Monday, 2 September 2013

ఆంధ్రాకాశరామాయణం



ఆకాశరామన్న లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటుండు - " ఘోరం!దారుణం!! మన రాష్ట్రాన్ని ముక్కలు జేస్తున్నరు. పదమూడు జిల్లాల ప్రజలను అడక్కుండా, వారి మనోభావాలను లెక్కచేయకుండా ఈరాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నరు. పైగా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు నెగ్గకపోయినా రాష్ట్రాన్ని విభజిస్తారట. ఈదారుణాన్ని ఖండించాల్సిందే.

పక్కనున్న సగటు సీమాంధ్ర మనిషి కాస్త చిరాకుపడ్డాడు. ఊరుకో రామన్నా! విడిపోతామని అక్కడి జనాలు తెగేసి చెబుతుంటే కలిసి ఉండమనడం ఏం న్యాయం? పైగా అందుకోసం ఈపదమూడు జిల్లాల జనాలను ఒక్కొక్కరినీ వచ్చి అడుగుతారా ఎక్కడయినా? అఖిలపక్షం పెట్టి అడిగినప్పుడు మన నాయకులే కేంద్రం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు కదా? అయినా కలిసిఉడడానికి ఏకాభిప్రాయం కావాలి గానీ విడిపోవడానికి ఎందుకు? వద్దంటున్నా  నాతోనే కలిసుండమనే ఆసిడ్ ప్రేమికునిలాగుంది నీవరస. 

ఆకాశరామన్నకు కాస్త కోపమొచ్చింది. ఇదిగో! నీకు తెలీదు నువ్వూరుకో? ఎక్కడైనా రాష్ట్రప్రజల అనుమతిలేకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తుందా? అదెలా సాధ్యం?

స.సీ.మ.: మన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రానికి ఆహక్కు ఉంటుంది. అదే లేకపోతే దోపిడీకి గురయేప్రాంతానికి న్యాయం జరిగేది ఎట్ల? ఎక్కడైనా దోచుకునేవాడు విభజనకు ఒప్పుకుంటాడా?

ఆకాశరామన్నకి మల్లీ బీపీ వచ్చింది.అంతలో కన్యాశుల్కం గిరీశం గుర్తొచ్చి అన్నాడు. "అసలు మన నాయకులవద్ద నిబద్దత కరువయిందోయ్. ఇటువంటి నిబద్ధత లేని నాయకులు ఉండ బట్టే కేంద్రం తెలుగు వారిని లోకువ గట్టి 13 జిల్లాల వారి ఆలోచనలకి, అభిప్రాయాలకి వీసమెత్తు విలువ ఇవ్వకుండా - కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టి లో వుంచుకొని అడ్డగోలు విభజనకి పూనుకుంది."

స.సీ.మ.: ఆవిషయం తెలిసిందే కదా. మన సీమాంధ్ర నాయకులకు ప్రజల బాగుకంటే వాళ్ళ వ్యాపారాలూ, కబ్జారాజకీయాలూ, పదవులూ,వోట్లూ ముఖ్యం. పదవులకోసం, అక్కడి ప్రాంతంలో వోట్లకోసం కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటారు, వ్యాపారాలకోసం సమైక్యత కావాలంటారు. అలాంటోళ్ళగురించి పట్టించుకునేదెందుకు? అయినా పక్కోడు విడిపోయి నాబాగు నేను జూసుకుంటానంటే నీకెందుకు కడుపుమంట?

ఉన్నమాట విని ఆకాశరామానికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. "నీకర్ధం కావటం లేదు సగటు మనిషీ? నాది డైజిన్ వేసుకంటే తగ్గడానికి కడుపు మంటకాదు, గుండెమంట. ఉరిశిక్ష వేసేఖైదీనైనా ఆఖరు కోరిక అడుగుతారుగానీ మనల్ని ఒక్కసారైనా అడిగారా?"  

స.సీ.కి కాస్త నవ్వొచ్చింది. "ఇంతకూ నీఆఖరు కోరిక ఏమిటో?" 

ఆ.రా.: నీకు పంచతంత్రం బొత్తిగా తెలిసినట్లు లేదు. ఇది కోతి మొసలి కథలాగుంది. ఈరాష్ట్రాన్ని విడగొట్టి మన గుండెకాయ అయిన హైరాబాదును వాళ్ళు సొంతం చేసుకుందామని కుట్ర చేస్తున్నరు. హైదరాబాదుమీద పెత్తనమే తన అసలు కోరిక అని నర్మగర్భంగా చెప్పాడు. 

"ఛ! ఊరుకో!! హైదరాబాదు మన గుండెకాయ ఏమిటి? మన గుండెకాయ అయితే అదెందుకు తెలంగాణ మధ్యలో ఉంది? నీ కథ బాగానేఉందిగాని పాత్రలు తారుమారు చేస్తున్నవు. మనమేమన్నా కలిసినప్పుడు హైదరాబాదును తీసుకెళ్ళామా, విడిపోతే అది మనకు చెందడానికి?కలిసిఉన్నా, విడిపోయినా  హైదరాబాద్ తెలంగాణలోనే ఉంటుంది, దాన్ని కాజేయడానికి వారు కుట్ర జెయ్యడమేమిటి నీపిచ్చిగానీ?మనదిగానిదాన్ని ఆశపడకుండా మనకో రాజధానిని ఏర్పాటుచేసుకుంటే మనకే లాభం."

