Saturday, 28 May 2011

సమైక్యవాదం అంటే? (విశాలాంధ్ర వారి రాతల్లో)

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బృహత్తర మహాశయంతో ఈమధ్యన పరకాల ప్రభాకర్ అధ్వర్యంలో ఒక వెబ్ సైటు, బ్లాగు వెలిసాయి. సమైక్యవాదం గురించి వారు ఈమధ్యన విపరీతంగా రాతలు గుప్పిస్తున్నారు. మరి వారి సమైక్యవాదానికి అర్ధం ఏమిటో వారి టపాల వారు చెప్పే విషయాల అధారంగా చూద్దాం:
1) రాష్ట్రాన్ని ఇప్పటిలాగే ఎప్పటికీ కలిపే ఉంచాలి. మీకిష్టం ఉన్నా లేకపోయినా మా సొంత లాభం కొరకు మీరు  మాతో చచ్చినట్టు కలిసి ఉండాల్సిందే (లేదంటే ఊరుకునేది లేదు). మాకిష్టం లేకపోతే ఎందుకు కలిసి ఉండాలి అంటారా.. ఫలానా కుతుబ్ షాహి కాలంలో మనం కలిసే ఉన్నాం కనుక ఇకముందు అనంతకాలం వరకూ కలిసే ఉండాలంతే.
2) సహజంగా నీళ్ళు ఎప్పుడూ కిందికే ప్రవహిస్తాయి కనుక డెల్టా ప్రాంతానికి నీరొస్తున్నాయి, లక్ష సంవత్సరాల క్రితం కూడా డెల్టాకే నీల్లొచ్చాయి కనుక ఇప్పుడూ వస్తాయి, ఇకముందుకూడా తెలంగాణాకు వాటా ఇచ్చేది లేదు. సాగునీల్ల విషయంలో తెలంగాణాకేం అన్యాయం జరుగలేదు, అంతా ప్రకృతి ధర్మం ప్రకారం జరుగుతుంది.
బలవంతుడు బలహీనుడిని దోచుకోవడం కూడా డార్విన్ సిద్ధాంతంలోని survival of the fittest సూత్రం ప్రకారం జరుగుతుంది కనుక తెలంగాణ వనరులు దోపిడీకి గురయితే అది ప్రకృతి సిద్ధాంతమే కనుక మీరు దాన్ని దోపిడీ అనడానికి వీల్లేదు.
3) మా లగడపాటి మీ తెలంగాణా బంజరుభూములపై, కొండలూ,చెరువులు, గుల్లూ స్మశానాలూ, వక్ఫ్ భూములపై  అందమయిన భవంతులు కడుతుంటే చూడండి మీ విమలక్క వచ్చి దౌర్జన్యంగా జెండాలు పాతింది? మీ తెలంగాణ ఉద్యమకారులే మాఅంధ్రా వ్యాపారుల ఆస్థులు దోచుకుంటున్నారు.
ఇలాంటివే ఇంకా మరెన్నో.ఇంత అసహజమయిన తర్కానికి అందని వాదనలెందుకంటారా? మరి వారి అబద్ధపు వాదనను సమర్ధించుకోవడానికి హేతుబద్దమయిన వాదనలు దొరకవు.

45 comments:

  1. మీ బొగ్గు మీరే వుంచుకోండి.. ఎగుమతి చేయకండి.. మీ భూవుల్లో పండిన పంట(?) తోనే బతకండి (ఇతర ప్రాంతాల నుండి వచ్చినవేవీ తినకండి)

    ReplyDelete
  2. వోలేటి గారు, ఎందుకలా చెయ్యాలి?

    ReplyDelete
  3. డార్విన్ సిద్ధాంతంలోని survival of the fittest అంటే ఏమిటి? పాములకి ఆహారం దొరక్కపోతే తమ జాతికే చెందిన చిన్న పాములని తింటాయి. జంతువులు మనిషిలా శ్రమ చేసి ఆహారోత్పత్తిని వృద్ధి చేసుకోలేవు. వనరులు సృష్టించుకోవడానికి మనిషి దగ్గర సాంకేతిక జ్ఞానం ఉంది. Survival of the fittest సూత్రం మనుషులకి వర్తించదు.

    ReplyDelete
  4. దోపిడీ దారుల ప్రాంతం నుండి విముక్తి, మీ నీళ్ళు, మీ భూమి, మీ వుద్యోగాలు అన్నీ మీ నాల్గుగోడల మధ్యే వుంటాయి.. మీ సినిమాలు (కెసీఅర్_ హీరో, విజయశాంతి_హీరోయిన్) వున్న సినిమాలే చూడండి..

    ReplyDelete
  5. ప్రవీణ్ గారు,

    మీరు చెప్పింది అక్షర సత్యం. మనిషి ప్రకృతిని జయించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ప్రకృతికి అన్నీ వదిలి వెయ్యడు. నదీ జలాలు సహజంగా కిందికి వస్తాయి కానీ మనిషి వాటికి ఆనకట్టలు కట్టి సాగునీటికి, తాగునీటికి తరలిస్తాడు. మనిషి బలహీనుడికి, వికలాంగులకు కూడా అవకాశాలు కల్పిస్తాడు, కానీ మన విశాలాంధ్రవారికి అది తెలియదేమో, అందుకే అలా వాదిస్తారు.

    వోలేటి గారు,

    మీది అమాయకత్వమో అతి తెలివో తెలియడం లేదు, మానీల్లు, మాఉద్యోగాలు మాకే చెందాలనడం, ఉత్పత్తులను ఎగుమతి చెయ్యడం వేర్వేరు అంశాలు. ఇప్పుడు మన సమైక్య రాష్ట్రం కూడా ఎగుమతులు చేస్తుంది, కానీ మన రాష్ట్ర సాగునీటివాటాను కర్ణాటకకో మహారాష్ట్రకో ఇచ్చెయ్యడం లేదు, పైగా కోర్టుల్లో వాటా పెరగాలని మనం పోరాటం చేస్తున్నాం. మన ప్రభుత్వ ఉద్యోగాలు మహారాష్ట్రకిచ్చెయడం లేదు. ఇవన్నీ మీకు తెలియక కాదు కానీ ఎలా ఎక్కడ ఎలా అవసరమయితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతారు.

