Wednesday, 13 November 2013

గొంతెమ్మ కోరికలు


కిరణ్‌రెడ్డి నేతృత్వంలోని సీమాంధ్ర సర్కారు మంత్రుల బృందానికి తమ కోరికలు తెలుపుతూ ఒక నివేదిక ఇచ్చిందంట. ఇంకా విభజన జరగలేదు గనుక ఇది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నివేదిక కావాలి. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రులూ, ప్రబుత్వాలూ ఉమ్మడి రాష్ట్రానికి ప్రభుత్వాల్లా వ్యవహరించలేదు, కేవలం తెలంగాణపై పెత్తనం చేస్తూ సీమాంధ్ర ప్రయోజనాలకోసం మాత్రమే పని చేశాయి కాబట్టి సీమాంధ్ర ప్రభుత్వం అనాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాకుండా నిస్సిగ్గుగా తమది సీమాంధ్ర ప్రభుత్వం అని తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించారు. ఇందులో కొన్ని మచ్చు తునకలు:

లక్ష ఎకరాలలో సీమాంధ్ర రాజధాని:

లక్ష ఎకరాల్లో ఐదు లక్షల బడ్జెట్‌తో సీమాంధ్రకు రాజధానిని ఏర్పాటు చేయాలంట. ప్రస్తుతం జీహెచ్ఎంసీ  పరిధి లక్షన్నర ఎకరాలు. కనీసం దానిలో మూడింట రెండు వంతులు ఉంటే గానీ తమ రాజధానికి సరిపోదంట. ఈ లక్ష ఎకరాలు అంతా కొత్తగా కావాలంట.  అంటే ఇప్పటికే ఉన్న విశాఖ, విజయవాడ లాంటి నగరాలను అభివృద్ధి చేస్తే అవి లక్ష ఎకరాల నగరాలయినా అలాగొద్దట, పూర్తిగా లక్ష ఎకరాల కొత్త భూమి కావాలంట. దానికోసం అభయారణ్యాలను డీనోటిఫై చేసి చెట్లు కొట్టేసి రాజధానిని ఏర్పాటు చేయాలంట. 

ఒక రాజధానికోసం లక్ష ఎకరాల అడవి కొట్టేయడం ఎందుకు, ఇప్పటికే ఉన్న నగరాలపక్కన స్థలాన్ని తీసుకుని అవసరమయిన బిల్దింగులు కట్టడానికి ఎంత స్థలం కావాలి అని సామాన్యుడికి అనుమానం రావొచ్చు. మరి ఇప్పుడున్న సీమాంధ్ర నగరాలచుట్టూ ప్రైవేటు భూములుంటాయి. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ప్రైవేటు వ్యక్తులు తమ భూములు అమ్ముకుని లాభపడతారు, నేతలకు కబ్జాలు చేయడానికి కుదరదు గదా? అదే లక్ష ఎకరాల కొత్త ఆటవీ భూమిని డీనోటిఫై చేసి రాజధాని ఏర్పాటు చేస్తే అందులో మూడొంతులు ఈనేతలు కబ్జా పెట్టొచ్చు గదా. అంత స్థలం కబ్జా చేస్తే గానీ హైదరాబాదు వదులుకున్న ఈనేతల భూదాహం తీరదు. 

హైదరాబాదు భూముల పంపిణీ తిరగదోడొద్దు:

కొత్త రాజధానిలో తమ కబ్జాలకోసం లక్ష ఎకరాలు ఇవ్వడంతోపాటు ఇప్పటిదాకా తాము హైదరాబాదు చుట్టుపక్కల చేసిన కబ్జాలపై సీమాంధ్ర నేతలకు రక్షణ కావాలంట. అందుకోసం హైదరాబాద్ భూముల పంపినీ వ్యవహారాలను తిరగదోడొద్దనేది వీరి మరో విచిత్రమయిన కోరిక.

భద్రాచలం డివిజన్ సీమాంధ్రకివ్వలట:

భద్రాచలం డివిజన్ను  విభజన తరువాత సీమాంధ్ర కిచ్చేయాలట. దీనికి వీరిచ్చే రీజన్: పోలవరం కడితే భద్రాచలం డివిజన్ ముంపుకు గురవుతుంది. కాబట్టి మాకిస్తే ఇబ్బంది ఉండదు, డివిజన్ మొత్తాన్ని ముంచేసి అక్కడి ప్రజలను తరిమి కొడతాం. అక్కడి ప్రజలేం కోరుకుంటే మాకేంతి మా అవసరాలె మాకు ముఖ్యం, మాదగ్గర ఆదివిజన్ ఉంటే అక్కడి ప్రజలను బలిపశువులు చేయొచ్చు లెకపోతే కుదరదనేది వీరి విచిత్ర వాదన.

