Tuesday 27 August 2013

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (చివరి భాగం)




డిసెంబర్ 10 నాడు నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గూర్చి చేసిన ప్రకటన అటు మెజారిటి తెలుగు ప్రజలు, నాయకులు ఆమోదించారు. కానీ ప్రకాశం బృందం మాత్రం తమ అత్యాశ మానుకోలేదు.
డిసెంబర్ 11, 1952 నాడు ఆంధ్ర ప్రభ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్ అప్పటి వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతుంది.
***
ఆంధ్ర రాష్ట్రం అనే స్త్రీని కారాగారంలో వేసి దానికి మదరాసు అనే తాళం బిగించి, దానిని ఎవరూ తీయకుండా దుడ్డుకర్ర పట్టుకుని కాపలాకాస్తున్న ప్రకాశం బృందం!
***
13 డిసెంబర్ నాటికి పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అనేకమంది ఆంధ్ర రాజకీయ నాకులు, ప్రముఖులు ప్రకాశం  బృందం తమ బెట్టువీడాలని, మదరాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకోవాలని విజ్ఞప్తులు చేశారు.
పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రజలు అనేకచోట్ల రైళ్లను అడ్డగించడం, ర్యాలీలు తీయడం మొదలుపెట్టారు.
చాలా పట్టణాల్లో మదరాసులేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ఊరేగింపులు జరిగాయి.



***
దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థం అయ్యేదేమిటంటే మదరాసు నగరాని కోరుకున్నది గుప్పెడు మంది స్వార్ధ రాజకీయనాయకులే కానీ ఆనాటి ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కారని.
డిసెంబర్ 16 నాడు ఆంధ్రప్రభ పత్రిక తన సంపాదకీయంలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, స్వామి సీతారాంల వైఖరిని తీవ్రంగా ఎండగట్టింది.
***
“ఎవరు ద్రోహులు?” అనే శీర్షికతో వచ్చిన ఆ సంపాదకీయంలో
” ఈ పరిస్థితిలో ముక్కోటి ఆంధ్రుల అభిమతం ఈడేరడం ముఖ్యమా? ఈ ముగ్గురు ముసలివారి మంకుపట్టు నెగ్గడం ముఖ్యమా? ఇప్పుడిక లోకమే నిర్ణయించాలి. ఆంధ్ర రాష్ట్రానికి అడ్డుగా నిలుస్తున్నవారెవరో, ఆంధ్రజాతికి ద్రోహం చేస్తున్నవారెవరో” అని రాశారు.
***
16 డిసెంబర్ నాడు అదే ఆంధ్రప్రభలో ప్రచురితమైన ఈ కార్టూన్ చూడండి ఎంత చక్కగా అప్పటి వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తుందో  :
***
చివరికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో 15 డిసెంబర్ 1952 అర్ధరాత్రి 11:23 నిముషాలకు పొట్టి శ్రీరాములు తుదిశ్వాస విడిచాడు…గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందే పూర్తిగా స్పృహ తప్పారు. అటువంటి పరిస్థితిలో కూడా ఆయనకు ఎందుకు వైద్య సహాయం అందించలేదనేది జవాబులేని ప్రశ్న.
స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా ప్రకాశం వంటి సీమాంధ్ర రాజకీయ నాయకులు మదరాసు నగరాన్ని చేజిక్కించుకునేందుకు ఆడిన జూదంలో పొట్టిశ్రీరాములు ప్రాణాలు ఫణంగా సమర్పించారు అని చెప్పొచ్చు.

1 comment:

  1. Very very informative series.
    There are still folks that believe Sri Potti Sri Ramulu Garu fasted unto death for the state of AP in its present form.
    They do not realize that the then Hyderabad state was not in the scheme of things at that time. They have no idea about the Telangana Saayudha Poratam.

    AraSurya

    ReplyDelete

Your comment will be published after the approval.