    సినిమాలు ఎవరు తీసినా మేం చూస్తాం, కానీ ఇప్పటిలా ఇండస్ట్రీని నలుగురి గుప్పిట్లో బందీని చెయ్యకుండా అందరికీ అవకాశం కల్పిస్తాం. మీదగ్గర ఏదయినా అర్ధవంతమయిన వాదన ఉంటే కామెంటు చెయ్యగలరు.

    ReplyDelete
  6. తిరుగుబాటు తెలంగాణా అబివృద్దికా లేక వారి సొంతానికా తెలియని పూటకో నాయకుడు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తెలంగాణా పార్టిల నాయకులు,మంత్రులూ వారి అనుచరగణం యుద్దాల అనంతరం తీరిగ్గా ఇవన్నీ చర్చించుకుందామేం...

    ReplyDelete
  7. మీవాదన దోచుకోబడుతున్న నీళ్ళు, ఉద్యోగాలు, వనరుల గురించా లేక నాయకత్వం గురించా? ముందు మీనీటిని, మీఉద్యోగాలను మీరే ఉంచుకోండి అని దెప్పుతూ పరోక్షంగా ఇప్పుడవి దోచుకోబడుతున్నవని ఒప్పుకున్నారు. అక్కడ మీవదన నెగ్గకపోతే ఇప్పుడు నాయకత్వంపై పడ్డారు, ఒక అంశానికి కట్టుబడి ఉండండి.

    ఇక మీవాఖ్యకు సమాధానం, తెలంగాణాలో ఉద్యమం చేసేది ప్రజలు. నాలుగుకోట్ల మంది ఉద్యమిస్తున్నపుడు అందులో విభిన్న నాయకత్వం పుట్టుకురావడం అత్యంత సహజం. సమైక్య ఉద్యమం కేవలం నాయకులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం కాబట్టి అందులో కొత్త నాయకత్వం పుట్టదు, ఉన్న నాయకులు కేవలం తమ అనుచరబృందం ద్వారా దొంగ ఉద్యమం నడిపిస్తారు.

    ReplyDelete
  8. తెలంగాణాలో ఇరిగేషన్ ప్రొజెక్ట్‌లు కట్టకుండా ఉద్యమం బలపడిన టైమ్‌లో మాత్రమే ఒకటిరెండు ప్రొజెక్ట్‌లు ప్రారంభించి పెండింగ్‌లో పెట్టే ఆంధ్ర నాయకుల పాలనలో దోపిడీ తక్కువగా ఉంటుందని నమ్ముతున్నారా? ఆంధ్ర నాయకుల దోపిడీ గురించి మాట్లాడితే తెలంగాణా నాయకుల గురించే అడగడం ఎందుకు?

    ReplyDelete
  9. తెలంగాణాలో పోరాటాలకి అంతు వుండదు.. నాడు నిజాం, రజాకార్ల మీద, నేడు ఆంధ్రా వాళ్ల మీద, రేపు మీ నాయకుల మీదే (ఇప్పుడు అదే జరుగుతోంది).. కష్టపడి ఒళ్ళొంచి పనిచేసే వాళ్ల సంఖ్య కన్నా, డప్పు వాయించి నాలుగు పాటలు పాడి పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువ..దోచేసుకున్నారో అని ఒకటే రాగం.. అదే శ్రీకాకుళం ప్రాంతంలోచూడండి (దేశ, విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి పని చేయగల శక్తి సామర్ధ్యాలు ఎక్కువ)..కూలి వాళ్ళ దగ్గర నుండి, విద్యా రంగంలోనూ, మిలటరీ లోనూ శ్రీకాకుళం వాళ్ళు శ్రమ పడ్డట్టు ఎవరూ వుండరు.. అటువంటి శ్రమైక భావన వుంటే జపాన్ లాగే భారతదేశం కూడా అబివృద్ది చెందుతుంది..మనకి విధ్యంస రచనే తప్ప, ఐక్యతా రాగం ఈ జన్మకి రాదు, మీ నాయకులు రానివ్వరు.

    ReplyDelete
  10. స్వతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయింది..ఇన్నాళ్ళూ తెలంగాణా నుంచి ఎన్నికైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్.పీ లు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి వీళ్ళేం చెయ్యలేనిది, ఇప్పుడు కొత్తగా తెలంగాణా వేర్పడి, వీళ్ళు మాత్రం చేసేదేమిటి.. పదవులు కోసం తన్నుకోడం, అందిన కాడికి దోసుకోడం తప్ప..

    ReplyDelete
  11. వోలేటి గారు,

    దోపిడీ, అణచివేత ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి, దోపిడీ దారులు ఇక్కడి దొరలయినా,రజాకార్లయినా, మరో ప్రాంతపు ధనిక వర్గాలయినా ఉద్యమానికి అతీతులు కారు.

    శ్రీకాకుళం వారు, తెలంగాణా వారు కూడా పొట్తకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెల్లి శ్రమిస్తారు. అలా ఎందుకు వలస వెల్లాల్సి వస్తుందనేదే ఇక్కడ ప్రశ్న. ఉత్తరాంధ్ర వారు కూడా సమైక్య రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. వారు రాష్ట్రం అడగకపోవడానికి కారణం ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా నిలదొక్కుకునే సామర్ధ్యం లేకపోవడమే. మీకు డప్పు కొట్టే కలాకారులమీద చాలా లోకువ ఉన్నట్లుంది, ఇలాంటి లోకువ భావన మానుకుంటే మంచిది.

    మీరు ముందు ఇక్కడి వనరుల దోపిడీ గురించి మాట్లాడారు, తరువాత తెలంగాణా నాయకులపై పడ్డారు, ఇప్పుడు ప్రజలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఒక్క విషయాన్ని ముగించి అందులో ఎదుటివారి పాయింటు అర్ధం చేసుకుని ఇంకో విషయంపై మల్లిస్తే బాగుంటుంది.

