Sunday, 4 August 2013

రక్తికట్టని రాజీడ్రామాలు


డిసెంబరు 9, 2009 నాడు తెలంగాణ ఏర్పాటు విషయమై చిదంబరం ప్రకటణ జరిగిన వెంటనే సీమాంధ్ర నాయకులు అంతా ఒక్కసారి రాజీనా నాటకాలు ఆడీ తెలంగాణను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సీమాంధ్ర నాయకులు రాజీనామా నాటకాలు మొదలుపెడుతున్నారు. అయితే పాపం నాటం ఇప్పటికే ఒకసారి జరిగిఉన్నదున ఈరాజీడ్రామాలు ఇప్పుడు రెండోసారి చేయబోతే రక్తి కట్టడం లేదు. సీమాంధ్ర జనాలు వీరి నాటకాలను నమ్మక ఛీకొడుతున్నారు.

వైకాప, కాంగ్రేస్, తెదేపా ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఈరాజీనామాలు అన్నీ చెల్లని ఉత్తుత్తి రాజీనామాలే. రాజీనామాలను ఎమ్మెల్యేలు స్పీకర్‌కు, మంత్రులు గవర్నర్‌కు పంపించాల్సి ఉండగా వీరు ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షునికి మొక్కుబడి రాజీనామాలు సమర్పించారు.

మొన్నటివరకూ అన్ని పార్టీలవారు తెలంగాణను మేం వ్యతిరేకించం, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే, ఇచే శక్తీ అడ్డుకునే శక్తీ మాకు లేదు అంటూ రకరకాల కథలు చెప్పి వోట్లకోసం తెలంగాణలో పాదయాత్రలు జరిపినవారు ఇప్పుడు ఏకారణం చెప్పి రాజీనామాలు చెయ్యాలో అర్ధంకాక తలలౌ పట్టుకుంటున్నారు. పైగా ఒకపార్టీ వారు మరో పార్టీ వారిని మీరెందుకు రాజీనామా చేశారని ప్రశ్నిస్తున్నారు.

ఎలాగూ నిర్ణయం జరిగిపోయింది, ఇప్పుడు ఆపే అవకాశం లేదని ఈ సీమాంధ్ర నాయకులకు తెలిసినప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు నటించి సీమాంధ్రలో ఛంపియన్లు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీమాంధ్ర వోటర్లు వీళ్ళ నాటకాలను పట్టించుకునే స్థితిలో ఏమాత్రం లేరు. విభజిస్తే నాకేంటి, సమైక్యంగా ఉంటే నాకేంటి నా ఆరోగ్యష్రీ కార్డు నాదగ్గరుంటే చాలని చూస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మూడో విడత పంచాయతీ ఎన్నికలు కాంగ్రేస్ నిర్ణయం వెలువడినతరువాత జరిగినప్పటికీ వోటర్లు ఎన్నికల్లో చక్కగా పాల్గొని మెజారిటీ ప్రాంతాల్లో కాంగ్రేస్నే గెలిపించారు. అప్పటికే రాజీనామాలు సమర్పించి సమైక్యనాటకంలో ముందున్న వైకాపను సీమాంధ్ర వోటర్లు పెద్దగా పట్టించుకోలేదు.

ఇకనైనా సీమాంధ్ర నాయకులు తమ డ్రామాలు కట్టిపెట్టి విభజనలో సీమాంధ్రకు రావల్సిన న్యాయమైన హక్కులకోసం పోరాడకుండా ఇంకా సమైక్యాంధ్ర నటూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకు పచ్చిమంచినీళ్ళు కూడా పుట్టవు.

6 comments:

 1. i'm from rayalaseema.what you said is 100%true.

  ReplyDelete
 2. విదిపోవడం వల్ల మధ్యవర్తి లాభ పదతాడు

  ReplyDelete
 3. మీ చివరి వ్యాక్యానీ ఈ కింది విధం మారిస్తే బాగుంటుంది

  ఇకనైనా సీమాంధ్ర నాయకులు తమ డ్రామాలు కట్టిపెట్టి విభజనలో సీమాంధ్రకు రావల్సిన న్యాయమైన హక్కులకోసం పోరాడకుండా ఇంకా సమైక్యాంధ్ర అంటూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకు పచ్చి మంచి నీళ్ళు కూడా పుట్టకూడదు. అప్పుడె ఆంధ్రా ప్రజలు తెలివిగల వాళ్ళు అని చెబితే ఎవరన్నా నమ్ముతారు.

