గత రెండురోజుల్లో రెండు పెద్ద రోడ్డుప్రమాదాలు ప్రధానవార్తలయ్యాయి. ఒకటి ఔటర్ రింగ్‌రోడ్ మీద డీసీఎం ట్రక్కును ఢీకొన్న ప్రమాదమయితే మరొకటి వోల్వో బస్సు దగ్ధం.
వోల్వో బస్సులు గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెల్లినా బ్యాలన్స్ తప్పవు, ప్రయాణీకులకు కుదుపులుండవు కనుక వేగంగా పోతుందని భయం ఉండదు. అయితే ఈవోల్వో బస్సులు డిజైన్ చేసింది ఫారిన్ రోడ్లను దృష్టిలో పెట్టుకొని. అక్కడి రోడ్లపై గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళీనా ప్రమాదాలు జరగవు. అయితే మన డ్రైవర్లు మన డొక్కురోడ్లపై కూడా వోల్వో దొరికింది గదా అని అదే స్పీడుతో వెలుతుంటారు. కానీ మన రోడ్లు అంత వేగంతో వెళ్ళడానికి అనుకూలంగా ఉండవు. ఎప్పుడు రోడ్డుపై ఏ కుక్క వస్తుందో, మేకలగుంపు వస్తుందో, పశువులు వస్తాయో తెలియని పరిస్థితి. రోడ్లకు ఆనుకునే ఊర్లు ఉంటాయి. హైవేలపై అప్పుడప్పుడూ చిన్నపిల్లలు ఆడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో నూటనలభైపై వెలుతున్న బస్సుకు సడన్‌గా ఏదైనా అడ్డువస్తే కంట్రోల్ చేయడం కష్టం. బహుషా వోల్వోలకు మన రోడ్లపై స్పీడ్ లాక్ చేయాల్సిన అవసరం ఉందేమో.
రెండోప్రమాదం జరిగిన ఔటర్ రింగ్ రోడ్డు ఫారిన్ రోడ్లకు ఏమాత్రం తీసిపోనిది. నాలుగు లేన్లతో కూడిన ఈ చక్కటిరోడ్డుపై స్పీడుగా వెల్లినా ప్రమాదాలు జరగగూడదు. కానీ అంత వేగంతో వెల్లడానికి అవసరమయిన రక్షణ వ్యవస్థ, సిగ్నలింగ్ సిస్టం లేని వాహనాలు కూడా ఈరోడ్డుపై వెలతాయి. ఇలాంటి వాహనాలు కూడా రోడ్డు బాగుంది కదా అని అంతే వేగంతో వెలతాయి. రోడ్డు మధ్యన ఆగిన ట్రక్కువాడు ఎమర్జెన్సీ బ్లింకర్ వేయకపోవడం ఒక తప్పు అయితే డీసీఎం అదుపు చేయలేనంత వేగంగా రావడం మరో తప్పు.
ఏతా వాతా తేలేదేమంటే వేగంగా వెళ్ళడానికి మంచి వాహనం, మంచి రోడ్డు రెండూ అవసరం. ఏదో ఒకటి ఉంది కదా అని స్పీడు పెంచితే పరిస్థితి ఇదే అవుతుంది.
చాలా ప్రైవేట్ బస్సులలో ప్రయాణీకుల సెక్షన్ కి డ్రైవర్ సెక్షన్ కి మధ్య ఒక తలుపు అమర్చి ఉంటుంది. దాని ప్రయోజనం ఏమిటో తెలియదు. బస్ బయలుదేరగానే ఈ తలుపుని బయటనుంచి గొళ్ళెం పెట్టేసి ప్రయాణీకుల్ని లోపల బంధించి ఉంచుతారు. అలా చెయ్యటానికి కారణం ఏమిటో కూడా తెలియదు (నాకు తెలియదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పగలరు). ఏదైనా ఏక్సిడెంట్ జరిగినప్పుడు గాని, మరేదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గాని ప్రయాణీకులు ఈ మూసిన తలుపు వెనక ఇరుక్కు పోయి బయటకు రాలేని పరిస్ధితి ఏర్పడుతుంది. అందులోనూ ఆ క్లీనరు, డ్రైవరూ ఆ తలుపు గొళ్ళెం తియ్యకుండా ప్రయాణీకుల్ని వాళ్ళ ఖర్మకి ఒదిలి దూకేసి పారిపోతే ఇక ప్రయాణీకుల భద్రత మరింత విషమంగా తయారవుతుంది. ప్రయాణీకుల్ని లోపల బందీలుగా చేసే ఇటువంటి తలుపు అసలు బస్సులో ఫిక్స్ చెయ్యకుండా RTO వారు గాని, Police వారు గాని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
ReplyDeleteChaala matuku Ac bus lalo ilanti thalupulu untaayi. deeni ee krindhi kaaranaalu.
