Wednesday, 3 August 2011

సమైక్య బ్రాండు ప్రశాంత(?) బందు


ఈమధ్యన రెండుకల్లబాబు డైరెక్షన్లో సీమాంధ్ర తెదేపా కడప జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా బందుకు పిలుపునిచ్చింది. సమైక్యాంధ్రకోసం బందు ఒక్క కడపలో మాత్రం ఎందుకో అర్ధం కాకపోవడం ఒక విషయమైతే ఇక్కడ తెలుగు తమ్ముల్లు చాలా శంతియుతంగా దౌర్జన్యాలు చేసి మరీ బందుకార్యక్రమం జరిపించడం అసలు విశేషం.

బందు విజయవంతమయిందని చెప్పుకోవడం కోసం బస్ స్టేషన్, రీజియన్ మెడికల్ ఆఫీసుల్లోకి దూరి ఫర్నీచర్ ధ్వంసం చేశారు, దుకాణదారులపై తమ అంగబలం ప్రదర్శించారు. కనీసం ఆటొ డ్రవర్లను, కూరగాయల బండ్ల వోనర్లను కూడా వదల్లేదీ సిగ్గులేని నేతలు. వీరి బందు విశేషాలు కింద ఫోటోల్లో చూడవచ్చు.
పొరపాటున పొట్టకూటికోసం ఆటో నడిపిన పాపానికి

ఆటోపై బలప్రదర్శన

ఆటో ఓనరుపై టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి దౌర్జన్యం

కూరగాయల బండిమీద ఆగ్రహం

బడిపిల్లలను కూడా వదల్లేదు

వైన్ షాపుపై దాడి

పెట్రోల్ బంకుపై దౌర్జన్యం

5 comments:

 1. సమైక్యాంధ్ర నినాదమే హాస్యాస్పదం!
  అమైక్యాంధ్ర అంటే ఆంద్ర ప్రాంతం సమైక్యం గా ఉండాలనే కదా.
  ఆంద్ర అంటే ఒకప్పటి ఆంద్ర రాష్ట్రమే.
  ఆనాటి ఆంద్ర రాష్ట్రాన్నీ తెలంగాణా ను కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు.
  జై సమైక్యాంధ్ర ప్రదేశ్ అని నినదిస్తే అర్ధం వుంటుంది కానీ
  సమైక్యాంధ్ర ఏమిటి సమైక్యాంధ్ర
  నినాదంలోనూ తెలంగాణా పట్ల చిన్న చూపే !
  మా రాష్రం మాకు కావాలి మా బతుకు మేం బతుకుతామని ఈ తోడేళ్ళతో కలసి ఉండలేం
  ఇంకా ఈ అన్యాయాలను సహించ లేం అని తెలంగాణా ప్రజలంతా ముక్త కంఠం తో నినదిస్తుంటే
  ఈ సమైక్య ఊళలు, గోలలు, బందులు ఏమిటో ! ఎందుకో, ఎన్నాళ్ళో
  ఖాండ్రించి ఉమ్ముతున్నా కలసి ఉంటా మనే పౌరుష హీన మైన జాతి ప్రపంచం మొత్తం లో ఆంద్ర జాతి ఒక్కటే నేమో.

  ReplyDelete
 2. ive panulu telangana lo TRS vallu cheste....adi udyamam hahahahaah

  ReplyDelete
 3. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దండి. తెలంగాణా సానుభూతిపరులు చేసిన బందులోమాత్రం ఇలాంటివే ఘట్టాలు చోటుచేసుకోలేదూ. ప్రస్తుతానికి శాంతియుతంగా బందు అనేది ఒక oxymoron. నిరసన తెలిపేందుకు బందులు చేయడం ఏమాత్రం ప్రజాస్వామికమో నాకిప్పటికీ అర్ధంకాలేదు. ముందు వీటిపై నిషేధం రావాలి.

  ReplyDelete
 4. @2nd Anonymous & Indian Minerva:

  ఇవే పనులు తెలంగాణ ఉద్యమకారులు చేసి ఉంటే మన తెలుగు ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా, మన తెలుగు బ్లాగరులు, మన విష-అంధ మహాసభ అన్నీ ఈ విషయాలను ఇంతింత పెద్దగా చూపించి తిట్టిపోసేది, మన టీవీ చానెల్లు అరగంటకోసారి ఇవే సన్నివేశాలు చూపించి మరీ తిట్టిపోసేవారు, బ్లాగుల్లో ఎవరైనా రాస్తే మీరే అక్కడే తెలంగాణ ఉద్యమాన్ని తిడుతూ కామెంట్లు చేశేవారు.

  అలా ఎదుటివారిని అదేపనిగా వెక్కిరించేవారికి వారి బందులు ఎలా అవుతున్నాయో చూపించడమే ఈటపా ఉద్దేషం.

  ReplyDelete
 5. లేదండీ... నేను అన్నిబందులకూ వ్యతిరేకిని. నేను దీన్నీ వ్యతిరేకిస్తాను అదేవిధంగా తెలంగాణా వారి బందునూ వ్యతిరేకిస్తాను. ఆమాటకొస్తే "నా" ఇబ్బందులను పట్టించుకోని దేన్నైనా వ్యతిరేకిస్తాను,

  ReplyDelete

Your comment will be published after the approval.