైగా తెవాదులు అలా, ఇలా అంటూ స్టేట్మెంట్లు. సీవాదులు వెర్రిబాగులోళ్ళంటారా, లేక కేవలం నటనా?

      Delete
    2. పోన్లెండి, మీరైతే ఆ వార్తను మిస్సవలేదు కదా! చూళ్ళేదనుకున్నాన్లెండి. :)
      ఇక అమాయకత్వమంటారా.. వేర్పాటు అర్థాన్ని డిక్షనరీ చూపించి కూడా మీ చేత ఒప్పించలేక పోయా గదా.. మీ ముందు నేనెంతలెండి :)

      Delete
    3. @చదువరి
      నేనేకాదు, మిపోస్టుకు మీరు కూడా కన్విన్స్ కాలేదు వెల్లి చదువుకోండి. అబద్దాలను రాయడానికి ఈనాడు దగ్గర సరిగ్గా ట్రైనింగు తీసుకున్నట్టు లేరు, ఎప్పుడూ తేలిగ్గా దొరికిపోతారు, అయినా ఊరుకోరు మహమ్మద్ ఘోరీలాగ.

      Delete
    4. అబద్ధాల ట్రెయినింగు ఈనాడో డేమివ్వగలడు, ఆడి మొహం. మాంఛి ట్రెయినింగు కావాలంటే తెవాదుల దగ్గర నేర్చుకోవాలి. :)

      Delete
    5. @చదువరి
      రెండుకళ్ళ సిద్దాంతంలో నీతికనపడ్డాట్టా?

      Delete
    6. రెండు కళ్ళ సిద్దాంతం లో మీకేమి తప్పు కనిపిస్తుంది ? పైకి రెండు కళ్ళు అని చెప్తూ ఒకరి బాగు మాత్రమె కోరితే తప్పు కాని అసలు సిద్దాంతమే తప్పు అని తప్పు అవగాహన సరి కాదు , నాకు తెలిసి ఇప్పటికి చంద్రబాబు ఒక్కడే ప్రత్యెక తెలంగాణా ను ఇంకా వ్యతిరేకించలేదు.

      Delete
    7. @Mauli

      http://kotiratanalu.blogspot.in/2012/05/blog-post_15.html

      Delete
  7. SIR., INDAKE EE AVAKASHA(AKASHA ANI CHADUVUKOGALARU) RAMANNA RASINA POST CHOOSANU.... VEELLA SEEMANDHRA AHAMKARAM INKA ENNI ROJULU BARINCHALO ARTHAM KAVATAM LEDU.... AINA EMI CHEPPALI ANUKONI EMI CHEPPUTUNNADO CLARITY AA POST LONE LEDU.... JAI TELANGANA...

    ReplyDelete
  8. Inka ee vishayam meeda intha charcha avasaramaa...nijamaina telangana vaadulevvaruu vibhajana korukoru....jarigindi kevalam ka cha ra kutumbam swardham kosam modalupettina panchayathee ....tharavaatha congress daanni raajakeeyamga maarchindi..1969 anubhavaalu telangana projalu evvaruu marchipoledu...inthalo punduki kaara m raasinatlu kodandaram reddy cheraadu udyamamlo...appudu asalu dramaa modalu ayyindi.....oka gujarati, oka bihari, oka kashmiri oka arava thambi kalisi swapryojanaalakosam italian amma gaarni vusikolipaaru.....jaruguthunnadi charitra.
    Telangana pallello evarinaina adagandi.....indulo vaallaki paniki vachedi...vaallu laabha padedi emainaa vundaa ani...alaage andhraa lo kooda..idantha pachi durmargapu raajakeya kreeda...
    Anduku manam enduku bali kaavadam.......AALOCHINCHANDI

    ReplyDelete
    Replies
    1. @jvrao
      బాగా ఆలోచించినట్లున్నారు.

      Delete
  9. మూడు నాలుగు రోజుల నుండి పెద్దగా ఇంటర్నెట్ వైపు రాలేదు, మిస్సయ్య్నట్లున్నాను, ఇప్పుడే చూసా అక్కడ, ఆకాశ రామన్న ఆయనే బ్లాగు పోస్టులు రాసుకొని దానికి అయానే కామెంట్లు రాసుకుంటూ, ఆ కామెంట్లకు ఆయనే తిరిగి రిప్లై రాసుకుంటూ తెగ కాలక్షేపం చేస్తున్నట్లున్నాడు.

    ఎవరయినా ఆయన్ను గిల్లితే ఆవేశంతో పేలిపోయేట్లు ఉన్నాడు. This guy is seriously hilarious.

    ReplyDelete

Your comment will be published after the approval.