Monday 7 October 2013

ఆధిపత్య పోరు - నిరశన ముసుగులో దాడులు



రాష్ట్ర విభజన గురించిన ప్రకటన తరువాత సీమాంధ్రలో మొదలయిన ఉద్యమం విభజన ఆపడానికి కాక సీమాంధ్రలో ఆధిపత్య పోటీ లాగా తయారయింది. ఈపోటీలో ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోగా ఇప్పుడు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే విజయనగరంలో నిన్నటినుంచీ కర్ఫ్యూ విధించగా మరికొందరు సందట్లో సడేమియాలు దుకాణాలపై పడి దోచుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమం నాలుగేళ్ళనుంచీ తీవ్రస్థాయిలో జరుగుతున్నా ఉద్యమం ఎప్పుడూ శాంతియుతంగానే జరిగింది. ఎప్పుడైనా బస్సులపై రాళ్ళు రువ్వడం లాంటి చిన్నచిన్న ఘటనలు జరిగినా అదికూడా పోలీసులు ఒవర్‌యాక్షన్ చేసి అనవర నిర్భందాలు, లాఠీఛార్జీలతో ప్రేరేపించినప్పుడే జరిగాయి. అయినా ఎప్పుడూ తెలంగాణ ఉద్యమాన్ని ఆడిపోసుకోవడమే తమ పనిగా పెట్టుకున్న సమైక్యవాదులు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దాక్కుంటున్నారు.

సీమాంధ్రలో రాజకీయపార్టీలన్ని ఇంతకుముందు తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని చెప్పినవారే. విభజన ప్రకటన తరువాత ఈపార్టీలన్నే విభజనకు కారణం తమ ప్రత్యర్ధి పార్టీయే నని వాదనలు మొదలుపెట్టారు. రాజకీయ విమర్శలు, పోటాపోటీ దీక్షలు ఇన్నాల్లు సాగితే ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తెదేపా వర్గీయులు వైకాప నాయకుల ఇళ్ళపై, వైకాప వర్గీయులు తెదేపా నేతల ఇళ్ళపై దాడులు, కాంగ్రేస్లో ఒక వర్గం వారు మరో వర్గంపై దాడులు చేసుకుంటూ సీమాంధ్రను భ్రష్టుపట్టిస్తున్నారు.

విజయనగరంలో బొత్సా ఇల్లపై దాడులకు ప్రేరేపిస్తుంది స్వయానా ముఖ్యమంత్రేనని ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరంలో బొత్సా ఆస్థులతోపాటు ఒక పది ప్రైవేటు దుకాణాలను తగలబెట్టి దోచుకున్నారు. నిన్న ఒక వైన్‌షాపును పగలగొట్టి కొందరు మందుప్రియులు వైన్ సీసాలు దోచుకుపోయారు. బొత్సాతోపాటు హర్షకుమార్, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆస్థులపై కూడా దాడులు జరుగుతున్నాయి. వీటివెనుక ముఖ్యమంత్రి, లగడపాటిల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర మీడియా మాత్రం యధాప్రకారం  లూటీలను కూడా సమైక్య ఉద్యమం అకౌంట్లో కలిపేసి ప్రజలకు అక్కద ఉద్యమం జరుగుతున్నట్లు భ్రమలు కల్ప్పిస్తున్నాయి. 

13 comments:

  1. భయ్యా
    మన తెలంగాన మనకొచ్చిందిగా. వాళ్ళు వాళ్ళు దొబ్బిచుకుంటారు. మనకెందుకు. ముందు టి-బిల్లు పార్లమెంట్లో పాస్ చెయించే పనిలో వుండండి. వాళ్ళ మీద సానుభూతి అనవసరం.

    ReplyDelete
    Replies
    1. @aditya

      అట్లంటె ఎట్లప్పా? మనం విదిపోయినంతమాత్రాన తమ్ముళ్ళు కొట్టుకు జస్తుంటె చూస్తూ ఊరుకుందామా చెప్పు?

      Delete
  2. ainaa vaallu tammullenti, vaallu raakshasulu, vaaridi rakshasa jaati, manaki vaallaku sambadame leadu.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే తెలిసిన వార్త.. ఆందోళనకారులు ఒక సిక్కుల గురుద్వారాపై కూడా దాడులు చేశారట. ప్రజలనెవరూ ఎపుడూ అనలేదు కానీ ఇప్పుడు దాడులు చేస్తుందీ, చేపిస్తుందీ రాక్షసులే. వారివలన సామాన్యులైన నీలాంటి సీమాంధ్ర తమ్ముళ్ళకు అన్యాయం అయిపోతుంది.

      Delete
  3. anyaayam ayte avvane annayya, 60 years nundi manalni chesina annyaayalaki, dopidiki phalitam anubhavinchanee vaallani inko 60 years varaku. ye maatram jaali, daya chupinchalsina avasaram leadu, daaniki anarhulu.