    స్వాతంత్రం వచ్చి ఎన్నేల్లయినా ఇక్కడి వారు ముఖ్యమంత్రులుగా ఉన్నది మొత్తంగా ఆరు సంవత్సరాలు కూడా లేదు, ఇక్కడి వారు ముఖ్యమంత్రి అయి ఇక్కడి ప్రాంతాలలో జరిగే అన్యాయాన్ని అరికట్తడానికి ఏదయినా చేద్దామనే లోగా మీవారు కుతంత్రాలు పన్ని గొడవలు సృష్టించి ముఖ్యమంత్రులను దించేస్తారు. ఇందుకు SLBC గురించి చెన్నారెడ్డి, ఉద్యోగాల గురించి పీవీ చేసిన ప్రయత్నాలు, వెంటనే మీనాయకులు వారిని దించి వేసిన ఉదాహరణలు చాలనుకుంటా. పైగా మాప్రాంతం వారు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒక ప్రాంతానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలాగా పనిచేసే సంకుచితత్వం వారికి లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మొత్తం రాష్ట్రం మంచి కొరకు పనిచెయ్యాలి, అలాజరగనప్పుడు విడిపోవడమే సరయినపద్దతి.

    మీకు అర్ధమయిందని అనుకుంటున్నాను.అర్ధం కానట్లు నటిస్తే చేసేదేం లేదు.

    ReplyDelete
  12. ధ్వంసరచన గురించి మీరెంత తక్కువ మాట్లాడితే మీనాయకులకు అంతమంచిది. మీ పదిహేనురోజుల సమిక్య ఉద్యమంలో జరిగిన విధ్వంసం మొత్తం తెలంగాణ ఉద్యమంలో జరిగిన విధ్వంసం కంటే చాలా ఎక్కువ. ఇంకా వంగవీటి, పరిటాల లాంటివారు చంపబడ్దపుడు జరిగిన విధ్వంసానికి లెక్కలేదు. ఒకరినొకరు చంపుకోవడం ఆతరువాత ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చెయ్యడం ఇదేకదా మీకు తెలిసింది?

    ReplyDelete
  13. శ్రీకాకుళం కూడా వెనుకబడిన ప్రాంతమే నాయనా. నేను ఉండేది శ్రీకాకుళంలోనే. ఇక్కడ హైవే పక్కన కొన్ని భారీ పరిశ్రమలు ఉన్నాయి కానీ ఇక్కడి జనాభాకి ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు దొరక్క వేరే ప్రాంతాలకి వలస వెళ్తుంటారు.

    ReplyDelete
  14. చంద్రబాబు కేబినెట్ లో కే.సీ.ఆర్ కి మంత్రి పదవి కట్టబెట్టని తర్వాత తె.రా.స పుట్టుకొచ్చింది.. ఆ తర్వాత ఎన్ని పార్టీల్తో పొత్తు పెట్టుకున్నా రెండు ఎన్నికల్లో విజయం సాధించలేదు.. మళ్లా రాజశేఖర్ రెడ్డి చనిపోయాక తెలంగాణా గుర్తు కొచ్చింది.. అంటే ఇది నిజంగా ప్రజల్లోంచి వచ్చిన వుద్యమమా ? నాయకులు తమ పదవుల కోసం చేస్తున్నదా ? ఆలోచించండి..మధ్యలో మీడియా హడావుడి..

    ReplyDelete
  15. వోలేటి గారు,

    జగన్ అవినీతికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తే జగన్ తన స్వార్ధం కోసం చేసాడు కాబట్టి అసలు అవినీతి లేనే లేదు అని అంటారా? నాయకులు ఎప్పుడూ తమ స్వార్ధం కోసమే ఉద్యమాలు చేస్తారు, మీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంతో సహా. అంతమాత్రాన ఉద్యమం తప్పయిపోదు.

    తెలంగాణ ఎందుకు ఏర్పడకూడదో మీదగ్గర హేతుబద్దమయిన వాదన ఏదయినా ఉంటే చెప్పండి, మాటిమాటీ టాపిక్ మారుస్తూ తలా తోకా లేకుండా వాదించకండి. తెలంగాణ కావాలనుకొనేవారంతా తెరాసకు చెందరని తెలుసుకోండి.

    ReplyDelete
  16. కెసిఆర్ కి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే తెలంగాణా రాష్ట్ర సమితి పుట్టిందనేది అరిగిపోయిన రికార్డ్. ఆ మాటకొస్తే కాకాని వెంకటరత్నానికి మంత్రి పదవి రెండో సారి దక్కకపోవడం వల్లే ప్రత్యేకాంధ్ర ఉద్యమం పుట్టిందని అనుకోవాలి.ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్న వారిలో రాజకీయ నిరుద్యోగులు లేరా? టిజి వెంకటేశ్ వంటివారు కీలకమైన పదవుల్లో లేరు కదా.

    ReplyDelete
  17. తెలంగాణ కావాలనే ఆకాంక్ష తెరాసతో పుట్టలేదు, అది 1956 నుంచీ ఉంది, 1969లో ఉవ్వెత్తున ఎగిసింది. మధ్యలో NTRప్రభంజనం వలన కొంత మందగించినా ఆ ఆకాన్ష ఎటూ పోలేదు. కేసీఆర్ మంత్రిపదవి ఇవ్వకపోతే పార్టీ పెట్టొచ్చు, కానీ అతనేమీ కొత్తగా ఉద్యమాన్ని మొదలుపెట్టలేదు, ప్రజలలో ఉన్న భావననే ముందుకు తీసుకొచ్చాడు.

    ప్రజల్లో ఆ భావన ఉంది కనుకనే ఇక్కడ ఎలక్షన్లొచ్చిన ప్రతిసారీ అన్నిపార్టీలు తెలంగాణ తామే తెస్తామని చెప్పుకొచ్చాయి. ఇప్పుడు చిదంబరం ప్రకటన తరువాత మిగతా పార్టీల అసలు రంగు బయటపడడం వల్ల, ఆంధ్రాలో ఉత్తుత్తి ఉద్యమాలద్వారా, డబ్బూ అధికారం ద్వారా తెలంగాణ ఏర్పాటును ఆపడానికి ప్రయత్నం చెయ్యడం వలన ఇప్పుడు ప్రజల్లో ఉద్యమం బలంగా తయారయింది.

