Monday, 18 November 2013

అందరూ అంబేద్కరులే!



ఎక్కువగా మాట్లాడని జైపాల్‌రెడ్డి మాట్లాడితే అవతలివారికి దిమ్మతిరుగుతుందని నిన్న చేసిన ప్రసంగంతో నిరూపించాడు. చంద్రబాబు, జగన్, జేపీ, ఉండవల్లి, అశోక్‌బాబు తేడా లేకుండా సీమాంధ్ర నాయకులంతా ఆర్టికల్ మూదును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు, అక్కడికి వీరికి రాజ్యాంగనిర్మాతలకంటే ఎక్కువ తెలిసినట్లు. మందిని మోసం జేయడం, దొరికితే జైలుకెల్లడం జేసే ఈదగుల్బాజీ నాయకులకు రాజ్యాంగం మార్చాలని చెప్పేంత సీనుందా? అందుకే అందరూ అంబేద్కరులైతే తట్టుకోవడం కష్టమని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలు ఆర్టికల్ మూడు రాష్ట్రాల పునర్విభజన అధికారాన్ని కేంద్రానికి ఇచ్చిందే ఇలాంటి పరిస్థితి వస్తుందని. రాజ్యాంగ నిర్మాతలు అరవై ఏళ్ళకిందనే ఊహుంచినదాన్ని ఇప్పుడు మన సీమాంధ్ర నేతలు నిరూపిస్తున్నారు. పైగా తమ పెత్తనం కొనసాగడంకోసం రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర నాయకుల లాభాలకోసం అవసరమైతే ఈసమైక్యాంధ్ర రాష్ట్రంలో ఫైల్లు మారుతాయి కానీ రాజ్యాంగం మారదని ఈమట్టిబుర్రలకు తెలీదులాగుంది. అలా మార్చగలిగితే ఇంకేముంది, అక్రమ ఆస్తుల కెసులనుండి జగన్ను బయటికి తేవడానికి చట్టాలనే మారిస్తే సరిపాయె.

ఆర్టిక 3 ఈ అధికారం కేంద్రానికి ఇచ్చిఉండకపోతే మద్రాసు నుండి ఆంధ్ర విడిపోగలిగేదే కాదు. సీమాంధ్ర నాయకులు చెప్పినట్టు ఆర్టికల్ 3ను సవరిస్తే భవిస్యత్తులో ఏరాష్ట్రంలోనైనా మెజారిటీవర్గం మైనారిటీ వర్గాన్ని వివక్షకు గురిచ్_ఎస్తుంటే మైనారిటీ విడిపోయేహక్కును కోల్పోతుంది. ఇలాంటి డిమాండ్‌ను  సీమాంధ్ర నాయకులు చేస్తే అది ఎలాగూ ఎవరూ ఒప్పుకోరుగానీ సీమాంధ్ర పరువు మాత్రం దేశం మొత్తంలో మంటకలుస్తుంది. సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని దోషులుగా జేస్తుంది మీనాయకులే.

1 comment:

  1. బాగా చెప్పారు విశ్వరూప్ గారూ!
    యథా రాజా తథా ప్రజా...వాళ్ళేమంటారు? తెలంగాణ ఇవ్వకపోతే, తెలంగాణ ఉద్యోగాలన్నీ వాళ్ళకేనాయె! భూములన్నీ వాళ్ళవేనాయె! అన్ని వనరులపై పెత్తనం వాళ్ళకే ఉంటుంది. అందుకే తమాషా చూస్తున్నారు. వాళ్ళదేంపోయింది? పోతే ఈత గింజ పోతుంది...వస్తే తాటి గింజ వస్తుంది. నష్టం తెలంగాణకే కదా! చోద్యంచూద్దాం...అంటారు గానీ, తమ నాయకులే తమని దోషులుగా నిలబెడుతున్నారనుకుంటారా? పరువు కోసం ప్రాకులాడతారా? చూద్దాం...ఏమవుతుందో?

    ReplyDelete

Your comment will be published after the approval.