ఉద్యోగులు కోరుకుంటే తెలంగాణలో ఉండనివ్వాలి:

తెలంగాణలో ఎందరో సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రికమెండేషన్ ప్రకారం వీరు తెలంగాణలో ఉండాలని కోరుకుంటే వీరికోసం ఖాళీలు లేకున్నా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇక్కడే ఉండనివ్వాలంట. అంటే విభజన జరిగిన తమ అన్యాయం అలాగే కొనసాగాలంట. 

సింగరేణిలో యాభైఎనిమిది శాతం వాటా కావాలంట:

తెలంగాణ నడిబొడ్డున ఉన్న సింగరేణి కాలరీస్‌ను విభజన అనంతరం సీమాంధ్రకు జనాభా ప్రాతిపాదికన యాభై ఎనిమిది శాతం వాటా ఇవ్వాలంట. విశాఖ ఉక్కులో,పోర్టులో, బెరైటీస్ గనుల్లో మాత్రం తెలంగాణకు వాటా ఉండదు.
  
ఆకాశరాముడు సెలవిచ్చినట్టు దురాశ దఃఖమునకు చేటు తెస్తే సంతోషానికి మంచిదే కానీ ఇది మాత్రం నిజంగా సీమాంధ్ర ప్రభుత్వపు  "దురాశ దుఃఖము, చేటు" తెస్తుంది. 

23 comments:

 1. మీది కాని భద్రాచలాన్ని మీరెలా కోరుకుంటారు తమ్మీ...
  మీ తెలబాన్ పార్టీ జీఓఎం కు ఇచ్చిన లిస్ట్ లోని కోరికల సంగతి ఒకసారి పరికించి చూడు మిత్రమా..
  1956 కు పూర్వం తెలంగాణ మాత్రమే కావాలని అన్నారు కదా... ఇపుడు ఆ వాదనను కావాలనే మర్చిపోతున్నారా?

  ReplyDelete
  Replies
  1. భద్రాచలం మా తెలంగాణది డమ్మీ!. దాన్ని మా తెలంగాణ శిస్తుల ధనంతో నిర్మించారు. గోల్కొండ నవాబు ఏలుబడిలో ఉన్న భద్రాచలానికి తహసీల్ దారు తెలంగాణకు చెందిన నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంచెర్ల గోపన్నకట్టించిన గుడి మీదెలా అవుతుంది? ఊరు మీ దెలా అవుతుంది? మీ కన్నా ముందు హక్కుదారులం మేమే. మా ధనంతో వృద్ధిపొందిన భద్రాచలం మే దెలా అవుతుంది డమ్మీ! మీ అయ్య సొమ్మేమైనా పెట్టి కట్టారా, మీది కావడానికి?

   Delete
  2. " మా ధనంతో వృద్ధిపొందిన భద్రాచలం" - Tenant cant be owner even if he spends 1000000000s on the property. this is what you told for hyderabad.

   Delete
  3. Bhadrachalam Telangana sommutho kattaledu, Goconda sommutho kattaru - Coastha, Rayalaseema, Bidar, Gulbarga, Beed, Nanded, Aurangabad, Berar sommutho. Vileenam raddu, ejamaani lease holder suthram Bhadrachalam, Munagalaku enduku varthimcavu ?

   Delete
 2. Hyderabad district area is 217 sq. km. This translates to around 54,000 acres.

  ReplyDelete
  Replies
  1. They want their capital to be close to the size of GHMC.

   Delete
  2. If you guys are so smart in calculation how come andhrites looted 10 Lakh acre land in Hyderabad?

   Delete
  3. one lakh acres is about 400 sq km smaller than HMDA. An international air port, train station and other facilities would be included.

   Andhra vallu enni acarallo katukunte mee kenduku ?

   Delete
 3. ఇంకా నయ్యం, ఒక చార్మినార్, ఒక గోల్కొండ, ఒక ట్యాంక్ బండ్, ఒక సాలార్జంగ్ మ్యుజియం లు కూడా అడగలేదు.

  దురాశ దుక్ఖమునకు చేటు అని వారికి ఇంకా అర్థం కాకపోవటం విచార కరం. వీరి దురాశే ఈ పరిస్తితికి కారణం కాదా !!

  ReplyDelete
  Replies
  1. when charminar, golkonda were constructed then East,west,Krishna guntur were part of Golkonda kingdom. We hold equal share on these.

   by the time tankbund and salarjung museum were created those parts were sold to british. we dont hold any rights on these two.

   Delete
  2. ఈడున్న చార్మినార్, గోల్కొండలు ఎక్కడికి పోతై తమ్మి, మెల్లగ తీసుకోవచ్చు. ముందు బంగ్లాదేశ్ డాఖా లో, పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్లో మీ షేరు అడగండి, అవన్నీ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగాలే, మీ టాక్స్ తో కట్టినవే, అలానే బ్రిటిషోళ్ళు మీ పైసలు లండన్ ల కూడా పెట్టిన్రంట, ఆ లండన్లో కూడా షేరు అడగండి, ఇక డిల్లి ముంబై, కలకత్తా ... అన్ని ఒక్కసారే తెలిపోతై.