  కాని చరిత్ర చూస్తే, ఆంధ్రులకు అంతటి రాజకీయ తెలివి ఉన్నట్టుగా లేదు. 1972-73 లో ప్రత్యేక ఆంధ్ర మహోద్యమంగా మూడు-నాలుగు నెల్ల పాటు జరిగి 360 మంది పోలీసు కాల్పులకు (ఆత్మ హత్యలు కాదు) బలైపోయినా, కాంగ్రెస్ వెన్నుపోటుతో ఆ ఉద్యమం అణచివేయబడింది. తరువాత 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని (ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ అణచివేసిన వ్యక్తి) దేశం మొత్తం చీ కొడితే మన ఆంధ్ర ప్రజలు 42 స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్ పరం చేసి దేశం మొత్తం మొత్తం "చీ" అనేట్టుగా చేసుకున్నారు. మన ఆంధ్రాకు సరైన నాయకులు లేరు. ఎక్కువ భాగం కాట్రాక్టర్లే, పి డబ్ల్యు డి లేదా సారా కాంట్రాక్టర్లే. నాయకులు లేని జాతి ఎలా హీన స్థితి దిగజారుతుందో ఇప్పుడు ఆంధ్రా పరిస్థితి అదే. ఆంధ్ర ప్రాంతాన్ని బాగుచెయ్యాలి, అభివృధ్ది పరచాలి అన్న నిబధ్ధత ఉన్న నాయకులే కరువు మనకు. ఎవడికి పడితే వాడు చేపల చెరువులు, లేకపోటె హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బిజినెస్. అవ్వి కాపాడుకోవటానికి సమైక్యం అని ఒక ముసుగు వేసుకుని ప్రజలను రెచ్చగొట్టటం.

  ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రజలు తమ పరిస్థితి తమ కళ్ళతో చూసుకుని, తమ మెదళ్ళతో ఆలోచించుకుని, తమకు కావలిసినది తెచ్చుకోవాలి, అక్కడెక్కడో ఉన్నదాని కోసం దేబిరించటం ఎంతమాత్రం బాగాలేదు.

  నా దృష్టిలో రాయలసీమను కూడా ఇప్పుడే ప్రత్యెక రాష్ట్రం చేసెయ్యాలి. ఇప్పుడు ఈ ప్రత్యేక ఆంధ్ర ను ఏమని పిలుస్తారో తెలియదు. ఆంగ్ల మీడియా ఇప్పటికే "సీమాంధ్ర" అనేస్తున్నది. ఆంధ్ర మాట రెండవ స్థానానికి పోయింది. తెలంగాణా పోగా మిగిలిన జిల్లాలకు ఏమి నామకరణ చేస్తారు?? పేరేదైనా ఆ రాష్ట్రానికి రాజధాని తప్పనిసరిగా మళ్ళీ రాయలసీమలోనే అని పట్టుపడతారు, ఆ పట్టు నెగ్గించుకుఇంటారు. అలా నెగ్గించుకోవటానికి కోస్తా ప్రజల బధ్ధకం, తెలివి తక్కువతనమే పెద్ద కారణం. ఒక 50 ఏళ్ళు పోయినాక ఇప్పుడు తెలంగాణా/హైదరాబాదులో ఎదుర్కుంటున్న పరిస్తితే రాయల సీమనుంచి రాదని ఏమిటి భరోసా.

  ReplyDelete
  Replies
  1. Uttarandhra is almost the same. Most of the lands in the Srikakulam-Tuni NH corridor & the Araku resorts are owned by south Andhras. The same case with high level jobs in VSP etc. and most big businesses in Vizag. Even their leaders (NJR, TSR, Chinnamma, Ganta & Velagapudi) are from south Andhra.

   Delete
 4. ప్రతీ ఒక్కడూ కోస్తా ఆంధ్రా జనాలు తెలివి తక్కువ వాళ్ళు అనే వాళ్ళే నిజానికి వాళ్ళే తెలివైన వాళ్ళు, రాజధాని ఉండటం వలన నష్టమే కానీ లాభం లేదు అని తెలుసుకుని రాజధానికి దూరంగా ఉన్నారు.

  ReplyDelete

Your comment will be published after the approval.