Thursday, 3 October 2013

నాటికీ నేటికీ తేడా!



డిసెంబరు 9 2009రోజు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న యూపీయే ప్రభుత్వం మానాయకుల తడాఖాతో  రెండువారాల్లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, ఈసారికూడా అలాగే తీసుకోదా అని కొందరు సమైక్యవాదులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారలా చూస్తుండగానే ఈసారి చకచకా తెలంగాణ ఏర్పాటు ముందుకు సాగుతుంది. ఇంతకీ నాటికీ నేటికీ తేడా ఏమిటి అని చూస్తే చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఒకే డ్రామా మళ్ళీ మళ్ళీ చేస్తే రక్తి కట్టదు.

2. అప్పుడు ఎన్నికలు అంత త్వరలో లేవు కనుక నేతలు రాజకీయప్రయోజనాలు పక్కనపెట్టి తమ ఆర్ధిక, భూదాహ ప్రయోజనాలకోసం తెలంగాణను అడ్డుకోవడం కోసం అన్నిపార్టీలూ కలిసి పనిచేశారు. ఈసారి ఇంకోసంవత్సరంలొ ఎన్నికలుండగా అలా చేయడం కష్టం. పైగా పార్టీలు తామే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామంటే తామేనని పోటీపడుతున్నాయి.

3. అప్పుడు కేంద్రం ముందే జరిగే పరిణామాలను ఊహించలేదు, ఈసారి ఊహించి అందుకు ప్రిపేర్ అయి ఉంది.

4. తెలంగాణ ఇస్తేనే అన్ని రాజకీయపార్టీలకూ లాభం. ప్రతిపక్షాలు కూడా తాము చేసే ఆందోళనలు విభజన ఆపడానికి కాక సీమాంధ్రకు ఎలా ఛాంపియన్ అవాలి అనే దానిపైనే దృష్టి పెట్టాయి.

4 comments:

  1. ధర్మమేవ జయతే!
    జై తెలంగాణ!

    ReplyDelete
  2. >>ఈసారి ఊహించి అందుకు ప్రిపేర్ అయి ఉంది.

    ప్రిపేర్ అవ్వటమే కాదు, వీళ్ళకు చుక్కలు చూపించే స్రీన్ ప్లే నడిపిస్తున్నది.

    ఇన్నాళ్ళు ఏ ప్యాకేజి కోసమో ఇంకో దానికో ఉద్యమం చేస్తే ఏదో పనికొచ్చేది, ఇప్పుడంతా వృధా అయ్యింది. పోనీ ఇప్పుడు అడుగుదాం అంటే అలరెడి జనాలకు మైండు బ్లాక్ అయ్యి ఓపిక నశించి ఉంటది.

    ఎందుకొచ్చిన గొడవ, హప్పిగా 'అత్తారింటికి దారేది' సినిమా చూసుకోక ...

    ReplyDelete
  3. ఇన్నాళ్ళు చేసిన ఉద్యమంలో ఏవయినా ఇతర డిమాండ్లు పెట్టి ఉంటె కాస్త చిల్లరయినా పడేసుండే వాళ్ళు. ఇప్పుడు అంతా పాయె!!

    ReplyDelete
  4. Jai telangana.... mee andhrari porataala palithame e telangana.. mee kandhariki hatss off.

    evariki veelina reethilo vaalu porataalu chesaaru.

    mee lanti vaaru nternet lo mana telanganaki full support ichharu.

    mee andhariki hats off..

    plz andharu ee vidanga poratamu chesina mana migitha sulandhirini encourage cheyyandi. vallaki kruthhhhhhhhhhhhhhhhhhhalu telupandi.

    valalu enni avamaadhurkunnaro.. enni kastallu paddaro.. enni boothulu chadivaaro. eenni bedirinpu comments chusaaro oka pouridigaa nenu arthamu chesukogalanu.

    thanks annaaa..

    keep it up.

    hats of to u..

    jai telanganaaa...

    ReplyDelete

Your comment will be published after the approval.