Saturday, 13 August 2011

ఔను, ఓరిస్తే ఎక్కడయినా ఓరుగల్లు ఢిల్లీ అవుతుందా?

ఈమధ్యన మన బ్లాగ్మేధావి తెలుగుభాషాదురభిమాని గారు ఒక టపాలో ఓరిస్తే ఓరుగల్లు ఢిల్లీ అవుతుందా అంటూ గొప్ప సత్యం చెప్పడం నాకల్లబడింది. నిజమేనండీ తెలుగుభాషాదురభిమానిగారూ. ఎక్కడయినా ఓరిస్తే ఓరుగల్లు ఢిల్లీ అవుతుందా, కరిస్తే కర్నూలు హైదరాబాదు అవుతుందా? మీరు చెప్పిన ఈసత్యాన్ని హైదరాబాద్ మావల్లే డెవలప్ అయిందీ, మేమొచ్చే దీన్ని డెవలప్ చేశాము, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది కనుకనే ఇంత అభివృద్ధి చెందింది లేకపోతే మాకర్నూలు హైదరాబాద్ కంటే ఎక్కువ అభివృద్ధి చెంది ఉండేది అని అనేవారు తెలుసుకోవాలి. ఎంత కరిచినా కర్నూలు మీరాజధానిగా ఉంటే ఇంచుమించు ఇప్పటిలాగే ఉండేది, కాకపోతే టెంటుల్లో ఉన్న సెక్రటేరియటూ, అసెంబ్లీ కాస్తా ఏదో ఒక బిల్డింగు కిందికి వచ్చి ఉండేవేమో! అంతే కదా? మర్రిచెట్టుకింద పెరిగితే ఉమ్మెత్తమొక్క పెరుగుద్దేమో కానీ మరో రావి చెట్టుపెరగదు కదా?

ఇదే సందర్భంగా మన తెలుగుభాషా దురభిమాని మరో విషయం చెప్పాడు, అడుక్కుతినేవారికి నిర్దేషించే హక్కు ఉండదట (beggars can't be choosers!!). ఈవిషయంలో మాత్రం నేను మీతో అంగీకరించడం లేదండీ, ఈమధ్యన అడుక్కునే వారు కూడా అధికారం చెలాయిస్తున్నారు..పోకిరీ సినిమా చూశారు కదా, బెగ్గర్స్ మాఫియా గురించి తెలుసుకునే ఉంటారు. అలాగే మనరాష్ట్రంలో కూడా తమకు రాజధానిలేక టెంట్లలో అసెంబ్లీలు నడుపుకునేవారు రాజధానికోసం కలిసిఉందామని మమ్మల్ని అడుక్కున్నవారు తరువాత ఈనగరం మాదే అంటూ మామీదే అధికారం చెలాయిస్తున్నారు చూశారు కదా? మీడెఫినిషన్ ప్రకారం తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నవారు అడుక్కునేవారయితే అలా ఈదేశంలోనేమొట్టమొదలు అడుక్కోవడం మొదలు పెట్టిన ఘనత తమదేనని తెలుసుకోండి. ఆతరువాత జీతాలివ్వడానికి డబ్బుల్లేక, అసెంబ్లీ డేరాల్లో నడుపుకోలేక మీఅవసరంకోసం కలిసుందామని అడుక్కున్న ఘనతా మీదేనని తెలుసుకోండి.

మరో సామెత మీరు మరిచినట్టున్నారు. అడుక్కునేవారికి అరవైనాలుగు కూరలట. అలాగే కొందరు అడుక్కునేవారికి సొంతగా ఒక మహానగరం ఉండదు కానీ మద్రాసు మాదేనంటారు, హైదరాబాదు మాదేనంటారు. అలాగే పరాన్నభుక్కులకు సొంతగుండెకాయలుండవు, పక్కవారి గుండెకాయలనే తమగుండెకాయలనుకుంటాయి.

(గమనిక: ఈటపా కొందరు అహంకారులకు సమాధానం చెప్పడానికే తప్ప ఎవరినీ కించపరచడం కాదనీ, ప్రత్యేక రాష్ట్రం కావాలనుకోవడం రాజ్యాంగబద్దమయిన డిమాండు కనుక మద్రాసు నుండి ఆంధ్ర వేవడడాన్ని గానీ ప్రస్తుత సమైక్య రాష్ట్రం నుండీ తెలంగాణ వేరు పడాలనుకోవడం కానీ అడుక్కోవడం కాదనీ మనవి.)

3 comments:

  1. శభాష్, భలే కొట్టావు.

    నోటిపట్టని మాటలంటున్నాడు, ఈ అహంకారి ..వీణ్ణి ఇలా వదిలేయకూడదు. నికృష్టంగా ప్రవర్తిస్తున్నాడు. ఉచ్చ నీచాలు మరచి మాట్లాడుతున్నాడు.

    ReplyDelete
  2. Please provide that blog url or give hint atleast

    ReplyDelete
  3. @Anon 2

    I have now added the link for the original post in the first para, please check.

    ReplyDelete

Your comment will be published after the approval.