Delete1. Driver window teesinaa... ac waste gaa bayatiki pokundaa undadaaniki.
2. Driver window teeyakundaa drive chesthe.. nidhra vachhe avkashaalu ekkuvaa. andhuke chaala mandhi drivers vaari side window koddigaa open chesukuntaaru. lekapothe matthu vasthundhi.
3. kontha mandhi drivers utsahamu raavadaaniki poga thhagu thaaru ( alsata teeradaaniki).. so aa vasana prayanikulaku teliyakunda undaadaaniki.
4. and vallu drive chesetappudu gatigaa matladuthu untaaru.. avi loplaiki vinapadakundaaa.
5. ippudu vacche volvi and benz baus lalo ilantii dorr fecilities levu.
మీ వివరణకు థాంక్స్ మధుబాబు గారు. చాలా ఓపికగా వివరించారు.
Deleteమీరు చెప్పిన కారణాలు ఎంత సహేతుకంగా ఉన్నట్లనిపించినా, నా అభిప్రాయంలో మాత్రం ఆ తలుపు అక్కడ ఉండకూడదు. డ్రైవర్కి నిద్ర వస్తుందనో, అతనికి గాలి కావాలనో ప్రయాణికుల్నందరినీ బంధించి ఉంచుతామనటం సమ్మతం కాదు. అదే గనక ప్రోబ్లం అయితే - డ్రైవర్ సీట్ చుట్టూ మాత్రం చిన్న కాబిన్ కడితే సరిపోతుంది గదా. ఆ కాబిన్ లో కూర్చుని డ్రైవరూ క్లీనరూ కబుర్లు చెప్పుకోవచ్చు, డ్రైవర్ తన కిటికీ ఒక్కటే తెరిచిపెట్టుకోవచ్చు,సిగరెట్ కాల్చుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అలా చేసే బదులు మొత్తం ప్రయాణికులందర్నీ బంధించి ఉంచుతామనటం సరి కాదు. ఆ తలుపు అక్కడ ఉంటే ఆపదలో ప్రయాణీకుల ఎస్కేప్ రూట్ కి అడ్డమే అనటంలో ఏమీ సందేహం లేదు.
(నిన్న దగ్ధమైన బస్ లో ఇటువంటి తలుపు ఉందో లేదో నాకు తెలియదు. ఈ తలుపు ఉండుంటే మాత్రం జరిగిన ప్రయాణీకుల ప్రాణ నష్టంలో దీని పాత్ర కూడా ఎంతో కొంత ఉండుండవచ్చేమో.)
నాకు తోస్తున్న మరొక జాగ్రత్త - బస్ నడుస్తున్నప్పుడు ఎంట్రీ డోర్ మూసి మాత్రమే ఉంచాలి గాని ఆటోమాటిక్ లాక్ చెయ్యకూడదు. సేఫ్టీ కోసం లోపల చేత్తో వేసి తీసే గొళ్ళెం ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇటువంటివో ఇంకా మంచివో శాశ్వత నివారణలేమన్నా ఆలోచించాలి గాని, ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వ విభాగాలు చేసే ఆ మూడు నాలుగు రోజుల హడావుడి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఎక్కువ ఉండదని నా నమ్మకం.
నిజం చెప్పారు విశ్వరూప్ గారూ! ప్రమాదాలకు రోడ్లూ, మోటార్లూ కారణమైనా, వాటి సామర్థ్య పర్యవేక్షకులు తగిన శ్రద్ధ చూపకపోవడం, లంచాలకు దాసోహమనడం కూడా కారణమే. వ్యక్తిగత సంపాదనకు మరిగి, ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకులయ్యారు. ఇదంతా మన ఖర్మే. ఎందుకంటే, మన పాలకులు అసమర్థులైనపుడు, అధికారులు కూడా అలాగే తయారవుతారు. "యథా రాజా, తథా ప్రజా" ! మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పాలకులు మారినపుడు, అధికారుల్లో మార్పు తప్పక వస్తుంది. అలాంటి రోజుకై ఎదురుచూద్దాం. స్వస్తి.
ReplyDeleteNenu first time comment cheyyadam blogs loo....But I can't resist after reading your comment.
DeleteDheeniki kuda Telangana link pettaara.....!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మధుసూదన్ గారూ,
Deleteఈవిషయంపై నేను మీతో విభేదిస్తున్నాను. మనరాష్ట్రం వచ్చినతరువాత అవినీతి పోవాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ, నాఉద్దేషంలో తెలంగాణ వచ్చినతరువాత కూడా అధికారుల, పాలకుల అవినీతిలో పెద్దగా తేడా ఉండదు. కానీ ప్రాంతీయ వివక్ష, వనరుల దోపిడీ అంతమవుతాయి. ఒకప్రాంతంవారి హక్కులను కాలరాసి మరోప్రాంతం వారిని నెత్తికెక్కించుకోవడం ఆగిపోతుంది.
