Wednesday, 7 August 2013

ఇదొక తలతిక్క ఉద్యమం



రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రేస్ నిర్ణయం ప్రకటనతో సీమాంధ్రలో మల్లీ ఉద్యమం(?) మొదలయింది. దీన్ని వీరు సమై"ఖ్య"ఆంధ్ర ఉద్యమం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు, అయితే ఇది మొత్తం రాష్ట్రంలో కాక సీమాంధ్రకు మాత్రమే పరిమితం. నాయకులకోరకు మీడియా ద్వారా కిరాయిమూకలచేత నడిచే ఈ ఉత్తుత్తి ఉద్యమంలో అన్నీ విచిత్రాలే.

ప్రజలు కోరుకుంటున్నందుకే తమ ప్రజల మనోభిప్రాయానికి అనుగుణంగా మేము ఈఉద్యమం చేస్తున్నామని అక్కడి నాయకులు చెబుతుంటారు. మళ్ళీ  వారే రాష్ట్రాన్ని ఆపాలంటే ప్రజలు ఉద్యమిస్తేనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు పోరాటం చెయ్యాలని పిలుపునిస్తారు.

సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతారు.  వారే హైదరాబాదును మేము వదులుకోము, హైదరాబాదు మీద అధికారంకోసం పోరాడుతామని చెబుతారు. ఒకడు నీళ్ళ వాటాను తేల్చాలంటే మరొకడు హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చెయ్యాలనీ, ఇంకొకడు హైదరాబాదును దేశాఅనికి రెండో రాజధానిని చెయ్యాలనీ అంటారు.

తెలంగాణ ఉద్యమ తీరును అణుక్షణం  తిట్టిపోసిన వీరంతా తమ ఉద్యమ కార్యాచరణకోసం అంతా తెలంగాణా ఉద్యమాన్ని కాపీకొడతారు. రోడ్డు మీద వంటావార్పులు, సకలజనుల సమ్మెలూ, జాక్‌లూ అన్నింట్లోనూ తెలంగాణకు నకలే.

ఉద్యమం మొదలు పెట్టగానే ఎక్కడన్నా తెలంగాణ నాయకుల విగ్రహాలు కనపడతాయేమో కూలదోద్దాం అని చూసి అసలు తమ ప్రాంతంలో ఎక్కడా తెలంగాణ నాయకుల విగ్రహాలు లేవనీ, తామెప్పుడూ పెట్టనియ్యలేదనీ తెలుసుకుని రాజీవ్, ఇందిరల విగ్రహాలు కూల్చడం మొదలుపెట్టారు. అయితే ఈవిషయంపై సోనియమ్మ కన్నెర్రజేసిందని తెలుసుకుని మన్నుతిన్నపాముల్లా నోరుమూసుకున్నారు.

ఈఉద్యమానికి ఒక లక్యం ఉండదు, ఒక నాయకుడు ఉండడు కనుక ఎప్పుడు ఎక్కడ ధర్ణా చేసినా కేసీఆర్ బొమ్మను కొట్టడం, కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టడం, వీళ్ళ నాయకులు కేసీఆర్ను తిట్టాడం పరిపాటి. ఏవిధంగానైతే తెలంగాణ నటే వీరిదృష్టిలో హైదరాబాదు భూములు మాత్రమేనో అలాగే తెలంగాణా ఉద్యమం అంటే కేసీఆర్ మాత్రమే. మరి కేస్సీఅర్ను తిట్టిపోసే ఇక్కడి నాయకులు వారివారి పార్టీల్లోని తెలంగాణ నాయకులందరూ తెలంగాణకోసం కొట్లాడినా వారినీ ఏమీ అనరు.

కాస్త వెరైటీగా ఉద్యమం చెయ్యాలనుకునేవారు ఏంచెయ్యాలో తోచక సంస్కారం మరిచి కేసీఆర్కూ, సోనియాకు పెళ్ళి చేసి వారిద్దరికీ తెలంగాణ అనే బిడ్డ పుట్టినట్టు చూపిస్తూ తమ సంస్కారాన్ని చాటుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ బొమ్మపై మూత్రం పోస్తున్నట్టు హోర్డింగులు పెట్టి తమ విగ్నత ప్రదర్శిస్తున్నారు. తమహక్కులకోసం కాక ఎదుటివారి హక్కులను అడ్డుకోవడాఅనికి డబ్బూ, ద్వేషంలోనుండి పుట్టే ఉద్యమాలనుండి ఇంకా ఏం ఆశిస్తాం? ఇదండీ ఈతలతిక్క ఉద్యమం పోకడ!!