    నిజమయిన ప్రజా ఉద్యమాలెప్పుడయినా ఇలాగే మెల్లిగా మొదలయి మధ్యమధ్యలో ఉవ్వెత్తున ఎగుస్తాయి, మన స్వాతంత్ర ఉద్యమం కూడా ఎప్పుడూ జరగలేదు. కానీ కృత్రిమ ఉద్యమాలు మాత్రం అర్ధరాత్రి ప్రజలతో సంబంధం లేకుండా నాయకులు మొదలు పెడతారు.

    ఇదంతా రాస్తే మీరు అర్ధం చేసుకుని మారుతారని కాదు, నాబ్లాగులోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు మీకు సమాధానం చెబుతున్నాను.

    ReplyDelete
  18. ఇలా అన్నిటికీ ఆంధ్రా వాళ్ల మీద ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మొత్తం అభివృద్ధి అంతా అక్కడే జరిగి, హఠాత్తుగా జాగో, బాగో అంటే ఎలా ? హైదరాబాద్ లో వున్నది ఆంధ్రా వాళ్ళేకాదు.. మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఎన్నో వేల మంది వున్నారు.. మరి వాళ్ళను కూడా తరిమెయ్యరాదూ? అసలు మన వెనుకబాటు తనానికి కారణం ఎవరు? కోట్లు దిగమింగుతున్న నాయకులు. శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ దాకా వుంది ఈ వెనుకబాటు తనం.. అది తెలుసుకోండి.. దానికి మూల కారణం ఎవరో వారి మీద వుద్యమించాలి..మా తెలంగాణాకే అన్యాయం జరిగింది..దానికి ఆంధ్రా వాళ్ళే కారణం అంటూ, చివరికి మహానుభావుల విగ్రహాల విధ్వంసం... ఇదా ఉద్యమం? ప్రశ్నించండి.. నిలదియ్యండి మీ తెలంగాణా నాయకుల్ని ఇన్నాళ్ళూ ఏం వెలగబెట్టారని?

    ReplyDelete
  19. >>>ఇలా అన్నిటికీ ఆంధ్రా వాళ్ల మీద ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి?

    ఆంధ్రా ప్రజలమీద ఎవ్వరూ ఏడ్వలేదు, ఆంధ్రా పరిపాలకులమీద, అవకాశాలను exploit చేస్తున్న కొద్దిమంది మీదే నిరశన అని గుర్తించండి.

    >>>మొత్తం అభివృద్ధి అంతా అక్కడే జరిగి, హఠాత్తుగా జాగో, బాగో అంటే ఎలా ?

    ఉద్యమాలన్నప్పుడు ప్రజలను ఉత్తేజపరచడానికి ఇలాంటి నినాదాలను లేవదీస్తారు, అంత మాత్రాన మీరేమన్నా పారిపోతునారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ఉండదలుచుకున్నవారు ఎలాగూ ఇక్కడే ఉంటారు, ఎవరూ వెల్లగొట్టరు, ఎక్కడికీ వెల్లరు. మీరు ఇడ్లీ సాంబార్ గోబాక్ అన్నా, మద్రాసులో ఇప్పటికీ తెలుగువారు లేరా?

    హైదరాబాదు కొత్తగా అభివృద్ధి చెందలేదు, 56లో ఐదో స్థానంలో ఉంది, ఇప్పుడు ఆరో స్థానంలో ఉంది. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణా నిధులను తెలంగాణాలోనే ఖర్చుపెట్టాలి (హైదరాబాదుతో సహా), కానీ అలా చెయ్యలేదు అంటే తెలంగాణా నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి, ఆంధ్రానుంచి హైదరాబాదుకు కాదని గుర్తించండి.

    >>>హైదరాబాద్ లో వున్నది ఆంధ్రా వాళ్ళేకాదు.. మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఎన్నో వేల మంది వున్నారు.. మరి వాళ్ళను కూడా తరిమెయ్యరాదూ?

    మరాఠీలయినా, కన్నడవారయినా ఇంకెవరయినా ఈగడ్డమీద పుట్టినవారు ఇక్కడివారే. ఎవరినీ ఎవరూ పొమ్మనలేదని గుర్తెరగండి. ఏదో ఒక్కసారి జాగో భాగో అంటే అదొక సాకులా చెప్పకండి.

    మరాఠీలు, కన్నడవారు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొల్లగొట్టలేదు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో తమవారికి అక్రమంగా ప్రమోషన్లు ఇవ్వడం లేదని గుర్తెరగండి.


    >>>అసలు మన వెనుకబాటు తనానికి కారణం ఎవరు?

    వెనుకబాటు తనానానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఇక్కడ సమస్య వ్యవస్థీకృత వివక్ష, దానిపైనే ఈ ఉద్యమం. అందుకు కారణం సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం, నాయకులు.

    >>>శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ దాకా వుంది ఈ వెనుకబాటు తనం.. అది తెలుసుకోండి..

    ఇంకేం, విడిపోయిన తరువాత మీరు మీనాయకులపై పోరాటం చెయ్యండి, మేము మా నాయకులపై పోరాటం చేస్తాం.

    >>>>మా తెలంగాణాకే అన్యాయం జరిగింది..దానికి ఆంధ్రా వాళ్ళే కారణం అంటూ, చివరికి మహానుభావుల విగ్రహాల విధ్వంసం... ఇదా ఉద్యమం?

    మాతెలంగాణకు అన్యాయం జరిగింది, దానికి సీమాంధ్రా పరిపాలకులే కారణం. మీకూ అన్యాయం జరిగితే మీరూ ఉద్యమించండి, మమ్మల్ని చెయ్యొద్దంటే ఎలా?

