Wednesday, 28 March 2012

బలిదానాలకు కారణభూతమవుతున్న సీమాంధ్ర మరియు నేషనల్ మీడియా



మల్లీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలపర్వం మొదలయింది. రెండున్నరేళ్ళక్రితం కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్లో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని చనిపోవడంతో మొదలయిన బలిదానాలపర్వం కొద్దిరోజులుగా బలిదానాలు  తగ్గిపోయాయని ప్రజలు కాస్త ఊరటపడుతున్న సమయంలో చీఫ్‌విప్ గండ్ర తెలంగాణవాదం తగ్గిపోయిందని మాట్లాడి మరోసారి బలిదానాలకు తెరదించారు.

అసలింతకూ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఉద్యమంలో ఆత్మబలిదానాల అవసరం ఏముంది? ఉద్యమకారులు ప్రభుత్వంపై నిరశన తెలపాటానికి ఇంకా అనేకమార్గాలు ఉండగా ఈవిపరీత విధానాన్నే ఆయుధంగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? దీనికి సమాధానం తెలుపును తెలుపుగా,నలుపును నలుపుగా చూపించాల్సిన మీడియా బాధ్యత మరచి వ్యవహరించి మిగతా నిరశన మార్గాలకు గొళ్ళెం పెట్టడం వల్లేనని చెప్పొచ్చు.

తెలుగు మీడియా డిసెంబరు 9, 2009 తరువాత తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరించి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండగా నేషనల్ మీడియా శ్రీక్రిష్ణ కమిటీ ఏడో అధ్యాయం వల్లనేమో అసలు తెలంగాణ అనేప్రాంతమే ఈభూమిమీదలేదన్నట్టు వ్యవహరిస్తోంది. మీడియా అనుసరిస్తున్న ఈపక్షపాతవైఖరివల్ల సామాన్య, పేద యువకులకు ఈప్రభుత్వం వైఖరిపై నిరశన వ్యక్తం చెయ్యడానికి మరేమార్గం లేకుండా పోయింది.

ఇక్కడ ఉస్మానియాలో వెయ్యిమంది విద్యార్థులు ఒక్కసారి సామూహిక నిరాహారదీక్షలకు పాల్గొంటే మీడియా ఆఖరుపేజీలోకూడా ఆఊసే ఉండదు. ఇక్కడ విద్యార్థుల శాంతియుత ర్యాలీలను పోలీసులు అన్యాయంగా అడ్డుకుని విచక్షణారహితంగా ఉస్మానియాలోనూ, నిజాం కాలేజీలోనూ కొడితే ఆసంఘటనలు మీడియా పచ్చకామెర్ల కళ్ళకు అందవు.ఇక్కడ సబ్బండవర్గాలు కలిసికట్టుగా సకలజనులసమ్మె చేస్తే అసలేమీ జరగట్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఉప-ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనొ తెలంగాణ అనుకూల పార్టీలు దిగ్విజయం చెందినా మసిపూసి మారేడుగాయజేసి వోట్లశాతం తగ్గింది, తెలంగాణవాదం తగ్గింది అంటూ ప్రచారం మొదలు పెడతారు.

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యతను మీడియా నిర్వర్తించడం మరిచినందువల్ల ఇక సామాన్యుడికి తనగొంతును వినిపించే అవకాశం పోయింది. తామేం చేసినా, ఎంత ఉధృతంగా సమ్మెచేసినా కనీసం ఆవార్త ప్రపంచానికి చేరకపోతే ఇంకా తాము శాంతియుతమార్గాలద్వారా నిరశన తెలిపి లాభంలేదనే నిరాశ యువకుల్లో వ్యాప్తించింది. స్వతహాగా శాంతికాముకులూ, ఫాక్షన్, రౌడీ రాజకీయాలకు దూరమైన తెలంగాణ ప్రజలు తమ ఆగ్రహాన్ని హింసారహితంగా ఎలావ్యక్తం చేయాలో తెలియని అనిశ్చిత స్థితిలోకి వెల్లారు. పరిణామం, తమ నిరశన తెలపటానికి ఆత్మబలిదానాలద్వారా తమను తామే హింసించుకుంటున్నారు.


తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మబలిదానాలకు పూటకో మాట మార్చి వచ్చిన తెలంగాణను అడ్డుకున్న మోసపునేతలు ఎంత బాధ్యులో తమ బాధ్యత మరిచి పక్షపాతబుద్దితో వ్యవహరిస్తూ వృత్తిద్రోహం చేస్తున్న మీడియాకూడా అంత బాధ్యులు. తెలంగాణా ఈమీడియాకు అక్కరలేకపోతే మనకూ ఈపక్షపాత మీడియా అవసరం లేదు. ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర మీడియానూ, తెలంగాణ అసలు లేనట్లు వ్యవహరిస్తున్న జాతీయ మీడియానూ తెలంగాణాలో బహిష్కరిద్దాం.


Wednesday, 21 March 2012

2014 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు?


ప్రస్తుత పరిస్థితులే 2014 దాక కొనసాగి, తెలంగాణ ఏర్పాటు గానీ, మధ్యంతర ఎన్నికలు గానీ రాకపోయినట్లయితే 2014 ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ఎలా ఉండవచ్చు? ఇదీ నా అంచనా.

తెలంగాణ
----------
టీఆరెస్ - 65
బీజేపీ - 25
సీపీఐ - 12
మజ్లీస్ -  2
ఎంబీటీ - 2
కాంగ్రేస్ - 4
ఇతరులు -  2

మొత్తం - 112

ఆంధ్ర
-------

టీడీపీ - 35
కాంగ్రేస్ -  54
వైఎస్సార్ కాంగ్రేస్ - 90
సీపీఎం - 2
ఇతరులు -  3

మొత్తం - 184


బహుషా కాంగ్రేస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్ను ముఖ్యమంత్రిని చెయొచ్చు. మెల్లిగా జగన్ కాంగ్రేస్లో కలిసిపోవచ్చు.

కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం. బీజేపీ అధికారంలోకి వచ్చినపక్షంలో 2015లోపు రాష్ట్రం విడిపోవచ్చు. సీమాంధ్రకు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని వెతుక్కోవాలి.

Monday, 19 March 2012

Regional Discrimination, root cause of Regional identity


During the Mahaboobnagar bi-election while there is a conflict of interest between BJP and TRS, some die-hard Telangana critics have found a new theory ..they say T-agitation which is based on regionalism is akin to communalism!! We do not know how many of those have actually condemned BJP when Babri was brought down but now to criticize Telangana agitation suddenly they all turn anti-communal. If you are against communalism, regionalism, cateism or any other kin of division among people we welcome your stand, but what we condemn is your double standards in criticizing regionalism but keeping a blind eye on its root cause, the regional discrimination.

Yes, our demand for separate statehood has roots from struggle for regional existence, however the root cause of regional existence struggle lies in the  discrimination of rulers on regional grounds. If we do a little root cause analysis and draw a fish-bone diagram for the causes of separate statehood, all causes end with the same root cause which is discrimination on regional grounds.

The main causes of T-agitation are denial of water resources, denial of funds, injustice in jobs and historic, cultural suppression. While the first three are result of the actions of the rulers of the state, the last one is deep rooted in the society at all levels.

Critics of regionalism, where were you when this region was fighting for drinking water for Fluoride sufferers? Where were you when we were fighting for 610 GO implementation? Where were you when our water was diverted to other regions and our fair share was denied?  Did you ever question when the social texts are manipulated to hide Telangana history and Telangana freedom fighters but gave exorbitant importance to their contemporaries from Andhra region?

When a group of people are exploited by others, over time the oppressed group re-invents their identity and struggle for their pride. Be it be a dalit liberation movement, be it be a black pride movement or Telangana movement, all are the result of the organized discrimination and oppression. Not acknowledging the cause and questioning only the effect does not solve any purpose.