:)
Delete:)
:)
:)
:)
Naaku telugu typing antha gaa raadhu. dayachesi e post ni evarinaa prachurincha galaru.
ReplyDeleteE pramadhamu lo ok nyamurthy thana kuthurini pogottukunnaru. idi entho baadha kaliginche vishyamu.
AA nyayamurthy ( devudiki) naa vinnapamu.
dayachesi athanu e case ni court lo veyyagalaru.
" Daya chesi mruthi chendina vaariki pariharamu govt tharapuna chellincha kudadhu"
endhukantee.. ivani manamu chesina thappulee.. andharu chaduvukuna vallame... bus lo unnavallau andharu sw engineers..
1. Asalu bus lo okkade driver unnadu ani telisina bus endhuku kadalanichharu. evvaru okkarinaa e question adigaaraa.
2. bus lo 3 seats ki okka sutthe lenappudu endhuku objection cheppaledhu. avi untene meemu bus kadilinsthamani cheppithe.. andhari future baagundedhi kadhaa.
3. madhyalo vere prayanikulani ekisthunte endhuku okkaru kuda matladaledhu. objection cheppaledhu.. ( maaknedhuku lee ane nirlakshyamu). ippudu ade nirlakshyamu pranaalu teesindhi.
4. bus ekkaa.. meeku ac bus volvo door ela teruvaalo telusaa.. eppudinaa e driver ainaa emergency situations lo emi cheyyalo.. chepparaaa.
5. Bus speed gaa pothunnatlu anpinchinappudu evvarinaa objection endhuku cheppaledhu. oka ganta thondaraga veladhamani chustheee antha lokanne vidichi vellaru.
6. pryanikula perulu raase sheet lo name.. address number raayamantaaru .( number ante emergency situation lo contact number raayaru. valla fancy numers raastharu)
6. enni saarlu meetho travels vaalu niralkshyamugaa pravartinchaaru.. evvarinaa adige vallku support gaa unnaraa..
7. shirdi pramadhamu tharuvatha ilane oka varamu hadavudi chesi.. malli marichipoyaaru.. i know.. agan same incident wil happen agaian..
inkaa ila chaala unnayi.
gauravaneeyulina nyamurthy gaaru. govt ichhe 15lakhs meeku kuthuru .. inkaa puttaboye manmado/manumaraalo kante ekkuva kaadhua.. but andhari kosamu poraadandi.
inni thappulaaaa..
andharu.. chinna pillalu.. youth.. manchi bavishyatthu unnvaaallu.. vallaku pariharamu kaadhu nyamau kaavali.
type chesthunte kandalo neellu vasthunnayi.
plzz... poradandi.. inka enallu..
nenu edo congress ki telugudeshamu.. ko telanganaki. samikhyandra ki poradamntelshu.. ee vishyamu meedha nyamau kaavali..
inka ennnallu.
@Madhubabu
DeleteTyping in telugu is easy. 'Try www.lekhini.org
మన దేశంలో ఇంచుమించు అన్ని వ్యవస్థలూ (ముఖ్యంగా అన్ ఆర్గనైజడ్ సెక్టార్) UNPROFESSIONAL గానే ఉన్నాయి.
ReplyDeleteఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోస్ట్ మార్టం చెయ్యడం, ఎవరినో కొంతమందిని బలి పశువులు చెయ్యడం తప్ప వ్యవస్థలని బాగు చేసే పని ఇంతవరకూ మొదలవ్వలేదు.
good one. తెలంగాణా - ఆంధ్రా అని దీనికి పొంతన పెట్టలేము. అవినీతికి ఏ రాష్ట్రమైనా ఒక్కటే. ప్రజలలో చైతన్యం పెంచడం - ప్రజా రవాణాను భద్రతగా నిర్వహించే నమూనాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి బాగున్నాయో చూసి ఆ విధమైన ఏర్పాట్లు చేయడం. రోడ్లపై ట్రాక్టర్లు గేదెలు పిల్లలు ఇష్టమొచ్చినట్లు విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు ఉండడాన్ని రైతులకు విలువనివ్వడం అంటూ అతిగా ఉపేక్ష వహించడం కూడా తప్పే. అందరిలో రోడ్ సెన్స్ నేర్పాలి. డ్రైవింగు లైసెన్సులు ఎవడిబడితే వాడికి ఎలా పడితే అలా ఇచ్చేయడం మానాలి. రోడ్డు భద్రతా అవగాహనా కార్యక్రమాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలి.
ReplyDelete