    మహానుభావుల విగ్రహాలగురించి మరీ తలబాదుకోవాల్సిన అవసరం లేదు, ఉద్యమాలను బలవంతంగా అణచివెయ్యాలని చూస్తే జరిగేదదే.

    >>>ప్రశ్నించండి.. నిలదియ్యండి మీ తెలంగాణా నాయకుల్ని ఇన్నాళ్ళూ ఏం వెలగబెట్టారని?

    మేం నిలదీస్తాం, మారాష్ట్రం ఏర్పడ్డాక. మీరెప్పుడు నిలదీస్తారు మీవినాయకులని?

    ReplyDelete
  20. ముందర అబివృద్ది అన్నారు..లెక్కలన్నీ తేలేసరికి ఆత్మ గౌరవం అన్నారు.. ఇప్పుడు శ్రీ కృష్ణ కమిటీ తమ నివేదికలో వాస్తవాలు అన్నీ చెప్పాక.. టాట్ అదంతా ఆంధ్రా వోళ్ళ కుట్ర అంటున్నారు.. హైదరాబాద్ డెవలప్ కాలేదు అని చెప్పింతర్వాత ఇకేం చెప్పాలి.. ఈ గొడవల్లనే కదా వచ్చే ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి.. అదీ అబద్దమేనా?

    ReplyDelete
  21. వోలేటి గారు,

    మీరు కేవలం ఈటపాలో ముందర ఉద్యోగాలు, నీళ్ళగురించి మాట్లాడారు, అది తేలిపోగానే తెలంగాణ ప్రజలు కష్టపడరు శ్రీకాకుళం వారయితే బాగా కష్టపడతారన్నారు. అది తేలిపోగానే ధ్వంస రచన అంటూ దెప్పబోయారు, అక్కడ దొరకగానే తెలంగాణా పోరాటాలకు అంతుండదన్నారు, ఆతరువాత మీఉద్యమం అంతా కేసీఆర్కు మంత్రిపదవి దక్కనందుకే అన్నారు. ఇప్పుడు అవన్నీ తేలిపొయ్యాక తెలంగాణ ఉద్యమకారులు మాటమారుస్తున్నారణ్తున్నారు. కనీసం ఒక టపాలో ఒక్కవాదనకు కట్టుబడి ఉండలేనివారు ఇన్నేళ్ళ తెలంగాణా ఉద్యమాన్ని అపహాస్యం చెయ్యబోవడం మరీ విచిత్రంగా ఉంది.

    తెలంగాణా సమైక్య రాష్ట్ర పాలకుల వివక్ష వలన వెనుకబడింది అనేది తెలంగాణవాదులు మొదటినుండీ చెబుతుంది, ఇప్పటికీ చెబుతుంది. ఏ లెక్కలు తేలినాయి? ఇంతకుముందు వేసిన కమిటీలన్ని పొయ్యి ఇప్పుడు తమ మోసపూరిత రిపోర్టు వలన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న శ్రీక్రిష్ణ కమిటీ స్తాండర్డ్ అయిపొయ్యిందా మీకు?

    ఇక ఆత్మగౌరవం గురించి, మేమొక న్యాయమైన డిమాండుకోసం పోరాటం చేస్తుంటే మీనాయకులు కుతంత్రాలతో అధికారంతో అణచివేస్తున్నప్పుడు ఇప్పుడు వేరే కారణాలేమీ అక్కరలేదు, మా ఆత్మగౌరవం కోసం మా స్వయంపాలన కోసం తెలంగాణ కావాలి. ఆంధ్ర రాష్ట్రం కొరకు మీరు చెప్పింది కూడా ఇదే, అదీ ప్రకాశం పంతులుకు అధికారం దక్కకపోవడం వలన.

    మీదగ్గర రాష్ట్రం ఎందుకు విడిపోగూడదో సహేతుకమయిన వివరణ ఉంటే చెప్పండి, ఊరికే మాటి మాటికీ వాదన మారుస్తూ టపాతో సంబంధం లేకుండా రాస్తూ తైంవేస్ట్ చెయ్యకండి. థాంక్స్!!

    ReplyDelete
  22. There are hard and industious people In Telangana. They are not agitating for separae state etc. Those who are not hard workers and try evade the responsibilities of daily chores are shouting for separate state. For example, most Telanganites are in abroad and other parts of the country. They more industrious and hard workers. Some of the NRIs and living in other states are influenced by the pseudo intellectuals, politicians and their worthless friends remained in Telangana.

    ReplyDelete
  23. రాళ్ళబండి గారు,

    మీ ప్రొఫైల్ చూస్తే సోషల్ సైంటిస్ట్ అని ఉంది, మీరేమిటి ఎప్పుడూ పూర్తి అశాస్త్రీయ వాదనలు చేస్తుంటారు?

    తెలంగాణలోనయినా, ఆంధ్రలోనయినా ఎక్కడయినా కష్టపడేవాల్లు కష్టపడుతారు, తెలంగాణ ప్రజలపై ఇలాంటి లోకువభావన కలిగిన సంకుచిత మనస్కులు విశాలాంధ్ర కావాలంటూ రాతలు రాయడం విడ్డూరం. ఏసీరూముల్లో కూర్చుని శ్రమజీవులపై ఒపీనియన్లు ఇవ్వడం మచిది కాదు. ఇప్పుడు నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలంతునారు, వారంతా సోమరులా లేక కష్టపడ్డ ఫలితం దక్కక తమ వనరులు తమకల్లముందే దోపిడీకి గురవుతుంటే నిస్పృహకు గురవుతున్న శ్రామికులా అనేది బహుషా మీ అశాస్త్ర్రియ అవగాహనకు ఎన్నటికీ అందదు.

    మీరే కదా రాసింది, మీతెలంగాణలో మా లగడపాటి అందమయిన భవతులు కడుతుంటే మీ విమలక్క వచ్చి దౌర్జన్యంగా జెండాలు పాతిందని? ఏం విమలక్క జెండాలు ఒక్కసారి పాతగానే లగడపాటి తాను దోచుకున్న ప్రభుత్వభూములు, గుల్లూ, వక్ఫ్ భూములు వెనక్కి ఇచ్చేశాడా? లగడపాటి లాంటి కబ్జాకోరును కూడా వెనకేసుకొచ్చే ఊహకందని వింత మనుషులకు ఏమని చెప్పేది?