ఇంటిదొంగల పని పడదాం



బ్రిటిష్ వాడు ఇంతపెద్ద మనదేశాన్ని ఆక్రమించుకుని రెండువందలఏళ్ళు మనమీద పెత్తనం ఎలా చేయగలిగాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం పెద్దకష్టం కాదు. మనమీద పరాయివాడు పెత్తనం చెయ్యగలగడానికి కారణం మన ఇంటిదొంగలే. అలాగే ఈనాడు ఇంతపెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నసమయంలో కూడా ఆంధ్ర నాయకులు మనమీద జులుం చెయ్యగలగడానికి కారణమూ ఇంటిదొంగలే.

ఇంటిదొంగలు మనకే ప్రత్యేకం కాదు, ఎక్కడయినా ఉంటారు. ఒకవేళ సమైక్యాంధ్రలో తెలంగాణకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి పెత్తనం తెలంగాణ వద్ద ఉంటే, ఆంధ్రా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఉంటే అక్కడా ఇంటిదొంగలు ఉండేవారు. సమాజంకంటే తనసొంతలాభమే ఎక్కువ అనుకునేవారిని పసిగట్టి పెత్తనం చేసేవారు వారికి పదవులూ, డబ్బూ ఆశ జూపి లోబరుచుకుని మిగతా సమాజానికి వ్యతిరేకంగా పని చేయిస్తారు. అలాంటివారే ఈఇంటిదొంగలు.

చంద్రబాబు మనగడ్డమీద పరాయి కిరాయిరౌడీలను తీసుకొచ్చి మనయువకులనే  కొట్టించగలిగాడంటే కారణం ఇక్కడి ఇంటిదొంగలు ఎర్రబిల్లి, మొత్కుపల్లి, రేవంత్ లాంటివారే. కిరణ్‌రెడ్డి ఇక్కడికొచ్చి మననేతలనే తిట్టగలుగుతున్నాడంటే దానికి కారణం ఇక్కడి ఇంటిదొంగలు డీకే అరుణ, జానారెడ్డి లాంటివారే. మరి ఈఇంటిదొంగలకు ఇంతబలం ఎలావచ్చిందంటే వారిదగ్గర ఉండే కొద్దిమంది అనుచరవర్గం కారణం.

తెలంగాణ ప్రజలు ఇంటిదొంగల భరతం పట్టడం ఎప్పటినుంచో మొదలు పెట్టారు. ఆంధ్రాబాబులకు మద్దతు పలికే తెలంగాణ నేతలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. అయితే ఈక్రమంలో మన యువకులకే దెబ్బలు తగులుతున్నాయి...కారణం ఎదుటివాడు మనకంటే బలవంతుడు. అలాంటప్పుడు మనం ఏంచేయాలి? శతృవు బలంపై దెబ్బకొట్టాలి. ఈఇంటిదొంగల బలం వారి అనుచరవర్గమయినప్పుడు ముందు మన లక్ష్యం ఈ అణుచర వర్గమే కావాలి. ఈఇంటిదొంగలందరికీ సామాజిక బహిష్కరణ విధించాలి. భవిష్యత్తులో ఒక మొత్కుపల్లికో ఒక డీకే అరుణకో అనుచరుడిగా ఉండాలంటే వీల్లు భయపడాలి.

ఇంటిదొంగలకూ, వారి అనుచరులకు పెల్లిచేసుకుందామంటే పిల్ల దొరకగూడదు. ఊరిలో ఉప్పు పుట్టకూడదు. మున్సిపాలిటీ నీల్లు రాకూడదు, ఇంట్లో పనిమనుషులు దొరకగూడదు. వీల్లపొలాలు సాగుచేసుకుంటే కూలివాల్లు దొరకగూడదు, వీల్ల ఇంట్లో ఎవరయినా చస్తే డప్పుకొట్టేవారు, పాడెకట్టేవారు దొరకగూడదు. ఇకనుంచీ మన నినాదం ఇదీ.."ఇంటి దొంగల పని పడదాం...తెలంగాణ సాధిద్దాం".