Monday, 25 November 2013

చిత్తం రామునిపై భక్తి పోలవరంపై


"చిత్తం శివునిపైన భక్తి చెప్పులపైన" అనేది పాత సామెత. "చిత్తం రాముడిపైన భక్తి పోలవరం డ్యాముపైన" అనేది నేడు సీమాంధ్ర నేతలకు సరిగ్గా అతికే సామెత.

భద్రాచలం డివిజన్ మాకే దక్కాలి అనే వాదించే సీమాంధ్ర నేతలు చెప్పే కారణం "భద్రాచలం తెలంగాణలో ఉంటే పోలవరంకు అడ్డంకులొస్తాయి" అని. నిజానికి పోలవరం రిజర్వాయరు ప్రస్తుత డిజైన్ ప్రకారం భద్రాచలం డివిజన్లో సగం మునిగిపోతుంది. అందమైన పాపికొండలు కనుమరుగవుతాయి. విలువైన ఆటవీ ప్రాంతం, వన్యప్రాణులు, ఖనిజ సంపద మునిగిపోతాయి. వీటన్నిటితో పాటు రాజమ్నడ్రి లాంటి ఒకపెద్ద నగరం ఆడ్యాము కింద ఉండడం అతిపెద్ద రిస్క్.భూకంపం సంభవిస్తే రాజమండ్రి క్షణాల్లో తుడిచిపెట్టుకోగలదు. అయినా సీమాంధ్ర నేతలు తమ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం పోలవరంపై పట్టుబట్టారు.

ఇప్పుడు భద్రాచలం డివిజన్ తెలంగాణకొస్తే రిజర్వాయరులో ఆటవీప్రాంతం ముంపుకు వ్యతిరేకంగా అక్కది ప్రజలు ఉద్యమిస్తారు, కోర్టులకెలతారు. అదే తమ సొంత రాష్ట్రంలో ఉంటే నయానో భయానో ఒప్పించవచ్చు. ఇదీ సీమాంధ్ర నేతల ఉపాయం.

 మీరు మాతో కలవండి, మేము మిమ్మల్ని నీటిలొ ముంచుతాం అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే భద్రాచలం ప్రజలు మేము తెలంగాణతోనె ఉంటామని తెగేసి చెబుతున్నారు, ఉద్యమిస్తున్నారు. 

రాష్ట్రం విడిపోతే నీటిపోరాటాలొస్తాయి అనే కిరణ్‌రెడ్డి కలిసుంటే నీటిపోరాటాలు ఎందుకు రావో చెప్పడు. కలిసున్నా ఇప్పుడూ నీటికోసం ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి కానీ వాతిని నిరంకుసంగా అణచివేయొచ్చు విడిపోతే అణచివేత సాధ్యం కాదనేది అతని మాతల మర్మం.

అలాగే మునగాల పరగణా గురించి కూడా. నాగర్జునసాగర్ ఎడమకాలువ పారే అతికొద్ది తెలంగాణా ప్రాంతంలో ఒకటి మునగాల పరగణా. అందుకే మునగాలపై ప్రేమ. 

1 comment:

  1. "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమా బానే ఆడిందేమో కానీ "ఉండమ్మా నిన్ను ముంచేస్తా" ఆడుతుందా?

    ReplyDelete

Your comment will be published after the approval.