    ReplyDelete
  24. Ne bacnhan...ne Kalmokta was the stage of Telangana a couple of decades ago. Where are the telanganites now ? Still in the stage of 'kalmokta'? If you can not call this development..no one can save you guys. You can not decide alone to form a separate state. Every Indian has a right/say on it. You may not understand others say in forming YOUR state. But it is reality.

    Bago, jago..raktapatam...agnigundam...all were done in 'avesam'. statue breaking is done because of suppression. Even LeT, LTTE can show 1000's of reasons to support their killings. You are no exception.

    Telangana has never been a state. It was part of Hyderabad state. If you are that much interested to form your state, leave Hyderabad...you can form your state with in DAYS.

    Finally, you are responsible for your failures/success. Others are not responsible for your constipation and erection.

    ReplyDelete
  25. @ravindranath

    What do you mean by hard and industrious people?

    The very people of yours who fought for separate andhra during 1952 were not hard and industrious? Your people then shouted only for evading responsibilities?

    Your people during 1972 also did the same?

    The people who did these things twice in past 60 years suddenly became saints?

    ReplyDelete
  26. విశ్వరూప్ garu,

    Chala kastapadutunnaru. Stop quoting the wrong figures. ( how can you do it when the very agitation is based on LIES ). Census realeased Telangana population figures as 3.5 crore. That would include many Andhrites etc etc also. Refer to the census web site if you have time for such things.

    First of all, 4 crore is a LIE. And quoting all those 4 crore want a state is even BIGGER LIE. So...try to come to the reality.

    ReplyDelete
  27. Anon 2: If it is not 4 crore and it is 3.5 crore does telangana cause become false? What are you going to prove with your numbers?

    How many people want telangana in Telangana is proved in the by-election. If you don't believe then let us wait for the next muncipal elections.

    Anon 1: You don't deserve an answer.

    ReplyDelete
  28. విశ్వరూప్ గారూ..
    పై స్పందనలు బట్టి మా అభిప్రాయాలు కరెక్టే అన్న విషయాల్ని గ్రహిస్తారని ఆశిస్తాను..రేపు తెలంగాణా వచ్చినా దోపిడీకి అంతువుండదు (మీ నాయకులు ఎక్కడో ఆకాశంలోంచి దిగిరాలేదు.. ఆ తాను లోని ముక్కలే.. ఎవరు నిజమైన దోపిడీ దార్లో గుర్తుంచుకోండి.. పిల్లలు తల్లితండ్రుల ఆశల్ని వమ్ముచేసి వుద్యామాల్లో చేరి వారి బంగారు భవిష్యత్తు ని నాశనం చేసుకుంటున్నారు..మరి నాయకులు, వారి పిల్లలు ?

    ReplyDelete
  29. వోలేటి గారు,

    మీరు అన్ని కామెంట్లలో అన్ని రకాల వాదనలెత్తుకుని అన్నిసార్లూ మీ వాదనకు మీరే నాలిక కరుచుకుని చేతులెత్తేశారు, ఇప్పుడెవరో అగ్నాతలు అర్ధం పర్ధం లేని రెండు కామెంట్లు పెడితే దాని నుంచి నేను విషయం గ్రహించాలా?

    నేను ఇప్పటికి పది సార్లు మీకు వివరించి ఉంటాను, మరొక్క సారి మీతలకెక్కుతుందని రాస్తున్నాను. మా ప్రాంతంలో కూడా కొందరు దోపిడీదారులు ఉండొచ్చు, వారు మీప్రాంతంలో అధికారం చేజిక్కించుకున్న బడా బాబుల మోచేతినీల్లి తాగుతూ దోపిడీ చేస్తున్నారు తప్పితే వారికి స్వతహాగా అంత బలం లేదు. మీప్రాంత నాయకులు అధికారం తమదగ్గర ఉంచుకొని వారికి వత్తాసు పలికినన్నాల్లూ మేము వారిని ఏమీ చెయ్యలేం, కాబట్టి ముందర మేము విడిపోతే ఆతరువాత మాప్రాంతం నాయకులను మేం నిలదీస్తాం. మీరెలాగూ మీనాయకులను నిలదీయరు, మీచేతకానితనానికి మేమెందుకు భాద్యులు కావాలి?

    మాప్రాంతంలో వనరులు (నీల్లు, భూములు, ఉద్యోగాలూ, నిధులు) ఎవరు దోపిడీ చేస్తున్నారో మాకు స్పష్టం. మీప్రాంతంలో పేదలను ఎవరు దోస్తున్నారో మీకు అవగాహన లేదు కానీ మీప్రాంత బడుగు వర్గాలకు ఉంది అందుకే అక్కడి కత్తి పద్మారావు లాంటి నేతలు కూడా తెలంగాణ ఏర్పాటు సమర్ధిస్తున్నారని తెలుసుకోండి.

    ReplyDelete
  30. Anonymous said...

    "Ne bacnhan...ne Kalmokta was the stage of Telangana a couple of decades ago"

    Sorry to disappoint you, the slogan changed to "nee ghori kadtam koduko" many decades ago!

    ReplyDelete
  31. voleti said...

    "రేపు తెలంగాణా వచ్చినా దోపిడీకి అంతువుండదు"

    Why do you care?

    "పిల్లలు తల్లితండ్రుల ఆశల్ని వమ్ముచేసి వుద్యామాల్లో చేరి వారి బంగారు భవిష్యత్తు ని నాశనం చేసుకుంటున్నారు..మరి నాయకులు, వారి పిల్లలు ?"

    Did your andhera tegulu guys do "agitations" like jai andhra, vishakha ukku, "samaikyandhra" without students?