కొసమెరుపు: ఈసారి ఎక్కువమంది సీమాంధ్ర నాయకులు దీక్షల్లో కూర్చోవడానికి కారణం  దీక్షల్లో కూర్చుంటే నన్నపనేని రాజకుమారి ఎక్కడ తమను ముద్దుపెట్టునుంటుందో నని సీమాంధ్ర నాయకులు భయపడుతున్నారట. 



19 comments:

  1. తప్పులెన్నువాడు తమతప్పులెరుగడు.. అన్నట్లుంది ఈ post.
    1.Post నిండా.. smelling mistakes
    2.వేరెవరిదో సంస్కారం గురించి ఎత్తిచూపి, చివరిలో కొసమెరుపు అని నీ బుద్ది బయటపెట్టుకోవడం..
    (సలహాః ముందు నీ ఇల్లు శుభ్రం చేసుకో.. తరువాత పక్కింటివాడి ఇంటిబయట మూలనున్న చెత్త గురించి మాట్లాడు...)

    ReplyDelete
    Replies
    1. I understand that you intended to type spelling when you wrote smelling unless you can actually smell through blogs. I hope you understand the difference between typos and writing the name of their agitation on banners wrongly and displaying them in television channels.

      Delete
  2. నీకు తెలుగు రాదు మళ్ళీ వేరు మల్లి వేరు

    ReplyDelete
    Replies
    1. మాకు ఒచ్చిన తెలుగు సాల్లే ..

      అసలు విషయం వదిలి కొసరు పట్టుకు వేలాడే వాళ్ళను గూట్లె అంటారు మా వైపు.

      Delete
  3. ఒప్పుకుంటున్నాను..

    ReplyDelete
  4. Viswaroop, your term "talatikka" (foolish) is totally wrong. Please withdraw this false accusation :)

    How can a riot inspired by years of scare mongering be termed foolish? How dare you categorize as foolish the intentions of crony capitalists to protect the lands alienated by them? How can you insult the power of the real estate mafia by calling them fools? Why do you trivialize the carpetbaggers?

    ReplyDelete
    Replies
    1. jai,

      నిజం. ఇదొక తలపొగరు ఉద్యమం.

      Delete
    2. థాంక్సండీ. ఇక మీదయినా పదాలు సరిగ్గా ఎంచుకోండి!

      Delete
  5. గత చరిత్ర నంతా పరిశీలిస్తే నిజానికి ఆంధ్రా వాళ్ళు చేసే పోరాటాలను ఉద్యమాలు అనలేము - అవి ముమ్మాటికీ ఆధిపత్య పోరాటాలే. మదరాసు పై ఆధిపత్యం చేయాలని 1913-1952 వరకు పోరాటాలు చేసి పొట్టి శ్రీరాములు వంటి వారిని చంపి (స్పృహలో కూడాలేని పొట్టి శ్రీరాములును వైద్యం చేయించకపోవటం హత్యే అవుతుంది), ఆ అల్లర్లలో వందలాది సోదర ఆంధ్రుల ఆస్తులు తగులబెట్టి దోపిడీలు చేసి వారిని హత్యలు చేసి చివరకు 1953 లో మదరాసు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు.

    అంతటితో ఆగక విశాలాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. విశాలాంధ్ర పదం లోనే సామ్రాజ్య విస్తరణ దురాశ కనిపిస్తుందని నాడే నేహ్రూ కొట్టి పారేసినా (చూడండి : ఆంధ్ర ప్రభ 3-10-53) ఆంధ్రా వాళ్ళ తీర్మానాలకు తల ఒగ్గి వారు కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ను 1956 లో ప్రకటించాడు. వారు కోరినట్టు విశాలాంధ్ర పేరుతో కాక ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టబడింది.

    ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ మద్యన ఉండవల్లి అనే ఒకతను మీటింగ్ పెట్టి తెలంగాణా వాళ్ళు రారమ్మని పిలిస్తే ఆంధ్రా వాళ్ళు వెళ్లి కలిసారని చరిత్రను తిరిగేసి చెబుతున్నాడు. యావత్ తెలంగాణా అంతా తెలంగాణా రాష్ట్రంగానే ఉంటామని ఘోషించి రోధించింది, ఊరూరా - వాడ వాడలా ఉద్యమాలు జరిగాయి(చూడండి november 1956 గోల్కొండ దిన పత్రికలు). 90% తెలంగాణా ప్రజలు తెలంగాణా రాష్ట్రమే కావాలంటున్నారని (చూడండి 28-11-55 గోల్కొండ) చరిత్రే అక్షర సత్యాలు చెబుతుంది. చరిత్ర హీనులు చరిత్రలో కోకొల్లలు తమ వారికి ద్రోహం చేసేవాడు పుడుతూనే ఉంటారు - అలాంటి ఎవడో ఒక స్వార్థుడు అన్న మాటని యావత్ తెలంగాణాకే ముడిపెట్టడం దుర్మార్గం - శోచనీయం. పుస్తకంలో ఒక పేజీ చదివితే కాదు ప్రతి పేజీ చదివి సారాన్ని గ్రహించినపుడే అది విజ్ఞత - అపుడే వాడు జ్ఞాని అది పదిమందికి పంచినపుడే వాడు విజ్ఞాని. నాటి ఆంధ్రా వాళ్ళ లాబీయింగ్ - నాటి తెలంగాణా పాలనాదికారుల అలసత్వం వల్లనే తెలంగాణా ఆంద్ర లో విలీనమై తన పేరుతో బాటు తన సంస్కృతినీ, సాంప్రదాయాన్ని ఆఖరుకి తెలంగాణా బిడ్డల అస్థిత్వాన్నే కోల్పోయింది. ఆంధ్రా వాళ్ళ దొరతనందోపిడీ ఆధిపత్యధొరినె తెలంగాణా ఉద్యమానికి తెరలేపింది.

    ఆ ఉద్యమానికి తల ఒగ్గి ప్రభుత్వం దిగివచ్చినపుడు మళ్ళీ ఆధిపత్యానికై ఆంధ్రులు జరిపిన పోరాటానికి పెట్టుకున్న పేరే "జై ఆంద్ర". అప్పుడు కూడా ఇది జరిగింది ఆంధ్రా లోనే - అప్పుడు కూడా వీరు దోపిడీ చేసింది చంపుకున్నది ఆంధ్రావాల్లనే - ఆ పోరాట ఫలితమే ఆగిపోయిన తెలంగాణా అనుకూల ప్రయోజన ప్రకటనలు.

    ఎన్ని గొంతుకలు ఘోషించి మూగబోయినా మళ్ళీ మళ్ళీ తెలంగాణా గళం మారు మ్రోగుతూనే ఉంది. ఆ గొంతుకల ఆర్తనాద ఫలితమే తెలంగాణా ప్రకటణ . ప్రకటనను మళ్ళీ పాతి పెట్టడానికే వాళ్ళు సరికొత్తగా పెట్టుకున్న పేరే "సమైఖ్యాంధ్ర" . ఆ పేరులో కూడా తెలంగాణా పదం రానివ్వలేదు - అసలా పేరుని శాశ్వతంగా తుడిచి పెట్టాలన్నదే వారి ధ్యేయంలా కనబడుతుంది. అసలు సమైఖ్యాంద్ర అర్థం = ఆంధ్రులు సమైఖ్యంగా ఉండాలని వారు "సమైఖ్యాంద్రప్రదేశ్" అని ఉద్యమిస్తే దానికొక నామార్థమైనా ఉండేది.

    సాటి తెలుగు వాడిగా సమైఖ్యాంద్ర వర్ధిల్లాలనే కోరుకుంటున్నా. ఇక ముందు వారిలో వారు భేదించుకుని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అనే పేరుతో పోరాటాలు చేయక ఉందురు గాక అని ఆశిస్తున్నా.

    తెలంగాణా అంతటా నాడు - నేడు - రేపు ఉండేది ఒకటే నినాదం - జై తెలంగాణా

    కొసమెరుపు: ఈ ఉద్యమాల్లో తమ పేరునే కాకా తమ ఉనికినీ కోల్పోయిన రాయలసీమ వారిని చూస్తే నిజంగానే జాలి వేస్తుంది - ఇప్పటికైనా వారు మేలుకొని వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టు కోవటం వల్ల ముందు తరాల రాయలసీమ వాసులన్నా వారిని విమర్శించ కుండా ఉంటుంది. సమైక్యాంద్ర పేరున గొంతెత్తి - రాయలసీమ భవిష్యత్ గురించి తిరిగి గొంతెత్తకుండా చేసుకుంటున్నారు (చేయబడుతున్నారు).

