Thursday, 17 October 2013

సద్దుమణిగిన సమైక్యాంధ్ర, జాడలేని సీమాంద్ర్హ హక్కుల చర్చ



పెట్టుడు ఉద్యమాలు ఎన్నాల్లని ఉంటాయి? పెట్టుబడి పెట్టేవాడు మానగానే అవీ మాయమవుతాయి. సమైక్యాంధ్ర ఆందోళనల పరిస్థితీ ప్రస్థుతం అదే. ఎక్కడా ధర్ణాలు లేవు, బహిరంగ సభలు లేవు, లక్ష(?)ఘళఘోషలు లేవు. ఉద్యోగస్థులందరూ మెల్లమెల్లగా డ్యూటీల్లో చేరుతున్నారు. ప్రభుత్వంలో విలీనం హామీతో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి.

మొన్నటిదాకా ఈనాడు పేపరు వాడు ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ ఏదో బ్యానరు పెట్టి గడ్డి తినేవాళ్ళ ఫోటోలు, ఈకలు పీకేవారిఫోటోలూ పెట్టేవాడు.ఇప్పుడదీ బందయింది. సీమాంధ్ర ఛానెళ్ళు పోటీలు పడి చిన్న చిన్న ఆందోళనల క్లిప్పింగులు రోజంతా రిపీట్ చేసేవారు. వారూ మానేశారు.

పోటీలు పడి నిరాహారదీక్షలు జేసిన పెద్దలు ఇంట్లో గూర్చుని ఇప్పుడు నీది దొంగ దీక్ష అంటే నీది దొంగ దీక్ష అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరివీ దొంగదీక్షలని తెలిసిన ప్రజలు ఇవి అసలు పట్టించుకోవడం లేదు.

నేను రాజీనామా చేశానంటే నేనూ చేశానని ప్రకటించుకున్న ఎంపీలూ, మంత్రులూ ఇంతవరకు వారి రాజీనామా పత్రాలు ఎందుకు ఆమోదించబడలేదో చెప్పడం లేదు.

బడిపిల్లలు ఎండలో కూర్చున్న ఫోటోలను ఫేస్బుక్కుల్లో షేర్ చేసుకుని సోషల్ నెట్‌వర్కర్లు మురిసిపోయేవారు కూడా ఇప్పుడు కొత్తఫోటోలు లేక మానేశారు.

అయినా ఇంకా సీమాంధ్ర నేతలు మాత్రం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తెలంగాణనాపుతారు అని ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప వాస్తవాలను ఒప్పుకుని ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలపై చర్చించడం లేదు. సీమాంధ్రకు రాజధాని విషయంపై గానీ, నీటివాటాల విషయంపై గానీ, ఉద్యోగుల హక్కులవిషయంపై గానీ చర్చలేదు. సీమాంధ్ర నేటల ఈప్రవర్తన వలన నష్టపోతుంది సీమాంధ్ర సామాన్యుడే.


4 comments:

  1. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయం ఎందుకు చర్చకు రావడం లేదో అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. మా ఊరంటే మా ఊరని కొట్టుకు చస్తారు.

    ఈ గొడవలేవో విభజన జరిగాక మొదలు పెట్టి చివరికి అందరికీ అమోదయోగ్యమంటూ హైదరాబాదు మీద పడడం ఉత్తమం. ఇదీ వీరి దురుద్దేశ్యం.

    ReplyDelete
  2. Exactly.

    Just like how common man in Telangana is suffering because of T-leaders, common man in the rest of India is also suffering because of Congress.

    Mr. Vishwaroop, how does the new state benefit you? What have you lost by staying in United Andhra?

    ReplyDelete
  3. అబ్బ ఛా!

    విశ్వరూపూ! తెలంగాణ ప్రక్రియకూడా వెనక్కు వెళ్ళిపోయిందంటున్నారేమిటి, నిజమేనా!

    ReplyDelete
  4. ఆంధ్ర ప్రదేశ్ విభజన అనివార్యం!తెలంగాణా రాష్ట్ర వేర్పాటు ఒక వాస్తవం!సీమాంధ్ర నాయకులు వాస్తవాలను మభ్యపెట్టడం ఆపి నిజాలు మాట్లాడి ప్రజలకు కావలసిందేమిటో తేల్చుకొని కేంద్రపెద్దలతో చర్చించడం మంచిది!అదే తక్షణ కర్తవ్యం!

    ReplyDelete

Your comment will be published after the approval.