    ReplyDelete
  32. కెసి‌ఆర్‌కి మంత్రి పదవి ఇవ్వలేదని తెరాస పార్టీ పెట్టాడని విమర్శిస్తారు కానీ గతంలో మన ప్రాంతానికే చెందిన కాకాని వెంకటరత్నం ఒకసారి మంత్రిగా పని చేసి రెండవసారి మంత్రి పదవి రాలేదని జై ఆంధ్ర ఉద్యమం నడిపిన విషయం మర్చిపోతారు. జై ఆంధ్ర ఉద్యమంలో యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు కానీ పోలీస్ కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు.

    ReplyDelete
  33. ఎందుకు కలిసి వుండాలో మీ హైదరాబాద్ నవాబు వారసులు ప్రస్తుత ఎమ్.ఎల్.ఏ అయిన అక్బరుద్దీన్ ఒవైసీ గార్ని అడగండి, హైదరాబాద్ లో వున్న ఆటో వాళ్లని అడగండి, భూములున్న వాళ్ళని అడగండి.. మీరు అనుకున్న నాలుగు కోట్ల మంది (అనుకుందాం) ఎందుకంటే వాళ్ళలో ఎంతమంది కేవలం తెలంగాణా (పుట్టుకతో అక్కడ పుట్టిన వారా ? / పదేళ్ళ నుండి అక్కడ వున్న వాళ్ళా ? / నలబ్బై ఏళ్ల క్రితం నుండి వున్నవాళ్ళా ? ) భార్య ఆంధ్రా అయితే, ఆవిడ సంగతి ఏమిటి? వాళ్ళ పిల్లలు ఎందులోకి వస్తారు? ఇవన్నీ మీరు క్లారిటీ ఇచ్చినట్టయితే.. నా జవాబుల్లో క్లారిటీ వుంటుంది..
    జై ఆంధ్రా వుద్యమం తో, స్టీల్ ప్లాంట్ వుద్యమంతో ఈ తెలంగాణా వుద్యమం సరిపోల్చ దగినది కాదు, అవి ఒక నిర్దుష్టమైన కాలంలో, ఏకాభిప్రాయ సాధన తో ముందుకు వెళ్ళాయి..
    ముందు మేం వేరు, ఆంధ్రా వేరు అన్న భావజాలం మార్చుకోవాలి.. మీరేం పాకిస్తాన్ లో లేరు..అన్య భాష మాట్లాడే వారు కాదు.. స్వతంత్ర్యం వచ్చి ఎన్నేళ్ళయినా, ఎంత అభివృద్ది చెందినా..ఈ వుద్యమానికి అంతులేదు, విధ్వంసాలకి కొరవ లేదు..
    ఇక పరిటాల రవి, రంగా .. వీళ్ళు ఎంత ఫాక్యనిష్టులు, రౌడీలయినా ప్రజల మద్దత్తు, వాళ్ళ ప్రాంత అబివృద్దికి చాలా కృషి చేసారు.. అందువల్ల వాళ్ల అబిమానులు బంద్ పాటించారు (విధ్వంసం ఎక్కడా హర్షనీయం కాదు) ఇలాంటి నాయకులు తెలంగాణా ఏరియాలో వున్నారా? అనంతపురంలోనైనా, విజయవాడ లోనైనా సామాన్య ప్రజల స్వేచ్చకి అడ్డంకి లేదు (ఏ ప్రాంతంవారైనా నిర్భయంగా తిరగొచ్చు) కాని ఇప్పుడు తెలంగాణాలో సాటి తెలుగు వారి నాలుకలు తెగ్గొస్తాం, తరిమి తరిమి కొడ్తాం అంటూ భయోత్పాతం సృష్టిస్తూ మారణకాండకి, మాస్ లో అదొకవిధమైన హిస్టీరిక్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మీ నాయకులు (వాళ్లలో వాళ్ళే కొట్టుకుంటున్న పరిస్థితి).. పాపం నాగం, ఓయూ లో చావు తప్పి కన్ను లొట్ట బోయాడు..ఇంకా ఎన్నని రాయాలి?

    ReplyDelete
  34. వోలేటి గారు,

    రాష్ట్రం ఎందుకు విడిపోవద్దో మీకు చెప్పటం చేతకాకపోతే మాత్రం నిజాం వారసున్నడగమంటారా?అదెందుకు, మీకు తెలీదని ఒప్పుకున్నట్లేనా?

    మీప్రాంత అభివృద్ధికి ఏదో చేశాడని ఒక ఫాక్షనిస్టు చస్తే ప్రభుత్వ ఆస్థులు విశృంఖలంగా తగలబెట్టే మీరు మా అభివృద్ధి కోసం మాకు రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తుంటే అది మాత్రం తప్పని ఎందుకనిపిస్తుంది? పైగా ధ్వంస రచన అని పేరుపెట్టారు, ఎంత ధ్వంసం జరిగితే మీప్రాంతనాయకుల ధ్వంసనీతిని అందుకోవచ్చో కాస్త చెప్పగలరా?

    ఉద్యమం లేనప్పుడే తెలంగాణా వాడు మీ విజయవాడలో ధైర్యంగా నడవలేడు, ఉద్యమం జరుగుతున్నప్పటి విషయాన్ని పక్కన పెట్తండి. అందుకే తెలంగాణ వారు పనికి కూడా విజయవాడ వెల్లరు, ఆంధ్రా వెల్లరు. నీటి ప్రాజెక్టులను కూడా వదిలిపెట్టకుండా ధ్వంసం చేశారు కదండి, ఎందుకీ వట్టి కబుర్లు?

    తెలంగాణలో ఒక్క హైదరాబాదే కాదు, ఊరూరా ఆంధ్రా కాలనీలున్నాయి, అంతా బాగానే ఉన్నారు,ఇంత ఉద్యమం నడుస్తున్నా.

    ReplyDelete
  35. Well said Viswaroop!

    Hats off to your patient replies to those provocative comments.

    Srikanth Chari

    ReplyDelete
  36. << అందుకే తెలంగాణ వారు పనికి కూడా విజయవాడ వెల్లరు, ఆంధ్రా వెల్లరు
    __ ఎందుకు వెళ్ళరూ? పని చెయ్యడం చేతకాకనా, సరైన నైపుణ్యం లేకనా ?