    ReplyDelete

  6. ఇదొక తలతిక్క ఉద్యమం

    కరెక్ట్ గా చెప్పారు ! అట్లా చెప్పండి, తల తిక్క, తల పొగురు దిమ్మ రిగులు ఉద్యమం. ఇట్లా చెబ్తే కాని వీళ్ళకి సమైక్య వాదులకి అర్థం కాదు. ఎక్సెలెంట్ టపా

    జిలేబి

    ReplyDelete
  7. Greatly written

    ReplyDelete
  8. "అసలు విషయం వదిలి కొసరు పట్టుకు వేలాడే వాళ్ళను గూట్లె అంటారు మా వైపు."

    మా వైపు కూడ అలానే అంటారు!

    ఆవేదన వ్యక్తపరుస్తున్నారన్న అసలు విషయం వదిలేసి కొసరు విషయం ఎలా వ్రాసారని (సమైక్య కి సమైఖ్య) కి తేడాలు చూడడం.

    ReplyDelete
  9. మనం చేస్తే ఉద్యమం. ఇతరులు చేస్తే అది ఉద్యమం కాదు.
    దీనినేమంటారు?

    ప్రత్యేక - సమైక్య ఉద్యమాలు రెండూ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో నడుస్తున్న ఉద్యమాలే. ఇద్దరిలో ఎవరైనా ఈ ఉద్యమాలకు బదులుగా, తమ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసుంటే కొంతలో కొంత ఉపయోగం ఉండేది. అది జరిగే పని కాదు. ఎందుకంటే రాజకీయనాయకులకు అటువంటి ఉద్యమాల వలన ఉపయోగం ఉండదు. ఇప్పుడు వచ్చే తెలంగాణ తో బ్రహ్మాండం బ్రద్దలవుతుందని అనుకోవటంలేదు. అసలు ఇప్పుడు వచ్చిన ప్రకటన కూడా పూర్తిగా నమ్మశక్యంగా లేదు. యుపియే వారు తెలుగు ప్రజానీకాన్ని తగవులలో వుంచి ఓట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వలన తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం కన్నా, దీర్ఘ కాలానికి ఆంధ్ర ప్రాంతానికే లాభం. అయితే, తెలంగాణా ప్రాంత ప్రజలు - తెలంగాణ రాజకీయ నాయకుల
    మాయ మాటలు నమ్మి ఎట్లా తెలంగాణ తో బతుకులు మరింత బాగుపడతాయి అనుకుంటున్నారో - ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా హైదరాబాదు పోతే భవిష్యత్తు లేదని బాధపడిపోతున్నారు. తాత్కాలికంగా కొంత నష్టం వుంటే వుండవచ్చు. అలాగే తెలంగాణ తో తాత్కాలిక ప్రయోజనం వుండవచ్చు. "పనిలేక" వారు వ్రాసినట్లు, సామాన్య జీవన స్రవంతిలో పెద్దగా మార్పేమి వుండదు. రెండు చోట్లా. గాని, రెండు ప్రాంతాల ప్రజలు మాత్రం విద్వేషాలతో రగిలిపోతున్నారు. బయటి వారికి చులకన అవుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. సమైక్యాంధ్ర ఉద్యమం నాయకులు మాత్రమే చేసింది కాదు. నాయకులు, మీడియా, కిరాయి మూకలు చేసింది. తెలంగాణలో నాయకులదగ్గర ఉద్యమం చేయించడానికి అధికారంతో దోచుకున్న డబ్బు లేదు, మీడియా బలం లేదు. ఇక్కడ ప్రజలు ఉద్యమం చేస్తే అందులో తప్పనిసరి పరిస్థితిలో ఆఖరుకు తెదెపా, కాంగ్రేస్ నాయకులు కూడా ఇష్టం లేకున్నా కలవాల్సొచ్చింది. కనుక తెలంగాణ ఉయమాన్ని ఈతలతిక్క ఉద్యమంతో పోల్చకూడదని మనవి. ఆసంగతి సోనియమ్మకు తెలుసు గనకే తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో తమపార్టీకి దిక్కుండదు, ఇస్తే సీమాంధ్రలో తేడా ఏమీ ఉండదని తెలిసే తెలంగాణ ఇస్తుంది.