   Delete
 4. whats ur problem if they ask some thing about their region? its issue between central govt and seemaandhara as if the central govt is going to give everything ! you got ur telangana and why do you still comment on everything. finding fault in every action is no good and and hatred ness leads no where.just like pakistan and india. Good we are divided let be happy with our issues and leave others for their own thougts

  ReplyDelete
  Replies
  1. ఓయీ అజ్ఞాతా! "వృద్ధనారీ పతివ్రతా" అన్నట్టున్నాయి నీ మాటలు. ఇంతకాలం మమ్మ్లల్ని దోచి, ఇప్పుడు సంసారిలా మాట్లాడుతున్నావు! భేష్...! మొదటి అజ్ఞాత మాటలు ఇంకా దోపిడీ కోసమే సాగుతున్నాయి. మా ప్రాంతాన్ని మా హక్కును గద్దలా తన్నుకొని పోవాలనుకుంటూనే ...పతివ్రతలా, పత్తిత్తులా మాట్లాడుతుంటే దాని అర్థం ఏమిటి? కాస్త గడ్డి పెట్టు...

   Delete
 5. 60 సంత్సరాలు మీ నియోజకవర్గాన్ని పరిపాలీంచింది మీ ప్రాంత శాసనసభుయులె కదా.మరి వారిని ఎప్పుడైన అదిగారా అభివ్రుద్ది గురించి?? నిధులు ఇవ్వలేదని మాత్రం చెప్పకండి.

  ReplyDelete
 6. ప్రభుత్వాన్ని నడిపించేది శాసనసభ్యులు కాదు ముఖ్యమంత్రి, అతని కింది మంత్రులూ, వారి కింది అధికారులు. అంతా సీమాంధ్ర ముఖ్యమంత్రి కంట్రోల్లోనే నడుస్తుంది.

  ReplyDelete
  Replies
  1. Mukhyamantrulanu Congresslo kendram niyamistundi. Sadharana Kostha raysalaseema vaaru Telngananu emi docukunnaru. Chenna Reddy, Hygreevacahri, Venkataswamy itarathra mantrulu, MLAlu kabzaalu cheyaledani cheppandi saripothundi.
   1956naati veeleenani raddu cheste undevi 1956nati sarihaddulu kada ?

   Delete
  2. Channa Reddy, PV Narasimha Rao, Anjaiah kooda semmandrula ?

   Delete
  3. Kostha pranthamlo gas kaavali, Bhadrachalam kalapali ani Telangana nayakulu korina sangathi teliyada.

   Telanganaku Kostha prantha gas lo vata ivamani kostha rayalaseema mantrulu cheppina sangathi teliyada ?

   Delete
  4. @Anonymous18 November 2013 14:26

   >>Kostha pranthamlo gas kaavali, Bhadrachalam kalapali ani Telangana nayakulu korina sangathi teliyada.>>

   తమ్ముడూ, తెలంగాణ నాయకులడిగింది గ్యాస్లో వాటా కాదు, తెలంగాణలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులకు ప్రభుత్వధరకు గ్యాస్ సప్లై చేయడం కోసం అలొకేషన్ మాత్రమే. అదే సీమాంధ్రవారడిగింది సింగరేణిలో వటా. జెర తేడా తెలుసుకో.

   భద్రాచలం జనం సీమాంధ్రలో మేం కలవం, కలిస్తే వాళ్ళు మమ్మల్ని నిండా ముంచుతారు ( పోలవరం ప్రాజెక్టులో ) అని డిమాండ్ చేస్తున్రు. ఒకవేళ భద్రాచలం వారు సీమాంధ్రలోనే కలుస్తామంటే మాకభ్యంతరం లేదు, కానీ పోయి పోయి ఎవడు సీమాంధ్రలో కలవడానికి ఇష్టపడతాడు జెప్పు?

   Delete
  5. >>Channa Reddy, PV Narasimha Rao, Anjaiah kooda semmandrula ?>>

   అందుకేగదా సంవత్సరం తిరక్కముందే కుట్రలు పన్ని మీరు వాళ్ళను దించింది.

   Delete
  6. TRS ichinna report choodandi. Gas gurinchi samacharam dorkuthundi. Bhadrachalam lo bandh cheyinchindi Telangana journalistlu, TRS, New democracy kaada ?

   Mari Hyderbad nu UT cheyamani Hyderabdalo andolana cheyisthe ?

   Delete
  7. Vallanu dinchindi kendram.

   Delete
  8. Mari Bhaskar Reddy, Bhramananda Reddy, Janardhan Reddy, Venkat Ramlanu evaru dincharu ?

   Delete

Your comment will be published after the approval.