    ReplyDelete
  37. ఎందుకంటే ఇందుకే..ఇపుడు మీరు చూపిస్తున్నారుగా మీ ఆంధ్రా అహంకారాన్ని, నైపుణ్యం లేకనా అంటూ. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ వివక్ష వలన తమప్రాంతంలో ఇరిగేషన్ లేకపోవడం వలన తమపక్కనే క్రిష్ణా గోదావరులున్నప్పటికీ వ్యవసాయం సాగక పొట్టకూటొకోసం దుబాఇకీ, సోలాపూర్కూ, నౌసారి, భీమాండి, సూరత్, బొంబాయి, బరోడా లాంటి అనేక ప్రాంతాలకు వలస వెలుతారు, అక్కడి వారితో కలిసి పని చేస్తారు. కాని పక్కనున్న ఆంధ్రా వారి అహంకారం, పక్షపాతబుద్ది, కులగజ్జి వారికి తెలిసి ఉండడంతో అక్కడికి వెల్లరు. ఎందుకు వోలేటి గారు ఏదో వాదన చెయ్యబోయి మీనలుపును మీరే బయట పెట్టుకుంటరు?

    ReplyDelete
  38. నేనేం కాకమ్మ కబుర్లు చెప్పట్లేదు.. కొన్నాళ్లు ఖమ్మం, వరంగల్, డోర్నకల్, నల్గొండ ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ జీవన విధానం, జనాల మనోభావాలు, అలవాట్లు అన్నీ తెలుసు.. కొత్తగూడెం పక్కనే వున్న భద్రాచలం వచ్చీసరికి మరల ప్రజల తీరు, అధికారులు, నాయకుల పనితీరు వేరు.
    హైదరాబాద్ కూడాఎన్నోసార్లు వస్తున్నాను. చుట్టాలు రామగుండం, బెల్లం పల్లి లో వున్నారు (వాళ్ళ అభిప్రాయాలు తెలుసు).. మీరు నలుపుఅన్నా, కులగజ్జి అన్నా, చేతులు ఎత్తేసారు అన్నా పెద్ద బాధ లేదు.. తొంభై శాతం ప్రజల్లో లేనిది బలవంతంగా మీడియా సాక్షిగా నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల దృష్ట్యా ఆడుతున్న ఈ నాటకాల్ని మీరు కూడా ఈ పాటికే గ్రహించే వుంటారు (కానీ గ్రహించనట్టు వుంటే మేమేం చెయ్యలేం)... నాయకులు, వుద్యమ నేతలు ఈ తెలంగాణా పేరు చెప్పుకుని కోట్లు సంపాదించుకుంటే, సామాన్య ప్రజలు, విద్యార్ధులు ఎంతో విలువైన ప్రాణాల్ని, టైమ్ ని వృధా చేసుకుంటున్నారు.అది గ్రహిన్తే చాలు..

    ReplyDelete
  39. మీరు కాకమ్మ కధలు చెబుతున్నారో, అర్ధం లేని వాదనలు చేస్తున్నారో మీవ్యాఖ్యలు చదవి పాఠకులు అర్ధం చేసుకుంటారు. ఎంత శాతం ప్రజలు తెలంగాణ కోరుతున్నారో బైఎలక్షన్లలో డిపాజిట్లు కోల్పొయినవారు చెబుతారులేగానీ మీడియా అంతా మీదేగా మల్లీ మీడియామీద మీరెందుకు ఏడుస్తారు?

    విద్యార్థులు ప్రాణాలు కోల్ఫోవడం ఎంతో బాధాకరం, అందుకు భాద్యులు 0.1 శాతం కూడా ప్రజలలో కూడా లేకున్నా దొంగ ఉద్యమాలు తయారు చేసిన మీనాయకులని గ్రహించండి. మీ వాదన పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  40. @voleti

    Babu mega star ye oore needhi. endhuku atlaa matlduthunavu chetakani vaalu, talent leni oolu anni
    inka edo edo nee notiki edi voste adi ...evadu cheppadu niku kalisunte manchidhi anni. veedi pothe nashanam anni.

    kocham ee vishayala meedha research chesi matladu.appati vaaraku appu nee sodhi ....

    memu matlade basha telugu anni oopuko nee mansanu oppinchi?

    @viswa garu great ...

    ReplyDelete
  41. "ఉద్యమం లేనప్పుడే తెలంగాణా వాడు మీ విజయవాడలో ధైర్యంగా నడవలేడు"

    Your agitation is FULL of lies. Above is just one example to show that. Keep setting up deadlines. You can do nothing else other than damaging properties, abusing and setting up new deadlines every time.

    ReplyDelete
  42. above Anon:

    What is lie and what is fact is beyond the perception of "ANDHULU" like you.

    ReplyDelete
  43. Viswaroop,
    Mee vadana baagane undi. Kaani seemandrulatho kalasi undalem, seemandrulu dochukunnaru ane vadanalu entavaraku samanjasam. Meeru itara prantalanu okasari gamaninchandi.
    udaharanaku, Kadapa jilla proddatur lo, Veternary College open ayindi 3 years back. First year lo unna 30 seats lo, telangana vallu 18 unnaru. Mari rayalaseema vallu meeru maa vanaralu anni dochukelthunnaru ani analede. A.P united ga undali leka divide avvalai anedi oka paddathi ga jaragali kaani, dwesham asuyala tho kaadu. K.C.R, HarishRao, K.K or Jana Reddy laanti neecha rajakeeaya nayakula advaryam lo rastra vibhajana anedi jarigithe, telangana vallakadu avatam matram spastam.

    ReplyDelete
  44. @ వోలేటి ,,
    సైమైక్య ఆంధ్ర తరవాత ముందు కమ్మ కాపులని కలిసి ఉండమనండి చాలు , మీ నీతులు చాల బాగున్నాయి, తెలంగాణా అంటేనే తేలిక భావం , ఇంకెప్పుడు మారుతారో మా తెలంగాణా ప్రజలు, నీలాంటి వాళ్ళని తరిమే రోజు దగ్గరలోనే ఉంది

    ReplyDelete

Your comment will be published after the approval.