      Delete
    2. Ipudu jarige telangana udyamam lo andaru udyama spoorthy to pani chese, etuvanti rajakeeya prayojanalu leni nayakule antaraa. Andaru naayakulu vaaru tappa inkevaru telangana kosam chitta sudhi tho pani cheyadam ledu ani feel ayyevaare. Vidyardhulaki dabbulicchi godavalu cheyinche vaare. Vidyardhulu kaani vaaru entha mandi viyardhulugaa godavallo cheruthunnaro, amayakulani panam gaa petti ela godavalu chestharo daggara nunchi choosi cheptunna. Ipudu prabhutvam meeda tecchina pressure ee praantha prayojanaala gurinchi mundu enduku teleka poyaaru. Rajasekhar reddy unnanni rojulu 7 years gaa kcr gaaru aamarana nirahaara deeksha enduku cheyaledu. Kevalam telangana pranta nayakula swardham valla, ikkada avasaram unna prajalaki nyayam jaragaledu. Telangana ivvadaaniki vyatirekam kaadu, kanee telangana vachinaa prajalaki entha varaku manchi jarugutundi anedi anumanaspadame. Rajakeeya nayakulu, kontha mandi vidyarthulu, prabhutvojyogulu kaaka migilina samanya prajallo etuvanti baleeyamaina abhiprayalu kanapadadam ledu. Prajalaki manchi jarigithe manchide, kaanee raajakeeya visha valayam valla prajalaki nashtame migilithe, adi kolukoleni debbe avtundi. Ee mottam godavallo samanyudu balipasuvu avakoodadu.

      Delete
  10. vitthanam paathi, pedda chesina tarvatha, pandlu kase timelo meekivvala?

    ReplyDelete
  11. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు ఉద్యమాలు ఎపుడూ పెట్టుడు ఉద్యమాల్లాగే కనిపిస్తాయి. అందుచేత సమైక్య ఉద్యమం తల తిక్క ఉద్యమం అయితే తెలంగాణ ఉద్యమం కూడా తలతిక్కదే. లేక తెలంగాణా ఉద్యమం తలతిక్కదైతే ఇపుడు జరుగుతున్నదీ తలతిక్క ఉద్యమమే. సోనియమ్మ సై అన్నది తెలంగాణ డిమాండ్లలో న్యాయం ఉందనే ఉద్దేశ్యం తో కాదు, తనకి లాభం వస్తుంది అని. అటువంటపుడు తెలంగాణేతరులు (దేశం లో మిగతా డిమాండ్లతో సహా) కూడా తమ సత్తా చూపించాలనుకోవటం సహజం. మీకు తల తిక్క అనిపించినంత మాత్రాన వాళ్ళు ఆగుతారా? మీరేనా తలతిక్క చూపించేది? వారు చూపించలేరా?

    ReplyDelete
  12. @విశ్వరూప్

    నిజమే డబ్బులు తీసికొని వచ్చి ఉండొచ్చు . అది రాజకీయ పార్టీల అవసరం మేరకు జరిగినపుడు , వాళ్ళని ఏమైనా అనొఛ్చు కాని, జనాన్ని కిరాయి మూకలు అనడం చాలా తప్పు . వాళ్ళెవరూ మీ జనాల్ని నిందించడం లేదు ,అది గమనించారా ? కేవలం పార్టీ అభిమానం తప్ప వాళ్ళకీ రాజకీయాలు తెలియవ్. దయచేసి ఆంధ్ర జనాలని హేళన చెయ్యకండి.

    ReplyDelete
  13. Do not worry brothers..nothing will happen in a movement. I do not understand if we two states of telugu speaking. Now we have only developed city HYderabad, tomorrow we will have one more city will help for next generation. Immediately we must loose something but in long way definitely it will use full. Do not blindly come into politically leaders stunts. Now separation is cong stand, then they why cannot they resign for party. What use the submitting resignation and still enjoy government car, building and security these all are dramas. Please as common public try understand the truth.

    ReplyDelete

Your comment will be published after the approval.