    ReplyDelete
    Replies
    1. nuvvu mana mana antunnavu kani ...nuvvu telanganaa vadhi vi kavu ani nee matallalo artham avunthundhi ... endhukante telangaa vudhyamanni nuvvu artham chesukoledu ..... telanganaa vudhyama anyaaaniki vythirekangaa jarugthunna portam kani okadu anyama ayeee povalani ani jarguthundhi kadu

      Delete
  4. పరస్పర దాడులు ఆపండి!సమైక్యం పేరుతో ఏకపక్ష సమ్మెలు ఆపండి!ముఖ్యమంత్రిని తక్షణం మార్చండి!ఆమరణ నిరాహార దీక్ష పేరుతో మైలేజి కోసం ప్రయత్నిస్తున్న రెండు పార్టీల నేతలను వెంటనే అదుపులోకి తీసుకోండి!లేదా పొట్టి శ్రీరాములు స్థాయిలో ౫౮ రోజులవరకు ఆగి వేచి చూడండి! ౫౮ వ రాష్ట్రంగా తెలంగాణా విభజనను ఇప్పుడు ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు!ఇది ఒకరికి విజయం కాదు!మరొకరికి అపజయం కాదు!రెండు రాజకీయ పక్షాలు మాటమీద నిలబడక అవకాశవాద రాజకీయాలకు తలపడ్డాయి!సీమాంధ్ర అంతా నిజంగానే చీకటి అలుముకునేటట్లు చేసి అగ్రవర్ణాలు చీకటిలో చిందులువేసి కాపు,ఎస్,సి ఎస్.టి వర్గనాయకుల ఆస్తుల వినాశనానికి,మారణహోమానికి పూనుకుంటున్నట్లు కనిపిస్తున్నది!కనుక దుండగులను అరెస్టు చేయండి!ఆలస్యమైనకొద్దీ మరింత ప్రమాదం అని హెచ్చరిస్తున్నాను!

    ReplyDelete
  5. తెలంగాణ ఉద్యమం నాలుగేళ్ళనుంచీ తీవ్రస్థాయిలో జరుగుతున్నా ఉద్యమం ఎప్పుడూ శాంతియుతంగానే జరిగింది. ఎప్పుడైనా బస్సులపై రాళ్ళు రువ్వడం లాంటి చిన్నచిన్న ఘటనలు జరిగినా అదికూడా పోలీసులు ఒవర్‌యాక్షన్ చేసి అనవర నిర్భందాలు, లాఠీఛార్జీలతో ప్రేరేపించినప్పుడే జరిగాయి. Nijamenaaa......

    ReplyDelete
  6. తెలంగాణ ఉద్యమం నాలుగేళ్ళనుంచీ తీవ్రస్థాయిలో జరుగుతున్నా ఉద్యమం ఎప్పుడూ శాంతియుతంగానే జరిగింది. ఎప్పుడైనా బస్సులపై రాళ్ళు రువ్వడం లాంటి చిన్నచిన్న ఘటనలు జరిగినా అదికూడా పోలీసులు ఒవర్‌యాక్షన్ చేసి అనవర నిర్భందాలు, లాఠీఛార్జీలతో ప్రేరేపించినప్పుడే జరిగాయి.
    chaaaa nijamaaa? Tankbund meedha vigrahaalu dhvamsam chesinappudu kooda chaala peaceful gaa jarigindhi kadhaa?

    ReplyDelete
    Replies
    1. అవును మిత్రమా!

      టాంక్‌బండ్ మీద విగ్రహాల కూల్చివేటకు రెండూ కారణాలు:
      1. మిలియన్ మార్చ్ పై ప్రభుత్వ మితిమీరిన నిర్భందం. అరెస్టులు, నిర్భందాలతో మార్చ్‌ను అడ్డుకోవాలని చూడ్డం.
      2. మొదటినుంచీ విగ్రహాల ఏర్పాటులో జరిగిన పక్షపాత ధోరణిపై ఉన్న నిరసన.

      మీదగ్గర పోలీసుల కళ్ళెదురుగానే రాజీవ్, ఇందిరల విగ్రహాలు ఎన్నో కూల్చారు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్థులపై తెగబడ్డారు. అప్పుడు విగ్రహాలు కూలిస్తే తెలంగాణవాదులను అంతెత్తున తిట్టిన మొహాలు ఇప్పుడెక్కడ పెట్టుకున్నారో.

      Delete
    2. Meeru chesthe oppu. avathali vaaru chesthe thappu annamaata.

      nuvvu tankbund vidhvamsam gurinchi rendu kaaranaalu isthunnaavu. Samaikyandhra vudyamam gurinchi nenu anthakante ekkuva kaaranaalu ivvagalanu.

      nee burrani nuvvu pettukunna chota nundi bayataku theesi aalochinchu.

      I don't support any kind of agitation that results in damaging public property. Be it in andhra or in telangana.

      Delete

Your comment will be published after the approval.