"నీకు తెలీదు. ఈకాంగ్రేస్ పార్టీ సొంత ప్రయోజనాలకోసం, వోట్ళకోసం రాష్ట్రాన్ని విభజిస్తుంది. వినాశకాలే విపరీతబుద్ధి." 

ఒకవేళ నువ్వన్నట్టు కాంగ్రేస్ సొంతప్రయోజనాలకోసమే విభజిస్తుందనుకో. విభజనవల్ల కాంగ్రేస్కు లాభం అంటే దాని అర్ధం ఏంటి? తెలంగాణలో ప్రజలు విభజన కోరుకుంటున్నారు, అదే సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత లేదన్నట్టే కదా? ప్రజాభిప్రాయం అలాగుంటే విభజిస్తే తప్పేంటి? 

ఆకాశరామన్న దగ్గర ఆయుధాలన్నీ ఒక్కొక్కటీ అయిపోతున్నయి. కనీసం నేను నాతోటి సీమాంధ్ర సగటు మనిషిని ఒప్పించలేకపోతున్నా. ఇంకా తెలంగాణ ప్రజలనూ, ఢిల్లీ పెద్దలనూ తనవాదన ద్వారా ఎలా ఒప్పించాలి అని భయమేసింది. చివరికి తన ఆఖరు ఆయుధాన్ని బయటకు తీశాడు. ఇది మన తెలుగు జాతిని విడదీయడానికి దుష్ట కాంగ్రేస్ చేసిన కుట్ర. ఇందులో మనం పావులమయ్యాం. తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా? తెలుగుజాతిని ముక్కలు చేస్తుంటే నువ్విలాగే ఊరుకుంటావా? అంటూ కస్సున లేశాడు.

సగటు సీమాంధ్రునికి చిరాకేసింది. "ఇదిగో ఆకాశరామన్నా. వింటున్నాగదా అని ఏంది నీ అరుపులు? ఆపు నీ బోడి డైలాగులు.  తెలుగు జాతికి ఆత్మగౌరవలేదా అని అడుగుతున్నావు, మరి తెలాంగాణ ప్రజలు ఈతెలుగుజాతిలో భాగం కాదా? వారి ఆత్మగౌరవం సంగతేంటి? కెవలం మన అభిప్రాయమే మొత్తం జాతి అభిప్రాయనుకుంటే ఎలా? ఎందుకింత కుంచితబుద్ధి?" అంటూ ఒక్కసారి లెఫ్ట్ రైట్ ఇచ్చాడు.

ఆఖరు అస్త్రం కూడా వీగిపోవడంతో ఇక లాభం లేదని ఆకాశరామన్న మెల్లగా పలాయనం చిత్తగించాడు.

8 comments:

  1. pachchi abhaddala donga amara veerula donga agitation chaesina meeru, dongae donga ani arichinattu vundi.pakka caadi meeda edavadam gudumba, gochi, dappu sanskruthi tappa eppudaina kastapaddara?

    sreerama

    ReplyDelete
    Replies
    1. అనామకా, నీ బాధేంటో అర్ధం కాదు. ఎప్పుడూ ఇలాంటి చత్త కామెంట్లు పెడుతుంటావు, నేను డిలీట్ చేస్తుంటాను. బహుషా తెలుగుజాతి సమైక్యత కోరుకునేవానిలాగున్నావు, కనీసం తెలుగులో టైపు చెయ్యడం, మంచి భాషలో కామెంట్లు రాయడం నేర్చుకో. ఈఇంగ్లీషు లిపి తెలుగు కామెంట్లను చదవలేక చస్తున్నాం.

      Delete
    2. naa good advice entanate please ignore people like above annymous .... kastha alochinchi matdevaaltho edianaa charcha jarupthe baguntundhi just ,,,, guddi gaa potldavalla, bhoothulu vallinche valla tho em matldutham .. please don't waste ur valuable time.

      Delete
  2. More on the reaction of స.సీ.మ at http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

    ReplyDelete
    Replies
    1. Jai,

      good summery of your own observations. If we can send some photos of those seemandhra agitations to parakala, he would anayse the strength of crowd using his elevator theory.

      Delete
    2. Parakala would not need any theory because he can count the people instead of estimating.

      I could not take photos as my cell battery was down.

      Delete
  3. ఆకాశ రామన్న ఆయన బ్లాగ్గిలో గిల గిల కొట్టుకుంటున్నాడు, ఆయన ఉద్రేకం చూస్తుంటే నవ్వొస్తుంది. తెలబాన్ అంట, హహః. అంటే మాద్రాస్ వాళ్లకు ఈయన తాలిబాన్ కాబోలు :)

    ReplyDelete
    Replies
    1. ఆకాశరామన్నకు డైజిన్ గోళీ వేసుకున్నా కడుపుమంట తగ్గినట్టు లేదు. పాపం అసలే, తన గుండె ఎక్కడ ఉందోకూడా తెలియని స్థితిలో ఉన్నడాయె.

      Delete

Your comment will be published after the approval.